![Ambrane Fitshot Zest Smartwatch With Voice Calling Feature Launched In India - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/10/ambrane.jpg.webp?itok=1wqiZ08u)
స్వదేశీ మొబైల్ యాక్సెసరీ బ్రాండ్ అంబ్రేన్ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. తాజాగా అంబ్రేన్ తన కొత్త ‘ఫిట్‌షాట్' సిరీస్‌లో మొదటి స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో భాగంగా ఫిట్‌షాట్ జెస్ట్ స్మార్ట్‌వాచ్‌ను అంబ్రేన్ లాంచ్ చేసింది.
ధర ఎంతంటే..?
అంబ్రేన్ ఫిట్‌షాట్ జెస్ట్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 4,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, బ్లూ, పింక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌వాచ్ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. అంబ్రేన్ ఫిట్‌షాట్ జెస్ట్ స్మార్ట్‌వాచ్‌పై ఒక సంవత్సరం పాటు వారంటీతో రానుంది. ఈ స్మార్ట్‌వాచ్ 10 స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. దీన్ని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, ఒక వారం వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని అంబ్రేన్ పేర్కొంది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే నాటికి మరో రెండు స్మార్ట్‌వాచ్‌లను కూడా విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది.
అంబ్రేన్ ఫిట్‌షాట్ జెస్ట్ స్మార్ట్‌వాచ్ ఫీచర్స్
- 1.7 అంగుళాల డిస్‌ప్లే
- 24x7 రియల్ టైమ్ హెల్త్ ట్రాకింగ్
- Spo2, రక్తపోటు, నిద్ర, హృదయ స్పందన రేట్ మానిటరింగ్.
- IP67- రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్
- వాయిస్- అసిస్టెన్స్ ఫీచర్
- బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్
చదవండి: ఈ స్మార్ట్‌వాచ్‌కు అసలు ఛార్జింగ్ అవసరం లేదు..! ధర ఎంతంటే..?
Comments
Please login to add a commentAdd a comment