
హరీశ్‌రావుకు వినతిపత్రం అందిస్తున్న జూడాలు
గాంధీ ఆస్పత్రి: జీవో నంబర్ 155 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనను విరమిస్తున్నామని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ (జూడా) అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. సమ్మె నోటీసులను వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు. వైద్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయన్నారు. మంత్రి హరీశ్‌రావు, వైద్య ఉన్నతాధికారులతో జూడాల సంఘ ప్రతినిధులు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
భవిష్యత్‌లో నీట్‌లో ఇన్ సర్వీసు కోటా రిజర్వేషన్లు పెంచబోమని, ఎవరీకి నష్టం కలగకుండా సర్వీస్ వైద్యులు, జూనియర్ డాక్టర్స్‌కు సమాన ప్రతిపత్తి కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారని జూడాల సంఘ ప్రతినిధులు సాగర్, కార్తీక్, వివేక్, మణికిరణ్‌రెడ్డి తెలిపారు. పలు అంశాలపై పరిష్కారం కోసం మంత్రికి వినతిపత్రం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment