Gandhi hospital
-
‘గాంధీ’లో డ్యూటీకి డాక్టర్ల డుమ్మా.. మంత్రి రాజనర్సింహ సీరియస్
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆకస్మికంగా పర్యటించారు. నేరుగా ఔట్ పేషెంట్ వార్డుకు వెళ్లి, ఓపీలో ఉన్న పేషెంట్లతో మంత్రి మాట్లాడారు. డాక్టర్ల హాజరుపై షీట్ తెప్పించుకుని పరిశీలించిన మంత్రి.. ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి.. షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్, డీఎంఈని ఆదేశించారు. ఓపీ, ఐపీ, ఎంసీహెచ్, ఐవీఎఫ్, ఓపీ డయాగ్నస్టిక్ సర్వీసెస్, స్కానింగ్ వార్డులను మంత్రి పరిశీలించారు. ఐవీఎఫ్ సేవల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. సంబంధిత డాక్టర్లకు షోకాజ్ ఇవ్వాలని డీఎంఈని మంత్రి ఆదేశించారు.గైర్హాజరైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని.. మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. డ్యూటీ సమయంలో డుమ్మా కొడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పేదలకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
మూసాపేట: చిన్ననాటి స్నేహితునితో కలిసి స్కూటీపై వెళ్తున్న యువతిని రెడీమిక్స్ లారీ ఢీకొనడంతో దుర్మరణం పాలైంది. కూకట్పల్లి పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం గ్రామానికి చెందిన కుమారి తన కుమార్తె మమత, కుమారుడితో కలిసి మూసాపేటలోని ముష్కిపేటలో ఉంటోంది. కుమారి కూతురు మమత(17) మంగళవారం రాత్రి తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. రాత్రి 11 గంటల సమయంలో మమత తన చిన్ననాటి స్నేహితుడైన నరేశ్‌తో కలిసి మూసాపేట నుంచి కూకట్పల్లి వైపు స్కూటీపై వెళ్తుండగా మూసాపేట మెట్రో స్టేషన్ పిల్లర్ 878 వద్ద గుర్తు తెలియని రెడీమిక్స్ లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ కింద పడిపోగా రెడీమిక్స్ వాహనం మమత నడుం మీదనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఇద్దర్నీ స్థానిక ఆస్పత్రికి తరలించగా మమత మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. తల్లి ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి..మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఢీకొట్టిన రెడీమిక్స్ లారీ వివరాలు తెలియవని, సీసీ ఫుటేజీలు పరిశీలించాక వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా..మమత మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
గాంధీ హాస్పిటల్ కు అల్లు అర్జున్..
-
గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం బన్నీని నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. అల్లు అర్జున్‌తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ అక్కడికి చేరుకున్నారు.క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా..కాగా.. అల్లు అర్జున్ ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ ఆయన తరఫున న్యాయవాదులు పిటిషన్ వేశారు. అంతేకాకుండా సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణను సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి -
గాంధీ ఆస్పత్రిలో ‘ఐవీఎఫ్’ సేవలు
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సేవలు ఉచితంగా పొందొచ్చని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ తెలిపారు. నిరుపేదలకు మాతృత్వపు మమకారాన్ని అందిస్తామని చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వైద్యవిద్యార్థుల వసతిగృహ భవన సముదాయానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి దామోదర రాజనర్సింహ మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం ఎంసీహెచ్ భవనంలోని ఐవీఎఫ్ సెంటర్‌ను వైద్య ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఏడాది క్రితం అప్పటి ప్రభుత్వం గాం«దీఆస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి వసతులు కల్పించకపోవడంతో నిరుపయోగంగా మారిందని, తనకు తెలిసిన వెంటనే డైరెక్టర్, గైనకాలజిస్ట్, ఎంబ్రయాలజిస్ట్లను నియమించి, రీఏజెంట్స్ కోసం నిధులు కేటాయించి, సంబంధిత శాఖ నుంచి అనుమతులు పొంది, గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.సంతానలేమితో బాధపడుతున్న వారిక్కడ వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌లలో ప్రభుత్వ సెక్టార్లో ఐవీఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. 15 రోజుల్లో పేట్లబురుజు ఆస్పత్రిలో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి లో ఐవీఎఫ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్య,ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశించారు. గాందీలో అదనపు విభాగాల ఏర్పాటు గాం«దీలో ప్రస్తుతం ఉన్న 34 విభాగాలతోపాటు అదనంగా మరో నాలుగు విభాగాలు, యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6 కేన్సర్ కేర్, 74 ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఐవీఎఫ్ సేవలను ఉచితంగా అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు పేదలకే అనే అభిప్రాయం పోగొట్టాలని, ఐఏఎస్, ఐపీఎస్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వ వైద్యరంగాన్ని తీర్చిదిద్దేందుకు వైద్యులంతా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ, కమిషనర్ కర్ణన్, డీఎంఈ వాణి, గాంధీ ప్రిన్సిపాల్ ఇందిర, సూపరింటెండెంట్ రాజకుమారి, రాజ్యసభ సభ్యు డు అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ రియా జ్, టీజీఎంఎస్ఐడీసీ చైర్మన్ హేమంత్‌కుమార్, వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రొఫెసర్ సాయిబాబాకు కన్నీటి వీడ్కోలు
మల్కాజిగిరి/ నాంపల్లి/ గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): పౌర హక్కుల నేత, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా(56)కు కుటుంబ సభ్యులు, అభిమానులు, పౌర హక్కుల నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని మౌలాలి జవహర్‌నగర్‌లో ఉన్న నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు చేరుకుని సాయిబాబాకు నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ మెడికల్ కాలేజీ వరకు ఆయన అంతిమయాత్ర నిర్వహించారు. అంతిమ యాత్రలో భాగంగా ప్రొఫెసర్ సాయిబాబా (56) భౌతికకాయాన్ని అసెంబ్లీ ఎదుట గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు తీసుకువచ్చారు. అంబులెన్స్ నుంచి బాడీ ఫ్రీజర్‌ను కిందికి దింపి, స్తూపం వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. స్తూపం వద్ద ఐదు నిమిషాల పాటు ఉంచి సంతాపం తెలియజేస్తామని పౌర హక్కుల నేతలు కోరినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. అభిమానులు, పౌర హక్కుల నేతలు ‘కామ్రేడ్ సాయిబాబా అమర్‌రహే.. లాల్ సలాం.. ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.బాడీ ఫ్రీజర్ మూతను తెరిచి స్తూపానికి చూపించారు. అనంతరం తిరిగి ర్యాలీగా గాంధీ మెడికల్ కాలేజీకి భౌతికకాయాన్ని తరలించారు. సాయిబాబా చివరికోరిక మేరకు ఆయన కుటుంబ సభ్యులు భౌతికకాయాన్ని సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. కాగా, మౌలాలిలోని నివాసంలో సాయిబాబా భౌతికకాయం వద్ద పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. సాయిబాబా మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని పౌర హక్కుల నేతలు ఆరోపించారు. -
రాష్ట్రంలో ప్రజారోగ్యం అస్తవ్యస్తం
సాక్షి, హైదరాబాద్/ గాంధీ ఆస్పత్రి: రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని.. మాతాశిశు మరణాలు, విషజ్వరాలు పెరిగిపోతు న్నాయని బీఆర్ఎస్ ‘ప్రజారోగ్య కమిటీ’ మండిప డింది. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని, ఎమర్జెన్సీ పాలన అని ఆరోపించింది. గాంధీ ఆస్ప త్రిలో పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్తే పోలీ సులు అడ్డుకోవడం దారుణమని మండిపడింది.గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. నేతల అరెస్టులు..ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితుల అధ్యయనం కోసం బీఆర్ఎస్ పార్టీ డాక్టర్ టి.రాజయ్య నేతృత్వంలో.. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌లతో కమిటీని వేసింది. సోమవారం ఉదయం తెలంగాణ భవన్ నుంచి గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని.. మాతాశిశు మరణాలపై నిజనిర్ధారణ చేయాలని ఈ కమిటీ నిర్ణయించింది. అయితే కమి టీకి నేతృత్వం వహిస్తున్న టి.రాజయ్యను పోలీ సులు ఉదయమే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గృహ నిర్బంధం చేశారు. మిగతా ఇద్దరు సభ్యులు డాక్టర్ సంజయ్, డాక్టర్ మెతుకు ఆనంద్ పోలీసుల కళ్లు గప్పి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.అక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మరికొందరు పార్టీ నేతలతో కలసి గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. పోలీసులు వారిని ఆస్పత్రి ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత లు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరగ డంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు మాగంటి గోపీనాథ్, సంజయ్, మెతుకు ఆనంద్ లను అరెస్టు చేసి నారాయణగూడ ఠాణాకు.. ఇతర నేతలు, కార్యకర్తలను ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించి బొల్లారం ఠాణాకు తరలించారు. మధ్యాహ్నం తర్వాత నేతలు, కార్యకర్తలను వదిలేశారు.రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలిగాంధీ ఆస్పత్రి ఘటన తర్వాత తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రజారోగ్య కమిటీ సభ్యులు రాజయ్య, సంజయ్, మెతుకు ఆనంద్ మీడియాతో మాట్లా డారు. సీఎం, మంత్రుల సమీక్ష లేకపోవడంతో.. రాష్ట్రంలో ప్రజారోగ్యం కుంటుపడిందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు తగ్గిపోయాయని రాజయ్య ఆరోపించారు. నిజనిర్ధారణ కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లిన కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు.రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వం నిద్రపోతోందని డాక్టర్ సంజ య్ విమర్శించారు. ఆస్పత్రుల్లో డొల్లతనం బయట పడుతుందనే తమకు అడ్డుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. నిపుణులైన వైద్యులు లేకే, ఆస్పత్రుల్లో మరణాలు సంభవి స్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.మాతాశిశు మరణాలపై దాపరికం ఎందుకు?ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న మాతాశిశు మరణాలపై సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాపరికంగా వ్యవహరి స్తోందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోపించారు. గాంధీ ఆస్పత్రి బయట ఆయన మీడియాతో మాట్లాడారు. తాము నిర్మాణాత్మక అంశాలపైనే పోరాడుతు న్నామని, ప్రతిపక్షంగా ఇది తమ బాధ్యత అని చెప్పారు. సీఎం కార్యాలయం నుంచి వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు సరైన సహ కారం లేదని ఆరోపించారు. -
Gandhi Hospital: మద్యం మత్తులో మహిళా జూడాపై దాడి
గాందీఆస్పత్రి : కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటన మరువక ముందే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఓ దారుణం చోటుచేసుకుంది. అత్యవసర విభాగంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా ఇంటర్నీ (జూనియర్ డాక్టర్)పై చికిత్స కోసం వచి్చన ఓ రోగి దాడి చేశాడు. మహిళ ఇంటర్నీ చేయి, యాప్రాన్ పట్టుకుని గట్టిగా లాగడంతో ఆమె భయాందోళనకు గురైంది. దీనిని గమనించిన తోటి వైద్యులు, సిబ్బంది రోగి చేతుల్లోంచి ఆమెను విడిపించారు. ప్రత్యక్ష సాక్షులు, గాంధీ అధికారులు, జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బన్సీలాల్‌పేటకు చెందిన జీ.ప్రకాశ్ (60) దినసరి కూలీగా పని చేస్తున్నాడు. మద్యం, కల్లు తాగే అలవాటు ఉన్న ప్రకాశ్ బుధవారం ఫుల్లుగా మద్యం సేవించి, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండటంతో అతడి భార్య వైద్యసేవల నిమిత్తం ప్రకాశ్‌ను గాంధీ ఎమర్జెన్సీ విభాగానికి తీసుకువచి్చంది. భార్య పక్కనే ఉన్న ప్రకాశ్ అక్కడే డ్యూటీలో ఉన్న ఓ వైద్యవిద్యార్థిని చేయి పట్టుకుని గట్టిగా లాగాడు. ఆమె యాప్రాన్ పట్టుకుని బయటికి లాక్కెళ్లేందుకు యత్నించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో గమనించిన తోటి వైద్యులు, సిబ్బంది అతడిని కొట్టి అతని చేతుల్లోంచి ఆమెను విడిపించారు. ఈ ఘటన దృశ్యాలు అత్యవసర విభాగంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముందుగా అతడిని గాంధీ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు అక్కడి నుంచి చిలకలగూడ ఠాణాకు తరలించారు. మద్యం మత్తులో మతిస్థిమితం కోల్పోయి దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను జూనియర్ డాక్టర్ల సంఘం గాంధీ యూనిట్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. వైద్యులు, వైద్య విద్యార్థులపై దాడులు జరగకుండా, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని జూడా సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వంశీకృష్ణ, లౌక్య, గిరిప్రసాద్‌లు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ పోలీసులు తెలిపారు. -
గాంధీ ఆసుపత్రిలో మహిళా జూనియర్ డాక్టర్‌పై దాడి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై దాడి జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో విధి నిర్వహణలో ఉన్న సమయంలో మహిళా జూనియర్ డాక్టర్‌పై రోగి బంధువుల్లో ఒకరు దాడికి పాల్పడ్డాడు. వైద్యురాలి అప్రాన్ లాగి దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అతడి బారి నుంచి ఇతర సిబ్బంది.. వైద్యురాలిని కాపాడారు.డాక్టర్‌పై దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అయితే రోగి బంధవులు దాడికి పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.చదవండి: RG Kar Case: చర్చల లైవ్ టెలికాస్ట్ డిమాండ్#AartiRavi#attackon_GANDHI_doctorAttacks on lady doctors still continued Lady doctor attacked by patient publicly in casualty in Gandhi hospital Hyderabad.Hatsoff to patient attendent and patient care worker immediately responded Kolkata episode everyone know how a lady… pic.twitter.com/9sXS8pDhG7— Dr vasanth kumar gourani (@vasant5577) September 11, 2024 -
జైనూరు బాధితురాలికి రూ.లక్ష తక్షణ సాయం
గాంధీ ఆస్పత్రి: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఘటనలో గాయపడి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క గురువారం పరామర్శించారు. బాధితురాలికి తక్షణసాయంగా లక్ష రూపాయల చెక్కును అందించారు. కాగా మంత్రి వస్తున్న సమాచారం తెలుసుకున్న బీజేపీ మహిళా శ్రేణులు గాంధీ ఆస్పత్రి వద్దకు చేరుకుని మంత్రిని అడ్డుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శించి ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివాసీ బిడ్డగా నాకే ఎక్కువ బాధ్యత... ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ, జైనూరు ఘటనపై కొంతమంది వ్యక్తులు, రాజకీయ పార్టీ లు చేస్తున్న విషప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని తెలియగానే ప్రభుత్వం స్పందించిందని, నిందితునిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామని, కఠినశిక్ష పడేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ ఘటనలో దోషులను శిక్షించేందుకు ఆడబిడ్డగా, ఆదివాసీ బిడ్డగా తనకే ఎక్కువ బాధ్యత ఉందన్నారు. జైనూ రు ఘటనకు మతం రంగు పూసేందుకు కొందరు యతి్నస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆదివాసీల జీవితాలతో చెలగాటం: ఏలేటి బంగ్లాదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రోహింగ్యా లు, ముస్లింలు ఏజెన్సీ ప్రాంతాలను ఆక్రమించుకుని, ఆదివాసీల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జైనూరు ఘటనలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గురువారం పరామర్శించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు.కేంద్ర నిబంధనల మేరకు ఆదివాసీల ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు ఉండకూడదని, కానీ జైనూరు అటవీప్రాంతంలో వేలాది మంది ముస్లింలు, గిరిజనేతరులు స్థిరనివాసాలు ఏర్పరుకున్నారని ఆరోపించారు. -
నా బిడ్డను బతికించండి
గాందీ ఆస్పత్రి: ప్రాణాపాయస్థితి కొట్టుమిట్టాడుతున్న తన కుమార్తెకు మెరుగైన వైద్యసేవలు అందించి కాపాడాలని ఓ కన్నతల్లి ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అయింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్యం అందడంలేదని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి చేరే వరకు ఫార్వర్డ్ చేయాలని వేడుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం మండపేట గ్రామం తాటిపూడికి చెందిన ఇల్ల శ్రీనివాస్, సుశీల దంపతులు. కొంతకాలం క్రితం నగరానికి వచ్చి అంబర్‌పేట తిరుమల నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. వీరి కుమార్తె జ్యోతి (25) తల్లితండ్రులకు చేదోడువాదోడుగా ఉంటోంది. ఈ నెల 18న ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందపడటంతో జ్యోతి తల, వెన్నెముక, కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఎంఎల్సీ (మెడికో లీగల్ కేసు) నమోదు చేసి అంబులెన్స్‌లో గాందీఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ప్రాథమిక వైద్యం అందించి, జూడాల సమ్మె కారణంగా అత్యవసర శస్త్ర చికిత్స చేయడం కుదరదని.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కావడంతో ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతూ గాంధీ వైద్యులు చేతులెత్తేశారని బాధితురాలి తల్లి సుశీల పేరిట సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అయింది. సీఎం రేవంత్‌రెడ్డికి చేరేవరకూ పోస్ట్‌ను ఫార్వర్డ్ చేయాలని వేడుకుంది. తాము పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సోమవారం వైరల్ కావడంతో అప్పటివరకు పట్టించుకోని గాంధీ వైద్యులు స్పందించారని, న్యూరోసర్జరీ, ఇతర విభాగాలకు చెందిన వైద్యులు చికిత్సలు అందిస్తున్నారని బాధితురాలి బంధువు రవిశంకర్ మీడియాకు తెలిపారు. కాగా.. గాంధీ అత్యవసర విభాగంలో మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నామని, వైరల్ అయిన పోస్ట్‌లో వాస్తవం లేదని గాంధీ సూపరింటెండెంట్ సీహెచ్ రాజకుమారి స్పష్టంచేశారు. జ్యోతికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. -
భారీ వర్షంలోనూ జూడాల నిరసన
గాంధీఆస్పత్రి: కోల్‌కతాలో విధినిర్వహణలో ఉన్న వైద్యవిద్యార్థినిపై హత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, ఈ ఘటనలు పునరావృతం కాకుండా కఠినచర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో జూడాలు నిరసన కార్యక్రమాలు ఉధృతం చేశారు. గురువారం సాయంత్రం భారీవర్షాన్ని సైతం లెక్కచేయకుండా వెయ్యి మంది జూడాలు భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ ఆస్పత్రి నుంచి ప్రారంభమైన ర్యాలీ సికింద్రాబాద్ ప్రధాన రహదారి, పద్మారావునగర్, ముషీరాబాద్ చౌరస్తా మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా సీనియర్ రెసిడెంట్స్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్, జూడాల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షుడు వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ న్యాయం జరిగే వరకు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
Hyderabad: అపార్టుమెంట్లో భారీ చోరీ
బన్సీలాల్‌పేట్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఓ అపార్టుమెంట్లో దొంగలు పడ్డారు. సుమారు 40 తులాల బంగారం, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లిన ఘటన గాందీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ భోలక్‌పూర్ కృష్ణానగర్ కాలనీలోని భవానీ శ్రీ షీలా ఎవెన్యూ అపార్టుమెంట్ 3వ అంతస్తులోని 303 ఫ్లాట్‌లో మాదాపూర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగి శ్రీనివాస్, ఆయన భార్య సబిత, ఇంజినీరింగ్ చదువుతున్న కుమార్తె అనుష్కతో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం ఇంటికి తాళం వేసి సబిత బయటకు వెళ్లారు. కుమార్తె కాలేజీకి, శ్రీనివాస్ బ్యాంక్‌కు వెళ్లారు. మధ్యాహ్నం వేళ గుర్తు తెలియని దొంగలు అపార్టుమెంట్ మూడో అంతస్తులోకి ప్రవేశించారు. తాళం వేసిన గడియ కింది భాగాన్ని తొలగించి ఇంట్లోకి వెళ్లారు. అల్మరా, ఇతరత్రా ప్రదేశాల్లో దాచి ఉంచిన 14 తులాల బంగారం, రూ.లక్ష నగదును దొంగిలించారు. శ్రీనివాస్ కుమార్తె అనుష్క సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా గాంధీనగర్ డివిజన్ ఏసీపీ మొగులయ్య, ఇన్స్పెక్టర్ డి.రాజు ఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. తెలిసిన వ్యక్తులే చోరీకి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
హేరామ్.. ‘గాంధీ’ ఖాళీ
గాంధీ ఆస్పత్రి: తెలంగాణ వైద్యప్రదాయిని, కోవిడ్ సంక్షోభ వేళ వేలాది మంది ప్రాణాలు కాపాడిన కోవిడ్ నోడల్ సెంటర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి బదిలీల విఘాతం తగిలింది. సుమారు 2 వేల మంది ఇన్‌పేషెంట్లు, మరో మూడు వేల మంది అవుట్‌పేòÙంట్లకు వైద్యసేవలు అందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో పెద్దసంఖ్యలో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఒకేసారి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. లాంగ్‌స్టాండింగ్ పేరిట బోధనాసుపత్రి నిర్వహణలో ఉన్న కీలకమైన ప్రొఫెసర్లను మూకుమ్మడిగా బదిలీ చేయడంతో గాంధీ ఆస్పత్రి నిర్వహణపై పెనుప్రభావం పడనుంది. ఆస్పత్రి సూçపరింటెండెంట్తోపాటు ఆయా విభాగాలకు చెందిన సుమారు 40 మంది ప్రొఫెసర్లను ఒకేసారి బదిలీ చేయడంతో మేజర్ సర్జరీల్లో జాప్యం నెలకొనే అవకాశం ఉంది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్యులకు గైడ్లుగా వ్యవహరించే ప్రొఫెసర్లకూ బదిలీ కావడంతో పీజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. సీనియర్, జూనియర్ నిష్పత్తిలో కాకుండా నిష్ణాతులైన వైద్యులందరినీ ఇష్టారాజ్యంగా శుక్రవారం బదిలీ చేయడంపై వైద్యవర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. జనరల్ సర్జరీ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లకు.... కీలకమైన గాంధీ జనరల్ సర్జరీ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లను ఒకేమారు బదిలీ చేయడంతో సర్జరీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. నూతనంగా బదిలీపై వచ్చే ప్రొఫెసర్లకు ఇక్కడి పరిస్థితులు ఆకళింపు చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటివరకు అరకొరగా ఉన్న అసోసియేట్, అసిస్టెంట్ వైద్యులతో నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. జనరల్ మెడిసిన్ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లకుగాను ఐదుగురు బదిలీ అయ్యారు. అత్యంత కీలకమైన అనస్తీషియా విభాగంలో ముగ్గురు ప్రొఫెసర్లు, ఆరుగురు అసోసియేట్లు బదిలీ కావడంతో ఆపరేషన్లలో జాప్యం నెలకొనే పరిస్థితి ఏర్పడింది. ఆర్థోపెడిక్ విభాగంలో ముగ్గురు ప్రొఫెసర్లు బదిలీకాగా ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. గైనకాలజీ విభాగంలో నలుగురు ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు.ఒక్కో ప్రొఫెసర్ ఉన్న విభాగంలో కూడా యూరాలజీ, సీటీ సర్జరీ, కార్డియాలజీ తదితర విభాగాల్లో ఉన్న ఒకే ఒక్క ప్రొఫెసర్‌ను కూడా బదిలీ చేయడంతో ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితిపై ప్రభావం పడనుంది. -
గాంధీ ఆసుపత్రి వద్ద ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు చేదు అనుభవం
-
కొత్తగా.. కొంగొత్తగా గాంధీ ఆస్పత్రి (ఫొటోలు)
-
జూడాల మధ్య చిచ్చుపెట్టిన సమ్మె విరమణ!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె.. వాళ్లలో వాళ్లకే చిచ్చు రాజేసింది. జూడాలు రెండుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. సమ్మె విరమించినట్లు జూడాల ప్రెసిడెంట్ ప్రకటించిన వేళ.. ఉస్మానియా జూడాలు మాత్రం సమ్మె కొనసాగుతోందని ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.తెలంగాణలో జూడాల సమ్మె విరమణ.. గాంధీ ఆస్పత్రి వర్సెస్ ఉస్మానియా ఆస్పత్రి జూనియర్ డాక్టర్ల అంశంగా మారిందిప్పుడు. బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధుల విడుదల, కాకతీయ యూనివర్సిటీ రోడ్ల మరమ్మత్తుల నిధుల విడుదల బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధులు విడుదల.. ఈ రెండు హామీలతో సమ్మె విరమిస్తున్నట్లు(తాత్కాలికంగానే) జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ ప్రకటించారు.అయితే.. ప్రభుత్వం ముందు ఎనిమిది డిమాండ్లు ఉంచామని, అందులో కేవలం రెండు డిమాండ్లను మాత్రమే ప్రభుత్వం అంగీకరిస్తే సమ్మె ఎలా విరమిస్తారని ఉస్మానియా జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గాంధీ ఆస్పత్రి జూడాలు ప్రభుత్వానికి లొంగిపోయారంటూ ఆరోపిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం తమ ప్రధాన డిమాండ్ అని, ప్రభుత్వం నుంచి ఈ డిమాండ్‌పై స్పష్టమైన హామీ వచ్చేదాకా యధావిధిగా సమ్మె కొనసాగిస్తామని వారంటున్నారు.ఈ క్రమంలో జూడా జనరల్ సెక్రటరీ ఉస్మానియా జూడాలకు మద్దతుగా నిలవడంతో.. ఈ వ్యవహారం ఏ మలుపు తిరగబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. -
TS: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఫేక్ వీడియో వైరల్
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ‘ఎక్స్’ఖాతాలో ఓ ఫేక్ వీడియో వైరల్ అయింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో కొవ్వొత్తులు, టార్చిలైట్లు, సెల్‌ఫోన్ వెలుగులో వైద్యసేవలు అందించారని, ఈ క్రమంలో ఓ బాలుడు మృతి చెందాడని, గొప్పులు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పనితీరు దరిద్రంగా ఉందని, గుంపు మేస్త్రీ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ వీడియోను పెట్టారు. ఓ తెలుగు చానల్ లోగోతో ఉన్న వీడియో క్లిప్పింగ్‌ను జత చేస్తూ ‘బీఆర్ఎస్ యూఎస్ఏ’ఎక్స్ ఖాతాలో ఇది పోస్ట్ అయింది. దీనిపై సీఎం కార్యాలయం విచారణ చేపట్టగా అంతా ఉత్తదే అని తేలింది. పాత క్లిప్పింగ్‌తో డీప్‌ఫేక్ ద్వారా తప్పుడు వీడియోను సృష్టించారని విచా రణలో వెల్లడైంది. సీఎం పేషీ ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు చిలకలగూడ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. బీఆర్ఎస్ యూఎస్ఏ ఎక్స్ ఖాతాలో హరీశ్‌రెడ్డి అనే వ్యక్తి ఈ ఫేక్ వీడియోను అప్లోడ్ చేసినట్లు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. ఐటీ, ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ ఎస్హెచ్ఓ అనుదీప్ తెలిపారు. వైద్యులు, సిబ్బందిపై నిందలు వే యడం తగదని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు ఆవేదన వ్యక్తం చేశారు. -
గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ కేసులేమీ నమోదు కాలేదు
హైదరాబాద్: ‘కోవిడ్ వైరస్ వ్యాప్తిపై వదంతులు నమ్మవద్దు. ఈ నెలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కేరళలో వ్యాప్తిలో ఉన్న జేఎన్–1 వేరియంట్‌తో గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు చేరారనే ప్రచారం పూర్తిగా ఫేక్. అనవసరంగా భయాందోళన వద్దు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి’ అని రాష్ట్ర కోవిడ్ నోడల్ సెంటర్ సికింద్రాబాద్ గాం«దీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. ∙కేరళలో వ్యాప్తిలో ఉన్న జేఎన్–1 వైరస్‌తో గాందీలో ఐదుగురు చేరారనేది పూర్తిగా అబద్ధం. ఆ ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. రాష్ట్రంలోనే జేఎన్–1 వేరియంట్ కేసు నమోదు కాలేదు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని కేంద్రం అలర్ట్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు, సలహాలు అందించింది. రాష్ట్ర వైద్యమంత్రి దామోదర రాజనర్సింహా, ఇతర వైద్య ఉన్నతాధికారులు గాం«దీలో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ∙గాంధీ అత్యవసర విభాగంలో గతంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ వార్డులో పురుషులకు 30, మహిళలకు 20 మొత్తం 50 పడకలు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ పాండమిక్ ముగిసన తర్వాత ఎండ్మిక్లో ఒకటి, రెండు కేసులు నమోదు కావడం సర్వసాధారణం. ఈ నెలలో గాం«దీలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రానున్న పండగ రోజులు కీలకం.. ∙రానున్న క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండగలు కీలకం. కోవిడ్ వంటి వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్క్ «ధరించాలి. హ్యాండ్ శానిటైజేషన్ పాటించాలి. ఈ ఏడాది సెపె్టంబర్, అక్టోబర్ నెలల్లో శ్వాసకోశ రుగ్మతలు, ఇన్ఫెక్షన్లు, వైరల్ ఫీవర్లు ఎక్కువగా నమోదు అయ్యాయి. నవంబర్, డిసెండర్ నెలల్లో తగ్గుముఖం పట్టాయి. ∙ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ జేఎన్–1 మొదట అమెరికాలో వెలుగుచూసింది. కొన్ని నెలల తర్వాత ఇప్పుడు కేరళలో వ్యాప్తిలో ఉంది. రూపాంతరం చెందిన జేఎన్– 1 సబ్ వేరియంట్ సెల్ఫ్ లిమిటింగ్ వైరస్. దానంతట అదే తగ్గిపోతుంది. ఈ వైరస్ తీవ్రత తక్కువ, ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు గుర్తించారు. వీరు జాగ్రత్తగా ఉండాలి.. ఫస్ట్, సెకెండ్ వేవ్‌ల్లో వ్యాపించిన ఆల్ఫా, డెల్టా కంటే మూడో వేవ్‌లో వచ్చిన ఒమిక్రాన్ త్వరితగతిన వ్యాపిస్తుంది. ఒమిక్రాన్ సబ్‌వేరియంటే జేఎన్– 1. దీర్ఘకాల రోగాలతో బాధపడేవారు, వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా సోకే అవకాశం ఉంది. వారంతా మరింత అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ వైరస్ అన్ని వేవ్‌లు సమ్మర్లోనే ఎక్కువగా వ్యాపించాయి. ► కేరళలో జేఎన్– 1 వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వాములు ముందు జాగ్రత్తలు పాటించాలి. తిరిగి వచి్చన తర్వాత స్వీయ నియంత్రణ పాటించడంతో పాటు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. కోవిడ్ కేసులు పెరిగితే గాంధీ మెడికల్ కాలేజీ వైరాలజీ ల్యాబ్‌లోనే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే మార్గదర్శకాలను అమలు చేస్తాం. ► కోవిడ్ నోడల్ కేంద్రం సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో కోవిడ్ ఐసోలేషన్ వార్డుతోపాటు, కోవిడ్ పరీక్షలు, పీపీఈ కిట్లు, వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయి. అసత్య ప్రచారాలు నమ్మవద్దు. భయాందోళనకు గురి కావద్దు. మాస్క్ ధరించి, హ్యాండ్ శానిటైజేషన్, కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. -
కరోనా వేరియంట్ భయం.. గాంధీ ఆసుపత్రి రాజారాం కీలక వ్యాఖ్యలు
కరోనా మళ్లీ కలవరపెడుతోంది. రూపం మార్చుకుని మళ్లీ వచ్చేస్తోంది. కరోనా కొత్త వేరియంట్ JN.1 విజృభిస్తోంది. రెండురోజులుగా కొత్త వేరియంట్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఏకంగా మళ్లీ కరోనా మరణాలను గుర్తుచేస్తోంది. అసలు జెఎన్–వన్ వెరియంట్ ఎంటీ? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? కొత్త వెరియంట్ ఎంత వరకు ప్రమాదకరం.. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ బారినపడి ఆరుగురు మృతి చెందారు. ఈ తాజా పరిణామాలు ప్రజలను మళ్లీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసింది. రెండేళ్ల క్రితం దేశంలో ఒమిక్రాన్ వెరియంట్ వేగంగా విస్తరించింది. చాలా మందిని ఇబ్బందిని పెట్టింది. అనారోగ్యానికి గురిచేసి అవస్థల పాలు చేసింది. తాజాగా ఈ వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన సబ్ వెరియంటే JN-1. ఒమిక్రాన్ రూపం మార్చుకుని జెఎన్-1 గా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వేరియంట్లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రాబోయే పండుగల సీజన్ల దృష్ట్యా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్కులను ధరించాలని ప్రజలను కోరుతున్నారు. మరోవైపు.. కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై.. కొవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ప్రత్యేకంగా కరోనా వార్డ్‌లో బెడ్స్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఇక, క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల, సంక్రాంతి పండుగ సందర్భంలో కొత్త వేరియంట్ కట్టడి సవాల్‌గా మారనుంది. సో.. బీ కేర్ ఫుల్.. బీ అలెర్ట్. ఇది కూడా చదవండి: భారత్‌లో కరోనా: జేఎన్.1 వేరియెంట్ లక్షణాలేంటి? -
‘గాందీ’లో అందుబాటులో ఫ్రీజర్స్
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఫ్రీజర్‌బాక్సులు అందుబాటులో లేవన్న సమస్యే ఉత్పన్నం కాదని, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నందున సాంకేతిక సమస్యలు కూడా తలెత్తవని ప్రస్తుతం ఆస్పత్రిలో 62 ఫ్రీజర్ బాక్సులున్నాయని ఆస్పత్రి సూపరింటిండెంట్ హైకోర్టుకు అఫిడవిట్ సమరి్పంచారు. గాంధీ ఆస్పత్రిలో కోల్డ్ స్టోరేజీ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోతున్నాయని ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ఈ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా...‘గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 62 ఫ్రీజర్ బాక్సులున్నాయి. రోజుకు 15 నుంచి 20 మృతదేహాలు ఆస్పత్రికి వస్తాయి. ఇందులో 3 నుంచి 4 గుర్తుతెలియనివి ఉంటాయి. నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకున్న తర్వాత గుర్తించిన మృతదేహాలను బంధువులకు అందజేస్తారు. గుర్తు తెలియని వాటిని 72 గంటల పాటు ఫ్రీజర్‌లో భద్రపరిచి ఆ తర్వాత పోస్టుమార్టం నిర్వహించి.. మున్సిపాలిటీ అధికారులకు అందజేస్తారు. వారు నిబంధనల మేరకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం రాత్రి సమయాల్లోనూ అవసరమైతే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పలు కారణాల రీత్యా వ్యక్తి మృతిచెందిన రోజే పోస్టుమార్టం సాధ్యం కాదు. 60 బాక్సులకు 25 మాత్రమే పని చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనం అవాస్తవం’అని ఆస్పత్రి సూపరింటిండెంట్ ధర్మాసనానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆస్పత్రి సూపరింటిండెంట్ సమర్పించిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం..ఫ్రీజర్స్ అందుబాటులో ఉన్నందున విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. -
గాంధీ వైద్యుల మరో ముందడుగు
గాందీఆస్పత్రి : బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి చెందిన కాలేయాన్ని సికింద్రాబాద్ గాం«దీఆస్పత్రి వైద్యులు సేకరించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అక్కడ చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి అమర్చారు. గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపిన వివరాల ప్రకారం... గాం«దీఆస్పతితో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి బ్రెయిన్‌డెడ్‌అయ్యాడు. అతని కుటుంబసభ్యుల అంగీకరించడంతో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి శరీరం నుంచి పలు అవయవాలు సేకరించాలని వైద్యులు నిర్ణయించారు\ లివర్ ఒక్కటే పూర్తిస్థాయిలో పనిచేస్తుందని, మిగతా అవయవాల పనితీరు బాగోలేదని వైద్యపరీక్షల్లో తేలింది. జీవన్‌దాన్‌లో నమోదు చేసుకున్న జాబితా ప్రకారం ఏబీ బ్లడ్ గ్రూపుకు చెంది లివర్ సమస్యతో బాధపడేవ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తేలింది. గాంధీ వైద్యులు బ్రెయిడ్ డెడ్ అయిన వ్యక్తి శరీరం నుంచి లివర్‌ను సేకరించి (రిట్రీవల్) ప్రత్యేక వాహనంలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, అక్కడ చికిత్స పొందుతున్న మరోవ్యక్తికి (ట్రాన్స్‌ప్లాంట్) అమర్చారు. లివర్‌ను సేకరించడం ఇదే గాందీఆస్పత్రిలో మొదటిసారని వివరించారు. గాంధీ ఆస్పత్రిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో లివర్‌ను విజయవంతంగా సేకరించి మరో వ్యక్తికి అమర్చి పునర్జన్మ ప్రసాదించిన గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, గాంధీ, ఉస్మానియా వైద్యులు, సిబ్బందిని వైద్యమంత్రి హరీష్ రావు అభినందించారు. -
తల్లీబిడ్డల సంరక్షణలో రోల్‌మోడల్‌గా తెలంగాణ
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): తల్లీబిడ్డల సంరక్షణలో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని, మాతాశిశు మరణాలు తక్కువగా ఉన్న మూడో రాష్ట్రంగా నమోదు కావడం గర్వంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మాతాశిశు మరణాలను గణనీయంగా తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి, ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికే దక్కుతుందని పేర్కొన్నారు. తల్లి మరణాలు గతంలో ప్రతి లక్షకు 92 ఉంటే.. అవిప్పుడు 43కు తగ్గాయని, బిడ్డ మరణాలు 39 నుంచి 21కి తగ్గాయని తెలిపారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో రూ.52 కోట్లతో నిర్మించిన మదర్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) కేర్ సెంటర్‌ను, రూ.2.70 కోట్లతో ఏర్పాటు చేసిన డైట్ క్యాంటీన్ భవనాలను, జిల్లాకు ఒకటి చొప్పున 33 నియోనెటల్ అంబులెన్స్ సర్విసులను ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో కలిసి హరీశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై నెలలో 72.8 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 350 ప్రసూతి కేంద్రాల ఆధునికీకరణ చేపట్టామని తెలిపారు. హైదరాబాద్‌లోని గాం«దీ, పేట్లబురుజు ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గాంధీలో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ కేర్ సెంటర్ మాతాశిశు మరణాలను తగ్గించేందుకు 600 పడకలతో గాం«దీ, నిమ్స్, టిమ్స్ (ఆల్వాల్)ల్లో మూడు ఎంసీహెచ్ కేర్ సెంటర్లకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, ఆదివారం నుంచి గాంధీలో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చిందని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రస్థుతం గాంధీ ఆస్పత్రిలో మాతాశిశు సంరక్షణకు 500 పడకలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన 300 అమ్మవడి వాహనాలు రోజూ 4 వేల మంది గర్భిణులకు సేవలు అందిస్తున్నాయని వివరించారు. ఆధునిక సౌకర్యాలతో నియోనెటల్ అంబులెన్స్‌లు పుట్టిన ప్రతి శిశువును ప్రాణాలతో కాపాడుకునేందుకు జిల్లాకు ఒకటి చొప్పున 33 నియోనెటల్ అంబులెన్స్ సర్విసులను అందుబాటులోకి తెచ్చామని హరీశ్‌రావు చెప్పారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ అంబులెన్సులు అత్యవసర సమయాల్లో నవజాత శిశువులను ఆస్పత్రులకు తరలించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎమ్మెల్సీలు వాణిదేవి, మీర్జా రహమత్ ఆలీబేగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, జిల్లా కలెక్టర్ అనుదీప్, పలువురు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. గాంధీ ఆస్పత్రికి ఐఎస్ఓ సర్టిఫికెట్ గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): తెలంగాణ వైద్య ప్రదాయినీ సికింద్రాబాద్ గాంధీ ఆస్ప త్రి రెండు విభాగాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) సర్టిఫికెట్లు సాధించింది. టెరిటరీ లెవెల్ పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ విభాగంలో క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎస్ఓ 9001: 2015), ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎస్ఓ 45001: 2018)లకు క్వాలిటీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (క్యూఆర్ఓ) సంస్థ ఐఎస్ఓ సర్టిఫికెట్లను ప్రదానం చేసింది. ఈ సర్టిఫికెట్ల కాలపరిమితి 2026 వరకు ఉంటుందని, ప్రభుత్వ ఆస్పత్రు ల సెక్టార్లో ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందిన మొట్ట మొదటి ఆస్పత్రి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి అని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. గాంధీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు గాంధీ వైద్యులు, సిబ్బంది, పాలనా యంత్రాంగ పనితీరును ప్రశంసించారు. సూపరింటెండెంట్ రాజారావు, గైనకాలజీ హెచ్ఓడీ సంగీత షాలకు ఐఎస్ఓ సర్టిఫికెట్లను అందించి అభినందించారు. -
విషాదం: ఫ్లైఓవర్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని మౌలాలి ఫ్లైఓవర్ పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ ఆమె మృతిచెందింది. వివరాల ప్రకారం.. గౌతమ్ నగర్‌కు చెందిన సుజి(37) ఆదివారం మౌలాలి ఫ్లైఓవర్ పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సదరు మహిళ ఆత్మహత్యాయత్నం గమనించిన స్థానికులు ఆమెను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి కుటుంబసభ్యుల కోసం ఆరా తీస్తున్నట్లు మల్కాజిగిరి సీఐ రవికుమార్ తెలిపారు. ఆమె మృతికి గల కారణాల గురించి తెలుసుకుంటున్నామని చెప్పారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇది కూడా చదవండి: విషాదం: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి -
ఐసీయూలో తల్లి .. ఆకలితో చిన్నారి
(హైదరాబాద్, గాందీఆస్పత్రి): చావుబతుకుల మధ్య తల్లిప్రాణం కొట్టుకుంటుంది.. ఆరుబయట చిన్నారి ఆకలితో అల్లాడుతున్నాడు. నేనున్నాను అనే భరోసా ఇవ్వాల్సిన వ్యక్తి తనకేమి పట్టనట్లు ఇద్దరినీ అలాగే వదిలేసి వెల్లిపోయాడు. ఆకలితో పాటు అమ్మకోసం ఏడుస్తున్న చిన్నారిని చేరదీసి, ఆకలి తీర్చి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న తల్లిని చూపించి మానవత్వం చాటుకున్నారు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ సలూరాకేంపు ప్రాంతానికి చెందిన గంగాధర్, మాధవి భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల బాబు సాతి్వక్ ఉన్నాడు. రెండవ కాన్పు కోసం ఈ నెల 1న మాధవి గాంధీ ఆస్పత్రిలో చేరింది. అదే రోజు ఆడశిశువు పుట్టిన వెంటనే చనిపోయింది. తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయస్థితి చేరిన మాధవికి మెటరీ్నటీ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ (ఎంఐసీయూ) లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. జాడలేని భర్త ఆచూకీ.. కారణం తెలియదు కానీ మాధవి భర్త గంగాధర్ ఈనెల 2వ తేదీన కుమారుడు సాతి్వక్‌ను గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో వదిలేసి వెల్లిపోయాడు. ఆకలితో అల్లాడుతూ అమ్మ కోసం రోధిస్తున్న చిన్నారిని గాంధీ సెక్యూరిటీ సిబ్బంది గమనించి అన్నం పెట్టి బుజ్జగించి ఆరా తీశారు. పలు వార్డులను తిప్పుగా వెంటిలేటర్‌పై అపస్మారకస్థితిలో ఉన్న అమ్మను చిన్నారి సాతి్వక్ గుర్తించాడు. కేస్ ట్లో ఉన్న గంగాధర్ సెల్‌ఫోన్ నంబరుకు కాల్ చేయగా స్విచ్చాఫ్ వస్తోంది. గాంధీ సెక్యూరిటీ సూపర్వైజర్ శివాజీ నేతృత్వంలో సిబ్బంది ఆంజనేయులు, శ్రీకాంత్, నర్సింహా, కళ్యాణ్, నాగరాజు, శివకుమార్, వరలక్ష్మీ, లావణ్య, అనురాధలు గత మూడు రోజులుగా చిన్నారి సాతి్వక్‌ను షిఫ్ట్డ్యూటీ ప్రకారం వంతుల వారీగా చేరదీసి అన్నం పెట్టి ఆకలి తీర్చి అమ్మను మరిపిస్తున్నారు. ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న మాధవికి రోగి సహాయకులు లేకపోవడంతో మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ)గా పరిగణించి వైద్యసేవలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. మాధవి కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు ఆధారంగా ఉన్న ఫోన్ నంబరు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోందన్నారు. చిన్నారిని చేరదీసి మానవత్వం చాటుకున్న సెక్యూరిటీ సిబ్బందిని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, జీడీఎక్స్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధి రవికుమార్‌లతోపాటు పలువురు వైద్యులు, రోగి సహాయకులు అభినందిస్తున్నారు. -
ఈ వ్యాధి పిల్లలో అరుదుగా వస్తోంది జాగ్రత్తగా ఉండండి
-
ప్రాణాలకు తెగించి పనిచేశాం.. అయినా రోడ్డున పడేశారు..
సాక్షి, హైదరాబాద్: కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారని గాంధీ ఆసుపత్రిలోని నాలుగో తరగతి ఔట్ సోర్సింగ్ సిబ్బంది వాపోయారు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిసి తమ మొర వినిపించారు. గాంధీ ఆసుపత్రిలో సేవలందించేందుకు అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదని, తాము ప్రాణాలకు తెగించి ఉద్యోగాల్లో చేరి సేవలందించామని పేర్కొన్నారు. కష్టకాలంలో అందించిన సేవలను మరిచి ఇప్పుడు తమ సేవలు అవసరం లేదని చెబుతూ గత నెలాఖరున ఉద్యోగాలు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 244 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన సంజయ్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీనిచ్చారు. చదవండి: వెనక్కి తగ్గిన ప్రభుత్వం!.. ‘విశాఖ ఉక్కు’కు తెలంగాణ దూరం -
Gandhi Hospital: 244 మంది కోవిడ్ పేషెంట్ కేర్ టేకర్లు ‘అవుట్’
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిన మూడేళ్లుగా సేవలు అందిస్తున్న 244 మంది కోవిడ్ పేషెంట్ కేర్ టేకర్లను తొలగిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయిన క్రమంలో కాంట్రాక్టు కాలపరిమితిని మరో ఏడాది పొడిగించేందుకు విముఖత వ్యక్తం చేయడంతో మార్చి 31వ తేదీ వారి విధులకు చివరిరోజైంది. రేపటి నుంచి విధులకు హాజరుకావాల్సిన అవసరం లేదని ఆస్పత్రి పాలన యంత్రాంగం సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యామని, కోవిడ్ వైరస్ విజృంభించిన తొలినాళ్లలో ప్రాణాలకు తెగించి సేవలు అందించామని విధుల నుంచి తొలగించబడిన పేషెంట్ కేర్ టేకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020లో నియామకం కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిని మార్చి 2020లో కోవిడ్ నోడల్ సెంటర్‌గా మార్చారు. కరోనా బాధితులకు వైద్యసేవలు అందించేందుకు అదే ఏడాది మే నెలలో ఏడాది కాలానికి కాంట్రాక్టు పద్ధతిని 244 మందిని కోవిడ్ పేషెంట్ కేర్ టేకర్లుగా విధుల్లోకి తీసుకున్నారు. 2021, 2022లో సెకండ్, థర్డ్వేవ్లు రావడంతో కాంట్రాక్టును ఎప్పటికప్పుడు పొడిగించారు. ప్రస్తుతం కరోనా వైరస్ సర్వసాధారణం కావడంతో కోవిడ్ పేషెంట్ కేర్ టేకర్ల అవసరం లేదని భావించిన ప్రభుత్వం ఈ ఏడాది కాంట్రాక్టు కాలపరిమితిని పొడిగించలేదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి విధుల్లోకి వచ్చే అవసరం లేదని ఆస్పత్రి యంత్రాంగం స్పష్టం చేస్తూ టెరి్మనేషన్ ఆర్డర్స్‌ను జారీ చేసింది. జీడీఎక్స్లో చేరేందుకు ససేమిరా... కాంట్రాక్టు కాలపరిమితి పొడిగించే అవకాశం లేదని సంకేతాలు రావడంతో ఆస్పత్రి పాలనయంత్రాంగం మానవతా ధృక్పథంతో వ్యవహరించి కోవిడ్ పేషెంట్ కేర్ టేకర్లుగా పనిచేస్తున్న వారితో మంతనాలు జరిపింది. నూతనంగా సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్టు పొందిన జీడీఎక్స్ సంస్థలో చేరేందుకు అవకాశం కలి్పస్తామని హామీ ఇచి్చంది. వేతనాలు తక్కువనే సాకుతో కోవిడ్ పేషెంట్‌కేర్ టేకర్లు జీడీఎక్స్లో చేరేందుకు విముఖత వ్యక్తం చేయడంతో ఆస్పత్రి పాలనయంత్రాంగం మిన్నకుండిపోయింది. వైద్యసేవలకు విఘాతం కలగకుండా... వైద్యసేవలకు విఘాతం కలగకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు స్పష్టం చేశారు. కాంట్రాక్టు కోవిడ్ పేషెంట్ కేర్ టేకర్ల కాలపరిమితి పొడిగించడం తన చేతిలో లేదన్నారు. ఇది అన్యాయం కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తే ఇప్పుడు మా జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని తొలగించబడిన కోవిడ్ పేషెంట్‌కేర్ టేకర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటు శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి ప్రాంగణంలో బైఠాయించి ధర్నా, ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గాంధీలో ఉద్యోగం పరి్మనెంట్ అవుతుందని నమ్మించారని, ప్రాణాలకు లెక్కచేయకుండా వేలాది మంది కరోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు తమ వంతు కృషి చేశామన్నారు. ఇప్పుడు విధుల నుంచి తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని కన్నీటి పర్యంతమయ్యారు. సేవలందిస్తు కరోనా బారినపడి ఐదుగురు పేషెంట్ కేర్ టేకర్లు మృతి చెందారని వివరించారు. అనంతరం గాంధీ సూపరింటెండెంట్ రాజారావును కలిసి వినతిపత్రం అందించారు. త్వరలోనే వైద్యమంత్రి హరీష్‌రావును కలిసి తమ పరిస్థితి విన్నవిస్తామని రాజేందర్, శివ, తేజ, యాదలక్ష్మీ, సాయి, మనోజ్, జంగయ్య, స్వప్న తదితరులు తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు.. కారణం ఇదే!
గాంధీ ఆస్పత్రి: వ్యాయామం చేస్తూ కొందరు హఠాత్తుగా కుప్పుకూలి మృతిచెందుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఎటువంటి లక్షణాలు కనిపించనప్పటికీ తీవ్రమైన గుండెపోట్లతో వారు మరణిస్తున్నట్లు వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. ఇంకొందరు బ్రెయిన్‌స్ట్రోక్‌తో కుప్పకూలుతున్నారని అంటున్నారు. కుటుంబంలో ఎవరైనా ఇలా మరణిస్తే మిగిలిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి వ్యాధులు, రుగ్మతలు జన్యుపరంగా రక్త సంబంధీకులకు వస్తున్నట్లు గతంలోనే నిర్ధారణైందని చెబుతున్నారు. గుండెపోటుతో కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్ ఎందుకు వస్తున్నాయి?, నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కోవిడ్ పాత్ర తదితర అంశాలపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు ‘సాక్షి’కి చెప్పి వివరాలు ఆయన మాటల్లోనే.. - గుండె, మెదడు జబ్బులు వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఎక్కువ. కాబట్టి రక్తసంబంధీకులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. - మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, స్థూలకాయం, మాదకద్రవ్యాల సేవనం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, శారీరకశ్రమ లేకపోవడం గుండె, మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. - కోవిడ్ బారినపడిన వారిలో రక్తం చిక్కబడే అవకాశం ఉంది, పోస్టు కోవిడ్ లక్షణాల్లో ఇది ప్రధానమైనది. రక్తం చిక్కబడి రక్తనాళాల్లో ప్రసరణ సరిగా జరగకపోవడంతో హార్ట్ఎటాక్, బ్రెయిన్‌స్ట్రోక్‌కు ఆస్కారం ఏర్పడుతుంది. - తల్లి గర్భంలో పిండం పెరిగి శిశువుగా రూపాంతరం చెందుతున్నప్పుడే కొన్నిరకాల రుగ్మతలకు గురవుతారు. డయాబెటిస్ వంటివి ఇటువంటివే. తల్లి ఆరోగ్యంగా లేనప్పుడు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నప్పుడు వాటి ప్రభావం శిశువులపై పడుతుంది. - చిన్నారులు, యువతలో శారీరక శ్రమ లేకపోవడం ఇటువంటి రుగ్మతలకు మరో కారణం. ఇలా చేస్తే పదిలం.. - వంశపారంపర్యంగా గుండె, మెదడు సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. - జీవనశైలి, ఆహార అలవాట్లు మార్చుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. మాదకద్రవ్యాలు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమపాళ్లలో తీసుకోవాలి. పండ్లు, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. - గుండెపోటుకు గురైన వారిని వెంటనే కాపాడేందుకు వీలుగా అన్ని వర్గాల ప్రజలకు అత్యవసర ప్రాథమిక చికిత్స అయిన సీపీఆర్‌పై అవగాహన కలి్పంచి శిక్షణనివ్వాలి. - యోగా, ధ్యానం చేసేందుకు వీలుగా కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులకు తప్పనిసరిగా 45 నిమిషాల సమయం కేటాయించాలనే నిబంధన విధించాలి. -
ప్రీతి కేసు.. ఠాగూర్ సినిమాలెక్కుంది!
సాక్షి, హైదరాబాద్: పీజీ డాక్టర్ ప్రీతికి అందుతున్న చికిత్స విషయంలో నిమ్స్ వైద్యులు వ్యవహరిస్తున్న తీరుపై ఆమె కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఇది ఠాగూర్ సినిమా లెక్కుందని ఆమె బాబాయ్ రాజ్‌కుమార్ ఆగ్రహం వెల్లగక్కారు. ఇక.. నిన్నటిదాకా ఆమె బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పారని, ఇవాళేమో హఠాత్తుగా బ్రెయిన్‌డెడ్ అయ్యిందని చెప్తున్నారని ఆమె తండ్రి నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో కాసేపట్లో ప్రీతి ఆరోగ్య స్థితిపై కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో నిమ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. డాక్టర్లు మాకేమో ఒకటి చెప్తున్నారు. ఆస్పత్రి చుట్టూ పోలీసులను పెడుతున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి మా అమ్మాయిని బతికించాలనే ఉద్దేశం ఉంటే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేది. కానీ, అలా చేయలేదు. ఇప్పుడు జరుగుతున్నదంతా ఠాగూర్ సినిమా లెక్కే ఉంది అని ప్రీతి బాబాయ్ రాజ్‌కుమార్ ఆగ్రహం వెల్లగక్కారు. మరోవైపు ప్రీతికి నిమ్స్‌లో సరైన చికిత్స అందడం లేదని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ప్రీతి కుటుంబ సభ్యులకు పరామర్శ సందర్భంగా మీడియా ముందు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మెరుగైన చికిత్స పేరిట వరంగల్ ఎంజీఎం నుంచి ప్రీతిని హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. గత ఐదు రోజులుగా చికిత్స అందిస్తూ.. ఎప్పటికప్పుడు పరిస్థితి విషమంగానే ఉందటూ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వచ్చారు. అయితే తమకు మాత్రం ప్రీతి బ్రతుకుతుందనే భరోసా ఇస్తూ.. ఇప్పుడు హఠాత్తుగా బ్రెయిన్ డెడ్, బతికే అవకాశం లేదని వైద్యులు చెప్పడంపై ఆమె కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గాంధీకి ప్రీతి! ఇదిలా ఉంటే నిమ్స్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. మరోవైపు.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఈ తరుణంలో.. ఏ క్షణమైనా ప్రీతిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తారనే ప్రచారం నడుస్తోంది. ఏది అనేది కాసేపట్లో నిమ్స్ వైద్యులు విడుదల చేసే బులిటెన్.. కీలక ప్రకటనపైనే ఆధారపడి ఉంది. -
గాంధీ, ఉస్మానియా మార్చురీల్లో అనాథ శవాల ఆత్మఘోష!
అవి రాష్ట్రంలోనే పేరొందిన రెండు ప్రభుత్వ పెద్దాస్పత్రులు... పేద రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందిస్తూ వారికి అండగా నిలుస్తున్న గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఈ రెండు ఆస్పత్రుల్లోని మార్చురీలు (శవాగారాలు), వాటి దయనీయ పరిస్థితిని చూస్తే ఎవరికైనా కళ్లు చెమరుస్తాయి.. గుండెలు బరువెక్కుతాయి. ఎంతో మంది అనాథలు, అభాగ్యుల మృతదేహాలు ఆనవాళ్లు లేక మార్చురీల్లో కుళ్లిపోయి దుర్వాసనలు వెదజల్లుతూ శవాల దిబ్బగా మారుతున్నాయి. సరైన సమయంలో దహన సంస్కారాలకు నోచుకోక వాటి ఆత్మలు ఘోషిన్తున్నాయి.. ఈ హృదయ విదారక దుస్థితిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని గాంధీ, ఉస్మానియా మార్చురీల్లో నిత్యం సుమారు 50 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. వాటిలో దాదాపు 10–15 వరకు అనాథ శవాలే. తాజా మృతదేహాలను మార్చురీలోని ఫ్రీజరు బాక్స్‌ల్లో భద్రపరుస్తున్న సిబ్బంది... గుర్తుతెలియని, అనాథ మృతదేహాలను పఫ్రూం (మూకుమ్మడిగా మృతదేహాలను భద్రపరిచే గది)కు తరలిస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం, పోలీసులు, ఫోరెన్సిక్ వైద్యుల మధ్య సమన్వయ లోపం కారణంగా మృతదేహాలను అక్కడ రోజుల తరబడి ఉంచాల్సి వస్తుండటంతో అవి కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. సిబ్బంది సైతం లోపలకు వెళ్లలేని దుస్థితి నెలకొంటోంది. నిబంధనలకు పాతర! పోస్ట్‌మార్టం జరిగిన 72 గంటల తర్వాత అనాథ శవాలను జీహెచ్ఎంసీ విభాగం శ్మశానవాటికకు తరలించాలనే నిబంధనలు ఉన్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. జీహెచ్ఎంసీ ఓ కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసి ఒక్కో మృతదేహం తరలింపు, అంత్యక్రియల నిర్వహణకు కొంత మొత్తం చెల్లిస్తుండగా ఆ సంస్థ మాత్రం వివిధ సాకులు చెబుతూ మృతదేహాల తరలింపులో తీవ్ర జాప్యం చేస్తోంది. రవాణా ఖర్చులు మిగుల్చుకొనేందుకు దాదాపు 10 రోజులకోసారి దాదాపు 20 చొప్పున మృతదేహాల తరలింపు ప్రక్రియ చేపడుతోంది. ప్రస్తుతం ఒక్కో మృతదేహం తరలింపు, అంత్యక్రియలకు కాంట్రాక్టు సంస్థకు జీహెచ్ఎంసీ రూ. 2,000–2,500 మ«ద్య ఇస్తున్నట్లు సమాచారం. గతంలో గాంధీ, ఉస్మానియాలకు చెందిన అనాథ శవాల అంత్యక్రియలు నిర్వహించిన ఓ స్వచ్ఛంద సంస్థపై ఆరోపణలు రావడంతో దానిని తప్పించి జీహెచ్ఎంసీయే రంగంలోకి దిగినా అదే తీరు నెలకొనడం గమనార్హం. కాలేజీలకు కొన్ని అనాథ శవాలు? మార్చురీ నుంచి కొన్ని అనాథ శవాలను కొందరు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంసీ) నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు మానవ అనాటమీ, డిసెక్షన్పై అవగాహన కల్పించాలి. ఇందుకోసం మృతదేహాలు కావాలి. అయితే రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై మృతిచెందే వ్యక్తుల మృతదేహాలు డిసెక్షన్‌కు పనికిరానందున రోడ్లు, ఫుట్‌పాత్‌లపై నివసిస్తూ సాధారణ రుగ్మతలతో మరణించే అనాథల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కొందరు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పుర్రె, ఎముకల విక్రయం! అంత్యక్రియలకు ముందు అప్పుడప్పుడూ అనాథ మృతదేహాల నుంచి పుర్రెతోపాటు కొన్ని శరీర భాగాలకు చెందిన ఎముకలను వేరు చేసి తాంత్రిక, భూత వైద్యులుగా చెలామణి అయ్యే వారికి అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పుర్రెను రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు, చేతి, తొడ ఎముకలు, వెన్నెముక, జాయింట్‌గా ఉన్న ఐదు చేతివేళ్ల ఎముకలను రూ. 2 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వెంటాడుతున్న సిబ్బంది కొరత.. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులను సిబ్బంది కొరత వెంటాడుతోంది. గాంధీ మార్చురీలో ప్రస్తుతం ఏడుగురు వైద్యులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. మరో ముగ్గురు వైద్యులు, ఆరుగురు సిబ్బందితో ఇంకో యూనిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కొన్నేళ్లుగా కార్యరూపం దాల్చడంలేదు. మరోౖవెపు ఉస్మానియాలో వైద్యుల కొరత అంతగా లేకున్నా ఏడుగురు కిందిస్థాయి సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. సమన్వయంతో అంత్యక్రియలు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను పఫ్ రూంలోకి తరలించాక 5–6 మృతదేహాలను ఒకసారి చొప్పున జీహెచ్ఎంíసీ సిబ్బంది తీసుకెళ్తున్నారు. వారితో సమన్వయం చేసుకుంటూ అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ బి. నాగేందర్, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ చనిపోయిన వ్యక్తి అనాథ కాకూడదు గుర్తుతెలియని వ్యక్తిని అనాథ శవంలా కాకుండా వారి కుటుంబ సభ్యులకు చేరవేయాలనే మా ఉద్దేశానికి వ్యతిరేకంగా ఈ తంతు నడుస్తోంది. ప్రభుత్వంతో 8 ప్రామాణికాలకు అనుగుణంగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే మేం నడుచుకున్నా మమ్మల్ని కాదని జీహెచ్ఎంసీకి అప్పగించింది. – డా. రాజేశ్వర్‌రావు, సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్, ప్రధాన కార్యదర్శి తరలింపులో కొన్నిసార్లు జాప్యం అనాథ శవాల తరలింపులో కొన్నిసార్లు జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. మేం ప్రతిరోజూ జీహెచ్ఎంసీకి అనాథ శవాల వివరాలను లిఖితపూర్వకంగా అందిస్తున్నాం. గాంధీలో 60 మృతదేహాలను భద్రపరిచేందుకు అవసరమైన ఫ్రీజరు బాక్సులు, పఫ్రూంతోపాటు అన్ని వసతులు ఉన్నాయి. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ జాప్యం లేదు.. 3 అనాథ శవాల తరలింపులో జాప్యం జరగట్లేదు. సమాచారం అందిన వెంటనే మార్చురీ నుంచి ప్రత్యేక వాహనంలో మృతదేహాలను శ్మశానవాటికకు తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాం. – ముకుందరెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, బేగంపేట సర్కిల్ -
అవయవదానం ఉద్యమంలా సాగాలి
గాంధీ ఆస్పత్రి: ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి పునర్జన్మ ప్రసాదించే అవయవదానం ఉద్యమంలా కొనసాగాలని, ఆత్మీయులను కోల్పోయిన బాధలో ఉండి కూడా దానం చేసేందుకు అంగీకరించడం నిజంగా చాలా గొప్ప విషయమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ వివేకానంద ఆడిటోరియంలో జీవన్‌దాన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అవయవదాతల కుటుంబసభ్యులను సన్మానించి ప్రశంసాపత్రాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. బ్రెయిన్‌డెడ్ అయినవారు భౌతికంగా మనమధ్య లేకున్నా, దానంతో ప్రాణభిక్ష పొందిన మరో ఎనిమిది మంది వారి ప్రతిరూపాలేనని అన్నారు. బ్రెయిన్‌డెడ్ అయి అవయవదానం చేసిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని, పిల్లల చదువు, డబుల్బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. అవయవదానంలో తెలంగాణ చాంపియన్ అవయవదానంలో తెలంగాణ చాంపియన్‌గా నిలుస్తోందని, ఈ ఏడాది బ్రెయిన్‌డెడ్ అయిన 179 మంది అవయవాలను దానం చేయగా ఆయా అవయవాలను 1432 మందికి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి పునర్జన్మ ప్రసాదించామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే దాతలు ఎక్కువన్నారు. బ్రెయిన్‌డెడ్ అయిన వారిని లేదా వారి నుంచి సేకరించిన అవయవాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు హెలికాప్టర్ సేవలు విని యోగించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఎనిమిదో అంతస్తులో అత్యంత అధునాతమైన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ బ్లాక్ ఏర్పాటు చేస్తున్నామని, టెండరు ప్రక్రియ పూర్తయిందని, ఆరు నెలల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కోర్టు వివా దాల తర్వాత ఉస్మానియా ఆస్పత్రిలో కూడా ఇటు వంటి బ్లాక్ రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో జీవన్‌దాన్ ఇన్చార్జి స్వర్ణలత, డీఎంఈ రమేష్‌రెడ్డి, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, గాంధీ, ఉస్మానియా సూపరింటెండెంట్లు రాజా రావు, నాగేందర్, నిమ్స్ ఇన్‌చార్జి్జ బీరప్ప, వైద్యులు మంజూష, మనీషా, కిరణ్మయి పాల్గొన్నారు. -
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి.. మరో అరుదైన ఘనత
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రి మరో అరుదైన ఘనతను సాధించనుంది. అవయవ మార్పిడి నోడల్ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. నిధుల కేటాయింపు, టెండరు ప్రక్రియ పూర్తి కావడంతో ఆరునెలల్లో అత్యాధునిక హైఎండ్ మాడ్యులర్ ఆపరేషన్ ధియేటర్లు అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, తుంటి ఎముక, మోకాళ్లు వంటి అవయవ మార్పిడి, మూగ, చెవుడు, వినికిడిలోపం గల చిన్నారులకు కాక్లియర్ శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవసరమైన ఆధునిక ఆపరేషన్ థియేటర్లను గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం ఎనిమిదవ అంతస్థులో నిర్మించనున్నారు. గాంధీలో చికిత్స పొందుతున్న రోగికి ఇతర దేశాలు, ప్రాంతాల నుంచి ఆపరేషన్ నిర్వహించేందుకు ప్రత్యేకంగా రోబోటిక్ సర్జరీ థియేటర్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. గాంధీలో అవయవ మార్పిడి థియేటర్ల కోసం ఐదేళ్ల క్రితమే ప్రతిపాదనలు సిద్ధం చేయగా, వైద్య మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో సాకారం అయ్యేదిశగా ముందడుగు పడింది. ► గాంధీఆస్పత్రి 8వ అంతస్తులో అందుబాటులో ఉన్న సుమారు లక్ష చదరపు అడుగుల వైశాల్యంలో రూ.35 కోట్ల వ్యయంతో ఆరు హైఎండ్ మాడ్యులర్ థియేటర్లను నిర్మిస్తున్నారు. అక్కడ ఉన్న నర్సింగ్ స్కూలు, హాస్టల్, నర్సింగ్, నన్ సిస్టర్స్ క్వార్టర్స్‌ను ఇతర ప్రదేశాలకు తరలించారు. ► అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ ఆపరేషన్ థియేటర్లు ఇన్ఫెక్షన్ కంట్రోల్ నూటికి నూరుశాతం ఉండటంతో సర్జరీల సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఆపరేషన్ థియేటర్లోని గాలిని పరిశుభ్రం చేసేందుకు లామినార్ ఫ్లో, వైరస్, బాక్టీరియాలను నాశనం చేసేందుకు హెఫాఫిల్టర్స్ను వినియోగిస్తారు. ► మాడ్యులర్ థియేటర్లకు అనుసంధానంగా ఐసీయు, స్టెప్‌డౌన్ వార్డులు, రోగులను సిద్ధం చేసేందుకు కౌన్సిలింగ్ విభాగం, సర్జరీ అనంతరం పర్యవేక్షణ విభాగాలను ఏర్పాటు చేస్తారు. నిష్ణాతులైన వైద్య, నర్సింగ్ సిబ్బందిని నియమిస్తారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ► ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో కొనసాగుతున్న సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాన్ని గాంధీకి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. రోబోటిక్ సర్జరీలు నిర్వహించేందుకు సంబంధిత వైద్యులకు శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. ► ‘హైఎండ్ మాడ్యులర్ ధియేటర్ల టెండర్ల ప్రక్రియ కొలిక్కివచ్చింది. తెలంగాణ వైద్యవిద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ నేతృత్వంలో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. రోబోటిక్, మాడ్యులర్ థియేటర్లు అందుబాటులోకి వస్తే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సర్జరీలు చేయడం, వీక్షించే అవకాశం కలుగుతుంది’ అని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. (క్లిక్: Omicron BF.7 ముంచుకొస్తున్న నాలుగో వేవ్?!) -
గాంధీ ఆసుపత్రిలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
-
అలాంటి వాళ్ల వల్ల మహాత్ముడి ఔన్నత్యం ఏమాత్రం తగ్గదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: గాంధీ జయంతిని (అక్టోబర్ 2) పురస్కరించుకొని సీఎం కేసీఆర్ మహత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన 16 ఫీట్ల గాంధీజీ విగ్రాహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. అంతకుముందు గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ ఎంజీరోడ్‌లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విగ్రహావిష్కరణ అనంతరం.. ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రి వైద్యులు విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. గాంధీ వైద్యులు కరోనాపై యుద్ధం చేశారన్నారు. మంచి జరిగితే తప్పక ప్రశంసలు వస్తాయన్నారు. ‘మహాత్ముడి సిద్ధాంతం విశ్వజనీనం. మహాత్ముడు జన్మించిన దేశంలో మనం పుట్టడం ఎంతో పుణ్యం. ఆనాడు యావత్తు భారతాన్ని నడిపించిన సేనాని మహాత్మా గాంధీ. గాంధీ ఏ కార్యక్రమం చేసినా అద్భుతమే, గొప్ప సందేశమే. గాంధీ ప్రతి మాట, పలుకు ఆచరణాత్మకం. పట్టణ, పల్లె ప్రగతికి ప్రేరణ గాంధీయే. గాంధీ మార్గంలోనే తెలంగాణ సాధించుకున్నాం. ఈ మధ్య వేదాంత ధోరణిలో నా మాటలు ఉన్నాయని చాలా మంది అంటున్నారు. ప్రపంచంలో శాంతి ఉంటేనే మనమంతా సుఖంగా ఉంటాం. ఎన్ని ఆస్తులు ఉన్నా శాంతి లేకపోతే, జీవితం ఆటవికమే. ఈ మధ్య మహాత్ముడినే కించపరిచే మాటలు మనం వింటున్నాం. ఆయనను కించపరిచే మాటలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. అలాంటి వాళ్ల వల్ల మహాత్ముడి ఔన్నత్యం ఏమాత్రం తగ్గదు’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
నేడు గాంధీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్
-
సీఎం కేసీఆర్ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: గాంధీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ► సెయింట్ జాన్స్ రోటరీ, క్లాక్‌టవర్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు చిలకలగూడ చౌరస్తాకు అనుమతించరు. సంగీత్ క్రాస్‌రోడ్డు నుంచి ఆలుగడ్డబావి మీదుగా మళ్లిస్తారు. ► ఆలుగడ్డబావి నుంచి ముషీరాబాద్ మార్గం మూసివేస్తారు. ఆలుగడ్డబావి నుంచి వచ్చే వాహనాలు చిలకలగూడ క్రాస్‌రోడ్డు నుంచి సీతాఫల్మండి, వారాసిగూడ, విద్యానగర్, నల్లకుంట మీదుగా మళ్లిస్తారు. ► ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి సికింద్రాబాద్ మార్గంలో వాహనాలకు అనుమతించరు. ముషీరాబాద్ క్రాస్‌రోడ్డు నుంచి కవాడిగూడ, ఆర్పీరోడ్డు మీదుగా మళ్లిస్తారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు అమలులో ఉంటాయి. ► గాంధీ ఆస్పత్రి ఎదుట మహాత్ముని విగ్రహావిష్కరణ, బహిరంగ సభలకు వచ్చే వాహనాలను బోయిగూడ వై జంక్షన్ వద్దగల పారామౌంట్ అపార్ట్మెంట్, అపార్ట్మెంట్ పక్కనగల గ్రేవియార్డ్ రోడ్డులో ఫోర్‌వీలర్ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. వాటర్‌బోర్డు ఆఫీస్ వద్ద ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించారు. -
చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ అగ్ని ప్రమాద మృతులతో గాంధీ మార్చురీ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. మూడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వాయుమార్గంతో పాటు ప్రత్యేక అంబులెన్స్‌ల్లో స్వస్థలాలకు తరలించారు. మిగిలిన అయిదు మృతదేహాలకు సంబంధించి ఆయా వ్యక్తుల సంబంధీకుల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించగా, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ కృపాల్‌సింగ్‌ల నేతృత్వంలో మూడు వైద్య బృందాలు పోస్టుమార్టం విధులు నిర్వహించారు. విషవాయువుల వేడి పొగతోనే.. బ్యాటరీలకు మంటలు అంటుకుని కెమికల్ టాక్సిన్స్ (విష వాయువులు)తో కూడిన వేడి పొగ పీల్చడం వల్లే ఊపిరి అందక మృతి చెందినట్లు ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాల ఊపిరితిత్తులకు అంటుకున్న పొగతో కూడిన విషవాయువు (స్మాగ్) కడుపు, ఇతర అవయవాల నుంచి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. మృత్యువు పిలిచినట్టు.. విజయవాడకు చెందిన అల్లాడి హరీష్‌ను మృత్యువు పిలిచిందని ఆయన స్నేహితుడు శ్రీనివాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈక్వటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో పనిచేస్తున్న హరీష్ ట్రైనింగ్ నిమిత్తం నగరానికి వచ్చే ముందే సికింద్రాబాద్ మినర్వా గ్రాండ్ లాడ్జీలో బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి ప్రమాదంలో మృతి చెంది కానరాని లోకాలకు వెళ్లిపోయాడని భోరున విలపించారు. మృతునికి భార్య కావ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు పన్నెండు రోజుల క్రితమే జన్మించాడు. మార్చురీలో హరీష్ మృతదేహాన్ని చూసి ఆయన తండ్రి కోటేశ్వరరావు రోదనలు కలచివేశాయి. చెన్నై నుంచి వచ్చి.. మృత్యువాత విధి నిర్వహణలో భాగంగా చెన్నై నుంచి నగరానికి వచ్చి రూబీ లాడ్జీలో బస చేసి అగ్నిప్రమాదంలో మృతి చెందారు ఆచీ మసాల సంస్థ ఉద్యోగులు బాలాజీ, సీతారామన్‌లు. ఆచీ మసాల ఆడిటర్ బాలాజీ, రీజనల్ సేల్స్ మేనేజర్ సీతారామన్‌లు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించి, రాత్రి 8 గంటలకు లాడ్జీకి వచ్చి అగ్ని ప్రమాదంలో అసువులు బాశారని ఆచీ మసాల స్థానిక సేల్స్ మేనేజర్ మహేందర్ కన్నీటి పర్యంతమయ్యారు. బాలాజీ, సీతారామన్‌ల మృత దేహాలను విమానంలో చెన్నైకి తరలించారు. ఢిల్లీకి చెందిన అన్నదమ్ములు... ఢిల్లీకి చెందిన సందీప్ మాలిక్, రాజీవ్ మాలిక్‌లు అన్నదమ్ములు. ఆలివ్ కంపెనీలో శిక్షణ కోసం సిటీకి వచ్చి రూబీ లాడ్జీలో బస చేసి మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న మృతుల బంధువులు నగరానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందే ఆ లాడ్జి మొదటి అంతస్తులోని రూమ్ నుంచి చెక్ఔట్ చేసిన ముగ్గురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. (క్లిక్ చేయండి: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనకు కారణం అదే) -
‘సినిమా సర్జరీ’ వైద్యులకు చిరు అభినందన
గాంధీఆస్పత్రి: ‘సినిమా చూపిస్తూ సర్జరీ చేసేశారు’శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి ప్రముఖ సినీనటుడు చిరంజీవి స్పందించారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఆ సర్జరీపై ఆయన ఆరా తీశారు. యాదాద్రి జిల్లాకు చెందిన మహిళారోగి(60) మెదడులోంచి కణితిని తొలగించేందుకు గాంధీ ఆస్పత్రి వైద్యులు గురువారం అవేక్ క్రేనియాటోమి సర్జరీ చేశారు. ఈ సర్జరీ చేస్తున్నప్పుడు నిరంతరాయంగా ఆమెను స్పృహలో ఉంచేందుకు ‘నీకు ఏ హీరో అంటే ఇష్టం’అని వైద్యులు అడగగా నాగార్జున, చిరంజీవి అంటే ఇష్టమని చెప్పింది. చిరంజీవి నటించిన సినిమాల్లో ఏది ఇష్టమని అడిగితే ‘అడవిదొంగ’ఇష్టమని చెప్పడంతో ఆ సినిమాను ఆమెకు కంప్యూటర్ ట్యాబ్‌లో చూపిస్తూ వైద్యులు సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ‘సాక్షి’లో వచ్చిన ఈ కథనాన్ని చదివి అబ్బురపడిన చిరంజీవి తన పీఆర్వో ఆనంద్‌ను శుక్రవారం గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, సర్జరీ చేసిన వైద్యులు, సర్జరీ జరిగిన మహిళను ఆనంద్ కలిశారు. తాను చిరంజీవి వీరాభిమానినని, ఆయన నటించిన అన్ని సినిమాలు చూస్తానని, ‘అడవిదొంగ’సినిమాలో చిరంజీవికి మాటలు రావని ఆమె చెప్పిన మాటలను పీఆర్వో వీడియో రికార్డింగ్ చేసి చిరంజీవికి వినిపించారు. ఆమె అభిమానానికి ఫిదా అయిన చిరంజీవి సర్జరీ చేసిన వైద్యులను అభినందించారు. మహిళారోగిని పరామర్శించేందుకు చిరంజీవి రెండురోజుల్లో గాంధీ ఆస్పత్రిని సందర్శిస్తారని పీఆర్వో సూపరింటెండెంట్‌కు చెప్పారు. సర్జరీ చేసిన వైద్యులకు సన్మానం అరుదైన సర్జరీని విజయవంతంగా నిర్వహించిన వైద్యులకు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తన చాంబర్లో శుక్రవారం పుప్పగుచ్ఛాలు అందించి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. న్యూరోసర్జరీ విభాగాధిపతి శ్రీనివాస్, వైద్యులు ప్రతాప్‌కుమార్, నాగరాజు, శ్రీదేవి, సారయ్య, ప్రతీక్ష, టీజీజీడీఏ గాంధీ యూనిట్ అధ్యక్షుడు రాజేశ్వరరావు, ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ మెడిసిన్ హెచ్వోడీలు సుబోధ్‌కుమార్, వినయ్‌శేఖర్ తదతరులు పాల్గొన్నారు. -
గాంధీ మెడికల్ కాలేజీ వద్ద వైద్య విద్యార్థుల ధర్నా
గాంధీఆస్పత్రి: కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన సప్లమెంటరీ పరీక్షలు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం జరగలేదని, మరోమారు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పలు మెడికల్ కాలేజీలకు చెందిన ఎంబీబీఎస్ ఫస్టియర్ వైద్యవిద్యార్థులు సికింద్రాబాద్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. పరీక్షపత్రంలో లోపాలు ఉన్నాయని, సంబంధం లేని ప్రశ్నలు ఇవ్వడంతో రాష్ట్రంలో పది శాతం అంటే 530 మంది విద్యార్థులు పరీక్ష ఫెయిల్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రీకరెక్షన్ లేదా మరోమారు పరీక్ష నిర్వహించి తమకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీలకు చెందిన వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు. -
మంకీపాక్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్/గాంధీఆస్పత్రి: దేశంలోకి మంకీపాక్స్ ప్రవేశించడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తిని నివారించడానికి అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఆయన వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను అన్ని జిల్లాల వైద్యాధికారులకు, ప్రభుత్వ ఆసుపత్రులకు పంపారు. మంకీపాక్స్ పరీక్షించడానికి దేశంలో 15 ప్రయోగశాలలకు కేంద్రం అనుమతించగా అందులో రాష్ట్రంలోని గాంధీ ఆస్పత్రి ప్రయోగశాలను గుర్తించిందన్నారు. మంకీపాక్స్‌పై 90302 27324కు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని పంపించవచ్చని, నేరుగా మాట్లాడాలనుకునేవారు 040– 24651119 నెంబరుకు ఫోన్ చేయాలని శ్రీనివాసరావు తెలిపారు. గాంధీలో మంకీపాక్స్ పరీక్షలు రెండు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. -
అవయవ మార్పిడి నోడల్ సెంటర్‌గా గాంధీ ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. అవయవాల మార్పిడి సర్జరీల నోడల్ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేయనున్నారు. అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటుకు రూ. 30 కోట్ల నిధులు కేటాయించగా, తెలంగాణ వైద్యవిద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఆధ్వర్యంలో త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి డిటెల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)కు వైద్యశాఖ మంత్రి హరీష్‌రావు ఇటీవలే ఓకే చెప్పారని ఆస్పత్రికి చెందిన ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వ సెక్టార్లో ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రుల్లో అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఒకటి రెండు అవయవమార్పిడి సర్జరీలు విజయవంతంగా చేపట్టినప్పటికీ అవసరమైన ఆధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో అవయవ మార్పిడిపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. గాంధీలోఅవయవ మార్పిడి ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితమే ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. రోబోటిక్‌తోపాటు హైఎండ్ మాడ్యులర్ థియేటర్లు.. ఆస్పత్రి ప్రధాన భవనం ఎనిమిదవ అంతస్తులో రోబోటిక్ థియేటర్‌తోపాటు గుండె, మూత్రపిండాలు, కాలేయం, కాక్లియర్, కీళ్లమార్పిడి తదితర తొమ్మిది హైఎండ్ మాడ్యులర్ థియేటర్లు ఏర్పాటు చేయనున్నారు. బాక్టీరియా, వైరస్ థియేటర్లతోకి ప్రవేశించకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాన్ని ఉస్మానియా నుంచి గాంధీకి తరలించేందుకు సన్నాహాలు చేపట్టారు. అంతేకాక సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గాంధీఆస్పత్రిని దేశంలోనే అత్యన్నతంగా తీర్చిదిద్ధుతామని గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. (క్లిక్: రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి అనూహ్య స్పందన) -
కాంగ్రెస్ నేతల అరెస్టుల పర్వం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం, పోలీసు కాల్పుల్లో ఒకరు మృతి చెందిన నేపథ్యంలో శనివారమంతా కాంగ్రెస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగింది. శనివారం ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డిని పోలీసులు తొలుత అదుపులోనికి తీసుకున్నారు. సికింద్రాబాద్ పోలీసు కాల్పుల్లో చనిపోయిన రాకేశ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వరంగల్ బయలుదేరిన ఆయన్ను ఘట్కేసర్లో పోలీసులు అడ్డుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో తనను అరెస్టు చేయడమేంటని, వరంగల్ ఎందుకు వెళ్లకూడదో చెప్పాలని పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. పలువురు నేతలు ఘట్కేసర్కు చేరుకుని రేవంత్‌కు సంఘీభావం ప్రకటించారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను నగరంలోని పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని గోల్కొండ పీఎస్‌కు తరలించారు. దీంతో వెంకట్‌ను విడుదల చేయాలంటూ పీఎస్‌కు వెళ్లిన జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని వరంగల్‌లో రాకేశ్ అంత్యక్రియలు పూర్తయ్యాక వదిలివేస్తామని చెప్పారు. సికింద్రాబాద్ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నేతలు అనిల్‌కుమార్ యాదవ్, శివసేనారెడ్డిలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కాగా, రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం ఘట్కేసర్ పీఎస్ నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. గోల్కొండ పీఎస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నందునే ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌పై పోలీసులు ఫోకస్ చేశారని మండిపడ్డారు.అరెస్టులు కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదని, కేసుల సంఖ్య పెరిగే కొద్దీ కేడర్ ఇంకా ఉత్సాహంగా పనిచేస్తుందని జగ్గారెడ్డి చెప్పారు. చావులపై టీఆర్ఎస్ రాజకీయం: రేవంత్ ఘట్కేసర్: చావులను కూడా టీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని రేవంత్ మండిపడ్డారు. రాకేశ్‌ను టీఆర్ఎస్ చంపిందని, బీజేపీ చంపించిందని ఆయన ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన నిరసనలో మృతి చెందిన రాకేశ్ కుంటుంబ సభ్యులను పరామర్శించడానికి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం డబ్బీర్పేటకు బయలుదేరిన రేవంత్‌రెడ్డిని ఘట్‌కేసర ఓఆర్ఆర్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం విడుదలైన అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా తన నియోజకవర్గంలో తిరిగే హక్కులేదా అని ప్రశ్నించారు. 70 ఏళ్లుగా ఆర్మీ జవాన్ల నియామకాలు నిబంధనల మేరకు జరిగాయని, మోదీకి పోయేకాలం రావడంతో కేవలం నాలుగు ఏళ్లు సైన్యంలో పనిచేసే అవకాశం కల్పించారని అన్నారు. నాలుగేళ్ల అనంతరం ఆర్మీ శిక్షణ పొందిన యువతకు ఎక్కడా ఉద్యోగం లభించకపోతే నక్సలైట్లలో కలవాలా అన్ని ప్రశ్నించారు. రాకేశ్ శవయాత్రను టీఆర్ఎస్ పార్టీ జెండాలతో ర్యాలీగా నిర్వహించవచ్చు కాని టీపీసీసీ అధ్యక్షుడిగా తాను వెళతానంటే అడ్డంకులు çసృష్టిస్తారా అని ప్రశ్నించారు. కాగా, రేవంత్‌రెడ్డిని కలవడానికి ఘట్కేసర్ పోలీసుస్టేషన్‌కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే, వరంగల్ వె‹స్ట్ నియోజవర్గ ఇన్చార్జి కొండా సురేఖను పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్‌రెడ్డి ఉన్న గదిలోకి వెళ్లకుండా డోర్ మూసివేశారు. డోర్ తీయని పక్షంలో తన దగ్గర ఉన్న సర్జికల్ బ్లేడుతో చేయి కోసుకుంటానని ఆమె బెదిరించింది. మహిళాపోలీసులు అక్కడి నుంచి ఆమెను దూరంగా తీసుకుపోయే ప్రయత్నం చేశారు. -
అక్క స్ఫూర్తి, అన్న ఆశయం కోసం..
ఖానాపురం: అక్క బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్.. అన్న కూడా ఆర్మీలో చేరేందుకు చాలా ప్రయత్నించి విఫలమయ్యాడు.. ఆ అక్కను స్ఫూర్తిగా తీసుకుని, అన్న ఆశయాన్ని తాను నెరవేర్చాలనుకుని శిక్షణ పొందాడు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పరుగు పందెం, దేహ దారుఢ్య పరీక్షల్లో విజయం సాధించాడు. రాత పరీక్ష పూర్తయితే ఆర్మీలో చేరడమే ఆలస్యమని అనుకున్నాడు. కానీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఆర్పీఎఫ్ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబ్బీర్‌పేట గ్రామానికి చెందిన దామెర రాకేశ్ (21) కథ ఇది. దబ్బీర్‌పేటకు చెందిన దామెర కుమారస్వామి–పూలమ్మలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల్లో రాకేశ్ చిన్నవాడు. బీఏ చివరి సంవత్సరం చదువుతున్నాడు. రాకేశ్ సోదరి రాణి, సోదరుడు రాంరాజ్ సైన్యంలో చేరేందుకు చాలాకాలం ప్రయత్నించారు. 2016 లో రాణి బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్‌గా ఎం పికై పశ్చిమబెంగాల్లో పనిచేస్తున్నారు. అక్కను స్ఫూర్తిగా తీసుకుని, అన్న ఆశయాన్ని నెరవేర్చాలని నిర్ణయించుకున్న రాకేశ్.. రెండేళ్ల క్రితం బాపట్లలో ఆర్మీ ఉద్యోగ శిక్షణ పొందాడు. 2021లో హకీంపేటలో జరిగిన రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని రాత పరీక్షకు అర్హత సాధించాడు. హకీంపేటలో అర్హత సాధించినవారు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూప్‌లో.. ఆందోళన కార్యక్రమం గు రించి తెలిసి స్నేహితులతో కలిసి సికింద్రాబాద్‌కు వచ్చా డు. రైల్వేస్టేషన్లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. నేడు దబ్బీర్‌పేటలో అంత్యక్రియలు! రాకేశ్ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం.. ప్రత్యేక అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని తమకు చూపకుండానే మార్చురీకి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నేతలు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగగా.. శనివారం ఉదయం అప్పగిస్తామని పోలీసులు సర్దిచెప్పారు. రాకేశ్ మృతదేహానికి శనివారం దబ్బీర్‌పేటలో అంత్యక్రియలు జరుగుతాయని పోలీసువర్గాలు తెలిపాయి. మోదీ నా కొడుకును చంపాడు నా కొడుకు పట్టుదలతో చదువుకుంటున్నాడు. ఉద్యోగం సాధిస్తాడనే నమ్మకం ఉండేది. కానీ నా బిడ్డను కేంద్రం పొట్టన పెట్టుకుంది. నరేంద్ర మోదీ నా కొడుకును చంపాడు. ఉద్యోగం రాకున్నా కష్టపడి సాదుకునేవాడిని. నా కొడుకును కనుమరుగు చేశారు. మాకు న్యాయం కావాలి. అంతవరకు మృతదేహానికి అంత్యక్రియలు చేయబోం.. – దామెర కుమారస్వామి, రాకేశ్ తండ్రి ప్రాణం పోయినా పోరాటం ఆగదు ఛాతీలో పిల్లెట్ గాయంతో యువకుడి వీడియో వైరల్ గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): ‘‘2021లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో రన్నింగ్, ఫిజికల్, మెడికల్ టెస్ట్‌ల్లో పాసయ్యాను. రెండేళ్లవుతున్నా రాతపరీక్ష నిర్వహించలేదు. ఇప్పుడు అగ్నిపథ్ అంటున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ధర్నా చేస్టుంటే కాల్చారు. ప్రాణం పోయినా మా పోరాటం ఆగదు. ఒకవేళ నేను చనిపోతే పోలీసులు, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కారణం..’’.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కాల్పుల్లో గాయపడిన లక్కం వినయ్ (20) బాధ ఇది. పోలీసులు జరిపిన కాల్పుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన వినయ్‌కు ఛాతీపై కుడి భాగంలో పిల్లెట్ తగిలి తీవ్ర గాయమైంది. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో అంబులెన్స్ సిబ్బంది వినయ్‌తో మాట్లాడుతూ వీడియో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వినయ్‌కు చిన్నపాటి శస్త్రచికిత్స చేశామని, ఆరోగ్యం నిలకడగానే ఉందని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. -
బాధితులకు సరైన చికిత్స అందించండి
సాక్షి, హైదరాబాద్: ‘అగ్నిపథ్’ పథకంపై సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిరసనలో గాయపడిన 13 మందికి సరైన చికిత్స అందించాలని గాంధీ ఆసుపత్రి అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. -
సర్కారు ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు
గాంధీఆస్పత్రి: ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రూ.11,440 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రూ.23 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎమ్మారై స్కానింగ్ మిషన్, క్యాథ్‌ల్యాబ్‌లను ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణలోని ఆస్పత్రులు నిర్లక్ష్యానికి గురైతే.. కేసీఆర్ ప్రభుత్వం నగరం నలుదిక్కులా అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టిందన్నారు. త్వరలో గాంధీ, పేట్లబురుజు (హైదరాబాద్), వరంగల్ ఆస్పత్రుల్లో రూ.7.50 కోట్లతో సంతాన సాఫల్య కేంద్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్‌లో 259 బస్తీ దవాఖానాలు ఉండగా, కొత్తగా 91 దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నూతన డైట్‌క్యాంటిన్ నిర్మాణం, 20వేల కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంక్‌లనూ హరీశ్‌రావు ప్రారం భించారు. కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మ న్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, డీఎంఈ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెంచింది చాంతాడు... తగ్గించింది బెత్తెడు పెట్రో ధరలను చాంతాడంత పెంచి, బెత్తెడు తగ్గించి తామే తగ్గించామని బీజేపీ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 2014 మార్చిలో డీజిల్‌పై సెస్సు రూ.3.46 ఉండగా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.31కి పెంచేశారన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు మోదీ ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోందని, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. -
రోగులకు ఊరట
గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో అత్యాధునిక వైద్య యంత్రాలు క్యాథ్‌ల్యాబ్, ఎమ్మారై స్కానింగ్ మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఆదివారం మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మెహమూద్‌ఆలీలతో కలిసి వైద్య శాఖ హరీష్‌రావు వీటిని ప్రారంభిస్తారని గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. గాంధీ రేడియాలజీ, కార్డియాలజీల్లో 2010లో ఏర్పాటు చేసిన ఎమ్మారై, క్యాథ్‌ల్యాబ్‌లు కాలపరిమితి ముగియడంతో తరచూ మొరాయిస్తున్నాయని ఆస్పత్రి పాలనాయంత్రాంగం విజ్ఞప్తికి మంత్రి హరీష్‌రావు స్పందించి ఆదేశాలు జారీ చేయడంతో రూ.9.5 కోట్లతో ఎమ్మారై స్కానింగ్, రూ.13.5 కోట్లతో క్యాథ్‌ల్యాబ్‌ను కొనుగోలు చేశారు. కరోనా లాక్డౌన్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం తదితర కారణాలతో ఆయా యంత్ర విడిభాగాలు ఇతర దేశాల నుంచి దిగుమతి కావడంలో జాప్యం ఏర్పడింది. మంత్రి ఆదేశాల మేరకు జర్మనీ, జపాన్ దేశాల నుంచి వాయు మార్గంలో యంత్ర విడిభాగాలను దిగుమతి చేసుకుని, నిరుపేద రోగులకు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. -
గాంధీ వైద్యుల ‘ఆరు’దైన సర్జరీలు
గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆరు గంటల వ్యవధిలో ఆరుగురు రోగులకు మోకాలిచిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు వివరాలు వెల్లడించారు. గాంధీ ఆర్థోపెడిక్ విభాగ ప్రొఫెసర్ వాల్యా నేతృత్వంలో ఈ నెల 18న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, బీహెచ్ఈఎల్ లింగంపల్లి, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్, కర్నూలు జిల్లా కొత్తకోట, హైదరాబాద్ జిల్లా అంబర్‌పేట, సూర్యాపేట జిల్లాకు చెందిన నాగమునీంద్ర(63), నాగమణి (40), మంగమ్మ (55), రామాచారి (56), విజయలక్ష్మి (69), పున్నమ్మ (68)లకు మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. వైద్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిలో పెద్దసంఖ్యలో మోకాలిచిప్ప మార్పిడి సర్జరీలు చేపట్టారు. ఒకేరోజు ఆరు గంటల్లో ఆరు సర్జరీలు సక్సెస్ కావడం అరుదైన విషయమని డాక్టర్ రాజారావు అన్నారు. మోకాలిచిప్ప మార్పిడి సర్జరీలు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేయించుకుంటే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు ఖర్చు అయ్యేదని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్భారత్ పథకాల ద్వారా వీటిని ఉచితంగా నిర్వహించామని వివరించారు. సర్జరీల్లో పాల్గొన్న వైద్యులకు డీఎంఈ, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రమేశ్‌రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, డిప్యూటీలు నర్సింహరావునేత, శోభన్‌బాబు అభినందించారు. -
ఆ వెబ్సైట్ మాకు ఇప్పించండి!
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నిర్వాహకులకు చిత్రమైన సమస్య వచ్చిపడింది. కొన్నేళ్ల క్రితం మెడికల్ కాలేజీతో సంయుక్తంగా వీరు తయారు చేయించిన వెబ్సైట్ ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో కనీసం అప్డేట్ చేయడానికి సాధ్యం కావట్లేదని, ఆ వెబ్‌సైట్‌ను తమకు ఇప్పించాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై సమాలోచన చేస్తున్నారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ► గాంధీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీలకు కలిపి కొన్నేళ్ల క్రితం గాంధీహాస్పిటల్.ఇన్ పేరుతో వెబ్సైట్ రూపొందించారు. ప్రైవేట్ సంస్థ యూసీ ద్వారా దీనిని తయారు చేయించడంతో పాటు వాళ్లే నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ► యూసీ సంస్థ ఈ వెబ్‌సైట్‌ను మరో సంస్థకు చెందిన సర్వర్‌లో హోస్ట్ చేసింది. దీని నిమిత్తం నిర్ణీత సమయానికి సర్వర్ నుంచి స్పేస్ ఖరీదు చేయడంతో పాటు రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. ► అలా కాని పక్షంలో సదరు వెబ్సైట్ ఓపెన్ స్పేస్‌లోకి వచ్చేయడంతో పాటు మరొకరు ఖరీదు చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కొన్నాళ్లుగా గాంధీ ఆసుపత్రి వర్గాలు రెన్యువల్ చేయించలేదు. ► దీనికితోడు యూసీ సంస్థ కూడా నిర్వహణ బాధ్యతల నుంచి వైదొలగింది. సర్వర్‌ను అందించిన సంస్థ ఈ సైట్‌ను సేల్‌లో పెట్టడంతో డైనాడాట్.కామ్ వారు కొనుగోలు చేయడంతో వెబ్సైట్ పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ► ఇటీవల ఆ వెబ్‌సైట్‌ను అప్డేట్ చేయడానికి గాంధీ ఆసుపత్రి నిర్వాహకులు ప్రయత్నించినా సా ధ్యం కాలేదు. యాక్సస్ కూడా లేక పోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఆరా తీయగా వెబ్సైట్ డైనాడాట్.కామ్ చేతిలో ఉన్నట్లు గుర్తించారు. ► ఆసుపత్రి నిర్వాహకులు సదరు సంస్థతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు గత వారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అధీకృతం కాని వారి చేతిలో వెబ్సైట్ ఉందని ఆరోపించారు. ► ఈ ఫిర్యాదు ఆధారంగా ఐపీసీలోని 419, ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 66–డీ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా డైనాడాట్.కామ్‌ను సంప్రదించి కంటెంట్‌తో ఉన్న వెబ్సైట్ ఎలా ఆధీనంలో ఉంచుకుంటారని ప్రశ్నించారు. (చదవండి: ఆన్లైన్లో అమెరికాకే ‘మత్తు’) ► ఆ వెంటనే స్పందించిన ఆ సంస్థ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ మొత్తం తొలగించింది. ఈ విషయంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సైబర్ క్రైమ్ పోలీసులు సమాలోచన చేస్తున్నారు. చట్ట ప్రకారం ఆ సంస్థపై చర్యలకు ఆస్కారం లేదని తెలుస్తోంది. ► సాధారణంగా ప్రభుత్వ వెబ్సైట్లన్నీ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఆధీనంలో జీఓవీ.ఇన్‌తో రూపొందుతాయి. ఇలాంటి వెబ్సైట్లు పూర్తి భద్రమైనవే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లవు. గాంధీ ఆసుపత్రి నిర్వాహకులు అలా చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు పేర్కొంటున్నారు. (క్లిక్: 300 మందికి పైగా ఔట్సోర్సింగ్ జేపీఎస్‌లకు ఉద్వాసన) -
అమర్నాథ్ యాత్రికులకు మెడికల్ సర్టిఫికెట్లు.. దరఖాస్తు ఇలా..
సాక్షి, హైదరాబాద్: అమర్నాథ్ వెళ్లే యాత్రికులకు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో వైద్యపరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు నిర్ధేశించిన మెడికల్ బోర్డు నుంచి తప్పనిసరిగా ఆరోగ్య ధృవీకరణ పత్రం పొందాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో గత రెండేళ్లుగా అమర్నాథ్ యాత్ర నిలిపివేశారు. ఈ కారణంగా ఈ ఏడాది యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రతివారం 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నామని, ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటే వారికే వరుస క్రమంలో వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. మెడికల్ బోర్డు కమిటీ ఎంపిక చేశామని, నితిన్‌కాబ్రా (కార్డియాలజీ) సత్యనారాయణ (ఆర్ధోపెడిక్), కృష్ణమూర్తి(ఫల్మనాలజీ), రవీందర్ (జనరల్ మెడిసిన్) వైద్యులు బోర్డు సభ్యులుగా కొనసాగుతారని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. దరఖాస్తు ఇలా... యాత్రికులు ఆథార్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో గాంధీ మెడికల్ రికార్డు సెక్షన్లో సంప్రదించాలి. దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత వరుస క్రమంలో వచ్చే తేదీని నిర్ణయిస్తారు. సదరు తేదీ రోజు గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం మొదటి అంతస్తు ఎంఆర్డీ సెక్షన్ కార్యాలయంలో మెడికల్ బోర్డు వైద్యుల నిర్వహించే వైద్య పరీక్షలకు నేరుగా హాజరుకావాలి. (క్లిక్: సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు) చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవీ.. కంప్లీట్ బ్లడ్ ప్రొఫిల్లింగ్ (సీబీపీ), ఆర్థరైటీ సెడిమెంటేషన్ రేట్ (ఈఎస్ఆర్), కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ (సీయు ఈ), గ్లూకోజ్ ర్యాండమ్ బ్లడ్ సుగర్ (జీఆర్బీఎస్) బ్లడ్ యూరియా, సీరం క్రియేటిన్, ఎలక్టోకార్డియా గ్రామ్(ఈసీజీ), ఎక్స్‌రే చెస్ట్ వైద్యపరీక్షల నివేదికలను కమిటీ ముందుంచాలి. యాభై ఏళ్ల వయసు పైబడినవారు పై నివేదికలతోపాటు రెండు మోకాలి (బోత్ నీస్) ఎక్స్‌రేలు జతచేయాలి. మెడికల్ బోర్డు సభ్యులు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. (క్లిక్: చింత చెట్టుపై వింత ఇల్లు .. 20 ఏళ్ల క్రితమే!) -
Covid 4th Wave: ఫోర్త్ వేవ్‌కు అవకాశాలు తక్కువ.. కానీ
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి పీడ పూర్తిగా తొలగిపోలేదని, వచ్చేనెలలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందని, ఫోర్త్‌వేవ్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వివరించారు. ప్రస్తుతం ఉన్న డెల్టా, ఒమిక్రాన్, ఎక్స్‌ఈలు సబ్ వేరియంట్లని, వీటి ప్రభావం తక్కువగా ఉంటుందని, కరోనా కొత్త వేరియంట్లపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రూపాంతరం చెందిన కరోనా వైరస్ కొత్త వేరియంట్లు ప్రతి ఆరునెలలకు ఒకసారి పుట్టుకొస్తున్నాయని, మూడో వేవ్‌లో నూతన వేరియంట్ ఒమిక్రాన్ బలహీనపడి పెద్దగా ప్రభావం చూపించలేదన్నారు. రూపాంతరం చెందిన కరోనా వైరస్ మే, జూన్ నెలల్లో నాలుగో వేవ్ రూపంలో కాకున్నా కొంతమేర ప్రభావం చూపించడంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్యనిపుణులు అంచనాకు వచ్చారని తెలిపారు. చదవండి: Corona: కరోనా ఫోర్త్ వేవ్ హెచ్చరిక! నెలరోజులుగా సింగిల్ డిజిట్... కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితుల సంఖ్య గత నెలరోజులుగా సింగిల్ డిజిట్‌కే పరిమితమైందని, ప్రస్తుతం కేవలం నలుగురు పాజిటివ్ రోగులకు వైద్యసేవలు అందిస్తున్నామని రాజారావు తెలిపారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు -
4 గంటలు.. 3 సర్జరీలు
సాక్షి గాంధీ ఆస్పత్రి: గాంధీఆస్పత్రి ఆర్థోపెడిక్ వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. నాలుగు గంటల వ్యవధిలో ముగ్గురికి శస్త్ర చికిత్సలు చేసి ఔరా అనిపించారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరికి చెందిన ఆగయ్య (63), ఖమ్మం జిల్లా వాసి అయిలయ్య(65), ముషీరాబాద్‌కు చెందిన నీలవేని (50)లకు మోకాలి కీళ్ల మార్పిడి సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ వాల్యా ఆధ్వర్యంలో శనివారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఏకబిగిన మూడు కీళ్ల మార్పిడి సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా సర్జరీలు ఉచితంగా చేసినట్లు గాంధీ ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్, మైక్రోబయోలజీ హెచ్ఓడీ ప్రొఫెసర్ రాజేశ్వరరావు తెలిపారు. సర్జరీలో పాల్గొన్న ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ వాల్యా, అనస్థీషియా హెచ్ఓడీ బేబిరాణి, అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీదేవి, శ్రీనివాస నాయక్ అనీల్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అబ్బయ్య, కిరణ్, అక్రమ్‌లు అభినందలు అందుకున్నారు. (చదవండి: అంతు చిక్కని అస్వస్థత) -
చెత్తా చెదారం.. ఎలుకల సంచారం
వరంగల్‌లో పేరొందిన మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఒక రోగిని ఇటీవల ఎలుకలు దారుణంగా కొరికి గాయపరిచిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుమారు ఐదేళ్ల క్రితం ఉస్మానియా మార్చురీలో భద్రపరిచిన యువతి శవాన్ని ఎలుకలు, పందికొక్కులు కొరికిన ఘటన కూడా అప్పట్లో కలకలం రేపింది. మెదక్ ఆస్పత్రి మార్చురీలో కూడా మూడేళ్ల క్రితం ఓ మృతదేహాన్ని పందికొక్కులు పీక్కుతిన్నాయి. తాజాగా వరంగల్ ఘటనలో రోగి (కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఇతను తర్వాత హైదరాబాద్ నిమ్స్‌లో చనిపోయాడు) కాళ్ల నుంచి రక్తస్రావం అయ్యేలా ఎలుకలు కొరికేయడం.. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి, నిర్వహణపై చర్చకు తెరతీసింది. ఐసీయూలోనే ఇలా ఉంటే సాధారణ వార్డులు, గదులు ఎలా ఉంటాయోనన్న సందేహాలకు తావిచ్చింది. దీంతో ‘సాక్షి’.. రాజధాని హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వాసుపత్రులతో పాటు పలు జిల్లా కేంద్రాల్లోని సర్కారు దవాఖానాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించింది. సాక్షి, నెట్వర్క్/గాంధీ ఆస్పత్రి/నాంపల్లి /అఫ్జల్‌గంజ్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ కొరవడింది. అపరి శుభ్ర వాతావరణం రాజ్య మేలుతోంది. ఎటు చూసినా చెత్తాచెదా రం, ప్లాస్టిక్ కవర్లు దర్శనమిచ్చాయి. కొన్నిచోట్ల డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ అపరిశుభ్ర వాతావరణం ఎలుక లు, పంది కొక్కులు ఆస్పత్రులను తమ ఆవాసాలు గా చేసుకునేందుకు దోహదపడుతోంది. మరోవైపు రోగులు, వారి సహాయకులు.. తినగా మిగిలిన ఆహారాన్ని, ఇతర తినుబండారాలను పడవేస్తున్నారు. ఈ ఆహార వ్యర్థాల కోసం ఎలుకలు, పంది కొక్కులు ఆసుపత్రుల ఆవరణలో, వార్డుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆస్పత్రి ఆవరణను, వార్డులను శుభ్రంగా ఉంచాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో కుక్కలు, కోతులు, పాములు కూడా తిరుగుతున్నట్లు రోగులు, వారి సహాయకులు చెబుతున్నారు. ఇది మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి దుస్థితి. పాత ఐసీయూ వెనుక భాగంలో చెత్తా చెదారం పేరుకుపోయింది. పందులు, ఎలుకలకు ఆవాసంగా మారింది. నిర్లక్ష్యానికి కేరాఫ్ నిలోఫర్ నగరంలోని ప్రముఖ నవజాత శిశువుల సంరక్షణా కేంద్రమైన నిలోఫర్ ఆసుపత్రి అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారింది. ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండిపోయింది. పాత, కొత్త, లోపల, బయట అనే తేడా లేకుండా ఆసుపత్రిలోని అన్నిచోట్లా అపరిశుభ్రత నెలకొంది. రోగులు, సహాయకులు పడేసే ఆహారం కోసం చుట్టుపక్కల ఉన్న బస్తీల నుంచి ఎలుకలు ఆసుపత్రి వైపు వస్తున్నాయి. డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌లో ఉంటూ రాత్రివేళ ఆస్పత్రిలో సంచరిస్తున్నాయి. గాంధీ సెల్లార్లో ఫుల్లు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సెల్లార్లో ఎలుకలు, పందికొక్కులు స్వైర విహారం చేస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక అక్కడ మురుగునీరు చేరుతోంది. ప్రధాన భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లోని గైనకాల జీ, లేబర్‌వార్డు, పీడియాట్రిక్, పీఐసీయూ, ఎస్ఎన్సీయూ తదితర వార్డుల్లో ఎలుకల సంచా రం తరచూ కనిపిస్తోందని పలువురు రోగులు తెలిపారు. 2015లో నవజాత శిశువులకు వైద్యం అందించే ఎస్ఎన్సీయూ వార్డులో ఎలుకలు కనిపించడంతో అప్పట్లో చర్యలు చేపట్టారు. తాజాగా వరంగల్ ఎంజీఎం ఘటనతో అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి అధికార యంత్రా ంగం ఎలుకల నివారణకు గుళి కల ప్రయోగం చేపట్టడంతో పాటు పలు వార్డుల్లో బోన్లు, ర్యాట్ ప్యాడ్లను ఏర్పాటు చేశారు. పందికొక్కులకు ‘చిరునామా’ జనగామ జిల్లా వందపడకల ఆస్పత్రి ఆవరణలో డ్రెయినేజీలను తోడేస్తున్నాయి. జనరేటర్ ఏర్పాటు చేసిన గది ఆవరణ, ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించే ల్యాబ్ ముందు భాగం, జనరల్ వార్డు వెనకాల పెద్ద పెద్ద కన్నాలు ఏర్పడ్డాయి. ఎలుకల కోసం పాములు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి భవనం ముందు భాగాన్ని ఇటీవల అం దంగా తీర్చిదిద్దారు. కానీ లోపల వార్డులు, ఆసుపత్రి పరిసరాలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. వెనుక భాగం చెత్తాచెదారం, చెట్ల పొదలతో నిండిపోయింది. గత ఏడాది డిసెంబర్ 21న రాత్రి సమయంలో పేషెంట్ కేర్‌టేకర్‌గా పనిచేసే వేముల సంపత్‌ను ఆసుపత్రి ప్రాంగణంలోనే పాము కాటేసింది. అంతకుముందు కూడా ఆసుపత్రిలో పనిచేసే మరొకరిని పాము కాటు వేసింది. వార్డుల్లో ఎలుకలు తిరుగుతుండడంతో వాటి కోసం పాములు వస్తున్నాయని చెబుతున్నారు. పాత భవనం కావడంతో వార్డుల్లో గోడలకు కన్నాలు ఉండడం, అం దులో ఎలుకలు, బొద్దింకలు చేరడంతో వాటి కోసం పాములు వస్తున్నాయి. వంద పడకల యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణ చుట్టూ పందికొక్కులు రంధ్రాలు చేశాయి. పగలు, రాత్రి తేడాలేకుండా సంచరిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆస్పత్రి మార్చురీలో 4 ఫ్రీజర్ బాక్స్‌లు ఉండగా అవి పనిచేయడం లేదు. దీంతో రెండు శవాలను కిందపడేశారు. వాటి ని పురుగులు, దోమలు, ఈగలు పీక్కు తింటుండటంతో గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాయి. ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోంది. కాగా శానిటేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ‘సాక్షి’కి తెలిపారు. ఉస్మానియాలో కుక్కల వీరంగం పేదల పెద్దాసుపత్రి హైదరాబాద్‌లోని ఉస్మానియాలో కుక్కలు, కోతులు, పిల్లుల బెడద ఎక్కువగా ఉంది. ఆసుపత్రి పరిసరాల్లో కుక్కలు వీరంగం సృష్టిస్తుంటే, కోతులు రోగులు వారి సహాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఆసుపత్రి నుండి రోగి కోలుకొని తిరిగి వెళ్లే సమయంలో కొబ్బరికాయలు కొడుతుండడంతో వాటి కోసం కోతులు ఎగబడుతున్నాయి. 2017లో ఆత్మహత్యకు పాల్పడిన అఫ్జల్‌సాగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన కుటుంబసభ్యులు.. ముక్కు, పెదవుల్ని ఎలుకలు, పందికొక్కులు కొరికిన స్థితిలో ఉన్న యువతి శవాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. -
గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో నాలుగో అంతస్తులో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం తెలియడంతో సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆస్పత్రులేనా?ఎలుకల ఘటనతోనైనా మార్పు వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్/అఫ్జల్‌గంజ్/గాంధీఆస్పత్రి: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగిపై ఎలుకల దాడి ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఏకంగా ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తిని తీవ్రంగా గాయపర్చిన వైనం ప్రభుత్వాస్పత్రుల్లో డొల్లతనాన్ని కళ్లకు కట్టింది. రోగుల భద్రతను ప్రశ్నార్థకంలో పడేసింది. అంతా బాగానే ఉందంటున్న వైద్యాధికారుల నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపేలా చేసింది. ఈ నేపథ్యంలో నగరంలోని సర్కారు దవాఖానాలపై వైద్యశాఖ దృష్టి సారించాల్సిన ప్రాముఖ్యతను తెలియజెప్పింది. నగరంలోని ఆస్పత్రుల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉస్మానియాలో వానర విహారం.. నగరంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా ఆస్పత్రిలో చాలా కాలంగా కోతుల సందడి కొనసాగుతోంది. అవుట్ పేషెంట్ రోగులు వేచి చూసే ప్రాంతాల దగ్గర నుంచి అనేక చోట్ల కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఇప్పటి వరకూ ఇవి ఎవరినీ తీవ్రంగా గాయపరిచిన ఘటన జరగనప్పటికీ, వీటి విషయంలో పలువురు రోగులు ఇబ్బందులు పతున్నారు. ఇదే ఆస్పత్రిలోని ఇన్‌పేషెంట్ విభాగంలో పిల్లులు వీర విహారం చేసేవి. రోగుల మంచాల కింద గందరగోళం సృష్టించేవి. ఇటీవల పాత ఇన్‌పేషెంట్ విభాగం మూసేశారు. అయినప్పటికీ అక్కడక్కడా పిల్లులు దర్శనమిస్తూనే ఉంటాయి. ఆస్పత్రి ప్రాంగణంలో కుక్కల హల్చల్ కూడా తక్కువేమీ కాదు. పేట్లబురుజులో బొద్దింకలు.. పాతబస్తీలోని పేట్ల బురుజులో ఉన్న ఆధునిక ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో బొద్దింకలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎంతో కాలంగా ఈ ఆస్పత్రిలో బొద్దింకల బెడద తీవ్రంగా ఉన్నప్పటికీ..ఏ విధమైన నిర్మూలనా చర్యలు చేపట్టలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మూసీనది పక్కగానే ఉండడం వల్ల దోమలు సైతం విపరీతంగా ఉ న్నాయి. దీంతో రోగుల్లో ఆందోళన పెరుగుతోంది. తెలంగాణ వైద్యప్రదాయినీ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో శునకాలు, సెల్లార్‌లోని డైట్‌క్యాంటిన్ పరిసర ప్రాంతాల్లో ఎలుకలు, పందికొక్కులు స్వైర విహారం చేస్తున్నాయి. ఆస్పత్రి ప్రాంగణంతోపాటు వార్డుల్లోనూ శునకాలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి రోగి సహాయకులతోపాటు వచ్చిన శునకాలకు సమృద్ధిగా ఆహారం దొరకడంతో ఆస్పత్రి ప్రధాన భవనం, ఓపీ, అత్యవసర, మార్చురీలతోపాటు గాంధీ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలను ఆవాసాలుగా చేసుకుని పదుల సంఖ్యలో తిష్టవేశాయి. పోలీస్ అవుట్‌పోస్ట్ వద్ద శునకాలు నిత్యం తిష్ట వేయడం గమనార్హం. రోగులు, వైద్యులకు ఆహారాన్ని అందించే సెల్లార్లో కొనసాగుతున్న డైట్‌క్యాంటిన్ పరిసర ప్రాంతాల్లో ఎలుకలు, పందికొక్కులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. పాలు, కూరగాయలు, పప్పులు వంటి ఆహార పదార్థాలపై తిరుగుతుంటాయి. ఆస్పత్రి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో సెల్లార్‌లోని బొరియలు, గుంతల్లో వందలాది ఎలుకలు, పందికొక్కులు నివసిస్తున్నాయి. (చదవండి: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్) -
కరోనాకు వేవ్‌లు లేవు... వేరియంట్లే
సాక్షి, హైదరాబాద్: ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన కరోనా మహమ్మారి ఇకపై వేవ్ రూపంలో వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, వివిధ రకాల వేరియంట్లు మాత్రం ఉంటాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫస్ట్, సెకెండ్ వేవ్‌లలో విశ్వరూపం చూపించిన కరోనా వైరస్ థర్డ్‌వేవ్ నాటికి బలహీన పడిందన్నారు. గత పాండమిక్‌లు, వైరస్ల చరిత్ర పరిశీలిస్తే మూడు వేవ్‌ల తర్వాత వైరస్లు వివిధ రకాలుగా రూపాంతరం చెంది, కొంతమేర శక్తి కోల్పోయి బలహీన పడినట్లు వైద్య నిపుణుల పరిశీలనలో తేలిందన్నారు. ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో ప్రాణనష్టం జరిగిందని, థర్డ్‌వేవ్‌లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత బలహీనమైనదిగా నిర్ధారణ అయిందన్నారు. వైరస్లు కొంతకాలం తర్వాత రూపాంతరం చెంది బలహీన పడతాయని, కొన్ని సందర్భాల్లో మాత్రం మరింత బలపడి విజృంభిస్తుందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ టీకా అందుబాటులోకి రావడం, వైరస్‌పై అవగాహన కలగడం, రోగనిరోధకశక్తి పెరగడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే కోవిడ్ వైరస్ తన ప్రభావాన్ని కొంతమేర కొల్పోయినట్లు భావించవచ్చన్నారు. (క్లిక్: తెలంగాణ: రానున్న 15 ఏళ్లలో భారీగా తగ్గనున్న యువత..) గాంధీ ఆస్పత్రిలో ప్రస్థుతం 31 మంది కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నామని, కోవిడ్ డిశ్చార్జీలు కొనసాగుతుండగా, అడ్మిషన్ల సంఖ్య పూర్తిగా తగ్గిందన్నారు. మూడు వేవ్‌ల్లో వేలాది మంది బాధితుల ప్రాణాలను కాపాడిన ఘనత గాంధీ వైద్యులు, సిబ్బందికే దక్కుతుందన్నారు. పూర్తిస్థాయిలో కరోనా ముప్పు తొలగిపోలేదని, వేవ్ రాకున్నా, వేరియంట్లు ఉన్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. (క్లిక్: ఓయూలో అబ్బాయిల హాస్టల్.. అమ్మాయిలకు!) -
గాంధీ ఆస్పత్రిలో సీబీఆర్ఎన్ సెంటర్
గాంధీ ఆస్పత్రి: తెలంగాణ వైద్య ప్రదాయిని గాంధీ ఆస్పత్రిలో కీలక వైద్య విభాగం త్వరలో అందుబాటులోకి రానుంది. రసాయన, జీవ, అణుధార్మిక ఏజెంట్ల వాడకం... ప్రత్యేకించి అణువిద్యుత్ కేంద్రాల్లో ప్రమాదాల బారినపడే క్షతగాత్రులకు ప్రత్యేక వైద్యం అందించేందుకు వీలుగా కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ (సీబీఆర్ఎన్) మెడికల్ మేనేజ్మెంట్ సెంటర్‌ను గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసే ప్రక్రియలో ముందడుగు పడింది. గాంధీలో ఈ సెంటర్ ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి గాంధీ ఆస్పత్రి పాలనా యంత్రాంగానికి తాజాగా లిఖితపూర్వక ఆదేశాలు అందాయి. దీంతో రాష్ట్ర వైద్య ఉన్నతాధికారులు, గాంధీ పాలనా యంత్రాంగం రెండు రోజులు సమాలోచనలు చేసి ఆస్పత్రి ప్రాంగణంలోని మెడికల్ షాపుల వెనుకగల వైద్యుల వాహన పార్కింగ్ స్థలంలో సీబీఆర్ఎన్ భవనం నిర్మించేందుకు ప్రతిపాదించారు. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లను పార్కింగ్‌కు కేటాయించి పిల్లర్ల సాయంతో పైఅంతస్తుల్లో భవన నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులు బ్లూప్రింట్‌ను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గాంధీ సూపరింటెండెంట్ రాజారావు మీడియాతో 2 వేల చదరపు మీటర్ల వైశ్యాలంగల స్థలాన్ని గుర్తించి కేంద్రానికి తెలియజేశామని, త్వరలోనే కేంద్ర నిపుణుల బృందం గాంధీని సందర్శించే అవకాశం ఉందన్నారు. వాస్తవానికి 2018లోనే గాంధీలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం భావించినప్పటికీ పలు కారణాలతో అది వాయిదాపడింది. -
93% ఒమిక్రానే.. అయినా లక్షణాలు లేవు.. నిబంధనలు పాటించకుంటే!
సాక్షి, గాంధీఆస్పత్రి : కోవిడ్ థర్డ్‌వేవ్‌లో కరోనా నిర్ధారణ అయినప్పటికీ లక్షణాలు కనిపించడం లేదని, ప్రస్తుత బాధితుల్లో 93 శాతం ఒమిక్రాన్, 7 శాతం డెల్టా వేరియంట్లు ఉన్నాయని గాంధీఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీలో 167 మంది కోవిడ్ రోగులకు వైద్యచికిత్సలు అందిస్తున్నామని, వీరిలో కరోనాతోపాటు దీర్ఘకాల వ్యాధులు, వివిధ రుగ్మతలతో బాధపడుతున్న 74 మంది పరిస్థితి ఒకింత విషమంగా ఉందని, వీరిని ప్రధాన భవనంలోని రెండో అంతస్తులోని కోవిడ్ ఐసీయులో ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నామని వివరించారు. చదవండి: ఒమిక్రాన్ భారత్: అంతా అయోమయం.. గందరగోళమే! ఒమిక్రాన్ వేరియంట్ అంతగా ప్రమాదకారి కాదనే ధైర్యంతో కోవిడ్ నిబంధనలు పాటించకుంటే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని, ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాంధీలో అవుట్ పేషెంట్, అత్యవసర సేవలు, పేషెంట్ అడ్మిషన్లు, సర్జరీలు యథావిధిగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. చదవండి: ఒమిక్రాన్ చివరి వేరియెంట్ అనుకోలేం -
ఎక్కడ చూసినా కరోనానే..
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రులు, ఆఫీసులు, పోలీస్స్టేషన్లు, విద్యాసంస్థలు.. ఎక్కడ చూసినా కరోనా కలకలం రేపుతోంది. వైరస్ బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ♦గాంధీ ఆస్పత్రిలో సోమవారం 70 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వెల్లడించారు. ♦ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో 57 మంది రోగులు, 9 మంది వైద్య సిబ్బందికి కరోనా ఉన్నట్టు తేలింది. వీరిలో పది మందిలోనే లక్షణాలు కన్పించినట్టు అధికారులు తెలిపారు. ♦మరోవైపు ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో ఐదుగురు వైద్యులకు కోవిడ్ నిర్ధారణ అయింది. ♦గ్రేటర్ పరిధిలో 32 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. ♦పాఠశాల విద్య డైరెక్టరేట్‌లో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. కొత్తగా 2,447 కేసులు రాష్ట్రంలో కరోనా కేసులతో పాటు ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్యా పెరుగుతున్నట్టు వైద్యారో గ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. సోమ వారం విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో 22,197 క్రియా శీల కేసులున్నాయి. వీరిలో ఆస్పత్రుల్లో చేరినవారిలో ఆక్సిజన్‌పై 964 మంది, ఐసీయూలో 587 మంది చికిత్స పొందుతున్నారు. కరీంనగర్, వరంగల్ తదితర జిల్లా ఆస్పత్రుల్లోనూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లినవారు హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న క్రమంలో కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని అంటున్నారు. ఒక్క రోజులో 80,138 పరీక్షలు.. 2,447 కేసులు రాష్ట్రంలో సోమవారం 80,138 కరోనా పరీక్షలు చేయగా.. అందులో 2,447 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7.11 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 2,295 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 96.31 శాతంగా ఉంది. తాజాగా ఒక్కరోజులో ముగ్గురు కరోనాతో చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,060కు చేరింది. -
రూ. 16 కోట్లుంటేనే పసిదానికి ప్రాణం!
మల్లాపూర్: తమకు పండంటి పాప పుట్టిందని మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు! ఇందుకు కారణం... ఆ చిన్నారిలో కదలికలు క్రమంగా తగ్గిపోవడమే!! ప్రస్తుతం నాలుగు నెలల వయసున్న ఆ బిడ్డ తల, కాళ్లు, చేతులు ఆడించలేని స్థితికి చేరుకోవడమే!! స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్–1గా పిలిచే అరుదైన జన్యువ్యాధి బారిన ఆ పసిపాప పడటమే!! ఈ వ్యాధి చికిత్సకు రూ. లక్షలు కాదు.. ఏకంగా రూ. కోట్లు కావాలని వైద్యులు చెప్పడంతో రెక్కాడితేకానీ డొక్కాడని ఆ నిరుపేద దంపతులు విలవిల్లాడుతున్నారు. దీనికితోడు కేవలం మరో 3 నెలల్లోనే ఆ సొమ్మును సమకూర్చుకోకుంటే పాప ప్రాణం దక్కదని తెలిసి దాతల సాయం కోసం చూస్తున్నారు. పిడుగులాంటి వార్త... నాచారం బాబానగర్‌కు చెందిన ఫయాజ్, రేష్మకు 2019లో వివాహం జరిగింది. ఫయాజ్ ఓ మొబైల్ షాప్‌లో పనిచేస్తుండగా ఆయన భార్య గృహిణి. వారికి 2021 ఆగస్టు 31న కుమార్తె ఫైజా జన్మించింది. తమ బిడ్డ కాళ్లు, చేతులు అడించట్లేదని గుర్తించిన తల్లిదండ్రులు గాంధీ ఆస్పత్రిలో చూపించారు. నెలపాటు చిక్సిత అందించినా చిన్నారి కోలుకోకపోవడంతో ఆమె జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు అనుమానించి ఆమె రక్త నమూనాలను నిమ్స్‌కు పంపించారు. నిమ్స్ వైద్యులు శాంపిళ్లను సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ)కి పంపగా ఆ చిన్నారి ఎస్ఎంఏ టైప్–1 జన్యు వ్యాధితో బాధపడుతున్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ వ్యాధిని నయం చేయడానికి విదేశాల నుంచి రూ. 10 కోట్ల ఖరీదైన ఇంజక్షన్తోపాటు దిగుమతి పన్నులు కలిపి రూ.6 కోట్లు కలిపి మొత్తం రూ.16 కోట్ల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు వెల్లడించారు. మంత్రి హరీశ్‌కు తల్లిదండ్రుల మొర... ఫయాజ్, రేష్మలు మంగళవారం వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి నివేదికలను చూపారు. దీంతో స్పందించిన ఆయన ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఇంజక్షన్ కోసం ప్రయత్నిద్దామని హామీ ఇచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. దాతలు ఆర్థిక సాయం పంపాల్సిన బ్యాంకు ఖాతా వివరాలు అకౌంట్ పేరు: ఫైజా అకౌంట్ నంబర్: 90928679014210 ఐఎఫ్ఎస్సీ కోడ్: IDFB0020101 యూపీఐ ట్రాన్స్‌శాక్షన్ కోసం: assist.faiza@icici -
హైదరాబాద్‌లో చాపకింద నీరులా పాకుతున్న కొత్త వ్యాధి.. గాంధీ ఆస్పత్రిలో 15 కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ఇప్పటికే కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో భాగ్యనగర వాసులను మరో కొత్త రకం వ్యాధి పీడిస్తోంది. స్క్రబ్ టైఫస్ పేరుతో ఉన్న ఈ వ్యాధి బారిన పడిన బాధితుల్లో ఎక్కువగా చిన్నారులే ఉండడం గమనార్హం. స్క్రబ్ టైఫస్ అనే పురుగులు ఈ వ్యాధికి కారణమవుతాయి. క్రమంగా దీని బాధితుల సంఖ్య కూడా పెరుగడం వైద్యులను కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ వ్యాధితో గాంధీ ఆస్పత్రిలో 15 మంది చికిత్స పొందుతున్నారు. ఈ నెలలో నలుగురు చిన్నారులు ఆస్పత్రిలో చేరారు. అందులో ఇద్దరు కోలుకోగా, మిగిలిన ఇద్దరికి చికిత్స జరగుతోంది. అయితే, ఇటీవల దేశంలోని అనేక ప్రాంతాల్లో సబ్‌టైఫస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో దాదాపు 500 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. అక్కడ కూడా బాధితుల్లో అధికంగా చిన్నారులే ఉన్నారు. అసలే ఒమిక్రాన్‌తో హడలిపోతున్న నగర వాసులకు ఇప్పుడు స్క్రబ్ టైఫస్ వైరస్‌కు తోడవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి? సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ( సీడీసీ) ప్రకారం, స్క్రబ్ టైఫస్ (ఓరియంటియా సుట్సుగముషి) అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. దీనిని బుష్ టైఫస్ అని కూడా పిలుస్తారు. ఇన్ఫెక్షన్ ఒక క్రిమి (లార్వా మైట్) కాటు ద్వారా ఇది మనుషులకు వ్యాపిస్తుంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలు.. దీని కాటు వల్ల.. తీవ్రమైన జ్వరం, చలి, తలనొప్పి, కళ్లు, కండరాల నొప్పులు, శరీర నొప్పులు, దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ప్రభావాలన్నీ కూడా 10 రోజులలోపు బయటపడతాయి. కనుక ఈ లక్షణాలు కనిపించిన తక్షణమే వైద్యులను సంప్రదించాలి. చదవండి: Tamil Nadu: ట్రాన్స్‌జండర్‌గా మారుతానన్నందుకు కొడుకును హతమార్చిన తల్లి! -
జూడాల ఆందోళన విరమణ
గాంధీ ఆస్పత్రి: జీవో నంబర్ 155 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనను విరమిస్తున్నామని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ (జూడా) అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. సమ్మె నోటీసులను వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు. వైద్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయన్నారు. మంత్రి హరీశ్‌రావు, వైద్య ఉన్నతాధికారులతో జూడాల సంఘ ప్రతినిధులు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్‌లో నీట్లో ఇన్ సర్వీసు కోటా రిజర్వేషన్లు పెంచబోమని, ఎవరీకి నష్టం కలగకుండా సర్వీస్ వైద్యులు, జూనియర్ డాక్టర్స్‌కు సమాన ప్రతిపత్తి కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారని జూడాల సంఘ ప్రతినిధులు సాగర్, కార్తీక్, వివేక్, మణికిరణ్‌రెడ్డి తెలిపారు. పలు అంశాలపై పరిష్కారం కోసం మంత్రికి వినతిపత్రం అందించారు. -
ఫలించిన సీఎం కేసీఆర్ వ్యూహం
సాక్షి, గాంధీఆస్పత్రి (హైదరాబాద్): సీఎం కేసీఆర్ వ్యూహం ఫలించింది. ముందు జాగ్రత్తతో చేపట్టిన ఆలోచన విధానం సత్ఫలితాలను ఇచ్చింది. వందలాది మంది రోగులు, వైద్యులు, సిబ్బంది పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కోవిడ్ సెకండ్‌వేవ్ విజృంభిస్తున్న సమయంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో కోవిడ్ ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు సంభవించి తీవ్రమైన ప్రాణ, ఆస్తినష్టాలు వాటిల్లాయి. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో జరిగిన అగ్నిప్రమాదాలను గమనించిన సీఎం కేసీఆర్ ముందుజాగ్రత్త చర్యలో భాగంగా తెలంగాణలోని కోవిడ్ ఆస్పత్రుల్లో అగ్నిమాపకలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేవలం ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఏర్పాటు పనులను నిరంతరం సమీక్షించారు. ► గాంధీఆస్పత్రి ప్రాంగణంలో ఈ ఏడాది ఏప్రిల్ 24న అగ్నిమాపక కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ► నాటి ఆదేశాలే నేడు ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు దోహదపడ్డాయని పలువురు భావిస్తున్నారు. ► సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో ఫైర్ సిబ్బంది పనితీరుపై ప్రశంసలజల్లు కురుస్తున్నాయి. ► సమాచారం అందిన మూడు నిమిషాల వ్యవధిలోనే అగ్నిమాపక సిబ్బంది ఘటనస్ధలానికి చేరుకుని కొన్ని నిమిషాల వ్యవధిలో మంటలను అదుపు చేశారు. ► ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం నుంచి బయట పడ్డామని పలువురు వైద్యులు, సిబ్బంది, రోగులు తెలిపారు. ► ఆస్పత్రి ప్రాంగణంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయకపోతే, ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేందుకు కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేదని, ఈ వ్యవధిలో మంటలు మరింత విజృంభించి ప్రమాద తీవ్రత మరింత పెరిగేదని, సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలే తమ ప్రాణాలు కాపాడాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ► నగరంలోని పలు ఆస్పత్రుల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన అగ్నిమాపక కేంద్రాలు తెలంగాణ సెక్రటేరియట్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. కార్బన్ స్మోక్ ప్రమాదకరం గాంధీ ఆస్పత్రిలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సకాలంలో స్పందించాం, విద్యుత్ కేబుళ్లు వైర్లను కార్బన్‌తోపాటు పలు రకాల కెమికల్స్‌తో తయారు చేస్తారు. ఇవి కాలుతున్న సమయంలో విపరీతమైన పొగను వెలువరిస్తాచి. ఈ పొగ ఎక్కువగా పీల్చితే ప్రాణాపాయం కలుగుతుంది. మేము మూడు నిమిషాల వ్యవధిలోనే ఘటన స్థలానికి చేరుకున్నాం. అప్పటికే పలు వార్డులు పొగతో నిండి ఉంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలతోపాటు రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న రోగులపై కార్బన్ పొగ తీవ్రమైన ప్రభాపం చూపించే ప్రమాదం ఉంది. ఆస్పత్రుల ప్రాంగణాల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో పెను ప్రమాదం తప్పింది. – కేవీ నాగేందర్, ఫైర్ ఆఫీసర్ -
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్నికీలలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. సెల్లార్‌లోని విద్యుత్ ప్యానల్ బోర్డులో షార్ట్‌సర్క్యూట్ కావడంతో కేబుళ్లకు మంటలు అంటుకుని క్షణాల్లో అయిదో అంతస్తుకు వరకూ విస్తరించాయి. దట్టమైన పొగతో మంటలు చెలరేగడంతో ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది తీవ్ర భయాందోళనతో హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, అధికారులతో పాటు ఆస్పత్రి ప్రాంగణంలోని ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సెక్యూరిటీ గార్డులు మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. బయటపడి.. ఊపిరి పీల్చుకుని.. ► బుధవారం ఉదయం 7.30 గంటల సమయం. ఆస్పత్రి సెల్లార్‌లోని ఎలక్ట్రికల్ విభాగంలోని విద్యుత్ ప్యానల్‌బోర్డులో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ప్రతి అంతస్తుకు అనుసంధానం చేసిన విద్యుత్ తీగలు, కేబుళ్లకు మంటలు అంటుకుని నిలువుగా అయిదో అంతస్తు వరకు వ్యాపించాయి. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చిమ్మచీకట్లు అలముకున్నాయి. ► దట్టమైన పొగలను గమనించిన రోగులు, సిబ్బంది భయాందోళనతో మెట్లు, ర్యాంపు మార్గాల ద్వారా బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కొంతమంది రోగులు కిందపడి స్వల్ప గాయాల పాలయ్యారు. గ్రౌండ్‌ఫ్లోర్, మొదటి అంతస్తులోని గైనకాలజీ, చిన్నపిల్లల (పీడియాట్రిక్) వార్డుల్లో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలు, పీఐసీయూ, ఎన్ఐసీయూల్లోని శిశువులను తీసుకుని వార్డుల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. ► అగ్నిమాపక, పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది సుమారు 40 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. డీఎంఈ రమేష్‌రెడ్డి గాంధీ ఆస్పత్రిని సందర్శించి ప్రమాదంపై ఆరా తీశారు. చేపట్టాల్సిన చర్యలపై సూపరింటెండెంట్ రాజారావు, వైద్యులతో కలిసి సమీక్షించారు. విద్యుత్ అంతరాయంతో వైద్యసేవల్లో జాప్యం ఏర్పడింది. పలు శస్త్రచికిత్సలను వాయిదా వేశారు. పురాతన కేబుళ్లతో ప్రమాదాలు.. గాంధీఆస్పత్రి నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ కేబుళ్ల వ్యవస్థ శిధిలావస్థకు చేరుకోవడంతో తరచూ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. వైర్లు, కేబుళ్లను ఎలుకలు, పందికొక్కులు కొరికివేయడంతో విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. అగ్నిప్రమాదాల కారణంగా లక్షలాది రూపాయల విలువైన వైద్యపరికరాలు దగ్ధమవు తున్నా ఆస్పత్రి పాలనా యంత్రాంగం సరైన రీతిలో స్పందించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కరకురాని అగ్నిమాపక పరికరాలు.. గాంధీఆస్పత్రిలో ఫైర్ ఫైటింగ్ సిస్టం పూర్తిగా నిరుపయోగంగా మారింది. ఆస్పత్రి ప్రారంభినప్పుడు ఏర్పాటు చేసిన పరికరాలు తుప్పుపట్టి మూలనపడ్డాయి. ఫైర్ ఎంగ్విస్టర్లు పనిచేయడంలేదు. నూతన ఫైర్ సిస్టం ఏర్పాటు చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. ఆస్పత్రి పాలనా యంత్రాంగం పలుమార్లు ఈ విషయమై వైద్య ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకపోవడం గమనార్హం. ఘటనపై మంత్రి తలసాని ఆరా గాంధీఆస్పత్రిలో అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా తీశారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే గాంధీ సూపరింటెండెంట్ రాజారావుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరానికి చేరుకున్న వెంటనే గాంధీఆస్పత్రిని సందర్శిస్తానన్నారు. వైద్యసేవలు యథాతథం.. నార్త్‌బ్లాక్‌లోని ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులను సౌత్ బ్లాక్‌కు తరలించి వైద్యసేవలు అందిస్తున్నాం. అగ్ని ప్రమాదాన్ని గుర్తించి 20 నిమిషాల్లో మంటలను అదుపు చేయించాం. వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతాయి. – రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ అంధకారంలోనే పరిపాలనా విభాగం, వార్డులు.. ► అగ్ని ప్రమాదంతో గాంధీ ఆస్పత్రిలో చిమ్మచీకట్లు అలముకున్నాయి. సుమారు గంటన్నర సమయం తర్వాత కొన్ని బ్లాకుల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. నార్త్‌బ్లాక్ మొత్తం చీకట్లోనే ఉంది. విద్యుత్ అంతరాయంతో నార్త్‌బ్లాక్‌లోని ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్లు మూతపడ్డాయి. ► సూపరింటెండెంట్ పేషీ, ఆరోగ్యశ్రీ, మెడికల్ రికార్డు సెక్షన్, ఆర్ఎంఓ, నర్సింగ్ సూపరింటెండెంట్, శానిటేషన్, ఎస్టాబ్లిష్మెంట్, పరిపాలన, బయోమెట్రిక్ విభాగాల పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడనుంది. -
Hyderabad: మానవత్వం చాటుకున్న హోంగార్డు..
హైదరాబాద్: గులాబ్ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే దీని ప్రభావానికి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్ష బీభత్సానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే. కాగా, తాజాగా హైదరాబాద్‌లో వర్షంలో ఆసుపత్రికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళను 100 పెట్రోల్ వెహికిల్ హోంగార్డు సమయానికి ఆసుపత్రికి తరలించాడు. వర్షం ప్రభావానికి ఓ గర్భిణి ఆసుపత్రికి వెళ్లలేక ఇబ్బందులు పడుతుంది. దీంతో సదరు మహిళ కుటుంబ సభ్యులు 100కి ఫోన్ కాల్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న హోంగార్డు ఇమ్రాన్ ఖాన్ బాధిత మహిళను ఎత్తుకుని గాంధీ ఆసుపత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసు అధికారులు, నెటిజన్లు హోంగార్డు ఇమ్రాన్ ఖాన్‌ను ప్రశసింస్తున్నారు. చదవండి: మణికొండలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం -
చిన్నారుల్లో ‘డెంగీ’ కలవరం!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నుంచి గ్రేటర్ వాసులు ఇంకా పూర్తిగా కోలుకోకముందే తాజాగా డెంగీ, మలేరి యా, టైఫాయిడ్, చికెన్‌గున్యా జ్వరాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు...వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పుల వల్ల అనేక మంది విషజ్వరాల బారినపడు తున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రస్తుతం ఏ ఇంట్లోకి చూసినా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ జ్వరపీడితుల్లో చిన్నారులు ఎక్కువగా ఉండటం విశేషం. ప్రతి ఐదుగురు జ్వరపీడితుల్లో ఒకరికి డెంగీ పాజిటివ్ రిపోర్ట్ అవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. బస్తీ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్యసేవలు అందక పోవడంతో శివారు ప్రాంతాల్లోని బాధితులంతా మెరుగైన వైద్యం కోసం నగరంలోని బోధనాసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ సహా నల్లకుం ట ఫీవర్ ఆస్పత్రి, కోఠి ఈఎన్టీ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రుల్లో రోగులను నేలపై పడుకోబెట్టి చికిత్సలు అందించాల్సి వస్తుంది. వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన నిలోఫర్ ఆస్పత్రిలో ప్రస్తుతం 1,200 మంది చికిత్స పొందుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కిటకిటలాడుతున్న పెద్దాసుపత్రులు.. హైదరాబాద్ జిల్లాలో 85 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 40పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇక మేడ్చల్ జిల్లాలో 36 ఉన్నాయి. ఈ మూడు జిల్లాల పరిధిలో 200పైగా బస్తీ దవాఖానాలతో పాటు ఏడు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందడం లేదు. సాధారణ రక్త, మూత్ర పరీక్షలకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో వారంతా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. సాధారణ రోజుల్లో ఉస్మానియా ఆస్పత్రిలో రోజు సగటు ఓపీ 1,200 ఉండగా, ప్రస్తుతం 1,800 నుంచి 2,000పైగా నమోదవుతోంది. ఇక ఫీవర్ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో సగటు ఓపీ 350 ఉండగా, ప్రస్తుతం వెయ్యి దాటింది. ఇక నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 900 ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 1,500 దాటింది. ఈఎన్టీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో వచ్చిన వారిని నేలపై పడుకోబెట్టి వైద్యసేవలు అందిం చాల్సి వస్తుంది. ఓపీకి వస్తున్న వారిలో ఎక్కువగా జ్వరపీడితులే. కరోనా భయం ఇంకా పోకముందే, డెంగీ జ్వరాలు వెంటాడుతుండటంతో నగరవాసులు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సి వస్తుంది. కరోనా, డెంగీలోనూ ఒకే లక్షణాలు ఉండటంతో ఈ జ్వరాల గుర్తింపు ఆందోళన కలిగిస్తోంది. సాధారణ జ్వర పీడితులకు డెంగీ బూచీ.. ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం లేకపోవడంతో అక్కడికి వచ్చిన బాధితుల నుంచి రక్తనమూనాలు సేకరించి ఐపీఎంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు పంపుతున్నారు. రిపోర్టుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో జ్వరం తీవ్రత మరింత పెరిగి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. విధిలేని పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. కరోనా, డెంగీ పరీక్షల పేరుతో ఆయా కేంద్రాలు రోగుల నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. డయాగ్నోస్టిక్ సెంటర్లపై సరైన నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్యులు సాధారణ జ్వరాలను కూడా డెంగీ, కరోనా జ్వరాలుగా పేర్కొంటూ అత్యవసర చికిత్సలను సిఫార్సు చేస్తున్నారు. ఐసీయూ చికిత్సల పేరుతో పేదలను దోచుకుంటుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నగరం లోని కొంత మంది వైద్యులు డెంగీ మరణాలను బూచిగా చూపించి..ప్లేట్లెట్ కౌంట్స్ చికిత్సల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. అంతేకాదు డెంగీ కేసుల వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు తెలియజేయాల్సి ఉన్నా.. అనుమానం రాకుండా సస్పెక్టెడ్ డెంగీ కేసుగా అడ్మిట్ చేసుకుని చికిత్సలు చేస్తుండటం విశేషం. డెంగీకి కారణాలివే – డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, రంగారెడ్డిజిల్లా ►ఎడిస్ ఈజిప్టే (టైగర్)దోమ కుట్టడం వల్ల డెంగీ సోకుతుంది. సాధారణంగా ఇది పగలు మాత్రమే కుడుతుంది. ►కేవలం పగలు మాత్రమే కుట్టే డెంగీ దోమలు లైట్ల వెలుగులు విరజిమ్ముతుండటంతో రాత్రి వేళలోనూ కుడుతున్నాయి. ►ఇంటి పరిసరాల్లో ఖాళీ కొబ్బరి బోండాలు, సీసాలు, డబ్బాలు, టైర్లు, ప్లాస్టిక్ గ్లాసులు లేకుండా చూసుకోవాలి. ►వర్షపు నీరు వీటిలో చేరి నిల్వ ఉండటం వల్ల దోమలకు నిలయంగా మారి వీటిలో గుడ్లు పెడుతుంటాయి. ►ఇంటి పరిసరాల్లో నీటి గుంతలు లేకుండా చూసుకోవాలి. మంచినీటి ట్యాంకులపై మూతలు పెట్టి ఉంచాలి. సీజన్ మారుతుండటం వల్లే – డాక్టర్ వెంకటి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, హైదరాబాద్ జిల్లా వాతావరణ మార్పులను శరీరం తట్టుకోలేదు. సీజన్ మారిన ప్రతిసారీ దగ్గు, జలుబు, టైఫాయిడ్ జ్వరాలు సర్వసాధారణం. భయపడాల్సిన పనిలేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ ఉన్న ఆహార పదార్థాలకు బదులుగా అప్పుడే వండిన తాజా ఆహార పదార్థాలను తీసుకోవడం, గోరు వెచ్చని మంచినీరు తాగడం; తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ టీకాలు వేసుకోవాలి. -
గాంధీ ఆస్పత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలోని సౌకర్యాలను పరిశీలించారు. ఆక్సిజన్ ప్లాంట్ పనితీరును అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 41 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోందన్నారు. రాష్ట్రానికి కోటి 68లక్షల 61వేల 809 వ్యాక్సిన్ డోసులు పంపించినట్లు తెలిపారు.13.18లక్షల డోసులు తెలంగాణలో నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. చివరి వ్యక్తి వరకు వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని ఆయన అన్నారు. -
గాంధీ ఆస్పత్రి ఉదంతం..పోలీస్.. కేర్లెస్!
సాక్షి, సిటీబ్యూరో: ఉమామహేశ్వర్రావు.. గాంధీ ఆస్పత్రికి చెందిన సాధారణ ఉద్యోగి. ఈ నెల 11న ఆల్కహాల్ విత్డ్రాల్ సిండ్రోమ్‌తో ఆస్పత్రి ఆవరణలో తనకు కనిపించిన సువర్ణను (చెల్లెలు) బాధ్యతగా లేడీ గార్డ్‌కు అప్పగించి వెళ్లాడు. ► ముషీరాబాద్ ఠాణా.. బాధ్యతాయుతంగా ఉండాల్సిన పోలీసులు. అదే రోజు రాత్రి ఆల్కహాల్ విత్డ్రాల్ సిండ్రోమ్‌తో తమ ఠాణాకు వచ్చిన తిరుపతమ్మను (అక్క) గంటకుపైగా ఉంచి నిర్లక్ష్యంగా రోడ్డుపై వదిలేశారు. ► గాంధీ ఆస్పత్రి కేంద్రంగా వెలుగులోకి వచ్చిన అక్కాచెల్లెళ్ల వ్యవహారంలో సాధారణ ఉద్యోగి స్పందనకు, పోలీసుల వ్యవహారానికి తేడా చూపించే మచ్చుతునకలు ఇవి. ముషీరాబాద్ పోలీసులు చేసిన పని కారణంగానే నగర పోలీసు విభాగంలోని దాదాపు అన్ని బలగాలూ మూడ్రోజుల పాటు రాత్రనకా పగలనకా రోడ్లపై తిరగాల్సి వచ్చింది. అదే రోజు ఠాణాకు.. ► మహబూబ్‌నగర్ నుంచి వచ్చిన అక్కాచెల్లెళ్లు తిరుపతమ్మ, సువర్ణ ఈ నెల 11నే ఆల్కహాల్ విత్డ్రాల్ సిండ్రోమ్‌కు లోనయ్యారు. దీని ప్రభావంతో వింతగా ప్రవర్తించడం మొదలెట్టారు. మధ్యాహ్నం 3.14 గంటలకు గాంధీ ఆస్పత్రి నుంచి బయలుదేరిన తిరుపతమ్మ రాత్రి 7 గంటల ప్రాంతంలో ముషీరాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లోకి వెళ్లి గలభా సృష్టించింది. దీంతో స్థానికులు డయల్–100కు సమాచారం ఇవ్వడంతో ముషీరాబాద్ ఠాణాకు చెందిన గస్తీ వాహనం వెళ్లి ఆమెను తీసుకుని పోలీసుస్టేషన్‌కు వచ్చింది. ► రాత్రి 7.30 గంటల నుంచి దాదాపు గంట పాటు ఆమెను స్టేషన్లోనే ఉంచిన పోలీసులు ఆపై నిర్లక్ష్యంగా రోడ్డుపై వదిలేశారు. ఎవరైనా మహిళలు ఈ రకంగా పోలీసులకు తారసపడితే సంబంధీకుల్ని గుర్తించి అప్పగించాలి. అలాంటి వాళ్లు ఎవరూ లేరనో, తాము వెళ్లమనో బాధితులు అంటే స్టేట్‌హోమ్‌కు తరలించాలి. మానసిక స్థితి సరిగ్గా లేని తిరుపతమ్మ లాంటి వాళ్లు కనిపిస్తే లేఖ రాయడం ద్వారా మానసిక చికిత్సాలయానికి పంపాలి. నిబంధనలు ఈ విషయాలు చెబుతున్నా ముషీరాబాద్ పోలీసులు మాత్రం ఆమె నడిరోడ్డుపై వదిలేశారు. మిన్నకుండిపోయిన ఆ పోలీసులు.. ► ‘గాంధీ ఆస్పత్రి’ ఉదంతం ఈ నెల 16న వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి నగర పోలీసు విభాగానికి చెందిన దాదాపు అన్ని విభాగాల అధికారులు రోడ్లపై పడ్డారు. ఫిర్యాదు చేసిన సువర్ణ భరోసా కేంద్రం అధీనంలోనే ఉండగా.. కనిపించకుండా పోయిన ఆమె అక్క తిరుపతమ్మ ఆచూకీ కోసం నిద్రాహారాలు మానేసి అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ వ్యవహారంపై నగరం మొత్తం హల్చల్ నడుస్తోంది. ► దీనికి ముందే చిలకలగూడ పోలీసులు తిరుపతమ్మపై లుక్ఔట్ నోటీసులు జారీ చేసి అన్ని ఠాణాలకు పంపారు. ఇంత జరుగుతున్నా.. ఆమెను ఠాణాకు తీసుకువచ్చి గాలికి వదిలేసిన ముషీరాబాద్ పోలీసులు మాత్రం కిక్కురుమనలేదు. తమకు ఏమీ తెలియదన్నట్లే వ్యవహరించారు. తిరుపతమ్మ ఆచూకీ కోసం సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం ఈ విషయం గుర్తించి నిలదీయడంతో ముషీరాబాద్ పోలీసులు అసలు విషయం చెప్పారు. బాధ్యులెవరు..? ► ఆల్కహాల్ విత్డ్రాల్ సిండ్రోమ్‌తో ఈ నెల 11న గాంధీ ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లిపోయిన తిరుపతమ్మ దాదాపు వారం రోజుల తర్వాత నారాయణగూడ ఠాణా పరిధిలో గురువారం దొరికింది. ఓ దుకాణాదారుడి ద్వారా ఈమెకు సంబంధించిన సమాచారం అందుకున్న అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తూ ఆమె వెళ్లి వివరాలు సేకరించి గుర్తించారు. ► ఇన్ని రోజులూ రోడ్లపైనే ఆమె నివాసం సాగింది. ఈ నేపథ్యంలో జరగరానిది ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత ముషీరాబాద్ పోలీసులదే అయ్యేది. నగర పోలీసు విభాగంలో ఉత్తమ పనితీరు కనబరుస్తూ వారిని నిత్యం ఉన్నతాధికారులు రివార్డులు అందించి ప్రోత్సహిస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వారిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తిరుపతమ్మ ఉదంతంలో ముషీరాబాద్ పోలీసులపై మాత్రం ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం, అసలు విషయం బయటకు రాకుండా ఉన్నతాధికారులు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. -
తెలంగాణను వణికిస్తున్న విష జ్వరాలు
-
తప్పిపోయిన మహిళ ఆచూకీ లభ్యం
-
గాంధీ ఆస్పత్రి ఘటన.. సంచలన విషయాలు వెలుగులోకి
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గాంధీ ఆస్పత్రి ఘటన అంతా ఫేక్ అని పోలీసులు తెలిపారు. అత్యాచారం జరగకున్నా యువతి కట్టుకథలు అల్లినట్లు పోలీసులు వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి ఘటనలో ఇద్దరు మహిళలు చెప్పిన ఫిర్యాదులో వాస్తవం లేదని పోలీసులు పేర్కొన్నారు. ఇద్దరి అక్కా చెల్లెలకి కెమికల్ కలిపిన కల్లు తాగే అలవాటు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న కొద్ది రోజులు కల్లు తాగకపోయే సరికి ఇద్దరూ చాలా స్ట్రెస్‌లో ఉన్నట్లు వెల్లడించారు. చదవండి: గాంధీ హాస్పిటల్ సీసీ ఫుటేజీలో బయటపడ కీలక సాక్ష్యాలు ఈ క్రమంలో ఇద్దరిలో అక్క బయటికి వెళ్ళిపోయిందని, ఇద్దరూ ఎదుట వ్యక్తికి గుర్తు పట్టే స్థితిలో లేరన్నారు. అక్కని వెతుకు కుంటూ వెళ్ళిన చెల్లి బయట ఓ సెక్యూరిటీ గార్డుతో మాట్లాడుతూ పరిచయం చేసుకుందని, ఇది జరిగిన రోజే సెక్యూరిటీ గార్డుతో పరస్పర అభిప్రాయంతో లైంగికంగా 7వ ఫ్లోర్లో కలిసినట్లు తెలిపారు. ఆ తరువాత మరొకసారి సెల్లార్లో మళ్లీ పరస్పర అభిప్రాయంతో లైంగికంగా ఇద్దరు కలిసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయం ఇంట్లొ తెలిస్తే బాగోదు అని అమ్మాయి ఇలా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన అక్క కూడా రెండూ రోజులు పాటు కాగితాలు ఏరుకునే వ్యక్తి తో ఉందని, అక్కడ ఏం జరిగింది అని వివరణ లేదని తెలిపారు. దీనిలో ల్యాబ్ టెక్నీషియన్ తప్పు ఏం లేనట్లు పోలీసులు తెలిపారు. కాగా గాంధీ ఆస్పత్రిలో అక్కా చెల్లెళ్ల సామూహిక అత్యాచార ఘటనపై సీపీ అంజనీ కుమార్ స్పందించారు. 500కి పైగాసీసీ కెమెరాలు పరిశీలించినట్లు ఆయన తెలిపారు. 800 గంటల సీసీ ఫుటేజ్‌లు చూడటం జరిగిందని, టెక్నాలజీ ఆధారంగా.. సెల్ ఫోన్ సిగ్నల్స్ చూసినట్లు పేర్కొన్నారు. ఇది చాలా సెన్సిటివ్ కేసు అని ఆయన అన్నారు. క్రైమ్ విషయంలో మహిళల గురించి తప్పుగా మాట్లాడకూడదని, పార్లమెంట్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. క్రైమ్‌లో సీన్ రీ క్రియేషన్ చాలా ముఖ్యమని, ప్రతి వ్యక్తికి పర్సనల్ విషయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. లా ప్రకారం.. ఏసీపీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ ఇన్వెస్టిగేటింగ్ చేయాలి, ఈ కేసులో మిస్టరీ ఏం లేదన్నారు. కోర్టులో కేసు వివరాలు ఎలా సబ్మిట్ చేయాలి అని చూస్తున్నట్లు వెల్లడించారు. కాగా, గాంధీ ఆసుపత్రిలో తనతోపాటు తన సోదరిపైనా సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నార్త్ జోన్ పోలీసులు 10 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మహిళను నారాయణగూడలో ఉన్నట్లు గురువారం గుర్తించారు. అదృశ్యమైన మహిళ రెండు రోజులుగా ఓ వ్యక్తితో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే, మహిళకు ఆశ్రయం ఇచ్చిన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. చదవండి: తాలిబన్ల రాకకు ముందు అఫ్గన్ -
Gandhi Hospital: అదృశ్యమైన మహిళ సురక్షితం
హైదరాబాద్: సంచలనంగా మారిన గాంధీ ఆసుపత్రి అక్కా చెల్లెళ్ల సామూహిక అత్యాచార కేసులో అదృశ్యమైన మహిళ సురక్షితంగా ఉందని పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మహిళను నారాయణగూడలో ఉన్నట్లు గుర్తించారు. అదృశ్యమైన మహిళ రెండు రోజులుగా ఓ వ్యక్తితో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే, మహిళకు ఆశ్రయం ఇచ్చిన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. (చదవండి: గాంధీ ఘటన.. ఇంకా మిస్టరీనే!) -
గాంధీ హాస్పిటల్ సీసీ ఫుటేజీలో బయటపడ కీలక సాక్ష్యాలు
-
ఆ ఇద్దరు అదృశ్యం!
-
గాంధీ ఆస్పత్రి: దొరకని మహిళ ఆచూకీ.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై జరిగిన సామూహిక అత్యాచార కేసులో కనిపించకుండా పోయిన మహిళ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నార్త్ జోన్లో ఉన్న పోలీసులతో పాటు, పలు టీమ్‌లు గాంధీ అసుపత్రిలో కనిపించకుండా పోయిన మరో బాధితురాలి కోసం ఆసుపత్రి మొత్తం జల్లెడ పడుతున్నారు. ఆమె దొరికితేనే అసలు విషయం బయటపడే అవకాశం ఉండడంతో 10 అంతస్తుల గాంధీ ఆస్పత్రిలోని 379 గదులను వెతుకుతున్నారు. డ్రైనేజితో మొదలుకొని చెట్ల పొదల వరకు ఏదీ వదలకుండా పోలీసులు గాలిస్తున్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో మిస్సింగ్‌లో ఉన్న మహిళ ఫోటో పట్టుకొని ప్రతి ఒక్కరికి చూపించి విచారణ జరుపుతున్నారు. కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పని చేయకపోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. అయితే ఉన్న కెమెరాలోనే ఆమె విజువల్స్ కోసం పోలీసులు తీవ్ర స్థాయిలో అన్వేషిస్తున్నారు. మొత్తానికి గాంధీ ఆస్పత్రిలో ప్రతి ఫ్లోర్‌తోపాటు అన్ని గదులను జల్లెడ పడుతూ ఆమె కోసం వెతుకుతున్నారు. చదవండి: గాంధీ ఘటన.. ఇంకా మిస్టరీనే! కాగా గాంధీ ఆసుపత్రిలో తనతోపాటు తన సోదరిపైనా సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన కేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ ఉదంతంపై స్పష్ట సాధించడంతో పాటు ఇప్పటికీ ఆచూకీ లేని మరో బాధితురాలిని కనిపెట్టడం కోసం మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే బాధితురాలు చెప్తున్న విషయాల్లో పొంతన లేకపోవడంతో ఇదంతా కల్లు ప్రభావంతో జరిగిన లొల్లిగానూ అనుమానిస్తున్న అధికారులు.. ఆ కోణంలోనూ ఆరా తీసుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం. అదృశ్యమైన మహిళ వద్ద సెల్‌ఫోన్ లేకపోవడంతో దర్యాప్తు జఠిలంగా మారింది. -
గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో మరో ట్విస్ట్
-
గాంధీ అత్యాచార ఘటనలో మరో ట్విస్ట్.. సెక్యూరిటీ గార్డు రాము అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం ఘటనలో మరో ట్విస్ట్ విలుగు చూసింది. గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న మరో సెక్యూరిటీ గార్డు రాము అదృశ్యం అయ్యాడు. సెక్యూరిటీ గార్డు రాము ఈనెల 14 నుంచి కనిపించడం లేదు. అయితే అత్యాచార ఘటనలో సెక్యూరిటీ గార్డు రాము పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు మరో మహిళ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. నిందితులు ఉమామహేశ్వర్, సెక్యూరిటీ గార్డును పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న బాధితురాలు పేర్కొన్న దాని ప్రకారం గాంధీ ఆసుపత్రి నుంచి అక్కా చెల్లెళ్లు ఈ నెల 8న అదృశ్యమయ్యారు. ఆ తర్వాతే వీరిపై సామూహిక అత్యాచారం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించిన ప్రత్యేక బృందం గాంధీ ఆసుపత్రి, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించింది. కొన్ని కెమెరాల్లో ఫీడ్ ఆధారంగా ఇప్పటికీ ఆచూకీ లేని మహిళ (బాధితురాలి సోదరి) ఈ నెల 11 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తనంతట తానుగా గాంధీ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. కొందరు ప్రత్యక్షసాక్షుల్ని విచారించిన నేపథ్యంలో బాధితురాలు సైతం 14వ తేదీ కూడా గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్నట్లు తెలుసుకున్నారు. -
గాంధీ ఘటన.. ఇంకా మిస్టరీనే!
-
గాంధీ ఘటన.. ఇంకా మిస్టరీనే!
సాక్షి, సిటీబ్యూరో: గాంధీ ఆసుపత్రిలో తనతో పాటు తన సోదరిపైనా సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన కేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ ఉదంతంపై స్పష్టత సాధించడంతో పాటు ఇప్పటికీ ఆచూకీ లేని మరో బాధితురాలిని కనిపెట్టడం కోసం మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే బాధితురాలు చెప్తున్న విషయాల్లో పొంతన లేకపోవడంతో ఇదంతా కల్లు ప్రభావంతో జరిగిన లొల్లిగానూ అనుమానిస్తున్న అధికారులు..ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పని చేయకపోవడం, అదృశ్యమైన మహిళ వద్ద సెల్‌ఫోన్ లేకపోవడంతో దర్యాప్తు జఠిలంగా మారింది. ఒక్కో చోట ఒక్కో విధంగా... బాధితురాలి ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసుస్టేషన్లో ఈ కేసు నమోదైంది. ఆమె నుంచి ప్రాథమికంగా వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు నిబంధనల ప్రకారం భరోసా కేంద్రానికి తరలించారు. ఈ సెంటర్లోని వైద్యులు పరీక్షలు చేయడంతో పాటు అధికారిణులు బాధితురాలి నుంచి మరోసారి స్టేట్మెంట్ తీసుకున్నారు. వీరిద్దరితో పాటు కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక పోలీసు టీమ్ కూడా బాధితురాలితో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ మూడు సందర్భాల్లోనూ బాధితురాలు వేర్వేరు కథనాలు చెప్పినట్లు, వాటి మధ్య పొంతన లేనట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగిందో తెలుసుకోవడంపై దృష్టి పెట్టారు. అదృశ్యమైన తర్వాత కూడా ‘ప్రత్యక్షం’... ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న బాధితురాలు పేర్కొన్న దాని ప్రకారం గాంధీ ఆసుపత్రి నుంచి అక్కా చెల్లెళ్లు ఈ నెల 8న అదృశ్యమయ్యారు. ఆ తర్వాతే వీరిపై సామూహిక అత్యాచారం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించిన ప్రత్యేక బృందం గాంధీ ఆసుపత్రి, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించింది. కొన్ని కెమెరాల్లో ఫీడ్ ఆధారంగా ఇప్పటికీ ఆచూకీ లేని మహిళ (బాధితురాలి సోదరి) ఈ నెల 11 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తనంతట తానుగా గాంధీ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. కొందరు ప్రత్యక్షసాక్షుల్ని విచారించిన నేపథ్యంలో బాధితురాలు సైతం 14వ తేదీ కూడా గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్నట్లు తెలుసుకున్నారు. నమూనాల పరీక్షల్లో లేని ఆనవాళ్లు... పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బాధితురాలు నిందితులు తనకు క్లోరోఫాం ఇచ్చి అత్యాచారం చేశారని చెప్పారు. దీంతో ఆమె నుంచి రక్తంతో సహా వివిధ నమూనాలను సేకరించిన అధికారాలు ఫోరెన్సిక్ పరీక్షలు చేయించారు. వీటి ఫలితాల్లో క్లోరోఫాం సహా ఇతరాల ఆనవాళ్లు కనిపించలేదని తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితురాలి దూరపు బంధువుతో పాటు కొందరు సెక్యూరిటీ గార్డులూ ఉన్నారు. వీరిని విచారించిన పోలీసులకూ ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆ సెక్యూరిటీ గార్డులతో బాధితురాలికి, ఆమె సోదరికి ఎలాంటి సంబంధం లేదని...తానే వారి రాకపోకలకు ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ గార్డులను పరిచయం చేశానని బంధువు చెప్పుకొచ్చినట్లు తెలిసింది. శిక్ష తప్పదు: మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి రాంగోపాల్‌పేట్: గాంధీ ఆస్పత్రి ఘటనలో నిజాలు బయటకు వస్తే నిందితులు ఎవరైనా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె గాంధీ ఆస్పత్రిని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో చర్చించారు. మహిళల ఆరోపణలు, రేడియాలజీ విభాగంలో పనిచేసే నిందితుడు ఎలాంటి వాడు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగి సహాయకుల వెయిటింగ్ హాలు వద్ద సంఘటన జరిగిన ప్రాంతంలోకి వెళ్లి ఆమె పరిసరాలను పరిశీలించారు. పోలీస్ ఔట్‌పోస్టు ఉండగా, నిత్యం వందలాది మంది తిరుగుతుండే ఇలాంటి ప్రదేశంలో ఈ ఘటన జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. తాను స్వయంగా వెళ్లి బాధిత మహిళను కలుస్తానని, ఆమెకు మంచి వైద్యం అందించి అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. మహిళా కమిషన్ ఎల్లవేళలా బాధిత మహిళలకు అండగా ఉంటుందన్నారు. రాజారావుతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ భేటీ అత్యాచార ఘటన గురించి తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం గాంధీ ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, చిలకలగూడ సీఐ జీ నరేష్, డీఐ సంజయ్‌కుమార్‌లతో సమావేశమై సంఘటన గురించి ఆరా తీశారు. అత్యాచారం జరిపిన వారికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. కాగా హోం మంత్రి మహమూద్ అలీ ఈ ఘటనపై పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. బాధ్యులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షపడేలా చూడాలని ఆయన ఆదేశించారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. వాస్తవాలు త్వరలో : సూపరింటెండెంట్ ఈ ఘటనలో వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు అన్నారు. ఆస్పత్రిలో 189 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, ఎక్కడా డార్క్ రూములు లేవని, 24 గంటలు సెక్యూరిటీ వ్యవస్థ పనిచేస్తుందని ఆయన చెప్పారు. వాస్తవాలు బయటకు వచ్చే వరకు మీడియా సంయమనం పాటించాలని, ఆస్పత్రి ప్రతిష్ట దిగజార్చేలా ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా చూపించవద్దని ఆయన కోరారు. నిజ నిర్ధారణ కోసం తనతో పాటు డాక్టర్ జి.నర్సింహారావు, గైనకాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ మహాలక్ష్మి, ఆర్ఎంవో డాక్టర్ నరేంద్ర కుమార్, డాక్టర్ పద్మలతో కూడిన నలుగురు సభ్యుల అంతర్గత కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కల్లు ప్రభావం కోణంలోనూ... ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు నార్త్‌జోన్ పోలీసులు చెబుతున్నారు. అత్యాచారం ఆరోపణల్ని కొట్టి పారేయలేమని, అయితే బాధితురాలి వాంగ్మూలాల్లో పొంతన కొరవడిందని చెబుతున్నారు. అదృశ్యమైన మహిళ ఆచూకీ లభిస్తేనే కీలకాంశాలు వెలుగులోకి రావడంతో పాటు పూర్తి స్పష్టత వస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. బాధితురాలితో పాటు ఆమె సోదరికీ కల్లు తాగే అలవాటు ఉందని, స్వస్థలం మహబూబ్‌నగర్‌లో లభించే కల్లుకు నగరంలో లభించే దానికి ఉన్న తేడాల ప్రభావంతోనూ బాధితురాలు ఇలా చెప్తున్నారా? అనే అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో అత్యాచారం కేసు నిందితులపై 342, 376 (d), 328 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమా మహేశ్వర్‌తో పాటు ఒక సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీసులు విచారిస్తున్నారు. ఈ అత్యాచార ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈనెల 5న తన అక్క భర్తను బాధితురాలు గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేసింది. అక్కతో కలిసి గాంధీ ఆస్పత్రిలోనే బాధితురాలు ఉండగా, పేషెంట్ దగ్గర ఒక్కరే ఉండాలంటూ అక్కాచెల్లెళ్లను ఉమామహేశ్వర్ వేరు చేసినట్లు తేలింది. (చదవండి: Gandhi Hospital: హే గాంధీ!) బాధితురాలిని ఉమామహేశ్వర్, సెక్యూరిటీ గార్డు తమ వెంట తీసుకెళ్లి మత్తు కలిపిన మద్యం ఇచ్చినట్లు అంతా భావించారు. కానీ ఔట్ పేషెంట్ వార్డు దగ్గర సెక్యూరిటీ రూమ్‌లోకి తీసుకెళ్లిన ఉమామహేశ్వర్.. బాధితురాలి ముక్కుకు మత్తుమందు ఉన్న ఖర్చీఫ్ అడ్డుపెట్టి, మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో బాధితురాలు అపస్మారకస్థితిలోకి వెళ్లినట్లు తెలిసింది. స్పృహలోకి వచ్చేసరికి తనపై అత్యాచారం జరిగినట్లు బాధితురాలు గుర్తించింది. సోదరి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇవీ చదవండి: కుప్పకూలిన విమానం: షాకింగ్ వీడియో భావోద్వేగం: వధువుని అలా చూసి కంటతడి పెట్టిన వరుడు -
గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఘటనపై పోలీసుల దర్యాప్తు
-
గాంధీ ఆస్పత్రిలో దారుణం... అక్కచెల్లెళ్లపై అత్యాచారం
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేషెంట్‌కు సాయంగా వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు మత్తు మందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు కామాంధులు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వేపురిగేరికి చెందిన ఓ వ్యక్తికిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. ఈ నెల 4న హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆయనకు సాయంగా భార్యతోపాటు ఆమె చెల్లెలు కూడా వెళ్లారు. పేషెంట్‌ను వేరు వార్డుకు మార్చడంతో అది ఎక్కడో తెలియక అక్కాచెల్లెల్లు ఇబ్బందిపడ్డారు. ఆ సమయంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉమామహేశ్వర్ వార్డు చూపిస్తానని వారిని నమ్మబలికాడు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు. అనంతరం వారికి మత్తుమందు ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని బయటపడిన బాధితురాలు ఈ విషయంపై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉమా మహేశ్వర్ అనే వ్యక్తి తనపై నాలుగైదుసార్లు అత్యాచారం చేశాడని,అక్క ఆచూకీ తెలియడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గాంధీ ఆస్పత్రిలో అయిదు రోజుల క్రితం ఇంత దారుణం జరిగినా వెలుగు చూడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ వేగవంతం గాంధీ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ల్యాబ్ టెక్నీషియలన్ ఉమామహేశ్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా సెక్యూరిటీ గార్డు పరార్ అయ్యాడు. ఉమామహేశ్వర్, సెక్యూరిటీ గార్డ్ కలిసి అత్యాచారం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు కరోనా
గాంధీ ఆస్పత్రి: బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్ అధికారి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా నీరసంగా ఉన్న ఆయన మంగళవారం కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో తక్షణమే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు హోంఐసోలేషన్లో ఉండాలని సూచించారు. తనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని, వైద్యుల సూచన మేరకు హోంఐసోలేషన్లో ఉంటున్నానని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నల్లగొండలోనే సోకిందా... ఐపీఎస్‌కు రాజీనామా చేసిన ప్రవీణ్‌కుమార్ గత పదిరోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈనెల 8న నల్లగొండలో జరిగిన రాజ్యాధికార సంకల్ప సభలో పాల్గొని బీఎస్పీలో చేరారు. ఈ సభకు హాజరైన ఆయనతో పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సన్నిహితంగా మెలిగారు. నల్లగొండ సభ పూర్తయిన తర్వాతే ప్రవీణ్‌కుమార్ ఆరోగ్యంలో స్వల్ప మార్పులు కనిపించాయి. దీంతో నల్లగొండ సభలోనే ప్రవీణ్‌కుమార్‌కు కరోనా సోకినట్లు భావిస్తున్నారు. -
నేటి నుంచి గాంధీ ఆస్పత్రిలో నాన్ కోవిడ్ వైద్య సేవలు
-
గాంధీ ఆస్పత్రి: 110 రోజుల తర్వాత సాధారణ సేవలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆగస్ట్ 3వ తేదీ నుంచి కోవిడ్‌తోపాటు సాధారణ వైద్యసేవలు కూడా అందుబాటులోకి వస్తాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. పలు విభాగాలకు చెందిన హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు, వైద్యులు, సిబ్బందితో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వ హించిన అనంతరం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఎనిమిది అంతస్తుల ఆస్పత్రి ప్రధాన భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఆర్థోపెడిక్ ఐసీయూలో కోవిడ్ ట్రైయాజ్ ఏరి యా, రెండు, మూడు అంతస్తుల్లో కోవిడ్, నాల్గవ అంతస్తులో మ్యూకోర్మైకోసిస్ (బ్లాక్‌ఫంగస్) బాధితులకు కేటాయించినట్లు వివరించారు. కోవిడ్‌కు 40 శాతం, నాన్‌కోవిడ్‌కు 60 శాతం వైద్యులు, సిబ్బందిని కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశామని, ఎమర్జెన్సీ, సాధారణ, ఓపీ సేవలు గతంలో మాదిరిగానే అందుబాటులో ఉంటాయని తెలిపారు. కోవిడ్ కారణంగా 110 రోజుల తర్వాత ఇక్కడ సాధారణ వైద్యం అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. గాంధీఆస్పత్రిలో 153 బ్లాక్‌ఫంగస్, 219 కోవిడ్ రోగులకు ప్రస్తుతం వైద్యసేవలు అందిస్తున్నామని నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. -
Gandhi Hospital: కరోనా విధుల్లో కాబోయే అమ్మలు
గాంధీఆస్పత్రి: కడుపులో పెరుగుతున్న శిశువులను మోస్తూ వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. బాధితులకు మేమున్నామనే భరోసా కల్పిస్తున్నారు. పేగుబంధం.. పడకపై ఉన్న ప్రాణం రెండూ తమకు ముఖ్యమేనంటున్నారు కరోనా విధులు నిర్వహిస్తున్న కాబోయే అమ్మలు. కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పలువురు గర్భిణులు రెండు ప్రాణాలను పణంగా పెట్టి నర్సింగ్ విధులు నిర్వహిస్తూ నైటింగేల్ వారసులుగా నిరూపించుకుంటున్నారు. గర్భంతో ఉండి కరోనా డ్యూటీ చేస్తున్నావా? అని ముక్కున వేలేసుకున్న ఇరుగుపొరుగువారి మాటలు పట్టించుకోకుండా, కుటుంబ సభ్యులు, సన్నిహితులు వారిస్తున్నా లెక్కచేయలేదు. కడుపులో పెరుగుతున్న శిశువుకు ఎటువంటి హాని కలగకుండా.. తాము ఒత్తిడికి గురికాకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ బాధ్యతలు సమపాళ్లలో నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. గాంధీఆస్పత్రిలో నర్సింగ్ విధులు నిర్వహిస్తున్న వారిలో పదిమంది గర్భిణులు ఉన్నారు. నాలుగు నుంచి ఎనిమిది నెలలు నిండినవారు కరోనాను లెక్క చేయకుండా విధులు నిర్వహించడం విశేషం. గర్భిణులైన నర్సింగ్ సిస్టర్స్ అశ్వినీ, రాణి, అనిత, అఖిల, గంగా, కవిత, సరోజ, రవళిలు అందిస్తున్న సేవలను గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, నర్సింగ్ సూపరింటెండెంట్ మంగమ్మల అభినందనలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు ఏమంటున్నారంటే.. తగిన జాగ్రత్తలు తీసుకున్నా.. వృత్తిధర్మాన్ని గౌరవించి భర్త నందకిషోర్, కుటుంబ సభ్యులు సహకరించారు. గాంధీ గైనకాలజీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాను. కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్య విషయమై ఆందోళన ఉన్నప్పటికీ కరోనా విధుల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాను. డ్యూటీలో చేరిన నాడు చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉన్నాను. కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యా. కొన్ని రోజుల్లోనే నెగెటివ్ రావడం, కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుసుకుని, తిరిగి విధుల్లో చేరాను. –అశ్వినీ సేవలు అందించేందుకే.. ఇప్పుడు నాకు ఏడో నెల. గాంధీఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిపై నర్సింగ్ విధులు నిర్వహిస్తున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కావడంతో కోవిడ్ నోడల్ సెంటరైన గాంధీఆస్పత్రిలో డ్యూ టీ చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించలేదు. సేవలు అందించేందుకే ఈ వృత్తిని ఎంచుకున్నానని అందరినీ ఒప్పించాను. నెలల నిండేంత వరకు డ్యూటీకి హాజరవుతాను. శిశువు ఆరోగ్యంపై ఆందోళన ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. భర్త సాయిబాబా, కుటుంబసభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. – రాణి మా శ్రమను గుర్తిస్తే చాలు.. కడుపులో పెరుగుతున్న శిశువుతో పాటు రెండు ప్రాణాలకు తెగించి అందిస్తున్న సేవలను గుర్తించి ప్రోత్సహిస్తే సహచరులు కూడా రెట్టించిన ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారు. కరోనాను జయించి బాధితులు డిశ్చార్జి అవుతున్న క్షణాలు మరిచిపోలేనివి. నేను విధులు నిర్వహించే వార్డులో గర్భిణీ బాధితులు ఉన్నారు. నేను కూడా ప్రెగ్నెన్సీతో మీతోపాటే వార్డులో ఉన్నాను అంటూ ధైర్యం చెప్పడంతో వారంతా త్వరితగతిన కోలుకోవడం ఓ గొప్ప అనుభవం. పీపీఈ కిట్ వేసుకుని విధులు నిర్వహించాలంటే ఓర్పు, సహనంతోపాటు మానసికబలం ఎంతో అవసరం. – అనిత చదవండి: హైదరాబాద్‌లోని పిల్లల్లో ఇవి తక్కువగా ఉన్నాయి -
వీళ్లకి కరోనా అంటే భయం లేదు..
సాక్షి, హైదరాబాద్ (గాంధీఆస్పత్రి): కరోన వైరస్ తాకిడికి ప్రపంచం మొత్తం మాస్క్‌లు వేసుకుని భౌతిక దూరం పాటిస్తూ తీవ్ర భయాందోళనకు గురవుతున్న నేపధ్యంలో ఎటువంటి అదురు, బెదురు లేకుండా ఊయల ఊగుతూ భయమనేది తెలియకుండా బాల్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ చిన్నారులు. తెలంగాణ కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ముందు నుంచి వెల్లేందుకే జంకుతున్న క్రమంలో గాంధీఆస్పత్రి ప్రధాన ద్వారం సమీపంలో మాస్క్‌లు ధరించకుండా ఎటువంటి భయం లేకుండా చిన్నారులు ఆటలాడుకుంటున్న దృశ్యాలను సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది. బాల్యానికి మించిన మధురస్మృతి లేదంటారు. చదవండి: యాపిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుగోడి ఫొటో -
Black Fungus: 6 తప్పుడు కేసులను గుర్తించిన వైద్యులు
గాంధీ ఆస్పత్రి: ఎల్బీనగర్కు చెందిన ఓ యువకుడు నెల క్రితం కరోనా బారిన పడ్డాడు. కొద్దిరోజుల క్రితం పైదవడ దంతాల నొప్పితో పాటు కదులుతున్నట్లు అనిపించడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. స్కానింగ్‌లు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి బ్లాక్‌ఫంగస్ అని చెప్పడంతో సదరు యువకుడు తీవ్రభయాందోళనకు గురై వెంటనే అదే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. రెండు రోజలు వైద్యం అందించి బ్లాక్‌ఫంగస్ మందులు తెచ్చుకోవాలని సూచించారు. సదరు మందులు ప్రైవేటులో అందుబాటులో లేక యువకుడు రిఫరల్‌పై గాంధీ ఆస్పత్రి బ్లాక్‌ఫంగస్ వార్డులో అడ్మిట్ అయ్యాడు. పలు రకాల స్కానింగ్‌లు, వైద్య పరీక్షలు నిర్వహించిన గాంధీ వైద్యులు బ్లాక్ ఫంగస్ కాదని, సాధారణ పిప్పిపన్ను అని నిర్ధారించి, డెంటల్ వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పించి డిశ్చార్జి చేశారు. ► పాతబస్తీకి చెందిన మహిళకు కరోరా పాజిటివ్, మూడు రోజుల క్రితం పక్షవాతం రావడంతో స్థాని క ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. బ్లాక్‌ఫంగస్ లక్షణా లు ఉన్నాయని చెప్పడంతో భయాందోళనకు గురైంది. తెలిసిన వారి సలహా మేరకు గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ కాగా, పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్‌తోపాటు పెరాలసిస్ వచ్చిందని, బ్లాక్‌ఫంగస్ ఆనవాళ్లు లేవని చెప్పి, కరోనాకు ట్రీట్మెంట్ ఇచ్చి స్వస్థత చేకూరిన తర్వాత డిశ్చార్జి చేశారు. ► బ్లాక్‌ఫంగస్‌ను బూచిగా చూపిస్తూ ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను అడ్డంగా దోచు కుంటున్నాయి. పిప్పిపన్ను, పక్షవాతం వంటి రుగ్మతలను బ్లాక్‌ఫంగస్ ఖాతాలో వేయడంతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ► ఓల్డ్‌సిటీకి చెందిన మరోవ్యక్తికి కరోనా, బ్లాక్‌ఫంగస్ లేవు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. స్వల్ప అస్వస్థతకు గురై స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా, బ్లాక్‌ఫంగస్ సోకిందని చెప్పారు. సదరు వ్యక్తి గాంధీఆస్పత్రిలో చేరగా, నిర్ధారణ పరీక్షల్లో కరోనా, బ్లాక్‌ఫంగస్ లేవని తేలింది. సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి బ్లాక్‌ఫంగస్ వార్డులో రిఫరల్‌పై చేరిన ఆరుగురు బాధితులకు ఫంగల్ లక్షణాలు మచ్చుకైనా లేవని గుర్తించారు. ఆయా విభాగాలకు చెందిన వైద్య నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించి బాధితులను డిశ్చార్జి చేశారు. ఆరుగురు బాధితులను గుర్తించి డిశ్చార్జి చేశాం ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి రిఫరల్‌పై గాంధీఆస్పత్రి బ్లాక్‌ఫంగస్ వార్డులో చేరిన ఆరుగురికి ఫంగల్ లక్షణాలు లేవు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి డిశ్చార్జీ చేశాము. వీరిలో ముగ్గురు దంత సంబంధ సమస్యలతో... మరో ముగ్గురు పెరాలసిస్ (ఫిట్స్)తో బాధపడుతున్నారు. స్కానింగ్ చేసిన తర్వాత బ్లాక్‌ఫంగస్ సోకినట్లు భావించిన అవయవ భాగాల నుంచి శాంపిల్స్ సేకరించి ఫంగల్ కల్చర్ టెస్ట్‌కు మైక్రోబయోలజీ ల్యాబ్‌కు పంపిస్తాము. బయాప్సీ నివేదిక ఆధారంగా బ్లాక్‌ఫంగస్‌గా నిర్ధారిస్తాము. ప్రజలు భయాందోళనకు గురికావద్దు. గాంధీ, ఈఎన్టీ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో బ్లాక్‌ఫంగస్ నివారణకు వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – రాజారావు, గాంధీ సూపరింటెండెంట్ చదవండి: చనిపోయాడని తెలియక.. రాత్రంతా మృతదేహంపై నిద్ర..! -
4 గంటలు శ్రమించి.. బ్లాక్ ఫంగస్ తొలగించి..
గాంధీ ఆస్పత్రి: బ్లాక్ ఫంగస్ సోకి మృత్యువుతో పోరాడుతున్న బాధితుడి ప్రాణాలు నిలి పారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. అందరూ అతడిపై ఆశలు వదిలేసుకున్నా.. డాక్టర్లు మాత్రం ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలోని ఐదు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు సుదీర్ఘ శస్త్రచికిత్స జరిపి విజయం సాధించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు, బ్లాక్ ఫంగస్ సర్జరీ కమిటీ చైర్మన్ శోభన్‌బాబు ఆదేశాల మేరకు ఆర్ఎంవో–1 నరేందర్ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి (45) కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతూ ఈనెల 19న ‘గాంధీ’లో చేరాడు. ఎడమ దవడ వాయ డంతో పాటు ఎడమ కన్ను పూర్తిగా కనిపించట్లేదు. కుడికన్ను కొంచెం కనిపిస్తోంది. ముఖం లోని పలు భాగాలకు ఫంగస్ వేగంగా విస్తరిస్తోందని గుర్తించారు. ఈఎన్టీ, ఆప్తాల్మాలజీ, పాస్లిక్ సర్జరీ, అనస్థీషియా, న్యూరోసర్జరీ వైద్యుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించా లని నిర్ణయించారు. ఈనెల 25న సుమారు 4 గంటల పాటు శ్రమించి ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. ఎడమ కన్నుతో పాటు, ముఖ భాగంలోని మాగ్జి లా ఎముకను తెరిచి ఫంగస్‌ను తొలగించారు. ఇన్ఫెక్షన్ సోకిన భాగాలను కొంతమేర తొలగించి, శుభ్రపరిచారు. ప్రస్తు్తతం రోగి కోలుకుంటున్నాడు. బ్లాక్‌ఫంగస్ నియంత్రణకు పొసకొనజోల్ మందు ఇచ్చామని, ఇది అద్భుతంగా పనిచేసిందని వైద్యులు చెప్పారు. రోగి పూర్తిగా కోలుకున్న తర్వాత ప్లాస్టిక్ సర్జరీ ద్వా రా ఆయా భాగాలను పునరుద్ధరిస్తామన్నారు. ఈ అరుదైన శస్త్రచికిత్సలో ప్లాస్టిక్ సర్జరీ, ఆప్తా ల్మాలజీ హెచ్ఓడీలు సుబోధ్‌కుమార్, రవిశేఖర్, పలు విభాగాల డాక్టర్లు పాల్గొన్నారు. చదవండి: ఈ–పాస్ ఇలా తీసుకోండి -
నిర్మానుష్యంగా మారిన గాంధీ ఆసుపత్రి పరిసరాలు
-
అమ్మతనానికి ఎంత కష్టం!
సాక్షి, సిటీబ్యూరో: మాతృత్వాన్ని ఆస్వాదించే అరుదైన క్షణాల కోసం నిండు గర్భిణులు కంటున్న కలలను కరోనా మహమ్మారి చిదిమేస్తోంది. చివరికి తల్లి కాకుండానే మృత్యువు కబళిస్తోంది. ఫస్ట్‌వేవ్‌లో వందల మందికి పురుడు పోసి.. తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడిన ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు సెకండ్ వేవ్‌లో మాత్రం కనీస రక్షణ కల్పించలేకపోతున్నాయి. ఫలితంగా పలువురు గర్భిణులు మాతృత్వపు మధురిమల్ని అనుభవించకుండానే కన్నుమూస్తున్నారు. నగరంలో ఇప్పటివరకు 18 మంది గర్భిణులు కరోనా కారణంగా మృతి చెందగా.. తాజాగా శుక్రవారం కోవిడ్ అనుమానంతో పలు ఆస్పత్రుల్లో అడ్మిషన్ దొరక్క మల్లాపూర్‌కు చెందిన నిండుచూలాలు పావని (22) మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మహమ్మారి కోరల్లో చిక్కుకుని.. వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేపట్టింది. సుమారు లక్షన్నర మంది జ్వర పీడితులున్నట్లు గుర్తించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 50 వేల మంది బాధితులు ఉన్నట్లు గుర్తించింది. వీరిలో ఇప్పటికే కోవిడ్ నిర్ధారణ అయినవారు 30 వేల వరకు ఉన్నట్లు అంచనా. ఇప్పటివరకు గర్భిణులకు నెలవారీ పరీక్షలు నిర్వహించిన పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, వనస్థలిపురం, కొండాపూర్ ఏరియా ఆస్పత్రులు ప్రస్తుతం కోవిడ్ కేంద్రాలుగా మారాయి. కోవిడ్ నిర్ధారణ పరీక్షలతో పాటు టీకాల కార్యక్రమంతో బిజీగా మారుతున్నాయి. నెలవారీ పరీక్షలకు వచ్చే గర్భిణులు వైరస్ బారిన పడుతున్నారు. గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 1,160 మంది గర్భిణులు వైరస్ బారినపడి గాంధీలో చేరగా...ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే 15 వరకు 299 మంది గర్భిణులు వైరస్‌తో ఆస్పత్రిలో చేరారు. వీరిలో 18 మంది మృతి చెందడం కలవరపరుస్తోంది. ప్రస్తుతం గాంధీలో 45 మంది.. గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున 250 ప్రసవాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం నాన్‌కోవిడ్ గర్భిణులకు సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, నిలోఫర్ సహా పలు ఏరియా ఆస్పత్రుల్లో ప్రసవాలు చేస్తుండగా.. కోవిడ్ బారిన పడిన గర్భిణులకు మాత్రం గాంధీలో డెలివరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఒక్క ఆస్పత్రిలోనే 45 మంది గర్భిణులు చికిత్స పొందుతున్నారు. ఇక్కడ రోజుకు సగటున పది డెలివరీలు జరుగుతున్నాయి. కేవలం 45 రోజు ల్లోనే 299 మంది గర్భిణులు కోవిడ్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. వీరే కాకుండా సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవించిన తర్వాత కోవిడ్ నిర్ధారణ అయిన 16 మంది ఆ తర్వాత చికిత్స కోసం గాం«దీలో గైనకాలజీ వార్డులో చేరి వైరస్ నుంచి బయటపడ్డారు. గర్భిణులకు ప్రత్యేకంగా 95 పడకలు.. కరోనా వైరస్ బారిన పడిన గర్భిణులకు చికిత్సలు అందించేందుకు గాంధీ గైనకాలజీ విభాగంలో 95 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. కోవిడ్ నిర్ధారణ అయిన గర్భిణులంతా ప్రసవం కోసం ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడ రోజుకు సగటున పది నుంచి పదిహేను డెలివరీలు చేస్తున్నాం. పది సహజ ప్రసవాలకు పట్టే సమయం.. ఒక్క కోవిడ్ డెలివరీకి పడుతుంది. ఫలితంగా వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగెత్తవద్దు. గాంధీ ఆస్పత్రికి రావాలి. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించబోం. – డాక్టర్ మహాలక్ష్మి, గైనకాలజీ విభాగాధిపతి, గాంధీ ఆస్పత్రి -
Covid-19: ఆస్పత్రిలో బెడ్స్ కావాలా?
లక్డీకాపూల్: కోవిడ్ సెకండ్‌వేవ్ ఉధృతి నేపథ్యంలో ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి. అతికష్టం మీద పడక సమస్య తీరినా.. వెంటిలేటర్ ఖాళీ లేకపోవడమో.. లేక ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యం లేని దుస్థితి. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో బెడ్స్ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, వివరాలు మీ కోసం ‘సాక్షి’ అందిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులు టిమ్స్, గచ్చిబౌలి – 94949 02900 గాంధీ – 93922 49569 ఈఎస్ఐ, సనత్‌నగర్ – 77029 85555 జిల్లా దవాఖాన, కింగ్‌కోఠి – 80085 53882 ఉస్మానియా – 98499 02977 మిలిటరీ హాస్పిటల్, తిరుమలగిరి – 78895 29724 నిలోఫర్ – 94406 12599 చెస్ట్ హాస్పిటల్ – 99492 16758 ఫీవర్ హాస్పిటల్, నల్లకుంట – 93470 43707 ఏరియా ఆసుపత్రి, మలక్‌పేట – 98662 44211, ఏరియా హాస్పిటల్, గోల్కొండ – 94409 38674 ఏరియా హాస్పిటల్, నాంపల్లి – 80085 53888 సీహెచ్‌సీ రాజేంద్రనగర్ – 80085 53865 ఏరియా హాస్పిటల్, వనస్థలిపురం – 80085 53912 జిల్లా దవాఖాన, కొండాపూర్ – 94400 61197 సీహెచ్‌సీ, హయత్‌నగర్ – 80085 53863 ప్రైవేట్ ఆసుపత్రులు కిమ్స్, కొండాపూర్ – 98495 54428 ఆదిత్య బొగ్గులకుంట – 99851 75197 అపోలో జూబ్లీహిల్స్/కంచన్ బాగ్ – 92462 40001 రెయిన్ బో, బంజారాహిల్స్ – 99591 15050 ఒమేగా, బంజారాహిల్స్ – 98480 11421 సెయింట్ థెరిస్సా, ఎర్రగడ్డ – 90320 67678 మల్లారెడ్డి ఇన్ స్టిట్యూట్, సూరారం – 98498 91212 వివేకానంద, బేగంపేట – 99482 68778 కేర్, బంజారాహిల్స్/ హైటెక్‌సిటీ – 99560 69034 నోవా – 93917 11122 కామినేని – 94910 61341 అస్టర్ ప్రైమ్, అమీర్‌పేట – 91777 00125 వాసవి, లక్డీకాపూల్ – 98481 20104 యశోద – 99899 75559, 93900 06070 మల్లారెడ్డి ఆస్పత్రి, సూరారం – 87903 87903 రవి హిలియోస్, ఇందిరాపార్క్ – 98490 84566 ఇమేజ్, అమీర్‌పేట/మాదాపూర్ – 90000 07644 ప్రతిమ, కాచిగూడ 99593 61880/ 97039 90177 ఏఐజీ, గచ్చిబౌలి –040–4244 4222, 6744 4222 విరించి, బంజారాహిల్స్ – 040 4699 9999 మెడికోవర్, మాదాపూర్ – 040 68334455 సన్ షైన్ – 040 44550000, 80081 08108 దక్కన్ – 90000 39595, స్టార్, బంజారాహిల్స్ – 040 4477 7777 మమత–బాచుపల్లి – 78932 11777 ఆయాన్ ఇన్స్టిట్యూట్ కనకమామిడి – 98496 05553 మెడిసిటీ ఇన్స్టిట్యూట్ , మేడ్చల్ – 97037 32557 వీఆర్కే మెడికల్ కాలేజీ, మెయినాబాద్ – 99859 95093 షాదన్ మెడికల్ కాలేజీ, హిమాయత్‌సాగర్ – 98482 88697 చదవండి: Bachupally: 840 ఫ్లాట్స్.. 320 విల్లాలు: 24/7వలంటీర్లు -
గాంధీ ఆసుపత్రిని పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్
-
Photo Feature: కరోనా ఇంటింటి సర్వే, టీకా కష్టాలు
హైదరాబాద్‌లో కరోనా ఇంటింటి సర్వే మొదలైంది. వేసవి కాలంలో వచ్చే తాటిముంజలు నోరూరిస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కష్టాలు కొనసాగుతున్నాయి. కోవిడ్ కట్టడికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్, కర్ఫ్యూలు అమలవుతున్నాయి. -
కరోనా భయంతో కాటికి వెళ్లాలనుకుంది.. కాపాడారు
సాక్షి, గాంధీఆస్పత్రి( హైదరాబాద్): కరోనా భయంతో మతిస్థిమితం కోల్పోయి ఆస్పత్రిలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వృద్ధురాలికి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. వివరాల్లోకి వెళితే... నగరానికి చెందిన 65 ఏళ్ల పుష్పావతి(పేరుమార్చాం) కరోనా పాజిటివ్‌తో గత నెల 26న గాంధీ ఆస్పత్రిలో చేరింది. కరోనా భయంతో పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన ఆమె ఏప్రిల్ 28వ తేదీన ఆస్పత్రి భవనంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి రోగులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వృద్ధురాలిని నిలువరించి వార్డులో చేర్చి మంచానికి కట్టేసి వైద్యసేవలు అందించారు. ఈ మేరకు గతనెల 29వ తేదీన ‘కరోనా బాధితురాలి ఆత్మహత్యాయత్నం’ శీర్షికతో సాక్షిలో ప్రచురించిన కథనానికి ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పందించారు. వృద్ధురాలికి సపర్యలు చేసేందుకు కేర్‌టేకర్‌ను నియమించి ప్రత్యేక వైద్యం అందించారు. మానసిక రుగ్మతలు నివారించేందుకు సైకియాట్రిస్ట్ డాక్టర్ జూపాక అజయ్‌కుమార్ ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించారు. మరోమారు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో బుధవారం ఆమెను డిశ్చార్జీ చేశారు. సదరు వృద్ధురాలు గతంలో సెరిబ్రోవాసు్కలర్ ఎటాక్ (సీవీఏ)తో బాధపడుతుండేదని, కరోనా సోకడంతో అయోమయానికి గురైన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మానసిక వైద్యుడు అజయ్‌కుమార్ తెలిపారు. తనకు పునర్జన్మ ప్రసాదించిన గాంధీ వైద్యులు, కృషి చేసిన ‘సాక్షి’ దినపత్రికకు వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ( చదవండి: Coronavirus: కోవిడ్ మళ్లీ సోకితే ఏం చేయాలి? ) -
ఉన్నకాడికి ఊడ్చేసి.. చివరికి గాంధీకి
హైదరాబాద్: నిజామాబాద్‌కు చెందిన రాజేందర్ (52)కు పది రోజుల క్రితం కోవిడ్ నిర్ధారణ అయింది. చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరు రోజుల పాటు వెంటిలేటర్ సపోర్ట్‌తో చికిత్సలు అందించారు. ఇందుకు రూ.4.18 లక్షల బిల్లు వేశారు. తీరా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మా వల్ల కాదంటూ చేతులెత్తేశారు. గత్యంతరం లేక చివరకు అదే వెంటిలేటర్ సహాయంతో బుధవారం రాత్రి గాంధీకి తరలించారు. ఆస్పత్రిలో చేర్చిన కొద్ది సేపటికే ఆయన మృతి చెందారు. హుజూరాబాద్‌కు చెందిన సమ్మయ్య(40)కు వారం రోజుల క్రితం కోవిడ్ నిర్ధారణ అయింది. తొలుత వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడ సరైన వైద్యం అందకపోవడంతో హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఒక రోజు చేర్చుకుని రూ.90 వేల బిల్లు వేశారు. తీరా తమ వల్ల కాదని, హైదరాబాద్‌కు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో ఆయన్ను బుధవారం సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. రెండు గంటల పాటు ఎమర్జెన్సీలో ఉంచుకున్నారు. రూ.20 వేలకుపైగా ఛార్జీ చేశారు. అనంతరం వెంటిలేటర్లు లేవని చెప్పి బయటికి పంపారు. దిక్కుతోచని స్థితిలో వారు రాత్రి 2 గంటలకు గాంధీకి చేరుకున్నారు. అప్పటికే ఆస్పత్రిలో వెంటిలేటర్లు లేకపోవడంతో ఆక్సిజన్‌పై ఉంచారు. ప్రస్తుతం ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు... ఇలా ఒక్క రాజేందర్, సమ్మయ్య మాత్రమే కాదు...కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్న అనేక మందిని ఉన్నకాడికి ఊడ్చేసి..చివరి నిమిషంలో..మా వల్ల కాదంటూ..ఇలాగే వదిలించుకుంటున్నాయి. వాళ్లు దోచుకుంటే..నిందలు మాపైనా? రోగి ఆస్పత్రిలో చనిపోతే..రోగి బంధువులు ఆందోళనకు దిగే అవకాశం ఉంది. అంతే కాదు ఆస్పత్రి ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదు. బిల్లు మొత్తం చెల్లించిన తర్వాత చికిత్సకు రోగి స్పందించడం లేదని..అయినా ఐసీయూలో ఉంచితే..వైద్య ఖర్చులు రోజుకు రూ.60 వేలకుపైగా అవుతుందని బంధువులను భయపడుతున్నారు. మెరుగైన వైద్యం అందాలంటే గాంధీకి తీసుకెళ్లడం ఒక్కటే పరిష్కారమని సూచిస్తున్నాయి. బలవంతంగా వారిని వదిలించుకుంటున్నారు. అప్పటికే వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో గాంధీ వైద్యులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఇలా ఆఖరి నిమిషంలో వచ్చిన వారిలో కొంత మంది ఆస్ప్రతిలో చేరిన కొద్ది సేపటికే మృతి చెందుతుండగా...మరికొంత మంది రెండు మూడు రోజుల తర్వాత కన్ను మూస్తున్నారు. చికిత్సల పేరుతో లక్షల రూపాయలు దోచుకుంది కార్పొరేట్ ఆస్పత్రులైతే...చికిత్సల్లో నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలను గాంధీ వైద్యులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వందకుపైగా అడ్మిషన్లు..20లోపే డిశ్చార్జిలు 1850 పడకలు ఉన్న గాంధీ ఆస్పత్రిలో 500 వెంటిలేటర్లు, 1250 ఆక్సిజన్ పడకలు ఉన్నాయి. ప్రస్తుతం వెంటì లేటర్లు ఖాళీ లేవు. ఆక్సిజన్ పడకలపై కూడా 250 మందికిపైగా చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి నేరుగా వచ్చే కేసులతో పోలిస్తే కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి రిఫరల్‌పై వస్తున్న కేసులే అధికం. నేరుగా వచ్చిన కేసులకు పడకలు కేటాయించలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే సోమవారం 110 మంది వస్తే..మంగళవారం 205 మంది వచ్చారు. బుధవారం 185 మంది వచ్చారు. డిశ్చార్జిలు అవుతున్న వారు కేవలం 20లోపే. కొత్తగా వెంటిలేటర్‌తో వచ్చిన వారికి చేర్చుకోలేని దుస్థితి. అనివార్య పరిస్థితుల్లో వారిని ఆక్సిజన్ పడకలపై ఉంచాల్సి వస్తుండటంతో ఊపిరాడక వారు ముందే చనిపోతున్నారు. ( చదవండి: గాంధీ ఆస్పత్రి: కరోనా బాధితులు ఫుల్, ఐసీయూ బెడ్లు నిల్ ) -
వెంటిలేటర్‌పై 30% యువకులే.. జాగ్రత్త
రోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్ అవసరం పడదు. కానీ అనేక మంది భయంతో అనవసరంగా వాడుతున్నారు. మా వద్దకు వచ్చే రోగుల్లో 30 శాతం మంది అవసరం లేకపోయినా ఆక్సిజన్ కోసం వస్తున్నారు. అందువల్లనే అవసరమైన వారికి కూడా ఆక్సిజన్ దొరకని పరిస్థితి. గాంధీలో వెంటిలేటర్‌పై ఉన్న వారిలో 30% మంది యువకులే ఉన్నారు. అంటే 30–45 ఏళ్ల వయస్సు వారన్నమాట. సెకండ్ వేవ్‌లో యువకులు కూడా ఎక్కువగా వైరస్ బారినపడుతున్నారు. అలాగే చిన్నపిల్లల ద్వారా పెద్దలకు సోకుతోంది. పిల్లలకు వైరస్ కనిపించదు కానీ వారు పెద్దలకు వ్యాపింపజేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రెమిడెసివిర్, తుసిలిజు మాబ్... ఇప్పుడు వీటికున్న క్రేజే వేరు. వీటిని కరోనా రోగులపాలిట అపర సంజీవనిగా అందరూ భావి స్తున్నారు. ఇదే కరోనా సీరియస్ రోగులను కాపాడే గొప్ప మందుగా తలపోస్తున్నారు. కానీ ఇలాంటి యాంటీ వైరల్ డ్రగ్స్‌తో ప్రాణాలు నిలపడం సాధ్యం కాదని, వాటిని వాడాల్సిన అవసరమే లేదని తేల్చి చెబుతున్నారు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు. వాటికోసం పిచ్చెక్కినట్లు బ్లాక్‌లో కొంటూ వేలు లక్షల రూపాయలు వృథా చేసుకుంటున్నారని అంటున్నారు. సెకండ్ వేవ్‌లో పిల్లలతోపాటు యువకులు కూడా ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని చెప్పారు. గాంధీలో 30 శాతం మంది యువకులే వెంటిలేటర్‌పై ఉన్నారన్నారు. కరోనా చికిత్సకు సంబంధించి వివిధ అంశాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... అవసరం లేకున్నా భయంతో ఆక్సిజన్... కరోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్ అవసరం పడదు. అనేక మంది భయాందోళనతో అనవసరం గా వాడుతున్నారు. మా వద్దకు వచ్చే రోగుల్లో 30 శాతం మంది అవసరం లేకపోయినా ఆక్సిజన్ కోసం వస్తున్నారు. వాస్తవంగా ఆక్సిజన్ శాచురేషన్ స్థాయిలను బట్టి వాడాలా లేదా అనే నిర్ధారణకు వస్తాం. ఆక్సిజన్ శాచురేషన్ లెవెల్స్ 85 శాతం కంటే తక్కువగా ఉంటే అత్యంత విషమమైన పరి స్థితుల్లో రోగి ఉన్నట్లు లెక్క. 85–89 మధ్య ఉంటే విషమం, 90–93 శాతం శాచురేషన్ ఉంటే మధ్య స్థాయి, 93–95 వరకు ఉంటే మైల్డ్‌గా ఉన్నట్లు లెక్క. 95 అంతకంటే ఎక్కువగా శ్యాచురేషన్ ఉంటే సాధారణం కింద లెక్క. కానీ శాచురేషన్ స్థాయి 100 శాతం రావడంలేదని, 95 మాత్రమే ఉందని.. ఆక్సిజన్ పెట్టాలని అనేక మంది ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అందువల్లనే అవసర మైన వారికి కూడా ఆక్సిజన్ దొరకని పరిస్థితి. చాలామంది దమ్ము అని ఆస్పత్రికి వస్తుంటారు.. కానీ వారిని చూస్తే సాధారణంగానే ఉంటారు. వెంటిలేటర్‌పై 30 శాతం మంది యువకులే... గాంధీలో వెంటిలేటర్‌పై ఉన్న వారిలో 30 శాతం మంది యువకులే ఉన్నారు. అంటే 30–45 ఏళ్ల వయస్సు వారన్నమాట. సెకండ్‌వేవ్‌లో యువకులు కూడా ఎక్కువగా వైరస్ బారినపడుతున్నారు. ఇక గతం కంటే ఇప్పుడు డాక్టర్లు ఎక్కువగా వైరస్‌కు గురవుతున్నారు. అలాగే చిన్నపిల్లల ద్వారా పెద ్దలకు సోకుతోంది. పిల్లలకు వైరస్ కనిపించదు కానీ వారు పెద్దలకు వ్యాపింపజేస్తున్నారు. అందుకే ప్రభుత్వం పాఠశాలు, కాలేజీలను మూసేసింది. సీరియస్ కేసులను తగ్గించలేదు రెమిడెసివిర్, తుసిలిజుమాబ్, ప్లాస్మాలు వాడితే కరోనా తగ్గుతుందన్న రుజువు లేనేలేదు. రెమిడెసివిర్‌ను వాడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్పింది. సీరియస్ రోగులను అది ఏమాత్రం సాధారణ స్థితికి తీసుకురాలేదు. రెమిడెసివిర్ కావాలని రోగులే ఎక్కువగా అడుగుతున్నారు. అది ఇస్తేనే సరైన వైద్యంగా భావిస్తున్నారు. దీనిపై జనాల్లో పిచ్చి అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఇంజెక్షన్ ప్రాణాలను ఏమీ కాపాడదు. యాంటీ వైరల్ డ్రగ్స్ అయిన రెమిడెసివిర్, తుసిలిజుమాబ్, ఫావిపిరావిర్‌లతో ప్రయోజనం లేదు. తుసి లిజుమాబ్‌ను డాక్టర్ నిర్ణయం మేరకు అత్యంత అరుదైన కేసుల్లోనే వాడాలి. ఈ మందు ఒక శాతం మందిలో కూడా అవసరం పడదు. అయితే రోగుల సంతృప్తి కోసం మాత్రమే ఇస్తున్నారు. సివియర్ కేసుల్లో స్టెరాయిడ్ చికిత్స... కరోనా లక్షణాలను బట్టే చికిత్స ఉంటుంది. సాధారణ కేసుల్లో డాక్టర్ సూచనల మేరకు మందులు వాడితే సరిపోతుంది. సీరియస్ కేసుల్లో స్టెరాయిడ్స్, యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్, యాంటీ కోయాగ్లెన్స్ మందులు అవసరాన్ని బట్టి వాడాలి. ఏ సమయంలో ఇవ్వాలో వాటిని అప్పుడు ఇస్తేనే సరిగా పనిచేస్తాయి. సెకండ్ వేవ్‌లో వైరస్ విజృంభణ అధికం... మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. ట్రిపుల్ మ్యుటేషన్ రాష్ట్రంలో గుర్తించలేదు. డబుల్ మ్యుటెంట్ వైరస్‌లైతే ఉన్నాయి. దీంతో వైరస్ ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉంది. కుటుంబంలో ఒకరికి వస్తే ఇతరులకు వేగంగా వ్యాపిస్తుంది. దీంతో చాలామంది వైరస్ బారిన పడుతున్నారు. వందలో 80 మందికి ఇంట్లోనే రికవరీ అవుతుంది. మిగిలిన వారిలో ఐదుగురికి మాత్రమే ఆక్సిజన్ అవసరం పడుతుంది. వైరస్ విజృంభణ వల్ల అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఇప్పుడు కరోనా చికిత్సలకు అనుమతి వచ్చింది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు పడకలు నిండుతున్నాయి. కేసుల సంఖ్య ఎక్కువుంది కాబట్టి అందులో సివియర్ కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మూడు వారాల్లో వైరస్ తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నాం. టీకా వేసుకోండి... జాగ్రత్తలు పాటించండి అనవసరంగా బయటకు పోవద్దు. సినిమాలు, పబ్స్, రెస్టారెంట్లు, బార్లకు వెళ్లొద్దు. అత్యవసరమైతే తప్ప శుభకార్యాలకు వెళ్లొద్దు. బర్త్‌డే పార్టీలు చేసుకోవద్దు. పండుగలను తక్కువ మందితో జాగ్రత్తలు తీసుకొని చేసుకో వాలి. ముక్కు, నోరు పూర్తిగా మూసుకునేలా మాస్క్ పెట్టుకోవాలి. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఏ కంపెనీ వ్యాక్సిన్ అని చూడకుండా ఏది అందుబాటులో ఉంటే దాన్ని వేసుకోవాలి. కరోనా నియంత్రణలో ఇవే కీలకమైన అంశాలు. -గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావుతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ -
పాజిటివ్ వచ్చిన అందరికీ ఆక్సిజన్ సపోర్ట్ అవసరమా?
లేదు. అందరికీ ఆస్పత్రిలో అడ్మిషన్, ఆక్సిజన్ సపోర్ట్ అవసరం ఉండదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ రక్తంలో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ 94 శాతం కంటే తక్కువగా ఉన్న వారికి ఇన్ఫెక్షన్ ఉన్నట్లు భావించి, ఆస్పత్రిలో అడ్మిషన్‌తో పాటు ఆక్సిజన్ సపోర్ట్ అవసరమని సూచిస్తాం. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న కరోనా బాధితులకు సరైన సమయంలో ఆక్సిజన్ అందిస్తే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆక్సిజన్ అందించక పోతే..శ్వాస కష్టమై చివరకు వెంటిలేటర్ అవసరమవుతంది. ప్రస్తుతం చాలామంది ఇంట్లోనే ఉండి ఆక్సిజన్ లెవెల్స్ చూసుకుంటున్నారు. ఇందుకు వీరు పల్స్ ఆక్సీమీటర్ (ఫింగర్ డివైజ్) వాడుతున్నారు. దీన్ని వేలికి పెట్టుకుంటే పల్స్‌తో పాటు రక్తంలో ఆక్సిజన్ శాతం ఎంతుందో సూచిస్తుంది. ప్రతి వ్యక్తికీ రక్తంలో ఆక్సిజన్ 100 శాతం ఉండాలి. 95 వరకు సాధారణంగా భావిస్తారు. 90 నుంచి 95 శాతం మధ్యలో ఉంటే మోడరేట్‌గా, అంతకంటే తక్కువ ఉంటే ప్రమాదమని చెబుతారు. వీరిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాల్సి ఉంటుంది. 97 శాతం ఆక్సిజన్ ఉన్నప్పుడు ఆరు నిమిషాలు నడిచిన తర్వాత ఐదు శాతం కంటే ఎక్కువ తగ్గితే (92 శాతానికి చేరితే) ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. ఇక పల్స్ 70 నుంచి 100 మధ్య ఉంటే సాధారణంగా భావిస్తారు. 60 కంటే తక్కువగా ఉంటే హార్ట్ రేట్ తగ్గిందని, 100 కంటే ఎక్కువగా ఉంటే పెరిగిందని భావిస్తారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు అనవసరంగా భయపడుతున్నారు. భయమే రోగుల పాలిట పెద్దముప్పుగా పరిణమిస్తోంది. ఎక్కువ ఒత్తిడికి గురికావడం, అనవసర ఆందోళన, అవçససరానికి మించి వ్యాయామాలు చేయడం వల్ల కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది. కడుపునిండా తిని, కంటి నిండా నిద్రపోవడం చాలా మేలు చేస్తుంది. - డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి కోవిడ్ నోడల్ ఆఫీసర్, గాంధీ ఆస్పత్రి, హైదరాబాద్ -
సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరం
సాక్షి, గాంధీఆస్పత్రి: కరోనా సెకెండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారి, కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యిందని, ఈ తరుణంలో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూలతో పెద్దగా ఫలితాలు ఉండవని, ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ను నియంత్రించవచ్చని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్య ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మార్చామని, ప్రాణాపాయస్థితిలో ఉన్న కరోనా రోగులను మాత్రమే ఇకపై గాంధీలో చేర్చుకుంటామన్నారు. మొదటి వేవ్‌లో కరోనా సోకిన రెండు, మూడు రోజులకు శరీరంలో వైరస్ లోడ్ పెరిగేదని, సెకెండ్ వేవ్‌లో కేవలం గంటల వ్యవధిలో పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఊపిరితిత్తులపై ఎటాక్.. సెకండ్‌వేవ్ మరో మూడు నెలలు పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు వైద్యనిపుణులు అంచనాకు వచ్చారని తెలిపారు. సెకెండ్‌వేవ్‌లో రూపాంతరం చెందిన కరోనా వైరస్ మానవ శరీరంలోని లీవర్, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులపై ఎక్కువగా ప్రభావం చూపుతుందన్నారు. శరీరంలో చేరిన వైరస్ రక్త ప్రసరణకు అడ్డుపడటంతో పెద్దసంఖ్యలో బాధితులు పక్షవాతానికి(పెరాలసిస్)కు గురవుతున్నారని, ఊపిరితిత్తులపై ఎటాక్ చేయడంతో శ్వాస అందక ప్రాణాపాయస్థితికి చేరుకుంటున్నారని వివరించారు. గాంధీలో వెంటిలేటర్లు, ఆక్సిజన్ పడకలతోపాటు నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, మందుల కొరత లేదన్నారు. కోవిడ్ బాధితులతో సహాయకులను ఆస్పత్రిలోకి అనుమతించమని స్పష్టం చేశారు. గత ఘటనలు, అనుభవాలను పాఠాలుగా తీసుకుని మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించి అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, కోవిడ్ నిబంధనలు పాటించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కోవిడ్ టీకా సెంటర్ కొనసాగుతుంది గాంధీ ఆస్పత్రి ఆర్ఎంఓ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ టీకా సెంటర్ కొనసాగుతుందని సూపరింటెండెంట్ రాజారావు స్పష్టం చేశారు. ప్రధాన ద్వారం నుంచి కోవిడ్ బాధితులు, అంబులెన్స్‌లు రాకపోకలు సాగిస్తాయని, ఆర్ఎంఓ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న గేట్‌ను శనివారం నుంచి అందుబాటులోకి తెస్తామన్నారు. ఆస్పత్రి ప్రధాన భవన సముదాయానికి కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ దూరంగా ఉండటంతో టీకా కోసం వచ్చేవారు ఎటువంటి భయాందోళన చెందాల్సిన పనిలేదన్నారు. నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు గోపాలపురం ఏసీపీ వెంకటరమణ, చిలకలగూడ సీఐ నరేష్ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారని తెలిపారు. ( చదవండి: జర జాగ్రత్త: వ్యాక్సిన్ కోసం వెళితే మొదటికే ముప్పు! ) -
‘గాంధీ’లో డిష్యుం.. డిష్యుం
గాంధీఆస్పత్రి: గాంధీ ఆస్పత్రిలో రెగ్యులర్ ఉద్యోగి, కాంట్రాక్టు కార్మికుడి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాంట్రాక్టు కార్మికుడు శంకరయ్య గాంధీ క్యాజువాలిటీ ఆపరేషన్ థియేటర్ (సీఓటీ) వద్ద విధులు నిర్వహిస్తుండగా, రెగ్యులర్ ఉద్యోగి లక్ష్మీపతి మేల్ నర్సింగ్ ఆర్డర్లీ (ఎంఎన్ఓ)గా పనిచేస్తున్నాడు. ఈనెల 10న హెల్త్ సూపర్వైజర్ రవికుమార్ కార్యాలయం వద్ద వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో హెల్త్ సూపర్వైజర్ సమక్షంలోనే లక్ష్మీపతి, శంకరయ్యపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై శంకరయ్య పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు లక్ష్మీపతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ నరేష్ తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగిపై దాడి విషయం తన దృష్టికి వచ్చిందని ఆస్పత్రి నోడల్ అధికారి, కాంట్రాక్టు కార్మికుల ఆర్ఎంఓ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధ్యుడిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దాడికి పాల్పడిన లక్ష్మీపతిని తక్షణమే సస్పెండ్ చేయాలని కాంట్రాక్టు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. శంకరయ్యకు మద్దతుగా సోమవారం ధర్నా, నిరసన చేప్టటనున్నారు. ( చదవండి: ప్రభుత్వ ధరలకే కోవిడ్ చికిత్స ) -
గాంధీలో పెరుగుతున్న కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఐసీయూలో ప్రస్తుతం 136 మంది కరోనా రోగులకు వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. ప్రధాన భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ట్రైయాజ్ ఏరియా, రెండు, మూడు అంతస్తుల్లో 300 పడకలతో కోవిడ్ ఐసీయూను అందుబాటులోకి తెచ్చారు.ప్రాణాపాయస్థితిలో ఉన్న కోవిడ్ బాధితులకు మాత్రమే ఐసీయూలో వైద్యసేవలు అందిస్తున్నామని, కోవిడ్ పాజిటివ్ ఉండి ఎటువంటి రుగ్మతలు లేనివారిని కింగ్‌కోఠి, టిమ్స్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నామని వివరించారు. సెకండ్‌వేవ్‌లో కోవిడ్ బాధితులతోపాటు మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు ఆస్పత్రికి చెందిన ఓ అధికారి వాఖ్యానించడం గమనార్హం. ప్రత్యేక కరోనా మార్చురీ ఏర్పాటు.. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో ప్రత్యేక కరోనా మార్చురీని గురువారం అందుబాటులోకి తెచ్చారు. కోవిడ్, నాన్‌కోవిడ్ రెండు రకాల వైద్యసేవలు అందిస్తున్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత మార్చురీ పక్కన గల బయోమెడికల్ వేస్టేజీ పాంట్ల్‌ను కరోనా మార్చురీగా ఏర్పాటు చేశారు. -
నిరుద్యోగి సునీల్ మృతి, గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్యాయత్నం చేసిన నిరుద్యోగి బోడ సునీల్ నాయక్.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఏడేళ్లు అవుతున్నా ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ప్రకటించడం లేదని ఆవేదన చెంది మార్చి 27న సునీల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి విదితమే. పురుగుల మందు తాగిన సునీల్‌ను విద్యార్థులు.. ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సునీల్ మరణించాడు. సునీల్ స్వస్థలం వరంగల్ జిల్లా గూడూరు మండలం గుండెంగ సోమ్లా తండా. గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత సునీల్ మృతదేహాన్ని నిమ్స్ నుండి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. గాంధీ ఆసుపత్రికి పెద్ద ఎత్తున చేరుకున్న బీజేపీ నేతలు, విద్యార్థులు, సునీల్ బంధువులు మార్చూరి ముందు ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి.. సునీల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భారీగా మోహరించిన పోలీసులు.. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేశారు. కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలి: బండి సంజయ్ సునీల్ నాయక్ కుటుంబాన్ని గాంధీ ఆసుపత్రి వద్ద రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, సునీల్ నాయక్ది ఆత్మహత్య కాదని.. ఇది కేసీఆర్ సర్కార్ హత్య అంటూ ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకునే ముందు సునీల్.. కేసీఆర్ పేరు ప్రస్తావించాడన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదు కాబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. కేసీఆర్‌పై కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు తొందరపడి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఉద్యోగాలు కల్పిస్తామని బండి సంజయ్ అన్నారు. -
పాపం పసివాళ్లు: ఆస్పత్రి సిబ్బందే అమ్మనాన్న అయ్యారు
సాక్షి, సిటీబ్యూరో: అంతుచిక్కని అంటు రోగం.. కొమ్ములు తిరిగిన కొత్త వైరస్.. ముట్టుకుంటే అంటుకునే గుణం.. చివరకు తుమ్మినా.. దగ్గినా.. భయమే.. మందుల్లేవు.. చికిత్సపై వైద్యులకు అవగాహన లేదు. కంటికి కన్పించని ఆ కొత్త వైరస్ అతి కొద్ది కాలంలోనే ఖండాంతరాలు దాటి మార్చి రెండో తేదీన నగరంలోకి ప్రవేశించింది. ఆస్పత్రిలో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎంతో మంది ఆత్మీయులను కోల్పోగా.. మరెంతో మంది కనీసం కడసారి చూపులకు కూడా నోచుకోలేదు. కరోనాపై పోరులో అహర్నిశలు శ్రమించి.. చివరకు పైచేయి సాధించారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. ఒంటినిండా పీపీఈ కిట్లు, మాస్కులు ధరించి రోజుల తరబడి ఇంటికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి 35 వేల మందికి వైద్య సేవలు అందించారు. ఆస్పత్రి పీడియాట్రిక్ వార్డులో 510 మంది పిల్లలు చికిత్స పొందారు. వీరిలో పుట్టుకతోనే కిడ్నీ సబంధిత సమస్యతో బాధపడుతున్న వారు 25 మంది శిశువులు ఉండగా, కేన్సర్ 20, కాలేయం 15, ఫిట్స్ 30, హృద్రోగం 20, మధుమేహం ముగ్గురు బాధితులు ఉన్నారు. 40 మంది చిన్నారులు మినహా మిగిలిన వారందరినీ కాపాడారు. ఇక గైనకాలజీ విభాగం వైద్యులు 950 మంది కోవిడ్ గర్భిణులకు పురుడు పోశారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన వారిలో అప్పుడే పుట్టిన శిశువు నుంచి 100 ఏళ్లు దాటిన వృద్ధుల వరకు ఉన్నారు. తల్లిదండ్రులు వదిలేస్తే.. ‘పుట్టుకతోనే కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న దుండిగల్‌కు చెందిన కార్తీక్(4)కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు బాలుడిని నిలోఫర్ ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు. ఆస్పత్రిలో కోవిడ్ వార్డు లేకపోవడంతో.. గాంధీకికు తరలించారు. ఆ తర్వాత కనీసం బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు కూడా ఎవరూ రాలేదు. తల్లిదండ్రులు కనిపించకపోవడంతో బాలుడు తల్లడిల్లిపోయాడు. తరచూ గుక్కపట్టి ఏడ్చేవాడు. విషయం తెలిసి విధి నిర్వహణలో ఉన్న స్టాఫ్‌నర్సులే అమ్మలా అక్కున చేర్చుకున్నారు. ఆకలితో ఏడ్చినప్పుడల్లా పాలు, బిస్కెట్లు, అన్నం తినిపించారు. జోలపాడి నిద్ర పుచ్చారు. 14 రోజుల తర్వాత నెగిటివ్ వచ్చింది. అయినా తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు రాలేదు. చివరకు పోలీసుల సాయంతో బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చాల్సి వచ్చింది’. వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులను వైద్యులతో పాటు స్టాఫ్‌నర్సులు తల్లిలా ఆదరించారు. ఒంటినిండా పీపీఈ కిట్లు, మాస్క్‌లు ధరించి, ఉక్కపోతతో శరీరమంతా చెమటలు కక్కుతుంటే చిన్నారులకు వారు అన్నీ తామై సపర్యలు చేశారు. వైద్యులకు చాలెంజ్‌గా డౌన్‌సిండ్రోమ్ కేసు అరుదైన డౌన్‌సిండ్రోమ్‌తో బాధపడుతున్న మూడు నెలల శిశువుకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆస్పత్రికి రావడంతోనే వెంటిలేటర్‌పై వచ్చింది. ఇలాంటి వారు బతకడం కష్టం. ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్కు తోడు.. గుండె, కిడ్నీ సమస్యలు కూడా ఉన్నాయి. క్లిష్టమైన ఈ కేసులను విభాగాధిపతి డాక్టర్ జార్జ్ నేృత్వంలో డాక్టర్లు సుచిత్ర, జయలక్ష్మి, శ్రీకాంత్భట్, ఉమాదేవి, శివరాం ప్రసాద్, మధుసూదన్, రమ్యతో కూడిన వైద్య బృందం చాలెంజ్‌గా తీసుకుని సేవలు అందించిందని పీడియాట్రిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ సందనాల తెలిపారు. బిడ్డను బతికించాలని.. మహబూబ్‌నగర్‌కు చెందిన జాక్వాబ్(23 రోజులు) శిశువుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నెలలోపు శిశువుకు కోవిడ్ నిర్ధారణ కావడం దేశంలోనే తొలిది. లూజ్మోషన్తో బాధపడుతుండటంతో చికిత్స కోసం తల్లి నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్య పరీక్షల్లో తల్లికి నెగిటివ్ రాగా.. శిశువుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎలాగైనా తన బిడ్డను బతికించాలని తల్లి వైద్యులను వేడుకుంది. ఆ పసిగుడ్డును తాము కంటికి రెప్పలా చూసుకున్నట్లు స్టాఫ్‌నర్సులు విమల, సత్య, శాంత, శిరీష తెలిపారు. కోలుకున్న బిడ్డను తల్లికి అప్పగించినప్పుడు వారు చెప్పిన కృతజ్ఞతలను ఇప్పటికీ మర్చిపోలేమన్నారు. గాంధీలో మొత్తం పడకలు 1800 ఆస్పత్రిలో తొలి పాజిటివ్కేసు నమోదు మార్చి 2 చికిత్స పొందిన కోవిడ్ బాధితులు 35,000 12 ఏళ్లలోపు చిన్నారులు 510 కరోనా బాధిత గర్భిణులకు చేసిన ప్రసవాలు 950 సిజేరియన్ ప్రసవాలు 612 సహజ ప్రసవాలు 338 కోవిడ్ బారిన పడిన వారికి చేసిన ఇతర సర్జరీలు 250 కోవిడ్ సోకిన వారిలో కిడ్నీ బాధితులు 3,000 డయాలసిస్ సేవలు 7,000 బాధితుల్లో 60 ఏళ్లు పైబడిన వారు 40 % 103 ఏళ్ల వారు ఒకరు చికిత్స పొందిన గర్భిణులు 400 వైరస్ బారిన పడిన వైద్య సిబ్బంది 68 చదవండి: వారందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ : నీతా అంబానీ -
కరోనా వ్యాక్సిన్.. వెనక్కితగ్గిన ఈటల
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఊపందుకున్న తరుణంలో భారత్‌లోనూ పంపిణీ షూరు అయ్యింది. కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో శనివారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 3,006 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది. తొలి టీకాను ఢిల్లీ ఎయిమ్స్‌లోని శానిటైజర్ కార్మికుడు మనీష్ కుమార్‌కు వేయగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ టీకా ప్రక్రియ ఆరంభమైంది. అయితే తొలి టీకాను తానే వేసుకుంటానని ప్రకటించిన తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. శనివారం గాంధీ ఆస్పత్రిలో వ్యాక్సిన్ ప్రక్రియను ఆరంభించిన ఆయన.. తొలి టీకా వేసుకోలేదు. కరోనా తొలి టీకాను పారిశుధ్య కార్మికులు, హెల్త్ వర్కర్స్కు మాత్రమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను జారీచేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే గాంధీ ఆస్పత్రిలో హెల్త్ వర్కర్ కృష్ణమ్మకు తొలి వ్యాక్సిన్ వేశారు. (కరోనా వ్యాక్సినేషన్ తొలి టీకా.. వీడియో) మంత్రులకు, ఎమ్మెల్యేలతో పాటు రాజకీయ నాయకులు తొలి విడతలోనే టీకా వేయించుకుంటే ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉందని కేంద్ర పెద్దలు అభిప్రాయపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన ఈటల.. తొలి వ్యాక్సిన్ వేసుకునేందుకు నిరాకరించారు. అయితే కోవిడ్ నియంత్రణకు రూపొందించిన టీకాపై ప్రజల్లో ఆందోళనలు తొలగించేందుకు తాను వ్యాక్సిన్ వేసుకుంటానని చెప్పినట్లు వివరించారు. వ్యాక్సిన్‌పై ఉన్న అనుమానాలను తొలగించేందుకే అలా అన్నట్లు చెప్పారు. మరోవైపు తొలి టీకాను తాను వేసుకుంటాన్న ఈటల ప్రకటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. హెల్త్ వర్కర్స్, పారిశుధ్య కార్మికులను కాదని, తొలి విడతలో మంత్రులు వాక్సిన్ వేసుకోవడం సరైనది కాదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రి కేటీఆర్ సైతం వివరణ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన జాబితా ప్రకారమే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ జరుగుతోందన్నారు. (ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్) -
గాంధీ నుండి పరారైన ఖైదీల కేసులో పురోగతి
సాక్షి, హైదరాబాద్ : గత నెలలో గాంధీ హాస్పిటల్ నుంచి తప్పించుకున్న ఖైదీల కేసులో పురోగతి లభించింది. పరారైన నలుగురు నిందితుల్లో సోమా సుందర్ అనే వ్యక్తని నార్త్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని నుంచి మిగతా నేరస్తుల సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నారు. వివరాల ప్రకారం.. జావిద్, నరసింహా, సోమ సుందర్, ఆర్బాజ్ అఏ నలుగురు ఖైదీలను గత నెలలో చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. అయితే అదును చూసుకొని అక్కడినుంచి తప్పించుకొని గుల్భర్గాకి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ సైతం బైక్ చోరీలు చేద్దామని దుండగులు ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు క్రితం కొట్టేసిన బైక్‌లతో సోమసుందర్ అనే నిందితుడు హైదరాబాద్‌కు చేరుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గుల్బర్గాలో మిగతా ఖైదీల కోసం ప్రత్యేక టీంలతో గాలిస్తున్నారు. (ఖమ్మంలో అమానుషం) -
ఆరోగ్యశ్రీలో మార్పులు తెస్తున్నాం: ఈటల
సాక్షి, హైదరాబాద్ : ఆరోగ్యశ్రీలో కొన్ని మార్పులు తెస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. లోపాలను సరిదిద్ది, ఆరోగ్యశ్రీలో రోగులను తిరస్కరించకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన సోమవారం పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రి మినహా అన్ని ఆస్పత్రుల్లో సాధారణ సేవలు మొదలైనట్లు చెప్పారు. కోవిడ్ డ్యూటీల్లో ఉన్నవాళ్లకు మాత్రమే క్వారంటైన్ సెలవులు వర్తిస్తాయని ఈటల తెలిపారు. కరోనా డ్యూటీల్లో లేని వైద్యులు, సిబ్బంది విధులకు హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి తగ్గిందని అయితే రానున్న బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు ఎవరి ఇంట్లో వాళ్లే నిర్వహించుకోవాలని లేకుంటే కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరికలు చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటే కరోనాను తరిమివేయవచ్చిని మంత్రి ఈటల పేర్కొన్నారు. -
భోజనంలో పుల్లలు, దారాలు..
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో రోగులకు సరఫరా చేస్తున్న భోజనంలో కర్రపుల్లలు, దారాలు వస్తున్నాయన్న ఆరోపణలున్నాయని.. అయినా ఆ ఫుడ్ కాంట్రాక్టర్‌ను ఎందుకు కొనసాగించాలని హైకోర్టు ప్రశ్నించింది. ఆహారంలో నాణ్యత పెంచాలని గాంధీ ఆసుపత్రి వైద్యుల కమిటీ ఫుడ్ కాంట్రాక్టర్‌కు నోటీసులిచ్చినా ఫలితం లేదని పేర్కొంది. ఫుడ్ కాంట్రాక్టర్‌గా తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ కె.సురేశ్‌బాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టి స్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది. నోటీసులు ఇవ్వకుండానే సురేశ్‌బాబును తొలగించారని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ‘భోజనంలో నాణ్యత బాగా లేదని రోగులు చేసిన ఫిర్యాదులను చూశారా’అని దమ్మాలపాటిని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే నోటీసులు ఇచ్చాక నాణ్యత పెంచారని, నాణ్యత పెంచడంపై వైద్యుల కమిటీ సంతృప్తి చెందిందని దమ్మాలపాటి తెలిపారు. కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది అనేందుకు ఆధారాలను చూపాలని ధర్మాసనం ఆదేశిస్తూ, విచారణను ఈనెల 5కు వాయిదా వేసింది. -
కోవిడ్ నోడల్ కేంద్రం: ఫరారైన పాజిటివ్ వ్యక్తులు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్ వార్డు నుంచి పరారైన నలుగురు కరోనా పాజిటివ్ ఖైదీల కోసం పదహారు ప్రత్యేక పోలీస్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రిజనర్స్ వార్డు సెంట్రీ కానిస్టేబుల్ అమిత్ ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ 224 ప్రకారం కస్టడీలో ఉన్న ఖైదీలు తప్పించుకున్న కేసు నమోదు చేశారు. సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, ఎస్కార్ట్, చిలకలగూడ పోలీస్‌తోపాటు ఆయా లోకల్ ఠాణాలకు చెందిన మొత్తం 16 బృందాలు ఖైదీల ఆచూకీ కోసం నగరం నలుమూలల జల్లెడ పడుతున్నాయి. కరోనా వైరస్ బారిన పడిన నలుగురు ఖైదీలు అబ్దుల్ అర్బాజ్, మహ్మద్ జావీద్, సోమసుందర్, నర్సయ్యలను జైలు అధికారులు చికిత్స కోసం గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్ వార్డులో అడ్మిట్ చేయగా, బాత్రూం కిటికీ గ్రిల్స్ తొలగించి పరారైన సంగతి విదితమే. బాత్రూం కిటికీ గ్రిల్స్‌కు బెడ్‌షీట్ కట్టి నలుగురు ఒకేసారి లాగడంతో గ్రిల్స్ ఊడిపోవడంతో, అదే బెడ్షీట్లను తాడుగా మార్చి రెండవ అంతస్థు నుంచి దూకి పారిపోయినట్లు పోలీసులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఆస్పత్రి ప్రాంగణంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఖైదీల పరారీపై పోలీసులకు స్పష్టమైన అవగాహన కుదరకపోవడం గమనార్హం. గతేడాది సీన్ రిపీట్... ఆస్పత్రి ప్రిజనర్ వార్డు నుంచి ఓ ఖైదీ గతంలో ఇదేవిధంగా తప్పించుకోవడంతో సీన్ రిపీట్ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మీగూడకు చెందిన పసుపు విక్కీ (25) చర్లపల్లి జైలులో రిమాండ్‌ఖైదీగా శిక్ష అనుభవిస్తూ అస్వస్థతకు గురికావడంతో 2019 మార్చి 10వ తేదీన గాంధీఆస్పత్రి ప్రిజనర్స్ వార్డులో అడ్మిట్ చేశారు. చిన్నరంపంతో బాత్రూం కిటికీ ఊచలు తొలగించి నీళ్లు పట్టే ప్లాస్టిక్ పైప్ సహాయంతో కిందికి దూకి, ఆస్పత్రి వెనుక పద్మారావు నగర్ వైపుగల చిన్నపాటి గేటు దూకి పరారయ్యాడు. ఇప్పడు కూడా నలుగురు ఖైదీలు అదేవిధంగా పరారీ కావడం గమనార్హం. జైళ్లశాఖకు చెందిన పోలీసులే ఈ ప్రిజనర్స్ వార్డుకు సంబంధించిన భధ్రతను పర్యవేక్షిస్తారు. ఖైదీలను పట్టిస్తే బహుమతి సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ప్రిజనర్స్‌వార్డు నుంచి తప్పించుకున్న నలుగురు ఖైదీల వివరాలను ఫోటోలతో సహా పోలీసులు మీడియాకు వెల్లడించారు. పరారైన ఖైదీలను పట్టించిన, ఆచూకీ, సమాచారం అందించినా తగిన బహుమతి ఇస్తామని, ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. సనత్‌నగర్, బోరబండ, సఫ్థార్‌నగర్‌కు చెందిన మహ్మద్ అబ్ధుల్ అర్భాజ్ (21) యుటీ నంబర్ 7024, బండ్లగూడ, చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ జావీద్ (35), యుటీ నంబర్ 6624, బోరబండ రాజీవ్‌గాంధీనగర్ సైట్–3కి చెందిన మంగళి సోమసుందర్ (20) కన్వెక్ట్ నంబర్ 3932, మెదక్ జిల్లా కొండపూర్ మండలం వేములగుట్ట గ్రామానికి చెందిన పర్వతం నర్సయ్య (41), కన్వెక్ట్ నంబర్ 3365లు ఈనెల 27వ తేది వేకువజామున గాంధీఆస్పత్రి నుంచి పరారయ్యారని స్పష్టం చేశారు. మెయిన్ పోలీస్ కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు 040–27852333, 9490616690, నార్త్‌జోన్ పోలీస్ కంట్రోల్ రూం 040–27853599, 9490598982, గోపాలపురం ఏసీపీ 9490616439. చిలకలగూడ సీఐ ఫోన్ నంబర్ 9490616440లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. -
గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు ఖైదీలు పరారీ
-
గాంధీ హౌస్‌ఫుల్.. వెంటిలేటర్ ప్లీజ్!
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌తో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జనగాం జిల్లా పాలకుర్తికి చెందిన వ్యక్తికి అకస్మాత్తుగా శ్వాస సంబంధ సమస్య తలెత్తింది. ఆయనకు వెంటిలేటర్ సహాయం అవసరమైంది. ఆస్పత్రిలో 105 వెంటిలేటర్లు ఉండగా, అప్పటికే అవన్నీ రోగులతో నిండిపోయాయి. బాధితున్ని గాంధీకి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు బాధితుని బంధువులకు సూచించారు. విధిలేని పరిస్థితుల్లో శనివారం రాత్రి అతికష్టం మీద గాంధీకి తీసుకొచ్చారు. తీరా.. ఇక్కడ వెంటిలేటర్లు ఖాళీ లేవని వైద్యులు చేతులెత్తేశారు. అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటిలేటర్ చికిత్సకు రోజుకు రూ.లక్ష ఖర్చు అవుతుందని, ఇందుకు అంగీకరిస్తేనే అడ్మిట్ చేస్తామని సదరు ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేయడంతో చేసేది లేక వారు అడిగినంత చెల్లించి అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ఇలా పాలకుర్తికి చెందిన వ్యక్తికి మాత్రమే కాదు..కోవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉన్న అనేక మంది ఆఖరి నిమిషంలో ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్), కింగ్‌కోఠిలో 50, ఛాతి ఆస్పత్రిలో 28 వెంటిలేటర్ల చొప్పున ఉన్నప్పటికీ..టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బంది కొరత వల్ల వాటిని పూర్తిస్థాయిలో వినియోగించలేక పోతున్నారు. గాంధీ ఐసీయూ హౌస్‌ఫుల్ 1890 పడకల సామర్థ్యం ఉన్న ప్రతిష్టాత్మాక గాంధీ జనరల్ ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినన్ని వెంటిలేటర్లు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకున్న పేద, మధ్య తరగతి రోగులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సాధారణ ఐసోలేషన్ వార్డులో 390 పడకలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 144 మంది చికిత్స పొందుతున్నారు. 1000 పడకలకు ఆక్సిజన్ ఏర్పాటు చేయగా, వీటిలో 117 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కీలకమైన ఐసీయూలో 500 వెంటిలేటర్ పడకలు ఉండగా, ప్రస్తుతం ఇవన్నీ రోగులతో నిండిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి వెంటిలేటర్ దొరకని పరిస్థితి. అంతేకాదు ఆక్సిజన్, సాధారణ ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిలో ఎవరికైనా వెంటిలేటర్ అనివార్యమైతే..అప్పటికప్పుడు ఇతరులకు అమర్చిన వెంటిలేటర్ తొలగించి అవసరమైన వారికి అమర్చాల్సి వస్తుంది. కొత్తగా ఆస్పత్రికి చేరుకున్న వారికి వెంటిలేటర్ కావాలంటే..ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఎవరో ఒకరు చనిపోతే కానీ..సమకూర్చలేని దుస్థితి. విధిలేని పరిస్థితుల్లో చాలా మందిని సాధారణ ఆక్సిజన్‌తోనే నెట్టుకొస్తుండటం గమనార్హం. ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినన్ని వెంటిలేటర్లు లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో బాధితులు కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది. పలు ఆ స్పత్రులు దీన్ని అవకాశంగా తీసుకుని ఇష్టం వచ్చినట్లు బిల్లులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు... ప్రభుత్వ గాంధీ ఆస్పత్రిలోనే కాదు...సికింద్రాబాద్, మాదాపూర్, మలక్‌పేట్, బంజారాహిల్స్, సోమాజిగూడలోని పలు ప్రతిష్టాత్మాక కార్పొరేట్ ఆస్పత్రుల్లోని ఐసీయూ వెంటిలేటర్ పడకలు కూడా దాదాపు నిండిపోయాయి. ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా ఉన్నప్పటికీ..వాటిలో చేరేందుకు వెనుకాడుతున్నారు. ఎంత ఖర్చైనా ఫర్వాలేదు కానీ...ప్రతిష్టాత్మాక ఆయా కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే చేరాలని భావిస్తున్నారు. రోగుల బంధువుల్లో ఉన్న ఈ బలహీనతను ఆయా ఆస్పత్రులు ఆసరాగా చేసుకుంటున్నాయి. అడిగినంత చెల్లించేందుకు ముందుకు వచ్చిన వారికే ఐసీయూ పడకలు కేటాయిస్తున్నాయి. వెంటిలేటర్ చికిత్సలకు ప్రభుత్వం రోజుకు రూ.9000 ధర నిర్ణయించగా..ఆయా ఆస్పత్రులు ఒక్కో వెంటిలేటర్ రోగి నుంచి రోజుకు రూ.80 నుంచి 90 వేల వరకు వసూలు చేస్తున్నాయి. బాధితులు చెల్లించిన డబ్బుకు కనీసం రసీదులు కూడా ఇవ్వడం లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతార్ చేస్తున్న ఆయా కార్పొరేట్ ఆస్పత్రులపై 1200పైగా ఫిర్యాదులు అందినా ఇప్పటి వరకు రెండు మినహా మరే ఇతర ఆస్పత్రిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంతేకాదు ప్రేవేటు ఆస్పత్రుల్లో 50 శాతం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు స్పష్టమైన విధివిధానాలు అంటూ ఖరారు చేయక పోవడంతో ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. -
నాయిన.. ఎట్లున్నడో?
సాక్షి, సిటీబ్యూరో: ‘మాది బోడుప్పల్ కాకతీయ కాలనీ. రెండు వారాల క్రితం మా నాన్నకు కోవిడ్ నిర్ధారణ అయింది. వారికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించే ఆర్థిక స్తోమత లేక ఆయనను అర్ధరాత్రి అత్యవసర పరిస్థితుల్లో గాంధీ కోవిడ్ సెంటర్‌కు తీసుకెళ్లాం. వైద్యులు ఐసీయూలో అడ్మిట్ చేసుకున్నారు. ఫోన్ చేద్దామంటే వారి వద్ద సెల్‌ఫోన్ కూడా లేదు. ఆస్పత్రి ల్యాండ్ నంబర్‌కు ఫోన్ చేసి అడిగితే...ఐసీయూలో ఉన్నట్లు చెప్పారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తే.. ఎవరూ ఏమీ చెప్పడం లేదు. పోయిన రోజు పోయిండు..మళ్లీ మాటా ముచ్చటా లేదు. ఉండబట్టలేక లోనికి వెళ్లేందుకు యత్నించా. ప్రధాన ద్వారం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. అదేమంటే నాన్‌కోవిడ్ బాధితులకు ఆస్పత్రిలో అనుమతి లేదని స్పష్టం చేశారు. కనీసం మా నాన్న ఎలా ఉన్నాడో..? తెలుసుకుని చెప్పమని వేడుకున్నా. అయినా స్పందన లేదు’ అని బాధితుడి కుమార్తె సరస్వతి సహా ఇతర బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా సరస్వతి కుటుంబ సభ్యులు, బంధువులకే కాదు కోవిడ్‌తో గాంధీలో చికిత్స పొందుతున్న అనేక మంది కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ ఇదే అనుభవం ఎదురవుతుంది. ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అంతా..అయోమయం 1890 పడకల సామర్థ్యం ఉన్న గాంధీ జనరల్ ఆస్పత్రిలో ప్రస్తుతం 806 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐసీయూలోని వెంటిలేటర్‌పై 178 మంది చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్‌పై 410 మంది చికిత్స పొందుతున్నారు. మరో 218 మంది సాధారణ ఐసోలేషన్ వార్డులో ఉన్నారు. ఆస్పత్రి పూర్తి స్థాయి కోవిడ్ సెంటర్ కావడంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు సహాయంగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వారి కుటుంబ సభ్యులను మినహా ఇతరులను అనుమతించడం లేదు. వీరిలో చాలా మంది వృద్ధులు, చిన్న పిల్లలు కూడా ఉంటున్నారు. వీరిలో చాలా మందికి సెల్ఫోన్లు లేవు. ఒక వేళ ఉన్నా..మాట్లాడలేని స్థితి. బాధితులకు ఎలాంటి వైద్య సహాయం అందుతుంది? వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటి? చికిత్సకు ఏమైనా స్పందిస్తున్నారా? వేళకు ఆహారం తీసుకుంటున్నారా? అసలు వారి ఆరోగ్యం ఎలా ఉంది? వంటి అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక కో ఆర్డినేటర్లను నియమించనున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురాక పోవడంతో బాధితుల ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స చేసేందుకు అవసరమైన వైద్యులు, స్టాఫ్ నర్సులు ఉన్నా...వారు బాధితుల ఆరోగ్య పరిస్థితిని వివరించడం లేదు. కుటుంబ సభ్యులు నేరుగా ఐసోలేషన్ వార్డు వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలని భావించే వారిని పోలీసులు లోనికి అనుమతించక..లోపల ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి తెలియక..బయట ఉన్న బంధువులు ఆందోళన చెందుతున్నారు. అదే కార్పొరేట్ ఆస్పత్రిలోనైతే... ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు రోజుకు రెండు పూటలా కుటుంబ సభ్యులను కౌన్సిలింగ్‌కు పిలుస్తుంటాయి. రోగుల ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యసేవలు, వాడుతున్న మందులు, రోగి స్పందిస్తున్న తీరు...చికిత్సలో ఎదురవుతున్న ఇతర సమస్యలను ఎప్పటికప్పుడు కుటుంబ స భ్యులకు వివరిస్తుంటాయి. ప్రభుత్వ కోవిడ్ సెంటర్లలో కౌన్సిలింగ్ కాదు కదా..! కనీసం రోగుల ఆరోగ్య పరిస్థితిని కూడా వివరించడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దినట్లు ప్రభుత్వం చెప్పుతుంది. గాంధీ సహా ఒక్కో ఆస్పత్రిలో వంద మందికిపైగా పేషంట్ కేర్ ప్రొవైడర్లను నియమించినట్లు చెబుతోంది. క్షేత్రస్థాయిలో వీరెవరూ కన్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రోగులకు ఆ..‘పరేషాన్’
చేవెళ్లకు చెందిన సత్యనారాయణ రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు రాడ్డు అమర్చారు. పూర్తిగా కోలుకున్న తర్వాత కాలులోని రాడ్డును తీసివేస్తామని చెప్పారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా మార్చడంతో చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లాడు. అత్యవసర సర్జరీలు మినహా ఎలక్టివ్ సర్జరీలన్నీ వాయిదా వేసినట్లు అక్కడి వైద్యులు చెప్పడంతో చేసేదేమీ లేక సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో రాడ్డు తొలగింపు చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. బాలాపూర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి కొంతకాలంగా తీవ్రమైన గ్యాస్ట్రిక్ పెయిన్‌తో సతమతమవుతున్నాడు. చికిత్స కోసం నిమ్స్ వైద్యులను సంప్రదించగా ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే, సంబంధిత విభాగం వైద్యులు క్వారంటైన్లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన అనేక మంది బాధితులకు ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: గత ఏడాది ఇదే సమయంలో గాంధీ ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 3,000 నుంచి 3,500 మంది రోగులు వచ్చేవారు. రోజుకు సగటున 250 సర్జరీలు జరిగేవి. ఇటీవల ప్రభుత్వం ఈ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా మార్చడంతో సాధారణ రోగులకు చికిత్సలు అందడం లేదు. గాంధీ, కింగ్‌కోఠి, జిల్లా ఆస్పత్రుల్లో మేజర్, మైనర్ సర్జరీలు చేయించుకుని ఫాలో అప్ చికిత్సలు, మందుల కోసం వచ్చే రోగులు ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయంలో పడిపోయారు. నిమ్స్ సహా ఉస్మానియా ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ వైద్యులు, ఆపరేషన్ థియేటర్ల కొరత ఉంది. అక్కడ అత్యవసర చికిత్సలు మినహా ఎలక్టివ్ చికిత్సలు చేయకపోవడంతో బాధితులు విధిలేని పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. కోవిడ్.. క్వారంటైన్ సెలవులు ఉస్మానియా ఆస్పత్రిలోని పాత భవనంలోకి ఇటీవల వర్షపునీరు చేరడంతో అక్కడి పడకలను ఖాళీ చేసి, కులీకుతుబ్‌షా, ఓపీ బ్లాక్‌లకు తరలించారు. ఆస్పత్రికి వస్తున్న అనేకమంది అసింప్టమేటిక్ కోవిడ్‌తో బాధపడుతున్నారు. వీరిని ముట్టుకోవడంతో వైద్యులు, టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు కోవిడ్ బారిన పడుతున్నారు. ఇలా 212 మంది వైద్యులకు కోవిడ్ సోకింది. వైద్యుల్లో 60 శాతం మంది వి«ధుల్లో ఉంటే.. 40 శాతం మంది క్వారంటైన్ సెలవుల్లో ఉండాల్సి వస్తోంది. దీంతో పలువురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి చికిత్సలు చేయించుకుంటుండగా... మరికొంత మంది తాత్కాలికంగా మందులపై నెట్టుకొస్తున్నారు. పాతభవనం ఖాళీ చేయడంతో ఆపరేషన్ థియేటర్ల సమస్య తలెత్తింది. పాతభవనంలోని రోగులకు ఇతర విభాగాల్లో సర్దుబాటు చేసినప్పటికీ పోస్టు ఆపరేటివ్ వార్డులకు ఆక్సిజన్ సరఫరా లేకపోవడం, ఉన్న ఆపరేషన్ థియేటర్లు ఇతర చికిత్సలతో బిజీగా మారడంతో అత్యధిక రోగులకు చికిత్సలు అందడంలేదు. -
గాంధీలో 17 ఏళ్ల క్రితం నాటి ఫైర్‌సేఫ్టీ వ్యవస్థ..
గాంధీఆస్పత్రి: కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఫైర్‌సేఫ్టీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. ఇక్కడ అగ్నిప్రమాదం జరిగితే ఘోరమైన పరిణామాలు సంభవిస్తాయని సంబంధిత నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రౌండ్ ప్లస్ ఎనిమిది అంతస్తుల్లో నిర్మించిన ఇన్‌పేషెంట్ భవనంలో అగ్నిప్రమాదం జరిగితే వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు, అందిస్తున్న వైద్యులు, సిబ్బంది బయటకు వెళ్లే దారిలేక అగ్నికీలల్లో మాడి మసై పోవాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. సుమారు 17 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఫైర్‌సేఫ్టీ సిస్టం పూర్తిగా పనిచేయడంలేదు. అగ్ని నిరోధక పరికరాల్లో కొన్ని తుప్పు పట్టి, మరికొన్ని దొంగతనానికి గురికావడంతో అక్కడక్కడ దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. గతేడాది ఆగస్ట్ 6వ తేదీన పిడియాట్రిక్స్ సర్జరీ విభాగంలో అగ్నిప్రమాదం జరిగి కోట్లాదిరూపాయల విలువైన వైద్య యంత్రాలు, సామాగ్రి కాలిబూడిదైంది. గత రెండేళ్లలో సుమారు 15 అగ్ని ప్రమాదాలు సంభవించాయని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం వెయ్యి మందికి పైగా కరోనా పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నారు. మరో రెండు వేలమంది వైద్యులు, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది విధులు నిర్వహిసున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంతోనైనా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వైద్య ఉన్నతాధికారులు స్పందించి గాంధీ ఆస్పత్రిలో ఫైర్‌సేఫ్టీ వ్యవస్థను పటిష్టం చేయాలని పలువురు కోరుతున్నారు. డిజైన్ లోపం...మెట్ల దారులన్నీ లోపలికే.... ఎనిమిది అంతస్తుల్లో నిర్మించిన ప్రధానభవనం డిజైన్లోనే లోపం ఉన్నట్లు ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అగ్నిప్రమాదంతో పాటు, విపత్కర పరిస్థితులు సంభవిస్తే భవనం నుంచి బయట పడేందుకు వెలుపల వైపుకు తప్పనిసరిగా మెట్లు ఏర్పాటు చేయాలి. నాలుగు వైపులా బంధించినట్లు నిర్మించిన భవనంలో ర్యాంపు తోపాటు మూడు చోట్ల ఏర్పాటు చేసిన మెట్ల దారులన్నీ భవనం లోపలికే ఉండడంతో ప్రమాదం జరిగితే పది శాతం మంది కూడా ప్రాణాలతో బయటపడే అవకాశమే లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అత్యవసర, అవుట్‌పేషెంట్ విభాగ భవనాలకు వెనుకవైపు నుంచి మెట్లదారి ఏర్పాటు చేసినప్పటికీ ఆయా ద్వారాలకు నిత్యం తాళం వేసి ఉండడం గమనార్హం. 17 ఏళ్ల క్రితం నాటి ఫైర్‌సేఫ్టీ వ్యవస్థ.. 2003లో గాంధీఆస్పత్రి నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన ఫైర్‌సేఫ్టీ వ్యవస్థే నేటికి కొనసాగుతోంది. చాలా వరకు పరికరాలు తుప్పుపట్టిపోగా, మరికొన్ని దొంగతనాలకు గురయ్యాయి. అగ్నిమాపక రక్షణ వ్యవస్థ పనిచేయడంలేదని, ఫైర్‌ఫైటింగ్ సిస్టం, స్మోక్ డిటెక్టివ్స్ ఏర్పాటు చేయాలని పలుమార్లు ప్రభుత్వానికి, టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులకు లిఖితపూర్వకంగా కోరినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఫైర్‌సేఫ్టీ వ్యవస్థకు సంబంధించిన ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని ఆస్పత్రికి చెందిన కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. అగ్నిమాపక రక్షణ వ్యవస్థ విషయమై పలుమార్లు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా లేఖలు రాశాం. అత్యాధునిక ఫైర్‌సేఫ్టీ వ్యవస్థను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ సూపరింటెండెంట్ -
క్వారంటైన్ హోటల్స్‌లో భద్రత ఎంత..?
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే సదరు ఘటనలు పునరావృతం కాకుండాతగు చర్యలు తీసుకుంటామనడం పరిపాటిగా మారింది. వర్షాలొచ్చి కాలనీలు నీటమునిగినా..అగ్నిప్రమాదాలు, అక్రమనిర్మాణాల కారణంగా ప్రాణాలు పోయినా.. ఇతరత్రా ఏ సంఘటనల్లో ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగినా ప్రతి ఏటా, ప్రతి సారీవినపడే మాట..ఇక ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడమే. గత సంవత్సరం ఎల్బీనగర్లోని చిన్నపిల్లలఆస్పత్రిలో, ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్‌లో,ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు సైతం ఇకముందు ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు అక్రమ నిర్మాణాలు కూలినప్పుడు సైతం ‘సహించేది’ లేదన్నారు. దాదాపు పదేళ్ల క్రితం సోమాజిగూడ పార్క్ హాస్పిటల్లో అగ్నిప్రమాదంలో 40 మందికి పైగా గాయపడ్డారు. ఏడేళ్లక్రితంసికింద్రాబాద్లోని సిటీలైట్ హోటల్ కుప్పకూలి పదిమందికి పైగా మరణించారు. ఇలా ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినాపునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటారు. దాదాపు నెలరోజులు తనిఖీలు, నోటీసుల జారీ వంటివి చేస్తారు. నిబంధనలు పాటించని ఆస్పత్రుల లైసెన్సులు రద్దుచేస్తామంటారు. తర్వాతకొద్దిరోజులకు అంతా మర్చిపోతారు. మరో ప్రమాదం జరిగినప్పుడు మళ్లీ చర్చ. విజయవాడలో కోవిడ్ ఆస్పత్రిగా మారిన హోటల్లో అగ్నిప్రమాద ఘటనతో మరోమారు నగరంలోని ఆస్పత్రులు చర్చనీయాంశంగా మారాయి. అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు ఉన్నాయో లేదో తనిఖీ చేయాల్సిందిగా వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. చర్యల లేమి.. వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీలు ప్రమాదాలు జరిగినప్పుడు చూపే సమన్వయం, చేసిన ప్రకటనల కనుగుణంగా ఆ తర్వాత చర్యలుండవు. దాదాపు పదేళ్లక్రితం పార్క్ హాస్పిటల్ ప్రమాదం జరిగింది. సెల్లార్లను పార్కింగ్‌కు కాకుండా అక్రమంగా ఇతర అవసరాలకు వినియోగిస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని అప్పట్లో ప్రకటించారు. వైద్యారోగ్యశాఖను సంప్రదించి..ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లులేని, ఉల్లంఘనలకు పాల్పడే ఆస్పత్రుల లైసెన్సులు రద్దుచేయిస్తామని హెచ్చరించారు. గత సంవత్సరం ఎల్బీనగర్ షైన్ చిల్డ్రన్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం అనంతరం గ్రేటర్ పరిధిలో 1823 ఆస్పత్రులున్నట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. ఫైర్‌సేఫ్టీ లేనివాటికి నోటీసులు జారీ చేసింది. వాటితోపాటు పబ్‌లు, బార్లు, కోచింగ్ సెంటర్లు, పాఠశాలలకు సైతం నోటీసుల జారీ చేపట్టారు. ఆస్పత్రులను సీజ్ చేస్తే పేషెంట్లకు వైద్య సదుపాయాలందవనే యోచనతో కఠిన చర్యలు తీసుకోలేదు. నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు చేసుకోకుంటే బిల్కౌంటర్లు, పరిపాలన విభాగాలను సీజ్ చేస్తామని హెచ్చరించింది. ఇప్పటి వరకు వాటిల్లో 90 శాతం హాస్పిటళ్లు ఫైర్‌సేఫ్టీకి సంబంధించి ఎన్ఓసీలు పొందలేదు. కానీ ఏ ఒక్క ఆస్పత్రి బిల్కౌంటర్ను మూసింది లేదు. పరిపాలన విభాగానికి తాళం వేసింది లేదు. కరోనా పేరిట ప్రస్తుత పరిస్థితుల్లో లక్షలకు లక్షలు దండుకుంటున్నప్పటికీ, ఫైర్‌సేఫ్టీ నిబంధనలు బేఖాతరు చేసిన వారిని పట్టించుకున్న యంత్రాంగమంటూ లేదు. ఆస్తిపన్ను చెల్లించకుంటే భవనాలను సీజ్ చేసే జీహెచ్ఎంసీ.. ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఏర్పాట్లు లేకుంటే పట్టించుకోదు. రోడ్ల పక్కన చిరువ్యాపారులపై ప్రతాపం చూపే అధికారులు పెద్దాసుపత్రుల జోలికి పోరనే ఆరోపణలున్నాయి. క్వారంటైన్ హోటల్స్‌లో భద్రత ఎంత..? ఇక పలు హోటళ్లు కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి, హోమ్ ఐసొలేషన్‌లో ఉండాల్సిన వారికి ప్రత్యేక ప్యాకేజీలను వసూలు చేస్తున్నాయి. అలాంటి హోటళ్లలో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు ఏ మేరకున్నాయో వాటి నిర్వాహకులు, అధికారులకే తెలియాలి. -
గడువు ముగిసింది.. గుట్టలు పెరిగాయి!
గాంధీఆస్పత్రి : కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో బయోమెడికల్ (జీవ) వ్యర్థాలు రోజురోజుకూ గుట్టలుగా పేరుకుపోతున్నాయి. డంపింగ్‌యార్టుకు తరలించి బయోమెడికల్ వేస్ట్‌ను నిర్వీర్యం చేయాల్సిన కాంట్రాక్టు సంస్థ కాలపరిమితి ముగియడంతో నెల రోజులుగా జీవవ్యర్థాలు ఆస్పత్రి ప్రాంగణంలోనే కుప్పులుగా పడున్నాయి. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో పాటు వైద్యులు, సిబ్బంది, ఆస్పత్రికి ఆనుకుని ఉన్న పద్మారావునగర్ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గాంధీఆస్పత్రి కోవిడ్ నోడల్ సెంటర్‌గా ప్రకటించడంతోపాటు కరోనా పాజిటివ్ రోగులకు వైద్యసేవలందిస్తున్న విషయం విదితమే. రోగులు, వైద్యులు, సిబ్బంది వినియోగించిన పీపీఈ కిట్లు, మాస్క్‌లు, చేతి, కాళ్ల గ్లౌజ్‌లు, సిరంజీలు, నీడిల్స్, ఐవీ ఫ్లూయిడ్స్, డైపర్లు తదితర వైద్య వస్తువులు బయోమెడికల్ వేస్టేజ్ కిందికే వస్తాయి. ఈ వ్యర్థాలను తరలించే సంస్థ కాంట్రాక్టు నెల రోజుల క్రితం ముగియడంతో టన్నుల కొద్ది జీవవ్యర్థాలు ఆస్పత్రి ప్రాంగణంలో గుట్టలుగా పేరుకుపోయింది. దీంతో వాటి నుంచి కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోందని తక్షణమే బయో వేస్ట్ నుంచి తమకు రక్షణ కల్పించాలని పద్మారావునగర్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. టెండర్ ప్రక్రియ ముగిసిందని, రేటు తేడాతో సదరు సంస్థ జీవవ్యర్థాల తరలింపునకు ముందుకు రావడంలేదని తెలిసింది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం... జీవవ్యర్థాల తరలింపు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో సెర్టిలైజ్ చేసిన తర్వాతే జీవవర్థాలను ప్రత్యేకమైన బ్యాగుల్లో నింపుతాం. వ్యర్థాల్లో వైరస్ ఉండదు. దుర్వాసన కూడా రాదు. ఇంతకు ముందు బయోమెడికల్ వేస్ట్ తరలింపు సేవలందించిన సంస్థే మరోమారు టెండర్ దక్కించుకుంది. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ -
ప్లాస్మాథెరపీలో ‘గాంధీ’ సక్సెస్
గాంధీఆస్పత్రి (హైదరాబాద్): కరోనా వైద్యం లో భాగంగా చేపట్టిన ప్లాస్మాథెరపీ చికిత్సలు కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వంద శాతం విజయవంతమయ్యా యి. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్లాస్మాథెరపీ చికిత్సల్లో ఐసీఎంఆర్ చేపట్టిన గ్రేడింగ్‌లో ఈ ఆస్పత్రికి 5వ స్థానం దక్కింది. కేటాయించిన కోటా పూర్తికావడంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) ఆదేశాల మేర కు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మాధెరపీ చికిత్సలు నిలిపివేశారు. అత్యంత క్లిష్టమైన, ప్రాణాపాయస్థితిలో ఉన్న 25 మంది రోగులకు ఇక్కడ ప్లాస్మా థెరపీ చికిత్స అందించి వైద్యులు పునర్జన్మనిచ్చారు. 25 మంది కోలుకుని ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. మే 14న మొదటి ప్లాస్మాచికిత్స సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఐసీఎంఆర్ ఆదేశాలతో వెంటిలేటర్‌పై ఉన్న పాతబస్తీకి చెందిన యువకుడి (44)కి గత మే 14న 200 మిల్లీలీటర్ల ప్లాస్మా ఎక్కించారు. శరీరం స్పం దించడంతో మే 16న మరో డోస్ ప్లాస్మాను ఎక్కించడంతో బా«ధితుడు సంపూర్ణ ఆరోగ్యం తో కోలుకుని వారం తర్వాత డిశ్చార్జ్ అయ్యా డు. అనంతరం ప్రాణాపాయస్థితిలో ఉన్న మ రో 24 మందికి విజయవంతంగా ప్లాస్మాథెరపీ చికిత్స అందించారు. కాగా, కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేందుకు మరికొంత సమయం పట్టనున్న క్రమంలో ప్లాస్మాథెరపీని కరోనా చికిత్సలో భాగం చేయాలా, మరికొంతకాలం ప్రయోగాత్మకంగానే పరిశీలించాలా అనే అం శంపై ఐసీఎంఆర్ తర్జనభర్జన పడుతోంది. దేశవ్యాప్తంగా ఈ చికిత్సలు నిర్వహించిన 25 సెం టర్లలో చికిత్సపొందిన 625 మంది బాధితుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొన్ని సెంటర్లలో ప్లాస్మాచికిత్స ఫలితాలు సాధించలేదు. తెలంగాణ, ఏపీలో సత్ఫలితాలనిచ్చిన క్రమంలో ప్రాంతాలవారీగా అధ్యయనం చేస్తున్నారు. అప్పటి వరకు ప్లాస్మా చికిత్సలకు విరామమివ్వాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. 5వ ర్యాంకు గర్వకారణం ప్లాస్మాథెరపీ చికిత్సల్లో వంద శాతం ఫలితాలు సాధించి దేశవ్యాప్త గ్రేడింగ్‌లో గాంధీ ఆస్పత్రి 5వ ర్యాంకు సాధించడం గర్వకారణం. ఐసీఎంఆర్ సూచనతో ప్రస్తుతం ప్లాస్మాథెరపీ చికిత్సలు నిలిపివేశాం. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
టెస్టులకు విముఖత.. ఇంట్లోనే
సాక్షి, సిటీబ్యూరో: సరూర్‌నగర్‌కు చెందిన 35 ఏళ్ల యువకుడు నాలుగు రోజులుగా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నాడు. ఆయన ఇంటికి సమీపంలోనే కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. టెస్టు చేయించుకునేందుకు నిరాకరించాడు. అదేమంటే గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సివస్తుందని, ఇరుగు పొరుగుకి విషయం తెలుస్తుందనే భయంతో ఆయన టెస్టుకు నిరాకరించి, ఇంట్లోనే ఉన్నాడు. రెండు రోజుల తర్వాత అర్ధరాత్రి అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఊపిరాడక పోవడంతో అత్యవసర పరిస్థితుల్లో అతడిని గాంధీకి తీసుకెళ్లగా.. కోవిడ్ రిపోర్ట్ ఉంటేనే చేర్చుకుంటామని అవుట్ పోస్టు సిబ్బంది స్పష్టం చేయడంతో విధిలేని పరిస్థితుల్లో సమీపంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పడకలు ఖాళీ లేకపోవడంతో చేర్చుకునేందుకు నిరాకరించారు. ఆ తర్వాత మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. సకాలంలో చికిత్స అందక అతడు అదే రోజు రాత్రి మృతి చెందాడు. ♦ రాంనగర్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ కూడా ఇవే లక్షణాలతో బాధపడుతోంది. పాజిటివ్ వచ్చినట్లు ఇంటి ఓనర్‌కు తెలిస్తే.. ఇల్లు ఖాళీ చేయమంటారనే భయంతో ఆమె ఎవరికీ విషయం చెప్పకుండా గత వారం రోజుల నుంచి ఇంట్లోనే ఉంది. తీరా శరీరంలో వైరస్ ఎక్కువై.. శ్వాస తీసుకోవడం కష్టమైంది. గాంధీకి తీసుకెళ్లింది. అప్పటి వరకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించకపోవడం, చేతిలో రిపోర్ట్ లేకపోవడంతో చేర్చుకునేందుకు నిరాకరించారు. కింగ్‌కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. తీరా అక్కడి కి చేరుకుంటే.. ప్రస్తుతం టెస్టింగ్ టైం అయిపోయిందని, మరుసటి రోజు ఉదయమే తీసుకొస్తే టెస్ట్ చేస్తామని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో వారు బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. టెస్టు చేయిస్తే ఇరుగు పొరుగుకు తెలుస్తుందనే భయం.. ఒకవేళ వైరస్ సోకినా తమను ఏమీ చేయలేదనే నిర్లక్ష్యం.. ముఖ్యంగా యుక్త వయస్కులను రిస్క్‌లోకి నెట్టేస్తుంది. అనేక మంది మృత్యువాతకు కారణమవుతోంది. తేలిగ్గా తీసుకోవడం వల్లే.. ప్రస్తుతం 80 శాతం మందిలో ఎసిప్టమేటిక్ కేసులే అధికం. వీరికి ఎలాంటి చికిత్సలు అవసరం లేకుండానే వైరస్ తగ్గిపోతుంది. కేవలం 15 శాతం మందికే ఆస్పత్రి చికిత్సలు అవసరమవుతుండగా, వీరిలో కేవలం ఐదు శాతం మందికే ఐసీయూ వెంటిలేటర్ చికిత్సలు అవసరమవుతున్నాయి. మరణాల రేటు కూడా చాలా తక్కువ. ఇతర దేశాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్ చాలా వీక్‌గా ఉందని తెలిసి చాలా మంది దీన్ని లైట్‌గా తీసుకుంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు క న్పించినప్పటికీ.. టెస్టులు, చికిత్సలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తీరా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం గాంధీకి తీసుకెళ్తున్నారు. అప్పటి వరకు టెస్టు చేయించకపోవడం, చేతిలో రిపోర్ట్ లేకపోవడంతో చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. వీరిలో కొంతమందికి పడకలు దొరికినప్పటికీ.. చాలా మందికి అడ్మిషన్ దొరకడం లేదు. టెస్టింగ్‌లోనే కాదు చికిత్సల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించి మృత్యువాత ™ è పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత వారి నుంచి కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు, స్నేహితులు వైరస్ బారిన పడుతున్నారు. పోరాడాల్సింది వైరస్‌తో.. అని తెలిసి కూడా.. కోవిడ్‌పై మొదట్లో తీవ్ర భయాందోళనలు ఉండేవి. ప్రస్తుతం వైరస్‌పై అవగాహన ఏర్పడింది. ‘పోరాడాల్సింది రోగితో కాదు.. వైరస్‌తో’ అంటూ ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించినప్పటికీ... చాలామంది ఇప్పటికీ బాధితుల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నారు. ముఖ్యంగా అద్దె ఇళ్లు, అపార్ట్మెంట్లు, గెటెడ్ కమ్యూనిటీల్లో ఉంటున్న వారి పట్ల వివక్ష ఎక్కువగా కొనసాగుతోంది. ఇరుగుపొరుగు వివక్షకు గురయ్యే కంటే.. టెస్టులు చేయించుకోకుండా గుట్టు చçప్పుడు కాకుండా ఇంట్లో ఉండి లక్షణాలను బట్టి మందులు వాడటమే ఉత్తమమే అభిప్రాయంతో బాధితుల కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ♦ ర్యాపిడ్ టెస్టుల్లో వందశాతం కచ్చితత్వం లేకపోవడం, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయకపోవడం, ఒకవేళ శాంపిల్ సేకరించిన సకాలంలో రిపోర్టులు జారీ చేయకపోవడం కూడా బాధితుల వెనుకంజకు కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించిన తర్వాత కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని బాధితుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సీటీస్కాన్ రిపోర్ట్ పాజిటివ్ అయినా.. పరేషాన్
సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. అనుమానం వచ్చి స్థానికంగా ఉన్న ఓ వైద్యుడిని సంప్రదించాడు. ఆయనకోవిడ్‌గా అనుమానించి సీటీస్కాన్ చేయించుకోవాల్సిందిగా సిఫార్సు చేశారు. సీటీస్కాన్ చేయించగా..కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితివిషమించింది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఈ రిపోర్ట్ తీసుకుని గాంధీ ఆస్పత్రికి వెళ్లగా..అడ్మిట్‌చేసుకునేందుకునిరాకరించారు. అదేమంటె..ఆర్టీపీఆర్ కానీ, ర్యాపిడ్ టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే...అడ్మిట్ చేసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో ఆ వ్యక్తిదిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇదీ ఒక్క వారాసిగూడ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి సమస్య మాత్రమే కాదు. సీటీస్కాన్ చేయించుకుంటున్నఅనేకమంది అత్యవసరపరిస్థితుల్లో ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో: నిజానికి ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టులతో పోలిస్తే సీటీస్కాన్ చేయిస్తే.. ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్ లోడు ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలుస్తుంది.అత్యవసర వైద్యానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తున్న కొంతమంది వైద్యులు తమ వద్దకు వచ్చిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో భాగంగా సీటీస్కాన్‌కు సిఫార్సుచేస్తున్నారు. పరిమిత కేంద్రాల్లోనే ఆర్టీపీసీఆర్ టెస్టు చేస్తుండటం, శాంపిల్‌ఇచ్చిన తర్వాత రిపోర్ట్ జారీకి 24 గంటల సమయం పడుతుండటం, ర్యాపిడ్ టెస్టుల్లో 80 శాతం మాత్రమే స్పష్టత ఉండటం వల్ల కచ్చితత్వం కోసం డాక్టర్లు ఈ సీటీస్కాన్‌లను సిఫార్సు చేస్తున్నారు. అంతేకాదు ప్రాథమిక దశలో ఉన్న వైరస్‌ను కూడా ఇందులో గుర్తించొచ్చు. ఇతర టెస్టులతో పోలిస్తే డయాగ్నోస్టిక్ సెంటర్లకు ఇది లాభదాయకంగా మారింది. దీంతో ఆయా ఆస్పత్రుల్లోని వైద్యులు కూడా దీనికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. సిటీస్కాన్‌లో పాజిటివ్ నిర్ధారణై.. అత్యవసర పరిస్థితుల్లో ఈ రిపోర్ట్‌ను తీసుకుని ప్రభుత్వ కోవిడ్ సెంటర్‌కు వెళితే..వారు అడ్మిషన్‌కు నిరాకరిస్తున్నారు. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టుల్లో ఏదో ఒకటి ఉంటే తప్ప అనుమతించడం లేదు. అప్పటికే వైరస్ శరీరంలోకి ప్రవేశించి, శ్వాసనాళాలు, గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చికిత్సను నిర్లక్ష్యం చేయడం, అప్పటికే శరీరంలో వైరస్ లోడు పెరగడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు అందక అనేకమంది మరణిస్తున్నారు. ఈ తరహా మృతుల్లో 60 శాతం మంది 55 ఏళ్లలోపు వారే ఉన్నారు. ఆ ముసుగులో కార్పొరేట్ దోపిడీ దగ్గు, జలుబు, జ్వరం వంటి తీవ్రమైన లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన బాధితులకు ఈ టెçస్టులు చేయడంలో పెద్దగా అభ్యంతరం లేదు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారికి, పాజిటివ్ కేసులకు ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉండి అనుమానంతో వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ సిఫార్సు చేస్తే సరిపోతుంది. సీటీస్కాన్‌తో పోలిస్తే ఈ టెస్టుకు అయ్యే చార్జీ కూడా చాలా తక్కువ. ప్రభుత్వం ఇందుకు రూ.2000 నుంచి శాంపిల్ సేకరణను బట్టి రూ.2800 వరకు నిర్ణయించింది. కానీ నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు అధిక సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఎలాంటి లక్షణాలు లేని సాధారణ రోగులకు కూడా సీటీస్కాన్ చేస్తున్నాయి. ఇందుకు రూ.10 వేల వరకు చార్జీ చేస్తున్నాయి. ఛాతీ ఎక్సరేతో తెలిసిపోయే..వైరస్‌ను సీటీస్కాన్ వరకు తీసుకెళ్లడంతో రోగులు మరింత భయాందోళనలకు గురవుతున్నారు. అంతేగాక సీటీస్కాన్లో పాజిటివ్ వచ్చిన వారి వివరాలు ప్రభుత్వ హెల్త్ పోర్టల్‌లో నమోదు కావడం లేదు. వైరస్ సోకినట్టు ఇతరులకు తెలిసే అవకాశం ఉండటంతో వీరిలో చాలా మంది ఆస్పత్రుల్లో చేరడం లేదు. సోషల్ మీడియాలో వైద్య నిపుణులు ఇస్తున్న సూచనలు పాటిస్తూ ఇళ్లలోనే ఉంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా మెడికల్ షాపులకు వెళ్లి మందులు కొని తెచ్చి వాడుతున్నారు. అసింటమేటిక్ బాధితులు సులభంగానే కోలుకుంటున్నప్పటికీ...మధుమేహం, హైపర్‌టెన్షన్, ఇతర రోగాలు ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాదు పరోక్షంగా వీరు వైరస్ సామాజిక వ్యాప్తికి కారణమవుతున్నట్టు ప్రభుత్వ వైద్యనిపుణులు అభిప్రాయ పడుతున్నారు. -
గాంధీలో విద్యుత్ అంతరాయం
గాంధీ ఆస్పత్రి: కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గురువారం సాయంత్రం సుమారు అరగంటపైగా విద్యుత్ అంతరాయం కలిగింది. అత్యవసర, సాధారణ వార్డుల్లో అంధకారం అలముకోవడంతో కరోనా బాధితులతోపాటు వైద్యులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అనంతరం జనరేటర్లు ఆన్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో సాయం త్రం 5.30 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చీకట్లు కమ్ముకోవడంతో ఏం జరుగుతుం దో తెలియక రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఐసీయూ, అత్యవసర విభాగాల్లో సుమా రు 850 మంది ఆక్సిజన్, వెంటిలేటర్లపై వైద్యసేవలు పొందుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆయా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. స్పం దించిన ఆస్పత్రి పాలనా యంత్రాంగం సంబంధిత ఎలక్ట్రీషియన్లను అప్రమత్తం చేసింది. ఆస్పత్రిలో ఉన్న 500 కేవీ జనరేటర్లను ఆన్ చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. 35 నిమిషాల తర్వాత ఆస్పత్రి మొత్తానికి విద్యుత్ సరఫరా జరిగింది. 11 కేవీ ఫీడర్‌లైన్ ద్వారా ఆస్పత్రి ఎలక్ట్రిసిటీ కంట్రోల్ బోర్డుకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఉదయం నుంచి నిరంతరం కురుస్తున్న వర్షానికి ఫీడర్‌లైన్ జంపర్ హఠాత్తుగా తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కాకుండా ఓవర్‌లోడ్ పడడంతో ఆటోమేటిక్‌గా ఆన్ కావాల్సిన జనరేటర్లు స్విచ్చాఫ్ అయ్యాయి. గాంధీలో ఆరుగురే కాంట్రాక్టు సిబ్బంది సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మొత్తం 21 ఎలక్ట్రీషియన్ పోస్టులు అవసరం కాగా ప్రస్తుతం మూడు షిఫ్ట్‌ల్లో ఆరుగురు కాంట్రాక్టు ఎలక్ట్రీషియన్లు మాత్ర మే అందుబాటులో ఉన్నారు. వారికి కూడా సంబం ధిత సర్టిఫికెట్, తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం గమనార్హం. అంతరాయం 7 నిమిషాలే.. గాంధీ ఆస్పత్రిలో కేవలం ఏడు నిమిషాలు మాత్రమే విద్యుత్ అంతరాయం కలిగిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు వివరణ ఇచ్చారు. గురువారం సాయంత్రం 5.35 నుంచి 5.56 గంటల వరకు సరఫరా నిలిచిపోయిందని, ఏడు నిమిషాల వ్యవధిలో జనరేటర్ల ద్వారా విద్యుత్ పునరుద్ధరించామని చెప్పారు. ఐసీయూ, అత్యవసర విభాగాలతో పాటు సాధారణ వార్డులో రోగులకు అందిస్తున్న చికిత్సలకు ఎటువంటి అంతరాయం కలగలేదని స్పష్టం చేశారు. -
యాంటిజెన్ పరీక్షల్లో నెగెటివ్ సీటీస్కాన్లో పాజిటివ్
సాక్షి, సిటీబ్యూరో: మన్సూరాబాద్‌కు చెందిన సురేష్(పేరు మార్చాం) అనే యువకుడు కోవిడ్ లక్షణాలతో ఆందోళనకు గురయ్యాడు. అనుమానం ఉండటంతో సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లాడు. యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్‌లో నెగెటివ్ అని తేలింది. కానీ తనకు ఉన్న లక్షణాలు అతడిని మరింత కుంగదీశాయి. ఓ ప్రైవేట్ లాబొరేటరీకి వెళ్లాడు. సీటీ స్కాన్‌లో కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు స్పష్టమైంది. కానీ ఆ నివేదిక ఆధారంగా అతడికి కోవిడ్ చికిత్స చేసేందుకు గాంధీ ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. దీంతో కింగ్‌కోఠి హాస్పిటల్లో మరోసారి పరీక్ష చేసుకోవాల్సి రావడంతో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చేర్చుకున్నారు. యాంటిజెన్ ర్యాపిడ్ పరీక్షల్లోని డొల్ల తనానికి నిదర్శనం ఇది. ఒక్క సురేష్ మాత్రమే కాదు. చాలామంది ఈ పరీక్షల వల్ల సరైన ఫలితాలు లభించక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరోనా లక్షణాలను గుర్తించేందుకు సత్వర ఫలితాల కోసం ప్రవేశపెట్టిన ర్యాపిడ్ పరీక్షల నిర్వహణలో చిత్తశుద్ధి కొరవడుతున్నట్లు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 88 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో యాంటిజెన్ పరీక్షలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.. కానీ నమూనాల సేకరణ మొదలుకొని ఫలితాలను వెల్లడించడం వరకు చాలాచోట్ల గందరగోళం నెలకొంటోంది. దీంతో బాధితులు ఒకటికి రెండుసార్లు పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. తప్పని పడిగాపులు.. తప్పుడు ఫలితాలు.. హస్తినాపురం ప్రాంతానికి చెందిన ఓ బిల్డర్‌కు సీటీస్కాన్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన యాంటి జెన్ పరీక్షకు వెళ్లాడు. అక్కడ నెగెటివ్ అని రిపోర్ట్ రావడంతో బిత్తరపోయాడు. íసీటీస్కాన్ ఆధారంగా సర్కార్ దవాఖానాలో చేర్చు కొనేందుకు నిరాకరించడంతో ప్రస్తుతం ఇంటి దగ్గరే హోంఐసోలేషన్‌లోనే ఉండి మందులు వాడుకుంటున్నాడు. బాధితులు యాంటిజెన్ పరీక్షల కోసం గంటల తరబడి పడిగాపులు కాసినా.. చివరకు తప్పుడు ఫలితాలతో ఆందోళనకు గురికావాల్సి వస్తోంది. ప్రధాన ఆస్పత్రుల్లో పరీక్షలను తగ్గించి చికిత్సలకే పరిమితం చేశారు. దీంతో జనం కరోనా పరీక్షల కోసం ప్రాథమిక కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుంది. కానీ ఈ కేంద్రాల్లో సకాలంలో వైద్య పరీక్షలు లభించక గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. నాలుగు గంటల పాటు క్యూలో.. ‘తెల్లవారు జామున 5 గంటలకు వచ్చి క్యూలో నిలబడితే ఉదయం 9 గంటలకు నమూనాలు తీసుకున్నారు. నాలుగు గంటలు పడిగాపులు తప్పలేదు. ఇక ఉదయం పూట వచ్చిన వాళ్లు మధ్యాహ్నం వరకు క్యూలో వేచి ఉండక తప్పడం లేదు.’ అని కొండాపూర్ ఆరోగ్య కేంద్రంలో పరీక్షకు వెళ్లిన ఒక బాధితుడు విస్మయం వ్యక్తం చేశారు. గంటల తరబడి ఎదురుచూసినా ఫలితాల్లో గందరగోళం కారణంగా మరింత భయాందోళనకు గురికావాల్సి వస్తోందని చెప్పారు. మరోవైపు ‘క్యూలో ఎక్కువ సేపు ఉండటం వల్ల కూడా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో అకస్మాత్తుగా వర్షం వచ్చినప్పుడు కరోనా ఉన్నవాళ్లు, లేనివాళ్లు అంతా ఒక్కచోట చేరి ఆరోగ్య కేంద్రాలే వైరస్ వ్యాప్తికి అడ్డాలుగా మారే ప్రమాదం ఉన్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్లాట్సిస్టమ్ మంచిది.. కరోనా వైద్య పరీక్షల కోసం ఒక్కసారి ఎక్కువ మంది వచ్చి గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా స్లాట్ పద్ధతిని అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుంది. యాంటిజెన్ పరీక్షా కేంద్రాలపైన విస్తృత ప్రచారం చేయడంతో పాటు ఒక్కో ఆస్పత్రిలో చేసే పరీక్షల సంఖ్యకు అనుగుణంగా బాధితులు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తే రద్దీ తగ్గుతుంది. పరీక్షల్లో నాణ్యత, పారదర్శకత పెరుగుతుంది. యాంటిజెన్ అలా.. ఆర్టీపీసీఆర్ ఇలా.. నిజానికి యాంటిజెన్ ర్యాపిడ్ పరీక్షలకు ముందు ప్రధాన ఆస్పత్రుల్లో ఆర్టీïసీపీసీఆర్ పద్ధతిలోనే వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఫలితాలు వెలువడేందుకు 24 గంటల సమయం పడుతుంది. కానీ ర్యాపిడ్ టెస్టుల్లో అరగంటలోనే ఫలితాలు తెలిసిపోతాయి. ర్యాపిడ్ టెస్టులు అందుబాటులోకి రావడంతో ప్రధాన ఆస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్ తగ్గించారు. యాంటిజెన్ పరీక్షలను విస్తృతం చేశారు. ఆలస్యమైనా ఆర్టీపీసీఆర్ పరీక్షల్లోనే ఎక్కువ ఖచ్చితత్వం ఉంటుందని సీనియర్ వైద్యనిపుణులు ఒకరు తెలిపారు. ‘అత్యవసరం’లోనే యాంటిజెన్ సాధారణంగా వైరస్ ఊపిరితిత్తుల్లోంచి రక్తంలో కలిన తర్వాత మాత్రమే యాంటిజెన్ ర్యాపిడ్ పరీక్షలు చేయడం వల్ల ఫలితం ఉంటుంది. కానీ వైరస్ గొంతులో, శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్నప్పుడు యాంటిజెన్ పరీక్షల వల్ల 50 నుంచి 60 శాతం ఫలితాలే ఉంటాయి. యాక్సిడెంట్ల వంటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ పరీక్షలు చేస్తారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మాత్రమే ఖచ్చితమైన ఫలితాలు తెలుస్తాయి. కానీ ఆలస్యమవుతుంది. ఇక ఊపిరితిత్తుల్లో ఉండే వైరస్‌ను గుర్తించేందుకు సిటీస్కాన్ చేయడం ఎంతో ఉత్తమం. – డాక్టర్ రఫీ, పల్మనాలజిస్టు, కేర్ ఆస్పత్రి -
ఆక్సిజన్ అందకే నా భర్త మృతి చెందాడు
గాంధీఆస్పత్రి : గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆక్సిజన్ అందక తన భర్త మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి భార్య గురువారం చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ముద్దనగిరి గ్రామానికి చెందిన గొల్ల శ్రీధర్ (28) స్వరూప దంపతులకు రెండున్నర ఏళ్ల వయసుగల బాబు ఉన్నాడు. నగరానికి వలస వచ్చి సైనిక్‌పురి సాయినగర్‌లో నివసిస్తున్నారు. శ్రీధర్ న్యూటెక్ గ్రాఫిక్స్ సంస్థలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న శ్రీధర్‌ను ఈనెల 11న ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. నిర్ధారణ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా రావడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు ఈనెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు గాంధీఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. 15వ తేదీ వేకువజామున 3.25 గంటలకు శ్రీధర్ తన భార్య స్వరూపకు ఫోన్ చేసి శ్వాస తీసుకోలేక పోతున్నానని, ఆక్సిజన్ కూడా పెట్టలేదని చెప్పడంతో బంధువులతో కలిసి ఆమె గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగానికి వచ్చింది. బెడ్ నంబర్ 104లో ఉన్న భర్త శ్రీధర్ దగ్గరకు వెళ్లి చూడగా ఆక్సిజన్ పైప్ పెట్టిలేదని, అచేతనంగా పడి ఉన్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. డ్యూటీలో ఉన్న నర్సుకు చెప్పగా ఆమె వచ్చి పల్స్ చూడగా జీరో వచ్చిందని దీంతో అక్కడ ఉన్న సిబ్బంది తమను తక్షణమే వార్డు బయటకు పంపించి వేశారని, ఉదయం 10 గంటలకు మీ భర్త మృతి చెందాడని సమాచారం అందించారని, సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలకు మృతదేహాన్ని తరలించారని తెలిపింది. ఆక్సిజన్ అందిస్తే తన భర్త బతికేవాడని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, సిబ్బందిపై తగిన చర్యలు చేపట్టాలని కోరుతు ఫిర్యాదుతోపాటు, తన భర్త ఆక్సిజన్ పెట్టలేదని చెప్పిన వాయిస్ క్లిప్పింగ్స్‌ను జతచేసింది. నిర్ధారణ పరీక్షల్లో తనకు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు న్యాయనిపుణులతో చర్చించి తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. -
ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితుడు మృతి
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువకుడు ఆక్సిజన్ అందక బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిసింది. నేరేడ్మెట్ సాయినగర్‌కు చెందిన గొల్ల శ్రీధర్ శ్వాస సంబంధ సమస్య తలెత్తడంతో నాలుగు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో చేరాడు. అక్కడ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో శ్రీధర్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స సమయంలో తనకు శ్వాస ఆడటం లేదని, ఆక్సిజన్ పెట్టమని చెప్పినప్పటికీ ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన కుటుంబ సభ్యులకు వివరించినట్లు ఒక ఆడియో బయటికి వచ్చింది. దీంతో ఆసుపత్రిలో ఆక్సిజన్ పెట్టకపోవడం వల్లే శ్రీధర్ మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. అయితే ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేద ని, ఆ పేరుతో ఉన్న యువకుడు చనిపోయినట్లు ఆస్పత్రి మృతుల జాబితాలో కూడా లేదని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు స్పష్టం చేశారు. -
ఔట్ సోర్సింగ్ నర్సులకు రూ.25 వేల వేతనం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడ్డ రోగులకు చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ నర్సుల వేతనాలను రూ.25 వేలకు పెంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అదేవిధంగా పనిచేసిన రోజున రూ.500 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని భావిస్తోంది. వేతనాల పెంపను కోరుతూ గాంధీ ఆస్పత్రిలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన సరికాదని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తూనే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈక్రమంలో స్పందించిన ప్రభుత్వం వేతన పెంపుతో పాటు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కోవిడ్–19 ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు కూడా పనిచేసిన రోజున రూ.300 ప్రోత్సాహకం ఇవ్వాలని భావిస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు గురువారం వెలువడే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్ బాధితులకు ఇబ్బంది కలగకూడదని సమ్మె విరమిస్తున్నట్లు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రకటించింది. వెంటనే విధుల్లో చేరనున్నట్లు తెలిపింది. -
గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమణ
-
గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో బుధవారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వం చేపట్టిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. నర్సులకు 17,500 నుంచి 25 వేల రూపాయల వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కరోనా డ్యూటీ చేస్తున్న వారికి డైలీ ఇన్సెంటివ్‌ల కింద రూ.750 ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్టులోకి మార్చేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చింది. నాల్గవ తరగతి ఉద్యోగులకు రోజుకు 300 రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వడంతో పాటు ఇకపై వారికి 15 రోజులు మాత్రమే డ్యూటీ ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆందోళన విరమిస్తున్నట్లు నర్సులు ప్రకటించారు. (గాంధీలో నిరవధిక సమ్మె) చదవండి: ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యం -
గాంధీలో కొనసాగుతున్న సమ్మె..
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి వద్ద ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ధర్నా రెండో రోజు కొనసాగుతోంది. సెక్యూరిటీ, శానిటైజేషన్, ఫోర్త్ క్లాస్ పేషేంట్ కేర్ సిబ్బంది విధులు బహిష్కరించారు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే వారం రోజులుగా నిరవధిక సమ్మెలో 600 మంది నర్సులు పాల్గొన్నారు. దీంతో కరోనా పేషెంట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విధులకు హాజరు కావాలని, సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం కోరినా ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు విధుల్లో చేరమని చెబుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ మంగళవారం విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. -
నేటి నుంచి గాంధీలో నిరవధిక సమ్మె
గాంధీ ఆస్పత్రి: కోవిడ్–19 నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి నిరసన సెగ తగిలింది. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ మంగళవారం విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా ప్రభుత్వం, వైద్య ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాలు సీఐటీయూ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, ఏఐటీయూసీ ప్రతినిధులతోపాటు గాంధీ సిబ్బంది జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో సమావేశం నిర్వహించి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల రెగ్యులరైజ్ ప్రధాన డిమాండ్‌తో పాటు సమాన పనికి సమాన వేతనం నినాదంతో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని తీర్మానించారు. ఇదిలాఉండగా మంగళవారం ఉదయం నుంచి ఆందోళనకారులు ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆస్పత్రి లోపల, బయట తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 212 మంది నర్సింగ్ సిబ్బంది గత 5 రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. మమ్మల్ని పట్టించుకోవట్లేదు..: ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు రూ.34 వేల వేతనం, ఇన్సెంటివ్స్, బీమా సౌకర్యం కల్పించాలని గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని కాంట్రాక్టు నర్సింగ్ యూనియన్ ప్రతినిధులు సుజాతరెడ్డి, మేఘమాల, ఇందిర, సరళ, మధులతలు ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ‘నాల్గవ తరగతి ఉద్యోగులను, 300 ఓసీఎస్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలి. పారిశుధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ టేకర్ల వేతనాలు రూ.20 వేలకు పెంచాలి’అని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఐఎన్టీయూసీ గాంధీ యూనిట్ అధ్యక్షుడు శివకుమార్ స్పష్టం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కాగా, నిరవధిక సమ్మె విషయం తన దృష్టికి రాలేదని గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. బెడ్లపైనే మృతదేహాలు.. డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆస్పత్రిలో పనిచేస్తున్న నాల్గవ తరగతి ఉద్యోగులు, వార్డు బాయ్స్, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు, పేషెంట్ కేర్ టేకర్లు మంగళవారం మూకుమ్మడిగా విధులు బహిష్కరించడంతో చికిత్స పొందుతున్న సుమారు 900 మంది కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వార్డుల్లో పారిశుధ్య లోపంతో తీవ్ర దుర్వాసనల మధ్య వైద్యులు విధులు నిర్వహించారు. చికిత్స పొందుతూ మరణించిన రోగుల మృతదేహాలను మార్చురీకి తరలించేందుకు అవకాశం లేకపోవడంతో గంటల తరబడి బెడ్లపైనే పడున్నాయి. -
యశోద, కిమ్స్‌పై ఏం చర్యలు తీసుకున్నారు?
-
యశోద, కిమ్స్‌పై ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కోవిడ్ నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, బాధితులకు అందుతున్న చికిత్సపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. గాంధీ ఆస్పత్రిలోనూ కరోనా పరీక్షలు జరపాలని ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశించింది. కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలని సూచించింది. కరోనా బాధితులకు 4 లక్షల రూపాయలకు పైగా బిల్లులు వేసిన యశోద, కిమ్స్ ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. (తెలంగాణలో 99 శాతం రికవరీ : హెల్త్ డైరెక్టర్) అలాగే ప్రైవేటు కేంద్రాల్లో అన్ని రకాల పరీక్షలకు గరిష్ట చార్జీలు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్ల వివరాలను విస్తృత ప్రచారం చేయాలని సూచించింది. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో కరోనా చికిత్సలు చేస్తారా లేదో చెప్పాలని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఈ నెల 27లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.(నిమ్స్‌లో మొదలైన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్) -
గాంధీ నర్సులకు వేతనాల పెంపు!
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న నర్సులకు త్వరలో వేతనాలు పెరగనున్నాయి. ప్రస్తుతం వారికి ప్రతి నెలా రూ. 17,500 చొప్పున జీతం ఇస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.25వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 212 మంది ఔట్సోర్సింగ్ నర్సులు పనిచేస్తున్నారు. జీవో 14 ప్రకారం ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ అయిన వీరందరికీ రూ.17,500 జీతం ఇస్తున్నా రు. అయితే ఇటీవల కోవిడ్–19 చికిత్స కోసం ని యమితులైన నర్సులకు రూ.25 వేలు చెల్లిస్తున్నా రు. తాము ఎప్పట్నుంచో పనిచేస్తున్నా తక్కువ జీతమివ్వడం ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల వైద్య విద్యా సంచాలకుడి కార్యాలయం వద్ద ఔట్సోర్సింగ్ నర్సులు వరుసగా 3 రోజులు ధర్నా చేశారు. దీంతో డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి వారి జీతాల పెంపు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో జీతాలు పెంచాలని ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పెరిగిన జీతాలు ఇన్సెంటివ్ రూపంలో ఇచ్చే అవకాశాలు న్నాయి. జీవో 14 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమితులయ్యారు. వారంతా కూడా తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేసే అవకాశం ఉండటంతో పెంచిన వేతనాల ను ఇన్సెంటివ్ రూపంలో ఇస్తే ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక ఇన్సెంటివ్‌గా వేతనంతో పాటు ఇన్ పేషెంట్ వద్ద సేవలందించే స్టాఫ్ నర్సులకు రోజుకు రూ.300–500 మధ్యలో ఇవ్వనున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా సమాచారం రాలేదు. కరోనా విధుల్లో ఉన్నవారికి షిఫ్టుల వారీగా డ్యూటీలు వేస్తున్నారు. వరుసగా 5 రోజులు పనిచేస్తే మరో 5 రోజులు సెలవిస్తున్నారు. ప్రస్తుతం వైరస్ భయంతో కొంతమంది నర్సులు విధులకు హాజరుకావడం లేదు. కొంతమంది ఉద్యోగాలకు రాజీనామా కూడా చేశారు. బయట నర్సులకు 12 గంటల డ్యూటీలకే రూ.3–4 వేల వరకు ఇస్తున్నారు. అందుకే కోవిడ్ సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిలోని ఔట్సోర్సింగ్ నర్సులకు ఈ మేరకు వేతనాలు పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, అడ్డగోలు బిల్లులు వేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. వాటిని నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఇం దుకోసం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీ టింగ్ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేయాలన్నారు. గాంధీ, ఫీవర్, కింగ్‌కోఠి, చెస్ట్ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలన్నారు. గాంధీలో 200 వెంటిలేటర్లు ఉన్నా అందులో చేరేందుకు ప్రజలు ఎందుకు భయ పడుతున్నారో, ఎందుకు వెనుకడుగు వే స్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. తాను గాంధీ ఆసుపత్రిని సందర్శించానని, అక్కడి పరిస్థితులను తెలుసుకున్నానన్నారు. అక్కడ పని చేసే సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 50 లక్షల బీమా కవరేజి తప్పితే ఎలాంటి ప్రోత్సాహకం ఇవ్వలేదన్నారు. కరోనా ఆసుపత్రుల్లో ఖర్చుల కోసమే కేంద్ర ప్రభుత్వం రూ. 215 కోట్లు ఇచ్చిందన్నారు. రాష్ట్రానికి 1,220 వెంటిలేటర్లకు గాను 888 కేంద్రం పంపించిందన్నారు. అందులో 10 శాతం కూడా వినియోగించడం లేదన్నారు. రాష్ట్రానికి 7,44,000 మాస్క్‌లు, 2,41,000 పీపీఈ కిట్లు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబెట్లు పంపించిందన్నారు. ర్యాపిడ్ టెస్టుల కోసం 1,23,000 యాంటిజెన్ కిట్లను, 1,02,407 ఆర్టీపీసీఆర్, 52 వేల వీటీఏ కిట్లు పంపించిందన్నారు. టెస్టులు సరిగా చేయడం లేదని, వాటిని చేయాలని కేంద్ర బృందాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాయన్నారు. వసతులకు సంబంధించి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో తాను మాట్లాడుతున్నానని, తనకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. రాష్ట్రంలో సిబ్బంది కొరత ఉన్నందునే టిమ్స్‌ను ప్రారంభించలేదని చెప్పారన్నారు. తన చొరవతోనే రైల్వే ఆసుపత్రిని, సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో రెండు బ్లాకులను కోవిడ్ ఆసుపత్రులుగా మార్చారన్నారు. కేంద్రం ఇచ్చిన బియ్యం, పప్పు దినుసులు రాష్ట్ర ప్రజలకు అందించాలని, ఇందుకోసమే రాష్ట్రంలో రూ. 3 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోందన్నారు. బియ్య పథకం కింద ప్రతి కిలోకు రూ. 31 కేంద్రం ఇస్తోందన్నారు. ఎంఎస్ఎంఈలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలిచ్చేందుకు చర్యలు చేపట్టామని, రాష్ట్రంలో వాటి అమలును బ్యాంకర్ల సమావేశంలో సమీక్షించానన్నారు.వరవరరావు విషయంలో చట్టప్రకారం ఏం చేయాలో ప్రభుత్వం అలాగే చేస్తుందన్నారు. గాంధీ ఆస్పత్రి సందర్శన గాంధీ ఆస్పత్రి: కరోనా సోకిన ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స పొందాలని కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని ఆయన ఆదివారం సందర్శించారు. డీఎంఈ రమేష్‌రెడ్డి, గాంధీ సూపరిం టెండెంట్ రాజారావు.. గాంధీ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యసేవలను ఆయనకు వివరించారు. -
గాంధీ ఆస్పత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
-
‘టిమ్స్ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలి’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గచ్చిబౌలిలో ఉన్న టిమ్స్ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో టెస్టులు తక్కువగా జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి ఈటల రాజేందర్, ఆధికారులతో మాట్లాడినట్లు వ్యాఖ్యానించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై తర్వాత హైద్రాబాద్‌లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. (కరోనా రోగి పట్ల అమానుష ప్రవర్తన ) కేంద్రం నుంచి తెలంగాణకు 600 వెంటిలేటర్లు పంపించామని కిషన్‌రెడ్డి చెప్పారు. వైద్య సిబ్బందికి, కరోనా బాధితులకు ధైర్యం కల్పించటానికే గాంధీ ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో 250పైగా వెంటిలేటర్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. గాంధీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలన్నారు. గాంధీలో పేషెంట్లకు మానసిన ధైర్యాన్ని ఇచ్చే బాధ్యత స్థానిక ఎంపీగా తనపై ఉందని తెలిపారు. ప్రస్తుతానికి కోవిడ్‌కు వ్యాక్సిన్ లేదని ప్రజలే తమను తాము సురక్షించితంగా కాపాడుకోవాలని పేర్కొన్నారు. (వైరస్ వ్యాప్తి: ఆ రెండూ వేర్వేరు అంశాలు) -
వామ్మో.. అక్కడా..!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా.. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరినుంచి వస్తుందో అర్థంకాక జనం బెంబేలెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కోవిడ్ సెంటర్లలో పనిచేసేందుకు సిబ్బంది కూడా వెనుకంజ వేస్తున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన పని చేస్తున్న వారు మినహాయిస్తే..కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల కింద పని చేస్తున్న స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు, పారిశుద్ధ్య కార్మికుల్లో ఇప్పటికే 30 శాతం మంది అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండానే మానేస్తున్నారు. ఇప్పటికే పని చేస్తున్న వారు భయంతో విధులకు దూరంగా ఉంటుంటే...ప్రభుత్వం ఆయా సెంటర్లలో రెగ్యులర్ కాకుండా తాత్కాలిక ప్రతిపాదికన చేపడుతున్న నియామకాలకు స్పెషాలిటీ వైద్యులు సహా టెక్నీషియన్లు ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. దీంతో ఇప్పటికే గచ్చిబౌలిలోని 14 అంతస్తుల్లో 1500 పడకలతో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్)పరిస్థితి ప్రశ్నా ర్థకంగా మారింది. పది రోజుల క్రితమే సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు ఇది అందుబాటులోకి రాకపోవడానికి ఇదే కారణమని తెలిసింది. ఉస్మానియా సహా ఇతర టీచింగ్ ఆస్పత్రులు, జిల్లాల్లో పని చేస్తున్న వైద్య సిబ్బందిని డిప్యూటేషన్‌పై ఇప్పటికే కొంత మందిని ఇక్కడికి తీసుకొచ్చినప్పటికీ..వారు కూడా ఇక్కడ పని చేసేందుకు నిరాసక్తత వ్యక్తం చేస్తుండటం విశేషం. ఆ స్టాఫ్ నర్సుల్లో ఆందోళన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్) సహా గాంధీ, కింగ్‌కోఠి, చెస్ట్ సహా పలు కోవిడ్ సెంటర్లలో విధులు నిర్వహించేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సుల నియమాకా నికి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. చాలా మంది స్టాఫ్ నర్సులు ధైర్యంతో ఇక్కడ పని చేసేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కాంట్రాక్ట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. 152 మందిని ఎంపిక చేసి, వీరిలో కొంత మందిని గాంధీ కోవిడ్ సెంటర్‌కు పంపింది. ఆ మేరకు వారంతా ఇటీవల గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. కాంట్రాక్ట్ ప్రతిపాదిక కింద ఇటీవల ఎంపిక చేసిన నర్సులకు తీరా ఆస్పత్రికి చేరుకున్న తర్వాత అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కింద నియమించినట్లు తెలిసి వారు ఆందోళనకు దిగారు.‘గాంధీ’లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రాణాలను రిస్క్‌లో పెడతారా? నిజానికి ఒక డాక్టర్ ప్రొఫెసర్ స్థాయికి చేరుకోవాలంటే కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి. వీరంతా ఇప్పటికే ఎక్కడెక్కడో సెటిలైపోయారు. ఇలాంటి వారు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి... కేవలం ఏడాది తాత్కాలిక ఉద్యోగం కోసం టిమ్స్‌కు ఎలా వస్తారు? కోవిడ్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క ఏడాది కోసం ఏ డాక్టరైనా తమ ప్రాణాలను ఫణంగా పెడతాడా? ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా? ఏపీలో వేల పోస్టులను రెగ్యులర్ బేసిస్‌పై రిక్రూట్మెంట్ చేస్తుంటే..తెలంగాణలో మాత్రం తాత్కాలిక పేరుతో నోటిఫికేషన్లు ఇవ్వడం ఎంత వరకు సమంజసం? – డాక్టర్ శ్రీనివాస్, ప్రతినిధి,తెలంగాణ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ -
ప్రజాకవి నిస్సార్‌ను కాటేసిన కరోనా
సాక్షి, హైదరాబాద్: ప్రజాకవి, రచయిత, గాయకుడు, తెలంగాణ ప్రజానాట్యమండలి సహాయ కార్యదర్శి మహ్మద్ నిస్సార్‌ను (58) కరోనా కాటేసింది. ఈ మహమ్మారి సోకడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. బుధవారం కన్నుమూశారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు పడిన కష్టాలను బాధలను పేర్కొంటూ‘ముదనష్టపు కాలం.. ఇంకెంతకాలం’అంటూ ఇటీవలే ఓ పాట పాడారు. అదే ఆయన చివరి పాట. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో లక్షలాది మందిని ఉద్యమ పథంలోకి నడిపిన నిస్సార్‌ది యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం. మహ్మద్ అబ్బాస్, హలీమా దంపతులకు 1962 డిసెంబర్ 16న ఆయన జన్మించారు. సుద్దాల హనుమంతుతోపాటు సుద్దాల అశోక్‌తేజ స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న నిస్సార్.. సీపీఐ కార్యకర్తగా, తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారుడిగా తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తన పదునైన కంచుకంఠంతో పాడిన పాటలు గొప్ప చైతన్యాన్ని కలిగించాయి. ఈ క్రమంలో ప్రజాగాయకుడు గద్దర్ స్ఫూర్తిని అందుకుని ఎన్నో పాటలు పాడారు. పలు కవితలు కూడా రాశారు. దోపిడీ, పీడనలు, అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తారు. ప్రజానాట్యమండలి సహా పలువురి సంతాపం.. నిస్సార్ మృతిపట్ల తెలంగాణ ప్రజా నాట్యమం డలి రాష్ట్ర కౌన్సిల్ తీవ్ర సంతాపం ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో ఆట–పాట–మాట, ధూంధాం కార్యక్రమాల్లో ప్రత్యేక పాత్ర పోషిస్తూ, ప్రజల సమస్యలను ఇతివృత్తాలుగా చేసుకుని అనేక జానపద గేయాలు, ప్రజల పాటలను రాసిన వాగ్గేయకారుడు నిస్సార్ అని కందిమళ్ల ప్రతాపరెడ్డి, పల్లె నర్సింహ, కె.శ్రీనివాస్, కన్నం లక్ష్మీనారాయణ, ఉప్పలయ్య, జాకబ్, కొండల్రావు, పి.నళిని నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ పోరాటంలో నిస్సార్ అద్భుతమైన పాటలు రాశారని, అనేక ప్రజా పోరాటాల్లో, పుట్టిన సుద్దాల గురించి రాసిన పాటలతో చిరస్మరణీయులుగా నిలిచిపోతారని ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ జోహార్లు అర్పించారు. నిస్సార్ వంటి కళాకారుడు వైరస్‌కు బలి కావడం విచారకరమని సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకటరెడ్డి, ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిస్సార్ మరణంతో పార్టీకి, ప్రజానాట్యమండలికి తీరని నష్టం వాటిల్లిందని ఏఐటీయూసీ నాయకులు టి.నరసింహన్, ఎస్.బాలరాజ్, వీఎస్ బోస్, ఎండీ యూసుఫ్ విచారం వెలిబుచ్చారు. ఆర్టీసీ ఉద్యోగిగా... కళాకారుడిగా జీవన ప్రస్థానం ప్రారంభించినప్పటికీ ఉపాధి కోసం నిస్సార్ అనేక పనులు చేశారు. లారీ క్లీనర్‌గా, డ్రైవర్‌గా కొంతకాలం పనిచేశారు. అనంతరం ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం రావడంతో చాలాకాలం పాటు ఆ ఉద్యోగం చేస్తూనే కళాకారుడిగా ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం గజ్జెకట్టారు. తెలంగాణలోని అన్ని డిపోల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన సాంస్కృతిక యోధుడిగా నిలిచారు. ప్రస్తుతం మియాపూర్–2 డిపోలో ఏడీసీగా పని చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన నిస్సార్‌ను పడకలు ఖాళీ లేవంటూ ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చుకోలేదని, చివరకు గాంధీ ఆస్పత్రిలో చేర్చుకున్నప్పటికీ, వెంటిలేటర్ లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తంచేశాయి. నిస్సార్‌కు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. -
కరోనాపై పాట.. దానికే బలైన నిస్సార్!
సాక్షి, హైదరాబాద్: కరోనాపై ప్రజలను చైతన్యం చేసిన కవిగాయకుడు నిస్సార్‌ను మహమ్మారి బలితీసుకుంది. కోవిడ్ బారినపడిన ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ప్రాణాలు విడిచారు. ‘కరోనా కరోనా నీతో యుద్ధం చేస్తాం మా భారత భూభాగాన. కరోనా కరోనా నిన్ను మట్టికరిపిస్తాం 130 కోట్ల జనం సరేనా!!’అంటూ కరోనాపై కలం గురిపెట్టిన నిస్సార్ అకాల మరణంపై పలువురు సాహితీవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిస్సార్ స్వగ్రామం యాదాద్రి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం. ఆయన ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో కంట్రోలర్‌గా పనిచేస్తూ, జగద్గిరిగుట్టలో నివాసముంటున్నారు. ఇక నిస్సార్ రాసిన పాటను సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస ఆలపించారు. మార్చి నెలాఖరులో విడుదలైన ఈ మాట ప్రేక్షకాదరణ పొందింది. (సచివాలయం కూల్చివేత: అత్యవసరంగా విచారించలేం) -
ఐసీయూలో 500 మంది బాధితులు
గాంధీ ఆస్పత్రి: కరోనా వైరస్ విజృంభణతో కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగంలో బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఐసీయూలో ఉండే రోగుల సంఖ్య శనివారం నాటికి 500కు చేరుకుంది. వీరంతా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్య వర్గాలు ధ్రువీకరించాయి. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 850 మంది కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తుండగా, వీరిలో కరోనాతోపాటు వివిధ రుగ్మతలకు గురై ప్రాణాపాయస్థితిలో ఉన్న సుమారు 500 మందిని ఐసీయూలకు తరలించి వెంటిలేటర్లపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ, లివర్, ఆస్తమా, షుగర్, బీపీ, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంటుందని, అందుకే వీరిని ఐసీయూలో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు వెల్లడించారు. ఆస్పత్రిలో పడకలు, వెంటిలేటర్ల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. క్రిటికల్ పొజిషన్లో ఉన్నవారు కూడా కోలుకుని డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు, సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం గాంధీ ఆస్పత్రిలో ఇప్పటివరకు తొమ్మిది మందికి ప్లాస్మాథెరపీ చికిత్సలు అందించామని, వందశాతం సక్సెస్ సాధించామన్నారు. ప్లాస్మా చికిత్సతో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులైన ఐదుగురిని డిశ్చార్జ్ చేశామని, మరో నలుగురు కోలుకుంటున్నారని, వారిని రెండురోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వివరించారు. మరో ఐదుగురికి ప్లాస్మాథెరపీ చికిత్సలు అందించేందుకు అవసరమైన ప్లాస్మాకణాలు గాంధీ బ్లడ్‌బ్యాంకులో అందుబాటులో ఉన్నాయని, ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు వాటిని వినియోగిస్తామన్నారు. -
గాంధీలో పేషెంట్ల పరిస్థితి దయనీయం
-
హైదరాబాద్ చేరుకున్న కేంద్ర బృందం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బృందం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. తెలంగాణలో కరోనా కట్టడి చర్యల పర్యవేక్షణలో భాగంగా బృందం సభ్యులు సోమవారం వివిధ ఆస్పత్రుల్లో ల్యాబులను పరిశీలిస్తారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఏదైనా కంటైన్మెంట్ క్లస్టర్లో పర్యటిస్తారు. అక్కడినుంచి నేరుగా బీఆర్కే భవన్లో రాష్ట్ర సీఎస్, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ అవుతారు. సాయంత్రం గాంధీ ఆస్పత్రిని సందర్శించి అనంతరం గచ్చిబౌలీలోని టిమ్స్ ఆస్పత్రిని సందర్శిస్తారు. అటునుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ చేరుకుని ఢిల్లీకి పయనమవుతారు. (చదవండి: అవసరమైతే మళ్లీ లాక్డౌన్ : కేసీఆర్) కాగా, ‘విపత్తు నిర్వహణ చట్టం–2005’ నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఈ బృందాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక దేశంలో అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్ జిల్లాల్లో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉందని కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, తమిళనాడులోని చెన్నై, మహారాష్ట్రలోని థానే నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని హెచ్చరించింది. తెలంగాణతో పాటు గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటించి, కరోనా వైరస్‌పై పరిస్థితిని అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి. (టిమ్స్ రెడీ..!) -
హైదరాబాద్‌లో కరోనా మృత్యు ఘంటికలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 237 మంది కరోనాతో మృతి చెందగా.. వారిలో 200 మందికిపైగా గ్రేటర్ హైదరాబాద్ వాసులే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఛాతీ ఆస్పత్రి లో పనిచేస్తున్న విక్టోరియా జయమణి అనే హెడ్ నర్సు కరోనాతో మృతి చెందారు. ఈనెల 30న పదవీ విమరణ చేయాల్సిన తరుణంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. తాను వయసురీత్యా పెద్ద కావడంతో కరోనా ఐసోలేషన్ వార్డులో పనిచేయలేనని, ఆ విధుల నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సూపరింటెండెంట్‌ను అభ్యర్థించినా ఆయన అంగీకరించలేదని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. (అంత్యక్రియలకు తరలిస్తుండగా పాజిటివ్..) కాగా, ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలో 20 మంది వైద్యులు, పది మంది పారా మెడికల్ స్టాఫ్ కరోనా వైరస్ బారిన పడగా.. ఉస్మానియా వైద్య కళాశాల పరిధిలోని స్పెషాలిటీ ఆస్పత్రుల్లో సుమారు వంద మందికి వైరస్ సోకింది. ఇక నిమ్స్‌లో 67 మందికి కరోనా సోకగా, వీరిలో 26 మంది వైద్యులు, 41 మంది పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. మలక్‌పేట్, కొండాపూర్ ఆస్పత్రుల్లోనూ 30 మంది వైద్య సిబ్బంది వైరస్ బారినపడ్డారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో 6 కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉండగా.. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ పరీక్షల కోసం కింగ్‌కోఠి ఆస్పత్రికి చేరుకున్న సత్తెమ్మ అనే బాధితురాలు ఆస్పత్రి గేటు ముందే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. (బ్యాంకులకు ‘కరోనా’ స్ట్రెస్ టెస్టులు) గాంధీ సూపరింటెండెంట్ పేషీలో... కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో కరో నా కలకలం సృష్టించింది. పేషీలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్‌తోపాటు టైపిస్ట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే ఆస్పత్రి మినిస్టీరియల్ విభాగంలో విధులు నిర్వ హించే సీనియర్ అసిస్టెంట్‌తోపాటు ఓ నర్సుకు కూడా పాజిటివ్ రావడంతో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో మరో ఉద్యోగికి.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వరుసగా నాలుగోరోజు మరో కరోనా పాజిటివ్ కేసు నమో దైంది. మూడో అంతస్తులోని పరిపాలనా విభాగం లో ఓ ఉద్యోగికి శుక్రవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటు తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్‌రెడ్డికి శుక్రవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనాతో బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింహ్మారావు కన్నుమూత తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పొనుగోటి నర్సింహారావు(70) కరోనా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా చివ్వెంలకు చెందిన నర్సింహారావు పది రోజుల క్రితం బిల్డర్లకు రావాల్సిన బకాయిలు, వివిధ రకాల అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. వెంటనే చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరినా ఫలితం లేకపోయింది. -
లక్షణాలు లేకుంటే రావొద్దు: మంత్రి ఈటల
సాక్షి, హైదరాబాద్: కరోనా విషయంలో కొందరు ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వైద్యుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లక్షణాలు లేనివారు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఆస్పత్రులకు రావొద్దని ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దీనివల్ల కరోనా పేషంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. లక్షణాలు ఉంటే ఎంతమందికైనా పరీక్షలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. (చదవండి: కోవిడ్ వ్యర్థాలు @ 100 టన్నులు) టెస్టుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని అన్నారు. ప్రజారోగ్యం విషయంలో రాజీపడబోమని ఈ సందర్భంగా ఈటల స్పష్టం చేశారు. త్వరలోనే గచ్చిబౌలీలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (టిమ్స్)ను ప్రారంభిస్తామని చెప్పారు. టిమ్స్‌లో 1264 పడకలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. 1000 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం, 50 పడకలకు వెంటిలేటర్ సౌకర్యం ఉందన్నారు. టిమ్స్‌లో ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయని, నాలుగైదు రోజుల్లో ఇన్పేషంట్లకు చికిత్స ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. జిల్లా స్థాయిలో ఏరియా ఆస్పత్రుల్లోనూ ఐసీయూలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. (చదవండి: నాలాగా కోవిడ్ బారిన పడకండి : ఎమ్మెల్యే) -
ప్రాణాలే పణంగా..!
గాంధీఆస్పత్రి: కోవిడ్–19 నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో ఇప్పటి వరకు పదివేలకు పైగా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు, 4,056 మంది పాజిటివ్ రోగులతో పాటు మొత్తం 10,128 మందికి వైద్యసేవలు అందించినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. ఈ మేరకు వివరాలతో కూడిన నివేదికను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. తీవ్రమైన ఒత్తిడిలోనూ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, సిబ్బందిని ఆయన అభినందించారు. మార్చి రెండో వారంలో గాంధీ ఆస్పత్రిలో కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు పదివేల మందికిపైగా నిర్ధారణ పరీక్షలు, వైద్యచికిత్సలు అందించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, వైద్య ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన అన్ని వసతులు, సౌకర్యాలు సమకూర్చుకుని బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. 290 మంది 12 ఏళ్లలోపు చిన్నారులతోపాటు నియోనెటాల్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో 35 మంది నవజాత శిశువులకు వైద్యసేవలు అందించామన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన 135 మంది గర్భిణుల్లో 37 మందికి గైనకాలజీ విభాగ వైద్యులు సిజేరియన్ సర్జరీలు నిర్వహించి తల్లిబిడ్డలకు పునర్జన్మ ప్రసాదించారని వివరించారు. రివకరీ అయిన 3423 మందిని డిశ్చార్జి చేశామన్నారు. ప్రస్తుతం గాంధీఆస్పత్రిలో 535 మంది వైద్యసేవలు పొందుతున్నారని, వీరిలో 220 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఇన్సెంటివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో వైద్యచికిత్సలు అందిస్తున్నామని, కరోనాతో గాంధీలో ఇప్పటివరకు 202 మందితో పాటు వివిధ రుగ్మతలతో మృతి చెందారని ఆయన స్పష్టం చేశారు. మరణం చివరి అంచుల దాకా.. కరోనాతో పాటు వివిధ రుగ్మతలతో బాధపడుతున్న పలువురు రోగులు ప్రాణాపాయ స్థితిలో మరణం చివరి అంచుల దాకా వెళ్లిన 1,395 మందికి మెరుగైన వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించినట్లు రాజారావు వివరించారు. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారితో పాటు న్యూమోనియా, కేన్సర్, కిడ్నీ, ఆస్తమా, లీవర్, గుండె సంబంధిత తదితర రుగ్మతలతో బాధపడుతున్న వారిని కరోనా వైరస్ త్వరగా సోకే అవకాశం ఉందన్నారు. ఆయా రుగ్మతల బారిన పడిన 2,074 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జి అయ్యారని వివరించారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు ఆక్సిజన్, వెంటిలేటర్ సహాయం అందించి, వైరస్‌తో అహర్నిశలూ పోరాడి ప్రాణాలు పోసినట్లు తెలిపారు. ప్రాణం పోసిన ప్లాస్మాథెరపీ... ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మాథెరపీ చికిత్సలు కొనసాగుతున్నాయని రాజారావు తెలిపారు. ఇప్పటి వరకు ఎనిమిది మందికి ప్లాస్మాథెరపీ చికిత్సలు అందించగా వారంతా కోలుకున్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో కొంతమందిని డిశ్చార్జి చేశామని వివరించారు. జాగ్రత్తలు పాటించండి... భౌతిక దూరంతో పాటు మాస్క్‌లు, శానిటైజర్లు వినియోగించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ దరిజేరదని గాంధీఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పష్టం చేశారు. చేతులను నిత్యం పరిశుభ్రం చేసుకోవాలన్నారు. అదే సమయంలో కరోనా భయం వీడాలన్నారు. కరోనా వస్తే మరణం తథ్యమనే అపోహ చాలామందిలో ఉందని, కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగానే తీవ్ర భయాందోళనకు గురికావడంతో శరీరంలోని పలు అవయవాలు సరిగా స్పందించకపోవడంతో సమస్య మరింత జటిలమవుతుందన్నారు. -
గాంధీలో పడకల్లేవ్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదబాద్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే కోవిడ్ సెంటర్లలోని ఐసోలేషన్ వార్డుల్లోని పడకలన్నీ పాజిటివ్ బాధితులతో నిండిపోవడం.. మరోవైపు రోజుకు సగటున 500 నుంచి 700 కొత్త కేసులు నమోదవుతుండటంతో ఐసీయూల్లో వెంటిలేటర్ పడకలు దొరకని దుస్థితి. అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లినవారికి సైతం చేదు అనుభవమే ఎదురవుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు చికిత్స చేయడం ఇష్టం లేని పలు కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన రోగులకు పడకలు ఖాళీ లేవంటూ తిప్పిపంపుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. చికిత్సకు నిరాకరించిన ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలువెల్లువెత్తుతున్నాయి. గాంధీ.. ఏమిటిదీ? కరోనా చికిత్సల కోసం గాంధీ ఆస్పత్రిని ప్రభుత్వం పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా మార్చింది. ప్రస్తుతం ఆస్పత్రిలో 320 మంది వైద్యులు, 366 మంది పీజీలు, 350 మంది హౌస్సర్జన్లు, 350 మంది స్టాఫ్ నర్సులు పని చేస్తున్నారు. 1000 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో వంద వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. మిగిలిన పడకలకు ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పించారు. రోగుల రద్దీ నేపథ్యంతో పడకల సంఖ్యను 1,850కి పెంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ.. సిబ్బంది కొరత కారణంగా వీటిని ఇప్పటి వరకు అందుబాటులోకి తీసురాలేదు. వైరస్ లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను మాత్రమే ఇక్కడ అడ్మిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలోని పడకలన్నీ రోగులతో నిండిపోయాయి. ఐసీయూలో వెంటిలేటర్లు ఖాళీగా లేవు. ప్రస్తుతం 300 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రోగుల నిష్పత్తికి తగినన్ని వెంటిలేటర్లు లేకపోవడంతో ఆక్సిజన్‌పై నెట్టుకొస్తున్నారు. కొత్తగా వచ్చిన రోగులకు అడ్మిషన్ కూడా కష్టమవుతోంది. సకాలంలో వైద్యసేవలు అందక రోగులు మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉస్మానియా.. ఇంతేనయా.. ఉస్మానియా ఆస్పత్రి కులీకుతుబ్‌షా భవనంలో 100 పడకలు ఏర్పాటు చేశారు. నాలుగో అంతస్తులో మరో 250 పడకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరో వారం రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఆస్పత్రిలో ప్రస్తుతం 85 వెంటిలేటర్లు ఉన్నారు. 500 పడకలకు సరిపోను ఆక్సిజన్ లైన్లు ఉన్నాయి. గాంధీ జనరల్ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా మార్చడంతో సాధారణ రోగులంతా ఇక్కడికే వస్తున్నారు. దీంతో జనరల్ మెడిసిన్ విభాగంలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీరిలో శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు ఉంటున్నారు. అప్పటికే వీరికి కరోనా వైరస్ విస్తరించి ఉండటంతో మృత్యువాత పడుతున్నారు. రోగుల నిష్పత్తికి తగినంత వైద్య సిబ్బంది లేకపోవడంతో పీజీలపై భారం పడుతోంది. వార్డులోని రోగులందరికీ ఒకే నర్సు సేవలు అందించాల్సి వస్తోంది. కళ్లెదుటే రోగులు చనిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నామని.. ఇలాంటి వాతావరణంలో తాము పని చేయలేమని పీజీలు, హౌస్ సర్జన్లు రెండు రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తుండటం విదితమే. కింగ్‌కోఠి, ఛాతీ ఆస్పత్రులు ఫుల్.. తీవ్ర లక్షణాలున్న వారిని గాంధీలో అడ్మిట్ చేస్తుండగా, ఏ లక్షణాలు లేకపోయినా పాజిటివ్ వచ్చిన రోగులను కింగ్‌కోఠి, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి, ఆయుర్వేద, నేచర్ క్యూర్ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో అడ్మిట్ చేస్తున్నారు. ఆయా ఆస్పత్రుల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, వేళకు పౌష్టికాహారం అందజేయకపోవడంతో రోగులు అక్కడ ఉండేందుకు ఇబ్బంది పడుతున్నారు. వైరస్‌తో ఇంటికి వెళ్లేందుకు ఇష్టం లేకపోయినప్పటికీ.. విధిలేని పరిస్థితుల్లోనే అడ్మిటఅయిన మరుసటి రోజే హోం క్వారంటైన్‌కు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్) ప్రారంభమై ఇప్పటికే నెల రోజులు దాటింది. 14 అంతస్తుల భవనంలో 1,500 పడకలను ఏÆర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉస్మానియా వైద్యులే డిప్యుటేషన్‌పై సేవలు అందిస్తున్నారు. ఓపీకి వచ్చే సాధారణ రోగులకు మందులు రాసి పంపుతున్నారు. నగరంలోని ప్రధాన ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. ఇన్‌పేషెంట్ సేవలు ఇంకా ప్రారంభించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యుడు సహా ఏఎస్ఐ మృతి.. కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 210 మంది మృతి చెందారు. వీరిలో 190 మంది నగరవాసులే. తాజాగా హిమాయత్‌నగర్‌కు చెందిన డాక్టర్ జ్ఞానేశ్వర్రావు (77)తో మృతి చెందారు. తెలంగాణలో తొలి వైద్యుడి మరణం ఇదే. ఆయన ఇంటి పనిమనిషి (50)కి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కాలపత్తర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ యూసఫ్ (47) కరోనాతో బాధపడుతూ సోమవారం గాంధీ ఆస్పత్రిలో మృతి చెందారు. మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రికి చెందిన ఇద్దరు వైద్యులు సహా మొత్తం 9 మందిలో వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. 90 శాతం కేసులు ఇక్కడే.. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 7802 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో 5798 కేసులు గ్రేటర్ హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3,861 మంది కోలుకోగా.. ప్రస్తుతం 3,731 మంది గాంధీ సహా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 90 శాతం మంది నగరవాసులే. -
వైద్య ఆరోగ్య శాఖపై కోవిడ్ పంజా
సాక్షి, సిటీబ్యూరో: ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌లో ఎంతో కీలకంగా వ్యవహరించే వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు కరోనా వైరస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కంటికి కన్పించని శత్రువుతో పోరాడుతున్న వారిలో వైద్య సిబ్బంది ముందుంటున్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన బాధితులకు ఆరోగ్యాన్ని పంచాల్సిన వారే.. ప్రస్తుతం ఒకరి తర్వాత మరొకరు వైరస్ బారిన పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. 200 మంది వైద్య సిబ్బంది క్వారంటైన్లో ఉండగా.. వీరిలో 72 మంది వైద్యులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా నిమ్స్, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, ఉస్మానియా, కొండాపూర్ ఏరియా ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బంది ఎక్కువగా వైరస్ బారినపడటం గమనార్హం. వైద్యులతో పాటు పారా మెడికల్ సిబ్బంది వైరస్ బారిన పడుతుండటం, వారితో పాటు వారికి సన్నిహితంగా మెలిగిన వారు కూడా క్వారంటైన్లో ఉండాల్సి రావడంతో ఆయా ఆస్పత్రుల్లోవైద్య సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్య సిబ్బంది లేకపోవడంతో సకాలంలో వైద్య సేవలు అందక అనేక మంది రోగులు మృత్యువాత పడుతున్నారు. కేవలం ఒక్క ఉస్మానియాలోనే రోజుకు కనీసం 15 మంది చనిపోతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వర్గాలే ప్రకటిస్తున్నాయి. కళ్లముందు రోగుల ప్రాణాలు పోతున్నా వైద్యులుగా తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఉన్నట్లు కొంతమంది జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ కార్యాలయంలో ఎంత మందికి.. ♦ పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలోని వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న 11 మంది సిబ్బంది వైరస్ బారిన పడటంతో ఇప్పటికే ఆ విభాగాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. ♦ కరోనా హై లెవల్ కమిటీలోని కీలకమైన ఇద్దరు వైద్యులకు ఇటీవల వైరస్ సోకింది. దీంతో వారికి సన్నిహితంగా మెలిగిన ఐఏఎస్, ఇతర అధికారుల్లో ఆందోళన మొదలైంది. ♦ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు వైరస్ సోకింది. ♦ ప్రతిష్టాత్మక నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)లో మొత్తం 67 మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 26 మంది వైద్యులు, 41 మంది పారామెడికల్ సిబ్బంది. దీంతో నెఫ్రాలజీ, కార్డియాలజీ, యూరాలజీ విభాగాల్లో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. డయాలసిస్ సేవలను కూడా రెండు రోజుల క్రితమే పునరుద్ధరించారు. ♦ ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా పని చేస్తున్న స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 64 మంది పీజీలు, సీనియర్ వైద్యులు వైరస్ బారిన పడ్డారు. వీరిలో ఒక్క పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోనే 33 పాజిటివ్ కేసులు నమోదు కావడం విశేషం. వీరిలో ఒక అటెండర్ కూడా మృతి చెందారు. ♦ ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ విభాగాల్లో పని చేస్తున్న సుమారు 20 మంది పీజీలు , నిలోఫర్‌లో నలుగురు పీజీలు, ఛాతీ ఆస్పత్రిలో ఇద్దరు సీనియర్లు, కింగ్‌కోఠి ఆస్పత్రిలో ఆరుగురు పారామెడికల్ సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ♦ కోఠి ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటిండెంట్ సహా పలువురు వైద్య సిబ్బందికి పాజిటివ్ లక్షణలు బయటపడ్డాయి. ♦ కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు వైద్యులు సహా మరో ఎనిమిది మంది పారామెడికల్ సిబ్బందికి వైరస్ సోకింది. ♦ సరూర్‌నగర్ పీహెచ్సీ డాక్టర్ సహా పాతబస్తీలోని ఓ డాక్టర్‌తో పాటు నలుగురు ఏఎన్ఎంలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ♦ హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఐదుగురు ఉద్యోగులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరికి సన్నిహితంగా మెలిగిన జిల్లా అధికారి సహా ఇతర సీనియర్ వైద్యులు కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం. -
గాంధీలో మరో శవ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్ : వరుస శవ పంచాయితీలతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి తాజాగా మరో వివాదానికి కేంద్ర బిందువైంది. అదృశ్యమైన రోగి గాంధీ మార్చురీలో శవమై కనిపించడంతో తీవ్ర కలకలం చెలరేగింది. మృతి చెందినట్లు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా గాంధీ ఆస్పత్రి పాలనా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించి అనాథశవంగా పడేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. సదరు మృతుడు కోవిడ్ బాధితుడే కాదని ఆస్పత్రి వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మృతుడి బంధువులు, ఆస్పత్రివర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ్‌హట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దూల్‌పేట జిన్సీచౌరాహీకి చెందిన నరేందర్‌సింగ్ (35) తీవ్ర అస్వస్థతకు గురై గతనెల 30న కింగ్‌కోఠి ఆస్పత్రికి వెళ్లాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో అదే రోజు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అడ్మిట్ అయిన మరుసటి రోజు నరేందర్‌సింగ్ తన సోదరుడు ముకేష్సింగ్కు ఫోన్ చేసి గాంధీ ఆస్పత్రిలో తనను ఎవరూ పట్టించుకోవడం లేదని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. మరుసటి రోజు నుంచి నరేందర్‌సింగ్ సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ అయింది. గాంధీ ఆస్పత్రితో పాటు కింగ్‌కోఠి, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రుల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. నరేందర్‌సింగ్ కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో సోదరుడు ముకేష్‌సింగ్ ఈనెల 6న మంగళ్‌హట్ ఠాణాలో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో నరేందర్‌సింగ్ మిస్సింగ్ వివరాలను పొందుపరుస్తు సోదరుడు ముకేష్‌సింగ్ తాజాగా వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. సోదరుడి జాడ తెలియజేయకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేశాడు. సదరు వీడియో వైరల్ కావడంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టి శనివారం గాంధీ కరోనా మార్చురీతో పాటు సాధారణ మార్చురీల్లో వెతికారు. సాధారణ మార్చురీలో ఉన్న నరేందర్‌సింగ్ మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులు సమాచారం అందించగా వారు వచ్చి మృతదేహం నరేందర్సింగ్దిగా గుర్తించారు. గాంధీ పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే నరేందర్‌సింగ్ మృతి చెందాడని ఆరోపిస్తు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులే మార్చురీలో ఉంచారు: సూపరింటెండెంట్ కాగా ఈ విషయంపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు మాట్లాడుతూ.. నరేందర్‌సింగ్ కరోనా బాధితుడే కాదని స్పష్టం చేశారు. మృతుడు గతనెల 30న గాంధీ ఓపీ విభాగానికి వచ్చి వెల్లినట్లు రికార్డుల్లో నమోదై ఉందని, కరోనా జాబితాలో అతని పేరే లేదన్నారు. మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ)గా నమోదు చేశామని, పోలీసులే గుర్తు తెలియని మృతదేహంగా మార్చురీలో పెట్టారని వివరించారు. గాంధీ ఆస్పత్రి పాలనా యంత్రాంగం, సిబ్బంది నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. మృతుడు నరేందర్‌సింగ్ కరోనా బాధితుడా? కాదా.? గాంధీ మార్చురీలోకి అతని మృతదేహం ఎలా వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడం గమనార్హం. -
‘ప్లాస్మా’ దాత.. దాటవేత!
గాంధీఆస్పత్రి: కరోనా రోగుల ప్రాణాలు కాపాడేందుకు వైద్యుల వద్ద ఉన్న ఒకే ఒక ఆయుధం ప్లాస్మాథెరపీ. వైరస్ బారిన పడి పూర్తిస్థాయిలో కోలుకున్న పలువురు బాధితులు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో ప్లాస్మా చికిత్సల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ చికిత్సలు నిర్వహించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుమతి ఇవ్వడంతో మే 11న ప్లాస్మాథెరపీ చికిత్సలు ప్రారంభించారు. కరోనా సోకి పూర్తిస్థాయిలో నయమైన రోగుల్లో వైరస్‌ను నిర్మూలించే యాంటీబాడీలు ఎక్కువగా ఉంటాయి. మానవ శరీరంలో రక్తంతో మిళితమై ఉన్న ప్లాస్మా యాంటీబాడీలను ప్రత్యేక పద్ధతుల ద్వారా బయటకు తీసి వాటిని ప్రాణాపాయస్థితిలో ఉన్న కరోనా బాధితులకు ఎక్కిస్తారు. బాధితుల శరీరంలో చేరిన యాండీబాడీలు కరోనా వైరస్‌తో పోరాడి నిర్మూలించడంతో రోగి కోలుకుని ప్రాణాపాయం నుంచి బయటపడతాడు.(కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలి :శ్రీదేవి) అయిదుగురు రోగులకు విజయవంతంగా.. గాంధీ ఆస్పత్రిలో చేపట్టిన ప్లాస్మా థెరపీ చికిత్సలు విజయవంతం కావడంతో మరింతమంది కరోనా రోగులకు ఇదే తరహా చికిత్సలు అందించాలని వైద్యులు నిర్ణయించారు. ఇప్పటి వరకు ప్లాస్మా« థెరపీ చికిత్సలు అందించిన ఐదుగురు రోగులు సంపూర్ణ ఆరోగ్యవంతులై డిశ్చార్జీ కావడం గమనార్హం. గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌కు చికిత్స పొంది కోలుకున్న బాధితులు వేలసంఖ్యలో ఉన్నారు. ప్రారంభంలో వీరంతా ప్లాస్మా దానం చేసేందుకు అంగీకరించారు. 50 ఏళ్లలోపు ఉండి ఇతర రుగ్మతలు లేనివారి నుంచే ప్లాస్మా సేకరించాలనే ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం 36 మంది ప్లాస్మా దాతలను గుర్తించారు. వీరిలో ఇప్పటికి కేవలం పదిమంది మాత్రమే ప్లాస్మా దానం చేసినట్లు తెలిసింది. అపోహలను తొలగించాలి.. ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రాణాపాయస్థితిలో ఉన్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్లాస్మా కోసం దాతలను సంప్రదిస్తే కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని, యాంటీబాడీలు దానం చేస్తే మల్లీ కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉందంటూ పలు కారణాలతో దానం చేసేందుకు అంగీకరించడంలేదని తెలిసింది. ప్లాస్మా దాతలు ముందుకు రాకపోవడంతో చికిత్సలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. తక్షణమే తెలంగాణ ప్రభుత్వంతోపాటు వైద్య ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాల సభ్యులు, సామాజికవేత్తలు స్పందించి ప్లాస్మాదానం, చికిత్సలపై ప్రజలకు ఉన్న అపోహలు తొలగించి, దాతలు ముందుకు వచ్చేలా తగిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వైద్యులకు, పోలీసులకు రక్షణ కిట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్ : కరోనా పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి పలు ఆదేశాలు జారీచేసింది. కరోనా కీలక సమాచారాన్ని మీడియా బులెటిన్‌లో ఉంచాలని తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల వారిగా కరోనా కేసులు వెల్లడించాలని సూచించింది. ఆ వివరాలు కాలనీ సంఘాలకు ఇవ్వాలని ఆదేశించింది. ర్యాపిడ్ యాంటీజెంట్ టెస్ట్ నిర్వహించాలని ఐసీఎంఆర్ సూచించిందని గుర్తుచేసింది. ఐసీఎంఆర్ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. వైద్యులకు తగినన్ని పీపీఈ కిట్లు, మాస్క్‌లు ఇతర రక్షణ పరికరాలు ఇవ్వడం లేదంటూ న్యాయవాది సమీర్ అహ్మద్ హైకోర్టుకు లేఖ రాయగా, దీన్ని కోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. నేడు కూడా దానిని కొనసాగించింది. ఈ విచారణకు రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు హాజరయ్యారు. రాష్ట్రంలో 79 మంది వైద్యులకు కరోనా సోకినట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. గాంధీలో ప్లాస్మా, యాంటీ వైరల్ డ్రగ్స్ ప్రయోగాలు చేస్తున్నట్టు వెల్లడించారు. (చదవండి : ‘కరోనా’పై చేతులెత్తేసినట్లుంది..) విచారణ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గాంధీతోపాటు 54 ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరుగుతున్నాయని ప్రచారం చేయాలని తెలిపింది. సంచార పరీక్షలు ఎందుకు వీలుకాదో ప్రభుత్వం వివరించాలని కోరింది. గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బందితోపాటు పోలీసులకు కూడా రక్షణ కిట్లు ఇవ్వాలని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రి సిబ్బందికి కూడా గాంధీ తరహా షిఫ్ట్‌ల విధానం అమలు చేయాలని తెలిపింది.లక్షణాలు లేని ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు నిర్వహించాలన్న ఐసీఎంఆర్ మార్గదర్శకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. ఈ నెల 29లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. -
‘కరోనా’పై చేతులెత్తేసినట్లుంది..
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వానికి పట్టు సడలినట్లుందని.. ఎక్కడో ఏదో లోపం ఉందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎవరి ప్రాణాలు వారే రక్షించుకోవాలి తప్ప, తామేం చేయలేనట్లు చేతులెత్తేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయంది. 72 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారని, 400 మంది సిబ్బంది క్వారంటైన్లో ఉన్నారని, డాక్టర్లు, సిబ్బంది రక్షణ కోసం కిట్లున్నాయని చెప్పడానికి, వాటిని వారికి అందచేయడానికి ఎంతో తేడా ఉందని తెలిపింది. డాక్టర్లపై భౌతిక దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోందని, ప్రతి వార్డుకు, ప్రతీ డాక్టర్‌కు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు తెలిపింది. ఆసుపత్రుల్లో ఎంత మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.. ఎందరికి పరీక్షలు చేశారు.. ఏఏ మౌలిక సదుపాయాలున్నాయి.. డాక్టర్లు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత భద్రత పరికరా (పీపీఈ) లున్నాయా.. వంటి వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించాలని గాంధీ, నిమ్స్, కింగ్స్ కోఠి, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యులకు తగినన్ని పీపీఈ కిట్లు, మాస్క్‌లు ఇతర రక్షణ పరికరాలు ఇవ్వడం లేదంటూ న్యాయవాది సమీర్ అహ్మద్ హైకోర్టుకు లేఖ రాయగా, దీన్ని కోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఆసుపత్రుల్లో పరిస్థితులు, రక్షణ పరికరాల సరఫరాపై నివేదికలివ్వాలని ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లను కోరినా ఇప్పటివరకు స్పందించకపోవడంపై ధర్మాసనం ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేసింది. గాంధీలో పరిస్థితి ఆందోళనకరం.. గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులపై ఆందోళన చెందుతున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు 7 లక్షల రక్షణ కిట్లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారని, అందుబాటులో ఉండటానికి, వాటిని డాక్టర్లకు, సిబ్బందికి ఇవ్వడానికి ఎంతో తేడా ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. డాక్టర్లు, సిబ్బందికి వాటిని పూర్తిస్థాయిలో అందజేయకపోవడం వల్లే వారు కూడా కరోనా బారిన పడుతున్నారంది. ఆసుపత్రుల్లో కరోనా రావడం లేదని, సిబ్బంది ఉంటున్న హాస్టళ్లలోనే వస్తోందని శ్రీనివాసరావు చెబుతుండటాన్ని ఎలా చూడాలని ప్రశ్నించింది. తమపై భౌతిక దాడుల గురించి జూనియర్ డాక్టర్లు నెత్తీనోరూ కొట్టుకుంటున్నా, వారి రక్షణ కోసం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ఈ విషయంలో తాము గతంలో ఇచ్చిన ఆదేశంపై ఎందుకు స్పందించలేదంది. తమ ఆదేశాలను ఇలా ఉల్లంఘిస్తూ పోతే అందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. కోర్టు హాళ్ల వద్ద ఎలా రక్షణ కల్పించారో, డాక్టర్లకు, ఆయా వార్డుల వద్ద అలానే రక్షణ కల్పించాలని తేల్చి చెప్పింది. జిల్లాకో కరోనా ఆసుపత్రి ఏమైంది..? ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా చర్యలు తీసుకుంటోందని వివరించారు. రాబోయే 10 రోజుల్లో 50 వేల పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, తెలంగాణలో పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయని ధర్మాసనం తెలిపింది. ఒక్క రోజులోనే 200కి పైగా కేసు నమోదయ్యాయంటే కరోనా తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చునంది. జిల్లాకో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు ఎంత వరకు కార్యరూపం దాల్చాయని ప్రశ్నించింది. ఇప్పటికే ఆసుపత్రులను గుర్తించామని, ఇందుకు సంబంధించిన వ్యాజ్యంపై గురువారం విచారణ జరగనుందని ఏజీ వివరించారు. కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తున్నారో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇన్ప్లుయెంజాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చినప్పుడు, కరోనాను ఎందుకు తీసుకురాకూడదని ప్రశ్నించింది. మే 16న ఇచ్చిన కరోనా బులిటెన్ అంతకుముందు రోజు ఇచ్చినట్లే ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. చైనాలో రక్షణ శాఖ వైద్యుల సాయంతో అతి తక్కువ సమయంలో ఆసుపత్రి నిర్మించారని, ఇక్కడ కూడా రక్షణ శాఖ వైద్యుల సాయం ఎందుకు తీసుకోవడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. తాము లేవనెత్తిన అన్ని అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇవ్వాలని అంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
మూడు నెలలుగా గాంధీలోనే తిండి.. ఠికానా..
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌తో అందరికంటే ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్య సిబ్బంది తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. గత మూడు నెలలుగా ఇంటికి దూరంగా ఉంటూ..క్యాంటిన్‌లోనే తింటూ...తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. పడకల నిష్పత్తికి తగినంత వైద్య సిబ్బంది లేకపోవడంతో ఉన్న వారిపైనే అధిక భారం పడుతోంది. కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన పనిచేస్తున్న వైద్య సిబ్బందిని ఇప్పటి వరకు రెగ్యులర్ చేయక పోవడం, కొత్త నియామకాలు లేక పోవడంతో ఉన్న వైద్య సిబ్బందిపై భారం పడుతోంది. కరోనా రోగులకు చికిత్స అందించే రిస్క్ ప్రదేశాల్లో పని చేయడం వారికి కత్తిమీద సాములా మారింది. దీంతో ఇప్పటికే అనేక మంది చెప్పాపెట్టకుండా విధులకు గైర్హాజరవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్)లో పూర్తి స్థాయి వైద్య సేవలు ఇప్పటి వరకుఅందుబాటులోకి రాక పోవడానికి కూడా ఇదే కారణమని తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడి రోగులకు ఇక సేవలు అందించడం తమ వల్ల కాదని, జిల్లా ఆస్పత్రుల్లోనూ కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడి రోగులకు అక్కడే చికిత్సలు మార్చి రెండో తేదీన తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కరోనా రోగుల నుంచి ఇతర రోగులకు వైరస్ సోకే ప్రమాదం ఉండటం, ఆ తర్వాత కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో గాంధీలోని ఇతర విభాగాలన్నీ ఖాళీ చేయించింది. ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా మార్చింది. ఇక్కడ కేవలం పాజిటివ్ కేసులకు మాత్రమే చికిత్స అందించనున్నట్లు ప్రకటించింది. తొలుత 1000 పడకలు ఉండగా, ఆ తర్వాత రోగుల రద్దీ పెరుగుతుండటంతో పడకల సామర్థ్యాన్ని 1500లకు పెంచింది. తాజాగా 1850కి పెంచింది. పడకల సంఖ్య అయితే పెంచింది కానీ..పడకలు, వాటిలోని రోగుల నిష్పత్తికి అనుగుణంగా వైద్య సిబ్బందిని నియమించలేదు. కోవిడ్ నిబంధనల ప్రకారం మొత్తం సిబ్బందిలో 2 బై 3 వంతు డ్యూటీలో ఉంటే.. 1 బై 3 వంతు క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. టీచింగ్ ఆస్పత్రుల్లో కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయక పోవడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసులన్నీ గాంధీకే తరలించడం, వైద్య సిబ్బంది, పడకల నిష్పత్తికి మించి రోగులు చేరడంతో చికిత్సల్లో జాప్యం చోటు చేసుకుంటుంది. అన్ని బోధనాసుపత్రులతో పాటు జిల్లా కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లోనూ కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి, కరోనా చికిత్సలను డీ సెంట్రలైజ్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఆ మేరకు ఆయా ఆస్పత్రుల్లో పడకలు, ఐసీయూ విభాగాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. సీరియస్ కండిషన్లో ఉన్న రోగులు మినహా మిగిలిన నాన్ సింథమేటిక్ రోగులందరికీ ఆయా జిల్లా ఆస్పత్రుల్లోనే చికిత్సలు అందించనున్నట్లు తెలిసింది. రోగి బంధువుల ఆగ్రహానికి కారణమిదే.. వైద్యులు కేవలం మందులు రాసి వెళ్లిపోతుంటారు. ఆ తర్వాత రోగి పూర్తి సంరక్షణ బాధ్యత నర్సులదే. ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినంత మంది స్టాఫ్ నర్సులు, వార్డ్‌బోయ్స్ లేరు. 400 మంది నర్సులు ఉంటే..వీరిలో 200 మంది కాంట్రాక్ట్, 100 మంది ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికనే పని చేస్తున్నారు. పనికి తగిన వేతనం లేకపోవడం, ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగాలు రెగ్యులర్ కాకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడంతో కోవిడ్ బాధితుల సేవలకు వారు వెనుకాడుతున్నారు. ఐసోలేషన్ వార్డుల్లోని రోగులకు సహాయంగా బంధువులను అంగీకరించకపోవడం, మలమూత్ర విసర్జనకు వెళ్లే సమయంలో సహాయంగా ఎవరూ లేకపోవడంతో, వారు బాత్రూమ్ల్లో కాలుజారిపడి చనిపోతున్న ఘటనలూ లేకపోలేదు. అనివార్యంగానే రోగుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఇటీవల గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లోని వెద్యులపై రోగి బంధువుల దాడికి కూడా ఇదే కారణం. -
జర్నలిస్ట్ మనోజ్ సోదరుడు ఫిర్యాదు
చిలకలగూడ : కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే జర్నలిస్ట్ మనోజ్‌కుమార్ మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని సోదరుడు సాయికుమార్ చిలకలగూడ ఠాణాలో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. కరోనాతో బాధపడుతు తనతోపాటు సోదరుడు మనోజ్‌కుమార్ ఈనెల 3వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత గాంధీఆస్పత్రిలో అడ్మిట్ అయ్యామన్నారు. గాంధీ అధికారులు, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తన సోదరుడు మనోజ్‌కుమార్ ఈనెల 7వ తేదిన మృతి చెందాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన సోదరుడు మృతిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన గాంధీ సూపరింటెండెంట్, నోడల్ అధికారి, సంబంధిత వైద్యులు, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరాడు.