![apple watch saves mans life helps detect blood clots in lungs - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/20/apple.jpg.webp?itok=hhrp4fG4)
ఇటీవల స్మార్ట్ వాచ్‌ల వాడకం పెరిగింది. ముఖ్యంగా నడక, ఇతర వ్యాయామ సమయాల్లో వీటిని బాగా ఉపయోగిస్తున్నారు. శరీరానికి సంబంధించిన రక్త ప్రసరణ, హృదయ స్పందన, ఆక్సిజన్ స్థాయిలు వంటి సమాచారాన్ని అందించేలా రూపొందిన ఈ స్మార్ట్ వాచ్‌లు ఆరోగ్య రక్షణలో ఉపయోగపడుతున్నాయి.
ఇదీ చదవండి: కస్టమర్‌కు షాకిచ్చిన ఉబర్.. 21 కిలోమీటర్ల రైడ్‌కి రూ.1,500 బిల్లు
శరీరంలో అనారోగ్య లక్షణాలను గుర్తించి వెంటనే అలెర్ట్ చేసి యాపిల్ స్మార్ట్ వాచ్‌లు యూజర్ల ప్రాణాలు కాపాడాయంటూ పలు కథనాలు వెల్లడయ్యాయి. తాజాగా క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన ఒక వ్యక్తి రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుముఖం పట్టడాన్ని గుర్తించి యాపిల్ వాచ్ ప్రాణాలు కాపాడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
న్యూస్ 5 క్లీవ్‌ల్యాండ్ కథనం ప్రకారం.. క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన కెన్ కౌనిహన్‌కు ఓ రోజు తన శ్వాస వేగం పెరిగిందని యాపిల్ స్మార్ట్ వాచ్ వెంటనే అలర్ట్ చేసింది. దీంతో ఇదేదో చిన్నపాటి జబ్బు అని భావించి ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత కుటుంబ సభ్యుల సూచన మేరకు ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించారు. డాక్టర్లు కౌనిహన్‌కు ఎక్స్ రే తీసి మందులు ఇచ్చి పంపించారు.
ఇదీ చదవండి: Byju’s: మాస్టారు మామూలోడు కాదు.. సీక్రెట్ బయటపెట్టిన బైజూస్ రవీంద్రన్!
అయితే ఆ తర్వాత కూడా యాపిల్ వాచ్ అలాగే అలర్ట్ ఇవ్వడంతో మరోసారి వైద్యులను సంప్రదించగా ఈ సారి డాక్టర్లు స్కానింగ్‌లు చేసి ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. దీన్ని నిర్లక్ష్యం చేసి ఉంటే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేదని వైద్యులు చెప్పినట్లుగా కౌనిహన్ తెలిపారు. ఆ రకంగా యాపిల్ వాచ్ తన ప్రాణాలను కాపాడిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment