కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్‌లో హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియాజేశారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విద్యార్థి విభాగ ఆవిర్భావ దినోత్సవాన్ని కోల్‌కతా హత్యాచార ఘటనలో బలైన జూనియర్ డాక్టర్‌కు అంకితం ఇస్తున్నట్లు బుధవారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
আজ তৃণমূল ছাত্র পরিষদের প্রতিষ্ঠা দিবসটিকে আমি উৎসর্গ করছি আমাদের সেই বোনটিকে, যাঁকে আমরা কয়েক দিন আগে আর জি কর হাসপাতালে মর্মান্তিকভাবে হারিয়ে শোকাহত।
আর জি করে আমাদের সেই যে বোনকে নির্মমভাবে নির্যাতন করে হত্যা করা হয়েছিল, তাঁর পরিবারের প্রতি আন্তরিকতম সমবেদনা জানিয়ে এবং…— Mamata Banerjee (@MamataOfficial) August 28, 2024
‘ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగ ఆవిర్భావ దినోత్సవాన్ని నేను కోల్‌కతా హత్యాచార ఘటనలో బలైన సోదరికి అంకితమిస్తున్నా. ఆమె మృతికి సంతాపం తెలియాజేస్తున్నా. ఆ సోదరి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. బాధితురాలి కుటుంబ సభ్యులకు సత్వర న్యాయం జరగాలని కోరుకుంటున్నా. అలాగే భారతదేశం అంతటా ఇటువంటి అమానవీయ చర్యలకు గురైన మహిళందరికి సానుభూతి తెలియజేస్తున్నా.. క్షమించండి’ అని పేర్కొన్నారు.
జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కోల్‌కతాలో మంగళవారం విద్యార్థులు చేపట్టిన ‘నబన్నా అభియాన్ (చలో సచివాలయ ర్యాలీ)’ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. విద్యార్థులు మార్చ్ అడ్డుకోవటం కోసం.. గాల్లోకి కాల్పులు జరపడంతో పాటు వాటర్ క్యానన్లు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడి, లాఠీచార్జిలో ఇరువైపులా చాలామంది గాయపడ్డారు. ఇక..పోలీసులు తీరుపై నిరసనగా ప్రతిపక్ష బీజేపీ బెంగాల్‌లో వ్యాప్తంగా 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చి కొనసాగిస్తోంది. దీంతో పోలీసులు అప్రమత్తం అయి హైఅలెర్ట్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment