Supreme Court of India: జనం ఏమైపోయినా పట్టించుకోరా? | Supreme Court of India: SC asks striking medics to resume work by Tuesday | Sakshi
Sakshi News home page

Supreme Court of India: జనం ఏమైపోయినా పట్టించుకోరా?

Published Tue, Sep 10 2024 5:06 AM | Last Updated on Tue, Sep 10 2024 5:46 AM

Supreme Court of India: SC asks striking medics to resume work by Tuesday

నేడు సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరండి  

పశ్చిమ బెంగాల్‌లో నిరసనలు కొనసాగిస్తున్న డాక్టర్లకు సుప్రీంకోర్టు ఆదేశం  

దర్యాప్తు పురోగతిపై 17లోగా నివేదిక ఇవ్వాలని సీబీఐకి గడువు

న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ఆసుపత్రిలో జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా ఆందోళన కొనసాగిస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని తేలి్చచెప్పింది. విధులను పక్కనపెట్టి నిరసనలు కొనసాగించడం సరైంది కాదని అభిప్రాయపడింది. సాధారణ ప్రజల అవసరాలను పట్టించుకోకుండా డాక్టర్లు ఇలా విధులకు గైర్హాజరు కావడం ఏమిటని ప్రశ్నించింది. 

జనం ఏమైపోయినా పట్టించుకోరా? అని నిలదీసింది. విధుల్లో చేరితే ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఉండబోవని వెల్లడించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మీ భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటారు, వెంటనే వెళ్లి డ్యూటీలో చేరండి అని డాక్టర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ విధులకు దూరంగా ఉంటూ నిరసనలు కొనసాగిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. 

బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినప్పుడు సంబంధిత డాక్టర్లకు ఇచ్చిన చలాన్‌ కనిపించకపోవడం పట్ల న్యాయస్థానం అనుమానం వ్యక్తంచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని సీబీఐని, పశి్చమ బెంగాల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చలాన్‌ మాయం కావడంపై దర్యాప్తు జరపాలని సీబీఐకి సూచించింది. జూనియర్‌ డాక్టర్‌పై అఘాయిత్యం కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. 

సీబీఐ తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. శవపరీక్ష కోసం ఉపయోగించిన చలాన్‌ తమ రికార్డుల్లో లేదని చెప్పారు. అయితే, అది ఎక్కడుందో తేల్చాలని ధర్మాసనం పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదులో 14 గంటలు ఆలస్యం కావడం పట్ల మరోసారి అసహనం వ్యక్తం చేసింది. బాధితురాలి ఫోటోలు, వీడియోలను అన్ని రకాల సోషల్‌ మీడియా వేదికల నుంచి తక్షణమే తొలగించాలని పేర్కొంది.

విరమించబోం: జూనియర్‌ డాక్టర్లు 
కోల్‌కతా: ఆర్‌.జి.కర్‌ మెడికల్‌ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ నెలరోజులుగా విధులను బహిష్కరిస్తున్న పశి్చమబెంగాల్‌ జూనియర్‌ డాక్టర్లు సమ్మె కొనసాగిస్తామని సోమవారం రాత్రి ప్రకటించారు. విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ తాము సమ్మె విరమించబోమని జూనియర్‌ డాక్టర్లు ప్రకటించారు.  

సీఐఎస్‌ఎఫ్‌కి వసతులు కలి్పంచండి  
సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సీల్డ్‌ కవర్‌లో సమరి్పంచిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై ఈ నెల 17వ తేదీలోగా తాజా నివేదిక సమరి్పంచాలని సీబీఐని ఆదేశించింది. ఈ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. ఆర్‌జీ కర్‌ ఆసుపత్రిలో భద్రతా విధుల్లో చేరిన మూడు కంపెనీల సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి తగిన వసతి సౌకర్యాలు కల్పించాలని పశి్చమ బెంగాల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారికి అవసరమైన పరికరాలు ఇవ్వాలని పేర్కొంది.

ఫోరెన్సిక్‌ నివేదికపై అనుమానాలు  
డాక్టర్‌ ఫోరెన్సిక్‌ నివేదికపై సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. తదుపరి పరీక్షల కోసం బాధితురాలి నమూనాలను ఢిల్లీ–ఎయిమ్స్‌కు పంపించాలని నిర్ణయించినట్లు సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలియజేశారు.  డాక్టర్‌ కేవలం హత్యకు గురైనట్లు నివేదిక తేలి్చందని చెప్పారు. కానీ, ఆమెను లైంగికంగా చిత్రహింసలకు గురిచేసి, అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని వివరించారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement