absence
-
Supreme Court of India: జనం ఏమైపోయినా పట్టించుకోరా?
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా ఆందోళన కొనసాగిస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని తేలి్చచెప్పింది. విధులను పక్కనపెట్టి నిరసనలు కొనసాగించడం సరైంది కాదని అభిప్రాయపడింది. సాధారణ ప్రజల అవసరాలను పట్టించుకోకుండా డాక్టర్లు ఇలా విధులకు గైర్హాజరు కావడం ఏమిటని ప్రశ్నించింది. జనం ఏమైపోయినా పట్టించుకోరా? అని నిలదీసింది. విధుల్లో చేరితే ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఉండబోవని వెల్లడించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మీ భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటారు, వెంటనే వెళ్లి డ్యూటీలో చేరండి అని డాక్టర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ విధులకు దూరంగా ఉంటూ నిరసనలు కొనసాగిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినప్పుడు సంబంధిత డాక్టర్లకు ఇచ్చిన చలాన్ కనిపించకపోవడం పట్ల న్యాయస్థానం అనుమానం వ్యక్తంచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని సీబీఐని, పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చలాన్ మాయం కావడంపై దర్యాప్తు జరపాలని సీబీఐకి సూచించింది. జూనియర్ డాక్టర్‌పై అఘాయిత్యం కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. శవపరీక్ష కోసం ఉపయోగించిన చలాన్ తమ రికార్డుల్లో లేదని చెప్పారు. అయితే, అది ఎక్కడుందో తేల్చాలని ధర్మాసనం పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదులో 14 గంటలు ఆలస్యం కావడం పట్ల మరోసారి అసహనం వ్యక్తం చేసింది. బాధితురాలి ఫోటోలు, వీడియోలను అన్ని రకాల సోషల్ మీడియా వేదికల నుంచి తక్షణమే తొలగించాలని పేర్కొంది.విరమించబోం: జూనియర్ డాక్టర్లు కోల్‌కతా: ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ నెలరోజులుగా విధులను బహిష్కరిస్తున్న పశి్చమబెంగాల్ జూనియర్ డాక్టర్లు సమ్మె కొనసాగిస్తామని సోమవారం రాత్రి ప్రకటించారు. విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ తాము సమ్మె విరమించబోమని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. సీఐఎస్ఎఫ్కి వసతులు కలి్పంచండి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీల్డ్ కవర్లో సమరి్పంచిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై ఈ నెల 17వ తేదీలోగా తాజా నివేదిక సమరి్పంచాలని సీబీఐని ఆదేశించింది. ఈ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. ఆర్జీ కర్ ఆసుపత్రిలో భద్రతా విధుల్లో చేరిన మూడు కంపెనీల సీఐఎస్ఎఫ్ సిబ్బందికి తగిన వసతి సౌకర్యాలు కల్పించాలని పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారికి అవసరమైన పరికరాలు ఇవ్వాలని పేర్కొంది.ఫోరెన్సిక్ నివేదికపై అనుమానాలు డాక్టర్ ఫోరెన్సిక్ నివేదికపై సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. తదుపరి పరీక్షల కోసం బాధితురాలి నమూనాలను ఢిల్లీ–ఎయిమ్స్‌కు పంపించాలని నిర్ణయించినట్లు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. డాక్టర్ కేవలం హత్యకు గురైనట్లు నివేదిక తేలి్చందని చెప్పారు. కానీ, ఆమెను లైంగికంగా చిత్రహింసలకు గురిచేసి, అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని వివరించారు. -
చిన్నారుల్లో వచ్చే ‘అబ్సెన్స్ సీజర్స్’ అంటే..?
చిన్నారుల్లో ఫిట్స్ (సీజర్స్) రావడం సాధారణంగా చూస్తుండేదే. ఇలా ఫిట్స్ రావడాన్ని వైద్యపరిభాషలో ‘ఎపిలెప్సీ’గా చెబుతారు. పెద్దవాళ్లతో పోల్చినప్పుడు పిల్లల్లో వచ్చే సీజర్స్‌కు కారణాలూ, చికిత్సకు వారు స్పందించే తీరుతెన్నులూ... ఇవన్నీ కాస్త వేరుగా ఉంటాయి. ఈ సీజర్స్లోనూ ‘ఆబ్సెన్స్ సీజర్స్’ అనేవి ఇంకాస్త వేరు. నాలుగేళ్ల నుంచి 14 ఏళ్ల వయసు పిల్లల్లో వచ్చే వీటి కారణంగా చిన్నారులు ఏ భంగిమలో ఉన్నా... ఉన్నఉన్నవారు ట్లుగానే వారు స్పృహ కోల్పోతారు. ఇవి పిల్లల్లో అకస్మాత్తుగా మొదలవుతాయి. హఠాత్తుగా వాళ్లను స్పృహలో లేకుండా చేస్తాయి. కనీసం 10 – 20 సెకండ్లు అలా ఉండిపోయి, మెల్లగా ఈలోకంలోకి వస్తారు. ఇలా హఠాత్తుగా కనిపించి, తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేసే ‘ఆబ్సెన్స్ సీజర్స్’పై అవగాహన కోసం ఈ కథనం. చిన్నారుల్లో వచ్చే ‘అబ్సెన్స్ సీజర్స్’ అంటే..?పిల్లల్లో వచ్చే ఫిట్స్‌లో... ఆబ్సెన్స్ సీజర్స్ అనేవి కనీసం 20 నుంచి 25% వరకు ఉంటాయి. సాధారణంగా ఇవి జన్యుపరమైన (జెనెటిక్), జీవక్రియ పరమైన (మెటబాలిక్) సమస్యల వల్ల వస్తుంటాయి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో ‘ఆబ్సెన్స్ సీజర్స్’ కేసులు ఎక్కువగా వస్తుంటాయి. అసాధారణంగా కొందరు చిన్నారుల్లో ఏడాదిలోపు వయసున్నప్పుడు కూడా ఇవి మొదలు కావచ్చు. చాలా మంది ఆరోగ్యకరమైన పిల్లల్లో హఠాత్తుగా మొదలైనప్పటికీ... కొందరు చిన్నారుల్లో మాత్రం... వారికి జ్వరం వచ్చినప్పుడు కనిపించే ఫిట్స్‌తో ఇవి మొదలవుతాయి. అలాగే ఎదుగుదలలో లోపాలు (డెవలప్మెంటల్ డిలే) వంటి నాడీ సంబంధమైన సమస్యలున్నవారిలోనూ కనిపిస్తుంటాయి. ఇంక కొందరిలోనైతే... వాస్తవంగా కనుగొన్న నాటికి చాలా పూర్వం నుంచే... అంటే నెలలూ, ఏళ్ల కిందటి నుంచే ఇవి వస్తుంటాయి. కానీ తల్లిదండ్రులు (లేదా టీచర్లు) చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. కానీ... వీటినంత తేలిగ్గా గుర్తించడం సాధ్యం కాకపోవడంతో పిల్లలేదో పగటి కలలు కంటున్నారనీ, ఏదో వాళ్ల లోకంలో వాళ్లు ఉన్నారంటూ తల్లిదండ్రులు, టీచర్లు, లేదా పిల్లల్ని చూసుకునే సంరక్షకులు పొరబడుతూ ఉండవచ్చు. సాధారణ సీజర్స్‌లో అవి వచ్చినట్లు తెలుస్తుంది. కానీ ఆబ్సెన్స్ సీజర్స్‌లో అవి వచ్చిన దాఖలా కూడా స్పష్టంగా తెలియదు. కొన్ని సందర్భాల్లో చాలాకాలం వరకూ తెలిసిరాదు. ప్రేరేపించే అంశాలు... ఈ ‘ఆబ్సెన్స్ సీజర్స్’ను కొన్ని అంశాలు ప్రేరేపిస్తూ ఉంటాయి. అవి... తీవ్రమైన అలసట వేగంగా శ్వాస తీసుకోవడం పిల్లలు టీవీ, మొబైల్ చూస్తున్నప్పుడు తరచూ హఠాత్తుగా మారిపోతూ ఉండే కాంతిపుంజాలూ, ఫ్లాష్లైట్ల కారణంగా... ఆబ్సెన్స్ సీజర్స్ రావచ్చు. ఆబ్సెన్స్ సీజర్స్ లక్షణాలు... ఈ సందర్భాల్లో పిల్లలు... అకస్మాత్తుగా చేష్టలుడిగి (బిహేవియర్ అరెస్ట్‌తో) నిశ్చేష్టులై ఉండిపోవడం ∙ముఖంలో ఎలాంటి కవళికలూ కనిపించకపోవడం ∙కళ్లు ఆర్పుతూ ఉండటం, ఒంటి మీద బట్టలను లేదా ముఖాన్ని తడబాటుగా చేతి వేళ్లతో నలపడం, నోరు చప్పరించడం, మాటల్ని తప్పుగా, ముద్దగా ఉచ్చరిస్తూ ఉండటం (ఫంబ్లింగ్), చేస్తున్నపనిని అకస్మాత్తుగా నిలిపివేయడం / ఆపివేయడం ∙బయటివారు పిలుస్తున్నా జవాబివ్వకపోవడం / ఎలాంటి స్పందనలూ లేకపోవడం పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వాళ్లు బయటకు పూర్తిగా నార్మల్‌గానూ కనిపించవచ్చు. మాట్లాడటం మాత్రం చాలావరకు నార్మల్‌గా ఉండిపోవచ్చు. కొందరిలో మాత్రం కొంచెం అస్పష్టత కనిపించవచ్చు. ఈ లక్షణాలన్నీ వారు ఆటలాడుకుంటున్నప్పుడూ, టీవీ చూస్తున్నప్పుడూ లేదా కొన్నిసార్లు నిద్రలో కూడా కొనసాగుతుంటాయి. చిన్నారులు అన్యమనస్కంగా ఉండటమో లేదా ఏదో లోకంలో ఉన్నట్టు కనిపించడాన్ని తల్లిదండ్రులు గమనిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. నిర్ధారణ ఇలా... ఆబ్సెన్స్ సీజర్స్‌లో ఎన్నో రకాలున్నప్పటికీ... సాధారణంగా టిపికల్ (అంతగా సంక్లిష్టం కానివి), అటిపికల్ (సంక్లిష్టమైనవి) అనే రకాలు ఉంటాయి. ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) ఎమ్మారై (బ్రెయిన్) వంటి మరికొన్ని పరీక్షలతో వీటిని నిర్ధారణ చేయవచ్చు. ఇక అటిపికల్ రకాల విషయంలో ఇతర నాడీ సంబంధమైన సమస్యలనూ, జీవక్రియలకు(మెటబాలిక్) సంబంధించిన, జన్యుసంబంధమైన మరికొన్ని పరీక్షలతో పాటు మెదడు / వెన్నుపూస చుట్టూ ఉండే ద్రవం (సెరిబ్రో స్పైనల్ ఫ్లుయిడ్ – సీఎస్ఎఫ్)ను పరీక్షించడం ద్వారా ఈ (అటిపికల్) రకాన్ని తెలుసుకుంటారు. చికిత్స సమస్య నిర్దారణ అయిన వెంటనే చికిత్స మొదలుపెట్టాలి. ఇందుకోసం ఫిట్స్ మందులు (యాంటీ సీజర్ మెడిసిన్స్) వాడాలి. వీటిని కనీసం రెండేళ్ల పాటు వాడాల్సి ఉంటుంది. అలా వాడుతూ, బాధితుల మెరుగుదలను గమనిస్తూ, దాని ప్రకారం మోతాదును క్రమంగా తగ్గిస్తూ పోవాలి. ఈ మందులు చిన్నారుల్లో... కేవలం ఫిట్స్ తగ్గించడం మాత్రమే కాదు, వాళ్ల జీవన నాణ్యతనూ మెరుగుపరుస్తాయి. స్కూల్లో వాళ్ల సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. సామాజికంగా ఒంటరి కాకుండా... నలుగురితో కలిసిపోయేలా చేస్తాయి. మందుల గుణం కనిపిస్తోందా లేదా అన్న విషయాన్ని నిర్ణీత వ్యవధుల్లో ఈఈజీ తీయడం ద్వారా పరిశీలిస్తూ ఉండాలి. ఇక సహాయ చికిత్సలు (సెకండ్ లైన్ ట్రీట్మెంట్)గా వాళ్లకు కీటోజెనిక్ డైట్ (కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం) ఇవ్వడం, వేగస్ నర్వ్ అనే నరాన్ని ప్రేరేపించడం (వేగస్ స్టిమ్యులేషన్) జరుగుతుంది. దాదాపు 70 శాతం కేసుల్లో చిన్నారులు యుక్తవయసునకు వచ్చేనాటికి మంచి స్పందన కనిపిస్తుంది. (చదవండి: నివారించలేని వింత వ్యాధి! తనను తాను గాయపరుచుకునేలా ప్రేరేపించే వ్యాధి!) -
22 ఏళ్లుగా ఖైదీ.. విడుదల రోజే పరారీ!
ఒక నేరస్తుడు విడుదలకు కొద్దిసేపటి ముందు పరారైన ఉదంతం ఆసక్తికరంగా మారింది. నేరం, అరెస్టు, జైలు.. ఇదే దశాబ్దాలుగా నేరస్తులకు ఎదురవుతున్న క్రమం. అయితే కాలం గడిచేకొద్దీ దీనిలో మార్పులు చోటుచేసుకున్నాయి. పలు కోర్టులు నేరస్తులను నిర్ణీత కాలం తర్వాత విడుదల చేస్తున్నాయి. తద్వారా వారు వారికి నచ్చినట్టు మిగిలిన జీవితాన్ని గడిపే అవకాశం కలుగుతుంది. అయితే ఒక నేరస్తుడు విడుదల కావడానికి కొన్ని గంటల ముందు పరారీ అయితే.. ఏం జరుగుతున్నదనేది ఊహించడం కష్టం. రష్యాలోని ఇర్కుట్స్క్ సమీపంలో ఉన్న మార్కోవా జైలులో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. కమోల్జోన్ కలోనోవ్ అనే ఖైదీ విడుదల కావాల్సిన రోజే జైలు నుండి తప్పించుకున్నాడు. కమోల్జోన్ కలోనోవ్ డబుల్ మర్డర్, దొంగతనం, అక్రమ ఆయుధాల సరఫరా, మందుగుండు సామగ్రిని కలిగి ఉండటం లాంటి క్రిమినల్ కేసులలో గత 22 సంవత్సరాలుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఆయన విడుదల కావాల్సిన రోజు రానే వచ్చింది. అయితే ఆ ఖైదీ అదే రోజున తెల్లవారుజామున 4 గంటలకు జైలు నుండి అదృశ్యమయ్యాడు. దీంతో జైలు అధికారులు సదరు ఖైదీ పరారైనట్లు ప్రకటించడంతో పాటుఅతనిపై మరొక కేసు నమోదు చేశారు. రష్యాలోని ఫెడరల్ పెనిటెన్షియరీ సర్వీస్ ప్రాంతీయ విభాగం అధికారులు ఈ ఉదంతం గురించి తెలియజేస్తూ ఖైదీ కమోల్జోన్ కలోనోవ్.. ఇర్కుట్స్క్ ప్రాంతంలోని జిమా నగరవాసి అని, పలు నేరాలలో ప్రమేయం ఉండటంతో జైలుకు తరలించారని తెలిపారు. 1997లో జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే 2001లో అతను డబుల్ మర్డర్‌లో దోషిగా తేలడంతో అతనికి 22 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. తాజాగా అతను విడుదల కావాల్సిన రోజు రాగానే జైలు నుండి పరారయ్యాడు. ఫెడరల్ పెనిటెన్షియరీ సర్వీస్ ఆఫ్ రష్యా ప్రకారం కమోల్జోన్ కలోనోవ్ కఠినమైన శిక్షను అనుభవిస్తున్నాడు. విడుదలైన అనంతరం కమోల్జోన్ కలోనోవ్ను కూలీ పనులకు పంపనున్నారు. బహుశా ఈ పనులు చేయడం ఇష్టంలేకనే కమోల్జోన్ కలోనోవ్ పరారయ్యాడని జైలు అధికారులు భావిస్తున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఇలా దాటేస్తున్నారు.. అందుకే మస్క్ బాధ పడుతున్నాడు! -
భారీ జరిమానాలు విధించిన ‘రెరా’
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ఉల్లంఘన..షోకాజ్ నోటీసులకు స్పందించకపోవడం.. హియరింగ్‌కు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ‘రియల్’ సంస్థలపై ‘రెరా’ చర్యలు చేపట్టింది. సాహితీ గ్రూప్‌నకు చెందిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ‘రెరా’ రిజిస్ట్రేషన్ లేకుండా ‘సాహితీ సితార్ కమర్షియల్’ పేరుతో రంగారెడ్డిజిల్లా గచ్చిబౌలిలో కమర్షియల్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కోసం కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రకటనలు ఇచ్చి విక్రయాలు చేపట్టగా, సాహితీతో పాటు కేశినేని డెవలపర్స్‌కు అపరాధ రుసుం విధించింది. ఇదే సంస్థ ‘సిసా ఆబోడ్‘ పేరుతో మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలో సరైన డాక్యుమెంట్లు సమర్పించకుండా రెరా’ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసింది. డాక్యుమెంట్లు సమర్పించాలని పలుసార్లు మెయిల్స్ పంపినా స్పందించలేదు. ప్రకటనల ద్వారా మార్కెటింగ్ చేస్తున్న కారణంగా ’రెరా’ నోటీసులు జారీ చేసింది. ఇదే సంస్థ సాహితీ సార్వానీ ఎలైట్ పేరుతో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అపార్ట్మెంట్స్ నిర్మాణం చేపట్టి సరైన డాక్యుమెంట్లు లేకుండా రెరా రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసింది. పైగా మార్కెటింగ్ కార్యకలాపాల ద్వారా ప్లాట్స్ విక్రయించింది.ఈ ప్రాజెక్టులన్నింటికి కలిపి రూ.10.74 కోట్లు 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. మంత్రి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో షేక్‌పేటలో ప్రాజెక్ట్ చేపట్టి ఫారం– ’బి’లో తప్పుడు సమాచారం పొందుపరిచి, వార్షిక, త్రైమాసిక నివేదిక సమర్పించలేదు. దీంతో ఈ సంస్థకు రూ.6.50 కోట్ల అపరాధ రుసుము విధించింది. సాయిసూర్య డెవలపర్స్ సంస్థ నేచర్‌కౌంటీ పేరుతో శేరిలింగంపల్లి మండల మనసానపల్లి గ్రామంలో రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాట్ల అభివృద్ధి పేరుతో ప్రాజెక్టు చేపట్టింది. దీనిపై ఫిర్యాదు రాగా, షోకాజ్ నోటీసు జారీ చేసి రూ.25లక్షలు అపరాధ రుసుం విధించింది. -
కోహ్లి లేకపోతే టీమిండియాకు కష్టమే
మెల్బోర్న్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీ ఆ జట్టుపై పెను ప్రభావం చూపిస్తుందని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. అయితే తండ్రి కాబోతున్న సమయంలో సెలవు తీసుకోవాలనే అతని నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని చెప్పాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో వచ్చే నెలలో ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ టెస్టు సిరీస్ మొదలవుతుంది. నాలుగు టెస్టుల పూర్తి స్థాయి సిరీస్‌లో కోహ్లి కేవలం తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ డెలివరీ కోసం అతను స్వదేశానికి పయనమవుతాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ హెడ్‌కోచ్ లాంగర్ మాట్లాడుతూ ‘నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ఆటగాడు కోహ్లి. ఒక్క బ్యాటింగ్‌లోనే కాదు... శక్తిసామర్థ్యాలు, క్రికెట్ కోసం కష్టపడే తత్వం, ఫిట్నెస్ స్థాయి ఇవన్నీ చూసి చెబుతున్నా. మ్యాచ్‌లో రాణించేందుకు అతను కనబరిచే పట్టుదల అద్భుతం. ప్రతీసారి అతనికి ఇదెలా సాధ్యమవుతుందో నాకు అంతుబట్టడం లేదు. అందుకే కోహ్లి అంటే నాకెంతో గౌరవం. అలాగే ఇప్పుడు కుటుంబం కోసం తను తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను గౌరవిస్తాను’ అని అన్నారు. ఆటగాళ్లు కెరీర్‌తో పాటు కుటుంబానికి సమయమివ్వాలని చెప్పారు. అతను లేకపోవడం భారత జట్టుకు పూడ్చలేని లోటేనని, ఇది జట్టుపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందని లాంగర్ వివరించారు. అయితే గత పర్యటన (2018–19)లో ఆసీస్‌ను ఓడించిన భారత్‌ను విరాట్ ఉన్నా లేకపోయినా తక్కువ అంచనా వేయబోమని, టీమిండియా పటిష్టమైన జట్టని విశ్లేషించారు. సుదీర్ఘ పర్యటన కోసం ఇప్పటికే టీమిండియా ఆసీస్‌కు చేరింది. ప్రస్తుతం కరోనా ప్రొటోకాల్ పాటిస్తున్న భారత జట్టు, క్వారంటైన్ పూర్తవగానే నవంబర్ 27న తొలి వన్డే ఆడుతుంది. -
తొలి టెస్టుకు రోచ్ దూరం
రాజ్‌కోట్: ప్రధాన పేసర్ కీమర్ రోచ్ లేకుండానే వెస్టిండీస్ తొలి టెస్టు బరిలో దిగనుంది. అమ్మమ్మ మృతితో స్వదేశానికి వెళ్లిన అతడు ఇంకా తిరిగి రాలేదు. ఈ కారణంగానే రోచ్ బోర్డు ఎలెవెన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ ఆడలేదు. అతడు తొలి టెస్టు మధ్యలో జట్టుతో చేరే అవకాశం ఉందని కోచ్ స్టువర్ట్ లా తెలిపారు. మరో పేసర్ జోసెఫ్ గాయంతో ఇబ్బంది పడుతుండటంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే మొదటి టెస్టులో గాబ్రియెల్ జతగా కీమో పాల్ విండీస్ పేస్ భారాన్ని పంచుకునే అవకాశం ఉంది. -
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు భారీగా గైర్హాజరు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫిజిక్స్ పేపరు–1, ఎకనామిక్స్ పేపరు–1 పరీక్షలకు విద్యార్థులు భారీ సంఖ్యలో గైర్హాజరయ్యారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో అత్యధికంగా 28 వేల మంది గైర్హాజరు కాగా, శుక్రవారం జరిగిన పరీక్షల్లో 38,083 మంది గైర్హాజరు కావడం గమనార్హం. ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు హాజరయ్యేందుకు 5,50,395 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 5,12,312 మంది విద్యార్థులు హాజరయ్యారు. అంటే 6.91 శాతం మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే, ఇప్పటివరకు కొన్ని పరీక్షల్లో అత్యధికంగా 21 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాగా, శుక్రవారం జరిగిన పరీక్షల్లో 45 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులను బుక్ చేశారు. ఇందులో అత్యధికంగా నిజమాబాద్ జిల్లాలో 10 మంది, మంచి ర్యాలలో నలుగురు, పెద్దపల్లిలో ఇద్దరు, జగిత్యాలలో ఒక్కరు, ఖమ్మంలో ముగ్గురు, సిద్దిపేట్లో ఇద్దరు, మెదక్‌లో ఇద్దరు, యాదాద్రిలో ఐదుగురు, జోగులాంబలో ఇద్దరు, మహబూబ్‌నగర్‌లో నలుగురు, నాగర్‌కర్నూలులో నలుగురు, సంగారెడ్డిలో నలుగురు, హైదరాబాద్‌లో ఇద్దరిపై మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ అయ్యాయి. -
సుదీర్ఘ నేస్తంలేక లోన్లీగా ఫీల్ అవుతున్నా..
-
సుదీర్ఘ నేస్తంలేక లోన్లీగా ఫీల్ అవుతున్నా..
చెన్నై: అక్రమ ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఎఐఎడిఎంకె చీఫ్ వికె శశికళ "ఒంటరితనం" ఫీల్ అవుతున్నారట. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత 69వ పుట్టినరోజు సందర్భంగా ఆమె అమ్మను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కార్యర్తలకు తన సందేశాన్ని పంపారు. అమ్మ ఆశయాలను, ఆకాంక్షలను ముందుకు తీసుకు పోవాలని కోరారు. ఈ నెల 24వ తేదీన (శుక్రవారం) అమ్మ జయలలిత జయంతిని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆమె సూచించారు. జయలలిత తొలి జయంతి కావడంతో.. ఈ మేరకు శశికళ పార్టీ కేడర్‌కు లేఖ రాశారు. అమ్మ 69వ పుట్టినరోజు( ఫిబ్రవరి 24) సందర్భంగా కార్యకర్తలకు ఇచ్చిన సందేశంలో..అమ్మ ప్రభుత్వం పేదలకు మరిన్ని ప్రోత్సాహకాలు, పథకాలు అందించాలని కోరారు. అవిరామంగా ప్రజలకు సేవ చేయాలన్న జయలిలత కోరికను నెరవేర్చాలని ఆమె కోరారు. తమ ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు ప్రతిజ్ఞ బూనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తన సుదీర్ఘ నేస్తం లేకపోవడం లోన్లీగా ఉందన్నారు. దాదాపు 33సం.రాలు కలిసిఉన్నామనీ, అమ్మ పుట్టినరోజును ప్రతీ ఏడాది జరుపుకునే వారమనీ.. ఈ సంవత్సరం లేకపోవడం చాలా విచారంగా ఉందని శశికళ చెప్పారు. గత ఏడాది ఆమె ఉన్నారు. కానీ ఈ సం.రం ఆమె జ్ఞాపకాలు మిగిలాయన్నారు. అమ్మ చాలా ఉత్సాహం పుట్టిన రోజు వేడుకులు జరుపుకునేవారని చెప్పారు. కానీ ఈ సంవత్సరం ఇలా ఉంటుందని తానెపుడూ ఊహించలేదని ఆమె వ్యాఖ్యానించారు. తన ఆలోచనలు అమ్మ చుట్టూనే తిరుగుతున్నాయన్నారు. అమ్మ పుట్టినరోజు సందర్భంగా సామూహిక అన్నదానాలు చేయాలని, మాజీ ముఖ్యమంత్రి ఫోటోలను ప్రజల దర్శనార్థం ఉంచి.. అమ్మకు ఘననివాళులర్పించాలని కార్యకర్తలను కోరారు.అమ్మ ఎపుడూ సవాళ్లకు తలొగ్గలేదనీ, చాలా ధైర్యంతోవాటిని ఎదుర్కొని సమస్యలన్ని ఎదుర్కొననే ధైర్యాన్ని, స్ఫూర్తిని అందించారని ఆమె పేర్కొన్నారు. జయలలిత ప్రముఖ నేత అని, ఆమెను ఎవరైనా జీవితంలో ఒకసారి కలిస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారన్నారు. 1987లో పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ చనిపోయినపుడు అనేక సవాళ్లమధ్య పార్టీ పగ్గాలు చేట్టి, సమయ స్ఫూర్తితో పార్టీని ఏకంచేసిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. "ప్రేమ, దయ, కష్టించే తత్వం’’ తో కీర్తి గడించారని తెలిపారు. అమ్మ బర్తడే సందర్భంగా పేదల సంక్షేమం కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమ్మ ఎపుడూ సవాళ్లకు తలొగ్గలేదనీ, చాలా ధైర్యంతో వాటిని ఎదుర్కొని సమస్యల్నిఎదుర్కొనే ధైర్యాన్ని,స్ఫూర్తిని అందించారంటూ అమ్మతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. -
ఐటీఐ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు
నిజామాబాద్‌స్పోర్ట్స్: ఐటీఐ ట్రేడ్ డీజిల్ మెకానిక్ కోర్సు పూర్తి చేసి ఆర్టీసీలో అప్రెంటీస్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఇంటర్వ్యూలు పూర్తి చేసినట్లు డిప్యూటీ సీమ్ దేవాదానం తెలిపారు. మొత్తం 64మంది హాజరయ్యారని, అభ్యర్థులకు త్వరలో డిపోలు కేటాయిస్తామన్నారు. గైర్హాజరైన 16మంది అభ్యర్థులు సోమవారం హాజరైతే ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. త్వరలో ఎలక్ట్రిషియన్, వెల్డర్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. -
లోక్ సభకు మంత్రుల గైర్హాజరుపై క్షమాపణలు
న్యూఢిల్లీః ప్రశ్నోత్తరాల సమయంలో సంబంధిత మంత్రులు లేకపోవడం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద చిక్కే వచ్చి పడింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు సహా ఆయన జూనియర్ మనోజ్ సిన్హా కూడ సమయానికి సభలో లేకపోవడం తీవ్ర వివాదం చెలరేగింది. దిగువ సభలో క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితికి దారితీసింది. ఇటువంటి సందర్భాలు పునరావృతం కాకూడదంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడ హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి నెలకొంది. మంగళవారం లోక సభ సమావేశంలో మంత్రుల గైర్హాజరుపై తీవ్ర గందరగోళం నెలకొంది. రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించిన 147 వ... 'గో ఇండియా స్మార్ట్ కార్డ్' ప్రశ్న వచ్చే సమయానికి మంత్రి సురేష్ ప్రభుగాని, సిన్హాగాని సభలో లేకపోవడం ఆందోళనకు దారి తీసింది. ఈ సందర్భం కాంగ్రెస్ కు కలసి వచ్చింది. సమయం చూసుకొని సభలో మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాల లిస్టులో రైల్వేకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నపుడు ఆ శాఖ మంత్రి సభలో లేకపోవడంపై ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ పరిస్థితికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సంబంధిత ప్రశ్నల సమయంలో ఆయా శాఖల మంత్రులు లేకపోవడం ఇది మొదటిసారి కాదని, తప్పనిసరిగా మంత్రులు హాజరు కావాలని సూచించారు. సభా మర్యాదలను పాటించకుండా, మంత్రులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం మంత్రుల గైర్హాజరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒకవేళ కేబినెట్ మినిస్టర్ బిజీగా ఉంటే ఆ శాఖకు సంబంధించిన స్టేట్ మినిస్టర్లైనా తప్పనిసరిగా సభకు హాజరు కావాలని, సమయానికి ఆయనకూడ సభలో లేకుండా పోయారని, ఇటువంటి పరిస్థితి మరోసారి తలెత్తకూడదని ఆమె హెచ్చరించారు. అయితే ఈ విషయంపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు.. ఇటువంటి పరిస్థితి మరోసారి తలెత్తదని చెప్తూ... మంత్రి లేకపోవడంపై క్షమాపణలు తెలియజేశారు. సదరు రైల్వే మంత్రికి చెందిన ప్రశ్నను మరో రోజుకు వాయిదా వేయాల్సిందిగా కోరారు. దీంతో రైల్వే శాఖకు చెందిన ఆ ప్రశ్న తిరిగి బుధవారం ప్రశ్నోత్తరాల జాబితాలో ముందుగా పెట్టడంతో మనోజ్ సిన్హా జవాబు ఇచ్చారు. ఈ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడ సభలో ఉన్నారు. అనంతరం మంత్రి సురేష్ ప్రభు కూడ జరిగిన తప్పుకు క్షమాపణ తెలియజేశారు. -
టెండూల్కర్ గైర్హాజరీపైసభలో మళ్లీ దుమారం
పార్టీలకు అతీతంగా అభ్యంతరం న్యూఢిల్లీ: క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ గైర్హాజరీపై రాజ్యసభలో సోమవారం కూడా విమర్శలు వెల్లువెత్తాయి. సభకు మూడురోజులు మినహా సుదీర్ఘకాలంగా గైర్హాజరు కావడాన్ని పార్టీలకు అతీతంగా పలువురు సభ్యులు ఆక్షేపించారు. ఇది సభను, జాతిని అగౌరవపరచడమేనని వ్యాఖ్యానించారు. గత వారం పార్లమెంటు సమీపంలోనే జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న టెండూల్కర్ సభకు మాత్రం రాకపోవడంపై ఆయన్ను వివరణ కోరాలన్నారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో సభకు హాజరుకాలేని స్థితిలో ఉన్నానని, అందుకు అనుమతించాలని తెండూల్కర్ పెట్టుకున్న దరఖాస్తుపై రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సెలవు మంజూరు చేయడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. అంతకు ముందు టెండూల్కర్‌కు సెలవు మంజూరీకి సభ అనుమతించాలని డిప్యూటీ చైర్మన్ కురియన్ కోరడంతో జీరో అవర్‌లో ఈ అంశం ప్రస్తావన కు వచ్చింది. సోదరుడికి గుండె ఆపరేషన్ జరగటంతో పాటు వృత్తిపరమైన పరిమితులవల్ల ప్రస్తుత సమావేశాలకు రాలేనని, ఇందుకు తనను అనుమతించాలని సచిన్ సెలవు దరఖాస్తు పంపినట్టు కురియన్ ప్రకటించారు. ఈ కారణాలను పరిగణనలోకి తీసుకుని ఆయనకు సెలవు మంజూరు చేశారు. టెండూల్కర్‌పైనే రచ్చ ఎందుకు?: కాంగ్రెస్ ఇదిలా ఉండగా, గైర్హాజరీపై సచిన్ టెండూల్కర్‌కు సెలవు మంజూరు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. పలువురు రాజ్యసభ సభ్యులు సెలవులో ఉన్నారని, వారు సెలబ్రిటీలు కాదు కాబట్టి వారిని ఎవరూ ఎత్తిచూపడంలేదని కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా అన్నారు. -
పీహెచ్‌సీల్లో సిబ్బంది ఇష్టారాజ్యం