
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆకస్మికంగా పర్యటించారు. నేరుగా ఔట్ పేషెంట్ వార్డుకు వెళ్లి, ఓపీలో ఉన్న పేషెంట్లతో మంత్రి మాట్లాడారు. డాక్టర్ల హాజరుపై షీట్ తెప్పించుకుని పరిశీలించిన మంత్రి.. ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి.. షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్, డీఎంఈని ఆదేశించారు. ఓపీ, ఐపీ, ఎంసీహెచ్, ఐవీఎఫ్, ఓపీ డయాగ్నస్టిక్ సర్వీసెస్, స్కానింగ్ వార్డులను మంత్రి పరిశీలించారు. ఐవీఎఫ్ సేవల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. సంబంధిత డాక్టర్లకు షోకాజ్ ఇవ్వాలని డీఎంఈని మంత్రి ఆదేశించారు.
గైర్హాజరైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని.. మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. డ్యూటీ సమయంలో డుమ్మా కొడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పేదలకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment