కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. ఈ దారుణ ఘటన కేసుకు సంబంధించిన విచారణను పశ్చిమ బెంగాల్ వెలుపలకు బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం విచారణ చేపట్టింది.
ఇక.. జూనియర్ డాక్టర్ హత్యాచార కేసు బదిలీకి సుప్రీం నిరాకరించింది. ఈ సందర్భంగా పోలీసు, న్యాయవ్యవస్థపై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోతోందని వ్యాఖ్యానించిన ఓ లాయర్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మందలించారు. కోర్టులో ‘క్యాంటీన్ కబుర్లు’ చెప్పొద్దని, అటువంటి జనరల్ స్టేట్‌మెంట్‌లు చేయొద్దని సూచించారు.
‘‘మణిపూర్ వంటి కేసుల్లో బదలీ చేశాం. కానీ ఇక్కడ పరిస్థితి ఏమి లేదు. కావును అటువంటి బదిలీ చేయలేం. ఇక.. ఈ కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ దాఖలు చేసిన ఆరో స్టేటస్ పోర్టును మేం పరిశీలించాం. అయితే..సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలో మేం కేసు స్టేటస్ పరిశీలనకు దూరంగా ఉన్నాం. నాలుగు వారాల తర్వత స్టేటల్ అప్‌డేట్ అయిన కొత్త రిపోర్టును దాఖలు చేయనివ్వండి’ అని సీజేఐ పేర్కొన్నారు.
ఇక.. వాదన సమయలో పశ్చిమ బెంగాల్ ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోయారని ఓ న్యాయవాది అన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఘాటుగా స్పందించారు. ‘‘ మీరు ఎవరి తరపున హాజరవుతున్నారు. ఇలాంటి సాధారణ ప్రకటనలు చేయొద్దు. ఈ కేసులో అలాంటిదేమీ లేదు. కోర్టులో క్యాంటీన్ కబుర్లు చెప్పొద్దు’’ అని మందలించారు. ఇక.. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 11కు వాయిదా వేసింది.
చదవండి: నేను ఏ నేరం చేయలేదు.. ప్రభుత్వమే ఇరికిస్తోంది: సంజయ్ రాయ్ కేకలు
Comments
Please login to add a commentAdd a comment