కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్‌లో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన.. దేశాన్ని కుదిపేసింది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు మంగళవారం 'నబన్న అభిజన్' (మార్చ్ టు సెక్రటేరియట్) పేరుతో నిరసనకు పిలుపునిచ్చాయి.
సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ భారీ ర్యాలీ జరగనుంది. అయితే హింస చేలరేగే అవకాశం ఉండడంతో కోల్‌కతా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ వద్ద సుమారు 6 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాల ముసుగులో.. అరాచక శక్తులు ర్యాలీలో పాల్గొన వచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
#BreakingNews : कोलकाता डॉक्टर रेप-हत्या पर बड़ी खबर, भारी संख्या में छात्र आज करेंगे प्रदर्शन#KolkataDoctorDeathCase #KolkataDoctorDeath #CBI #KolkataDeathCase | @Nidhijourno @anchorjiya pic.twitter.com/mDjspQ4ons
— Zee News (@ZeeNews) August 27, 2024
క్రెడిట్స్: Zee News
సామాన్య ప్రజలను రెచ్చగొట్టి అరాచకాలు సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సుమారు 19 పాయింట్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. 26 మంది డిప్యూటీ కమిషనర్లు పలు పాయింట్ల వద్ద ఎప్పటికప్పుడు పోలీసు భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు చోట్ల పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి కోల్‌కతా, హౌరాలో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తామని పోలీసులు అధికారులు తెలిపారు.
యువ వైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత.. ఆగస్టు 14 అర్ధరాత్రి చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అందుకే పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ భద్రతకు ప్లాన్ చేశారు. మరోవైపు.. శాంతియుతంగా నిరసన తెలిపేవారిని అడ్డుకోవద్దని ఇటీవల సుప్రీం కోర్టు బెంగాల్ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment