భారీ వర్షంలోనూ జూడాల నిరసన | Junior doctors protest in heavy rain | Sakshi
Sakshi News home page

భారీ వర్షంలోనూ జూడాల నిరసన

Aug 16 2024 5:03 AM | Updated on Aug 16 2024 5:04 AM

Junior doctors protest in heavy rain

గాంధీఆస్పత్రి: కోల్‌కతాలో విధినిర్వహణలో ఉన్న వైద్యవిద్యార్థినిపై హత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, ఈ ఘటనలు పునరావృతం కాకుండా కఠినచర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో జూడాలు నిరసన కార్యక్ర­మాలు  ఉధృతం చేశారు. గురువారం సాయంత్రం భారీవర్షాన్ని సైతం లెక్కచేయకుండా వెయ్యి మంది జూడాలు భారీ ర్యాలీ నిర్వహించారు. 

గాంధీ ఆస్పత్రి నుంచి ప్రారంభమైన ర్యాలీ సికింద్రాబాద్‌ ప్రధాన రహదారి, పద్మారావునగర్, ముషీరాబాద్‌ చౌరస్తా మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా సీనియర్‌ రెసిడెంట్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్, జూడాల సంఘం గాంధీ యూనిట్‌ అధ్యక్షుడు వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ న్యాయం జరిగే వరకు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement