junior doctor
-
తప్పు ఎవరిది? శిక్ష ఏమిటి?
దేశాన్ని అట్టుడికించిన కేసులో కోర్టు తీర్పు వెలువడింది. తీరా తీర్పు సైతం ఆ కేసులానే చర్చకు దారి తీస్తోంది. కోల్‌కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలోని సెమినార్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ డాక్టర్‌పై గత ఆగస్ట్ 9న జరిగిన దారుణ హత్యాచార ఘటనపై తాజా తీర్పు సహేతుకం కాదనే విమర్శ వినిపిస్తోంది. ఆస్పత్రిలో వాలంటీరైన సంజయ్ రాయ్ భారతీయ న్యాయ సంహిత లోని వివిధ సెక్షన్ల కింద నేరస్థుడంటూ శనివారమే కోర్ట్ ప్రకటించేసింది. కానీ, ఈ కేసులో అతనికి ఉరిశిక్ష బదులుగా యావజ్జీవ కారాగారవాస శిక్ష మాత్రమే విధిస్తున్నట్టు సియాల్డాలోని అడిషనల్ జిల్లా, సెషన్స్ కోర్ట్ సోమవారం తీర్పు చెప్పేసరికి మళ్ళీ తేనెతుట్టె కదిలింది. బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారే కాక, అటు కేంద్ర నేరదర్యాప్తు సంస్థ (సీబీఐ), ఇటు బాధితురాలి కుటుంబం సైతం నేరస్థుడికి ఉరిశిక్ష విధించాలంటూ వాదించింది. కానీ, అంతటి తీవ్ర శిక్ష విధించేందుకు హేతుబద్ధత లేదంటూ కోర్ట్ వ్యాఖ్యానించడం గమనార్హం. దాంతో, మహిళా లోకంలో, బాధిత, వైద్య వర్గాల్లో అసహనం కట్టలు తెంచుకుంది. సామాజిక మాధ్యమాల్లోని దృశ్యాలే అందుకు నిదర్శనం.హత్యాచారానికి గురైన ఆడకూతురు, ఆమె కుటుంబం బాధను ముగ్గురు ఆడపిల్లలకు తల్లినైన తాను అర్థం చేసుకోగలనంటూ నేరస్థుడి తల్లే స్వయంగా అనడం గమనార్హం. కన్నకొడుకైనా సరే నేరం రుజువైతే, శిక్ష పడాల్సిందేనని ఆ మాతృమూర్తి అన్న మాటలు జరిగిన ఘటన రేపిన భావోద్వేగాలను గుర్తు చేస్తుంది. పైపెచ్చు, ఆగస్ట్ 9 తర్వాత బెంగాల్లో అయిదు హత్యాచార ఘటనల్లో, మైనర్లపై దారుణానికి పాల్పడ్డ నేరస్థులకు ‘పోక్సో’ కోర్టులు ఏకంగా మరణశిక్షే విధించాయి. అందుకే, ఈ కేసులోనూ నేరస్థుడికి ఉరిశిక్ష పడుతుందనీ, పడాలనీ బలమైన భావన వ్యాపించింది. అయితే జరిగింది వేరు. బెంగాల్‌నే కాక అప్పట్లో భారత్ మొత్తాన్నీ కదిలించిన ఈ ఘటనలో బాధిత కుటుంబానికి రూ. 17 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, ఈ ఘటన ఉరిశిక్ష విధించాల్సినంత అత్యంత అరుదైన కేసు ఏమీ కాదంటూ కోర్ట్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. బెంగాల్ ఏలిక మమతా బెనర్జీ సైతం తీర్పుతో సంతృప్తికరంగా లేమంటూ కుండబద్దలు కొట్టేసి, తీర్పుపై హైకోర్టుకు వెళతామని తేల్చేశారు. సర్వసాధారణంగా నేరం తాలూకు తీవ్రత, సమాజంపై దాని ప్రభావం, నేరస్థుడి గత చరిత్ర, ప్రవర్తన లాంటివన్నీ మరణశిక్ష విధింపునకు ప్రాతిపదిక అవుతాయి. అయితే, గౌరవ న్యాయస్థానం తన ముందున్న సాక్ష్యాధారాలను బట్టి మాత్రమే ఎలాంటి తీర్పునైనా ఇస్తుంది. తీర్పు చెబుతూ న్యాయమూర్తి సైతం ఆ మాటే అన్నారు. అంతేతప్ప, మీడియాలో సాగుతున్న ప్రచారం సహా ఇతరేతర కారణాలను బట్టి శిక్షపై నిర్ణయం తీసుకోవడం జరగదు. కాబట్టి, తగినంత బలమైన సాక్ష్యాధారాలు లేనందు వల్లనే ఈ కేసులో నేరస్థుడికి కోర్ట్ మరణశిక్ష విధించలేదా అన్నది ఆలోచించాల్సిన అంశం. తీర్పు పూర్తి పాఠం అందుబాటులోకి వచ్చిన తర్వాత కానీ ఆ అంశంపై మరింత స్పష్టత రాదు. ఆస్పత్రి సిబ్బంది భద్రత కోసం పనిచేయాల్సిన వాలంటీర్ రాయ్ అసలు తన ఉద్యోగ ధర్మాన్నే మంటగలిపి, కాపాడాల్సిన డాక్టర్నే కాటేశాడన్నది చేదు నిజం. అతడు చేసిన నేరం ఘోరం, హేయమన్నదీ నిర్వివాదాంశం. అయితే, హత్యాచారానికి పాల్పడ్డ సదరు నేరస్థుడు జీవితంలో మారే అవకాశం లేదంటూ ప్రాసిక్యూషన్ బలంగా వాదించలేక పోయింది. ఆ మాటను నిరూపించలేక పోయింది. అది కూడా శిక్ష విషయంలో నేరస్థుడికి కలిసొచ్చిందని నిపుణుల మాట.కోల్‌కతా కేసు దర్యాప్తు ఆది నుంచి అనుమానాలకు తావివ్వడం దురదృష్టకరం. నిజానిజా లేమో కానీ, అత్యంత హేయమైన ఈ ఘటనలో శిక్షపడ్డ నేరస్థుడే కాక, ఇంకా పలువురి హస్తం ఉంద నేది అందరి నోటా వినిపిస్తున్న మాటే. స్థానిక పోలీసుల నుంచి చివరకు సీబీఐ చేతుల్లోకి దర్యాప్తు వెళ్ళినా జనంలో అనుమాన నివృత్తి కాలేదన్నది నిష్ఠురసత్యం. సీసీ టీవీ దృశ్యాల్లో 68 దాకా రాకపోకలు కనిపించినా, రాయ్ ఒక్కరినే గుర్తించారన్న ఆరోపణలే అందుకు సాక్ష్యం. పనికి మాలిన రీతిలో దర్యాప్తు జరిగిందనీ, పలుకుబడి గల బడాబాబులు తప్పించుకున్నారనీ, ఆఖరికి ఒకడే నేర స్థుడని తీర్మానించి యావజ్జీవ ఖైదుతో సరిపెట్టారనీ విమర్శలు వెల్లువెత్తడానికి కారణమూ అదే. ఆర్.జి. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ సహా పలువురి వ్యవహారశైలి, ఆశ్రిత పక్ష పాతం, అవినీతి ఆరోపణలు, ఆస్పత్రి యంత్రాంగం పనితీరు, వగైరా... ఎన్నో ప్రశ్నల్ని ముందుకు తెచ్చాయి. సాక్ష్యాధారాల తారుమారు యత్నంలో ప్రిన్సిపాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసినా, నిర్ణీత 90 రోజుల వ్యవధిలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోయే సరికి నిష్పూచీగా ఆయన బయటకొచ్చారంటే మన నిఘా, దర్యాప్తు సంస్థలు ఎంత ఘనంగా పనిచేస్తున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కీలకమైన మరో విషయం – ఈ ఘటనకు కారణమైన పరిస్థితులు. ప్రగతి బాటలో ముందున్నా మనే దేశంలో... పనిప్రదేశాల్లో సైతం మహిళలకు రక్షణ కొరవడడం, ఉద్యోగస్థలాలు స్త్రీలకు సురక్షితంగా లేకపోవడం శోచనీయం. కోల్‌కతా ఘటనతో పార్టీలు, ప్రజలు కదం తొక్కిన మాట నిజమే కానీ, ఇప్పటికైనా ఈ పరిస్థితుల్ని సమూలంగా మార్చాల్సిన అవసరం పాలకులకుంది. అవినీతి పంకిలమై, లోపభూయిష్ఠంగా నడుస్తున్న అనేక వ్యవస్థల్ని చక్కదిద్దాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లోనే కోర్టులు ఉన్నంతలో సత్వర న్యాయం అందించడం, ప్రజాభిప్రాయం కన్నా ప్రత్యక్ష సాక్ష్యాలే ప్రాతి పదికగా తీర్పులివ్వడం ఆహ్వానించదగ్గదే. అయితే, చాలా సందర్భాల్లో న్యాయం చెప్పడమే కాదు... న్యాయమే చేస్తున్నట్టు కనిపించడం ముఖ్యం. ఈ కేసులో అది జరిగిందా అన్నదే పలువురి ప్రశ్న. -
RG Kar Case : నిందితుడు సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ఆర్జీ కార్ ఆస్పత్రి (RG Kar Case) ట్రైనీ డాక్టర్ (అభయ) హత్యాచార కేసులో సీల్దా కోర్టు (sealdah court ) సోమవారం మధ్యాహ్నం (జనవరి 20) తుది తీర్పును వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్ (sanjay roy)కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తీర్పు వెలువరించే సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ ‘నేను అమాయకుడిని, కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారంటూ’ కోర్టుకు తెలిపారు. సంజయ్ రాయ్ వాదనల్ని సీల్దా కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ ఖండించారు. నిందితుడికి జీవిత ఖైదు విధించారు. తీర్పు సమయంలో వైద్యురాలి కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ సైతం వైద్యురాలి కేసు ఆరుదైన కేసుల్లో అరుదైన కేసు కేటగిరి కిందకు వస్తుందని, సమాజంపై ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేందుకు నిందితుడు రాయ్‌కు మరణిశిక్ష విధించాలని కోరింది. సీబీఐ వాదనపై సీల్దా కోర్టు సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ స్పందించారు. ‘ఈ కేసు అరుదైన కేటగిరీ కిందకు రాదు. అతనికి (సంజయ్ రాయ్‌కు) జీవిత ఖైదుతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆదేశించారు. సీల్దా కోర్టు తీర్పుపై అభయ తల్లిదండ్రులు కోర్టు హాలులో ఆందోళన చేపట్టారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కుమార్తె కేసులో న్యాయం జరిగే వరకు కోర్టులను ఆశ్రయిస్తామని కన్నీటి పర్యంతరమవుతున్నారు. ఉరితీయండిగత నెల డిసెంబర్లో కోల్‌కతాను వణికించిన జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్షను సమర్థించే సాక్ష్యాలను సీబీఐ (cbi) సీల్దా సెషన్స్ కోర్టుకు అందించింది. తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ తన వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపింది. అందుకు బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే సాక్ష్యమని చెప్పింది.అంతేకాదు, నిందితుడు వైద్యురాలిపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్ రాయేనని స్పష్టం చేసింది. బాధితురాలిపై జరిగింది భయంకరమైన నేరమని, అత్యాచారం-హత్య అరుదైన నేరంగా పరిగణించింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సంజయ్ రాయ్‌కి ఉరిశిక్షే సరైందని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సంజయ్ రాయ్ నిర్దోషి సీబీఐ వాదనల ముగిసిన అనంతరం సంజయ్ రాయ్ తరుఫు లాయర్ సౌరవ్ బంద్యోపాధ్యాయ తన వాదనల్ని వినిపించారు. తన క్లయింట్ సంజయ్ రాయ్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి, ఆపై అతన్ని ఇరికించారని కోర్టుకు తెలిపారు. ఆ రోజు రాత్రి ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఏం జరిగిందంటేగతేడాది ఆగస్ట్‌లో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలపై దారుణం జరిగింది. రాత్రి ఆస్పత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ దుర్ఘటనపై పోలీసుల్లో అలసత్వం భయటపడడం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కల్కత్తా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. రోజు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది. తాజాగా, సీల్దా కోర్టు సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించడంపై కోల్‌కతా వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఆందోళన కారులు తమ నిరసనల్ని తెలుపుతున్నారు. -
క్లాస్‌మేట్‌పై జూనియర్ డాక్టర్ అత్యాచారం
గ్వాలియర్: ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలోని ఉపయోగంలో లేని హాస్టల్లో ఓ జూనియర్ డాక్టర్(25) తోటి వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలోని గజరాజా మెడికల్ కాలేజీలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు, బాధితురాలు వేర్వేరు హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. ఆదివారం నిందితుడు కాలేజీ ఆవరణలోనే ఉన్న ఉపయోగంలో లేని బాయ్స్ హాస్టల్లోకి రావాలని బాధితురాల్ని కోరాడు. అంగీకరించి అక్కడికి వెళ్లిన ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలు కాంపు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు నగర ఎస్పీ అశోక్ జడొన్ చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
ఆర్జీ కర్ ఆసుపత్రి.. నిందితుడు సంజయ్రాయ్ గొంతు వినిపడకుండా పోలీసుల హారన్లు!
కోల్‌కతా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలి ఘటన కేసు విచారణలో కోల్‌కతా పోలీసులు చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనలో విచారణ కొనసాగుతుంది.అయితే విచారణ నిమిత్తం జైల్లో ఉన్న నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు సోమవారం సీల్దా కోర్టుకు తరలించారు. ఆ సమయంలో సంజయ్ రాయ్ మీడియాకు, ప్రజలకు వినిపించకుండా పోలీసులు హారన్ కొడుతూ తీసుకెళ్లడం చర్చనీయాశంగా మారింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. నవంబర్ 11న సీల్దా కోర్టుకు సంజయ్‌రాయ్‌ను తీసుకెళ్లే సమయంలో కోల్‌కతా మాజీ పోలీసు కమీషనర్ వినీత్ గోయల్‌పై రాయ్ తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని, తాను ఏ తప్పూ చేయలేదని వ్యాఖ్యానించాడు. ఈ తరహ ఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉండేలా సైరన్ మోగిస్తూ కోర్టుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. -
కోల్‌కతా హత్యాచార ఘటన: కేసు బదిలీకి సుప్రీం కోర్టు నిరాకరణ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. ఈ దారుణ ఘటన కేసుకు సంబంధించిన విచారణను పశ్చిమ బెంగాల్ వెలుపలకు బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఇక.. జూనియర్ డాక్టర్ హత్యాచార కేసు బదిలీకి సుప్రీం నిరాకరించింది. ఈ సందర్భంగా పోలీసు, న్యాయవ్యవస్థపై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోతోందని వ్యాఖ్యానించిన ఓ లాయర్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మందలించారు. కోర్టులో ‘క్యాంటీన్ కబుర్లు’ చెప్పొద్దని, అటువంటి జనరల్ స్టేట్మెంట్లు చేయొద్దని సూచించారు.‘‘మణిపూర్ వంటి కేసుల్లో బదలీ చేశాం. కానీ ఇక్కడ పరిస్థితి ఏమి లేదు. కావును అటువంటి బదిలీ చేయలేం. ఇక.. ఈ కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ దాఖలు చేసిన ఆరో స్టేటస్ పోర్టును మేం పరిశీలించాం. అయితే..సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలో మేం కేసు స్టేటస్ పరిశీలనకు దూరంగా ఉన్నాం. నాలుగు వారాల తర్వత స్టేటల్ అప్డేట్ అయిన కొత్త రిపోర్టును దాఖలు చేయనివ్వండి’ అని సీజేఐ పేర్కొన్నారు. ఇక.. వాదన సమయలో పశ్చిమ బెంగాల్ ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోయారని ఓ న్యాయవాది అన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఘాటుగా స్పందించారు. ‘‘ మీరు ఎవరి తరపున హాజరవుతున్నారు. ఇలాంటి సాధారణ ప్రకటనలు చేయొద్దు. ఈ కేసులో అలాంటిదేమీ లేదు. కోర్టులో క్యాంటీన్ కబుర్లు చెప్పొద్దు’’ అని మందలించారు. ఇక.. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 11కు వాయిదా వేసింది.చదవండి: నేను ఏ నేరం చేయలేదు.. ప్రభుత్వమే ఇరికిస్తోంది: సంజయ్ రాయ్ కేకలు -
కోల్‌కతా డాక్టర్ ఉదంతం: ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ కేసు దర్యాప్తు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (సీబీఐ) తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. సోమవారం మధ్యాహ్నం సీల్దాలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సీబీఐ ఛార్జిషీటును సమర్పించింది.ఈ ఘటనలో సామూహిక అత్యాచారం లేదని సీబీఐ తేల్చి చెప్పింది. కాంట్రాక్టు ప్రాతిపదికన కోల్‌కతా పోలీసులతో కలిసి వాలంటీర్‌గా పనిచేసిన నిందితుడు సంజయ్ రాయ్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేశాడని సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేసింది. రాయ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ.. దాదాపు 200 మంది వాంగ్మూలాలు నమోదయ్యాయని సీబీఐ చార్జిషీట్లో తెలిపింది.జూనియర్ డాక్టర్ ఆగస్టు 9న ఆర్జీకర్ ఆస్పత్రిలో మృతిచెందినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటన వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు, సిబ్బంది, మెడికల్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ఈ కేసును కోల్‌కతా హకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ఘటన జరిగిన మరుసటి రోజు నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఇతర ఆధారాలతో సహా సంజయ్ రాయ్‌ను సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.ఇక.. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్లు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు.చదవండి: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి: 10 మంది డాక్టర్లపై బహిష్కరణ -
కోల్‌కతా బాధితురాలి విగ్రహావిష్కరణ.. సోషల్ మీడియాలో చర్చ
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే తాజాగా బాధితురాలికి సంబంధించిన విగ్రహం ఆవిష్కరణపై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హత్యాచార సమయంలో ఆమె అనుభవించిన బాధను ప్రతిబింబించేలా విగ్రహాన్ని అసిత్ సైన్ అనే శిల్పి రూపొందించటం గమనార్హం. ఆ విగ్రహానికి ‘క్రై ఆఫ్ ది అవర్’గా నామకరణం చేశారు. బాధితురాలి విగ్రహాన్ని ప్రిన్సిపల్ ఆఫీసుకు సమీపంలోని పీజీబీ గార్డెన్ ఎదుట ఆవిష్కరించారు.#justiceforAbhya "Cry of the Hour""The Agony, the Pain, the Suffering...A poignant depiction of the unbearable trauma Abhaya enduredToday A #statue erected in memory of the rape and murder victim at R.G. Kar Medical College and Hospital"#MedTwitter #medX #rgkarprotest pic.twitter.com/Pek84iAsNj— Indian Doctor🇮🇳 (@Indian__doctor) October 2, 2024 ‘‘బాధితురాలి విగ్రహం ఆవిష్కరించటం చాలా భావోద్వేగంతో కూడుకున్న విషయం. ఆమె మా సహోద్యోగి. మేము ఆమె కోసం పోరాడుతున్నాం. ఆమె మన హృదయంలో ఉంది. విగ్రహ ఏర్పాటు ద్వారా ఆమెను ఎవరూ మరచిపోరు’ అని జూనియార్ డాక్టర్ అన్నారు.‘‘ ఈ విగ్రహం బాధితురాలిది కాదు, ఆమె అనుభవించిన బాధ, హింస, ఆమె కోసం కొనసాగుతున్న నిరసనలకు ప్రతీక’’ అని మరో జూనియర్ డాక్టర్ పేర్కొన్నారు.అయితే ఈ విగ్రహం మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినప్పటికీ.. తయారు చేసిన విధానం అగౌరవంగా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ‘‘ అత్యాచార బాధితురాలి ఆధారంగా ఇలాంటి విగ్రహాన్ని ఎందుకు సృష్టించారు’’, ‘‘ ఇది మంచి ఆలోచన అని ఎవరు భావించారు? దీన్ని ఎవరు ఆమోదించారు?’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘‘ అగౌరవ పరిచేవిధంగా ఏం లేదు. కొందరు భారతీయ స్త్రీలను కూడా గర్వంగా గుర్తుంచుకోలేరు’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన జూనియర్ డాక్టర్ల నిరసన కొనసాగుతోంది. ప్రభుత్వం ఈ ఘటనపై నిర్ణయాత్మకంగా వ్యవహరించే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు తేల్చిచెబుతున్నారు.చదవండి: కోల్‌కతా ఘటన.. సీబీఐ విచారణకు టీఎంసీ ఎమ్మెల్యే -
కోల్‌కతా: విధుల్లో చేరిన జూనియర్ డాక్టర్లు
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘటన నేపథ్యంలో బెంగాల్లో జూనియర్ డాక్టర్లు సమ్మె ద్వారా తమ నిరసనలు కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జరిపిన చర్చల అనంతరం 42 రోజుల విరామం తర్వాత జూనియర్ డాక్టర్లు బెంగాల్ వ్యాప్తంగా శనివారం తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా అత్యవసర వైద్య సేవల్లో విధులు నిర్వహిస్తామని జూనియర్ డాక్టర్లు వెల్లడించారు. ఇక.. తమ డిమాండ్లలో కొన్నింటికి సీఎం మమత ప్రభుత్వం అంగీకరించడంతో ఇవాళ విధుల్లోకి చేరినట్లు పేర్కొన్నారు. కానీ, ఔట్ పేషెంట్ విభాగానికి సంబంధించిన జూనియర్ డాక్టర్లు ఇంకా విధుల్లో చేరలేదు.చదవండి: కోల్‌కతా డాక్టర్ కేసు: కుట్ర కోణంలో సీబీ‘ఐ’ దర్యాప్తు!‘‘ఈరోజు తిరిగి విధుల్లో చేరడం ప్రారంభించాం. జూనియర్ ఈ ఉదయం నుంచి అవసరమైన, అత్యవసర సేవలకు సంబంధించిన విభాగాల్లో తిరిగి సేవలు ప్రారంభించారు.కానీ ఔట్ పేషెంట్ విభాగాల్లో ఇంకా చేరలేదు. ఇది పాక్షికంగా విధులను ప్రారంభించడం మాత్రమే. నా తోటి ఉద్యోగులు ఇప్పటికే రాష్ట్రంలోని వరద బాధిత జిల్లాలకు బయలుదేరారు. అక్కడ ప్రజారోగ్యం పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించడానికి ‘అభయ క్లినిక్‌లు’(వైద్య శిబిరాలు) ప్రారంభిస్తారు’’ అని సమ్మె చేసిన డాక్టర్లలో ఒకరైన అనికేత్ మహతో తెలిపారు.బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జూనియర్ డాక్టర్ల మధ్య ఇటీవల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూడాల డిమాండ్లకు దీదీ అంగీకరించారు. తమ డిమాండ్లలో అధిక శాతానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో శనివారం నుంచి పాక్షికంగా విధులకు హాజరుకావాలని జూనియర్ వైద్యులు నిర్ణయించారు. అయితే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అత్యవసర, తప్పనిసరి సేవల విభాగాల్లో మాత్రమే తాము విధుల్లో పాల్గొంటామని ప్రకటించారు. కానీ, అవుట్ పేషంట్ విభాగాల్లో మాత్రం విధులు చేపట్టబోమని స్పష్టం చేశారు. చదవండి: కోల్‌కతా కేసు.. సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు -
ఇది రాజకీయ ఎత్తుగడల వైఫల్యం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గుండ్రంగా వేసిన ఖాళీ తెల్లని కుర్చీల ముందు కూర్చుని, వైద్యులతో భేటీ కోసం ‘వేచి వేచి వేచి’ చూసిన చిత్రం చాలా ఆసక్తిని పుట్టించింది. ప్రత్యేకించి దాని తర్వాత ముఖ్యమంత్రి చేతులు జోడించి, నిరసన తెలుపుతున్న వైద్యు లతో చర్చించే విషయమై ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడంలో జరిగిన వైఫల్యానికి క్షమాప ణలు చెప్పడం... నాటకీయంగా ఉద్వేగభరితంగా తాను ‘రాజీ నామాకు సిద్ధంగా ఉన్నాను’ అనే ఎత్తుగడను వేయడం మరీ విశేషం.వాస్తవానికి, ఆ క్షణమాత్రపు దృశ్యంలో ప్రదర్శితమైన ప్రహసనం ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి చేసిన ఈ వ్యాఖ్యలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. విశేషం ఏమంటే, ఇదే ప్రత్యక్ష ప్రసారం విషయంలోనే ఆ చర్చలు ప్రారంభం కావడానికి ముందే విఫలమయ్యాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలో యువ వైద్యురాలిపై జరిగిన హత్యాచారంపైనా... దాని వెంబడే చోటు చేసుకున్న తప్పుడు చర్యలు, వాటిని కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాల పైనా గత నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్న వైద్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రితో తమ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందేనని ముందస్తు షరతు పెట్టారు. సుప్రీంకోర్టు ఈ కేసును ప్రత్యక్ష ప్రసారం చేయగలిగినప్పుడు, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం దానిపై విభేదించడానికి ఎటువంటి కారణం లేదని వాదిస్తూ, వారు ఈ డిమాండ్‌పై ఇప్పటికీ మొండిగా ఉన్నారు. అదే సమయంలో చర్చలను రికార్డ్ చేసి, సుప్రీంకోర్టు అను మతితో తర్వాత విడుదల చేయాలనే ప్రతిపాదనను వైద్యులు అంగీకరించలేదు.మమతా బెనర్జీ ఈ పనిని నిరసనల ప్రారంభంలోనే ఎందుకు చేయలేదని ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ముడిచిన చేతులు, మధురమైన స్వరం, ప్రతిష్టంభనను ఛేదించలేక పోయినందుకు క్షమాపణ చెప్పడం, వైద్యుల కోసం రెండు గంటలకు పైగా వేచి ఉండటాన్ని నొక్కి చెప్పడం... బహుశా నేరం జరిగిన కొన్ని గంటలు లేక రోజులలో ఇదే విధానం పాటించి ఉంటే, ఇంత సంక్షోభం ఏర్పడేది కాదు. ఉద్య మాలలో పుట్టి, రూపుదిద్దుకున్న ఈ రాజకీయ నాయకురాలు ఇలా సహజ ప్రవృత్తి రాహిత్యాన్ని ప్రదర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కోల్‌కతా పోలీసు చీఫ్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపాదించినప్పటికీ రాబోయే పండుగ సీజన్ కారణంగా తాను దానిని తిరస్కరించినట్లు ఆమె వెల్లడించడం మరింత అయోమయం కలిగించింది. ఆమె ప్రకటనపై స్పందిస్తూ ఒక యువ వైద్యుడు ఇలా అన్నాడు: ‘ప్రస్తుతం పండుగల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు?’ (ప్రభుత్వం అనంతరం కోల్‌కతా నగర కమిషనర్‌ను మార్చింది.) ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విమర్శించడంలో భార తీయ జనతా పార్టీ రాష్ట్రంలో అందరికంటే ముందు ఉండ వచ్చు; కానీ, మణిపుర్ విషయానికి వస్తే, అక్కడ బీజేపీ ఏ సహజ ప్రవృత్తినీ ప్రదర్శించకపోవడం గురించి ఇలాంటి ప్రశ్న లనే ఆ పార్టీ నాయకత్వంపై సంధించవలసి ఉంటుంది.మళ్ళీ, స్పష్టంగా చెప్పాలంటే, 2023 మే నుండి హింసా త్మక జాతి ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించిన మణి పుర్ రాష్ట్రానికీ, పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జి కర్ హాస్పిటల్ కేసుకూ మధ్య నేను వాచ్యార్థంగా కూడా ఎలాంటి పోలికలను చూపడం లేదు. చిన్న, పెద్ద సంక్షోభ సమయాల్లో రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారనే దానికే ఈ సారూప్యత పరి మితం. ఇంగితజ్ఞానం చాలా అవసరమైనప్పుడే అది వారికి లేకుండా పోయినట్లు కనిపిస్తుంది.మణిపుర్లో ఎన్. బీరేన్ సింగ్‌ను ముఖ్యమంత్రి స్థానం నుండి తొలగించడానికి బీజేపీ మొండిగా నిరాకరించడం ఏ రకంగానూ వివరించలేనిది. రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఆందో ళనకరంగా ఉందంటే, చాలామంది దీనిని అంతర్యుద్ధంతో పోల్చారు. అక్కడ మైతేయి, కుకీ సమాజాల మనుషులు ఒకరు ఆధిపత్యం వహించే భౌగోళిక ప్రాంతాలలోకి మరొకరు ప్రవేశించలేరు. జాతి సమూహాలను స్పష్టంగా వేరు చేసే ‘బఫర్ జోన్’ను ప్రమాదవశాత్తూ దాటిన కారణంగా సైన్యా నికి చెందిన ఒక మాజీ సైనికుడు వారం క్రితం హత్యకు గుర య్యాడు. ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చని పోయిన 11 మందిలో మహిళలు కూడా ఉన్నారు. రెండు వర్గాల ప్రజలు, రైతులు, విద్యార్థుల చేతుల్లో వేల సంఖ్యలో ఆయుధాలు ఉన్నాయి.ప్రతి ఒక్కరికి దేశభక్తి పరీక్షలను నిర్వహించే కీ–బోర్డ్ జాతీయవాదులు, స్వల్పంగా అసమ్మతి వ్యక్తం చేసే ప్రజలను జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడానికి వెనుకాడరు. అలాంటిది ఒక మాజీ సైనికుడు అయిన హవల్దార్ లిమ్ఖోలాల్ మాతే భార్య ‘నా భర్త భారతదేశం కోసం పోరాడాడు, కానీ తనను ఒక జంతువులా చంపేశారు’ అని ఏడుస్తూ చెప్పిన ప్పుడు, జాతీయవాదానికి స్వీయ నియమిత మధ్యవర్తులందరూ ఎక్కడ ఉన్నారు? మణిపుర్లో రాజకీయ పార్టీలు పతనమయ్యాయి. ఈ గొడవలో ముఖ్యమంత్రి పాత్రపై విచారణ జరిపించాలని కోరిన పది మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు బీజేపీకి చెందిన వారే. హింస బయటినుంచి ఉన్నప్పుడు, ఉదాహరణకు తిరుగుబాట్లు లేదా యుద్ధ సమయంలో రాజకీయ నాయ కత్వం కొనసాగింపును నేను అర్థం చేసుకోగలను. కానీ ఇది తనపై తాను యుద్ధంలో ఉన్న రాష్ట్రం. ఇది శాంతి భద్రతల వైఫల్యం. కానీ ఇది అన్నింటికంటే, రాజకీయాల వైఫల్యం. ముఖ్యమంత్రిని తొలగించడం అనేది స్పష్టంగా సరైన పని కావడమే కాకుండా, ఘర్షణ పడుతున్న పార్టీలను చర్చల బల్ల వద్దకు తీసుకురావడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. పశ్చిమ బెంగాల్ నుండి మణిపుర్ వరకు, తప్పక చేయ వలసిన చర్యే చాలాసార్లు సరైనది అవుతుంది. కానీ అలా చేయకపోగా దాన్ని ప్రతిఘటించడమే ఇక బాగు చేయలేని పరిస్థితికి నెట్టినట్టు అవుతోంది.బర్ఖా దత్‌వ్యాసకర్త ప్రముఖ జర్నలిస్టు, రచయిత(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
బాధితురాలి ఫొటో, పేరు తొలగించండి: సుప్రీం కోర్టు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్యాచారం కేసును సుప్రీం కోర్టు విచారించింది. మంగళవారం సుప్రీం కోర్టు చేపట్టిన విచారణ సందర్భంగా.. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నిద్ర పోవట్లేదు, నిజాన్ని వెలికితీసేందుకు కొంత సమయం ఇవ్వాలని పేర్కొంది. నేరానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ సహా ఆధారాలను సీబీఐ ధ్వంసం చేసిందని ఎవరూ చెప్పలేరని తెలిపింది. బాధితురాలి ఫొటో, పేరును వీకిపీడియా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీం కోర్టు ఆదేశించింది. బాధితురాలి గౌరవాన్ని కాపాడే దృష్ట్యా, బాధితురాలిపై గుర్తింపును బహిర్గతం చేయరాదని పేర్కొంది. సీసీటీవీ ఫుటేజీ సహా నేరానికి సంబంధిచిన ఆధారాలన్నీ సీబీఐకి అప్పగించామని తెలిపిన పశ్చిమ బెంగాల్ పోలీసులు కోర్టుకు తెలిపారు.గత ఆదేశాల మేరకు ఈ కేసుకు సంబంధించిస్టేటస్ రిపోర్ట్‌ను సీబీఐ సుప్రీం కోర్టుకు సమర్పించింది. తాజా రిపోర్టుపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.కేసుకు సంబంధించి ఇప్పటివరకు గుర్తించిన వివరాలను బయటపెట్టడం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపింది. ఇక.. ఇప్పటికే ప్రిన్సిపల్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లను అరెస్టు చేశారు. దర్యాప్తు పూర్తయ్యేవరకు వేచి చూద్దామని పేర్కొంది.హాస్పిటల్స్‌లో టాయిలెట్స్, సీసీటీవీలు, బయోమెట్రిక్ ఏర్పాటుకు చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సీనియర్, జూనియర్ డాక్టర్ల ప్రతినిధులను సంప్రదించాలని ఆదేశించింది. మహిళా డాక్టర్లు రాత్రిపూట పని చేయకూడదనే షరతు వారి కెరీర్‌పై ప్రభావం చూపుతుందని, డ్యూటీ టైమింగ్స్ డాక్టర్లందరికీ సహేతుకంగా ఉండాలని తెలిపింది. అయితే.. ఆ షరతును పభుత్వం తొలగిస్తుందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టుకు తెలియజేశారు. మహిళల నైట్ డ్యూటీలకు నిషేధిస్తూ వారు 12 గంటల షిఫ్టుకు మించి పని చేయరాదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ నోటిఫికేషన్‌ను పరిశీలించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి చూచించింది. ఈ నొటిఫికేషన్ తాత్కాలికమేనని మరో నోటిఫికేషన్‌ను తీసుకువస్తుందని బెంగాల్ ప్రభుత్వం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టుకు తెలిపారు.చదవండి: అబద్ధాల పుట్ట సందీప్ ఘోష్.. అభయ కేసు దర్యాప్తుపై సీబీఐ అధికారులుమరోవైపు.. సోమవారం సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు, ప్రభుత్వం మధ్య రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశం జరిగింది. అనంతరం.. జూనియర్ డాక్టర్ల ఐదు డిమాండ్లలో సీఎం మమతా బెనర్జీ మూడింటిని ఆమోదించారు. వైద్య విద్య డైరెక్టర్, ఆరోగ్య సేవల డైరెక్టర్లను తొలగించడానికి అంగీకరించారు. వైద్యురాలి తల్లిదండ్రులకు డబ్బు ఇవ్వజూపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ పైనా వేటు వేశారు. ఇక.. ఇవాళ కొత్త కమిషనర్‌ను నియమిస్తామని సీఎం మమత ప్రకటించారు.జూనియర్ల డాక్టర్ల ఇతర డిమాండ్లను పరిశీలించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఐదింటిలో మూడు డిమాండ్లను అంగీకరించినందుకు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని జూనియర్ డాక్టర్లను కోరినట్లు మమత వెల్లడించారు. జూడాలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవని ప్రకటించారు. ఇక.. సమ్మె విషయంపై చర్చించుకొని తమ నిర్ణయం చెబుతామని జూనియర్ డాక్టర్లు తెలిపారని సీఎం మమత వెల్లడించారు. -
కోల్‌కతా కేసు: సందీప్ ఘోష్, అభిజిత్ సంభాషణపై అనుమానాలు!
కోల్‌కతా: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తోపాటు తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మోండల్‌ను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. తాజాగా ఈ ఇద్దరిని దర్యాప్తు సంస్థ సీబీఐ ఆదివారం స్థానిక కోర్టులో హాజరుపర్చింది. హత్యాచార ఘటన జరిగిన గంటల వ్యవధితో సందీప్ ఘోష్.. అభిజిత్ మోండల్‌తో మాట్లాడారని సీబీఐ కోర్టుకు వెళ్లడించింది. ఈ కేసుతో వీరికి సంబంధం ఉన్నట్లు అనుమానం కలుగుతోంది.వారిని విచారించాలని అసవరం ఉందని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో కోర్టు వారిని సీబీఐ కస్టడీలో భాగంగా రిమాండ్లకు ఆదేశించింది. ఈ కేసును కోర్టు సెప్టెంబర్ 17వరకు వాయిదా వేసింది.‘‘ఈ కేసులో రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు అయింది. మేము సేకరించిన కాల్ రిక్డార్డుల ప్రకారం ఘటన జరిగిన గంటల వ్యవధితో సందీప్ ఘోష్, మండల్ మాట్లాడుకున్నారు. ఈ ఘటనలో వారికి సంబంధం ఉన్నట్లు అనుమానం ఉంది. ఈ కేసులో నిజాలు వెలికితీయాలంటే వారిని విచారించాలి. బెంగాల్ పోలీసులకు, సీబీఐకి మధ్య విభేదాలు లేవు. మేము నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నాం. మాకు మోండల్ ఓ పోలీసు అధికారిగా కనిపించటం లేదు.. ఆయన మాకు ఒక అనుమానితుడిగా కనిపిస్తున్నారు. హత్యాచారం కేసులో మోండల్ కాదు.. కానీ ఈ కేసులో నిజాలు కప్పిపుచ్చే పెద్ద కుట్రలో పాత్ర పోషించి ఉండవచ్చని అనుమానం కలుగుతోంది’ అని సీబీఐ కోర్టుకు వివరించింది. హత్యాచార ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం, విచారణలో సరైన సమాధానాలు చెప్పకపోవడం వంటి కారణాలతో తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మోండల్ సీబీఐ అరెస్టు చేసింది. మరోవైపు.. ఇప్పటికే ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆర్థిక అవకతవకల పాల్పడిన కేసులో సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా హత్యాచార ఘటనలో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలను సీబీఐ సందీప్‌పై మోపింది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు.చదవండి: ‘టీ’ తాగాలంటూ దీదీ ఆహ్వానం.. వద్దని ఖరాఖండిగా చెప్పిన డాక్టర్లు -
‘సంజయ్ రాయ్‌పై నార్కో టెస్ట్ వద్దు’
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ఆర్జీ కర్ వైద్యకళాశాల జూనియర్ వైద్యురాలి హత్యోదంతంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు నార్కో అనాలసిస్ పరీక్ష చేసేందుకు కోల్‌కతా కోర్టును సీబీఐ అనుమతి కోరగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ఈ విషయాన్ని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఆ కుటుంబాలకు ఆర్థికసాయం జూనియర్ వైద్యుల సమ్మె కారణంగా ఆస్పత్రుల్లో వైద్యం అందక మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం చేసేందుకు పశి్చమబెంగాల్ ప్రభుత్వం ముందుకొచి్చంది. 29 మంది మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలు ఇస్తామని సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రపతి, ప్రధానికి జూడాల లేఖ ఈ ఉదంతంలో స్వయంగా కలగజేసుకోవాలంటూ రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి జూనియర్ డాక్టర్లు గురువారం రాత్రి లేఖలు రాశారు. ఈ లేఖల ప్రతులను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాలకూ పంపించారు. ‘‘ అత్యంత జుగుప్సాకరమైన నేరానికి మా తోటి సహాధ్యాయి బలైంది. న్యాయం జరిగేలా మీరు జోక్యం చేసుకోండి. అప్పుడే ఎలాంటి భయాలు లేకుండా మళ్లీ మా విధుల్లో చేరతాం’’ అని ఆ లేఖలో జూనియర్ వైద్యులు పేర్కొన్నారు. -
Mamata Banerjee: రాజీనామాకైనా సిద్ధం
కోల్‌కతా: బెంగాల్ ప్రజల కోసం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. వైద్యురాలికి న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నానని తెలిపారు. ‘వైద్యుల సమ్మెపై ప్రతిష్టంభన ఈ రోజుతో తొలిగిపోతుందని ఆశించిన బెంగాల్ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను. జూనియర్ డాక్టర్లు నబన్నా (సచివాలయం)కు వచ్చి కూడా చర్చలకు కూర్చోలేదు. తిరిగి విధులకు వెళ్లాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని మమత గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. ‘సదుద్దేశంతో గత మూడురోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మెడికోలు చర్చలకు నిరాకరించారు’ అని సీఎం అన్నారు. ‘ప్రజల కోసం నేను రాజీనామా చేసేందుకు సిద్ధం. కానీ ఇది పద్ధతి కాదు. గడిచిన 33 రోజులుగా ఎన్నో అభాండాలను, అవమానాలను భరించాం. రోగుల అవస్థలను దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో చర్చలకు వస్తారని భావించా’ అని మమత పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినా.. తమ ప్రభుత్వం జూనియర్ డాక్టర్లపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోదని హామీ ఇచ్చారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్ హత్యాచారంతో జూనియర్ డాక్టర్లు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. నెలరోజులకు పైగా వీరు విధులను బహిష్కరిస్తున్నారు. సెపె్టంబరు 10న సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను బేఖాతరు చేశారు. మమత సమక్షంలో చర్చలకు జూడాలు డిమాండ్ చేయగా.. బెంగాల్ ప్రభుత్వం దానికి అంగీకరించి వారిని గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చల కోసం నబన్నాకు రావాల్సిందిగా ఆహా్వనించింది. అయితే ప్రత్యక్షప్రసారం ఉండాలనే జూడాల డిమాండ్‌ను ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చర్చలు జరగలేదు. రెండుగంటలు వేచిచూశా సమ్మె చేస్తున్న డాక్టర్లను కలవడానికి రెండు గంటల పాటు సచివాలయంలో వేచిచూశానని, వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని మమత అన్నారు. గురువారం సాయంత్రం 5:25 గంటలకు సచివాలయానికి చేరుకున్న డాక్టర్లు ప్రత్యక్షప్రసారానికి పట్టుబట్టి బయటే ఉండిపోయారు. ప్రత్యక్షప్రసారం డిమాండ్‌కు తాము సానుకూలమే అయినప్పటికీ హత్యాచారం కేసు కోర్టులో ఉన్నందువల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే.. చర్చల రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేశామని మమత వివరించారు. ‘పారదర్శకత ఉండాలని, చర్చల ప్రక్రియ పక్కాగా అధికారిక పత్రాల్లో నమోదు కావాలనే రికార్డింగ్ ఏర్పాటు చేశాం. సుప్రీంకోర్టు అనుమతిస్తే జూడాలతో వీడియో రికార్డును పంచుకోవడానికి కూడా సిద్ధం పడ్డాం’ అని మమత చెప్పుకొచ్చారు. రహస్య పత్రాలపై ఇలా బాహటంగా చర్చించలేమన్నారు. గడిచిన నెలరోజుల్లో వైద్యసేవలు అందక రాష్ట్రంలో 27 మంది చనిపోయారని, 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ‘15 మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని చర్చలకు పిలిచాం. కానీ 34 మంది వచ్చారు. అయినా చర్చలకు సిద్ధపడ్డాం. చర్చలు సాఫీగా జరగాలనే ఉద్దేశంతోనే వైద్యశాఖ ఉన్నతాధికారులెవరినీ పిలువలేదు (వైద్యశాఖ కీలక అధికారుల రాజీనామాకు జూడాలు డిమాండ్ చేస్తున్నారు)’ అని మమతా బెనర్జీ అన్నారు. నబన్నాకు చేరుకున్న జూనియర్ డాక్టర్లను ఒప్పించడానికి ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్, డీజీపీ రాజీవ్ కుమార్‌లు తీవ్రంగా ప్రయత్నించారు. ముమ్మర సంప్రదింపులు జరిపారు. అయినా జూడాలు తమ డిమాండ్‌పై వెనక్కితగ్గలేదు. ప్రభుత్వం జూడాలను చర్చలకు పిలవడం రెండురోజుల్లో ఇది మూడోసారి. రాజకీయ ప్రేరేపితంచర్చలు జరపాలని తాము చిత్తశుద్ధితో ఉన్నామని, అయితే డాక్టర్ల ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని మమతా బెనర్జీ సూచనప్రాయంగా చెప్పారు. ‘డాక్టర్లలో చాలామంది చర్చలకు సానుకూలంగా ఉన్నారు. కొందరు మాత్రమే ప్రతిష్టంభన నెలకొనాలని ఆశిస్తున్నారు’ అని ఆరోపించారు. బయటిశక్తులు వారిని నియంత్రిస్తున్నాయన్నారు. ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని, వాటికి వామపక్షాల మద్దతుందని ఆరోపించారు. మమత రాజీనామా కోరలేదు: జూడాలు ప్రత్యక్షప్రసారాన్ని అనుమతించకూడదనే సర్కారు మొండి పట్టుదలే చర్చలు కార్యరూపం దాల్చకపోవడానికి కారణమని జూనియర్ వైద్యులు ఆరోపించారు. తామెప్పుడూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా కోరలేదని స్పష్టం చేశారు. ప్రతిష్టంభనకు వైద్యులే కారణమని మమత పేర్కొనడం దురదృష్టకరమన్నారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా విధుల బహిష్కరణ కొనసాగిస్తామని తేలి్చచెప్పారు. -
సందీప్ ఘోష్ తండ్రి నివాసంలో ఈడీ సోదాలు
కోల్‌కతా: జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన అనంతరం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఆర్థిక అవకతవకల అంశంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు గురువారం ఉదయం కోల్‌కతా, సబర్బన్ ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తండ్రి సత్య ప్రకాశ్ నివాసంలోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.West Bengal | Enforcement Directorate carrying out search operation in connection with RG Kar Medical College & Hospital financial irregularities case at several places in Kolkata and suburban areas including the residence of former principal of RG Kar Medical College & Hospital…— ANI (@ANI) September 12, 2024 మరోవైపు.. డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ డార్టర్లు, వైద్య సిబ్బంది ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇక.. హత్యాచార ఘటనపై నిర్లక్ష్యం వహించినందుకు సందీప్ ఘోష్ సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.చదవండి: జూనియర్ డాక్టర్ల షరతులు.. కుదిరే పనికాదన్న సర్కారు -
Gandhi Hospital: మద్యం మత్తులో మహిళా జూడాపై దాడి
గాందీఆస్పత్రి : కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటన మరువక ముందే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఓ దారుణం చోటుచేసుకుంది. అత్యవసర విభాగంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా ఇంటర్నీ (జూనియర్ డాక్టర్)పై చికిత్స కోసం వచి్చన ఓ రోగి దాడి చేశాడు. మహిళ ఇంటర్నీ చేయి, యాప్రాన్ పట్టుకుని గట్టిగా లాగడంతో ఆమె భయాందోళనకు గురైంది. దీనిని గమనించిన తోటి వైద్యులు, సిబ్బంది రోగి చేతుల్లోంచి ఆమెను విడిపించారు. ప్రత్యక్ష సాక్షులు, గాంధీ అధికారులు, జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బన్సీలాల్‌పేటకు చెందిన జీ.ప్రకాశ్ (60) దినసరి కూలీగా పని చేస్తున్నాడు. మద్యం, కల్లు తాగే అలవాటు ఉన్న ప్రకాశ్ బుధవారం ఫుల్లుగా మద్యం సేవించి, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండటంతో అతడి భార్య వైద్యసేవల నిమిత్తం ప్రకాశ్‌ను గాంధీ ఎమర్జెన్సీ విభాగానికి తీసుకువచి్చంది. భార్య పక్కనే ఉన్న ప్రకాశ్ అక్కడే డ్యూటీలో ఉన్న ఓ వైద్యవిద్యార్థిని చేయి పట్టుకుని గట్టిగా లాగాడు. ఆమె యాప్రాన్ పట్టుకుని బయటికి లాక్కెళ్లేందుకు యత్నించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో గమనించిన తోటి వైద్యులు, సిబ్బంది అతడిని కొట్టి అతని చేతుల్లోంచి ఆమెను విడిపించారు. ఈ ఘటన దృశ్యాలు అత్యవసర విభాగంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముందుగా అతడిని గాంధీ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు అక్కడి నుంచి చిలకలగూడ ఠాణాకు తరలించారు. మద్యం మత్తులో మతిస్థిమితం కోల్పోయి దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను జూనియర్ డాక్టర్ల సంఘం గాంధీ యూనిట్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. వైద్యులు, వైద్య విద్యార్థులపై దాడులు జరగకుండా, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని జూడా సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వంశీకృష్ణ, లౌక్య, గిరిప్రసాద్‌లు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ పోలీసులు తెలిపారు. -
Junior doctors: ప్రత్యక్షప్రసారం చేయాలి
కోల్‌కతా: నెలరోజులకు పై గా విధులను బహిష్కరిస్తున్న జూనియర్ డాక్టర్లతో చర్చలకు పశి్చమబెంగాల్ ప్రభుత్వం వరుసగా రెండోరోజు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి సమక్షంలోనే చర్చలు జ రగాలని జూనియర్ డాక్టర్లు పట్టుబట్టారు. అలాగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని, తమ తరఫున 30 మంది ప్రతినిధుల బృందాన్ని చర్చలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. సచివాలయం నబన్నాలో బుధవారం సాయంత్రం 6 గంటలకు చర్చలకు రావాలని బెంగాల్ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ జూనియర్ డాక్టర్లకు ఈ–మెయిల్ ద్వారా ఆహా్వనాన్ని పంపారు. 12 నుంచి 15 మంది రావాలని కోరారు. సీఎం మమతా బెనర్జీ నేరుగా చర్చల్లో పాల్గొనే విషయాన్ని సీఎస్ మెయిల్లో ధృవీకరించలేదు. చట్టానికి బద్ధులై ఉండే పౌరులుగా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడం ప్రతి ఒక్కరి విధి అయినప్పటికీ జూనియర్ డాక్టర్లు దానికి కట్టుబడలేదని పంత్ పేర్కొన్నారు. దీనిపై సాయంత్రం 5:23 గంటలకు జూనియర్ డాక్టర్లు విలేకరుల సమావేశంలో స్పందించారు. ‘సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే చర్చలు జరగాలి. టీవీల్లో ప్రత్యక్షప్రసారం ఉండాలి. పలు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులకు చెందిన జూనియర్ డాక్టర్లు ఆందోళనలో పాలుపంచుకొంటున్నందున కనీసం 30 మందిని చర్చలకు అనుమతించాలి’ అని జుడాల ఫోరం ప్రకటించింది. షరతులకు ఒప్పుకోం బేషరతుగా చర్చలకు రావాలని, జూనియర్ డాక్టర్లు పెట్టిన ఏ షరతునూ అంగీకరించాడానికి బెంగాల్ సర్కారు సిద్ధంగా లేదని ఆరోగ్యమంత్రి చంద్రిమా భట్టాచార్య స్పష్టం చేశారు. షరతులు పెట్టారంటే వారు మనస్ఫూర్తిగా చర్చలకు సిద్ధంగా లేరని అర్థమన్నారు. -
గాంధీ ఆసుపత్రిలో మహిళా జూనియర్ డాక్టర్‌పై దాడి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై దాడి జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో విధి నిర్వహణలో ఉన్న సమయంలో మహిళా జూనియర్ డాక్టర్‌పై రోగి బంధువుల్లో ఒకరు దాడికి పాల్పడ్డాడు. వైద్యురాలి అప్రాన్ లాగి దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అతడి బారి నుంచి ఇతర సిబ్బంది.. వైద్యురాలిని కాపాడారు.డాక్టర్‌పై దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అయితే రోగి బంధవులు దాడికి పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.చదవండి: RG Kar Case: చర్చల లైవ్ టెలికాస్ట్ డిమాండ్#AartiRavi#attackon_GANDHI_doctorAttacks on lady doctors still continued Lady doctor attacked by patient publicly in casualty in Gandhi hospital Hyderabad.Hatsoff to patient attendent and patient care worker immediately responded Kolkata episode everyone know how a lady… pic.twitter.com/9sXS8pDhG7— Dr vasanth kumar gourani (@vasant5577) September 11, 2024 -
దీదీ వ్యాఖ్యలు సరికాదు: జూ.డా. తల్లి ఆవేదన
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై బెంగాల్‌వ్యాప్తంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు.. డాక్లర్లు, వైద్య సిబ్బంది ఇవాళ సాయంత్రం వరకు డ్యూటీలో చేరాలని సోమవారం ఆదేశించింది. మరోవైపు.. డాక్టర్ ఘటనపై ప్రజలు నిరసనలు మానేసి రాబోయే దుర్గా పూజ మీద దృష్టి సారించాలని సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో సీఎం మమత చేసి వ్యాఖ్యాలను బాధితురాలి తల్లి తప్పుపట్టారు. ఘటన ఆమె చేసి వ్యాఖ్యలు సరైనవి కాదని.. ఈ దారుణ ఘటనపై సున్నితత్వం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మేము ఎప్పుడూ మా కూతురుతో దుర్గా పూజ జరుపుకునేవాళ్లం. రాబోయే రోజుల్లో మేము దుర్గా పూజనే కాదు మరే ఇతర పండలు జరుపుకోలేము. సున్నితమైన అంశంపై ఆమె(మమతను ఉద్దేశించి) అలా ఎలా మాట్లాడతారు?. మా కూతురిని తిరిగి తీసుకురాగలరా. సీఎం మమత కుటుంబంలో ఇలాంటి దారుణ ఘటన ఆమె ఇలాగే మాట్లాడేవారా? నా బిడ్డకు న్యాయం జరగాలని నిరసన తెలుపుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని సీఎం మమత అడ్డుకోవాలని చూస్తున్నారు. మా కూతురి మరణంతో మా ఇంట్లో దీపం వెళ్లిపోయింది. మా కూతురిని దారుణంగా చంపేశారు. ఇప్పుడు న్యాయం కోసం డిమాండ్‌ను చేస్తున్నవారిని కూడా అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని అన్నారు.సోమవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం మమత మాట్లాడుతూ.. ‘‘ నిరసన చేస్తున్న ప్రజలు, డాక్టర్లు, వైద్య సిబ్బంది దుర్గా ఉత్సవాలపై దృష్టి సారించండి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు త్వరగా పూర్తి చేయడానికి సహకరించాలని అభ్యర్థిస్తున్నా’ అని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్లో దుమారం రేపుతున్నాయి.చదవండి: Supreme Court of India: జనం ఏమైపోయినా పట్టించుకోరా? -
మహిళా జూనియర్ డాక్టర్‌కు వేధింపులు
రాంచీ: కోల్‌కతా మహిళా డాక్టర్ హత్యాచారంపై ఆందోళనలు కొనసాగుతుండగానే అలాంటి తరహా ఘటన మరొకటి జార్ఖండ్‌లో జరిగింది. రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) మెడికల్ కాలేజీ ఆస్పత్రి లిఫ్టులో మహిళా జూనియర్ డాక్టర్ లైంగిక వేధింపులకు గురయ్యారు. వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. వేధింపులకు గురైన డాక్టర్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు.జూనియర్ డాక్టర్‌కు వేధింపుల ఘటనను నిరసిస్తూ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. డాక్టర్లకు భద్రత పెంచుతామని ఆస్పత్రి యాజమాన్యం హామీ ఇవ్వడంతో డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రతి లిఫ్టులో లిఫ్ట్ ఆపరేటర్‌ను నియమించడంతో పాటు ఆస్పత్రి క్యాంపస్లోఎ 100 మంది సాయుధులైన భద్రతా సిబ్బందిని మోహరించేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. ఇదీ చదవండి.. మమత అబద్దం చెబుతున్నారు: కోల్‌కతా వైద్యురాలి తల్లి -
నిరసనలు కేంద్రం కుట్ర: మమత
కోల్‌కతా: వైద్యురాలి హత్యాచారంపై నిరసనల వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. వామపక్షాలూ ఈ కుట్రలో భాగమయ్యాయన్నారు. సచివాలయం నబన్నాలో సోమవారం ఒక అధికారిక సమీక్షలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్ రేప్, హత్య ఉదంతంలో నెలరోజులుగా బెంగాల్లో ప్రజలు నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. బాధితురాలి తల్లిదండ్రులకు తానెప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదని మమత అన్నారు. ఈమేరకు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. దుర్గాపూజ సమీపిస్తున్నందున నిరసనలు వీడి.. పండుగ ఏర్పాట్లు చేపట్టాలని ప్రజలను కోరారు. ‘వైద్యురాలి కుటుంబానికి నేనెప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదు. అభాండాలు వేస్తున్నారు. కూతురి జ్ఞాపకార్థం ఏదైనా కార్యక్రమం చేపట్టదలిస్తే మా ప్రభుత్వం అండగా ఉంటుందని తల్లిదండ్రులకు చెప్పాను. ఎప్పుడేం మాట్లాడాలో నాకు తెలుసు. నిరసనలు ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ కుట్రే. కొన్ని వామపక్ష పార్టీలకు ఇందులో భాగస్వామ్యముంది. పొరుగుదేశంలో అస్థిరత చూసి.. ఇక్కడా అలాంటి ఆందోళనలు రేకెత్తించాలని కొందరు చూస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్‌లు రెండు వేర్వేరు దేశాలని వారు మర్చిపోయారు’ అని మమత ధ్వజమెత్తారు. ఆందోళన నేపథ్యంలో కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని, దుర్గాపూజ వేళ శాంతి భద్రతలపై పట్టున్న అధికారి అవసరం ఉందని దాన్ని తిరస్కరించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. -
Supreme Court of India: జనం ఏమైపోయినా పట్టించుకోరా?
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా ఆందోళన కొనసాగిస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని తేలి్చచెప్పింది. విధులను పక్కనపెట్టి నిరసనలు కొనసాగించడం సరైంది కాదని అభిప్రాయపడింది. సాధారణ ప్రజల అవసరాలను పట్టించుకోకుండా డాక్టర్లు ఇలా విధులకు గైర్హాజరు కావడం ఏమిటని ప్రశ్నించింది. జనం ఏమైపోయినా పట్టించుకోరా? అని నిలదీసింది. విధుల్లో చేరితే ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఉండబోవని వెల్లడించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మీ భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటారు, వెంటనే వెళ్లి డ్యూటీలో చేరండి అని డాక్టర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ విధులకు దూరంగా ఉంటూ నిరసనలు కొనసాగిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినప్పుడు సంబంధిత డాక్టర్లకు ఇచ్చిన చలాన్ కనిపించకపోవడం పట్ల న్యాయస్థానం అనుమానం వ్యక్తంచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని సీబీఐని, పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చలాన్ మాయం కావడంపై దర్యాప్తు జరపాలని సీబీఐకి సూచించింది. జూనియర్ డాక్టర్‌పై అఘాయిత్యం కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. శవపరీక్ష కోసం ఉపయోగించిన చలాన్ తమ రికార్డుల్లో లేదని చెప్పారు. అయితే, అది ఎక్కడుందో తేల్చాలని ధర్మాసనం పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదులో 14 గంటలు ఆలస్యం కావడం పట్ల మరోసారి అసహనం వ్యక్తం చేసింది. బాధితురాలి ఫోటోలు, వీడియోలను అన్ని రకాల సోషల్ మీడియా వేదికల నుంచి తక్షణమే తొలగించాలని పేర్కొంది.విరమించబోం: జూనియర్ డాక్టర్లు కోల్‌కతా: ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ నెలరోజులుగా విధులను బహిష్కరిస్తున్న పశి్చమబెంగాల్ జూనియర్ డాక్టర్లు సమ్మె కొనసాగిస్తామని సోమవారం రాత్రి ప్రకటించారు. విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ తాము సమ్మె విరమించబోమని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. సీఐఎస్ఎఫ్కి వసతులు కలి్పంచండి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీల్డ్ కవర్లో సమరి్పంచిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై ఈ నెల 17వ తేదీలోగా తాజా నివేదిక సమరి్పంచాలని సీబీఐని ఆదేశించింది. ఈ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. ఆర్జీ కర్ ఆసుపత్రిలో భద్రతా విధుల్లో చేరిన మూడు కంపెనీల సీఐఎస్ఎఫ్ సిబ్బందికి తగిన వసతి సౌకర్యాలు కల్పించాలని పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారికి అవసరమైన పరికరాలు ఇవ్వాలని పేర్కొంది.ఫోరెన్సిక్ నివేదికపై అనుమానాలు డాక్టర్ ఫోరెన్సిక్ నివేదికపై సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. తదుపరి పరీక్షల కోసం బాధితురాలి నమూనాలను ఢిల్లీ–ఎయిమ్స్‌కు పంపించాలని నిర్ణయించినట్లు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. డాక్టర్ కేవలం హత్యకు గురైనట్లు నివేదిక తేలి్చందని చెప్పారు. కానీ, ఆమెను లైంగికంగా చిత్రహింసలకు గురిచేసి, అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని వివరించారు. -
నిశీధి వీధుల్లో అగ్ని నక్షత్రాలు..
రాత్రిళ్లు తారలు కనపడటం సహజం. కాని కోల్‌కతా వీధుల్లో అగ్ని నక్షత్రాలు దర్శనమిస్తున్నాయి. ‘రీక్లయిమ్ ది నైట్’ పేరుతో మహిళలు అనూహ్య సంఖ్యలో రాత్రిళ్లు దివిటీలతో నిరసనలు చేస్తున్నారు. అభయ ఘటన జరిగి నెల అయిన సందర్భంగా సెప్టెంబర్ 8 రాత్రి కోల్‌కతాలోని ఏ కూడలిలో చూసినా దగ్ధ కాగడాలు చేతబూనిన స్త్రీలే. కోల్‌కతాలో సాగుతున్న నిరసనలపై కథనం.‘రాత్రి ఎవరిది?’ ఈ ప్రశ్న పిక్కటిల్లుతోంది కోల్‌కతాలో. ‘రాత్రి మాది కూడా’ అని అక్కడి స్త్రీలు ఎలుగెత్తి నినదిస్తున్నారు. వందల వేల సంఖ్యలో స్త్రీలు రాత్రిళ్లు బయటకు రావడం... కాగడానో, కొవ్వొత్తినో, సెల్‌ఫోన్ లైట్‌నో వెలిగిస్తూ సామూహికంగా నడవడం... ఆ నగరం ఎప్పుడూ ఎరగదు. ఇప్పుడు చూస్తోంది. ‘కోల్‌కతాలో దుర్గాపూజ సమయంలో ఇలాంటి వాతావరణం ఉంటుంది. కాని అభయ విషయంలో న్యాయం కోసం స్త్రీలు రోడ్ల మీదకు వస్తున్నారు. పురుషులు కూడా వారికి స΄ోర్ట్ ఇస్తున్నారు’ అంటున్నారు స్త్రీలు.ఎన్నడూ ఎరగని భయంకోల్కతాలో క్రైమ్ రేటు ఉన్నా ఆగస్టు 8 రాత్రి అభయపై జరిగిన అత్యాచారం, హత్యవల్ల నగరం పూర్తిగా భయపడి΄ోతోంది. స్త్రీలు బయటకు రావాలంటేనే సంకోచించే స్థితి ఈ ఘటన తర్వాత చోటు చేసుకున్నా మెల్లమెల్లగా ఎందుకు బయటకు రాకూడదనే తెగింపు కూడా మొదలయ్యింది. ఆగస్టు 14 అర్ధరాత్రి (స్వాతంత్య్రం వచ్చిన సమయం) రాత్రి భారీస్థాయిలో స్త్రీలు రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అయితే పార్టీలు ఉసికొల్పడం వల్ల ఇలాంటి నిరసనలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఎదురుదాడి చేసింది. కాని ఆ తర్వాత ఏ పార్టీతో సంబంధం లేని రిమ్‌ఝిమ్ శర్మ అనే సామాజిక కార్యకర్త న్యాయం కోసం నిరసన తప్ప వేరే మార్గం లేదనే ఉద్దేశంతో అర్ధరాత్రి నిరసనలకు పిలుపునిచ్చింది. నెప్టెంబర్ 4న కోల్‌కతా పట్టపగలులా మారింది. వేలాదిగా మహిళలు బయటకు వచ్చారు. ఈసారి వారందరి చేతుల్లో పార్టీల జండాలు కాకుండా త్రివర్ణ పతాకాలు ఉన్నాయి. ఇది జనం నిరసన. కోల్‌కతా నగరం దిగ్గున వెలిగింది– న్యాయ ఆకాంక్షతో.నెల రోజుల రాత్రిఆగస్టు 8 రాత్రి కోల్‌కతాలోని ఆర్.జి. కార్ ఆస్పత్రిలో ‘అభయ’ అనే జూనియర్ డాక్టర్‌పై పాశవికంగా అత్యాచారం, హత్య జరిగి నెల రోజులు అవుతుండటంతో ‘ఇంకా జరగని న్యాయానికి’ నిరసనగా పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ‘నైట్ ఆఫ్ అభయ’ పేరుతో నిరసనకు సామాజిక కార్యకర్తలు పిలుపునివ్వడంతో కోల్‌కతాతో పాటు ముఖ్యపట్టణాల్లో స్త్రీలు సెప్టెంబర్ 8 (ఆదివారం) రాత్రి వేలాదిగా రోడ్ల మీదకు వచ్చారు. నినాదాలు, పాటలు, కవితలు... రోడ్ల మీద బొమ్మలు వేయడం ఎక్కడ చూసినా చైతన్యజ్వాలలు. ‘ఉయ్ వాంట్ జస్టిస్’ నినాదం మార్మోగి΄ోయింది. సి.బి.ఐ అనునిత్యం ఏవో స్టేట్మెంట్లు ఇవ్వడం ఆస్పత్రిలోని మూడు గదులను త్రీడి మ్యాపింగ్ ద్వారా విశ్లేషిస్తున్నామని చెప్పడం పాలిగ్రాఫ్ పరీక్షలు చేయించడం తప్ప అసలు ఏం జరిగిందో దీని వెనుక ఎవరున్నారో తెలుపడం లేదు. అభయ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సెప్టెంబర్ 9న (నిన్న) విచారణ చేసినా అందులో అటాప్సీ రి΄ోర్టులో కీలకపత్రం లేక΄ోవడాన్ని గుర్తించి నిలదీసింది. అంటే ఈ కేసు అంతు లేకుండా సాగేలా ఉంది.గగుర్పాటు క్షణం‘ఘటన జరిగి నెల రోజులైనా నా కూతురు ఆ క్షణంలో ఎంత తల్లడిల్లి ఉంటుందో గుర్తుకొస్తే నేటికీ గగుర్పాటుకు గురవుతూనే ఉన్నాను’ అని అభయ తల్లి సెప్టెంబర్ 8 రాత్రి నిరసనలో తెలిపింది. మరోవైపు ఆర్.జి. కార్ ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్లు ఆస్పత్రిలోని పరిస్థితుల్లో ఏమీ మార్పు లేదని, íసీసీ కెమెరాలు బిగించలేదని, భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. రోడ్లపైకి వస్తున్న మహిళలను అడిగితే ‘దేశంలో పెరిగి΄ోయిన రేప్ కల్చర్‌తో విసిగి΄ోయాం. దీనికి ముగింపు పలకాల్సిందే. అంతవరకూ రోడ్ల మీదకు వస్తూనే ఉంటాం’ అంటున్నారు. ఏ జాగృదావస్థ అయినా ప్రక్షాళనకే దారి తీస్తుంది. ఈ ప్రక్షాళనే ఇప్పుడు కావాల్సింది. -
కోల్‌కతా కేసు: ‘బాధితురాలి తల్లిదండ్రులకు లంచం ఇవ్వలేదు’
కోల్‌కతా: కోల్‌కతా ఆర్టీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఇటీవల బాధితురాలి తల్లిదండ్రులకు పోలీసులు డబ్బు ఇవ్వజూపినట్లు ఓ వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం మమత స్పందిస్తూ.. బాధితురాలి తల్లిదండ్రులకు పోలీసులు లంచం ఇవ్వలేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వపై చేస్తున్న అసత్య ఆరోపణలని అన్నారు.‘నేను బాధితురాలి తల్లిదండ్రులకు ఎటువంటి డబ్బులు ఇవ్వజూపలేదు. మా ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ఆరోపణలు మాత్రమే. బాధితురాలి తల్లిదండులు ఒకటి చెప్పాను. తమ కూతురి జ్ఞాపకం కోసం ఏదైనా చేయాలనుకుంటే మాత్రం తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చా. ఆర్జీ కర్ ఆస్పత్రిలో నిరసనల తర్వాత రాజీనామా చేస్తానని కోల్‌కతా కమీషనర్ ఆఫ్ పోలీస్ వినీత్ గోయల్ అన్నారు. దుర్గాపూజకు ముందు శాంతిభద్రతలు తెలిసినవారిని సీపీగా నియమించాలని యోచిస్తున్నాం. తమ ప్రభుత్వంపై కేంద్రం కుట్ర చేస్తోంది. ఇందులో లెఫ్ట్ పార్టీలు సైతం పాలుపంచుకుంటున్నాయి. కొందరు పొరుగు దేశంలో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం పేరుతో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. కానీ వాళ్లు ఇండియా, బంగ్లాదేశ్ అనేవి రెండు వేర్వేరు దేశాలన్న విషయాన్ని మర్చిపోతున్నారు’’ అని అన్నారు.#WATCH | Howrah: West Bengal CM Mamata Banerjee says, "We are fulfilling all the requirements of CISF... This is all a conspiracy hatched by the central government and some leftist parties. They are involved in this conspiracy... We are not stopping you for anything... There are… pic.twitter.com/9zGOqjWSSL— ANI (@ANI) September 9, 2024‘ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా కేసును అణగదొక్కేందుకు పోలీసులు మొదటినుంచీ ప్రయత్నించారు. మృతదేహాన్ని చూసేందుకు కూడా మమ్మల్ని అనుమతించలేదు. పోస్ట్‌మార్టం పూర్తయ్యేంతవరకు పోలీస్‌స్టేషన్‌లోనే వెయిట్ చేయించారు. ఆ తర్వాత మృతదేహాన్ని మాకు అప్పగిస్తుండగా.. ఓ సీనియర్ పోలీసు అధికారి మా వద్దకు వచ్చి డబ్బులు ఆఫర్ చేశారు. మేం దాన్ని తిరస్కరించాం’ అని బాధితురాలి తండ్రి మాట్లాడినట్లు ఇటీవల ఓ విడియో వైరల్ అయింది. అదే రోజు మరో వీడియో కూడా కూడా వైరల్ అయింది. అందులో బాధితురాలి తల్లిదండ్రులు.. ‘పోలీసులు డబ్బులు ఇవ్వజూపారని మేము అనలేదు. మా కూతురికి న్యాయం జరగాలని కోరాం’ అని తెలిపారు. దీనిపై అదేరోజు టీఎంసీ ప్రతిపక్ష బీజేపీపై ఇలాంటి అసత్య ప్రచారం చేయవద్దని మండిపడింది. -
కోల్‌కతా: నిందితుడికి బెయిల్ ఇవ్వమంటారా? సీబీఐపై కోర్టు ఫైర్
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌ను సీబీఐ విచారిస్తోంది. ఈ కమ్రంలో సంజయ రాయ్ బెయిల్ కోరుతూ కోల్‌కతా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు సీబీఐపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. నిందితుడి తరఫున న్యాయవాది కవితా సర్కార్ వాదనలు వినిపించారు. అనంతరం వాదనలు వినిపించాల్సిందిగా సీబీఐ తరఫున న్యాయవాదిని కోర్టు కోరింది. సీబీఐ న్యాయవాది దీపక్ పోరియా అందుబాటులో లేకపోవటంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో.. ‘నిందితుడు నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వమంటారా? న్యాయవాది కోర్టు హాలులో లేకపోవటం సీబీఐ చట్టవ్యతిరేక ప్రవర్తనకు నిదర్శనం. ఇలా చేయటం చాలా దురదృష్టకరం’’ అని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పమేలా గుప్తా సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సుమారు 40 నిమిషాల ఆలస్యం తర్వాత సీబీఐ తరఫున న్యాయవాది కోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. నిందితుడు సంజయ్ రాయ్ బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించారు. సున్నితమైన ఈ కేసులో సీబీఐ చేసే దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తుందని కోర్టుకు తెలియజేశారు. వాదనలు విన్న కోర్టు సంజయ్ రాయ్ బెయిల్ పటిషన్ తిరస్కరించింది.ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు ఆగస్టు 10వ తేదీన అరెస్ట్ చేశారు. కోర్టు నిందితుడికి సెప్టెంబర్ 20 వరకు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సీబీఐ విచారణలో భాగంగా నిందితుడుకి గత నెలలో పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. -
బలవంతంగా దహనం చేశారు
కోల్‌కతా: కూతురు మృతదేహాన్ని భద్రపరచాలని భావించినప్పటికీ పోలీసుల బలవంతంకారణంగానే దహనం చేయాల్సి వచి్చందని కోల్‌కతాలో హత్యకు గురైన జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్జీ కర్ వైద్యకళాశాల బయట ఆందోళన చేస్తున్న వైద్యులకు బుధవారం బాధిత వైద్యురాలి తల్లిదండ్రులు, బంధువులు మద్దతు తెలిపారు. ‘న్యాయం జరిగేదాకా నిద్రించేది లేదు’’అని బాధితురాలి తల్లి అన్నారు. ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడారు. డబ్బులు ఇవ్వజూపారు కుమార్తె మృతదేహం తమ ముందు ఉండగానే నార్త్ డెప్యూటీ కమిషనర్ తమకు డబ్బు ఆఫర్ చేశారన్నారు. ‘‘మేము మృతదేహాన్ని భద్రపరచాలని అనుకున్నాం. కానీ ఇంటికి వెళ్లి చూడగా బయట 300 మంది పోలీసులు నిల్చుని ఉన్నారు. ఆమెను దహనం చేయాల్సిందేనని మమ్మల్ని తీవ్రంగా ఒత్తిడిచేశారు. దహన సంస్కారాలకు హడావుడి చేసి, దహనసంస్కారాల ఖర్చు కూడా మా వద్ద ఎవరూ వసూలుచేయలేదు. కనీసం దహనసంస్కారాలకు కూడా మా నాన్న దగ్గర డబ్బులు లేవని నా కూతురికికూడా తెలుసనుకుంటా. అందుకే ఇలా వెళ్లిపోయింది’’అని తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘కొందరు పోలీసు అధికారులు ఖాళీ కాగితంపై సంతకాన్ని పెట్టాలని నన్ను బలవంతపెట్టారు. కోపంతో నేను ఆ పేపర్‌ను చింపేసి విసిరేశా. అసలు మృతదేహాన్ని పరీక్షించకముందే నా కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆసుపత్రి అధికారులు ఎందుకు చెప్పారు?. మా అమ్మాయి ముఖం చూసేందుకు మూడున్నర గంటలు వేచి చూడాల్సి వచి్చంది. చూడనివ్వాలని తల్లి కాళ్ల మీద పడినా ఎవరూ పట్టించుకోలేదు. పోస్ట్‌మార్టమ్ ఎందుకంత ఆలస్యం చేశారు? పోలీసులు అసహజ మరణం కేసు ఎందుకు నమోదు చేశారు? తాలా పోలీస్ స్టేషన్లో రాత్రి 7 గంటలకే ఫిర్యాదుచేస్తే 11.45 గంటల దాకా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?’అని తండ్రి ప్రశ్నించారు. అన్నీ అనుమానాలే.. తల్లిదండ్రులు ఆస్పత్రి వచి్చన 10 నిమిషాలకే వారిని ఘటనాస్థలికి తీసుకెళ్లామని సుప్రీంకోర్టుకు సమరి్పంచిన అఫిడవిట్లో కోల్‌కతా పోలీసులు పేర్కొన్నారు. అయితే మూడు గంటలకుపైగా వేచి చూశామని, తమ కుమార్తెను కడసారి చూసేందుకు అనుమతించాలని పోలీసులను వేడుకున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. పోలీసులు అసహజ మరణం కేసు నమోదు చేశారని, అయినా ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని కలకత్తా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించడం తెల్సిందే.