Heavy Rain : Pregnant Woman Saves By Home Guard In Hyderabad - Sakshi
Sakshi News home page

Hyderabad: మానవత్వం చాటుకున్న హోంగార్డు..

Sep 27 2021 3:57 PM | Updated on Sep 27 2021 5:16 PM

Heavy Rain: Pregnant Woman Saves By Home Guard In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే దీని ప్రభావానికి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్ష బీభత్సానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే. కాగా, తాజాగా హైదరాబాద్‌లో వర్షంలో ఆసుపత్రికి వెళ్లలేక  తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళను 100 పెట్రోల్‌ వెహికిల్‌ హోంగార్డు  సమయానికి ఆసుపత్రికి తరలించాడు.

వర్షం ప్రభావానికి ఓ గర్భిణి ఆసుపత్రికి వెళ్లలేక ఇబ్బందులు పడుతుంది. దీంతో సదరు మహిళ కుటుంబ సభ్యులు 100కి ఫోన్‌ కాల్‌ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న హోంగార్డు ఇమ్రాన్ ఖాన్‌ బాధిత మహిళను ఎత్తుకుని గాంధీ ఆసుపత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసు అధికారులు, నెటిజన్లు హోంగార్డు ఇమ్రాన్‌ ఖాన్‌ను ప్రశసింస్తున్నారు. 

చదవండి: మణికొండలో గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతదేహం లభ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement