అదిరిపోయిన అంబ్రేన్ 'ఫిట్‌షాట్ స్పియర్' స్మార్ట్‌వాచ్‌..!​ | Ambrane Launches Round Dial FitShot Sphere Smartwatch with Amazing Features | Sakshi
Sakshi News home page

అదిరిపోయిన అంబ్రేన్ 'ఫిట్‌షాట్ స్పియర్' స్మార్ట్‌వాచ్‌..!​

Published Wed, Feb 23 2022 9:21 PM | Last Updated on Wed, Feb 23 2022 9:23 PM

Ambrane Launches Round Dial FitShot Sphere Smartwatch with Amazing Features - Sakshi

భారతీయ స్మార్ట్​ఫోన్​​ యాక్సెసరీ బ్రాండ్ అంబ్రేన్ తన​ సరికొత్త స్మార్ట్​వాచ్​ను లాంచ్​ చేసింది. తాజాగా అంబ్రేన్​ తన కొత్త ‘ఫిట్‌షాట్' సిరీస్​లో స్పియర్ స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది. ఫిట్‌షాట్ స్పియర్ పేరుతో దీన్ని రూ.4,999 ధర వద్ద విడుదల చేసింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్'లో ఈ బడ్జెట్​ స్మార్ట్​వాచ్​ అమ్మకాలకు రానుంది. ఇది ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది. ఆంబ్రేన్ ఫిట్‌షాట్ జెస్ట్ స్మార్ట్‌వాచ్ 1.28 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్​వాచ్​ 24x7 రియల్​ టైమ్​ హెల్త్​ ట్రాకింగ్‌కు మద్దతు ఇస్తుంది. 

ఈ స్మార్ట్​వాచ్​ సహాయంతో Spo2, రక్తపోటు, నిద్ర, హృదయ స్పందన రేటు వంటి పారామీటర్లను కొలవొచ్చు. ఈ స్మార్ట్​వాచ్​ స్టెప్ ట్రాకర్‌కు కూడా మద్దతిస్తుంది. ఎన్ని కాలరీలను ఖర్చు చేశామనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మరోవైపు, ఈ స్మార్ట్​వాచ్​ సహాయంతో ఫిజికల్​ యాక్టివిటీ హిస్టరీని రికార్డ్​ చేయవచ్చు. 270 mAh బ్యాటరీ ఇందులో ఉంది. ఈ వాచ్ ఐపీ67- రేటెడ్ డస్ట్​, వాటర్​ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. తద్వారా, ఈ స్మార్ట్​వాచ్​ నీటిలో తడిచినా పాడవ్వదు. మరోవైపు, ఈ స్మార్ట్​వాచ్​ 47కి పైగా క్లౌడ్ -ఆధారిత వాచ్ ఫేస్‌లకు మద్దతిస్తుంది. యూజర్లు వారి స్మార్ట్​ఫోన్​లో అంబ్రేన్​ యాప్​ డౌన్‌లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు హెల్త్​ హిస్టరీని ట్రాక్​ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ వాయిస్- అసిస్టెన్స్​ ఫీచర్​తో వస్తుంది. మరోవైపు, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌కు మద్దతిస్తుంది. బ్లూటూత్​ ద్వారా స్మార్ట్​ఫోన్​కు కనెక్ట్ అయ్యేందుకు అనుమతిస్తుంది.

(చదవండి: ఈ యాప్ వాడుతున్న వారికి ఆర్‌బీఐ అలర్ట్..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement