Smart Watch
-
వాచీలోనే క్యూఆర్ కోడ్... అదిరిందయ్యా ఆటో డ్రైవర్!
బెంగళూరుకు చెందిన ఈ ‘స్మార్ట్’ఆటో డ్రైవర్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందనలు అందుకున్నాడు. ఎందుకంటే మనవాడు యూపీఐ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ స్మార్ట్ వాచ్‌ను వాడుతున్నాడు మరి! సదరు ఫొటోను ఓ నెటిజన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దాంతో అది తెగ వైరలవుతోంది. అలా రైల్వే మంత్రి దృష్టినీ ఆకర్షించింది. ఆ ఫోటోను ఆయన రీట్వీట్ చేశారు. ‘యూపీఐ కా స్వాగ్! చెల్లింపులు మరింత సులువయ్యాయి’అంటూ కామెట్ చేశారు. ఆటోడ్రైవర్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెలులవెత్తుతున్నాయి. ఐటీలో ట్రెండ్ సెట్టర్ అయిన బెంగళూరు ఆ సాంకేతిక పరిజ్ఞానం వాడకంలోనూ ట్రెండ్ సెట్ చేస్తోందంటూ యూజర్లు కామెంట్ చేస్తున్నారు. ‘నవ భారత ముఖచిత్రమిది’అని ఒకరు, ‘డిజిటల్ ఇండియా మ్యాజిక్’అని మరొకరు పోస్ట్ చేశారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016లో ప్రారంభించిన యూపీఐ బ్యాంకుల మధ్య తక్షణ బదిలీలకు వీలు కలి్పంచడం ద్వారా చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతా స్మార్ట్.. ఆరోగ్యంపై ముందస్తు సమాచారం!
సాక్షి, సిటీబ్యూరో: వాచ్ రూపాంతరం చెంది స్మార్ట్ వాచ్‌గా మారింది. భిన్నమైన ఫీచర్లతో దూకుడు ప్రదర్శిస్తోంది. మార్కెట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అద్భుతమైన పనితీరుకలిగిన స్మార్ట్ వాచ్‌లో అందుబాటులోకి వచ్చాయి. బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని, మన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు డేటా రూపంలో పొందుపరుచుకోవచ్చు. అడ్వెంచర్, వాటర్ స్పోర్ట్స్ అవసరాలకు ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. యాపిల్, ఒప్పో, హువావే, ఫిట్ బిట్, నాయిస్, సామ్సంగ్, టైటాన్ మొదలైన కంపెనీలు స్మార్ట్ వాచ్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. సుమారు రూ.వెయ్యి నుంచి రూ.90 వేల వరకూ అందుబాటులో ఉన్నాయి.పిల్లల కోసం..చిన్న పిల్లలను తల్లిదండ్రులు ట్రాక్ చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. జీపీఎస్ సాయంతో పిల్లల సమాచారాన్ని ట్రాక్ చేయొచ్చు.ఆరోగ్యంపై అలర్ట్స్..ఇందులో గుండె పనితీరుకు సంబంధించిన నోటిఫికేషన్లు, రక్త ప్రసరణ, ఆక్సిజన్ స్థాయి, ఈసీజీ, ఇతర ఆరోగ్య వివరాల సమాచారం అందిస్తాయి. ఫాల్ డిటెక్షన్, క్రాష్ డిటెక్షన్ హార్డ్ ఫాల్, కార్ క్రాష్ సందర్భంలో అత్యవసర సేవలతో అనుసంధానం చేయగలవు. మహిళలకు భద్రత, రుతుచక్రం ట్రాకింగ్లోనూ ఈ స్మార్ట్ వాచ్ ఉపయుక్తం.ఇవి చదవండి: ప్రపంచ బీర్ దినోత్సవం : క్రాఫ్ట్ బీర్ ఇంత పాపులర్?! -
వృద్ధుల డిమెన్షియా కోసం స్మార్ట్ వాచ్ ఆలోచన అద్భుతం
హైదరాబాద్: వృద్ధులలో డిమెన్షియా (మతిమరుపు) సమస్య సర్వసాధారణంగా వస్తుందని, కానీ దాన్ని అధిగమించేందుకు తగిన వ్యవస్థలు ఇన్నాళ్లూ సరిగా లేవని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అన్వయ సంస్థ వారికోసం ప్రత్యేకంగా ఒక స్మార్ట్ వాచ్ రూపొందించడం, దానికి పేటెంటు కూడా పొందడం ఎంతో అద్భుతమైన ఆలోచన అని కొనియాడారు. దీనివల్ల వృద్ధులు ఎక్కడున్నా తెలుస్తుందని, అలాగే వారికి ఏం జరిగినా వారి సంరక్షకులకు క్షణాల్లో సమాచారం వెళ్తుందని.. ఇలాంటి పరికరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వయోవృద్ధులందరి సంరక్షణలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అన్వయ సంస్థ ఎనిమిదో వార్షికోత్సవం, వ్యవస్థాపకుల దినోత్సవాన్ని బేగంపేటలోని ఫ్యామిలీ వరల్డ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సంతోష్ మెహ్రా, టెక్ మహీంద్రా హెచ్ఆర్ గ్లోబల్ హెడ్ వినయ్ అగర్వాల్, టి-హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు, ఇండియా-ఇన్ఫర్ సంస్థ ఎండీ రంగ పోతుల, ఇండిపెండెంట్ స్ట్రాటజిక్ అడ్వైజర్ శక్తిసాగర్, అన్వయకేర్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ రెడ్డి, డైరెక్టర్ దీపికారెడ్డి తదితరులు పాల్గొన్నారు.టి-హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు మాట్లాడుతూ, స్టార్టప్ ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటున్నాయని, వృద్ధుల సంరక్షణ కోసం ఏఐ ఆధారిత యాప్ తీసుకురావడం, వారి సమస్యలను సమగ్రంగా పరిష్కరించే ప్రయత్నాలు చేయడం ఎంతో అభినందనీయమని చెప్పారు. అన్వయ కేర్ సంస్థ సేవలు మరింతమందికి అందాలని అభిలషించారు. “డిమెన్షియా అనేది వయోవృద్ధులందరిలో చాలా ఎక్కువగా కనపడుతున్న సమస్య. అయితే దీన్ని పరిష్కరించేందుకు ఎవరూ పెద్దగా ముందుకు రావట్లేదు. అసలు వృద్ధులు అంటే కేవలం ఆరోగ్య సమస్యలే కాదు.. ఇంకా చాలా ఉంటాయి. అన్వయ సంస్థ అద్భుతమైన సేవలు అందిస్తోంది. వాళ్లు ఒక స్మార్ట్ వాచ్ తయారుచేసి, దానికి పేటెంటు కూడా తీసుకోవడం చాలా బాగుంది. యూరోపియన్ దేశాల్లో సైకిళ్లపై వెళ్లేవారు తరచు ప్రమాదాలకు గురవుతారు. వాళ్లు ఆస్పత్రికి వెళ్లేలోపే వాళ్ల వైటల్స్, ఇతర వివరాలు అన్నీ డాక్టర్‌కు చేరిపోతాయి. ఇక్కడ ఈ వాచీని కూడా ప్రమాద బాధితులకు ఉపయోగపడేలా చేయాలి. వాళ్లను అంబులెన్సులోకి ఎక్కించగానే వాచీ పెట్టినా.. ముఖ్యమైన వివరాలన్నీ వైద్యులవద్ద సిద్దంగా ఉండి, వెంటనే చికిత్స ప్రారంభించగలరు. ఇలాంటి మంచి ఆలోచనలు వచ్చినందుకు ప్రశాంత్‌కు అభినందనలు” అని ఆయన చెప్పారు.ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, “వయోవృద్ధులకు సేవలు అందించే లక్ష్యంతో మా సంస్థను స్థాపించాం. అనతికాలంలోనే బెంగళూరు, చెన్నై లాంటి 40 నగరాలకూ విస్తరించాం. దీనికిగాను మాకు ఐఐటీ మద్రాస్ నుంచి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, హైసియా నుంచి.. ఇలా పలు వర్గాల నుంచి మాకు గుర్తింపు, అవార్డులు వచ్చాయి. కొవిడ్ నుంచి చాలామందిని రక్షించాం. హోం క్వారంటైన్ ఏర్పాటుచేశాం. అన్వయ స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టంను ఏర్పాటుచేసి, దానికి పేటెంటు కూడా సాధించాం. డిమెన్షియా కేర్ రంగంలో ఏమీ లేదని, వృద్ధులకు సేవలు అందించాలని గుర్తించాం. అప్పుడే భారతదేశంలోనే తొలిసారిగా ఏఐ ఎనేబుల్డ్ డిమెన్షియా కేర్ ఎట్ హోంను ప్రారంభించాం. ఉద్యోగుల సంరక్షణ కోసం అనన్య నిశ్చింత్ అనే ఏఐ ప్లాట్‌ఫాం తీసుకొచ్చాం. అనన్య కిన్ కేర్ అనే రిమోట్ పేషెంట్ మానిటరింగ్ సిస్టం ప్రవేశపెట్టాం. ఇది రాబోయే 20 ఏళ్లకు సరిపోయే వ్యవస్థ. పెద్దవాళ్లు మనల్ని పెంచి పెద్దచేసి, ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. వారికి అవసరమైనవి కల్పించడం మన విధి. అందుకే వారికి ఇంటివద్ద నర్సులు, డాక్టర్లను పంపడం, ల్యాబ్ శాంపిళ్లు ఇంటివద్దే సేకరించడంతో పాటు చివరకు ప్లంబర్లను పంపడం, ఉబర్ క్యాబ్‌లు బుక్ చేయడం వరకు అన్నిరకాల సేవలనూ అనన్య సంస్థ అందిస్తుంది” అని వివరించారు. -
మొక్కలను కాపాడే స్మార్ట్ కుండీ ఇదే!
ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి కుండీలను వాడుతుంటాం. ఇంటి అందం కోసం కుండీలను ఏర్పాటు చేసుకున్నా, వాటిలోని మొక్కల ఆలనా పాలనా మనమే చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి మొక్కల ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటే, అవి ఎండిపోయి, చనిపోతాయి. మొక్కల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టి, అందుకు అనుగుణంగా వాటి బాగోగులను చూసుకోవడం కష్టమే!ఈ సమస్యను తొలగించడానికే అమెరికన్ కంపెనీ ‘స్మార్టీ ప్లాంట్’ సంస్థ కుండీల్లోని మొక్కల రక్షణ కోసం స్మార్ట్ సెన్సర్‌ను తయారుచేసింది. సెన్సర్ అమర్చిన ఈ స్మార్ట్ కుండీల్లోని మొక్కలకు సునాయాసంగా రక్షణ కల్పించవచ్చు. అవి నిత్యం పచ్చగా కళకళలాడేలా చూసుకోవచ్చు. ఈ కుండీల్లోని స్మార్ట్ సెన్సర్ యాప్ ద్వారా పనిచేస్తుంది. వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ, కుండీలోని మట్టిలోని తేమ, మొక్కల వేళ్లు, కాండంలోని పోషకాల పరిస్థితులను ఎప్పటికప్పుడు యాప్ ద్వారా సమాచారం అందిస్తుంది. దీని ధర 45 డాలర్లు (రూ.3,760) మాత్రమే!పిల్లల కోసం ఫిట్నెస్ వాచీ..రక్తపోటు, గుండె పనితీరు, శరీరంలో ఆక్సిజన్ స్థాయి వంటి వివరాలను చెప్పే స్మార్ట్ వాచీలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ పెద్దల కోసం రూపొందించినవి. అయితే, అమెరికన్ కంపెనీ ‘ఫిట్‌బిట్’ ప్రత్యేకంగా పిల్లల కోసం ‘ఏస్ ఎల్టీఈ’ పేరుతో ఈ ఫిట్నెస్ వాచీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫిట్నెస్ ట్రాకింగ్ సెన్సర్లు పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తాయి.ఆ సమాచారాన్ని యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తాయి. ఈ వాచీని ఫోన్లా కూడా ఉపయోగించుకునే వీలు ఉంది. ఇందులోని కమ్యూనికేషన్స్ టాబ్ ద్వారా అవసరమైప్పుడు కాల్స్ చేసుకోవడానికి, మెసేజ్‌లు పంపుకోవడానికి కూడా వీలవుతుంది. ఏడేళ్లకు పైబడిన వయసు గల పిల్లలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ‘ఫిట్‌బిట్’ కంపెనీ చెబుతోంది. దీని ధర 229 డాలర్లు (రూ.19,126) మాత్రమే!నానోబాక్స్ మినీ డ్రమ్స్..మృదంగం, తబలా, డ్రమ్స్ వంటి తాళ వాయిద్యాలు లేకుండా సంగీత కచేరీలు పరిపూర్ణం కావు. అయితే, ఈ పరికరాలు కొంచెం భారీగా ఉంటాయి. ఆక్టోపాడ్ వంటి ఎలక్ట్రిక్ డ్రమ్స్ అందుబాటులోకి వచ్చినా, అవి కూడా కొంచెం భారీగా ఉండేవి, స్థలాన్ని ఆక్రమించుకునేవే! అమెరికన్ సంగీత పరికరాల తయారీ సంస్థ ‘1010 మ్యూజిక్’ ఇటీవల డ్రమ్స్‌ను అరచేతిలో ఇమిడిపోయే పరిమాణానికి కుదించి, ‘నానోబాక్స్’ను అందుబాటులోకి తెచ్చింది.‘రాజ్మాటాజ్’ పేరుతో రూపొందించిన ఈ మినీ డ్రమ్స్‌ను మిగిలి ఎలక్ట్రానిక్ సంగీత పరికరాల్లాగానే వాడుకోవచ్చు. ఈ ‘నానోబాక్స్’ పొడవు 3.75 అంగుళాలు, మందం 1.5 అంగుళాలు, వెడల్పు 3 అంగుళాలు. ఇందులోని 64 స్టెప్ సీక్వెన్సర్ ఔత్సాహికుల సాధనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ నానోబాక్స్కు ఉన్న టచ్‌స్క్రీన్ ద్వారా కోరుకున్న ధ్వనులను, శబ్దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీని ధర 399 డాలర్లు (రూ.33,327) మాత్రమే! -
కొత్త బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. వాచ్, బడ్స్ కూడా..
లండన్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ ‘నథింగ్’ సబ్-బ్రాండ్ అయిన సీఎంఎఫ్ మూడు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. సీఎంఎఫ్ ఫోన్ 1, సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 , సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.ఈ సీఎంఎఫ్ బ్రాండ్ కొత్త ఉత్పత్తులు జూలై 12 నుంచి భారత్‌లో విక్రయానికి రానున్నాయి. సీఎంఎఫ్ అధికారిక వెబ్సైట్ (cmf.tech) నుంచి, దారి రిటైల్ భాగస్వాముల ద్వారా జూలై 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.సీఎంఎఫ్ ఫోన్ 1 వివరాలు⇒ 6/8GB ర్యామ్, 128GB స్టోరేజీ, ⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్⇒ 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే⇒ 50 MP రియర్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా⇒ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ⇒ ఛార్జర్‌ను రూ. 799కి విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.⇒ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 15,999 ⇒ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999.⇒ మొదటిరోజు సేల్‌లో రెండు మోడళ్లపై రూ. 1,000 తగ్గింపు. ⇒ ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ కొంటే సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 లేదా CMF బడ్స్ ప్రో 2పై రూ.1,000 తగ్గింపు⇒ బ్లాక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ రంగులలో లభించే బ్యాక్ కేస్ల ధర రూ.1499 యాక్సెసరీస్‌లో స్టాండ్ రూ. 799, లాన్యార్డ్ ధర రూ. 799, కార్డ్ కేస్ రూ. 799కి లభిస్తుంది.సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 వివరాలు⇒ 1.32- అంగుళాల అమోల్డ్ ఎల్లప్పుడూ ఆన్ డిస్ప్లే⇒ 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్⇒ హృదయ స్పందన రేటు, బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్, ఒత్తిడి స్థాయిల నిరంతర పర్యవేక్షణ⇒ IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్⇒ మార్చుకోగలిగిన బెజెల్ డిజైన్⇒ బ్లూటూత్ కాల్స్, మ్యూజిక్ కంట్రోల్, నోటిఫికేషన్స్, రిమోట్ కెమెరా కంట్రోల్ ⇒ స్టాండర్డ్ మోడల్ ధర రూ. 4,999⇒ వేగన్ లెదర్ రూ.5,499⇒ డార్క్ గ్రే, యాష్ గ్రే, బ్లూ, ఆరెంజ్ రంగుల్లో లభ్యం.⇒ బెజెల్, స్ట్రాప్ సెట్‌ను అదనంగా రూ. 749కి కొనుగోలు చేయవచ్చు.సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2 వివరాలు⇒ 50 dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్⇒ మెరుగైన సౌండ్ క్వాలిటీ కోసం డ్యూయల్ డ్రైవర్లు⇒ ఎల్డీఏసీ టెక్నాలజీ సపోర్ట్⇒ Hi-Res ఆడియో వైర్లెస్⇒ 43 గంటల బ్యాటరీ లైఫ్⇒ స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్⇒ బ్లాక్, వైట్, బ్లూ, ఆరెంజ్ రంగులలో లభ్యం.⇒ ధర రూ. 4,299. -
ఏకంగా శునకాలకై.. అమెరికన్ కంపెనీ 'కడీ' పేరుతో..
చాలామంది జంతుప్రేమికులు ఇళ్లల్లో శునకాలను పెంచుకుంటూ ఉంటారు. ఇళ్లలో అవి ఏ మూలనో పడుకుంటూ ఉంటాయి. అవి పడుకునే చోట పాత బొంతలో, దుప్పట్లో పరుస్తూ ఉంటారు. బాగా సంపన్నులైతే సోఫా కుర్చీలను పెంపుడు శునకాలకు మంచాలుగా మార్చేస్తుంటారు. అమెరికన్ కంపెనీ ‘థింకో ఎల్ఎల్సీ’ శునకాల కోసం ‘కడీ’ పేరుతో ఒక స్మార్ట్ మంచానికి రూపకల్పన చేసింది.దీని తయారీకి చైనీస్ కంపెనీ లావో ఇంటర్నేషనల్ ట్రేడ్ కంపెనీ సాంకేతిక సహకారం అందించింది. శునకాలకు అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించిన ఈ బెడ్ స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై యాప్ ద్వారా పనిచేస్తుంది. దీనిపై పడుకున్న శునకానికి ఆహ్లాదం కలిగించేలా సంగీతం వినిపిస్తుంది. ఒంటికి హాయి నిచ్చేలా ఉష్ణోగ్రతను సర్దుకుంటుంది.యాప్ ద్వారా కూడా దీని ఉష్ణోగ్రతను మార్చుకునే వీలు ఉంది. దీనిపై పడుకున్న శునకం నిద్ర తీరుతెన్నులను యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. అంతేకాదు, శునకం ఆరోగ్యంలో మార్పులను కూడా ఇది నిశితంగా గమనిస్తూ, అవసరమైన సందర్భాల్లో యాప్ ద్వారా యజమానులను హెచ్చరిస్తుంది. ఈ స్మార్ట్ బెడ్‌ను ‘థింకో ఎల్ఎల్సీ’ జూన్ నెలాఖరులోగా మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.బీపీ చెకింగ్ స్మార్ట్‌వాచీలు..జీవనశైలి వ్యాధుల్లో హై బీపీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా హై బీపీ బాధితులు నానాటికీ ఎక్కువవుతున్నారు. బీపీ చెక్ చేయించుకోవాలంటే డాక్టర్ దగ్గరకు లేదా డయాగ్నస్టిక్స్ సెంటర్‌కు వెళ్లాలి. లేకుంటే, సొంతగా బీపీ మెషిన్ కొని ఇంట్లో పెట్టుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు ఈ మెషిన్‌ను వెంట తీసుకుపోవడం కుదిరే పని కాదు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే అమెరికన్ కంపెనీ వైహెచ్ఈ టెక్నాలజీ తాజాగా బీపీ చెకింగ్ స్మార్ట్ వాచీని అందుబాటులోకి తెచ్చింది.మిగిలిన స్మార్ట్‌వాచీల మాదిరిగానే ఇది కూడా రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ వాచీని చేతికి తొడుక్కుంటే, బీపీ ఎంత ఉందో ఎప్పటికప్పుడు నిరంతరాయంగా చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ బీపీ ఆందోళనకరమైన స్థాయిలో ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి తగిన చికిత్స తీసుకునేందుకు దోహదపడుతుంది. బీపీ చెకింగ్‌ను సులభతరం చేసిన ఈ స్మార్ట్‌వాచీ కోసం ఆన్లైన్లో ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. దీని ధర 199 డాలర్లు (రూ.16,564) మాత్రమే!ఇవి చదవండి: నిద్దురలో బాగా గురక కొడ్తున్నారా! అయితే ఈ దిండు.. -
నొప్పి లేకుండా చక్కెర స్థాయి చెబుతుంది..!
డయాబెటిస్ బాధితులు ప్రతినిత్యం చక్కెర స్థాయి తెలుసుకుంటూ ఉండాలి. చక్కెర స్థాయి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడల్లా వేలిని సూదితో గుచ్చి నెత్తుటిచుక్కలు బయటకు తీయాల్సి ఉంటుంది. ఈ నెత్తుటిచుక్కల ద్వారానే ఇప్పుడు అందుబాటులో ఉన్న గ్లూకోమీటర్లు చక్కెర స్థాయిని నిర్ధారించగలుగుతున్నాయి. ఇప్పటి వరకు డయాబెటిస్ బాధితులకు ప్రతిరోజూ ఈ నొప్పి తప్పడంలేదు. ఎలాంటి నొప్పి లేకుండానే, నెత్తుటి చుక్క చిందించకుండానే చక్కెర స్థాయిని కచ్చితంగా చెప్పగలిగే స్మార్ట్‌వాచీని కొరియన్ కంపెనీ ‘సామ్సంగ్’ అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్‌వాచీ మీటల మీద చేతి మధ్యవేలు, ఉంగరంవేలు కొద్ది క్షణాలు అదిమిపెట్టి ఉంచితే చాలు, శరీరంలో చక్కెర స్థాయి ఎంత ఉందో స్క్రీన్ మీద చూపిస్తుంది. ‘సామ్సంగ్’ రూపొందించిన ఈ గెలాక్సీ స్మార్ట్‌వాచ్ చక్కెర స్థాయితో పాటు శరీరంలో కొవ్వు పరిమాణం, కండరాల పరిమాణం వంటి వివరాలను కూడా చెబుతుంది. దీని ధర 81.26 డాలర్లు (సుమారు రూ.6750) మాత్రమే! -
కంపెనీ సీఈవోకు గుండెపోటు.. ప్రాణాలు కాపాడిన స్మార్ట్ వాచ్
ఓ స్మార్ట్ వాచ్ 42 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కాపాడింది. మార్నింగ్ జాగింగ్‌కు వెళ్లిన కంపెనీ సీఈవోకు ఉన్నట్టుండి ఛాతిలోనొప్పి రావడంతో.. స్మార్ట్‌వాచ్ అతన్ని రక్షించింది. స్మార్ట్‌ఫోన్ సాయంతో భార్యకు సమాచారం ఇవ్వగా.. నిమిషాల్లో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. గుండెపోటు నుంచి బయటపడటానికి స్మార్ట్ వాచ్ ఎలా సాయపడిందనే విషయాన్ని ఆయనే స్వయంగా వివరించారు. ఈఘటన బ్రిటన్‌లో జరిగింది. హాకీ వేల్స్ కంపెనీ సీఈవో పాల్ వాపమ్ స్వాన్సీలోని మోరిస్టన్ ప్రాంతంలో నివిసిస్తుంటారు. ఆయనకు రోజూ జాగింగ్‌కు వెళ్లడం అలవాటు. ఓ రోజు ఉదయం 7 గంటలకు ఇంటి సమీపంలోనే జాగింగ్‌కు వెళ్లారు. పరుగెత్తుతుండగా అయిదు నిమిషాలకు అకస్మాత్తుగా అతనికి ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చింది. గుండె బిగుతుగా అనిపించడంతో ఒక్కసారిగా రోడ్డుమీద కుప్పకూలిపోయారు. వెంటనే తన చేతికున్న స్మార్ట్ వాచ్ ద్వారా భార్య లారాకు ఫోన్ చేశాడు. ఆమె అక్కడికి చేరుకొని తన కారులో అతన్ని నిమిషాల వ్యవధిలో ఆసుపత్రికి తీసుకెళ్లింది. చదవండి: బ్రిటన్ ప్రధాని ఇంట.. దీపావళి సంబరాలు డాక్టర్లు సైతం సరైన సమయంలో వైద్యం అదించడంతో సీఈవో ప్రాణాలు నిలిచాయి. అయితే గుండె ధమనుల్లో ఒకటి పూర్తిగా బ్లాక్ అవ్వడం కారణంగా గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అదే ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేసుకొని ఆరు రోజులు తరువాత ఇంటికి చేరుకున్నారు. కాగా ఈ ఘటన తనతోపాటు తన కుటుంబాన్ని షాక్‌కు గురి చేసిందని చెప్పారు. అంతేగాక తనకు ఉబకాయ సమస్యలు ఏం లేవని రోజు ధృడంగా ఉండటానికి ప్రయత్నిస్తానని తెలిపారు. సరైన సమయంలో సాయం చేసిన స్మార్ట్ వాచ్, భార్య, ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కాలంలో ఆపిల్ వాచ్ సిరీస్ 8 వంటి ఎల్టీఈ కనెక్టివిటీ, ఈ-సిమ్‌తో కూడిన స్మార్ట్‌వాచ్‌లలో ఫోన్లు దగ్గరలో లేకునప్పటికీ కాల్ చేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల గతంలో గుండెపోటు లక్షణాలను స్మార్ట్‌వాచ్‌లు ముందుగానే గుర్తించి అప్రమత్తం చేయడంతో పలువురి ప్రాణాలు దక్కిన విషయం తెలిసిందే. స్మార్ట్‌వాచ్‌ల్లో ఉండే హార్ట్‌రేట్, ఈసీజీ వంటి సెన్సర్లు గుండెపోటు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడంలో సాయపడుతున్నాయి. -
ఈ వాచ్ పెట్టుకుంటే నిద్ర సమస్యలు పరార్!
ఇప్పటికే రకరకాల స్మార్ట్‌వాచీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాలా వాచీలు నడక, వ్యాయామం ద్వారా శరీరంలో ఖర్చయ్యే కేలరీలు, రక్తపోటు వంటి సమాచారాన్ని యాప్ ద్వారా ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాయి. దక్షిణ కొరియాకు చెందిన సామ్సంగ్ కంపెనీ నిద్రా సమస్యలను గుర్తించే స్మార్ట్ వాచీని ఇటీవల రూపొందించింది. దీనికి దక్షిణ కొరియా ఆహార, ఔషధ మంత్రిత్వశాఖ ఆమోదం కూడా లభించింది. ‘సామ్సంగ్ గెలాక్సీ వాచ్5’ పేరుతో వచ్చే ఏడాది నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఇది నిద్ర తీరుతెన్నులను నిరంతరం గమనిస్తూ ఉంటుంది. నిద్రలో ఎదురయ్యే గురక, నిద్ర మధ్యలో శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలను గుర్తించి, యాప్ ద్వారా తెలియజేస్తుంది. సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా వెంటనే తగిన చికిత్స పొందడానికి వెసులుబాటు కల్పిస్తుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. (చదవండి: 120 మీటర్ల ఎత్తులో ఉన్న కొండను ఆనుకొని ఓ కొట్టు..ఎక్కడంటే..) -
ఏకే ఫ్లవర్ కాదు ఫైర్ బోల్ట్!
అర్నవ్ కిశోర్‌కు ఆటలు అంటే ప్రాణం. స్పోర్ట్స్‌మెన్, ఫిట్నెస్ ప్రేమికులకు ఉపయోగపడే గాడ్జెట్లను సృష్టించాలనేది తన భవిష్యత్ లక్ష్యంగా ఉండేది. వేరబుల్ టెక్ కంపెనీ ‘ఫైర్–బోల్ట్’తో తన కలను నిజం చేసుకున్నాడు కిశోర్. స్మార్ట్ వేరబుల్ మార్కెట్‌ను తగిన అధ్యయనం చేసిన తరువాత మార్కెట్ వ్యూహాలు రచించుకున్నాడు. అప్పటికే చైనాలోని దిగ్గజ టెక్ కంపెనీలు మన మార్కెట్లోకి వచ్చాయి. వాటితో పోటీ పడడం అంత సులభం ఏమీ కాదు. మంచి టైమ్ రావాలంటే ఆ టైమ్ ఎప్పుడు వస్తుందో ఓపిగ్గా ఎదురుచూడాలి. అర్నవ్ కిశోర్ అదే చేశాడు. సరిౖయెన సమయం చూసి మార్కెట్లోకి దిగి విజయం సాధించాడు. తొలి సంవత్సరం....‘మన టైమ్ వచ్చేసింది’ అనుకున్నాడు. రెండో సంవత్సరం....‘ఈ ఫైర్ ఇలాగే కొనసాగాలి’ అనుకున్నాడు. గత సంవత్సరం ఫైర్–బోల్ట్ నాయిస్ మన దేశంలోనే అతి పెద్ద స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌గా అవతరించింది. ఆన్లైన్లోనే కాదు ఆఫ్‌లైన్ లోనూ సరసమైన ధరల్లో అందుబాటులో ఉండేలా చేయడమే కాదు, ఇన్నోవెటివ్, మార్కెట్–ఫస్ట్ ఫీచర్స్ కూడా కంపెనీ ఉత్పత్తులు విజయం సాధించడానికి ప్రధాన కారణం. కంపెనీ ప్రాడక్ట్ లైన్లోనికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటి) డివైజ్‌లు, వైర్లెస్ ఇయర్ ఫోన్లు...మొదలైనవి వచ్చి చేరాయి. ఇండియన్ మార్కెట్లో విజయం సాధించిన అర్నవ్ అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. వ్యాపారవేత్త అయిన తండ్రి నుంచి కిశోర్ నేర్చుకున్న పాఠం... ‘నిరాశతో ప్రయాణాన్ని ఆపవద్దు. పరుగెత్తక పోయినా సరే, నడిస్తే చాలు. ప్రయాణంలోనే ఎన్నో విషయాలను నేర్చుకుంటాం. మంచి,చెడులను తెలుసుకుంటాం’. నిజానికి ప్రయాణ ప్రారంభంలోనే అర్నవ్ కిశోర్‌కి కోవిడ్ హాయ్ చెప్పి భయపెట్టింది. సంక్షోభ సమయంలో వ్యాపారవేత్త డీలా పడకూడదు. కిశోర్ ఆ సమయంలోనూ అధైర్య పడలేదు. వెనకడుగు వేయలేదు. ‘ట్రెండ్స్ ఆఫ్ బ్యాండ్’ ఏమిటి? ‘పాపులారిటీ కోల్పోయిన బ్యాండ్స్ ఏమిటి?’ అనే అంశంపై అవగాహన ఉన్న కిశోర్ 2021లో కొత్త స్ట్రాటజీతో ముందుకు వచ్చాడు. టెంప్టింగ్ ట్యాగ్‌తో నింజా సిరీస్ స్మార్ట్ వాచ్‌లను తీసుకువచ్చి విజయం సాధించాడు. ‘రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్ అండ్ డీ), డిజైన్ మార్కెట్లో మాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగించాయి’ అంటాడు కిశోర్. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్లు అందుకున్నాడు అర్నవ్ కిశోర్. సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అర్నవ్ కిశోర్ ఇప్పుడు చేయాల్సింది....ఎప్పటిలాగే ఆట తెలివిగా ఆడటం. అతి ఆత్మవిశ్వాసం ఉంటే ఆట తారు మారు అవుతుంది. ఇలాంటి విషయాలు అర్నవ్ కిశోర్‌కు తెలియనివేమీ కాదు. ఎందుకంటే ఈ యువ వ్యాపారవేత్త తండ్రి నుంచి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాడు. టెక్నాలజీ, ఫిట్నెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్పోర్ట్స్...అనేవి అర్నవ్ కిశోర్(ఏకే) కలల ప్రపంచం. వాటిని మిళితం చేసి ‘ఫైర్–బోల్ట్’ స్టార్టప్ సృష్టించాడు. ఇది మన దేశంలోనే అతి పెద్ద వేరబుల్ టెక్ బ్రాండ్‌గా అవతరించింది. అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతుంది. ‘మంచి టైమ్ సెట్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది’ అంటాడు ఏకే... (చదవండి: బీర్ వ్యర్థాలతో..బిస్కెట్లు, చిక్కిలు, లడ్డులా..) -
కొత్త ఐఫోన్ 15 సిరీస్ లాంచ్.. యాపిల్ వాచ్ కూడా - ధరలు ఇలా!
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా ఐఫోన్ 15 మోడళ్ల మొబైళ్లతోపాటు.. 9 సిరీస్ స్మార్ట్ వాచీని విడుదల చేసింది. ఐఫోన్ 15 మోడళ్ల చార్జింగ్కు టైప్ సీ కేబుల్‌ను ప్రవేశపెట్టింది. దీంతో ఇతర యాపిల్ గాడ్జెట్లను సైతం టైప్ సీ ద్వారా చార్జింగ్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 15, 15 ప్లస్ మోడళ్లకు ఏ 16 చిప్‌ను వినియోగించింది. వాచీ మోడళ్లకు రీసైకిల్డ్ మెటీరియల్‌తో రూపొందించిన విభిన్న స్ట్రాప్స్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ మోడళ్ల కేసు తయారీలో టైటానియంను వినియోగించింది. ఏ17 చిప్‌ను వినియోగించింది. తద్వారా అత్యంత వేగవంత, మన్నికైన, తేలికపాటి ఫోన్లను రూపొందించినట్లు యాపిల్ తెలియజేసింది. ఐఫోన్ 15 ధర 799 డాలర్లు, 15 ప్లస్‌కు 899 డాలర్లు చొప్పున నిర్ణయించింది. ఇక ఐఫోన్ 15 ప్రో ధర 999 డాలర్లు కాగా, ప్రో మ్యాక్స్ ధర 1199 డాలర్లుగా ప్రకటించింది. కొత్త ఐఫోన్ మోడళ్లన్నీ 48 ఎంపీ ప్రధాన కెమెరాతో విడుదలయ్యాయి. 6.1, 6.7 అంగుళాల స్క్రీన్ పరిమాణంలో ప్రవేశపెట్టింది. స్టోరేజీ 128 జీబీ, 256 జీబీతో విడుదల చేసింది. -
స్మార్ట్ వాచీ కోసం స్నేహితుడి హత్య
కర్ణాటక: నగరంలోని బెంగేరి వెంకటేష్ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి స్మార్ట్ వాచీ విషయమై స్నేహితులిద్దరి మధ్య ప్రారంభమైన ఘర్షణ హత్యతో అంతమైంది. హతుడు సిద్రామనగర నివాసి అస్లాం మకాందార్ కాగా గాయత్రినగర మంజునాథ్ నిందితుడు. కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడు అస్లాం మకాందార్ నిందితుడు మంజునాథ్ ఇద్దరు మంచి స్నేహితులు. కొద్ది రోజుల క్రితం మంజునాథ్ అస్లాంకు స్మార్ట్ వాచీని ఇచ్చాడు. అయితే అస్లాం సదరు వాచీని తిరిగి ఇవ్వకుండా వేధించాడు. ఈక్రమంలో మధ్య రాత్రి బెంగేరి వెంకటేష్ కాలనీలో ఎగ్‌రైస్ తింటుండగా ఇదే విషయమై ఇద్దరూ ఘర్షణ పడ్డారు. మంజునాథ్ చాకుతో అస్లాం ఛాతీపై పొడిచాడు. దీంతో తీవ్రంగా రక్తస్రావమైన అస్లాంను అతడి స్నేహితులు కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స ఫలించక అతడు మృతి చెందాడు. ఘటనపై కేశ్వాపుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
అద్భుతమైన ఫీచర్లతో బోట్ ‘స్మార్ట్ రింగ్’ లాంచ్.. ధర ఎంతంటే..
ఇప్పటివరకూ స్మార్ట్ వాచీలను ఎక్కువగా చూస్తున్నాం.. ఇప్పుడిప్పుడే చేతి వేళ్లకు ధరించగలిగే 'స్మార్ట్ రింగ్'లు సైతం మార్కెట్లోకి వస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లతో ఇలాంటి స్మార్ట్ రింగ్‌ను ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బోట్ తాజాగా లాంచ్ చేసింది. ఆరోగ్య పర్యవేక్షణ నుంచి సింగిల్ హ్యాండ్ కదలికల ద్వారా చేసే స్మార్ట్ ట్రాకింగ్ యాక్టివిటీ వరకూ పలు రకాల ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ ధరను రూ. 8,999లుగా కంపెనీ ప్రకటించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బోట్ వెబ్సైట్లలో ఆగస్టు 28 మధ్యాహ్నం 12 గంటల తర్వత నుంచి ఈ స్మార్ట్ రింగ్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అందరి వేళ్లకూ సరిపోయేలా ఈ రింగ్ మూడు సైజ్‌లలో వస్తుంది. బోట్ స్మార్ట్ రింగ్ ఫీచర్లు స్టైలిష్, ప్రీమియం, మెటాలిక్ లుక్ స్వైప్ నావిగేషన్‌తో ఇతర డివైజ్‌ల కంట్రోల్ ప్లే/పాజ్ మ్యూజిక్, ట్రాక్ చేంజ్, పిక్చర్ క్లిక్, అప్లికేషన్ల నావిగేట్ హార్ట్ రేటు, బాడీ రికవరీ, శరీర ఉష్ణోగ్రత, స్లీప్ మానిటరింగ్, ఋతుక్రమ ట్రాకర్ సొంత బోట్ రింగ్ యాప్‌కు కనెక్ట్ స్టెప్ కౌంట్, కరిగిన కేలరీలు, ప్రయాణించిన దూరం వంటి స్మార్ట్ యాక్టివిటీ ట్రాకింగ్ అత్యవసర పరిస్థితుల్లో ఇతరులను అప్రమత్తం చేసే ఎస్‌వోఎస్ ఫీచర్ 5 ఏటీఎం వరకు వాటర్ రెసిస్టెన్స్ -
వైరస్‌లను గుర్తించే స్మార్ట్ వాచ్
‘కోవిడ్’ మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వైరస్ పేరు చెబితేనే జనాలకు వెన్నులో వణుకు మొదలయ్యే పరిస్థితి దాపురించింది. వైరస్ల నిర్మూలన కోసం శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం కూడా చేశారు. ‘కోవిడ్’ తర్వాత వైరస్ల ఆచూకీని కనిపెట్టే సాంకేతికత కూడా అభివృద్ధి చెందింది. తాజాగా వైరస్ల జాడ గుర్తించగలిగే ‘విక్లోన్’ అనే ఈ స్మార్ట్‌వాచ్ అందుబాటులోకి వచ్చింది. టైమ్ చూపించడం సహా మిగిలిన పనులన్నీ ఇది ఇతర స్మార్ట్‌వాచీల మాదిరిగానే చేయడమే కాకుండా, చుట్టుపక్కల గాలిలో వైరస్లు ఉంటే, వెంటనే అప్రమత్తం చేస్తుంది. గాలిలోని సూక్ష్మకణాలను ఇది లోపలికి పీల్చుకుంటుంది. ఇందులో అమర్చిన అధునాతన సాంకేతికత ద్వారా ప్రమాదకరమైన బ్యాక్టీరియా కణాలు, వైరస్ కణాలు ఉన్నట్లయితే, వాటిని వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘డిజైనర్ డాట్’ వైరస్‌ను గుర్తించే ఈ స్మార్ట్‌వాచీని ‘విక్లోన్’ పేరుతో రూపొందించింది. -
మార్కెట్లో కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్ - ధర చాలా తక్కువ!
దేశీయ మార్కెట్లో పెబల్ కంపెనీ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ విడుదలైంది. పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో (Pebble Cosmos Bold Pro) పేరుతో విడుదలైన ఈ వాచ్ ధర రూ. 2,799. ఇది ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, పెబల్ అధికారిక వెబ్సైట్లో విక్రయానికి ఉంది. ఈ లేటెస్ట్ వాచ్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మార్కెట్లో విడుదలైన కొత్త 'పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో' వాచ్ నాలుగు కలర్ ఆప్షన్లలో ఉంటుంది. అవి బ్లాక్, గోల్డ్, మెటల్ బ్లాక్, సిల్వర్ కలర్స్. మెటల్ బాడీ కలిగిన ఈ వాచ్ 1.39 ఇంచెస్ TFT డిస్ప్లేతో లభిస్తుంది. ఇందులో హార్ట్ మానిటర్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. అంతే కాకుండా బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ కొలిచే ఎస్పీఓ2 సెన్సార్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. (ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న హ్యుందాయ్ క్రెటా ఈవీ.. లాంచ్ ఎప్పుడంటే?) బ్లూటూత్ 5.0 వెర్షన్ కనెక్టివిటీ కలిగి ఉండటం వల్ల ఇది కాలింగ్ ఫీచర్ కూడా పొందుతుంది. బ్లూటూత్ ద్వారా మొబైల్ కి కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ స్వీకరించవచ్చు, రిజెక్ట్ చేయవచ్చు. నోటిఫికేషన్లను కూడా వాచ్ ద్వారానే తీసుకోవచ్చు. మ్యూజిక్ ప్లేబ్యాక్, కెమెరా వంటి వాటిని కూడా వాచ్ ద్వారానే కంట్రోల్ చేయవచ్చు. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో స్మార్ట్ వాచ్ ఒక ఫుల్ ఛార్జ్ ద్వారా సాధారణంగా వారం (7 రోజులు) రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఎక్కువ ఉపయోగించినప్పుడు బ్యాటరీ లైఫ్ ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ స్మార్ట్ వాచ్ ఆధునిక కాలంలో వినియోగించడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. -
ఛార్జింగ్ అవసరం లేని స్మార్ట్‌వాచ్.. ఇంకెలా పనిచేస్తుందంటే?
ఈ ఫొటోలో చేతికి తొడుక్కున్న వాచీ చూస్తున్నారు కదా! ఇది స్మార్ట్ వాచీ. మిగిలిన స్మార్ట్ వాచీల మాదిరిగా దీని బ్యాటరీకి చార్జింగ్ అవసరం లేదు. ఇది పూర్తిగా సోలార్ స్మార్ట్ వాచ్. ఎండలో కాసేపు తిరిగితే చాలు, ఇందులోని బ్యాటరీ చార్జ్ అవుతుంది. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ‘గ్రామిన్ ఇంటర్నేషనల్’ ఇటీవల ఈ పూర్తిస్థాయి సోలార్ స్మార్ట్ వాచ్‌ను ‘ఇన్స్టింక్ట్–2’ పేరుతో విడుదల చేసింది. దీనికి అమర్చిన లెన్స్ ద్వారా ఇందులోని బ్యాటరీ చార్జ్ అవుతుంది. రోజుకు మూడుగంటల సేపు ఎండసోకితే, ఈ వాచ్ ఇరవైనాలుగు గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఎండసోకని పరిస్థితులు రోజుల తరబడి ఉంటే, యూఎస్బీ చార్జర్ ద్వారా కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఈ వాచ్‌లో ఫ్లాష్‌లైట్ కూడా ఉండటం విశేషం. ఆరుబయట పిక్నిక్లు, ట్రెక్కింగ్‌లకు వెళ్లే వారికి ఈ వాచ్ పూర్తి అనుకూలంగా ఉంటుందని ‘గ్రామిన్ ఇంటర్నేషనల్’ వైస్ ప్రెసిడెంట్ డాన్ బార్టెల్ చెబుతున్నారు. దీని మోడల్స్‌లో వైవిధ్యాన్ని బట్టి దీని ధర 389.99 డాలర్ల (రూ.32,027) నుంచి 469.99 డాలర్ల (38,597) వరకు ఉంది. -
కేవలం రూ. 2499కే స్మార్ట్‌వాచ్: లేటెస్ట్ డిజైన్ & అంతకు మించిన ఫీచర్స్
దేశీయ మార్కెట్లో ప్రతి రోజు ఏదో ఒక మూలన ఏదో ఒక కొత్త ఉత్పత్తి విడుదలవుతూనే ఉంది. ఇందులో భాగంగానే దేశీయ కంపెనీ 'బోల్ట్ ఆడియో' (Boult Audio) ఒక కొత్త స్మార్ట్‌వాచ్ విడుదల చేసింది. ఇది ఆకర్షణీయమైన డిస్ప్లే కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు. బోల్ట్ ఆడియో విడుదల చేసిన కొత్త స్మార్ట్‌వాచ్ పేరు 'బోల్ట్ రోవర్ ప్రో' (Boult Rover Pro). దీని ధర కేవలం రూ. 2,499 మాత్రమే. ఇది ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులకు ఈ వాచ్‌తో పాటు అదనంగా రెండు డిటాచబుల్ స్ట్రాప్స్ కూడా లభిస్తాయి. కొత్త బోల్ట్ రోవర్ ప్రో వాచ్ 1.43 ఇంచెస్ సూపర్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే కలిగి 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 446x446 పిక్సెల్స్ రెజల్యూషన్ పొందుతుంది. అంతే కాకుండా బ్లూటూత్ 5.2 వెర్షన్ కలిగి ఉండటం వల్ల కాలింగ్ ఫీచర్ ఇందులో లభిస్తుంది. తద్వారా మొబైల్‌కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. అంతే కాకుండా డయల్ ప్యాడ్, సింక్ కాంటాక్ట్ ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి. ప్రస్తుతం స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేసే చాలామంది హెల్త్ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న వాచ్‌లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కావున బోల్ట్ రోవర్ ప్రోలో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ సాచురేషన్ ఎస్పీవో2 ట్రాకర్, స్లీప్ మానిటరింగ్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు వందకుపైగా స్పోర్ట్స్ మోడ్లకు సపోర్ట్ చేస్తుంది. (ఇదీ చదవండి: సి3 కొత్త వేరియంట్ లాంచ్ చేసిన సిట్రోయెన్ - ధర ఎంతంటే?) బోల్ట్ రోవర్ ప్రో స్మార్ట్‌వాచ్ ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 7 రోజుల వరకు పనిచేస్తుంది. దీనిని కేవలం 10 నిముషాల ఛార్జ్‌తో 2 రోజులు ఉపయోగించుకోవచ్చు. చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది. ఇది వాయిస్ అసిస్టెంట్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్ పొందుతుంది. మొత్తం మీద ఆధునిక కాలంలో వినియోగించడానికి ఈ వాచ్ ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంది. -
మార్కెట్లో కొత్త నాయిస్ స్మార్ట్‌వాచ్ లాంచ్: ధర తక్కువ & బోలెడన్ని ఫీచర్స్..
ఆధునిక ప్రపంచంలో లేటెస్ట్ ఉత్పత్తుల వాడకం విపరీతంగా పెరుగుతోంది. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో మరో కొత్త స్మార్ట్‌వాచ్ విడుదలైంది. నాయిస్ కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త వాచ్ ధర, ఫీచర్స్, ఇతర వివరాలను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు. కలర్‌ఫిట్ ఐకాన్ లైనప్‌లో విడుదలైన కొత్త ఐకాన్ 3 ధర కేవలం రూ.1,999 మాత్రమే. దీనిని ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లేదా నాయిస్ అఫీషియల్ వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు. ఇది జెట్ బ్లాక్, మిడ్ నైట్ గోల్డ్, స్పేస్ బ్లూ, మ్యాట్ గోల్డ్, కామ్ బ్లూ, రోజ్ మయూవే అనే ఆరు కలర్ ఆప్షన్లతో లభిస్తుంది. నాయిస్ ఐకాన్ 3 స్మార్ట్‌వాచ్ 1.91 ఇంచెస్ TFT స్క్వేర్ డిస్ప్లే కలిగి సన్నని బెజిల్స్ పొందుతుంది. ఇది సిలికాన్ స్ట్రాప్, మెటల్ బాడీ కలిగి స్క్రీన్ పాస్ కోడ్ ఫీచర్‌తో లభిస్తుంది. అంతే కాకుండా హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ట్రాకింగ్ కోసం ఎస్పీఓ2 సెన్సార్, బ్రీత్ ప్రాక్టీస్ లాంటి హెల్త్ ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి. (ఇదీ చదవండి: Suguna Foods: 5 వేలతో ప్రారంభమై అందరిని ఆశ్చర్యపరిచిన వ్యాపారం, ఇది!) మొబైల్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకున్న సమయంలో ఈ వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు, నోటిఫికేషన్స్ కూడా పొందవచ్చు. సుమారు పది వరకు కాంటాక్టులను కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ వాచ్ ఒక ఫుల్ ఛార్జ్‌తో 7 రోజుల వరకు పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్లో నాయిస్ఫిట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ వాచ్‌కి కనెక్ట్ చేసుకుని ఫిట్నెస్, వర్కౌట్ వివరాలను చూడడం, సెట్టింగ్‌లను మార్చుకోవడం వంటివి కూడా ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు. -
ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!
ఇటీవల స్మార్ట్ వాచ్‌ల వాడకం పెరిగింది. ముఖ్యంగా నడక, ఇతర వ్యాయామ సమయాల్లో వీటిని బాగా ఉపయోగిస్తున్నారు. శరీరానికి సంబంధించిన రక్త ప్రసరణ, హృదయ స్పందన, ఆక్సిజన్ స్థాయిలు వంటి సమాచారాన్ని అందించేలా రూపొందిన ఈ స్మార్ట్ వాచ్‌లు ఆరోగ్య రక్షణలో ఉపయోగపడుతున్నాయి. ఇదీ చదవండి: కస్టమర్‌కు షాకిచ్చిన ఉబర్.. 21 కిలోమీటర్ల రైడ్‌కి రూ.1,500 బిల్లు శరీరంలో అనారోగ్య లక్షణాలను గుర్తించి వెంటనే అలెర్ట్ చేసి యాపిల్ స్మార్ట్ వాచ్‌లు యూజర్ల ప్రాణాలు కాపాడాయంటూ పలు కథనాలు వెల్లడయ్యాయి. తాజాగా క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన ఒక వ్యక్తి రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుముఖం పట్టడాన్ని గుర్తించి యాపిల్ వాచ్ ప్రాణాలు కాపాడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. న్యూస్ 5 క్లీవ్‌ల్యాండ్ కథనం ప్రకారం.. క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన కెన్ కౌనిహన్‌కు ఓ రోజు తన శ్వాస వేగం పెరిగిందని యాపిల్ స్మార్ట్ వాచ్ వెంటనే అలర్ట్ చేసింది. దీంతో ఇదేదో చిన్నపాటి జబ్బు అని భావించి ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత కుటుంబ సభ్యుల సూచన మేరకు ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించారు. డాక్టర్లు కౌనిహన్‌కు ఎక్స్ రే తీసి మందులు ఇచ్చి పంపించారు. ఇదీ చదవండి: Byju’s: మాస్టారు మామూలోడు కాదు.. సీక్రెట్ బయటపెట్టిన బైజూస్ రవీంద్రన్! అయితే ఆ తర్వాత కూడా యాపిల్ వాచ్ అలాగే అలర్ట్ ఇవ్వడంతో మరోసారి వైద్యులను సంప్రదించగా ఈ సారి డాక్టర్లు స్కానింగ్‌లు చేసి ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. దీన్ని నిర్లక్ష్యం చేసి ఉంటే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేదని వైద్యులు చెప్పినట్లుగా కౌనిహన్ తెలిపారు. ఆ రకంగా యాపిల్ వాచ్ తన ప్రాణాలను కాపాడిందని పేర్కొన్నారు. -
Fire-Boltt Smartwatch: అదిరిపోయే ఫీచర్స్‌తో రేపటి నుంచి సేల్.. ధర ఎంతంటే?
భారతదేశంలో టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో యువత కూడా ఆధునిక పరికరాలను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఫైర్ బోల్ట్ టర్మినేటర్ స్మార్ట్‌వాచ్ తీసుకువచ్చింది. ఇది మునుపటి మోడల్స్ కంటే పెద్ద సైజ్ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్స్ వంటి వాటిని పొందుతుంది. ఫైర్ బోల్ట్ టర్మినేటర్ స్మార్ట్‌వాచ్ మార్చి 06 నుంచి (రేపటి నుంచి) విక్రయానికి రానున్నట్లు సమాచారం. మొదటి సేల్స్ రూ. 1999 స్పెషల్ ప్రైస్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్ బ్లాక్, బ్లూ, డార్క్ గ్రే, సిల్వర్ గ్రీన్, గోల్డ్ పింక్, సిల్వర్ గ్రే అనే మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. (ఇదీ చదవండ: నిజం నిరూపించిన మహీంద్రా.. వాటర్ లీక్ వీడియోకి గట్టి రిప్లే) ఫైర్ బోల్ట్ టర్మినేటర్ వాచ్ 1.99 ఇంచెస్ స్క్వేర్ షేప్డ్ డిస్ప్లేతో వస్తుంది. అంతే కాకుండా ఇది బ్లూటూత్ కాలింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. దీని కోసం ఈ వాచ్‌లో స్పీకర్, మైక్ వంటివి ఉన్నాయి. మొబైల్‌కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు వాచ్ నుంచే కాల్స్ మాట్లాడవచ్చు. డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీ వంటి వాటిని కూడా సింక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. లేటెస్ట్ ఫైర్ బోల్ట్ టర్మినేటర్ స్మార్ట్‌వాచ్ హార్ట్ రేట్ ట్రాకింగ్, ఎస్పీఓ2 మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, బ్రీత్ ట్రైనింగ్ హెల్త్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇది 120కి పైగా స్పోర్ట్స్ మోడ్లకు సపోర్ట్ చేస్తుంది, ఫోన్‌కి కనెక్ట్ చేసుకున్నప్పుడు మ్యూజిక్, కెమెరాను కంట్రోల్ చేయవచ్చు. నోటిఫికేషన్లను కూడా వాచ్లోనే పొందవచ్చు. -
అదిరిపోయే ఫీచర్లతో.. వారి కోసం ప్రత్యేక స్మార్ట్ వాచ్!
అంధుల కోసం ఓ ప్రత్యేక స్మార్ట్ వాచ్(Smart Watch)ను తయారు చేశారు. దృష్టిలోపం ఉన్నవారి కోసం ఆధునిక టెక్నాలజీతో ఓ స్మార్ట్ వాచ్‌ను కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. వీటిని పెద్ద మొత్తంలో తయారీతో పాటు విక్రయించేందుకు యాంబ్రేన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఐఐటీ కాన్పూర్ జతకట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్‌లలో లోపాలను సరిచేసి యూజర్లకు మెరుగైన అనుభూతిని ఇచ్చేందుకు హాప్టిక్ వాచ్‌ను రూపొందించినట్లు ఐఐటీ కాన్పూర్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో టాక్టిల్, టాకింగ్, వైబ్రేషన్, బ్రెయిలీ ఆధారిత వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో అనేక లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను అధిగమిస్తూ ఈ స్మార్ట్ వాచ్ రాబోతోంది. యాంబ్రేన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి త్వరలో ఈ స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేయనున్నట్లు ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అభయ్ కరందికర్ తెలిపారు. ఇందులో ఏ ఫీచర్లు ఉన్నాయంటే! ఈ హాప్టిక్ స్మార్ట్ వాచ్ రెండు వేరియంట్లలో రానుంది. ఇందులో డయల్ఫ్రీ ఆప్షన్‌తోపాటు 12 టచ్-సెన్సిటివ్ హవర్ మార్కర్స్ ఉంటాయి. వాచ్‌ను ధరించిన వారు ఈ మార్కర్స్పై ఫింగర్‌ను స్కాన్ చేయడం ద్వారా టైమ్ తెలుసుకోవచ్చు. ఈ వాచ్.. టాక్టిల్, వైబ్రేషన్ వాచ్‌ల సమ్మిళతంగా ఉంటుంది. అయితే వైబ్రేషన్ వాచ్‌లలో 20పైగా ఉండే వైబ్రేషన్ పల్సెస్‌ను ఈ వాచ్‌లో 2 పల్సెస్‌కు తగ్గించారు. టాక్టిల్ వాచ్‌కు ఉండే సులువుగా విరిగిపోయే స్వభావం ఇందులో ఉండదు. వీటితోపాటు హార్ట్ రేట్, స్టెప్ కౌంట్, హైడ్రేషన్ రిమైండర్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అంధుల కోసం ప్రస్తుతం ఉన్న స్మార్ట్ వాచ్‌లు ఆడియో ఆధారిత అవుట్‌పుట్‌తో పనిచేసేవి కావడం వల్ల వాటిని ధరించిన వారి ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉంది. ఈ ఇబ్బంది లేకుండా ఐఐటీ కాన్పూర్ ఈ హాప్టిక్ స్మార్ట్‌వాచ్‌ను రూపొందించింది. చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మార్పులు రానున్నాయ్, నిమిషానికి 2 లక్షల టికెట్లు! -
‘పోయే ప్రాణం తిరిగొచ్చింది’, మహిళ ప్రాణాల్ని కాపాడిన స్మార్ట్ వాచ్!
లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి యూజర్ల ప్రాణాల్ని కాపాడేలా ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కొత్త కొత్త డివైజ్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్రాష్ డిటెక్షన్ అలెర్ట్, శాటిలైట్ సాయంతో అత్యవసర సేవల్ని అందిస్తుండగా..ఐఫోన్, యాపిల్ వాచ్‌లలో ఎమర్జెన్సీ, హెల్త్ ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫీచర్లు అందుబాటులో ఉన్న డివైజ్‌లు వినియోగించే యూజర్లు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వారిని అప్రమత్తం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కాపాడుతుంది. తాజాగా యాపిల్ వాచ్‌లోని ఈసీజీ ఫీచర్‌తో ఓ మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది. మహిళలో గుర్తించని హార్ట్ బ్లాకేజ్‌ను యాపిల్ వాచ్‌లోని ఈసీజీ ఫీచర్ కనుగొని అలర్ట్ చేయడంతో ఆమె ప్రాణాల్ని కాపాడుకోగలిగింది. చదవండి👉 వావ్..కంగ్రాట్స్ మేడమ్.. మీరు గర్భవతి అయ్యారు!! యూకేలోని గేట్ హెడ్‌కు చెందిన ఎలిన్ థామ్సన్‌కు ఆమె ధరించిన యాపిల్ వాచ్ నుంచి ఓ అలెర్ట్ వచ్చింది. మీ గుండె పనితీరు సరిగ్గా లేదని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఎలిన్ థామ్స్‌న్ దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి జరిగిన విషయం చెప్పింది. ఎలిన్ థామ్సన్ మాటలు విన్న డాక్టర్ ఆమెకు ఓ హార్ట్ మానిటర్‌ను అమర్చారు. దాని సాయంతో మహిళ హృదయ స్పందనలు ఎలా ఉన్నాయో తెలిసేలా హార్ట్ మానిటర్లో రికార్డ్ ఆప్షన్ సెట్ చేశారు. వారం రోజుల తర్వాత తిరిగి ఆస్పత్రికి రావాలని సూచించారు. అప్రమత్తం చేసిన యాపిల్ వాచ్ హార్ట్ మానిటర్‌తో ఇంటికి వెళ్లిన ఎలిన్‌కు ఓ రోజు ఉదయాన్ని నిద్ర లేచిన వెంటనే యాపిల్ రెడ్ అలెర్ట్ ఇచ్చింది. మరో రోజు రాత్రి సమయంలో ఎలిన్ నిద్రలో ఉండగా.. 19 సెకండ్ల పాటు గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లు హార్ట్ మానిటర్ ఆస్పత్రికి హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తమైన వైద్యులు థాంప్సన్ వైద్య పరీక్షలు చేశారు. ఈ వైద్య పరీక్షల్లో ఆమె గుండెలో అడ్డంకులు ఏర్పడినట్లు తేలింది. బాధితురాల్ని ప్రాణాల్ని కాపాడేందుకు గుండెకు ఫేస్మేకర్(బ్యాటరీతో నడిచే అతి చిన్న డివైజ్)ను అమర్చారు. యాపిల్ వాచ్ నా ప్రాణం కాపాడింది యాపిల్ వాచ్ తన ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తం చేసింది. కాబట్టే నా ప్రాణాల్ని కాపాడుకోగలిగాను’ అని అన్నారు. వాచ్ లేకపోతే అలర్ట్ వచ్చేది కాదు. నేను ఆస్పత్రికి వెళ్లేదాన్ని కాను. అందుకే ఎల్లప్పుడు వాచ్ ధరిస్తున్నా. యాపిల్ వాచ్ అలర్ట్ చేయకుంటే తాను ప్రాణాలతో ఉండేదాన్ని కాదనే ఆలోచన భయపెడుతున్నదని ఎలిన్ గుర్తుచేసుకున్నారు. 2018లో 2018లో నేను మూర్ఛపోయాను. మూర్ఛపోవడంతో బ్రెయిన్ సంబంధిత సమస్యలు తలెత్తాయి. నా కుతురి సలహాతో అప్పటి నుంచి యాపిల్ వాచ్ ధరించి ఆరోగ్యాన్ని ప్రాణాల్ని కాపాడుకోగలుగుతున్నట్లు తెలిపారు. చదవండి👉 మీకు హార్ట్ ఎటాక్ వచ్చింది చూసుకోండి! -
కళ్లు చెదిరేలా న్యూ ఇయర్ సేల్, స్మార్ట్ ఫోన్ కొంటే.. స్మార్ట్ వాచ్ ఫ్రీ!
హైదరాబాద్: టాటా గ్రూప్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ కంపెనీ ‘క్రోమా’ క్రిస్మస్, కొత్త ఏడాది సందర్భంగా ఆఫర్లు ప్రకటించింది. గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాలపై డీల్స్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ప్రారంభ ధర రూ.12,999తో 5జీ స్మార్ట్ ఫోన్ పొందవచ్చు. దీనికి అదనంగా రూ.4,999 విలువైన స్మార్ట్‌వాచ్‌ను(బ్రాండ్లను బట్టి) ఉచితంగా అందిస్తుంది. పార్టీ స్పీకర్లను రూ.2199 ప్రారంభ ధరతో అందిస్తుంది. సౌండ్బార్లపై 80% వరకు తగ్గింపు లభిస్తుంది. అన్ని క్రోమా స్టోర్లు, క్రోమా ఆన్లైన్ పోర్టల్ కొనుగోలుపై ఈ ఆఫర్లు పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్లు జనవరి రెండో తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. -
మైండ్‌బ్లోయింగ్ ఆఫర్.. రూ.27వేల స్మార్ట్‌వాచ్..కేవలం రూ. 3 వేలకే
క్రిస్మస్, న్యూయర్కు వెల్ కమ్ చెబుతూ పలు దిగ్గజ ఈకామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్ నిర్వహిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఈ తరుణంలో సౌత్ కొరియా దిగ్గజం శాంసంగ్ ఆయా ఫోన్లను భారీ డిస్కౌంట్లకే కొనుగోలు దారులు దక్కించుకోవచ్చని తెలిపింది. ముఖ్యంగా ఫోల్డబుల్ ఫ్లాగ్ షిప్ డివైజ్‌లపై శాంసంగ్ ఆఫర్లు పెట్టింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 ఫోన్ ధర రూ.1,54,999 ఉండగా రూ.8,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్, రూ. 8,000 అప్‌గ్రేడ్ బోనస్‌తో రూ.1,46,999కే కొనుగోలు చేయొచ్చు. అదనంగా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4ని కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 34,999 విలువైన గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ బీటీ 46ఎంఎంపై రూ. 2,999 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి అన్ని ఉత్పత్తులపై అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్‌ను సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా, రూ. 89,999 గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4పై రూ. 7వేల బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా రూ. 7వేల అప్‌గ్రేడ్ బోనస్‌తో సహా రూ. 82,999 కే కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్లు ప్రముఖ ఈ కామర్స్ సైట్లతో పాటు అన్నీ రిటైల్ స్టోర్లలో లభిస్తాయని శాంసంగ్ ప్రతినిధులు వెల్లడించారు. వీటితో పాటు రూ.1,09,999 ఖరీదైన గెలాక్సీ ఎస్ 22 ఆల్ట్రా పై రూ. 5వేల బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా రూ. 7వేల అప్‌గ్రేడ్ బోనస్‌తో రూ. 1,02,999కి కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ ఎస్ 22 ఆల్ట్రాని కొనుగోలు చేసే కస్టమర్లు రూ.26,999 విలువైన స్మార్ట్ వాచ్ గెలాక్సీ వాచ్ 4 బీటీ 44ఎంఎంను కేవలం రూ.2,999కే పొందవచ్చు. రూ. 72,999 ధర కలిగిన గెలాక్సీ ఎస్22ని రూ. 54,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయొచ్చు. గెలాక్సీ బడ్స్2ని కేవలం రూ. 2,999కే పొందవచ్చు. రూ.84,999 ధర కలిగిన గెలాక్సీ ఎస్ 22 ప్లస్ రూ. 59,999కే అందుబాటులో ఉంటుంది. ఇందులో రూ. 15,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా రూ. 13,000 అప్‌గ్రేడ్ బోనస్, అలాగే రూ. 10,000 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్‌లు ఉన్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 20,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ని పొందవచ్చు. రూ.26,999 విలువైన గెలాక్సీ వాచ్4 బీటీ 44 ఎంఎం స్మార్ట్ వాచ్‌ను రూ. 2,999కే పొందవచ్చు. ఇక, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ధర రూ . 84,999 ఉండగా.. ప్రత్యేక సేల్‌లో రూ. 59,999కి అందుబాటులో ఉంటుంది. ఇందులో రూ. 15వేలు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్, రూ. 10,000 అప్‌గ్రేడ్ బోనస్ ఉన్నాయి.గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈని రూ . 39,999 నుండి కొనుగోలు చేయొచ్చు. ఇందులో రూ. 3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్, రూ. 7,000 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్, రూ. 10,000 అప్‌గ్రేడ్ బోనస్ ఉన్నాయి. గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఈ రూ. 5,000 క్యాష్‌బ్యాక్, రూ. 3,000 అప్‌గ్రేడ్ బోనస్‌తో సహా రూ. 32,999 నుండి అందుబాటులో ఉంటుంది. -
బిగ్’సి’ దీపావళి డబుల్ ధమాకా ఆఫర్
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైలర్ బిగ్ ‘సి’ దీపావళి పండుగ సందర్భంగా కస్టమర్లకు ‘‘డబుల్ ధమాకా ఆఫర్’’ ఆఫర్లను ప్రకటించింది. ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.1,999 విలువైన ఇయర్ బడ్స్‌ను కేవలం రూ.199లకే లేదా రూ.3,999 విలువైన గిగ్మోర్ కాలింగ్ స్మార్ట్ వాచ్‌ను కేవలం రూ.999లకే అందించనుంది. ప్రతిస్మార్ట్ ఫోన్‌పై రూ.7900 వరకు తక్షణ డిస్కౌంట్ కూడా ఇస్తుంది. ప్రతి ల్యాప్‌ట్యాప్ కొనుగోలుపై రూ.3వేల తక్షణ డిస్కౌంట్‌తో పాటు ల్యాప్‌టాప్ బ్యాగ్ ఉచితంగా ఇస్తుంది. ఏటీఎం కార్డుపై ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండానే మొబైల్, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే ఆకర్షణీయమైన సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. బిగ్ సి అందిస్తున్న ఈ దీపావళీ పండుగ ఆఫర్లను కస్టమర్లు అందరూ వినియోగించుకోవాలని కంపెనీ సీఎండీ బాలు చౌదరి తెలిపారు.