Ambrane
-
ఆంబ్రేన్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్.. అదిరిపోయే ఫీచర్స్ ఇవే!
ప్రస్తుతం మార్కెట్లోకి రకరకాల స్మార్ట్ వాచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వాచ్‌లలో రకరకాల ఫీచర్స్‌ను జోడిస్తూ ముందుకు వస్తున్నాయి కంపెనీలు. ఇక స్మార్ట్‌ఫోన్ యాక్సెసరీ బ్రాండ్ ఆంబ్రేన్ "ఫిట్‌షాట్ సర్జ్" పేరుతో సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,999గా నిర్ణయించింది. ఈ వాచ్ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ వాచ్ ఒక సంవత్సరం పాటు వారంటీతో వస్తుంది. ఫిట్‌షాట్ సర్జ్'ను ప్రీమియం రస్ట్ ప్రూఫ్ జింక్ అల్లాయ్ బాడీ, తేలికపాటి డిజైన్'తో తయారు చేశారు. ఇందులో ఐపీ68 రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ రోజ్ పింక్. జేడ్ బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంది. ఆంబ్రేన్ ఫిట్‌షాట్ సర్జ్ స్మార్ట్‌వాచ్ 1.28 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ 24×7 రియల్ టైమ్ హెల్త్ ట్రాకింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ సహాయంతో Spo2, రక్తపోటు, క్యాలరీలు, స్లీప్, పెడోమీటర్, బ్రీత్ ట్రైనింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి పారామీటర్లను చూసుకోవచ్చు. స్టెప్ ట్రాకర్ కూడా ఉంటుంది. ఎన్ని కాలరీలను ఖర్చు చేశామనే వివరాలు ఇందులో తెలుస్తుంది. స్మార్ట్ నోటిఫికేషన్లు, 8 ట్రైనింగ్ మోడ్లు, టైమర్, అలారం, స్టాప్‌వాచ్, వాతావరణం, సెడెంటరీ రిమైండర్ వంటి మరెన్నో ఇతర ఫీచర్స్ ఉన్నాయి. ఫిజికల్ యాక్టివిటీ హిస్టరీని రికార్డు చేయవచ్చు. యూజర్లు వారి స్మార్ట్‌ఫోన్‌లో అంబ్రేన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు హెల్త్ హిస్టరీని ట్రాక్చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ వాయిస్- అసిస్టెన్స్ ఫీచర్‌తో వస్తుంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. బ్లూటూత్ ద్వారా ఫోన్‌ను కనెక్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. 7 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుంది. (చదవండి: దేశంలో తగ్గని స్టార్టప్ కంపెనీల జోరు..!) -
అదిరిపోయిన అంబ్రేన్ 'ఫిట్‌షాట్ స్పియర్' స్మార్ట్‌వాచ్..!
భారతీయ స్మార్ట్‌ఫోన్ యాక్సెసరీ బ్రాండ్ అంబ్రేన్ తన సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. తాజాగా అంబ్రేన్ తన కొత్త ‘ఫిట్‌షాట్' సిరీస్‌లో స్పియర్ స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది. ఫిట్‌షాట్ స్పియర్ పేరుతో దీన్ని రూ.4,999 ధర వద్ద విడుదల చేసింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్'లో ఈ బడ్జెట్ స్మార్ట్‌వాచ్ అమ్మకాలకు రానుంది. ఇది ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది. ఆంబ్రేన్ ఫిట్‌షాట్ జెస్ట్ స్మార్ట్‌వాచ్ 1.28 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ 24x7 రియల్ టైమ్ హెల్త్ ట్రాకింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ సహాయంతో Spo2, రక్తపోటు, నిద్ర, హృదయ స్పందన రేటు వంటి పారామీటర్లను కొలవొచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ స్టెప్ ట్రాకర్‌కు కూడా మద్దతిస్తుంది. ఎన్ని కాలరీలను ఖర్చు చేశామనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మరోవైపు, ఈ స్మార్ట్‌వాచ్ సహాయంతో ఫిజికల్ యాక్టివిటీ హిస్టరీని రికార్డ్ చేయవచ్చు. 270 mAh బ్యాటరీ ఇందులో ఉంది. ఈ వాచ్ ఐపీ67- రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. తద్వారా, ఈ స్మార్ట్‌వాచ్ నీటిలో తడిచినా పాడవ్వదు. మరోవైపు, ఈ స్మార్ట్‌వాచ్ 47కి పైగా క్లౌడ్ -ఆధారిత వాచ్ ఫేస్‌లకు మద్దతిస్తుంది. యూజర్లు వారి స్మార్ట్‌ఫోన్‌లో అంబ్రేన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు హెల్త్ హిస్టరీని ట్రాక్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ వాయిస్- అసిస్టెన్స్ ఫీచర్‌తో వస్తుంది. మరోవైపు, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌కు మద్దతిస్తుంది. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయ్యేందుకు అనుమతిస్తుంది. (చదవండి: ఈ యాప్ వాడుతున్న వారికి ఆర్బీఐ అలర్ట్..!) -
అంబ్రేన్ నుంచి మరో సూపర్ స్మార్ట్‌వాచ్..! అది కూడా బడ్జెట్ రేంజ్లో..!
స్వదేశీ మొబైల్ యాక్సెసరీ బ్రాండ్ అంబ్రేన్ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. తాజాగా అంబ్రేన్ తన కొత్త ‘ఫిట్‌షాట్' సిరీస్‌లో మొదటి స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో భాగంగా ఫిట్‌షాట్ జెస్ట్ స్మార్ట్‌వాచ్‌ను అంబ్రేన్ లాంచ్ చేసింది. ధర ఎంతంటే..? అంబ్రేన్ ఫిట్‌షాట్ జెస్ట్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 4,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, బ్లూ, పింక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌వాచ్ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. అంబ్రేన్ ఫిట్‌షాట్ జెస్ట్ స్మార్ట్‌వాచ్‌పై ఒక సంవత్సరం పాటు వారంటీతో రానుంది. ఈ స్మార్ట్‌వాచ్ 10 స్పోర్ట్స్ మోడ్లతో వస్తుంది. దీన్ని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, ఒక వారం వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని అంబ్రేన్ పేర్కొంది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే నాటికి మరో రెండు స్మార్ట్‌వాచ్‌లను కూడా విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. అంబ్రేన్ ఫిట్‌షాట్ జెస్ట్ స్మార్ట్‌వాచ్ ఫీచర్స్ 1.7 అంగుళాల డిస్ప్లే 24x7 రియల్ టైమ్ హెల్త్ ట్రాకింగ్ Spo2, రక్తపోటు, నిద్ర, హృదయ స్పందన రేట్ మానిటరింగ్. IP67- రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ వాయిస్- అసిస్టెన్స్ ఫీచర్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ చదవండి: ఈ స్మార్ట్‌వాచ్‌కు అసలు ఛార్జింగ్ అవసరం లేదు..! ధర ఎంతంటే..? -
అంబ్రేన్ నుంచి అదిరిపోయే టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్..!
భారతదేశంలో అతిపెద్ద మేక్ ఇన్ ఇండియా మొబైల్ యాక్సెసరీస్ బ్రాండ్ అంబ్రేన్ తన సరికొత్త డాట్స్ మ్యూస్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్ 23 గంటలపాటు ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయి. వీటి ధర రూ.1999గా కంపెనీ పేర్కొంది. ఈ కొత్త టీడబ్ల్యూఎస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడంతో ఇందులో బూస్ట్ చేసిన డ్రైవర్ల వల్ల 23 గంటల ప్లేటైమ్ వస్తుంది. దీనికి 365 రోజుల వారంటీ కూడా ఉంది. ఈ ప్రొడక్ట్ Flipkart, Tata Cliq, భారతదేశంలోని అనేక ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. క్లాసిక్ స్టైల్‌తో కూడిన ఈ కాంపాక్ట్ ఇయర్‌బడ్‌లు స్పష్టమైన సంభాషణల కోసం అధిక-నాణ్యత గల ఇన్-బిల్ట్ మైక్రోఫోన్లను కలిగి ఉంటాయి. ఈ వైర్లెస్ ఇయర్‌బడ్‌ల పరిధి 10మీ. ఇవి సరికొత్త బ్లూటూత్ 5.1 టెక్నాలజీతో రూపొందించబడ్డాయి. ఇయర్ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్, సిరి కోసం వాయిస్ యాక్టివేషన్ కూడా ఉంది. అంబ్రేన్ ప్రస్తుతం భారతదేశంలో టీడబ్ల్యూఎస్‌లో బలమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. డాట్స్ సిరీస్‌లో - డాట్స్ స్లే, డాట్స్ 38, డాట్స్ 11, డాట్స్ ట్యూన్ &నియోబడ్స్ 11 & 33 ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో అంబ్రేన్ డాట్స్ మ్యూస్ టీడబ్ల్యూఎస్ కోసం బ్రాండ్ ఇన్ఫ్లుయెన్సర్గా నటి నిధి అగర్వాల్ సంతకం చేసింది. (చదవండి: ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త..!) -
అంబ్రేన్ నుంచి అదిరిపోయే టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్..!
భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉపకరణాల తయారీ దారు అంబ్రేన్ సరికొత్త డాట్స్ ట్యూన్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్ 29 గంటలపాటు ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయి. వీటి ధర రూ. 2199. చదవండి: శాంసంగ్ నుంచి చౌవకైన 5జీ స్మార్ట్‌ఫోన్..! -
499కే 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రతి ఒక్కరు నిత్యం ఎదుర్కొనే ప్రధాన సమస్య బ్యాటరీ బ్యాక్అప్. ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాం వంటి సోషల్ మీడియా వాడటం బాగా పెరిగినప్పటి నుండి ఫోన్ యొక్క బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతూ ఉంటాయి. అలాగే మనం ఏదైనా పని మీద వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, విహార యాత్రలకు వెళ్ళినప్పుడు పవర్ బ్యాంక్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మధ్య పవర్ బ్యాంక్ వాడకం కూడా బాగా పెరిగింది. మీరు కూడా కొత్త పవర్ బ్యాంక్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది ఒక మంచి సమయం. అమెజాన్ లో తాజాగా పవర్ బ్యాంక్ డేస్ సేల్ ఈ రోజు (డిసెంబర్ 13) నుండి నిర్వహిస్తుంది. ఈ సేల్ మూడు రోజుల పాటు(డిసెంబర్ 13 నుండి డిసెంబర్ 15) కొనసాగుతుంది. ఈ సేల్ లో మీకు తక్కువ ధరకే మంచి నాణ్యత గల పవర్ బ్యాంక్ లు లభిస్తాయి. ఈ సేల్ లో తీసుకొచ్చిన కొన్ని పవర్ బ్యాంకు వివరాలు మీకు అందిస్తున్నాం.(చదవండి: నోకియా 5.4లో సూపర్ ఫీచర్స్) రెడ్మీ పవర్‌బ్యాంక్: రెడ్మి యొక్క ఈ పవర్ బ్యాంక్ 10000 ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది, దీని ధర 699 రూపాయలు మాత్రమే. పవర్‌బ్యాంక్ బరువు 246.5 గ్రాములు. ఛార్జ్ చేయడానికి 7.5 గంటలు పడుతుంది. దీనికి రెండు అవుట్‌పుట్ పోర్టులు మరియు రెండు ఇన్పుట్ పోర్టులు ఉన్నాయి.| అంబ్రేన్ పవర్‌బ్యాంక్: అంబ్రేన్కు చెందిన ఈ పవర్‌బ్యాంక్ ధర 649 రూపాయలు. పవర్‌బ్యాంక్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 5 నుండి 7 గంటలు పడుతుంది. సిస్కా పవర్‌బ్యాంక్: సిస్కోకు చెందిన 10000 ఎంఏహెచ్ బ్యాటరీతో కూడిన ఈ పవర్‌బ్యాంక్ ధర రూ.599. దీనికి ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్ కూడా లభిస్తుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ పవర్‌బ్యాంక్‌లో ఓవర్ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ రక్షణ కూడా ఇవ్వబడింది. యూఆర్బీఎన్(URBN) పవర్‌బ్యాంక్: యూఆర్బీఎన్ పవర్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే ఈ సేల్ లో అతి తక్కువ ధరకు రూ.499 లభించేది ఇదే. ఈ అల్ట్రా స్లిమ్ పవర్‌బ్యాంక్ 10000 ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. ఇది 12వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. పవర్‌బ్యాంక్ బరువు కేవలం 354 గ్రాములు. -
అతి చవకధరలో స్మార్ట్‌వాచ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ కంప్యూటర్ ఉపకరణాల సంస్థ అంబ్రేన్ చవక ధరలో స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. ఏఎస్ డబ్ల్యు-11పేరుతో దీన్ని సోమవారం విడుదల చేసింది. దీని ధరను కేవలం రూ.1,999 కే ప్రారంభించింది. ఈ స్మార్ట్ వాచ్ ఫిట్నెస్ ట్రాకర్ గా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. తమ స్మార్ట్ వాచ్ ద్వారా వినియోగదారులు రోజువారీ ఫిట్నెస్ కార్యకలాపాలను ట్రాక్ చేయొచ్చనీ, అలాగే పెడోమీటర్ సహాయంతో నడకదూరాన్ని , స్లీప్ పాటర్నీ కూడా పరిశీలిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చాలా ఖరీదైన వాచ్‌లను ఇది రీప్లేస్ చేస్తుందనీ, అలాగే ఫిట్నెస్ ట్రాకర్ పాత్రను కూడా పోషిస్తుందని అంబ్రేన్ ఇండియా డైరెక్టర్ గౌరవ్ దూరెజా తెలిపారు. బ్లాక్ కలర్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌వాచ్ ఒక సంవత్సరం వారెంటీతో అన్ని ప్రముఖ రిటైల్, ఇ-టెయిల్ స్టోర్లలో లభిస్తుందని చెప్పారు.