saves
-
సీపీఆర్ చేసి పాము ప్రాణాలు కాపాడిన యువకుడు.. వీడియో వైరల్
ఈ మధ్య కాలంలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు బాధితులను కాపాడేందుకు ఉన్న తక్షణ మార్గం సీపీఆర్. ఈ అత్యవసర చికిత్స ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ప్రాణాపాయంలో ఉన్న వారికి సీపీఆర్ చేసిప్రాణాలను నిలుపుతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా, గుజరాత్ వడోదరలో ఓ వ్యక్తి ఇలానే ప్రాణాపాయంలో ఉన్న పాముకు సీపీఆర్ చేసి దాని ప్రాణాలు నిలపాడు. నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న నిజంగానే జరిగింది. వివరాలు.. బృందావన్ చౌరస్తాలో రోడ్డుపక్కన అపస్మారకస్థితిలో ఉన్న పామును గుర్తించిన కొందరు జంతు సంరక్షణ కార్యకర్తలకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న బృందం దానికి సీపీఆర్ చేయాలని నిర్ణయించింది. వెంటనే యశ్ తాడ్వి అనే యువకుడు నిర్జీవంగా పడివున్న పాముపిల్లను చేతుల్లోకి తీసుకున్నాడు. దాని ప్రాణాలు పోలేదని నిర్ధారించుకున్న అతడు వెంటనే దానికి నోటితో శ్వాస అందిస్తూ సీపీఆర్ చేశాడు. పాము నోరు తెరిచి నోటిలోకి మూడు నిమిషాలు ఊది స్పృహలోకి తీసుకురావడానికి యత్నిచాడు.మొదటి రెండు ప్రయత్నాలలో సీపీఆర్ ఇచ్చినా, దాని పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. మూడోసారి పాములో చలనం వచ్చింది. CPR to the snake with his mouth and unconscious snake back to life.This video going viral on social media from Vadodara, Gujarat, India#CPR #Life #Viral #India pic.twitter.com/VZXEOuTXKz— Chaudhary Parvez (@ChaudharyParvez) October 17, 2024 ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు యశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. -
మహిళా రైతును కాపాడిన దిశ యాప్
సాక్షి, నంద్యాల జిల్లా: దిశ యాప్‌తో తనకేమి ఉపయోగం ఉంటుందనుకున్న ఓ మహిళా రైతుకు అదే యాప్ రక్షణగా నిలబడింది. పొలం పనులు ముగించుకొని ఇంటికెళ్తున్న ఆమెపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి యత్నించగా, వెంటనే ఆ మహిళ దిశ SOS కు కాల్ చేసి సహాయం కోరింది. నిముషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రుద్రవరం మండలం పెద్ద కంబలూరుకు చెందిన మహిళ పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రసాద్ అనే వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు వేసి ప్రసాద్ నుంచి తప్పించుకుంది. స్థానికులు రావడంతో ప్రసాద్ అక్కడ నుండి పారిపోయాడు. బాధిత మహిళ దిశ SOS కు కాల్ చేసి జరిగిన సంఘటనను వివరించింది. చదవండి: పవన్‌పై క్రిమినల్ డిఫమేషన్ కేసు.. వలంటీర్ స్టేట్మెంట్ రికార్డ్ బాధిత మహిళ వుండే లోకేషన్‌కు దిశ పోలీసులు కేవలం పది నిముషాల వ్యవధిలో చేరుకున్నారు. సిరివెళ్ల వైపు పారిపోతున్న నిందితుడు ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్ పై ఐపీసీ సెక్షన్ 354 ఏ, 354 బి, 506ల కింద రుద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు. దిశ SOS కు కాల్ చేసిన పది నిముషాల వ్యవధిలో పోలీసులు వచ్చి సహాయం చేశారని బాధిత మహిళ సంతోషం వ్యక్తం చేసింది. రెండు నెలల క్రితం తన సెల్ ఫోన్లో గ్రామ సచివాలయ సిబ్బంది దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసి, ఎలా ఉపయోగించాలో వివరించినట్లు మహిళ తెలిపింది. ఆ సమయంలో దిశ యాప్ వలన తనకేమి ఉపయోగం ఉంటుందని సచివాలయ సిబ్బందితో వాదించిన విషయాన్ని మహిళ గుర్తు చేసింది. కానీ అదే దిశ యాప్ ఈ రోజు తనకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని ఊహించలేదని పేర్కొంది. ఆపదలో ఉన్న తనకు దిశ పోలీసులు చేసిన సహాయం ఎప్పటికీ మరువలేనని చెప్పింది. మహిళల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పనిచేస్తున్నట్లు దిశ పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అమ్మాయిలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సూపర్ పోలీస్.. రాకాసి అలల్లో పిల్లలను కాపాడి.. వీడియో వైరల్...
ముంబయి: ముంబయిలోని జుహు బీచ్‌లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఇద్దరు పిల్లలను కాపాడారు. సముద్రంలో మునిగిపోతున్న పిల్లలను కాపాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. కానిస్టేబుల్ ధైర్య సాహసాలపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. వర్షాల ధాటికి సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో ముంబయిలోని జుహు బీచ్‌లో ఇద్దరు పిల్లలు అలల వేగానికి తట్టుకోలేక మునిగిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ విష్ణు భౌరావ్ బేలే పరిస్థితిని గమనించి రంగంలోకి దిగారు. ప్రాణాలకు తెగించి పిల్లల ప్రాణాలను కాపాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కానిస్టేబుల్ ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు. #WATCH | Santacruz Police station constable Vishnu Bhaurao Bele safely rescued two drowning children aged 7&10 from the sea at Juhu's Koliwada, Juhu Beach. pic.twitter.com/wnjVGJU6FP — ANI (@ANI) June 24, 2023 కాగా.. ముంబయిలో రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంది. శనివారం కురిసిన కుండపోత వర్షానికి ఇద్దరు మరణించారు. తీవ్ర గాలులకు చెట్లు నేలకూలాయి. రహదారులు చెరువులను తలపించాయి. కాలనీలు నీటమునిగాయి. థాణె జిల్లాలో ఓ రెస్టారెంట్ పైకప్పు కూలిన ఘటనలో పలువురు గాయపడ్డారు. ఇదీ చదవండి: కాలేజీ కుర్రాళ్ల రహస్య ‘స్టార్టప్’.. బండారం బయటపడిందిలా.. -
ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!
ఇటీవల స్మార్ట్ వాచ్‌ల వాడకం పెరిగింది. ముఖ్యంగా నడక, ఇతర వ్యాయామ సమయాల్లో వీటిని బాగా ఉపయోగిస్తున్నారు. శరీరానికి సంబంధించిన రక్త ప్రసరణ, హృదయ స్పందన, ఆక్సిజన్ స్థాయిలు వంటి సమాచారాన్ని అందించేలా రూపొందిన ఈ స్మార్ట్ వాచ్‌లు ఆరోగ్య రక్షణలో ఉపయోగపడుతున్నాయి. ఇదీ చదవండి: కస్టమర్‌కు షాకిచ్చిన ఉబర్.. 21 కిలోమీటర్ల రైడ్‌కి రూ.1,500 బిల్లు శరీరంలో అనారోగ్య లక్షణాలను గుర్తించి వెంటనే అలెర్ట్ చేసి యాపిల్ స్మార్ట్ వాచ్‌లు యూజర్ల ప్రాణాలు కాపాడాయంటూ పలు కథనాలు వెల్లడయ్యాయి. తాజాగా క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన ఒక వ్యక్తి రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుముఖం పట్టడాన్ని గుర్తించి యాపిల్ వాచ్ ప్రాణాలు కాపాడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. న్యూస్ 5 క్లీవ్‌ల్యాండ్ కథనం ప్రకారం.. క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన కెన్ కౌనిహన్‌కు ఓ రోజు తన శ్వాస వేగం పెరిగిందని యాపిల్ స్మార్ట్ వాచ్ వెంటనే అలర్ట్ చేసింది. దీంతో ఇదేదో చిన్నపాటి జబ్బు అని భావించి ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత కుటుంబ సభ్యుల సూచన మేరకు ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించారు. డాక్టర్లు కౌనిహన్‌కు ఎక్స్ రే తీసి మందులు ఇచ్చి పంపించారు. ఇదీ చదవండి: Byju’s: మాస్టారు మామూలోడు కాదు.. సీక్రెట్ బయటపెట్టిన బైజూస్ రవీంద్రన్! అయితే ఆ తర్వాత కూడా యాపిల్ వాచ్ అలాగే అలర్ట్ ఇవ్వడంతో మరోసారి వైద్యులను సంప్రదించగా ఈ సారి డాక్టర్లు స్కానింగ్‌లు చేసి ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. దీన్ని నిర్లక్ష్యం చేసి ఉంటే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేదని వైద్యులు చెప్పినట్లుగా కౌనిహన్ తెలిపారు. ఆ రకంగా యాపిల్ వాచ్ తన ప్రాణాలను కాపాడిందని పేర్కొన్నారు. -
Viral Video: వాగులో పడిన కుక్క.. ప్రాణాలు తెగించి కాపాడిన యువకుడు
-
వైరల్ వీడియో: ప్రమాదంలో బాలుడు.. ప్రాణాలు కాపాడిన డ్రోన్
-
ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఫోన్ కాల్
అనంతపురం సిటీ: కుటుంబాన్ని వద్దనుకుని ఇల్లాలు పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన భర్త... పిల్లల సహా ఆత్మహత్యాయత్నం చేశాడు. సకాలంలో సమాచారం అందుకున్న పోలీసులు వారిని కాపాడారు. వివరాలు.. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లికి చెందిన రామానాయుడు భార్యాబిడ్డలతో కలసి నగరంలోని ఆదర్శనగర్‌లో నివాసముంటున్నాడు. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి 13 ఏళ్ల కుమార్తె, 11 ఏళ్ల వయస్సు కలిగిన కొడుకును చూసుకుంటూ రామానాయుడు రోజులు నెట్టుకొచ్చాడు. భార్య కాపురానికి రానని తేల్చి చెప్పడంతో మనస్తాపం చెందిన అతను తన ఇద్దరు బిడ్డలతో కలసి నాయక్‌నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి చేరుకున్నాడు. వారిని గమనించిన స్థానికులు డయల్ 100కు సమాచారం అందించడంతో నాల్గో పట్టణ సీఐ జాకీర్ హుస్సేన్ తక్షణమే స్పందించి బ్లూకోట్ సిబ్బందిని రైల్వే ట్రాక్ వద్దకు పంపారు. సకాలంలో పోలీసులు అక్కడకు చేరుకుని ముగ్గురిని కాపాడి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. కౌన్సెలింగ్ అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా బ్లూకోట్ సిబ్బందిని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప, డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీఐ జాకీర్, రైల్వే సీఐ నాగరాజు అభినందించారు. (చదవండి: అర్హులైన రైతులందరికీ ఉచిత పంటల బీమా పరిహారం) -
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. కొంచెం ఆలస్యమైనా ఎంత ఘోరం జరిగేదో..
తెలిసిన వారు, బంధువులు ఆపదలో ఉంటేనే ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాని రోజులివి. అడక్కముందే మాటలు ఎన్నో చెప్తారు కానీ చేతల్లోకి వచ్చే సరికి సైలెంట్‌గా సైడ్ అయిపోతుంటారు. కానీ తనకు ఏం కాని వ్యక్తి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాడు. చనిపోదామనుకున్న వ్యక్తిని ప్రాణాలను తెగించి కాపాడాడు. అతనికి కొత్త లైఫ్ అందించాడు. ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య నిర్ణయించుకున్నాడు. దూరం నుంచి రైలు కూడ వస్తోంది. అయితే అదే సమయంలో స్టేషన్లో విధుల్లో ఉన్న రైల్వే సిబ్బంది అతని గమనించాడు. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పరుగెత్తాడు. అటు నుంచి రైలు వేగంగా దగ్గరకు వస్తున్న భయపడకుండా ప్రాణాలకు తెగించి రైల్వే ట్రాక్‌పైకి దూకి అతన్ని ఎత్తుకొని పక్క ట్రాక్ మీదకు తీసుకెళ్లాడు. అతను కాపాడిన సెకన్ల వ్యవధిలోనే రైలు పట్టాలపై వేగంగా వెళ్లింది. కాగా ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.. కాపాడిన వ్యక్తి పేరు మాత్రం సతీష్ కుమార్ అని తెలిసింది. చదవండి: గున్న ఏనుగు చుట్టూ బాడీగార్డులు.. ఓ లుక్కేయండి దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ రైల్వేస్ తమ అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. ‘రైల్వే సిబ్బంది సాహసోపేతమైన ధైర్యం ఒక విలువైన ప్రాణాన్ని కాపాడింది. సతీష్ లాంటి ధైర్యవంతులు భారతీయ రైల్వేలో ఉన్నందుకు గర్వంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాలకు తెగించి వ్యక్తిని కాపాడిన రైల్వే సిబ్బందిని అక్కడున్నవారు, అధికారులు ప్రశంసించారు. నెటిజన్లు సైతం సిబ్బంది ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. అతడిని దేవుడు చల్లగా చూడాలి, హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. सेवा, सुरक्षा और सहयोग A precious life was saved by the courageous act of help by on-duty staff, who jumped on tracks himself to save a person from getting gravely injured. Indian Railways is proud to have daring & diligent staff like H. Satish Kumar and commends his bravery. pic.twitter.com/gcnHCrtXg4 — Ministry of Railways (@RailMinIndia) June 23, 2022 -
క్షణం ఆలస్యమై ఉంటే అంతే
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కదులుతున్న రైలు నుండి పట్టాలపై పడబోయిన ప్రయాణికుడిని రైల్వే పోలీస్ చాకచక్యంతో రక్షించిన సంఘటన కారవార రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన కేంద్ర రక్షణ శాఖ అధికారి బీఎం దేసాయి (59)ని, కారవార రైల్వే పోలీస్ నరేశ్ రక్షించారు. ఆదివారం దేసాయి ఒకటవ ప్లాట్‌ఫాం మీద ఉన్న లగేజీ తీసుకోవడానికి కదులుతున్న ట్రైన్ నుండి దిగబోతూ కాలుజారి పట్టాలపై పడబోయాడు. అంతలో ఈ దృశ్యాన్ని చూసిన నరేశ్ తక్షణం అప్రమత్తమై దేసాయిని కాపాడాడు. ఈ వీడియోను కొంకణ రైల్వే శాఖ విడుదల చేసి ప్రయాణికులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చదవండి: నీ అశ్లీల వీడియో లీక్ చేస్తా.. మంత్రి కొడుక్కి బెదిరింపులు! -
ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసి.. 60 నిద్ర మాత్రలు మింగేశాడు!
బీజింగ్: ఒక్కొసారి జీవితంలో మనం ఊహించుకునే దానికి, జరిగే దానికి చాలా తేడా ఉంటుంది. మనం పెట్టుకున్న అంచనాలు.. పూర్తిగా తలకిందులుగా మారుతుంటాయి. ఇలాంటి పరిస్థితులను కొందరు ధైర్యంగా ఎదుర్కొంటే.. మరికొందరు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటాయి. ఈ సమయాల్లో వీరు .. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తమ మిత్రులకు గానీ, దగ్గరి వారికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చెబుతుంటారు. ఈ సమయంలో అవతలివారు.. అప్రమత్తంగా వ్యవహరిస్తే.. బాధితుల ప్రాణాలు నిలుస్తాయి. తాజాగా, ఒక డెలీవరీ బాయ్ అప్రమత్తంగా వ్యవహరించడంతో.. ఒక నిండు ప్రాణం నిలిచింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాలు.. చైనాలోని హెనాన్ ప్రావీన్స్‌లో ఒక కస్టమర్ వ్యాపారంలో నష్టపోయాడు. ఈ క్రమంలో తాను.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే, తనకు ఇష్టమైన ఆహరం తిని చనిపోవాలనుకున్నాడో.. ఏమో గానీ.. ఫుడ్ కోసం ఆర్డర్ పెట్టాడు. ఈ క్రమంలో.. డెలీవరీబాయ్ డెలీవరీని ఇవ్వడానికి కస్టమర్ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ‘ది లాస్ట్ మీల్ ఇన్ మై లైఫ్ ’ ఇది నా జీవితంలో చివరి భోజనం.. అంటూ నోట్ రాసిపెట్టి ఉంది. దీన్ని చూసిన డెలీవరీబాయ్ షాక్‌కు గురయ్యాడు. కస్టమర్ ఇంటి తలుపు తట్టడానికి ప్రయత్నించాడు. ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కస్టమర్‌ను.. తలుపును తీయాలని కోరారు. అయితే, బలవంతంగా లోపలికి వస్తే.. కిటికీలో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో పోలీసులు బాధితుడిని ఓదార్చి.. మాటల్లో పెట్టారు. ఆ తర్వాత.. బాధితుడు చెప్పిన విషయాన్ని ఓపికతో విన్నారు. కాగా, కస్టమర్.. తాను చేస్తున్న వ్యాపారంలో నష్టం రావడంతోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపాడు. ఆ తర్వాత పోలీసులు చాకచక్యంగా గదిలోపలికి ప్రవేశించారు. కస్టమర్ అప్పటికే బాధతో 60 నిద్రమాత్రలు మింగినట్లు గుర్తించారు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సరైన సమయానికి ఆసుపత్రికి తరలించడంతో బాధితుడి ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం .. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. డెలీవరీ బాయ్‌ను అభినందిస్తున్నారు. -
‘వీడియో చూస్తుంటే.. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి’
భోపాల్: ఒక యువతి రైల్వే క్రాసింగ్ గేటు వద్ద వెళ్లి రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆమెను ఒక ఆటోడ్రైవర్ తన ప్రాణాలను తెగించి కాపాడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్‌లోని ఒక రైల్వేగేటువద్ద రైలు వస్తుంది. ఈ క్రమంలో ప్రయాణికులు రోడ్డు దాటకుండా రైలు ఉద్యోగి గేటు వేశారు. రోడ్డుకు ఇరువైపులా ప్రయాణికులు నిల్చుండిపోయారు. అప్పుడు ఒక యువతి గాబరాగా రైల్వే గేటు ముందు నిలబడింది. ఆ తర్వాత రైలు సమీపిస్తుండగా.. ఒక్కసారి రైల్వేగేటు దాటుకుని పోయి పట్టాల మీద వెళ్లి నిలబడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆటోడ్రైవర్ యువతి ప్రవర్తన పట్ల అనుమానంగా చూశాడు. రైలు దగ్గరకు వస్తుంది.. ఆ క్షణంలో ఒక్కసారిగా వెళ్లి రైలు పట్టాలపై నిలబడిన ఆ యువతిని బలవంతంగా పక్కకు లాగాడు. ఒక్క క్షణం ఆలస్యమైన ఆ యువతి ప్రాణాలకు పెద్ద ప్రమాదమే సంభవించేది. ఆ తర్వాత యువతి బిగ్గరగా ఏడ్చింది. అక్కడున్న స్థానికులు ఆమెను ఓదార్చారు. కాగా, ఉద్యోగం రాకపోవడం పట్ల తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని యువతి కన్నీటి పర్యంతమయ్యింది. ఆ యువతికి అక్కడున్న వారు ధైర్యం చెప్పారు. కాసేపటికి యువతి తెరుకుంది. యువతిని ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. బాధిత యువతి ప్రాణాలు కాపాడిన ఆటోడ్రైవర్ మోసిన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘అందరికి సమస్యలు ఉంటాయని.. సమస్యలకు పరిష్కారం.. చావు కాదని’ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘వీడియో చూస్తుంటే.. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి..’,‘ ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తికి సెల్యూట్ ’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. नौकरी ना मिलने से परेशान युवती सुसाइड के इरादे से पटरी पर खड़ी हो गई. ट्रेन आती देख ऑटो ड्राइवर ने खींचकर बचाई जान. वीडियो हुआ वायरल. ऑटो चालक मोहसिन की सूझबूझ और दिलेरी को सलाम नोट: सुसाइड किसी समस्या का समाधान नहीं! pic.twitter.com/CZscsq1CX7 — Ravish Pal Singh (@ReporterRavish) September 28, 2021 చదవండి: Video Viral: వలలో పడ్డ భారీ షార్క్.. పాత రికార్డులన్నీ బ్రేక్ -
Hyderabad: మానవత్వం చాటుకున్న హోంగార్డు..
హైదరాబాద్: గులాబ్ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే దీని ప్రభావానికి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్ష బీభత్సానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే. కాగా, తాజాగా హైదరాబాద్‌లో వర్షంలో ఆసుపత్రికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళను 100 పెట్రోల్ వెహికిల్ హోంగార్డు సమయానికి ఆసుపత్రికి తరలించాడు. వర్షం ప్రభావానికి ఓ గర్భిణి ఆసుపత్రికి వెళ్లలేక ఇబ్బందులు పడుతుంది. దీంతో సదరు మహిళ కుటుంబ సభ్యులు 100కి ఫోన్ కాల్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న హోంగార్డు ఇమ్రాన్ ఖాన్ బాధిత మహిళను ఎత్తుకుని గాంధీ ఆసుపత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసు అధికారులు, నెటిజన్లు హోంగార్డు ఇమ్రాన్ ఖాన్‌ను ప్రశసింస్తున్నారు. చదవండి: మణికొండలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం -
ఆంధ్రప్రదేశ్‌లో పవర్ ‘ఫుల్ ఆదా’
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న విధానాలతో సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రజాధనం వృథా కాకుండా నివారిస్తూ ప్రతి పైసాను ఆదా చేయడంతో విద్యుత్ సంస్థలు బలోపేతం అవుతున్నాయి. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చిన్న ప్రాజెక్టులపైనా ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు ఉత్తమ ప్రమాణాలు పాటించడం, బహిరంగ మార్కెట్లో చౌకగా విద్యుత్‌ను కొనుగోలు చేయడంతో విద్యుత్ సంస్థలు రూ.2,342 కోట్ల మేర ఆదా చేయగలిగాయి. విద్యుత్ సంస్థల్లో సాంకేతిక, వాణిజ్య నష్టాలు (ఏటీ,సీ) 2018–19లో 13.79 శాతం ఉండగా 2019–20లో 10.95 శాతానికి తగ్గాయి. రీ టెండర్‌తో రూ.15.96 కోట్లు మిగులు చౌక విద్యుత్, పొదుపు చర్యల్లో భాగంగా ఏపీ ట్రాన్స్‌కో సిస్టం అప్లికేషన్స్ అండ్ ప్రొడక్టస్(ఎస్ఏపీ), హన (హై పెర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్స్) ఎంటర్‌ప్రైజెజ్ క్లౌడ్ సర్వీసుల టెండర్ ఖరారులో రూ.15.96 కోట్లు ఆదా చేసింది. వాస్తవానికి ఎస్ఏపీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఏపీ ట్రాన్స్‌కో ఐదేళ్ల కిందట ఒప్పందం కుదుర్చుకుంది. ఐదేళ్ల కాలానికి క్లౌడ్ సర్వీసులకు రూ.20.22 కోట్లతో నామినేషన్ పద్ధతిలో ఈ ఒప్పందం జరిగింది. ఇదే కంపెనీ మరో ఐదేళ్ల పాటు ఒప్పందాన్ని పునరుద్ధరించాలని కోరింది. ఈ ప్రతిపాదనను ఏపీ ట్రాన్స్ కో తిరస్కరించింది. రీ టెండర్ ద్వారా ఐదేళ్ల క్లౌడ్ సర్వీసుల కోసం రూ.3.94 కోట్లకు, వన్ టైం మైగ్రేషన్ కోసం రూ.31.22 లక్షలకు టెండరు ఖరారు చేసింది. ఫలితంగా రూ.15.96 కోట్లు ఆదా అయ్యాయి. విద్యుత్ కొనుగోళ్లలో రూ.2,342 కోట్లు ఆదా చౌక విద్యుత్ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా విద్యుత్ సంస్థలు అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి. ఒక రోజు ముందే విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని అమలు చేస్తున్నాయి. ఫలితంగా విద్యుత్ కొనుగోలు ఖర్చును గణనీయంగా తగ్గించగలుగుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయి. 2019 – 20, 2020 – 21లో ఉత్తమ ప్రమాణాలు పాటించడం, చౌక విద్యుత్ పవర్ ఎక్సే ్చంజీల ద్వారా విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా మొత్తం రూ.2,342 కోట్లు ఆదా చేశారు. విద్యుత్ సంస్థల సాంకేతిక, వాణిజ్య నష్టాల వివరాలు శాతాల్లో సంస్థ 2018–19 2019–20 ఏపీఈపీడీసీఎల్ 6.68 6.64 ఏపీఎస్పీడీసీఎల్ 8.45 8.30 ఏపీసీపీడీసీఎల్ 7.93 7.99 సాంకేతిక నష్టాల సగటు 7.70 7.62 డిస్కంల వాణిజ్య నష్టాలు 6.09 3.33 ఏటీ అండ్ సీ నష్టాల మొత్తం 13.79 10.95 అందుబాటు ధరల్లో నాణ్యమైన విద్యుత్ ‘‘వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయటంతో పాటు అందుబాటు ధరల్లోనే అందించే ప్రయత్నాలను కొనసాగించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. విద్యుత్ వ్యవస్థలు ఈ విధానాలను పాటిస్తూ ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నాయి’’ – నాగులాపల్లి శ్రీకాంత్. ఇంధనశాఖ కార్యదర్శి ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం ‘‘ఉత్తమ విధానాల అమలు, చౌక విద్యుత్‌లో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యుత్ రంగాన్ని సుస్థిరం చేయాలన్న ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నాయి. దానిలో భాగంగానే ఎస్ఏపీ టెండర్లలో రూ.15.96 కోట్లు ఆదా చేయగలిగాం’’– కర్రి వెంకటేశ్వరరావు, ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ -
యువతిని కాపాడిన 'దిశ' యాప్
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): ‘దిశ’ యాప్ ఆపదలో ఉన్న ఓ యువతిని కాపాడింది. ఉండవల్లి– అమరావతి కరకట్ట రహదారుల్లో ఓ యువతి ద్విచక్రవాహనాన్ని నలుగురు వెంబడిస్తున్నారని తాడేపల్లి పోలీసు స్టేషన్‌కు సమాచారం అందింది. దీంతో వెంటనే సీఐ అంకమ్మరావు సిబ్బందిని అప్రమత్తం చేసి యువతి కోసం గాలించగా వెంటకపాలెం సమీపంలో ఉన్న యువతిని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యువతి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తుంది. ఈ క్రమంలో యువతికి బంధువులు వివాహం నిశ్చయించగా, తనకు ఇష్టం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించింది. దీంతో ప్రకాశం బ్యారేజీపై నుంచి ఉండవల్లి కరకట్ట మీదుగా వెంకటపాలెం ఇసుక క్వారీ వరకు ద్విచక్రవాహనంపై వెళ్లింది. అదే సమయంలో నలుగురు యువకులు ఆమెను వెంబడించడాన్ని గుర్తించి కుటుంబసభ్యులకు, దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. యువతి ఫోన్లో మాట్లాడటాన్ని గమనించిన యువకులు పరారయ్యారు. యువతి సూసైడ్ చేసుకునేందుకు పెద్ద మొత్తంలో శానిటైజర్ తీసుకురాగా, పోలీసులు గుర్తించి ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. -
కుక్కను కాపాడాడు.. ఫేమస్ అయిపోయాడు!
ముంబై: ముంబై నగరం గత కొన్నిరోజులుగా వరుణుడి దెబ్బకు అతలాకుతలం అవుతోన్న సంగతి తెలిసిందే. ముంబైని వరదలు ముంచెత్తడంతో ప్రాణనష్టంతో పాటు, ఆస్తి నష్టం కూడా సంభవించింది. అయితే ఈ వరదల్లో చిక్కుకున్న ఓ కుక్కకు మాత్రం భూమ్మీద నూకలు ఇంకా మిగిలే ఉన్నాయి. వరదలో కొట్టుకుపోతున్న ఈ కుక్కను కానిస్టేబుల్ రక్షించడంతో అది చావు నుంచి తప్పించుకుంది. వరదల్లో కొట్టుకుపోతున్న ఓ కుక్కను ప్రకాష్ పవార్ అనే పోలీస్ కానిస్టేబుల్ రక్షించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆ కుక్కను రక్షిస్తుండగా తీసిన వీడియోను ముంబై పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘మనిషికి కుక్క ఓ మంచి ఫ్రెండ్.. అయితే అలాంటి ఓ కుక్కకు కానిస్టేబుల్ ప్రకాశ్ పవర్ రూపంలోమంచి స్నేహితుడు దొరికాడు’ అంటూ ట్వీట్ చేశారు. నెటిజన్లు ఆ కానిస్టేబుల్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో అందరి చేత హీరో అనిపించుకుంటున్నాడు. Man’s best friend, found its best friend in PC Prakash Pawar too. #FriendsIndeed pic.twitter.com/hCsrDwlfZ5 — Mumbai Police (@MumbaiPolice) July 3, 2019 -
ఆధార్‌తో రూ. 90వేల కోట్ల ఆదా..
న్యూఢిల్లీ: అర్హులైన లబ్ధిదారులకే ప్రభుత్వ పథకాల సబ్సిడీలను అందించేందుకు తోడ్పడుతున్న ఆధార్‌తో గణనీయంగా ఆదా అవుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. నకిలీ లబ్ధిదారులు, అనర్హులను ఏరివేయడం ద్వారా గతేడాది మార్చి ఆఖరు దాకా చూస్తే సుమారు రూ. 90,000 కోట్లు ఆదా అయినట్లు ఆయన వివరించారు. ‘ఆధార్ ప్రయోజనాలు’ అంశంపై సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో చేసిన ఒక పోస్టులో ఈ విషయాలు పేర్కొన్నారు. ఆధార్ వినియోగం ద్వారా భారత్ ఏటా రూ. 77,000 కోట్లు ఆదా చేసుకోగలదంటూ ప్రపంచ బ్యాంకు ఒక నివేదికలో పేర్కొన్నట్లు ఆయన వివరించారు. ‘ఆధార్‌తో ఆదా అయ్యే నిధులతో ఆయుష్మాన్ భారత్ స్థాయిలో మూడు పథకాలను అమలు చేయొచ్చు’ అని జైట్లీ తెలిపారు. కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీనిచ్చే ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద.. దాదాపు 10.74 కోట్ల పైగా పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టినప్పట్నుంచి ఇప్పటిదాకా 7 లక్షల మంది పేద పేషెంట్లు.. ఉచిత వైద్య చికిత్స పొందినట్లు జైట్లీ పేర్కొన్నారు. 122 కోట్ల ఆధార్ నంబర్ల జారీ.. 2016లో ఆధార్ బిల్లును జారీ చేసినప్పట్నుంచీ 28 నెలల వ్యవధిలో 122 కోట్ల ఆధార్ నంబర్లను జారీ చేయడం జరిగిందని జైట్లీ తెలిపారు. 18 ఏళ్ల పైబడిన వయోజనుల్లో 99 శాతం మందికి ఆధార్ జారీ అయ్యిందని పేర్కొన్నారు. ‘ఆధార్ ఆధారంగా ఇప్పటిదాకా లబ్ధిదారులకు బదలాయించిన సబ్సిడీల విలువ దాదాపు రూ. 1,69,868 కోట్ల మేర ఉంటుంది. మధ్యవర్తుల ప్రమేయం తగ్గిపోవడం వల్ల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి చేరతాయి. ఇది భారత్‌లో మాత్రమే అమలవుతున్న ప్రత్యేక టెక్నాలజీ’ అని వివరించారు. -
శునకం ప్రాణం కోసం మగువ తెగువ
-
పాలేరు వాగులో చిక్కుకున్న రైతులు సేఫ్
-
మొక్కలతోనే మానవ మనుగడ
కారేపల్లి: మానవ మనుగడ మొక్కలతోనే ప్రారంభం అయిందని ఫారెస్టు స్టేట్ అబ్సర్వర్ రఘువీర్ తెలిపారు. బుధవారం విశ్వనాథపల్లి గ్రామంలో ఆమన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దట్టమైన అడవులను పునరిద్ధరించుకోవడంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని, అప్పుడే రాష్ట్రం హరిత తెలంగాణగా రూపుదిద్దుకుంటుందన్నారు. గిద్దెవారిగూడెంలో ర్యాలీ.. ప్రాథమికోన్నత పాఠశాలలో ఫారెస్టు స్టేట్ అబ్సర్వర్ మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ పీఏ, టీఆర్ఎస్ జిల్లా నాయకులు దయాకర్‌రెడ్డి, జడ్పీటీసీ ఉన్నం వీరేందర్, ఎంపీపీ బాణోతు పద్మావతి, తహశీల్దార్ ఎం మంగీలాల్, ఎంపీడీఓ ఎన్ శాంతాదేవి, ఎఫ్ఆర్ఓ శ్రీహరిప్రసాద్ పాల్గొన్నారు. -
జిహాదీలను ఎదిరించి, సైన్యాన్ని రక్షించిన శునకం!
లండన్ః బ్రిటిష్ సైన్యాన్ని రక్షించిన మిలటరీ డాగ్ ఇప్పుడు వార్తల్లో హీరో అయిపోయింది. ఏభైమంది ఐసిస్ సమూహాన్ని దీటుగా ఎదుర్కొని బ్రిటిష్ ప్రత్యేక దళాలపై విశ్వాసాన్ని చూపింది. సాస్ సైనికులు పది రోజుల ట్రైనింగ్ అనంతరం తిరిగి వస్తుండగా.. ఫైటర్లనుంచి రక్షించి ప్రత్యేకతను చాటింది. నాలుగు వాహనాల కాన్వాయ్ లో బ్రిటిష్ సైనిక దళాలతో పాటు ప్రయాణిస్తున్న అల్సేషన్ డాగ్... కుర్షిద్ సరిహద్దు ప్రాంతంలోకి రాగానే అనుకోకుండా జిహాదీల సమూహానికి చిక్కారు. గతనెల్లో సుమారు ఏభైమంది ఐసిస్ సభ్యులు ఓ హోం మేడ్ బాంబుతో సైన్యంపై దాడికి దిగారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన బ్రిటిష్ సైన్యంపై వెనుకనుండి దాడి చేశారు. అదే సమయంలో కాన్వాయ్ లో సైనికులతో పాటు ప్రయాణిస్తున్న మిలటరీ డాగ్ తన ప్రతాపం చూపింది. కోపంతో ఉగ్రరూపం దాల్చింది. ఐసిస్ దళాలపై విరుచుకు పడింది. ఓ జిహాదీని మైడపైనా, ముఖంపైనా కరిచింది. మరో జిహాదీ చేతులు, కాళ్ళను పట్టుకు పీకేసింది. ఆల్సేషన్ కుక్క టెర్రర్ కు ఐసిస్ సభ్యులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగులు తీశారు. కుక్క భయానికి అక్కడినుంచీ పారిపోయారు. ఐసిస్ దాడులనుంచి తన ప్రాణాలను కాపాడుకునేందుకు పారిపోకుండా.. ఆ కుక్క వీరోచితంగా పోరాడి తమ సైనికులను రక్షించడం అభినందించాల్సిన విషయమని, అందుకు దానికి ఎంతో తర్ఫీదు ఇచ్చి ఉంటారని ఘటన అనంతరం అంతా మెచ్చుకున్నారు. ఆల్సేషన్ దగ్గరకు వస్తే సాధారణ మనుషులైతే భయపడతారు. కానీ జిహాదీలను సైతం తీవ్రంగా భయపెట్టి, వారిని దీటుగా ఎదుర్కొని తన బాధ్యతను నిర్వర్తించడం నిజంగా ఆశ్చర్యకరమని అంటున్నారు. -
ఆ అరగంట ఆలస్యమై ఉంటే..
బీజింగ్: కుప్పకూలిపోతున్న ఏడంతస్తుల భవనం నుంచి 67 మందిని దంపతులు కాపాడిన వైనం పలువురి ప్రశంసలందుకుంది. చైనాలోని హుచియాన్ జిల్లాలోని గిజో ప్రావిన్స్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ భవనంలో కింది అంతస్తులో కిరాణా దుకాణం నిర్వహించే లూ కైసూ, జి యవాన్ కుయీ దంపతులు ఆకస్మాత్తుగా భవనం కూలిపోతున్న విషయాన్ని గమనించారు. క్షణం కూడా ఆలోచించకుండా ఏడో అంతస్తులో ఉంటున్న తమ పిల్లలతో సహా, భవనంలో ఉంటున్న అందర్నీ అప్రమత్తం చేశారు. ఏ ఒక్కరూ ప్రమాదం బారిన పడకుండా అందర్నీ రక్షించారు. ఆఖరి వ్యక్తి భవనం నుంచి బయటపడిన దాదాపు అర్థగంట తరువాత ఏడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ''అర్థరాత్రి ఆకస్మాత్తుగా గ్లాస్ పగిలిన శబ్దం వినిపించింది. ఇది దొంగల పని అనుకొని మా ఆయన్ను చూడమన్నాను. అనుమానాస్పదంగా ఏమీ కనపించలేదు. పోయి పడుకున్నాం.. కానీ తెల్లవారుజామున పెద్ద శబ్దం వినిపించింది. అప్పుడు వెళ్లి చూస్తే... భవనానికి పగుళ్లు! ఒక్కసారిగా సిమెంట్, ఇసుక రాలిపోతున్నాయి. అంతే, గడప గడపకూ వెళ్లి...'' అంటూ ఆనాటి సంఘటననూ పూసగుచ్చినట్టు వివరించారు లూ కైసూ. ఈ ప్రమాదంలో రూ. 10 లక్షల విలువ చేసే తమ దుకాణం మొత్తం నాశనమైందని లూ కైసూ భర్త జి యవాన్ కుయీ చెప్పారు. తామంతా భయంతో వణికిపోయామని, కళ్లముందే భవనం పడిపోతోంటే.. నేల మీద అలా కూర్చుండిపోయామని తెలిపారు. తమ ప్రాణాలను కాపాడిన 'లూ' దంపతులకు ఇరుగుపొరుగువారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణం కన్నా విలువైన ఆస్తి ఏముంటుందన్నారు మరో నైబర్ యాంగ్ బింగ్ . ఇది 1995 లో నిర్మించిన భవనమని, నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఉన్న దాని కంటే నాలుగు అంతస్తులు అదనంగా నిర్మించినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని స్థానిక అధికారులు తెలిపారు. నాసిరకం మెటీరియల్ వాడటంతో ఇటీవల కురిసిన వర్షాలకు కుప్పకూలిపోయిందన్నారు. భవన యజమానిని అదుపులోకి తీసుకున్నామన్నారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు.