watch
-
జుకర్‌బర్గ్ చేతికి అరుదైన వాచ్: ధర అన్ని కోట్లా?
ప్రపంచ ధనవంతులలో ఒకరు, మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg) ఇటీవల ఓ ఖరీదైన, అరుదైన వాచ్ కట్టుకుని కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వాచ్ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.మార్క్ జుకర్‌బర్గ్ కట్టుకున్న వాచ్ గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1'. దీని ధర 9,00,000 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ. 7 కోట్ల కంటే ఎక్కువ. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వాచ్ ధర కోట్లలో ఉండటం వల్ల దీనిని కొనొగోలు చేసేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. అయితే ఈ వాచ్ కలిగిన కుబేరుల జాబితాలో జుకర్‌బర్గ్ ఒకరు.గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1' వాచ్'హ్యాండ్ మేడ్ 1' (Hand Made 1) అనేది విలాసవంతమైన, ఖరీదైన వాచ్‌ల జాబితాలో ఒకటి. దీనిని ప్రఖ్యాత స్విస్ వాచ్‌మేకర్ గ్రూబెల్ ఫోర్సే ఎస్ఏ ఉత్పత్తి చేసింది. ఇవి చాలా అరుదైన వాచ్‌లు. ఎందుకంటే కంపెనీ కూడా వీటిని తక్కువ సంఖ్యలో (ఏడాదికి రెండు లేదా మూడు) మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.మార్క్ జుకర్‌బర్గ్ ఖరీదైన వాచ్‌లు కట్టుకుని కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈయన పటెక్ ఫిలిప్, ఎఫ్పీ జర్న్ వంటి బ్రాండ్ వాచ్‌లను కట్టుకుని కనిపించారు. కాగా ఇప్పుడు గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1' వాచ్‌తో కనిపించారు. ప్రస్తుతం ఫేస్బుక్ సీఈఓ ధరించిన వాచ్ మీద పలువురు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.మార్క్ జుకర్‌బర్గ్ ఖరీదైన గడియారాన్ని కట్టుకోవడం వెనుక ఏమైనా ఆలోచన ఉందా? అని ఒకరు అన్నారు. ఫేస్బుక్ సత్యం, వాస్తవాలపై దృష్టి పెట్టాలని మరొకరు పేర్కొన్నారు. ఈ వాచ్ ఖరీదు చాలామంది ఇళ్ల ఖరీదు కంటే ఎక్కువ అని ఇంకొకరు అన్నారు. ఇలా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.వాచ్‌ల మీద అమితాసక్తి కలిగిన మార్క్ జుకర్‌బర్గ్.. అనంత్ అంబానీ & రాధికా మర్చంట్ల వివాహానికి హాజరైనప్పుడు కూడా వాచ్‌ల ప్రస్తావన వచ్చింది. జుకర్‌బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్, అనంత్ ధరించిన విలాసవంతమైన గడియారాన్ని మెచ్చుకోవడానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది.ఇదీ చదవండి: ఒక్క రీఛార్జ్.. 425 రోజులు వ్యాలిడీటీ: ఈ నెల 16 వరకే ఛాన్స్అనంత్ అంబానీ వాచ్ముకేశ్ అంబానీ తనయుడు.. అనంత్ అంబానీ ఇటీవల రూ. 22 కోట్ల విలువైన వాచ్ కట్టుకుని కనిపించారు. ఆ వాచ్ ది రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్ అని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాచీలలో ఇది ఒకటి. ఇలాంటివి ప్రపంచంలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయని సమాచారం. ఈ వాచ్ రష్యా అధ్యక్షుడు 'వ్లాదిమిర్ పుతిన్' ప్రెస్ సెక్రటరీ 'డిమిత్రి పెస్కోవ్' (Dmitry Peskov) వద్ద కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రిచర్డ్ మిల్లే RM 52-04 బ్లూ సఫైర్ ఒకే పీస్తో తయారు చేశారు. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. -
అనంత్ చేతికి అరుదైన వాచ్: ప్రత్యేకతలివే..
కొంతమందికి కార్లంటే ఇష్టం, మరికొందరికి బైకులు, ఇంకొందరికి వాచీలు. ఇలా ఎవరి అభిరుచి వారిది. అయితే వాచీలను ఎక్కువగా ఇష్టపడే వారిలో భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు 'అనంత్ అంబానీ' (Anant Ambani) కూడా ఒకరు. గతేడాది 'రాధికా మర్చెంట్'ను (Radhika Merchant) పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన అనంత్.. ఇటీవల ఓ ఖరీదైన వాచ్ ధరించి కనిపించారు.అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఏకంగా రూ. 22 కోట్లు అని తెలుస్తోంది. ఇది ది రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాచీలలో ఇది ఒకటి. ఇలాంటివి ప్రపంచంలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయని సమాచారం. ఈ వాచ్ రష్యా అధ్యక్షుడు 'వ్లాదిమిర్ పుతిన్' ప్రెస్ సెక్రటరీ 'డిమిత్రి పెస్కోవ్' (Dmitry Peskov) వద్ద కూడా ఉన్నట్లు తెలుస్తోంది.రిచర్డ్ మిల్లే RM 52-04 బ్లూ సఫైర్ ఒకే పీస్తో తయారు చేశారు. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వాచ్ మాత్రమే కాకుండా అనంత్ అంబానీ వద్ద పటెక్ ఫిలిప్పె, అడెమార్స్ పిగ్యుట్ వంటి ఇతర బ్రాండెడ్ వాచీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్ ప్రత్యేకతలుఒకే పీస్తో తయారైన ఈ వాచ్ మధ్య భాగంలో ఒక పుర్రె ఆకారం.. క్రాస్బోన్ ఉండటం చూడవచ్చు. దీని కింద వంతెనల లాంటి నిర్మాణాలను చూడవచ్చు. ఇవన్నీ ఖరీదైన మెటల్‌తో రూపొందించడం వల్ల చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. పేరుకు తగ్గట్టుగానే ఇది నీలం రంగులో ఉండటం కూడా గమనించవచ్చు, ఇది ఐస్ క్యూబ్ మాదిరిగా ఉంటుంది.అనంత్ అంబానీఅనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు. అనంత్ జూలై 12, 2024న రాధిక మర్చంట్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈయన వద్ద ఖరీదైన వాచీలు మాత్రమే కాకుండా.. రోల్స్ రాయిస్ కల్లినన్ వంటి కార్లు కూడా ఉన్నాయి. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీలు.. అనంత్ అంబానీ తోబుట్టువులు. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) -
రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్.. ప్రత్యేకతలివే..
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ ఏఐ లామాకు సంబంధించిన విషయాలను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా షేర్ చేసుకున్నారు. అయితే ఆ వీడియోలో తాను ధరించిన వాచ్‌పై నెట్టింట చర్చ జరిగింది. ప్రపంచంలోనే అత్యంత సన్నని వాచ్‌ను మార్క్ ధరించినట్లు నెటిజన్లు గుర్తించారు. ఈ బల్గారి ఆక్టో ఫినిసిమో ఆల్ట్రా సీఓఎస్సీ(Bulgari Octo Finissimo Ultra COSC) మోడల్ వాచ్ కేవలం 1.7 మిల్లీమీటర్ మందంతో ఉంటుంది. అంటే దాదాపు రెండు క్రెడిట్ కార్డ్‌ల మందం కంటే సన్నగా ఉంటుంది.ఈ వాచ్ ప్రత్యేకతలు..ఈ వాచ్ కేవలం 1.7 మిమీ మందంతో ఉంటుంది.ఈ వాచ్ బీవీఎల్ 180 క్యాలిబర్‌తో గంటకు 28,800 వైబ్రేషన్స్ (4 హెర్ట్జ్) ఫ్రీక్వెన్సీతో మాన్యువల్ వైండింగ్ మూవ్‌మెంట్‌ను కలిగి ఉంటుంది.ఈ గడియారాన్ని సాండ్బ్లాస్టెడ్ టైటానియంతో తయారు చేశారు. వాచ్ పట్టీలు కూడా పూర్తిగా టైటానియంతోనే రూపొందించారు. కాబట్టి ఇది చాలా ఏళ్లు మన్నికగా ఉంటాయి. దాంతోపాటు తేలికపాటి డిజైన్ దీని సొంతం.ఇది COSC సర్టిఫైడ్ గడియారం. అంటే ఇది కఠినమైన కచ్చితత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.ఈ వాచ్ లిమిటెడ్ ఎడిషన్. ప్రపంచంలో ఇవి 20 మాత్రమే ఉన్నాయి. అందుకే ఇది అంత ప్రత్యేక సంతరించుకుంది.దీని ధర సుమారు 5,90,000 అమెరిన్ డాలర్లు. అంటే రూ.5 కోట్లకు పైనే.లామా 3 కంటే పది రెట్లు ఎక్కువజుకర్బర్గ్ పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. మెటా ఏఐ లామా 4 వెర్షన్‌ను 2025 ప్రారంభంలో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఇది తదుపరి తరం ఏఐ మోడల్ అని, లామా 3 కంటే ఇది మరింత మెరుగ్గా పని చేస్తుందన్నారు. ఇందులో రీజనింగ్ వ్యవస్థ సమర్థంగా పని చేస్తుందని చెప్పారు. లామా 4కు సుమారు 1,60,000 జీపీయూలు(గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్- కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్ కోసం చిత్రాలు, వీడియోలను రియల్ టైమ్‌లో అందించడానికి ఇది ఉపయోగపడుతుంది) అవసరమని భావిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది లామా 3 కంటే పది రెట్లు ఎక్కువ. -
బుల్లి వాచీకి భారీ ధర
వందేళ్ల క్రితం 1,500 మందికి పైగా ప్రయాణికుల దుర్మరణానికి దారి తీసిన టైటానిక్ నౌక విషాదం అందరికీ తెలిసిందే. ఆ విపత్తు బారి నుంచి 700 మందిని కాపాడినందుకు ఆర్ఎంఎస్ కర్పతియా నౌక కెప్టెన్ ఆర్థర్ రోస్ట్రన్కు బహూకరించిన పాకెట్ వాచీ ఇది. ఈ బుల్లి బంగారు వాచీ తాజాగా వేలంలో 20 లక్షల డాలర్లు పలికింది! -
స్టైలిష్‌గా సామ్.. తన వాచ్ ధర ఎన్ని లక్షలో తెలుసా?
చాలాకాలం తర్వాత సమంత మళ్లీ హడావుడి మొదలుపెట్టేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస ఫోటోషూట్స్ షేర్ చేస్తోంది. తను నటించిన సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌ను లండన్‌లో ప్రీమియర్ ప్రదర్శించడమే ఇందుకు కారణం! లండన్‌లో జరిగిన వెబ్ సిరీస్ ప్రీమియర్‌కు సిటాడెల్ ఒరిజినల్ వర్షన్ హీరోయిన్ ప్రియాంక చోప్రాతో పాటు సమంత సైతం హాజరైంది.వాచ్ ధర..ఈ సందర్భంగా ఆమె చేతికి ధరించిన వాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన స్టైలిష్ లుక్‌ను రెట్టింపు చేసేలా ఉన్న ఈ వాచ్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. లగ్జరీ బ్రాండ్ బల్గరీకి చెందిన ఈ వాచ్ ధర రూ.45.5 లక్షలని తెలుస్తోంది. ఇది విన్న అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.వెబ్ సిరీస్..సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ' నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. అలాగే సామ్ 'మా ఇంటి బంగారం' అనే సినిమాను నిర్మిస్తోంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)చదవండి: జయం రవితో అలాంటి రిలేషన్ లేదు'.. సింగర్ క్లారిటీ! -
జుకర్‌బర్గ్ చేతికి అరుదైన వాచ్! రేటు తెలిస్తే..
బిలియనీర్లు, వ్యాపార ప్రముఖుల బిజినెస్ విషయాలే కాదు.. వారు ఏం ధరిస్తున్నారు.. లైఫ్ స్టైల్‌కు సంబంధించిన విశేషాలూ వార్తల్లోకి వస్తుంటాయి. మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల చేతికి అరుదైన వాచ్‌తో కనిపించారు. మరి ఔత్సాహికులు ఊరికే ఉంటారా ఆ వాచీ ఏ కంపెనీ, ధర ఎంత తదితర విషయాలు ఆరా తీసి కనిపెట్టేశారు.జుకర్‌బర్గ్ ధరించిన గడియారం డి బెతునే కంపెనీకి చెందిన డీబీ 25 స్టార్రి వేరియస్ వాచ్. ధర 90,000 నుంచి 95,700 డాలర్లు (రూ. 75 లక్షల నుండి రూ.80 లక్షలు) మధ్య ఉంటుందని బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. అంటే దాదాపుగా భవిష్యత్ టెస్లా సైబర్‌ట్రక్ ధరంత. దీని రేటు 99,990 డాలర్లు. ఇది అరుదైన వాచ్. ఇలాంటివి సంవత్సరానికి కేవలం 20 వాచీలను మాత్రమే తయారు చేస్తారు.డీబీ 25 స్టార్రి వేరియస్ వాచ్‌కి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. స్విస్ వాచ్‌మేకర్ వెబ్సైట్ ప్రకారం.. తెలుపు, గాఢ నీలం రంగుల్లో ప్రకాశవంతమైన డయల్, 24-క్యారెట్ బంగారంతో పాలపుంతలో నక్షత్రాల్లాగా అంకెలను సూచించే చుక్కలు, వాటిని తాకుతూ ముళ్లు, చుట్టూ మెరిసిపోతున్న రోజ్ గోల్డ్ ఫ్రేమ్ చూస్తేనే కళ్లు చెదిరేలా చేస్తున్నాయి.జుకర్‌బర్గ్ ప్రీమియం వాచ్ ధరించడం ఇదే మొదటిసారి కాదు. మొన్నామధ్య తన భార్య భుజాలపై చేయి వేసుకుని తీసుకున్న సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో ఆయన చేతికి ఖరీదైన వాచ్ ధరించారు. అది 1,41,400 డాలర్ల విలువైన పటెక్ ఫిలిప్ వాచ్ అని వెంటనే పట్టేశారు ఔత్సాహికులు.Mark Zuckerberg spotted yesterday during the @AcquiredFM live wearing a DB25 Starry Varius in rose gold from De Bethune. 👀 pic.twitter.com/raZRTyzmAz— ZwapX (@zwapxofficial) September 11, 2024 -
సల్మాన్ చేతికి ఖరీదైన రూ.42 కోట్ల వాచ్..
-
అతి పలుచని వాచీ
ప్రపంచంలోనే అతి పలుచని చేతి గడియారాన్ని తయారు చేయడానికి యూరోపియన్ హోరాలజీ దిగ్గజాలన్నీ తెగ పోటీ పడుతుంటేం రష్యాకు చెందిన ఓ స్వతంత్ర వాచ్ మేకర్ ఆ అద్భుతాన్ని సాధించేశాడు. ప్రతిష్ఠాత్మక అకాడెమీ హోర్లోగెర్ డెస్ క్రిటెపెండెంట్స్ ఇండిపెండెంట్స్లో ఏకైక రష్యన్ సభ్యుడైన కాన్స్టాంటిన్ చైకిన్ అనే వ్యక్తి అత్యంత పలుచనైన చేతి గడియారాన్ని రూపొందించారు. దీని మందం కేవలం 1.65 మిల్లీమీటర్లు. బరువైతే 13.3 గ్రాములే! ఆ లెక్కన ప్రపంచంలోనే అతి తేలికైన గడియారమూ ఇదే. గత వారం స్విట్జర్లాండ్‌లో జరిగిన ‘జెనీవా వాచ్ డేస్ ఫెయిర్’లో ఈ వాచీని ప్రదర్శించారు. స్టెయిన్లెస్ స్టీల్, టంగ్స్టన్ కార్బైడ్ వాడటంతో ఇది తేలిగ్గా ఉన్నా చాలా దృఢంగా ఉంటుంది.కాగితం ముక్కంత పలుచన.. విశ్వసనీయమైన, ఖచి్చతమైన, ధరించేంత మన్నికైన అ్రల్టా–స్లిమ్ గడియారాలను ఉత్పత్తి చేయడం ప్రపంచంలోని గడియారాల తయారీదారులకు ఓ సవాలుగా ఉండేది. కానీ ఇటీవలి కాలంలో పలుచని గడియారాల తయారీ పోటీ ఊపందుకుంది. స్విస్ బ్రాండ్ పియాజెట్ 2018లో 2 మిల్లీమీటర్ల మందం కలిగిన గడియారాన్ని తయారు చేసింది. ఇది రెండేళ్ల తరువాత ఉత్పత్తిలోకి వచి్చంది. లగ్జరీ దిగ్గజం బుల్గారి కేవలం 1.8 మిల్లీమీటర్ల మందంతో వాచీని తెచ్చింది. వీటిని తలదన్నుతూ వాచ్ మేకర్ రిచర్డ్ మిల్లే 2022లో కాగితం ముక్కంత పలుచనైన గడియారాన్ని తయారు చేసింది. దాని ఖరీదు 500,000 డాలర్లకు పై చిలుకే! పాకెట్ వాచ్ ప్రేరణతో... 2003లో తన పేరుతోనే వాచ్ మేకింగ్ బ్రాండ్ స్థాపించిన చైకిన్ 20 ఏళ్ల క్రితం 19వ శతాబ్దానికి చెందిన బాగ్నోలెట్ పాకెట్ వాచ్‌ను చూసి పలుచని వాచీలపై ఆసక్తి పెంచుకున్నాడట. సొంతంగా అల్ట్రాథిన్ వాచ్ డిజైన్ చేయాలని ఒక క్లయింట్ సవాలు చేయడంతో రంగంలోకి దిగాడు. ఇప్పుడు తయారు చేసిన బుల్లి వాచీకి మున్ముందు నీలమణి లేదా వజ్రాలను పొదిగే ఆలోచన ఉందట! అనేక పేటెంట్లకు దరఖాస్తులు చేసినా ఇంకా ఏదీ ఖరారు కాలేదని చెప్పుకొచ్చాడు. వచ్చే ఏప్రిల్‌లో జెనీవాలో జరిగే వాచ్స్ అండ్ వండర్స్ ట్రేడ్ షోలో తన డిజైన్ తుది వెర్షన్‌ను సమరి్పస్తానని చెబుతున్నాడు. అప్పటికల్లా తన డిజైన్ మరింత కచ్చితత్వం, పవర్ సంతరించుకుంటుందని చెప్పాడు. ఈ వాచీకి ఇంకా ధర నిర్ణయించలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ.34 లక్షల వాచ్.. కేవలం 49 మందికే (ఫోటోలు)
-
49 మందికే రామ్ మందిర్ వాచ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
స్విస్ వాచ్ తయారీదారు జాకబ్ & కో భారతదేశంలోని దాని రిటైలర్ భాగస్వామి ఎథోస్ వాచ్ బోటిక్స్ సహకారంతో 'రామ్ జన్మభూమి ఎడిషన్ వాచ్' లాంచ్ చేసింది. ఈ వాచ్ కేవలం 49 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. దీని ధర 41000 డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 34,00,000.జాకబ్ & కో లాంచ్ చేసిన ఈ వాచ్ ఈ వాచ్‌లో అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం, రాముడు, హనుమంతుని నమూనాలు ఉన్నాయి. ఇది కుంకుమపువ్వు రంగులో ఉంది. దీనికి కేవలం 49మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది.భారతీయ సంస్కృతికి నిదర్శనంగా సంస్థ ఈ వాచ్ లాంచ్ చేసింది. ఈ వాచ్‌లో 9 గంటల వద్ద రామ మందిరం, 2 గంటల వద్ద రాముడు, 4 గంటల వద్ద హనుమంతుడు ఉండటం చూడవచ్చు. ఈ వాచ్ కలర్ ఆధ్యాత్మికతకు ప్రతీకగా చెబుతున్నారు. దీనిని ప్రధానంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రతిధ్వనించేలా రూపొందించారు. View this post on Instagram A post shared by WatchTime India (@watchtimeindia) -
అనంత్ అంబానీ వాచ్..వామ్మో..! అంత ఖరీదా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ఈ నెల 12న జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వారి ఇంట జరిగే చివరి వివాహం కావడంతో అత్యంత విలాసవంతంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఆ ఈవెంట్లో ఆ కుటుంబ సభ్యులు ధరించిన ఆభరణాలు, కాస్ట్యూమ్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా. తాజాగా అలానే అనంత్ ధరించిన లగ్జరియస్ వాచ్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. రాధిక మర్చంతో వివాహ నేపథ్యంలో అనంత్ ప్రముఖ దేవాలయాలను దర్శిస్తున్నారు. ఆ క్రమంలోనే మహారాష్ట్రలోని నేరల్‌లోని కృష్ణ కాళీ దేవాలయాన్ని దర్శించారు కాబోయే వరుడు అనంత్ అంబానీ. అమ్మవారి ఆశీర్వాదాన్ని కోరుతూ ఆలయంలో హవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత్ ధరించిన గడియారం అందరి దృష్టిని తెగ ఆకర్షించింది. దాని ధర తెలిస్తే కంగుతింటారు.అత్యంత అరుదైన వాచ్..అనంత్ అంబానీకి అద్భుతమైన వాచీలను సేకరించే అలవాటు ఉంది. వాటిలో ఖరీదైన పాటెక్ ఫిలిప్, రిచర్డ్ మిల్లే నుండి అరుదైన వాచీలు ఉన్నాయి. కృష్ణ కాళీ ఆలయ సందర్శన సమయంలో, అనంత్ రిచర్డ్ మిల్లే వాచీని పెట్టుకున్నారు. ఎరుపు రంగు కార్బన్ రిచర్డ్ మిల్లే వాచ్ (ఆర్ఎం 12-01 టూర్‌బిల్లాన్)ను ఆయన పెట్టుకున్నారు. దీని ధర ఏకంగా రూ. 6.91 కోట్లు. ఈ బ్రాండ్‌కి సంబంధించిన వాచ్‌లు చాలా పరిమితి పరిధిలోనే అందుబాటులో ఉంటాయి. ఇప్పటి వరకు ఈ బ్రాండ్‌కు సంబంధించినవి 18 వాచ్‌లు మాత్రమే రూపొందించారు. మన దేశంలో కొన్ని కుటుంబాలు కేవలం నెలకు ఆరు వేల రూపాయలతో జీవిస్తున్నారు. అనంత్ అంబానీ వాచీ ఖరీదు ఆరుకోట్ల 91 లక్షల రూపాయలు. అంటే మనదేశంలోని దారిద్య్రరేఖకు దిగువున ఉన్న రెండు గ్రామాలను అభివృద్ధి చెయ్యొచ్చు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (చదవండి: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననున్న టీమ్ ఇండియా దుస్తులను డిజైన్ చేసేదేవరంటే..!) -
విజయవాడలో బుజ్జిని చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్ (ఫోటోలు)
-
Diljit Dosanjh: కల్కి సింగర్ వాచ్ ధర తెలిస్తే కంగుతినడం ఖాయం..!
ప్రముఖ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. బడిలో పాఠాలు చదువుకునే రోజుల్లో గురుద్వారలో కీర్తనలు పాడేవాడు దిల్జీత్ దోసాంజ్. తర్వాత ఆ గొంతే అతడికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. పంజాబీ, హిందీ ఇండస్ట్రీలో సింగర్‌గా, నటుడిగానూ రాణిస్తున్నాడు. అంతేగాదు ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'లో 'భైరవ ఏంథమ్' పాటని కూడా పాడారు. ఇక దిల్జిత్ దోసాంజ్ పాటలే గాక మంచి ఫ్యాషన్ ఐకాన్ కూడా. ప్రతి పాటకు అందుకు తగ్గ డిజైనర్ డ్రెస్‌లతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంటాడు. బహుశా ఈ ఆహార్యమే అతడిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిందేమో.!. ఇక ఇటీవల జిమ్మీపాలన్ ది టునైట్ షోలో దిల్జిత్ దోసాంజ్ ధరించి వాచ్ అందర్నీ ఆకర్షించింది. ఆయన ఆ షోలో పంజాబీకి చెందిన గోట్ లిరిక్స్, బోర్న్ టు షైన్ వంటి మంచి హిట్ పాటలతో ప్రేక్షకులనూ ఉర్రూతలు ఊగించాడు. ఈ షోలో ఆయన పంజాబీ సంప్రదాయం ఉట్టిపడేలా వేషధారణతో పాటలు పాడారు. అలాగే అందుకు తగ్గట్లు తన సంస్కృతిని తెలియజెప్పేలా గోట్ లిరిక్స్‌లో మంచి హిట్ పాటలతో అలరించారు. ఈ షోలో ఆయన పాడుతూ.. లయబద్ధంగా డ్యాన్స్‌లు చేశారు. ఆ షోలో అందరి దృష్టి ఆయన చేతికి ధగ ధగ మెరుస్తూ కనిపిస్తున్న వాచ్‌పైనే పడింది. విలాసవంతమైన వస్తువుల కలెక్షన్‌కు కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఉండే దిల్జిత్ ఆడెమర్స్ పిగెట్ రాయల్ ఓక్ సెల్ఫ్వైండింగ్ బ్రాండ్ వాచ్‌ని ఈ షోకి ఎంపిక చేసుకున్నారు. ఈ వాచ్ 18 క్యారెట్ల రోజ్ గోల్డ్ లింక్‌లతో కూడిన స్టెయిన్లెస్ స్టీల్ బ్రాస్లెట్తో రూపొందించారు. అంతేగాదు ఈ వాచ్ ఇండెక్స్ అవర్ మార్క్‌లో సిల్వర్ డయల్ ఉంటుంది. దీన్ని జైన్ ఆభరణాల వ్యాపారులు రూపిందించారట. ఈ వాచ్ మెరిసిపోయేలా మొత్తం వజ్రాలతో పొదిగారు. ఎంత దూరం నుంచి చూసినా వాచ్ చేయిపై మిరుమిట్లు గొలిపే కాంతితో కూడిన ఒక ఆభరణంలా కనిపిస్తుంది. ఇంత లగ్జరీయస్ వాచ్ ధర వింటే మాత్రం కళ్లు బైర్లుకమ్ముతాయి. దిల్జిత్ ఈ లగ్జరీయస్ బ్రాండెడ్ వాచ్‌ని ఏకంగా రూ. 1.2 కోట్లుతో కొనుగోలు చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by The Tonight Show (@fallontonight) (చదవండి: ప్లాస్టిక్ బాటిల్స్‌తో టీ షర్ట్స్..ఏకంగా రూ. 80 కోట్లు..!) -
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్: నీతా అంబానీ వాచ్ ధర అన్ని కోట్లా..!
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలు గత మార్చి నెలలో గుజరాత్‌లోని జామ్ నగర్లో సినీతారలు, ప్రముఖులు, సెలబ్రిటీల సమక్షంలో అత్యంత అట్టహాసంగా జరిగాయి. ఆ తర్వాత ఇటీవల ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్‌లో రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత లగ్జరియస్‌గా ముగిశాయి. ఆ వేడుకల్లో స్పెషల్ డ్రెస్సింగ్ కోడ్‌ను కూడా ఏర్పాటు చేసింది అంబానీ కటుంబం.ఈ వేడుకల్లో అంబానీ కుటుంబం ధరించే డ్రెస్‌లు, నగలు ఎప్పడూ స్పెష్టల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయనే విషయం తెలిసిందే. అలానే ఈసారి అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అత్యంత హైలెట్‌గా నీతా చేతి వాచ్ నిలిచింది. అందరి దృషిని ఆకర్షించింది. ఆ వాచ్ ధర, స్పెషాలిటీ ఏంటో చూద్దామా..! View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) ఇటీవలే ముగిసిన క్రూయిజ్‌లోని ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఆమె చేతి వాచ్ అత్యంత స్టైయిలిష్‌గా, లగ్జరియస్‌గా ఉంది. ఈ వేడుకలో ఆమె ధరించిన దుస్తుల ధర కంటే వాచ్ ధరం అత్యంత ఖరీదు కూడా. ఆమె ప్రముఖ డిజైనర్ ఆస్కార్ డి లా రెంటా పెయింటెడ్ పాప్పీస్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ మ్యాక్సీ దుస్తులను ధరించారు. వాటి ధర కేవలం రూ. 6 లక్షలు కాగా ఆమె ధరించిన వాచ్ ధర అంతకు మించి అన్న రేంజ్లో ఉంది. నీలమణులతో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఈ వాచ్. ఇది జాకోబ్ అండ్ కో బ్రాండ్‌కి చెందిన టైమ్‌పీస్. దీని ధర ఏకంగా రూ 3 కోట్లు. ఈ వాచ్ ఇంద్రధనస్సులా మెరిసే నీలమణులతో కూడిన గోల్డ్ కేస్, దానికి నొక్కు కూడా ఉంటుంది. అందుకు తగ్గట్టు లైట్ మేకప్‌తో, జుట్టు వదులు చేసి అత్యంత స్టన్నింగ్ లుక్‌లో కనిపించింది నీతా. ఈ ఆహార్యం నీతా ఆధనాతన స్టెయిలింగ్ శైలి రేంజ్ ఏంటన్నది చెప్పకనే చెప్పింది. View this post on Instagram A post shared by JACOB & CO. (@jacobandco) (చదవండి: దగ్గడంతో తొడ ఎముక విరిగిపోవడమా?..షాక్‌లో వైద్యులు!) -
ఐపీఎల్ ఫైనల్లో షారూఖ్ సందడి.. ఆ వాచ్‌తో లైఫ్‌టైమ్ సెటిల్మెంట్!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ గతేడాది జవాన్, డుంకీ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం ఈ ఏడాదిలో ఇంకా కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే తాజాగా తన టీమ్ కేకేఆర్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. కుటుంబంతో సహా చెన్నైలో జరిగిన మ్యాచ్‌ను వీక్షించారు. చెపాక్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది.కేకేఆర్ విజయంతో బాలీవుడ్ బాద్షా సంబురాలు చేసుకున్నారు. స్టేడియంతో కలియ తిరుగుతూ సందడి చేశారు. అయితే ఈ మ్యాచ్‌కు హాజరైన షారూఖ్ ఖాన్ వాచ్‌పైనే అందరిదృష్టి పడింది. ఆయన ధరించిన స్కల్ వాచ్ గురించి నెట్టంట చర్చ మొదలైంది. షారుఖ్ ధరించిన వాచ్ రిచర్డ్ మిల్లే కంపెనీకి చెందిన స్కల్ టైటానియం వాచ్‌గా గుర్తించారు. ఈ వాచ్ ధర దాదాపు రూ.4 కోట్లు ఉంటుందని సమాచారం.ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దట్ ఇజ్ కింగ్ ఖాన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఐపీఎల్ ముగింపు వేడుకల్లో షారుఖ్‌తో పాటు అతని భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్, అనన్య పాండే, షానయ కపూర్, మహీప్ కపూర్, చుంకీ పాండే, భావన పాండే కూడా పాల్గొన్నారు. -
సమంత లగ్జరీ బ్రాండ్ వాచ్.. ధర ఎంతంటే..!
టాలీవుడ్ నటి సమంత చక్కటి ఫ్యాషన్ దుస్తుల పోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి డ్రెస్ అత్యంత లగ్జరియస్ బ్రాండ్‌కు చెందినవే. ఈసారి మంచి కలర్‌ఫుల్ లుక్ ఫోటోలతో అభిమానులను ఆకర్షించింది. ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ గూచీకి చెందిన తెల్లటి లక్కర్ జాకెట్, స్కర్ట్ ధరించి.. క్యూట్ లూక్‌తో చూపురులన కట్టిపడేస్తుంది. దుస్తులపై ఉన్న ఎంబ్రాయిడరీ, ప్యాడెడ్ ఫోల్డర్లు, ఫుల్ స్లీవ్ల్లు బోర్డురూంలో సమావేశానికి వెళ్లే సీఈవోల మాదిరిగా ఉంది. అందుకు తగ్గట్టు ఆమె ధరించి డైమండ్ స్టడెడ్ సెర్పెంటి స్పిగా వాచ్ ఆమె అందన్ని రెట్టింపు చేశాయి. ఆ వాచ్ డయల్ చ్టుటూ సిల్వర్ ఒపలైన్ , డైమండ్లతో పొదడబడి ఉంది. చేతికి స్పైరల్ బ్రాస్లెట్ మాదిరిగా ప్రకాశవంతంగా ఉంది. ఆ తెల్లటి దుస్తులకు సరిగ్గా సరిపోయింది కాంస్య మేకప్ సమంతాకి కొత్త లుక్‌ని ఇచ్చింది. బహుశా ఈ వాచ్ అంటే ఆమెకు చాలా ఇష్టమనుకుంటా దీన్ని మరో రెండు సందర్భల్లో కూడా ధరించింది. ఒకసారి బోల్డ్ బ్లాక్ దుస్తులను ధరించినప్పుడూ వాచ్ మరింత ప్రకాశవంతంగా కనిపించింది. అలాగే ఓ ఫ్రైమ్ వీడియో ఈవెంట్‌కు కూడా ఈ సర్పెంటీ వాచ్‌ని ధరించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) అలాగే ఈ వజ్రాలతో కూడిన వాచ్‌కి కేవలం సమంతా మాత్రమే ఫ్యాన్ కాదు మరో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీకి కూడా తెగ ఇష్టం. అందుకే కియారా కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో ఆమె నలుపు రంగు దుస్తులు ధరించి, చేతికి వెండి సర్పెంటీ స్పిగా వాచ్‌ను ధరించింది. మంచి జీవనశైలితో జీవితాన్ని ఆశ్వాదించేవారికి ఈ బల్గారియా వాచ్‌లు స్టైయిల్ష్ లుక్‌ని ఇస్తాయట. ఇంతకీ డైమండ్లతో పొదగబడిన ఈ వాచ్ ధర వింటే షాకవ్వుతారు. ఈ బల్గారియా సర్పెంటీ వాచ్ ధర ఏకంగా రూ. 70 లక్షలట. లగ్జరీ బ్రాండ్‌కి తగ్గ రేంజ్ ధర కాబోలు..! View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!) -
భారీగా తగ్గనున్న చాక్లెట్లు, వాచీల ధర..! మరిన్నింటిపై ప్రభావం.. కారణం..
యూరప్‌లోని నాలుగు దేశాల కూటమి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంది. దీని ప్రకారం వచ్చే 15 ఏళ్లలో దేశంలోకి రూ.8.3 లక్షల కోట్ల కచ్చిత పెట్టుబడులకూ హామీ లభించింది. తద్వారా పది లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగనుంది. ఈ ఒప్పందంతో ప్రధానంగా స్విస్ వాచీలు, పాలిష్ చేసిన వజ్రాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, గోడ గడియారాల వంటివి ప్రస్తుతం కంటే తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం రానుంది. ఈఎఫ్‌టీఏలో స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లిక్టన్స్టైన్, నార్వే సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇవి ఐరోపా సమాఖ్యలో భాగం కాదు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన సమాఖ్య. కెనడా, చిలీ, చైనా, మెక్సికో, కొరియా వంటి 40 భాగస్వామ్య దేశాలతో ఈఎఫ్టీఏ ఇప్పటివరకు 29 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఎఫ్‌టీఏలో పెట్టుబడుల హామీకీ చట్టబద్దత లభించడం ఇదే తొలిసారి. ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది. ఉపయోగాలివే.. దేశీయంగా తయారవుతున్న ఉత్పత్తులన్నింటినీ, సుంకాలు లేకుండా ఈఎఫ్టీఏ దేశాల్లో విక్రయించుకోవచ్చు. ప్రాసెస్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకూ సుంకాల్లో రాయితీలు లభిస్తాయి. మన ఉత్పత్తులపై ఈ ఏడాది జనవరి నుంచే స్విట్జర్లాండ్ సుంకాలను తొలగించింది. భారత్ కూడా ఈఎఫ్టీఏ ఉత్పత్తుల్లో 95.3 శాతానికి మినహాయింపు ఇస్తోంది. అక్కడ నుంచి బంగారం మనదేశంలోకి అధికంగా దిగుమతి అవుతున్నా, కస్టమ్స్ సుంకం (15%) విషయంలో మినహాయింపు ఇవ్వలేదు. బౌండ్‌రేటు (అత్యంత అనుకూల దేశాలుగా పరిగణించి ఇచ్చేది)ను మాత్రం 1% తగ్గించి, 39%గా ఉంచింది. ఐరోపా సమాఖ్యకు చేరేందుకు భారత కంపెనీలు స్విట్జర్లాండ్‌ను బేస్‌గా వినియోగించుకోవచ్చు. ప్రెసిషన్ ఇంజినీరింగ్, హెల్త్ సైన్సెస్, పునరుత్పాదక ఇంధనం, వినూత్నత-పరిశోధనల్లో సాంకేతిక సహకారం సులువవుతుంది. మారనివి ఇవే.. డెయిరీ, సోయా, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులను మాత్రం మినహాయింపుల జాబితాలో చేర్చలేదు. అందువల్ల వీటికి సుంకాల్లో రాయితీలు అమలు కావు. ఇదీ చదవండి: విద్యుత్ వాహనాలతో వాతావరణ కాలుష్యం..! స్విట్జర్లాండ్ నుంచి భారత్ ఎక్కువగా బంగారం (12.6 బి.డాలర్లు), యంత్రాలు (409 మి.డాలర్లు), ఔషధాలు (309 మి.డాలర్లు), కోకింగ్ అండ్ స్టీమ్ కోల్ (380 మి.డాలర్లు), ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్లు, ఆర్థోపెడిక్ అప్లియెన్సెస్ (296 మి.డాలర్లు), వాచీలు (211.4 మి.డాలర్లు), సోయాబీన్ ఆయిల్ (202 మి.డాలర్లు) చాక్లెట్లు (7 మి.డాలర్లు) తదితర వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. రసాయనాలు, రత్నాభరణాలు, కొన్ని రకాల టెక్స్టైల్స్, దుస్తులను మనదేశం ఎగుమతి చేస్తోంది. -
శ్లోకా మెహతా వాచ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల పెద్ద కోడలు శ్లోకా మెహతా సైతం వారి రేంజ్ తగ్గట్టుగానే లగ్జరీయస్‌గా ఉంటారు. ఇటీవలే ముంఖేశ్ నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్-రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకల్లో శ్లోకా మెహతా అంబానీల లెవల్‌కి తగ్గట్టు తనదైన ఫ్యాషన్ బ్రాండ్స్‌తో తళుక్కుమన్నారు. ఇంతfరకు అంబానీల కుటుంబంలోని మగవాళ్లు అత్యంత లగ్జరీయస్ వాచ్‌లు ధరించడం గురించి విని ఉన్నాం. ఆ కుటుంబంలోని మహిళలు కూడా అలాంటివి ధరిస్తారని శ్లోకా మెహతా ప్రూవ్ చేశారు. నిజానికి ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అంబానీ కుటుంబం తొమ్మిది పేజీల మెనులో ఏయే రోజులు సెలబ్రెటీలు, అతిథులు ఎలాంటి డ్రెస్ కోడ్ ధరించాలనే రూల్స్ పెట్టిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే సినీ సెలబ్రెటీలు, ప్రముఖులు, విదేశీ ప్రముఖులు వరకు అందరూ ఈ వేడుకలకు తగ్గ వస్త్రధారణతో సందడి చేశారు. అయితే ఈ వేడుకల్లో శ్లోకా మెహతా డైమండ్స్‌తో పొదిగిన నెక్లెస్, జూకాలతో అందర్నీ ఆకర్షించారు. ఈ వేడుకల్లో ఆమె ఎరుపురంగు వేలెంటినో డ్రస్‌తో అంబానీ కోడలు అంటే ఇది అనేంత రేంజ్లో గ్లామరస్ లుక్‌లో కనిపించారు. డైమండ్స్ అంటే ఇష్టపడే శ్లోకా ఈ వేడుకల్లో చేతికి పటేక్ ఫిలిప్ నాటిలస్ బ్రాండ్ డైమండ్ వాచ్‌ని ధరించింది. మొత్తం వాచ్ అంతా ట్రాన్స్పరెంట్ వజ్రాలతో పొదగబడి ఉంటుంది. ఎంత దూరాన ఉన్న చేతికి ఉన్న వాచ్ ఆకర్షణ కనిపించడమే దీని ప్రత్యేకత. అయితే ఈ వాచ్ ఖరీదు వింటే కళ్లు బైర్లుకమ్మడం గ్యారంటీ. ఇంతకీ ఈ వాచ్ ధర ఎంతంటే అక్షరాల రూ. 4.8 కోట్లు. అమ్మ బాబోయే! జస్ట్ వాచ్కే అన్ని కోట్లా..! అని నోరెళ్లబెట్టకండి. అందులోనూ అంబానీ పెద్ద కోడలు ఆ మాత్రం రేంజ్ మెయింటెయిన్ చేయాల్సిందే కదూ. View this post on Instagram A post shared by Shloka Akash Ambani (@shloka_ambani) (చదవండి: అనంత్-రాధికా ప్రీ వెడ్డింగ్: ఇవాంకా ట్రంప్ డ్రస్ స్టయిల్ అదిరిందిగా!) -
కార్టూన్ సిరీస్‌లతో జర జాగ్రత్త..! ఎందుకంటే?
ఎనిమిదేళ్ల సారా స్కూల్ నుంచి∙రాగానే హోమ్‌వర్క్ పూర్తిచేసి కార్టూన్లు చూస్తూ కూర్చుంటుంది. చూస్తున్నది కార్టూన్లే కదా అని తల్లిదండ్రులు కూడా అడ్డుచెప్పలేదు. కానీ క్రమేణా సారా ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. ఏదడిగినా మొహం మీద కొట్టినట్టు సమాధానం ఇస్తోంది. లేదా ఎగతాళి చేస్తోంది. సరిచేయాలని పేరెంట్స్ ఎంత ప్రయత్నించినా అమ్మాయి ప్రవర్తనలో మార్పు రాలేదు. దాంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు కౌన్సెలింగ్‌కు తీసుకువచ్చారు. పిల్లలు దేన్నయినా సరే చూసి, గమనించి నేర్చుకుంటారు. కానీ సారా వాళ్లింట్లో అలా దుడుకుగా సమాధానం చెప్పేవారు ఎవ్వరూ లేరు. అయినా ఆ పాపకు అలాంటి ప్రవర్తన ఎలా అలవాటైందో తెలుసుకోవడానికి తనతో మాట్లాడాను. తాను చూస్తున్న కార్టూన్ సిరీస్‌ల నుంచే అలా మాట్లాడటం నేర్చుకుందని అర్థమైంది. కార్టూన్లన్నీ మంచివేం కావు.. టీవీలో వచ్చే కార్టూన్లన్నీ మంచివేం కావు. కొన్ని చెడ్డవి కూడా ఉంటాయి. అవి పిల్లల మనసులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు.. మనకు దయ్యం, భూతం, రాక్షసులు అనే భావనలు ఎప్పుడు పరిచయమయ్యాయి? చిన్నప్పుడు చదివిన చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్రలాంటి పుస్తకాల్లోంచే కదా! అలాంటి కథలు చదవడం ద్వారా దయ్యాలు, భూతాలు ఉన్నాయని మనం అనుకున్నట్లే, పిల్లలూ ఈనాటి కార్టూన్ సిరీస్‌లు చూసి సూపర్ మన్లు, సూపర్ పవర్స్‌ని నమ్ముతుంటారు. కొన్ని కార్టూన్లు హింస, చవకబారు హాస్యం లేదా పిల్లలను గందరగోళానికి గురిచేసే పద్ధతుల్లో ఉంటాయి. కార్టూన్లలో చిత్రీకరించే అతిశయోక్తి చర్యలు, పరిస్థితులు పిల్లల్లో అవాస్తవిక అంచనాలను క్రియేట్ చేయొచ్చు. గతంలో శక్తిమాన్ సిరీస్ ప్రసారమైనప్పుడు శక్తిమాన్‌లా దూకి పిల్లలు గాయాలపాలైన విషయం గుర్తుచేసుకోండి. అంతెందుకు మనకు విపరీతంగా నవ్వు తెప్పించే టామ్ అండ్ జెర్రీ సిరీస్‌లో విపరీతమైన హింస దాగి ఉంది. ఎక్కువసేపు కార్టూన్లు చూడటం.. శ్రద్ధ, నిద్రలను దెబ్బతీస్తుంది. వ్యాయామానికి దూరంచేసి శారీరక సమస్యలకు దారి తీస్తుంది. కార్టూన్లు వినోదం మాత్రమే కాదు.. కార్టూన్లు రంగురంగుల విజువల్స్, ఆకట్టుకునే పాటలు, పాత్రలతో పిల్లలను బాగా ఆకర్షిస్తాయి. పిల్లలు కార్టూన్లు చూస్తుంటే తల్లిదండ్రులు కూడా పెద్దగా అడ్డుచెప్పరు. కానీ కార్టూన్లు కేవలం వినోదం మాత్రమే కాదు. అంతకు మించి. వాటి నుంచి పిల్లలు చాలా నేర్చుకుంటారు. అవి వాళ్ల మనస్సులపై చెరగని ముద్ర వేయవచ్చు. అందుకే పిల్లలు ఎలాంటి కార్టూన్లు చూస్తున్నారనే విషయం గమనించడం తప్పనిసరి. ఎడ్యుకేషన్ కార్టూన్లు కొత్త భావనలను పరిచయం చేస్తాయి, ప్రపంచం గురించి ఉత్సుకతను రేకెత్తిస్తాయి. అభిజ్ఞా వికాసానికి (cognitive development) తోడ్పడతాయి. స్నేహం, భయం లేదా నష్టం వంటి భావోద్వేగాలతో పోరాడే పాత్రలు పిల్లలకు వారి స్వంత భావాలను అన్వేషించడానికి దారి చూపిస్తాయి. అలాగే వారి ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ను పెంచుకోవడానికి దోహదపడతాయి. అనేక కార్టూన్లు దయ, నిజాయితీ, పట్టుదల వంటి ఇతివృత్తాలను నొక్కిచెప్తాయి. పిల్లల నైతిక దిక్సూచిని, సానుకూల సామాజిక ప్రవర్తనను పెంపొందించడానికి ఉపయోగపడతాయి. పేరెంట్స్ చేయాల్సింది.. పిల్లలతో కలసి కార్టూన్లు చూడండి. అవి వారి వయసుకు, మీ కుటుంబ విలువలకు తగినవైతేనే అనుమతించండి. వాటిలో పాత్రల గురించి, అవి అందించిన సందేశాల గురించి మాట్లాడండి. విభిన్న నేపథ్యాల నుంచి పాత్రలతో కూడిన కార్టూన్లను పరిచయం చేయండి. తద్వారా భిన్నాభిప్రాయాలను కలుపుకొని పోవడం అలవాటవుతుంది. ఆడుకోవడం, చదవడం లేదా ఆరుబయట సమయం గడపడం వంటి ఇతర ఆకర్షణీయమైన కార్యకలాపాలతో స్క్రీన్ సమయాన్ని బ్యాలెన్స్ చేయండి. గుర్తుంచుకోండి.. ఓపెన్ కమ్యూనికేషన్, యాక్టివ్ పార్టిసిపేషన్ కీలకం. పిల్లలు చూడకూడని కార్టూన్ సిరీస్‌లు.. ది సింప్సన్స్: ఇది ఎలాంటి హాని చేయని కార్టూన్‌గా కనిపించినప్పటికీ చిన్నపిల్లలకు తగినది కాదు. ఇందులో సంక్లిష్టమైన, క్రూరమైన, అభ్యంతరకరమైన అంశాలుంటాయి. హ్యాపీ ట్రీ ఫ్రెండ్స్: అందంగా కనిపించినప్పటికీ, నిజానికి చాలా హింసాత్మకమైన, కలవరపెట్టే కార్టూన్. ఇది ఏ వయసు పిల్లలకైనా తగినది కాదు. రిక్ అండ్ మోర్టీ: ఈ సిరీస్ ఒక శాస్త్రవేత్త, అతని అమాయక మనవడి చుట్టూ తిరుగుతుంది. దీంట్లో అడల్ట్ జోక్స్, హింస ఉంటాయి. విలువలన్నీ శూన్యమనే భావన నిండి ఉంటుంది. బిగ్ మౌత్: ఇది టీనేజ్ పిల్లల గురించి! అయితే ఆ వయసులో వచ్చే ఇబ్బంది కరమైన, అసౌకర్యమైన అంశాలన్నిటినీ చూపిస్తుంది. ఇది పెద్దలకు ఉల్లాసంగా ఉంటుంది. కానీ టీనేజర్లకు తగినది కాదు. హ్యూమన్ రిసోర్సెస్: ఇందులో హార్మోన్ మాన్స్టర్స్, యాంగ్జయిటీ దోమలు, లవ్ బగ్స్ వంటి ఊహాత్మక జీవులు ఉంటాయి. కొంచెం బోల్డ్‌గా ఉంటుంది. పిల్లలకు అనువైనది కాదు. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com ఇవి చదవండి: అందమైన జీవితం కోసం ఐన్ స్టీన్ సూత్రాలు -
మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే
మెగాస్టార్ చిరంజీవి కాస్త మొన్నమధ్యే పద్మవిభూషణ్ అయ్యారు. కేంద్రం తాజాగా ప్రకటించిన పురస్కారాల్లో ఈయన పేరు రావడంతో అభిమానులు తెగ ఆనందపడ్డారు. ఈ అవార్డు వచ్చిన తర్వాత చిరు.. తొలిసారి ఓ ఈవెంట్‌కి హాజరయ్యారు. మెగాహీరో వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలంటైన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇది. అయితే మెగాస్టార్ చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ ఆయన చేతి వాచీ మాత్రం అందరినీ ఎట్రాక్ట్ చేసింది. దాని ధర ఎంతో తెలిస్తే మాత్రం మీకు గుండె జారిపోద్ది. ఓ సాధారణ నటుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి.. మెగాస్టార్ రేంజుకు వెళ్లిపోయారు. 150కి పైగా సినిమాలు చేసి కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్నారు. అలానే చిరు దగ్గర కార్లు, వాచీల కలెక్షన్ కూడా బాగానే ఉంది. కోట్లాది రూపాయల విలువైన ఇందులో ఉన్నాయి. రోలెక్స్ వాచీల దగ్గర నుంచి బెంజ్ కార్ల వరకు చిరు దగ్గర ఉన్నాయి. చాలాసార్లు వాటి ఫొటోలు వైరలయ్యాయి. (ఇదీ చదవండి: లావణ్యని ఇప్పటివరకు ఆ ప్రశ్న అడగలేదు: వరుణ్ తేజ్) తాజాగా వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కనిపించిన చిరు.. ఏ.లాంజ్ & సోహ్నే అనే బ్రిటీష్ కంపెనీ చేతి గడియారంతో కనిపించారు. దీని ధర ఎంత అని ఆరా తీస్తే షాకింగ్ నంబర్స్ కనిపించాయి. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.50,56,747 అని తెలుస్తోంది. అంటే అరకోటి అనమాట. అదేదో సినిమాలో అన్నట్లు చిరు కట్టుకున్న ఈ వాచీ అమ్మితే బ్యాచ్ బ్యాచ్ సెటిలైపోవచ్చు! చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమాలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాని డైరెక్టర్ వశిష్ట తీస్తున్నారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ తీస్తున్న ఈ మూవీ.. 2025 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు కూడా. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
సికింద్రాబాద్ క్లాక్ టవర్.. ఆగిపోయిన టిక్ టిక్
సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో ఉన్న చరిత్రాత్మక క్లాక్ టవర్ టిక్ టిక్ అనడం ఆగిపోయింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ హిస్టారికల్ గడియారంలో టైమ్ ఆగిపోయి ఐదు రోజులు గడుస్తున్నా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) సిబ్బంది పట్టించుకోవడం లేదు. అయితే తాము సోమవారం క్లాక్‌ను రిపేర్ చేస్తామని జీహచ్ఎంసీ సిబ్బంది చెబుతున్నారు. సాధారణంగా క్లాక్ పనిచేయడం ఆగిపోతే స్థానికులు తమకు సమాచారమిస్తారని, ఈసారి అలాంటి ఫిర్యాదు ఏదీ రాకపోవడం వల్లే రిపేర్ ఆలస్యమైందని జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చెప్పారు. ఇదీచదవండి.. కిటికీలు తొలగించి చొరబాటు -
సినిమాలు చూడండి.. రూ. 1.6 లక్షలు అందుకోండి!
సినిమాలు చూడండి.. 2000 డాలర్లు (రూ. 1.6 లక్షలు) అందుకోండి.. అంటోంది ఓ అమెరికన్ కంపెనీ. మీరు చేయాల్సిందల్లా వాళ్లు చెప్పిన సినిమాలు చూసి మీ అభిప్రాయాలను తెలియజేయడమే. యూఎస్‌కు చెందిన బ్లూమ్‌సీబాక్స్ (BloomsyBox) అనే సంస్థ వివిధ సంవత్సరాల్లో విడుదలైన పేరొందిన 12 క్రిస్మస్ సినిమాలను చూసి అభిప్రాయాలు పంచుకోవాలని సినీ ఔత్సాహికులను కోరుతోంది. ఎంపికైనవారు వాళ్లు చెప్పిన క్రిస్మస్ సినిమాలను చూసి ప్రతి సినిమా గురించి వారి అభిప్రాయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి డబ్బుతో పాటు హాట్ కోకా, రెండు జతల యూజీజీ సాక్స్‌లు, పీకాక్‌కి ఒక సంవత్సరం సబ్స్క్రిప్షన్, 12 నెలల ఫ్లవర్ సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ అందజేస్తుంది చూడాల్సిన 12 సినిమాలు ఇవే.. ది మోస్ట్ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ ది ఇయర్ (2008) క్రౌన్ ఫర్ క్రిస్మస్ (2015) ది నైన్ లైవ్స్ ఆఫ్ క్రిస్మస్ (2014) క్రిస్మస్ గెటవే (2017) జర్నీ బ్యాక్ టు క్రిస్మస్ (2016) గోస్ట్స్ ఆఫ్ క్రిస్మస్ ఆల్వేస్ (2022) ఫ్యామిలీ ఫర్ క్రిస్మస్ (2015) క్రిస్మస్ అండర్ రాప్స్ (2014) త్రీ వైస్ మెన్ అండ్ ఏ బేబీ (2022) ఎ రాయల్ క్రిస్మస్ (2014) నార్త్‌పోల్ (2014) ది క్రిస్మస్ ట్రైన్ (2017) -
తారక్ చేతికున్న వాచ్ ధరెంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!
Jr NTR Patek Philippe Watch: తెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న 'జూనియర్ ఎన్టీఆర్' గురించి పరిచయమే అవసరం లేదు. మంచి నటనా నైపుణ్యంతో ప్రేక్షులకు హృదయాలను దోచుకున్న ఈ నటుడు అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇందులో భాగంగానే లగ్జరీ కార్లు, ఖరీదైన వస్తువులు వినియోగిస్తారు. ఇటీవల ఆయన చేతికి పెట్టుకున్న వాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల నందమూరి సుహాసిని తనయుడు హర్ష వివాహానికి హాజరైన జూ. ఎన్టీఆర్ సుమారు రూ. 2.45 కోట్లు విలువైన వాచ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇది 'పాటక్ ఫిలిప్' అనే స్విజర్ల్యాండ్ బ్రాండ్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో జూ. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో కూడా మరో పాటక్ ఫిలిప్ వాచ్ పెట్టుకుని కనిపించాడు. దీని ధర రూ. 1.56 కోట్లు కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇంకా ఈయన వద్ద రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్, బృందావనం పేరుతో ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉందని సమాచారం. ఇదీ చదవండి: రూ. 76000 మ్యాక్‌బుక్ ఆర్డర్ చేస్తే.. వచ్చింది ఇదా? ఖంగుతిన్న కస్టమర్! ఇక కార్ల విషయానికి వస్తే.. ఈయన వద్ద లంబోర్ఘిని ఉరుస్ గ్రాపైట్ క్యాప్స్యూల్, రేంజ్ రోవర్ రోగ్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే మూవీ చేస్తున్నారు. ఇది 2024లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Jr NTR Universe ™ (@ntr.universe) -
వామ్మో.. చిరంజీవి చేతికున్న వాచ్ అన్ని కోట్లా?
Chirajeevi Expensive Watch: ఇటీవల విడుదలైన బేబీ చిత్రం అంచనాలను దాటుకుంటూ మంచి వసూళ్లను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఆ చిత్ర బృందం జులై 30న హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా మెగాస్టార్‌ని ఆహ్వానించారు. ఈ వేడుకల్లో కనిపించిన చిరంజీవి చేతికున్న వాచ్ చాలా మందిని ఆకర్శించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బేబీ చిత్ర బృందం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన చిరంజీవి కట్టుకున్న వాచ్ ధర 230000 డాలర్లు లేదా రూ. 1.90 కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఇది రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ వాచ్ కావడం గమనార్హం. ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి! ఇది చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ ధర మాత్రం భారీగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు చలన చిత్ర సీమలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి నటులు కూడా ఖరీదైన వాచ్‌లు కలిగి ఉన్నారన్న సంగతి గతంలో చాలా సార్లు అనేక కథనాల్లో వెల్లడయ్యాయి. కాగా మెగాస్టార్ త్వరలో భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులను అలరించున్నారు. -
స్టార్ సింగర్ మెడలో డైమండ్ వాచ్.. ఎన్ని కోట్లో తెలుసా?
మీరు వాచీ ఎక్కడ కట్టుకుంటారు? అని అడగ్గానే ఇదేం పిచ్చి ప్రశ్న అని కిందనుంచి పైవరకు చూసి.. చేతికి కట్టుకుంటాం అని చెబుతారు. కానీ కొన్ని గడియారాలు ఉంటాయి. వాటిని బాడీలో ఎక్కడపడితే అక్కడ కట్టుకోవచ్చు! ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఓ ప్రముఖ పాప్ సింగర్ తన మెడకు ఓ డైమండ్ వాచ్ ధరించి కనిపించింది. ఇప్పుడు ఆ వాచ్, దాని ధర సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. (ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!) మన దగ్గర పెద్దగా ఉండదు కానీ పాశ్చాత్య దేశాల్లో పాప్ కల్చర్ చాలా ఎక్కువ. పాప్ సాంగ్స్ పాడే సింగర్స్ ని పిచ్చిపిచ్చిగా అభిమానిస్తారు. అలా ఫేమస్ అయింది రిహానా. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది. తాజాగా తన భాయ్ ఫ్రెండ్ రాకీతో కలిసి ఓ చోట కనిపించింది. అయితే ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు కానీ ఆమె మెడకు వాచ్ ఉండటం కాస్త వింతగా అనిపించింది. అది వజ్రాలతో పొదిగిన గడియారం కావడం మరింత ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ వాచ్ ధర గురించి మాట్లాడుకుంటే రూ.5.7 కోట్లు రూపాయలని తెలుస్తోంది. జాకబ్ & కో కంపెనీ.. పాప్ సింగర్ రిహానా కోసం ప్రత్యేకంగా ఈ వజ్రాల గడియారాన్ని డిజైన్ చేశారు. మెడపై ఓ వాచ్ ధరించడం ఇదే తొలిసారి అని చెప్పుకొచ్చింది. తమ కంపెనీ ఇన్ స్టా పేజీలో రిహానా వాచ్ తో ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వాచ్, దాని కాస్ట్ చూసిన నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. View this post on Instagram A post shared by JACOB & CO. (@jacobandco) (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) -
రూ.2 వేల వాచీ.. రూ.59 వేలకు విక్రయం!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఈ ఏడాది మార్చిలో జరిగిన అగ్నిప్రమాదం క్యూ–నెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) సంస్థ అక్రమ దందాను మరోసారి తెరపైకి తెచ్చింది. ఆ దుర్ఘటనలో చనిపోయిన ఆరుగురూ దీని ఉద్యోగులే. ఈ ఘటనపై నమోదైన కేసులను దర్యాప్తు చేసిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు.. ఈ సంస్థ సౌత్ ఇండియా ఆపరేషన్స్ హెడ్ గుమ్మడిల్లి రాజేశ్ అలియాస్ రాజేశ్ ఖన్నాను బెంగళూరులో అరెస్టు చేశారు. ఈ సంస్థ ఎంఎల్ఎం పేరిట తక్కువ ఖరీదైన వస్తువులను అత్యంత ఎక్కువ రేటుకు అమ్ముతోందని.. రూ.2 వేల వాచీని రూ.59 వేలకు విక్రయించినట్టు ఆధారాలు సేకరించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. కేసులు నమోదవడంతో పేరు మార్చి.. హాంకాంగ్ కేంద్రంగా ఎంఎల్ఎం దందా చేస్తున్న క్యూ–నెట్‌పై అనేక కేసులు నమోదవడంతో.. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ‘వీ–ఎంపైర్’ పేర్లతో మళ్లీ దందా ప్రారంభించింది. ఈ సంస్థలో టెలీకాలర్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ప్రమోటర్స్, టీమ్ లీడర్లుగా చాలామంది పనిచేస్తున్నారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ ఐదో అంతస్తులోని ఫ్లాట్ నంబర్ 511లో దీని కార్యాలయం ఉంది. రాజేశ్ ఖన్నా, ఉపేందర్‌రెడ్డి, శివనాగ మల్లయ్య, కటకం మల్లేశ్, నాగమణి సహా 12 మంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి నెలా కనీసం రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదించవచ్చంటూ ఎరవేయడం.. ఇప్పటికే ‘వీ–ఎంపైర్’లో చేరినవారు నెలకు రూ.50వేల నుంచి రూ.1.5లక్షల దాకా సంపాదిస్తున్నారని అమాయకులకు ఎర వేస్తున్నారు. మూడు కోట్లు వసూలు చేసి.. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసు బృందం.. ఇప్పటివరకు హైదరాబాద్‌లోనే 159 మంది బాధితుల నుంచి రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్టు గుర్తించింది. దేశవ్యాప్తంగా ఇంకా ఎంతో మంది బాధితులు ఉంటారని పోలీసులు తెలిపారు. రాజేశ్ ఖన్నా వద్ద లభించిన 35 బ్యాంకు ఖాతాల్లోని రూ.54 కోట్ల నగదును ఫ్రీజ్ చేశామని.. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. -
రాధిక మర్చంట్, ఫ్రెండ్ ఒర్రీ: ఈ టీషర్ట్, షార్ట్ విలువ తెలిస్తే షాకవుతారు
సాక్షి,ముంబై: రిలయన్స్ అధినేత అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్ స్నేహితుడు ఓర్హాన్ అవతరమణి (ఒర్రీ) తెగ సందడి చేశాడు. దుబాయ్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన అనంత్ అంబానీ బర్త్‌డే బాష్‌లో ఖరీదైన దుస్తులు, ఎటైర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. స్టార్ కిడ్స్ బర్త్‌డే బాష్ ఆ సందడి లెవలే వేరుంటది. ఈ ఎ ంజాయ్మెంట్ కతే వేరుంటంది. ఎవరికి వాళ్లు స్పెషల్‌గా ఉండాల్సిందే. ముఖ్యంగా దుబాయ్‌లో అనంత్ 28 పేరుతో నిర్వహించిన బర్త్‌డే ఈవెంట్లో రాధికా మర్చంట్, ఒర్రీ తదితరులు ధరించిన టీ షర్ట్స్ ధర 40వేలు, షార్ట్‌లు రూ. 45వేలు. అలాగే ఒర్రీ ధరించిన రూ. 10,000 ఖరీదు చేసే నైక్ స్నీకర్లు స్పెషల్ ఎట్రాక్షన్ అలాగే ఇటీవల నిర్వహించిన ఎన్ఎంఏసీసీఏ ఈవెంట్లోరూ. 3 లక్షల విలువైన డిజైనర్ సూట్‌ను ధరించాడట.ఈ నవ్భూమి సెట్ చాలా తేలికగా ఉండే ఆర్గాన్జా సిల్క్‌తో తయారు చేసింది.దీంతోపాటు షీర్ ట్యాంక్ టాప్స్ కూడా ధరించాడు. అలాగే రాధిక మర్చంట్ రూ.2 కోట్ల విలువైన క్లచ్‌తో వార్తల్లో నిలిచారు. అనంత్ పుట్టిన రోజు సందర్భంగా దుబాయ్‌లో స్కైడైవింగ్ కూడా చేసిన సంగతి తెలిసిందే. కాగా నైసా దేవగన్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌తో సహా పలువురు స్టార్ కిడ్స్‌కి మంచి ఫ్రెండ్ ఒర్రీ. జోర్జ్ , షహనాజ్ అవత్రమణిలకు ఆగస్ట్ 1999లో జన్మించాడు. సింగర్, రైటర్, ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి మూడు లక్షల మందికి పైగా ఫాలోవర్లతో ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీ కూడా. 2017లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేరాడు. ఎప్పుడూ డిజైనర్ దుస్తులనే ధరించే ఒర్రీ ఖుషీ కపూర్‌తో ఇటీవలి ఫోటోలో 55000 విలువైన బుర్బెర్రీస్ కో-ఆర్డ్ సెట్‌ను ధరించాడు. అలాగే వేసుకున్న షూ ధర రూ. 90వేలు. బ్రాస్లెట్ ఖరీదు రూ. 5.73 లక్షలు.అతను ధర రూ. 30000 ధరించిన తెల్లటి చొక్కా ధరించిన మరొక ఫోటోను పంచుకున్నాడు. బ్రాండ్ ఓర్లెబార్ బ్రౌన్ షార్ట్ రూ. 47వేలకు పై మాటే. ఇక అతను ధరించే రోలెక్స్ వాచ్ విలువ రూ. 72 లక్షలు . బాలెన్సియాగా షూస్ ధర రూ. 90వేలు. వీటనికి తోడు Mercedes-Benz G-వ్యాగన్ కారు కూడా అతని సొంతం. -
అనంత్ అంబానీ వాచ్ ధర ఎన్ని కోట్లో తెలిస్తే గుడ్లు తేలేస్తారు!
ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో ఒకరైన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఇటీవల 'నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్' (NMACC) ప్రారంభోత్సవ వేడుకలు ప్రారభించారు. ఇందులో ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ తనకి కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో కలిసి కనిపించారు. ఈ వేడుకల్లో రాధిక మర్చంట్ ఖరీదైన హ్యాండ్ బ్యాగు మాత్రమే కాకుండా.. వారు ధరించిన ఖరీదైన దుస్తులు, ఇతర వస్తువులు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. వీటితో పాటు అనంత్ అంబానీ ధరించిన వాచ్ (Watch) చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దీని ధర సుమారు రూ. 18 కోట్లు వరకు ఉండటం గమనార్హం. ఇది అనంత్ అంబానీ కోసం ప్రత్యేకంగా తయారు చేయించినట్లు తెలుస్తోంది. పాటెక్ ఫిలిప్ కంపెనీ తయారు చేసిన ఈ వాచ్‌కి ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయని, ఇప్పటి వరకు తయారు చేసిన అత్యంత ఖరీదైన చేతి గడియారాల్లో ఇది చాలా ప్రత్యేకమైందని 'ద ఇండియన్ టెక్నాలజీ' ఇన్స్టాగ్రామ్ పేజీలో వెల్లడించారు. ఈ వాచ్‌కి రివర్సిబుల్ మెకానిజం, రెండు ఇండిపెండెంట్ డయల్స్, ఎంచుకున్న సమయానికి ప్రత్యేక శబ్దంతో అలర్ట్ చేసే అలారం, డేట్ రిపీటర్, మాన్యువల్ ఆపరేటర్ వంటి దాదాపు ఇరవై కంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయని సమాచారం. వైట్ గోల్డ్ కలర్లో ఫ్రంట్, బ్యాక్ డయల్స్ కలిగిన ఈ ఖరీదైన వాచ్ ఎలిగేటర్ లెదర్, చేతితో కుట్టిన క్లాస్ప్‌తో గోల్డ్ డయల్ ప్లేట్లతో అలంకరించబడి చూడచక్కగా ఉంటుంది. ఈ ప్రారంభ కార్యక్రంలో బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) -
స్టైలిష్ లుక్‌లో తారక్.. చేతి వాచీ ధర ఎన్ని కోట్లో తెలుసా?
ఆర్ఆర్ఆర్తో ప్రపంచస్థాయిలో సత్తా చాటారు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి, కీరవాణి. ఆస్కార్ రావడం కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ, షోలలో పాల్గొంటూ ఎంతో కష్టపడ్డారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించి ఆస్కార్‌ను పట్టేశారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ లభించింది. ఇక లాస్ ఏంజిల్స్‌లో ప్రమోషన్లలో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించాడు తారక్. ఆ సమయంలో తారక్ చేతికి ధరించిన వాచీపై అందరి దృష్టి పడింది. తారక్‌కు వాచెస్ అంటే ఎంతిష్టమో తెలిసిందే! ఎప్పటికప్పుడు కొత్త వాచీతో దర్శనమిస్తాడు హీరో. లేటెస్ట్గా మరో కొత్త వాచీతో కనిపించడంతో అభిమానులు దాని గురించి ఆరా తీస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న చేతి గడియారం పటేక్ ఫిలిప్ బ్రాండెడ్‌కు చెందినది. దీని ధర కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఇది స్విట్జర్లాండ్‌కు చెందిన కంపెనీ కాగా దీనికి వంద ఏళ్ల చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో మీడియా సమావేశానికి హాజరైనప్పుడు నాలుగు కోట్ల రూపాయల విలువైన రిచర్డ్ మిల్లీ బ్రాండ్‌కు చెందిన వాచీ ధరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు యంగ్ టైగర్. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
షారుక్ ఖాన్ ధరించిన వాచ్ అన్ని కోట్లా?
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పఠాన్. జనవరి 25న రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.877 కోట్లు రాబట్టింది. సినిమా సక్సెస్‌తో ఒక్క చిత్రయూనిటే కాదు బాలీవుడ్ మొత్తం ఫుల్ ఖుషీ అవుతోంది. హిందీ చిత్రపరిశ్రమకు మళ్లీ మంచిరోజులొచ్చాయని అంతా సంబరపడుతున్నారు. కాగా ఇటీవల జరిగిన పఠాన్ సక్సెస్ ఈవెంట్లో షారుక్ తన చేతికి ఖరీదైన బ్లూ కలర్ వాచ్ ధరించాడు. తాజాగా దీపికా పదుకొణె షేర్ చేసిన వీడియోలో సైతం అదే వాచీతో దర్శనమిచ్చాడు. దీంతో అందరూ ఈ చేతి గడియారం ఏ బ్రాండ్‌కు చెందినది? దీని ఖరీదెంత? అని ఆరా తీస్తున్నారు. ఆ విషయానికి వస్తే.. షారుక్ ధరించిన వాచ్ 'అడెమర్స్ పిగెట్' అనే లగ్జరీ వాచ్ బ్రాండ్‌కు చెందినది. దీని ఖరీదు అక్షరాలా రూ.4.98 కోట్లని తెలుస్తోంది. ఇకపోతే షారుక్‌కు కోట్లు విలువ చేసే బీఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్, బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, ఆడి సహా మరికొన్ని కార్లు ఉన్నాయి. అలాగే మన్నత్‌లో రూ.200 కోట్లు విలువ చేసే ఇల్లు కూడా ఉంది. #SRK doing a skincare routine is the most adorable thing you'll see today🥹❤️ Book your tickets now to watch him in an action packed avatar in #Pathaan:https://t.co/z4YLOG2NRI | https://t.co/lcsLnUSu9Y@iamsrk @deepikapadukone#ShahRukhKhan #DeepikaPadukone #JohnAbraham #YRF50 pic.twitter.com/3LCDxY57UJ — Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) February 9, 2023 The #Pathaan festivities continue ❤️💥 Book your tickets now! https://t.co/SD17p6x9HI | https://t.co/VkhFng6vBj Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/i82UrCWq7v — Yash Raj Films (@yrf) February 9, 2023 చదవండి: ఆర్థికసాయం కోసం అభిమాని ఎదురుచూపులు, గుర్తుపట్టి సాయం చేసిన బన్నీ -
జాన్సన్ లిఫ్టుల్లో ‘వాచ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లిఫ్టులు, ఎస్కలేటర్స్ తయారీలో ఉన్న జాన్సన్ లిఫ్ట్స్.. వాచ్ పేరుతో ఐవోటీ ఆధారిత వైర్లెస్ సాఫ్ట్వేర్ పరికరాన్ని అభివృద్ధి చేసింది. లిఫ్ట్ స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడమేగాక సమస్య తలెత్తితే ఈ పరికరం వెంటనే గ్రహించి డేటా సెంటర్‌కు సమాచారం చేరవేస్తుంది. సాంకేతిక సిబ్బంది రంగంలోకి దిగి సమస్యను త్వరగా పరిష్కరించేందుకు వాచ్ ఉపయోగపడుతుందని కంపెనీ ప్రకటించింది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
హరీష్ శంకర్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బండ్ల గణేష్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో 'గబ్బర్ సింగ్' ఒకటి. ఈ సినిమా వచ్చి పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్‌కు నిర్మాత బండ్ల గణేష్ ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మీరు లేకపోతే ఈ సినిమా అంత వేగంగా పూర్తయ్యేది కాదంటూ ట్వీట్ చేశారు. కాగా హిందీలో సూపర్ హిట్‌గా నిలిచిన దబాంగ్ రీమేక్ చిత్రమే గబ్బర్ సింగ్. 2012లో విడుదలైన ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ నటించింది. ఈ సినిమా విడుదలై నిన్నటికి పదేళ్లు అయిన సందర్భంగా హరీష్ శంకర్‌కు సుమారు రూ. 5లక్షలు విలువచేసే వాచ్‌ను బండ్ల కానుకగా ఇచ్చారు. Successful Producer Bandla Ganesh gifted an expensive watch to Blockbuster Director Harish Shankar on the occasion of #DecadeForGabbarSingh #10YearsForGabbarSingh @harish2you @ganeshbandla pic.twitter.com/brxVrCRB6f — Vamsi Kaka (@vamsikaka) May 11, 2022 -
ఖరీదైన వాచ్ పెట్టుకున్న ఎన్టీఆర్, ధరెంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్లను సాధించడంతో ముంబైలో సక్సెస్ పార్టీ నిర్వహించారు మేకర్స్. ఈ ఫంక్షన్‌కు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో సహా బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. అయితే ఈ వేడుక కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్ చేతికి పెట్టుకున్న వాచ్ కెమెరాల కంటపడింది. ఇంకేముందీ, ఎన్టీఆర్ చేతికి పర్ఫెక్ట్గా సెట్టయ్యిన ఆ వాచ్ గురించి సెర్చింగ్ మొదలుపెట్టగా దాని ధర కోటిన్నర పైనే ఉందని తెలుస్తోంది. ఆ వాచ్ పేరు Patek Philippe Nautilus 5712 1/A. మీకీపాటికే అర్థమై ఉంటుంది ఇది విదేశాలకు చెందిన బ్రాండెడ్ వాచ్ అని! వాచీలంటే మక్కువ చూపే ఎన్టీఆర్ దీన్ని సొంతం చేసుకునేందుకు కోటి 70 లక్షల పైనే ఖర్చు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ బ్రాండ్‌లో లభించే ప్రతి వాచ్ కూడా చాలా ఖరీదైనదే! కాగా గతేడాది ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లోనూ తారక్ ఖరీదైన వాచ్ ధరించాడు. రిచర్డ్ మిల్లే RM కు చెందిన 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ అనే బ్రాండెడ్ వాచ్‌తో కనిపించాడు. దీని ధర దాదాపు నాలుగు కోట్ల రూపాయలు. ఇలా ఎన్టీఆర్ దగ్గర బ్రాండెడ్ వాచ్‌లు మరికొన్ని ఉన్నాయట! చదవండి: విజయ్‌పై షారుక్ ఆసక్తికర వ్యాఖ్యలు, దళపతి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే.. కొత్త బైక్ కొన్న హీరో, ఎన్ని లక్షలో తెలుసా? -
యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన బుల్గారీ
ఇటలీకి చెందిన ప్రముఖ వాచీల తయారీ సంస్థ బుల్గారీ తాజాగా సరికొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోకెల్లా అత్యంత తక్కువ మందంగల మెకానికల్ చేతి గడియారాన్ని రూపొందించి యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ద బుల్గారీ ఆక్టో ఫినిస్సిమో అల్ట్రా పేరిట మార్కెట్లోకి విడుదల చేసిన ఈ ప్రత్యేక ఎడిషన్ వాచీ మందం ఎంతో తెలుసా.. 1.8 మిల్లీమీటర్లు మాత్రమే! దీన్ని మరోలా చెప్పాలంటే ఈ వాచీ మందం యూరో, ఆస్ట్రేలియా, అమెరికా కరెన్సీలకు చెందిన 10, 20, 5 సెంట్ల నాణేలకన్నా తక్కు వగా ఉండటం విశేషం. ఈ వాచీలో ఇదొక్కటే ప్రత్యేకత కాదండోయ్... దీని డిజైన్ మొదలు అందులో వాడిన పదార్థాల వరకు అన్నీ విభిన్నమైనవే. అష్టభుజి ఆకారం లోని ఈ వాచీ చట్రం, బ్రేస్‌లెట్‌ను టైటానియంతో, అడుగు భాగాన్ని టంగ్స్టన్ కార్బైడ్తోనూ తయారు చేశారు. వాచీ లోని చక్రాలను మాత్రం స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందించారు. మొత్తం 170 పరికరాలు ఈ వాచీలో ఉన్నాయి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వాచీలో ఒక క్యూఆర్ కోడ్‌నుకూడా నిక్షిప్తం చేశారు. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే వాచీ విశిష్టతలు తెలియజేయడంతోపాటు 3డీ వర్చువల్ వరల్డ్‌లోకి అనుసంధానమయ్యే ఏర్పాటు ఉంది. ఇంతటి సంక్లిష్టమైన వాచీ తయారీకి బుల్గారీ కంపెనీకి మూడేళ్ల సమయం పట్టిందట. ఇంతకీ దీని ధర ఎంత అంటారా? కేవలం రూ. 3.35 కోట్లు మాత్రమే! అది కూడా ఆక్టో ఎడిషన్ కింద కేవలం 10 వాచీలనే రూపొందించింది. అన్నట్టు.. ఈ సంస్థకు వివిధ తరహా వాచీలకు సంబంధించి ‘అత్యంత పలచని’విభాగంలో ఇది ఎనిమిదో ప్రపంచ రికార్డు అట! – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
అదిరిపోయిన అంబ్రేన్ 'ఫిట్‌షాట్ స్పియర్' స్మార్ట్‌వాచ్..!
భారతీయ స్మార్ట్‌ఫోన్ యాక్సెసరీ బ్రాండ్ అంబ్రేన్ తన సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. తాజాగా అంబ్రేన్ తన కొత్త ‘ఫిట్‌షాట్' సిరీస్‌లో స్పియర్ స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది. ఫిట్‌షాట్ స్పియర్ పేరుతో దీన్ని రూ.4,999 ధర వద్ద విడుదల చేసింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్'లో ఈ బడ్జెట్ స్మార్ట్‌వాచ్ అమ్మకాలకు రానుంది. ఇది ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది. ఆంబ్రేన్ ఫిట్‌షాట్ జెస్ట్ స్మార్ట్‌వాచ్ 1.28 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ 24x7 రియల్ టైమ్ హెల్త్ ట్రాకింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ సహాయంతో Spo2, రక్తపోటు, నిద్ర, హృదయ స్పందన రేటు వంటి పారామీటర్లను కొలవొచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ స్టెప్ ట్రాకర్‌కు కూడా మద్దతిస్తుంది. ఎన్ని కాలరీలను ఖర్చు చేశామనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మరోవైపు, ఈ స్మార్ట్‌వాచ్ సహాయంతో ఫిజికల్ యాక్టివిటీ హిస్టరీని రికార్డ్ చేయవచ్చు. 270 mAh బ్యాటరీ ఇందులో ఉంది. ఈ వాచ్ ఐపీ67- రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. తద్వారా, ఈ స్మార్ట్‌వాచ్ నీటిలో తడిచినా పాడవ్వదు. మరోవైపు, ఈ స్మార్ట్‌వాచ్ 47కి పైగా క్లౌడ్ -ఆధారిత వాచ్ ఫేస్‌లకు మద్దతిస్తుంది. యూజర్లు వారి స్మార్ట్‌ఫోన్‌లో అంబ్రేన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు హెల్త్ హిస్టరీని ట్రాక్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ వాయిస్- అసిస్టెన్స్ ఫీచర్‌తో వస్తుంది. మరోవైపు, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌కు మద్దతిస్తుంది. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయ్యేందుకు అనుమతిస్తుంది. (చదవండి: ఈ యాప్ వాడుతున్న వారికి ఆర్బీఐ అలర్ట్..!) -
Jr NTR Watch Cost: వామ్మో.. ఎన్టీఆర్ ధరించే వాచ్ అన్ని కోట్లా!
బ్రాండ్ల విషయంలో ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆ మధ్య ఆయన ధరించే మాస్క్, బ్లేజర్, షూల గురించి సోషల్ మీడియాలో చర్చ జరగ్గా..ఇప్పుడు ఆయన చేతికి ఉన్న వాచ్ చర్చనీయాంశంగా మారింది. మరి ఆ వాచ్ ప్రత్యేక ఏంటనేది డౌట్ రావొచ్చ. అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. రీసెంట్గా జరిగిన ‘ఆర్ఆర్ర్’ప్రెస్మీట్లో ఎన్టీఆర్ చేతికి ధరించిన వాచ్‌పై అందరి దృష్టి పడింది. అది చాలా స్పెషల్‌గా ఉండడంతో.. దీని ధర ఎంత ఉంటుందబ్బా.. అని సెర్చ్ చేస్తే.. దిమ్మతిరిగిపోయింది. ఆ వాచ్ ధర దాదాపు నాలుగు కోట్ల రూపాయలు(5,14,800 డాలర్లు) . రిచర్డ్ మిల్లే RM కు చెందిన 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ వాచ్ అది(Richard Mille rm 011 CarbonNtpt Grosjean Rose Gold lotus F1 Team limited Edition). ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన వాచ్‌లతో ఇది ఒకటి. ఈ బ్రాండ్‌లో లభించే ప్రతి వాచ్ చాలా ఖరీదైనదే. ఎన్టీఆర్ ఇష్టంతో ఈ వాచ్ కొలుగోలు చేశాడట. ఇలాంటివి ఆయన దగ్గర మరో రెండు వాచ్ లు ఉన్నాయని సమాచారం. వాస్తవానికి ఎన్టీఆర్ కి కార్లు, వాచ్‌లు, దుస్తులు అంటే చాలా ఇష్టం. వాటికోసం కోట్లలో ఖర్చు చేస్తుంటారు. ఎన్టీఆర్ కి నచ్చితే చాలు.. రేటు చూడకుండా కొనేస్తారు. -
RC15 : రామ్‌చరణ్ ధరించిన ఈ కాస్ట్లీ వాచ్ ధరెంతో తెలుసా?
Ram Charan Wears Richard Mille Watch At RC15 Launch: సెలబ్రిటీలు ధరించే దుస్తులు, వాచ్‌ల దగ్గర్నుంచి వేసుకునే బ్యాగులు, చెప్పుల వరకు దాదాపు అన్ని కాస్ట్లీగానే ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు. తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిరంజీవి, ఎస్.ఎస్. రాజమౌళి,రణ్వీర్ సింగ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో రామ్‌చరణ్ ధరించిన వాచీపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.రామ్‌చరణ్ ధరించిన వాచ్ మోడల్ ఏంటి? దాని ధరెంత అని సెర్చ్ చేయగా అది 'రిచర్డ్ మిల్లె RM 61-01 యోహన్ బ్లేక్ మోడల్' అని తెలిసింది. ఒలంపిక్స్‌లో 100,200 మీటర్లలో ఫాస్టెస్ట్ రన్నర్‌గా ప్రపంచ రికార్డ్ సాధించిన యోహన్ బ్లేక్ కోసం 'రిచర్డ్ మిల్లే' కంపెనీవారు ఈ వాచ్‌ని స్పెషల్‌గా డిజైన్ చేశారు. అప్పటి నుంచి ఈ వాచ్‌కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. బ్లాక్ కలర్ రబ్బర్ స్ట్రిప్ తో పాటు యల్లో, గ్రీన్ కాంబోతో డైల్ కలర్స్ రావడం ఈ వాచ్ కి మరింత గ్రాండ్ లుక్‌ను తీసుకువచ్చింది. వందశాతం వాటర్ రెసిప్టెన్సీ ఉన్న ఈ వాచ్ ధర 124500 యూరోలు. అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ.1,02 కోట్లు అనమాట. చదవండి : RC15: సూటుబూటు వేసుకొని స్టయిలిష్‌గా పోస్టర్ ఆర్సీ 15 పోస్టర్‌కు డైరెక్టర్ ఎంత ఖర్చు పెట్టించాడో తెలుసా! -
వైరలవుతున్న రామ్ చరణ్ కాస్ట్లీ వాచ్.. ధరెంతో తెలుసా?
సెలబ్రిటీలు ఏం చేసినా అది వార్తే అవుతుంది. ఏది తిన్నా, ఎటు వెళ్లినా, ఏం ధరించినా అది సెన్సెషనల్ టాపిక్‌గా మారుతుంది. ఇటు అభిమానులు సైతం తాము ఇష్టపడే స్టార్ల లైఫ్‌స్టైల్‌ను ఇంట్రెస్ట్‌గా అబ్జర్వ్ చేస్తుంటారు. తల నుంచి కాళ్ల వరకు ఏదీ వదలకుండా ఏం ధరించారని జల్లెడ పట్టి మరీ చూస్తుంటారు. ఇటీవల కాలంలో సెలబ్రెటీలు ధరించిన దుస్తులు, వాచ్‌లు, షూస్, హ్యండ్‌బ్యాగ్ ఇలా అన్నింటి ధరలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ ధరించిన ఓ వాచ్ ఖరీదుపై నెట్టింట్లో తెగ చర్చ జరుగుతోంది. చరణ్ ధరించిన వాచ్ పేరు, దాని ఖరీదు చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. ఈ హీరో ధరించిన వాచ్ లక్ష 50 వేల డాలర్లు అట. అంటే మన ఇండియన్ కరెన్సీలో దీని ధర ఏకంగా కోటి 50 లక్షలు. ఈ మధ్యకాలంలో చెర్రీ ఎక్కువగా ఈ వాచ్‌తోనే కనిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ వాచ్ ఖరీదు బయటపడటంతో అంత కాస్ట్లీనా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్నంగా స్పందిస్తున్నారు. ఇంత ఖరీదైన వాచ్‌తో సామాన్యులు జీవితాంతం సంతోషంగా బతికేయచ్చు అని అంటుంటే.. మరికొందరు స్టార్స్ అన్నప్పుడు ఆమాత్రం ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోవర్గం వారు ఆ వాచ్ డబ్బులు పేదవాళ్లకు ఇచ్చిన ఎంతోమంది బాగుపడతారు అంటూ హితవు పలుకున్నారు. View this post on Instagram A post shared by Bhimavaram abbai memes 🔥 (@kastha_navvu_babai) ఇక రామ్ చరణ్ విషయానికొస్తే.. చరణ్ వెండితెరమీద కనిపించి రెండేళ్లు దాటింది. అయినప్పటికీ చెర్రీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆ మధ్యలో సైరా నర్సింహరెడ్డి చిత్రానికి నిర్మాతగా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం యంగ్‌టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. చెర్రీకి జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ లోనూ రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న చరణ్ సిద్ధ అనే కీలక పాత్రలోనూ కనిపించనున్నాడు. ఈ రెండిటి అనంతరం స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. చదవండి: రామ్‌చరణ్ సపోర్ట్ దొరకడం మర్చిపోలేను: యంగ్ హీరో చదవండి: భాగ్యమిత్ర లాటరీ.. సెక్యూరిటీ గార్డు కరోడ్‌పతి -
మొదటి ప్రపంచ యుద్ధం ఇప్పటికీ ఉంది
మొదటి ప్రపంచ యుద్ధానికి ఇదేమీ ‘టైమ్’ కాదు. టైమ్ అంటే సందర్భం. వరల్డ్ వార్–1 మొదలైంది 1914 జూలై 14. ముగిసింది 1918 నవంబర్ 11న. ప్రారంభానికీ, ముగింపునకు వందేళ్లు ఎప్పుడో దాటిపోయాయి. పోనీ ఈ ప్రథమ ప్రపంచ సంగ్రామానికి కారకుడైన బోస్నియా యువకుడు గవ్రిలో ప్రిన్సిప్ బర్త్, డెత్‌ల తేదీల కూడా దగ్గర్లో ఏమీ లేవు. మరేమిటి! అకస్మాత్తుగా యుద్ధం–1? ఒక విశేషం అయితే ఉంది. ఎయిడ్స్‌కు కారణమైన హెచ్.ఐ.వి. వైరస్ అసలు ఎక్కడి నుంచి సంక్రమించిందో కనిపెట్టేందుకు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్న ఒక కెనడా ప్రొఫెసర్‌కు మధ్య ఆఫ్రికాలోని కామెరాన్‌లో మొదటి ప్రపంచ యుద్ధం మధ్య కాలం నాటి (1916) సైనికుడొకరు ఆకలికి తట్టుకోలేక ఒక చింపాజీని చంపి తినడంతో ఆ చింపాజీ నుంచి ఎయిడ్స్ క్రిమి సంక్రమించిన జాడలు కనిపించాయి. అలా.. చింపాంజీ టు మనిషి.. ఎయిడ్స్ వచ్చి ఉంటుందని ఆ ప్రొఫెసర్ గారొక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ సంగతిని తాజాగా కెనడా, యూఎస్‌లలోని మెడికల్ జర్నల్స్ ప్రకటించాయి. ఎయిడ్స్‌ని అలా ఉంచితే.. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మానవాళికి ‘సంక్రమించిన’ కొన్ని ఇన్వెన్షన్స్ కూడా ఉన్నాయి. వాటిలో కొన్నివి. చేతి వాచీ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు మహిళలు మాత్రమే చేతివాచీలు ధరించేవారు. అయితే అవి వారికి ఆభరణాలుగా ఉండేవి. మగవారైతే కాలంతో తమకు పనేముంది అన్నట్లు ఉండేవారు. తెలియందేముంది! తామే కాలాన్ని నడిపిస్తున్నామన్న ఆ ఆధిక్య భావన భూమి పుట్టినప్పటి నుంచి మగజాతికి ఉన్నదే కదా! అయితే ఘరానా ఉండటం కోసం మాత్రం వాచీలను జేబుల్లో పైకి కనిపించేలా పెట్టుకుని తిరిగేవారు. యుద్ధం మొదలయ్యాక పగలూ రేయీ ఏకమై పురుషులు కూడా టైమ్‌ను చూసుకునేందుకు వీలుగా జేబుల్లోంచి తీసి చేతికి పెట్టుకోవలిసి వచ్చింది. ఆ రిస్ట్ వాచీలకు, పాకెట్ వాచీలకు మధ్యస్థ రూపం మరొకటి వచ్చింది. అవి ‘ట్రెంచ్ వాచీ’లు. వాటినే రిస్ట్లెట్స్ అనేవారు. ఒక గ్రేట్ వార్ వస్తే కానీ రిస్ట్‌వాచ్‌లు తగిలించుకోని ‘గ్రేట్’ పీపుల్ ఈ మగవాళ్లు! ఇది ఆవిష్కరణ కానీ, ఒక అలవాటుకు ఆరంభం. జిప్పులు మగవాళ్ల ప్యాంట్లకు, ఆడవాళ్ల గౌన్లకు మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ‘హుక్లెస్ ఫాస్ట్నర్స్’ మాత్రమే ఉండేవి. ఇప్పుడు మనం చూస్తున్న జిప్పుల్లాంటివి అవి. లాంటివే కానీ, జిప్పులు కావు. గిడియోన్ సండ్బాక్ అనే స్వీడిష్ అమెరికన్ ఇంజినీరు చిక్కుపడని, కక్కేలు ఇరుక్కోని సాఫీగా ఉండే జిప్పులను హుక్కుతో పాటు 1914లో డిజైన్ చేశారు. ఆ యుద్ధ పరిస్థితుల్లో సైనిక వస్త్రాల అవసరాలకు కొత్త డిజైన్లలోని జిప్పులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చివరికి అవే మన్నికైనవిగా స్థిరపడ్డాయి. ఫ్యాషన్లు ఎన్ని మారినా, జిప్ డిజైన్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. అంతకుమించి జిప్పులను మెరుగు పరచడానికి ఏమీ లేదని, మెరుగు పరిచే అవసరమే లేదని తర్వాత్తర్వాత వచ్చిన ఇంజనీర్లు తేల్చేశారు! స్టెయిన్లెస్ స్టీల్ తుప్పు పట్టని విధంగా క్రోమిమంతో తయారు చేసిన స్వచ్ఛమైన ఉక్కు ‘స్టెయిన్లెస్ స్టీల్’. మొదటి ప్రపంచ యుద్ధకాలానికి ముందు స్టెయిన్లెస్ స్టీల్ లేనేలేదు. యు.ఎ.లోని షెఫీల్డ్ ప్రాంతంలో ఉండే హ్యారీ బ్రియర్లీ యుద్ధ ప్రారంభ కాలమైన 1914 లో ఈ రకం స్టీల్‌ను కనిపెట్టారు. యుద్ధ విమానాల ఇంజిన్లు, మెస్ కిట్ సిల్వర్‌వేర్, వైద్య పరికరకాల తయారీకి ఒక మేలు రకమైన లోహం అవసరం అవడంతో, ఆ అవసరం నుంచి స్టెయిన్లెస్ స్టీల్ అవిర్భవించింది. పైలేట్స్ ఇదొక ఫిట్నెస్ టెక్నిక్. జోసెఫ్ పైలేట్స్ అనే జర్మన్ ఫిట్నెస్ మాస్టర్ ఈ టెక్నిక్‌ను (వ్యాయామ విధానం) మొదటి ప్రపంచ యుద్ధం ముగుస్తుండగా 1918 చివర్లలో వృద్ధి చేశారు. యుద్ధకాలంలో ఆయన ఆసుపత్రులలోని రోగుల నడకకు బలం చేకూర్చే పైలేట్స్ వ్యాయామం కోసం ‘క్యాడిలాక్’ అనే సాధనాన్ని రూపొందించారు. స్వయంగా ఆసుపత్రులకు వెళ్లి ఈ టెక్నిక్‌తో వ్యాయామ సేవలు కూడా అందిం చారు. శానిటరీ నేప్కిన్స్ 1914లో యూఎస్‌లోని కింబర్లీ క్లార్క్ అనే సంస్థ కలప గుజ్జుతో ఒక వస్త్రాన్ని తయారు చేసింది. యుద్ధ కాలంలో పత్తి కొరత ఏర్పడి, పత్తి వస్త్రాలకు అవసరం పెరగడంతో ప్రత్యామ్నాయంగా ఆ కంపెనీ గుజ్జు వస్త్రాన్ని కనిపెట్టింది. దానికి సెల్యుకాటన్ అని పేరుపెట్టింది. అమెరికా సైన్యంలోని క్షతగాత్రుల కోసం సర్జికల్ డ్రెస్సింగ్‌గా ఆ వస్త్రాన్ని సరఫరా చేసింది. రక్తస్రావాన్ని సెల్యుకాటన్ సమర్థం గా నిలువరించడంతో, యుద్ధానంతరం కొటెక్స్ శానిటరీ పాడ్స్ తయారు చేసి మార్కెట్లో విడుదల చేసింది. ఆ ప్రాడక్ట్‌కు అమితమైన ఆదరణ లభించింది. నేడు వాడుకలో ఉన్న శానిటరీ నేప్కిన్స్ వాటికి ఆధునాతన రూపమే. పోర్టబుల్ ఎక్స్–రేస్ తొలి ‘రేడియోలాజికల్ కారు’ అవిష్కరణ జరిగింది కూడా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే. ఈ కారును కనిపెట్టింది పోలెండ్ భౌతిక శాస్త్రవేత్త మేరీ క్యూరీ. ఈ వాహనంలో ఎక్స్ రే మిషన్ ఉండేది. ఫొటోగ్రాఫ్ డార్క్ రూమ్ పరికరాలు ఉండేవి. యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స చేయడానికి ఆర్మీ సర్జన్లు నేరుగా యుద్ధ క్షేత్రంలోనికే ఈ రేడియోలాజికల్ కార్లను నడుపుకుంటూ వెళ్లేవారు. -
భారత్‌లో ప్రారంభమైన యాపిల్ వాచ్ సిరీస్ 6 అమ్మకాలు
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ గత నెల రెండు కొత్త స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. యాపిల్ వాచ్ సిరీస్ 6తోపాటు వాచ్ సిరీస్ఎస్ఈను ప్రకటించింది. అమెరికాలో వీటి అమ్మకాలు సెప్టెంబర్ 18నే ప్రారంభం కాగా తాజాగా భారత్‌లో ఈ వాచ్‌ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రముఖ బ్యాంకులు భారీగా ఆఫర్లను అందిస్తున్నాయి. (రిలయన్స్ డిజిటల్లో యాపిల్ వాచ్ న్యూ సిరీస్ 6 లాంఛ్) యాపిల్ వాచ్ సిరీస్ 6 ధర ఇది రెండు 40 ఎంఎం, 44 ఎంఎం సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. జీపీఎస్ వేరియంట్‌ను బట్టి 40 ఎంఎం కేన్ ఉన్న ధర రూ. 40,900 కాగా 44 ఎంఎం కేన్ ఉన్న ధర రూ. 43,900గా నిర్ణయించారు.ఇందులో జీపీఎస్+సెల్యులార్ ఆప్షన్ కూడా ఉంది. దీని ధర రూ.49,990(40ఎంఎం)...రూ. 52,900(44ఎంఎం)గా ఉంది. (ఫెస్టివ్ సీజన్ : త్వరలో ఐఫోన్12 ) యాపిల్ వాచ్ సిరీస్ 6 ఆఫర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ ద్వారా యాపిల్ వాచ్ సిరీస్ 6ను కొనుగోలు చేస్తే లాంచ్ ఆఫర్లతోపాటు తక్షణ 3 వేల రుపాయాల డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే డెబిట్ కార్డు ద్వారా చేస్తే 1500 రూపాయల డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ప్రైమ్ మెంమర్స్ అమెజాన్‌పేతో కొనుగోలు చేస్తే ఫ్లాట్ 5% తక్షణ డిస్కౌంట్ ఇవ్వనుంది. ప్రైమ్ మెంబర్ కాని వారికి 3% డిస్కౌంట్ ఉంది. యాపిల్ వాచ్ ఎస్ఈ ధర ఇందులో కూడా రెండు 40 ఎంఎం, 44 ఎంఎం సైజులు అందుబాటులో ఉన్నాయి. జీపీఎస్ వేరియంట్‌ను బట్టి 40 ఎంఎం కేన్ ధర రూ. 29,900 ఉంండగా 44 ఎంఎం కేన్ ధర రూ. 32,900 ఉంది. జీపీఎస్ + సెల్యులార్ వేరియంట్ ధరను బట్టి రూ.33,900(40ఎంఎం) అలాగే 36,900(ఎంఎం)గా నిర్ణయించారు. యాపిల్ వాచ్ సిరీస్ ఎస్ఈ ఆఫర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ ద్వారా యాపిల్ వాచ్ సిరీస్ ఎస్ఈను కొనుగోలు చేస్తే లాంచ్ ఆఫర్లతోపాటు తక్షణ 2 వేల రుపాయాల డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే డెబిట్ కార్డు ద్వారా చేస్తే 1500 రూపాయల డిస్కౌంట్ కూడా అందిస్తోంది. హెచ్ఎస్బీసీ క్యాష్‌బ్యాక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 5% డిస్కౌంట్ లభించనుంది. ఇంకేందుకు ఆలస్యం కావాలి అనుకునే వారు కొనేయండి. -
రిలయన్స్ డిజిటల్లో యాపిల్ వాచ్‌ల ప్రీబుకింగ్
-
వాచ్.. తూచ్..
సాక్షి, సిటీబ్యూరో: ఈ కామర్స్ యాప్ స్నాప్‌డీల్‌లో వాచీ కొన్నాడు...కొన్నాళ్ళకే లక్కీ డ్రాలో కారు గెల్చుకున్నారంటూ సందేశం రావడంతో పొంగిపోయాడు... సైబర్ నేరగాళ్ళ మాటల వల్లోపడి రూ.50 వేలు పోగొట్టుకున్నాడు... చివరకు మోసపోయానని గుర్తించి బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బేగంబజార్ ప్రాంతానికి చెందిన ఓ కార్పెంటర్ ఇటీవల స్నాప్‌డీల్ నుంచి వాచీ ఖరీదు చేశారు. ఇది కొరియర్లో అతడికి చేరిన కొన్ని రోజుల తర్వాత స్నాప్‌డీల్ నుంచి అంటూ ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. అందులో తమ సంస్థ నిర్వహించిన లక్కీడ్రాలో కారు గెల్చుకున్నారని, ఇతర వివరాలు తమ ప్రతినిధి అందిస్తారని ఉంది. ఇది జరిగిన మరుసటి రోజు స్నాప్‌డీల్ సంస్థ నుంచి అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. లక్కీడ్రాలో రూ.12.6 లక్షల విలువైన హైఎండ్ కారు గెల్చుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కారును సొంతం చేసుకోవడానికి సదరు కార్పెంటర్ సంసిద్ధత వ్యక్తం చేయడంతో సైబర్ నేరగాళ్ళు అసలు కథ ప్రారంభించారు. కారును డెలివరీ పొందడానికి కొన్ని చార్జీలు, పన్నులు చెల్లించాలని ఎర వేశారు. అలా రకరాలైన పేర్లతో రూ.8,500 నుంచి ప్రారంభించి విడదల వారీగా రూ.50,700 తమ ఖాతాల్లోకి డిపాజిట్ చేయించుకున్నారు. సైబర్ నేరగాళ్ళు మరికొంత మొత్తం చెల్లించాలని అడుగుతుండటంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ జి.వెంకటరామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. మూడు చోట్ల నుంచి లీక్‌కు అవకాశం ఈ తరహా మోసాల్లో ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్ళు టార్గెట్ చేయడానికి ఆయా ఈ–కామర్స్ సంస్థల డేటానే ఆధారం. ఈ కేసును తీసుకుంటే బేగంబజార్‌కు చెందిన బాధితుడు స్నాప్‌డీల్ నుంచి వాచీ ఖరీదు చేశాడనే విషయం ఆ సంస్థతో పాటు మరో రెండు సంస్థలకు తెలిసే అవకాశం ఉంది. ఈ తరహాకు చెందిన ఈ–కామర్స్ సైట్స్/యాప్స్ తమకు వచ్చిన ఆర్డర్స్‌ను థర్డ్ పార్టీ సంస్థలకు పంపిస్తాయి. ఆయా వస్తువుల్ని తయారు చేసే, సరఫరా చేసే సంస్థలే థర్డ్‌పార్టీలుగా ఉంటాయి. వీళ్ళు వినియోగదారుడు ఆర్డర్ చేసిన వస్తువుల్ని అతడి చిరునామాకు కొరియర్ ద్వారా పంపిస్తారు. కస్టమర్ చెల్లించిన సొమ్ముకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు స్నాప్‌డీల్‌కు ఈ థర్డ్ పార్టీ సంస్థకు మధ్య జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఫలానా సైట్/యాప్ నుంచి ఫలానా వస్తువు ఖరీదు చేశాడనే సమాచారం ఆ సంస్థతో పాటు, థర్డ్ పార్టీ సంస్థకు, కోరియర్ సంస్థకు తెలిసే ఆస్కారం ఉంది. ఈ మూడు చోట్ల పని చేసే ఉద్యోగుల్లో ఎవరైనా ఈ డేటా లీక్ చేస్తున్నారని అనుమానిస్తున్నాం. దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంది. లక్కీ డ్రాల పేరుతో వచ్చే సందేశాలు, ఫోన్‌కాల్స్‌ను నమ్మవద్దు.– జి.వెంకట రామిరెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ -
కొనాలంటే ‘వాచి’పోతుంది..!
-
ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్; ఆశ్చర్యంలో నెటిజన్లు
ఆపిల్ వాచ్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాలు.. గాబ్ బర్డెట్, అతని తండ్రి బైక్‌పై పర్వతారోహణకు వెళ్లారు. చెరో మార్గం గుండా పర్వతాన్ని అధిరోహిస్తుండగా.. తన తండ్రి ప్రమాదంలో ఉన్నట్టు అతని చేతికున్న ఆపిల్ వాచ్ నుంచి బర్డెట్ వాచ్‌కు అలర్ట్ వచ్చింది. అంతేగాక అతని తండ్రి ఉన్న ప్రదేశాన్ని సైతం వాచ్ షేర్ చేసింది. దాంతో బర్డెట్ సదరు ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్నాడు. అయితే, అక్కడ తన తండ్రి కనిపించలేదు. కానీ, తండ్రి వాచ్ నుంచి మరోసారి సందేశం వచ్చింది. ఆయన సేక్రేడ్ హార్ట్ మెడికల్ సెంటర్లో ఉన్నట్టు వాచ్ అలర్ట్ ఇచ్చింది. బర్డెట్ ఆస్పత్రికి చేరుకుని తన తండ్రిని కలుసుకున్నాడు. పర్వతారోహణ సమయంలో తన అనుభవాలను ఫేస్బుక్లో పంచుకున్నాడు. ‘‘పర్వతారోహణ చేస్తుండగా ప్రమాదవశాత్తూ నాన్న బైక్నుంచి పడిపోయాడు. ఆయన తలకు బలమైన గాయమైంది. దాంతో ఆయన చేతికున్న ఆపిల్ వాచ్‌లో గల ‘‘హార్డ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్’’ అత్యవసర నెంబర్ 911కు కాల్ కనెక్ట్ చేసింది. సమాచారం అందుకున్న ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్‌లో అక్కడికి చేరుకుని నాన్నకు ప్రాథమిక చికిత్సనందించారు. అనంతరం ఆస్పత్రికి చేర్చి సత్వర వైద్య చికిత్స చేశారు. ప్రస్తుతం నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది’’ అని బర్డెట్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇదంతా ఆపిల్ వాచ్‌లో సెట్ చేయబడిన హార్డ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ వల్లే సాధ్యమైందని, ప్రతి ఒక్కరూ తమ పరికరాల్లో ఈ ఫీచర్‌ను సెట్ చేసుకోవాలని కోరారు. అయితే, ఆపిల్ వాచ్‌లో ఈ ఫీచర్ ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
చిన్నారి గొంతులో ఇరుక్కున్న వాచ్ బ్యాటరీ
సాక్షి, కొత్తగూడెం: ఓ చిన్నారి గొంతులో వాచ్ బ్యాటరీ ఇరుక్కుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం తడికలపూడికి చెందిన తేజావత్ హర్యా కూతురు (10 నెలలు) శుక్రవారం ఉదయం ఇంట్లో ఆడుకుంటోంది. ఈ క్రమంలో పాడైపోయిన చేతి గడియారం బ్యాటరీని మింగగా అది గొంతులో ఇరుక్కుంది. శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు కొత్తగూడెంలోని సురక్ష ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్ రవిబాబు నాయక్ ఎక్స్‌రే తీసి గొంతులో బ్యాటరీ ఇరుక్కున్నట్లు గుర్తించారు. వెంటనే చిన్నారికి ఆపరేషన్ చేసి తొలగించి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ రవిబాబు తెలిపారు. -
ఎన్టీఆర్ వాచ్ 2 కోట్లా...?
సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు ఉత్సాహం చూపిస్తుంటారు. తాజాగా రాజమౌళి కుమారుడి పెళ్లి సందర్భంగా టాలీవుడ్ అంతా రాజస్థాన్ చేరుకుంది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్ లుక్ చూసిన కొంత మంది షాక్ అయ్యారు. ఆ సమయంలో ఎన్టీఆర్ చేతికి ఉన్న గడియారం ధర తెలుసుకొని అవాక్కవుతున్నారు. ఆ వాచ్ ధర రెండు కోట్లకు పై మాటే అంటూ సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్‌ను కూడా పోస్ట్ చేస్తున్నారు. ఎఫ్ రేస్‌లో పాల్గొనే వారు ధరించే అత్యంత ఖరీదైన రిచర్డ్ మిల్లే మెక్లారెన్ కంపెనీ వాచ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలపై సోషల్ మీడియాలో జోక్‌లు కూడా పేలుతున్నాయి. ఆ వాచ్ ఖరీదు కొంత మంది హీరోల సినిమాల బడ్జెట్ అంత ఉందంటూ కొందరు.. కొందరు స్టార్ హీరోల సీడెడ్ కలెక్షన్ అంత ఉందంటూ మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. -
మార్కెట్లోకి ఆపిల్ వాచ్ సిరీస్ - 4
-
ఆపిల్ వాచ్ బైపాస్ సర్జరీ చేస్తుందట!!
టెక్ ప్రపంచంలో సెప్టెంబర్ 12.. ఓ ఐకానిక్’ డే. ఎన్నో రూమర్లు, మరెన్నో లీక్‌ల అనంతరం ఆపిల్ తన సరికొత్త ఐఫోన్లను సెప్టెంబర్ 12 ప్రవేశపెట్టింది. ఐఫోన్లతో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ 4ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. కిందపడిపోయే అవకాశాలను కూడా ముందే గుర్తించి హెచ్చరించగలిగే చిప్‌ను దీనిలో పొందుపర్చారు. గుండె కొట్టుకునే వేగాన్ని ఇది లెక్కిస్తుంది. 30 సెకన్లలో ఈసీజీ తీసుకోవచ్చు. మొట్టమొదటిసారి ఐఫోన్లను డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సరికొత్త ఫీచర్లతో వచ్చిన ఈ సరికొత్త ఆపిల్ ప్రొడక్ట్‌లపై సోషల్ మీడియా మాత్రం జోకులు వేయడం ఆపలేదు. 2018 ఆపిల్ వాచ్ సిరీస్ 4 ఈసీజీ ఫీచర్ ఉంటే, 2019 వాచ్‌లో యాంజియోప్లాస్టీ, 2020 వాచ్‌లో బైపాస్ సర్జరీ, 2021లో అంత్యక్రియల ఏర్పాటు ఫీచర్లు ఉంటాయంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. మనం 2018లో జీవిస్తుంటే, ఆపిల్ ఇంకా 2012లోనే నివసిస్తుందంటూ డ్యూయల్ సిమ్ ఫీచర్‌ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. ఓ వ్యక్తి ఒక టేబుల్ వద్ద కూర్చుని ఐఫోన్ ఆపిల్ లోగోతో వస్తుందని చెబుతున్న కార్టూన్ గీయగా.. మరోవ్యక్తి, ఆండ్రాయిడ్ ఫోన్ అవే ఫీచర్లతో తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని చెబుతున్న పిక్చర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కిందపడిపోవడాన్ని ఆపిల్ వాచ్ సిరీస్ 4 గుర్తిస్తుంది, అవునా..అయితే కొంతమంది రూపాయిని ధరిస్తారు అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Apple watch features 2018 : ECG 2019 : Angioplasty 2020 : Bypass Surgery 2021: Funeral arrangements#AppleEvent — SAGAR (@sagarcasm) September 12, 2018 IPhone fans right now #AppleEvent pic.twitter.com/nuQgOyaMWt — Mask ishan (@Mr_LoLwa) September 12, 2018 We’re all living in 2018 while Apple is living in 2012 #AppleEvent pic.twitter.com/hJnyfbGgbK — 9GAG (@9GAG) September 13, 2018 Android be like : Launch wo kar rahein hain par features humaare hain.#AppleEvent pic.twitter.com/v24iRk4tst — SAGAR (@sagarcasm) September 12, 2018 Reality check. #AppleEvent #iphoneXs pic.twitter.com/tC6wBYFqAc — Godman Chikna (@Madan_Chikna) September 12, 2018 me @ my iPhone 📱 after seeing the new prices #AppleEvent pic.twitter.com/xPJW1iB4vV — Khattak (@Nayapakistan_55) September 12, 2018 Fixed it. #AppleEvent pic.twitter.com/6Y1cHkcrzY — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 12, 2018 Samsung fans watching #AppleEvent and realising they can’t even taunt you about dual sim anymore. pic.twitter.com/Ka2nksuv15 — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 12, 2018 Me and my broke friends checking the price of the new iPhone. #AppleEvent pic.twitter.com/88a1yUyeDm — Bade Chote (@badechote) September 12, 2018 -
వాచ్ వచ్చె
అందరికీ బర్త్‌డేకి అడ్వాన్స్ విషెస్ లభిస్తాయి. కానీ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌కి అడ్వాన్స్ బర్త్‌డే గిఫ్ట్స్ లభిస్తున్నాయి. రణ్వీర్ బర్త్ డే ఈనెల 6న. వారం ముందే ఓ మంచి వాచ్ గిఫ్ట్‌గా బçహూకరించారట దర్శకుడు రోహిత్ శెట్టి. తెలుగు హిట్ మూవీ ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’లో రణ్వీర్ సింగ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షూటింగ్లో రణ్‌వీర్‌కు రోహిత్ శెట్టి వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారట. ‘‘బాస్ (రోహిత్ శెట్టి) ఓ వారం ముందే బర్త్‌డే ప్రజెంట్ ఇచ్చేశారు. ఇప్పటివరకు నేను చూసినవాటిలో ఇదే సూపర్ వాచ్. థ్యాంక్యూ సార్’’ అంటూ ఈ విషయాన్ని ట్వీటర్లో తెలిపారు రణ్వీర్ సింగ్. ‘సింబా’ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 28న రిలీజ్ కానుంది. -
‘టైమ్’.. చాలా ఖరీదు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చోపా, పాటక్ ఫిలిప్, జేగర్ లేకూట్, వషెరో కున్‌స్టాంటా, ఒడేమార్ పీగే, ఒమేగా, రోలెక్స్, టాగ్ హోయెర్.. ఇటువంటి అత్యంత ఖరీదైన చేతి వాచీ బ్రాండ్లకు భారతీయులు ఉవ్విళ్లూరుతున్నారట. ఇలాంటివి ఇప్పుడు 30 దాకా బ్రాండ్లు ఇక్కడ కొలువుదీరాయి. వీటికోసం కోట్ల రూపాయలు వెచ్చించేందుకు కస్టమర్లు వెనుకాడటం లేదు. పైగా దుబాయ్ వంటి షాపింగ్ కేంద్రాలతో పోలిస్తే వాచీల ధర భారత్‌లోనే తక్కువగా ఉంది. ఇక్కడ అమ్మకాలు పెరిగేందుకు ఈ అంశం దోహదం చేస్తోందని విక్రేతలు చెబుతున్నారు. 2025 నాటికి టాప్–10 లగ్జరీ వాచీల మార్కెట్‌గా భారత్ అవతరించనుందని 160 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రాండ్ చోపా అంటోంది. ఖరీదుకు వెనుకాడరు.. లగ్జరీ కోసం భారతీయులు ఎంతైనా వెచ్చిస్తారని చోపా బ్రాండ్ ఇంటర్నేషనల్ సేల్స్ మేనేజర్ జవియే లెస్సే సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రూ.6.9 కోట్ల విలువైన ఇంపీరియల్ వాచీని సైతం భారత్‌లో విక్రయించామని చెప్పారు. తమ కంపెనీకి చెందిన 45 విభాగాల నిపుణులు ఏడాదిపాటు శ్రమిస్తే ఒక వాచీ తయారవుతుందని వెల్లడించారు. భారత్ కోసం తయారైన ఎక్స్‌క్లూజివ్ మోడళ్ల కంటే అంతర్జాతీయంగా లభిస్తున్న వాచీలను కొనేందుకు ఇక్కడివారు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. లగ్జరీ విషయంలో 2025 నాటికి టాప్–10 మార్కెట్లలో ఒకటిగా భారత్ నిలుస్తుందని పేర్కొన్నారు. నాల్గవ స్థానంలో హైదరాబాద్.. రూ.2 లక్షలు ఆపైన ధర గల వాచీల విభాగం ఏటా 20 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. ఈ విభాగంలో నెలకు దేశవ్యాప్తంగా 300 పీసులు అమ్ముడవుతు న్నాయని అంచనా. మూడేళ్ల క్రితం ఈ సంఖ్య 200 పీసులు ఉండేదని సమాచారం.కొనుగోళ్ల పరంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాల్గవస్థానం కోసం హైదరాబాద్, చెన్నై లు పోటీపడుతున్నాయని వాచీల రిటైల్ దిగ్గజం కమల్ వాచ్ కంపెనీ ఎండీ వేణు గోపాల్ తెలిపారు. దుబాయ్ వంటి షాపింగ్ డెస్టినేషన్లతో పోలిస్తే భారత్‌లోనే ధర 8 శాతం దాకా తక్కువగా ఉందన్నారు. దీంతో దేశీయంగా కొనుగోళ్లు పెరిగాయని తెలిపారు. 23 స్టోర్ల ద్వారా తాము 50 రకాల బ్రాం డ్ల వాచీలను హైదరాబాద్ సహా పలు నగరాల్లో విక్రయిస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది చివరినాటికి మరో 15 కేంద్రాలు నెలకొల్పుతామన్నారు. ఇదీ వాచీల మార్కెట్.. భారత్‌లో వాచీల విపణి వార్షిక పరిమాణం రూ.7,700 కోట్లకు చేరుకుంది. అవ్యవస్థీకృత రంగంలోనూ ఇదే స్థాయిలో వ్యాపారం జరుగుతోంది. వ్యవస్థీకృత రంగంలో అన్ని ధరల శ్రేణుల్లో 75 బ్రాండ్ల దాకా పోటీపడుతున్నాయి. ఏటా పరిశ్రమ 15 శాతం వృద్ధి చెందుతోంది. మొత్తం అమ్మకాల్లో రూ.10,000 లోపు వాచీలు 65 శాతం ఉంటాయి. రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు 20 శాతం, రూ.1 లక్ష పైన ఖరీదైన వాచీల పరిమాణం 15 శాతముందని రిటైల్ చైన్ బ్రాండ్ జస్ట్ వాచెస్ చెబుతోంది. ఇక భారత్‌కు దిగుమతి అవుతున్న వాటిలో స్విస్ వాచీల వాటా ఏకంగా 30 శాతం దాకా ఉంది. పెద్ద పెద్ద బ్రాండ్లను పోలిన నకిలీ వాచీలు ఆన్లైన్లో లక్షలాది రకాలు లభిస్తున్నాయి. -
యూట్యూబ్‌కు పోటీ వచ్చేసింది!
శాన్ఫ్రాన్సిస్కో : వీడియో వీక్షణలకు, షేరింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన యూట్యూబ్ గట్టి పోటీ వచ్చేసింది. యూట్యూబ్‌కు పోటీగా ఫేస్బుక్ సరికొత్తగా రీడిజైన్ చేసిన వీడియో ట్యాబ్ 'వాచ్' ను రంగంలోకి దింపింది. తమ వీడియో ఆఫర్స్‌ను మరింత విస్తరిస్తూ టెలివిజన్ మార్కెట్లో గట్టిపోటీని ఇవ్వడానికి ఫేస్బుక్ దీన్ని లాంచ్ చేసింది. ప్రొఫెషనల్ ఉమెన్స్ బాస్కెట్‌బాల్ నుంచి సఫారీ షోల వరకు అన్ని రకాల వీడియో ప్రొగ్రామ్‌లను ఇది ఆఫర్ చేయనుంది. రీడిజైన్ చేసిన ఈ ప్రొడక్ట్ 'వాచ్' ప్రస్తుతం అమెరికాలోని ఫేస్బుక్ మొబైల్ యాప్, వెబ్సైట్, టెలివిజన్ యాప్‌లు వాడుతున్న పరిమిత గ్రూపు సభ్యులకు మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఫేస్బుక్ తెలిపింది. గతేడాదే ఈ వీడియో ట్యాబ్‌ను ఫేస్బుక్ లాంచ్ చేసింది. మేలోనే ఫేస్బుక్ మిలినీయల్ ఫోకస్డ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ క్రియేటర్స్ వోక్స్ మీడియా, బుజ్‌ఫీడ్, ఏటీటీఎన్, గ్రూప్ నైన్ మీడియా, ఇతర వాటితో ఒప్పందాలు చేసుకుంది. స్క్రిప్ట్, స్క్రిప్ట్‌లేని షోలను ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఒప్పందం కుదుర్చుకుంది. న్యూస్ ఫీడ్‌లో ప్రజలు ఎక్కువగా వీడియోలను చూసేందుకు ప్రజలు ఇష్టపడతారని తాము తెలుసుకున్నట్టు ఫేస్బుక్ ప్రొడక్ట్ డైరెక్టరర్ డానియల్ డాంకర్ చెప్పారు. యూజర్లు వీడియో ఎపిసోడ్స్‌ను చూస్తున్నప్పుడు చాట్ చేసుకోవడానికి, ఇతరులతో కనెక్ట్ కావడానికి ఈ వాచ్ వీడియో ట్యాబ్ సహకరిస్తుందని ఫేస్బుక్ సీఈవో, వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. కమ్యూనిటీని అభిృద్ది చేసుకోవడానికి అదే షోలను ఇష్టపడుతున్న వారు గ్రూప్‌లను కూడా ఏర్పరచుకోవచ్చని పేర్కొన్నారు. -
‘స్మార్ట్’గా పనిచేసే వాచీ!
ఈ ఫొటోలో ఉన్న వాచీ చూశారా.. ఇందులో ప్రత్యేకత ఏంటంటే దీనికి బ్యాటరీ అనేది అసలు అవసరముండదు. మీ శరీర కదలికల ఆధారంగానే వాచీ పనిచేసేందుకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. దీని ప్రత్యేకతలు ఇక్కడితో అయిపోలేదు.. గుండె కొట్టుకునే వేగాన్ని లెక్కపెట్టే సెన్సర్‌తో పాటు జీపీఎస్, మీరు వేసే అడుగుల లెక్కలు చెప్పే, నడిచిన దూరాన్ని లెక్కించే ఫీచర్లు కూడా ఉన్నాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన ఈ వాచీని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రస్తుతం కిక్ స్టార్టర్‌లో నిధులు సేకరిస్తున్నారు. దాదాపు 83 వేల డాలర్లు సేకరించాలని అనుకుంటే.. ఇప్పటికే దాదాపు 3.3 లక్షల డాలర్లు వచ్చాయి. ఈ స్మార్ట్ వాచీ మీకు కావాలనుకుంటున్నారా? కిక్స్టార్టర్కు వెళ్లి ఈ ప్రాజెక్టును సపోర్ట్ చేయడం ద్వారా రూ.12 వేలకు బేసిక్ మోడల్ వాచీ పొందొచ్చు. డెలివరీ మాత్రం డిసెంబర్లో వస్తుంది. వాచీ పేరు సీక్వెంట్! -
వేడియారం
మన శరీరం ఎల్లప్పుడూ వెచ్చగా ఉంటుందని అందరికీ తెలుసు. ఎలాంటి పని లేకుండా ఉన్నప్పుడు ఈ వేడితో ఓ బల్బును వెలిగించవచ్చునట. వ్యాయామం చేసేటప్పుడు పుట్టే వేడిలో మాత్రం ఈ విద్యుత్తు ఓ కిలోవాట్ వరకూ ఉంటుందని అంచనా. ఇప్పుడీ వేడి... విద్యుత్తు సంవాదం ఎందుకయ్యా అంటే... పక్కనున్న ఫొటో చూడండి. ఈ వాచీకి బ్యాటరీ అన్నది అస్సలు అవసరం లేదు. మన శరీరంలోని వేడితోనే పనిచేస్తుంది. మ్యాట్రిక్స్ పవర్ వాచ్ కంపెనీ ఐదేళ్ల శ్రమ ఫలితంగా రూపుదిద్దుకున్న ఈ సూపర్ స్మార్ట్‌వాచ్ రోజువారీ వ్యాయామం లెక్కలేయడంతోపాటు ఎంత విద్యుత్తు ఉత్పత్తి చేయగలిగేంత వేడి పుట్టించారో కూడా చెబుతుంది. యాభై మీటర్ల లోతు నీళ్లల్లో వేసినా చెక్కుచెదరని ఈ వాచ్ నుంచి ఆండ్రాయిడ్ ఓఎస్‌కు, అక్కడి నుంచి క్లౌడ్‌కు సమాచారాన్ని పంపించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మరి... ఈ వాచీ నడవాలంటే ఎప్పుడూ కట్టుకునే ఉండాలా? అవసరం లేదు. తీసేయగానే ఇది స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. అతితక్కువ కరెంటుతో పనిచేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఇండిగోగో ద్వారా కేవలం రెండు నెలల్లోనే దాదాపు లక్ష డాలర్ల పెట్టుబడులు సేకరించిన మ్యాట్రిక్స్ పవర్‌వాచ్ కంపెనీ వచ్చే ఏడాది జూలై నుంచి వీటిని అందరికీ అందుబాటులోకి తేనుంది. ధర దాదాపు రూ.9 వేల వరకూ ఉండవచ్చు. -
టైటాన్ కొత్త స్మార్ట్‌వాచ్ ‘జక్ట్స్ ప్రో’
హైదరాబాద్: ప్రముఖ వాచీల తయారీ కంపెనీ ‘టైటాన్’ తాజాగా ‘జక్ట్స్ ప్రో’ టచ్‌స్క్రీన్ స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.22,995. ఈ వాచ్ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులో 20 ప్రి-లోడెడ్ డిజైన్లతో కూడిన కస్టమైజ్డ్ వాచ్ డయల్, 4 జీబీ మెమరీ, ఎస్ఎంఎస్/ఈ-మెయిల్/వాట్సాప్/కాల్ అలర్ట్స్ నోటిఫికేషన్స్, అలారమ్, ఫిట్నెస్ ట్రాకింగ్, ఫోన్ ఫైండర్, ఫోన్ కెమెరా/మ్యూజిక్ కంట్రోల్, క్లౌడ్ సపోర్ట్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ వివరించింది. వినియోగదారులు ఈ వాచ్‌లను టైటాన్ షాపులు సహా ఇతర మల్టీబ్రాండెడ్ ఔట్‌లెట్స్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో పొందొచ్చని తెలిపింది. -
కాకి వాలిందని కారు మార్చిన సీఎం!
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమత్రి సిద్దరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో పెను దుమారం సృష్టించిన 'వాచీ' ఘటన మరవకముందే తాజాగా 'కాకి' కహానీ తెర మీదకు వచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొత్త కారు కొన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రులు అన్నాక కార్లు మార్చడం, కొత్త వాహనాలు కొనుక్కోవడం సాధారణమే. ఇటీవలి సిద్దూ 35 లక్షల రూపాయలతో కొత్త టొయోటా ఫార్చ్యునర్ కారు కొన్నారు. అయితే అసలు విషయం ఏంటంటే..అంతకు ముందు ఆయన వాడిన వాహనంపై కాకి వాలిందట. ఆ కాకి వాహనం బొనెట్ పైనే తిష్టవేసిందట. దాన్ని సిబ్బంది తరిమినా వెళ్లకుండా పది నిమిషాల పాటు కారు బోనెట్ పైనే ఉండిపోయిందట. కాగా ఈ సీన్‌ను ఎవరో రికార్డ్ చేశారు. అదే ఇప్పుడు సిద్ధ రామయ్యకు తలనొప్పి తెచ్చిపెట్టింది. పాత కారుపై కాకి వాలడం వల్లే సిద్ధ రామయ్య కారు మార్చారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రికి జాతకాలపై నమ్మకమని... అందుకునే 35 లక్షలు ఖర్చు పెట్టి కారు కొన్నారంటు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎంగా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఇలా జాతకాల పిచ్చితో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. గతంలో సిద్దరామయ్య వజ్రాలు పొదిగిన ఈ హబ్లాట్ వాచీ ధర రూ. 70 లక్షలు కావడం, ముఖ్యమంత్రికి అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై మీడియాలో బోలెడు కథనాలు వెల్లువెత్తాయి. చివరకు ఈ వ్యవహారం రాష్ట్ర అసెంబ్లీని సైతం కుదిపేసింది. దీనిపై దర్యాప్తు జరిపించాలంటూ బీజేపీ నేతలు ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను ఆశ్రయించారు. ఇది కాస్తా చినికి చినికి గాలివానగా మారుతుండటంతో ఎట్టకేలకు దాన్ని వదిలించుకోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి.. ఆ వాచీని అసెంబ్లీ స్పీకర్‌కు అందజేసి, దాన్ని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
మీ చేతి చర్మంపైనే ఆపరేట్ చేయ్యొచ్చు!
లండన్ : మీరు ధరించే స్మార్ట్ వాచ్ స్క్రీన్ చాలా చిన్నదిగా అనిపిస్తుందా..? మీరు దాన్ని పెద్దదిగా చేయాలనుకుంటున్నారా..? అయితే మీ చేతినే టచ్ ప్యాడ్ లాగా మార్చుకోవచ్చట. కార్నెగీ మిలాన్ యూనివర్సిటీకి చెందిన ఫ్యూచర్ ఇంటర్ ఫేస్ గ్రూప్ పరిశోధకులు మన చేతి చర్మాన్ని టచ్ సెన్సార్ గా మార్చుకునే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం చాలా స్మార్ట్ వాచ్ లు, డిజిటల్ జ్యువెల్లరీ డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే ఇవి చిన్నవిగా ఉండటంతో, యూజర్లకు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఈ సమస్యలన్నింటినీ తొలగించి, యూజర్లను ఎక్కవగా ఆకర్షించేందుకు చర్మాన్ని టచ్ పాడ్ లాగా మార్చి.. ఈ చిన్ని డివైజ్ ల పరిమాణాన్ని పెంచామని పరిశోధకులు తెలిపారు. ఈ డివైజ్ లను 'స్కిన్ ట్రాక్' అని పిలుస్తారు. దీనిలో రెండు భాగాలుంటాయి. ఒకటి సిగ్నల్ ఎమిటింగ్ రింగ్, రెండోది సెన్సింగ్ వ్రిస్ట్ బ్యాండ్. రింగ్ పెట్టుకున్న చేతి వేలిని స్మార్ట్ వాచ్ డివైజ్ ధరించిన చేతిపై కదిలించడం ద్వారా ఎలక్ట్రోకోడ్లను ఉత్పత్తిచేసేలా దీన్ని రూపొందించారు. ఎప్పుడైతే రింగ్ ఉన్న వేలు స్కిన్ ను టచ్ చేస్తుందో, అప్పుడు ఎక్కువ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ యూజర్ చేతిలోకి వెళుతాయి. అప్పుడు స్కిన్ పై వేలిని కదిపిన ప్రతిసారీ, ఎలక్టోకోడ్ ల ఆధారంగా స్మార్ట్ వాచ్ ఆపరేట్ అవుతుంది. చేతిపై లేయర్ పొర లాంటి క్లాత్ ను వేసినా ఈ టెక్నాలజీకి ఎలాంటి ఆటంకం కలుగదు. నొక్కడం, రాయడం, ప్రత్యేక హావభావాలు వంటి ఈ టచ్ స్క్రీన్ సిగ్నల్ లన్నింటినీ స్కిన్ ట్రాక్ గుర్తిస్తుంది. -
సీఎం ధరించినది స్మగుల్డ్ వాచీ
మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బెంగళూరు:‘కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధరించిన వాచీ స్మగుల్డ్‌దని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి సీబీఐతో విచారణ చేయించాల్సిన అవసరం ఉంది’ అని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీ.ఎస్.యడ్యూరప్ప పేర్కొన్నారు. మైసూరులో శనివారం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అసెంబ్లీలో మీరు వాచీ విషయంపై చర్చకు పట్టుబట్టారు కదా అన్న విలేకరుల ప్రశ్నకు యడ్యూరప్పపై విధంగా సమాధానం ఇచ్చారు. సీఎం వాచీ వ్యవహారంపై తాము న్యాయపోరాటానికి సన్నద్ధం అవుతున్నామని తెలిపారు. నిజా,నిజాలు తెలియాలంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం చాలా గంభీరంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది కాబట్టే తమ సభ్యులు అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టారన్నారు. ‘సీఎంకు స్మగుల్ గూడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. సీఎం సిద్ధరామయ్య పై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు నమ్మకం సన్నగిల్లుతోంది. అందుకే సీఎం మర్యాద పూర్వక విందుకు కూడా సగానికి పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరుకాలేదు. అందుకే రెండో సారి సిద్ధరామయ్య విందును ఏర్పాటు చేశారు’ అని యడ్యూరప్ప విమర్శలు గుప్పించారు. -
పదవి నుంచి తప్పించే కుట్ర
శాసన సభలో విపక్షాలపై సిద్ధు మండిపాటు చిన్న విషయాలపై అనవసర రాద్ధాంతం అది దొంగలించిన వాచీ కాదు... ఓ మిత్రుడి బహుమానం వాచీపై సీఎం వివరణ బెంగళూరు: వెనకబడిన వర్గాల వారి తరఫున ఎవరు మాట్లాడినా, వారి గొంతు నొక్కే ప్రయత్నం ఎంతో కాలంగా జరుగుతూనే ఉందని, అందులో భాగంగానే ఇప్పుడు కూడా తనను పదవి నుంచి తప్పించే కుట్రకు తెరతీశారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విపక్షాలపై మండిపడ్డారు. అందులో భాగంగానే వాచ్ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని అసహనం వ్యక్తం చేశారు. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే విషయమై శాసన సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న వాచీ సంబంధ ఆరోపణలు, రాజకీయంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను ఇదే సందర్భంలో శాసన సభలో సీఎం సిద్ధు ఉటంకించారు. తాను దేవుడిని నమ్ముతానని అయితే రోజూ పూజలు, హోమాలు చేయనన్నారు. బసవణ్ణ సిద్ధాంతాలను ఆచరిస్తానని పేర్కొన్నారు. ఆత్మసాక్షిని నమ్ముకుని పనిచేస్తున్నానని ఒక్క ఆరోపణ కూడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్నానని సిద్ధరామయ్య తెలిపారు. ఈ సమయంలో కలుగజేసుకున్న జేడీఎస్ పార్టీ ఫ్లోర్‌లీడర్ కుమారస్వామి...‘అర్కావతి డీ నోటిఫికేషన్ విషయంలో మీరు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారన్నది నిజం కాదా?’ అని ప్రశ్నించారు. ఇందుకు సీఎం సమధానమిస్తూ...‘అర్కావతి విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. నాకు న్యాయస్థానంపై నమ్మకముంది. అందువల్ల ఈ విషయంపై ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. మీపై రూ.150 కోట్ల లంచం ఆరోపణలు రాలేదా?’ అంటూ ప్రశ్నకు ప్రశ్నగా సమాధానమిచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఐదు కేసులను సీబీఐకు అప్పగించానని మీ హయాంలో ఒక్క కేసు అయినా సీబీఐ చేత దర్యాప్తు చేయించారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో ఒక్క తప్పు కూడా జరగలేదని తాను అనడం లేదని అయితే చిన్న విషయాలను కూడా భూతద్ధంతో చూపిస్తూ తనపై విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘నేను వెనుకబడిన తరగతికి చెందిన వాడిని. రాష్ట్రంలో సామాజికంగా వెనుకబడిన వారు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం చాలా కష్టం. అయినా నేను కష్టపడి ఆ స్థానంలో కుర్చొన్నాను. ఇప్పుడు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం ఇబ్బందిగా ఉంది. మొత్తంగా సామాజికంగా వెనుకబడిన వారు సీఎం పీఠం దక్కించుకోవడం చాలా కష్టం అనుకుంటే ఆ స్థానంలో కొనసాగడం మరింత కష్టం’ అంటూ విశ్లేషించారు. దొంగిలించిన వాచీ కాదు... తాను ధరించిన ఖరీదైన హోబ్లాట్ వాచ్ దొంగలించినది కాదని స్నేహితుడు గిఫ్ట్‌గా ఇచ్చిందేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాసనసభకు స్పష్టం చేశారు. సదరు వాచీపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడం, శాసనసభ సమావేశాలు ముగిసేలోపు సీఎం సిద్ధరామయ్యతో వివరణ ఇప్పిస్తానని స్పీకర్ కాగోడు తిమ్మప్ప రెండు రోజుల ముందు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య శాసనసభ సమావేశాలు ముగిసిన శనివారం రోజుల సదరు వాచ్‌పై వివరణ ఇచ్చారు. స్నేహితుడు కానుకగా ఇచ్చిన వాచ్‌పై జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆ సమయంలో కలుగజేసుకున్న విపక్ష బీజేపీ ఫ్లోర్‌లీడర్ జగదీష్‌శెట్టర్ ‘ఆరోపణలు వచ్చిన వెంటనే చేతిలో ఉన్న వాచీని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించిం ఉంటే సబబుగా ఉండేది. ఇప్పుడు ఏమి చేసినా ఏమి చెప్పినా ప్రజలు నమ్మలేరన్నారు.’ అన్నారు. ప్రజలకు అన్నీ తెలుసునని తాను ఇచ్చిన వివరణను అందరూ నమ్ముతున్నారని సిద్ధరామయ్య జవాబిచ్చారు. ఆ సమయంలో కలుగ జేసుకున్న స్పీకర్ కాగోడు తిమ్మప్ప ‘మీరు ఇచ్చిన జవాబు సరే...అయితే మీకు గిఫ్ట్‌గా ఇచ్చిన వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు పోలీసుల చేతికి చిక్కుతారు.’ అన్నారు. దీంతో కంగు తిన్న సీఎం సిద్ధరామయ్య అలాంటిది ఏమీ జరుగదు. సదరు వాచ్‌కు ఆయన అన్ని రకాల పన్నులు చెల్లించారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు కూడా సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఆయన అందజేశారు.’ అని సిద్ధరామయ్య వివరణ ఇవ్వడంతో వాచ్‌పై చర్చకు తెరపడింది. -
అనుకున్నదే అయింది..!
రిస్ట్ వాచీ వ్యవహారంపై దద్దరిల్లిన ఉభయసభలు మౌనం వహించిన సీఎం సిద్ధు ప్రతిపక్షాల ముప్పేట దాడి ఈశ్వరప్ప ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు భారతరత్న విశ్వేశరయ్య, దివంగత నిజలింగప్పలను ఆదర్శంగా తీసుకోవాలి అంటూ హితవు సమయాన్ని మింగేసిన సీఎం సిద్ధు వాచ్! సభ నేటికి వాయిదా సాక్షి, బెంగళూరు:అనుకున్నదే జరిగింది... ‘గిఫ్ట్ వాచీ’ వ్యవహారం ఉభయసభలను కుదిపేసింది. విపక్షాలు అధికార పార్టీపై ముప్పేట దాడి చేశాయి. వివరణ ఇచ్చుకోవడంతో అధికార పార్టీ వ్యూహం ఫలించలేదు. అత్యంత విలువైన చట్టసభల సమయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డైమండ్ వాచ్ మింగేసింది!. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కరువు, విద్యుత్ తదితర సమస్యల పై ఒక్క నిమిషమైనా చర్చ జరగకుండానే సమావేశాల్లో రెండోరోజైన మంగళవారం గడిచిపోయింది. ఫిబ్రవరి 29న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా ప్రసంగించిన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో రెండోరోజైన మంగళవారం శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఉదయం 11 గంటలకు వేర్వేరుగా ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లోనూ ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సాహితీవేత్తలతో పాటు సియాచిన్‌లో కురిసిన హిమపాతంలో చిక్కుకుని ప్రాణాలు విడిచిన సైనికులకు నివాళులు అర్పించారు. అటుపై శాసనసభలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప, శాసనమండలిలో అధ్యక్షుడు శంకరమూర్తి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు జవాబులు ఇవ్వాలని (ప్రశ్నోత్తరాల సమయం) సూచించారు. అయితే శాసనమండలిలో విపక్షనాయకుడైన కే.ఎస్ ఈశ్వరప్ప లేచి ‘ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విదేశాల్లో ఉన్న ఒక వ్యక్తి ఖరీదైన వాచ్‌ను తనకు గిఫ్ట్‌గా ఇచ్చారు.’ అని బహిరంగంగా ఒప్పుకున్నారు. అయితే ఆ వ్యక్తి ఎందుకు ఇచ్చారు? అన్న విషయంపై చర్చ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందుకు అధికారపక్ష నాయకుడు ఎస్.ఆర్ పాటిల్‌తో పాటు ఆ పార్టీ సభ్యులందరూ అభ్యంతరం చెప్పారు. అంతేకాకుండా వివిధ సందర్భాల్లో రాష్ట్ర బీజేపీ నాయకులైన యడ్యూరప్ప, సదానందగౌడతోపాటు ప్రధాని నరేంద్రమోదీలు ఖరీదైన వాచ్‌లు, సూట్లలో ఉన్న ఫొటోలను ప్రదర్శించి బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సమయంలో జేడీఎస్ పార్టీ ఎమ్మెల్సీలు బీజేపీ సభ్యులకు అండగా నిలబడ్డారు. ముఖ్యంగా ఆ పార్టీకు చెందిన సీనియర్ ఎమ్మెల్సీ బసవరాజ్ హొరట్టి ‘సభాపతి శంకరమూర్తి విపక్షనాయకుడు ఈశ్వరప్పకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. అయితే విపక్షాలు ఆయన్ను మాట్లాడనీయకుండా అడ్డుకున్నాయి. ఇది ఎమ్మెల్సీ సభ్యుడికి ఉన్న హక్కును హరించడమే అవుతుంది.’ అని పేర్కొన్నారు. అయినా పట్టువిడవని అధికార పక్షం నాయకులు కే.ఎస్ ఈశ్వరప్ప ప్రసంగాన్ని పదేపదే అడ్డుకుంటూ వచ్చారు. పరిస్థితిని అదుపుచేయడానికి సభను రెండు సార్లు వాయిదా వేసినా ప్రయోజనం లేకపోయింది. బీజేపీ, జేడీఎస్ సభ్యులు కే.ఎస్ ఈశ్వరప్పకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాల్సిందేనంటూ వెల్‌లోకి దూసుకువచ్చి నిరసనకు దిగడంతో సభను యథావిధిగా జరపలేమని భావించిన శంకరమూర్తి నేటి (బుధవారం) ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ఆత్మావలోకనం చేసుకోవాలి... శాసనసభలో కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డైమండ్ వాచ్ వివాదం ప్రతిధ్వనించింది. ఈ విషయమై చర్చకు అనుమతివ్వాల్సిందగా విపక్షనాయకుడు జగదీష్‌శెట్టర్ పట్టుబట్టారు. అయితే సిద్ధరామయ్య వాచ్ ధరించడం చాలా చిన్న విషయమని...దీనిపై విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని బెంగళూరు నగరాభివృద్ధిశాఖ మంత్రి కే.జే జార్జ్ ఎదురుదాడికి దిగారు. ఇంతలో శాసనసభలోని మంత్రులతోపాటు కాంగ్రెస్ శాసనసభ్యులు రాష్ట్ర బీజేపీ నాయకులు వివిధ సందర్భాల్లో ధరించిన ఖరీదైన వాచ్‌ల ఫొటోలను ప్రదర్శించారు. అయినా వెనక్కుతగ్గని జగదీశ్ శెట్టర్ సీఎం సిద్ధరామయ్య వ్యక్తిగతంగా ఎంత ఖరీధైన వాచ్‌ను ధరించినా తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే ప్రజల ఓట్లతో ఎన్నుకోబడిన నాయకులు లక్షల విలువ చేసే వాచ్‌లు ధరించడం ఎంత వరకూ సమంజసమో చెప్పాలని నిలదీశారు. ‘రూ.5 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను బహుమతి రూపంలో ప్రజాప్రతినిధులు తీసుకోకూడదన్న నిబంధన ఉంది. ఒక వేళ తీసుకున్నా అందుకు అవసరమైన ధృవీకరణ పత్రాలు సమర్పించాలి.’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్ కలుగజేసుకుని...‘ఖరీదైనా వస్తువులను గిఫ్ట్‌గా ఇచ్చే వారు అంతేకంటే ఎక్కువ విలువైన పనులను చేయించుకోవాలని చూస్తారు. ఇది సహజం. ఒకవేళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు శక్తి ఉంటే ఈ వాచ్‌కు సంబంధించిన వివాదం నుంచి బయటపడుతారు. ప్రజాప్రతినిధులమైన మనమంతా ఆత్మావలోకనం చేసుకోవాలి. నిజలింగప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాచ్ గిఫ్ట్‌గా వచ్చినప్పుడు ఆయన తీసుకోలేదు. ఇక భారత రత్న విశ్వేశరయ్య తనతో ఎప్పుడూ రెండు పెన్నులను ఉంచేకునే వారు. ఒకటి ప్రభుత్వ కార్యకలాపాలకు మరొకటి సొంత పనులకు ఉపయోగించేవారు. ఈ విషయాలను మనం సదా స్మరిస్తూ ఆచరించాలి. అయితే రాష్ట్రంలో ప్రజలు పలు సమస్యలతో బాధపడుతున్న సమయంలో వాటిపై చర్చించాలి కాని వాచ్‌లపై చర్చిస్తే ప్రజల దృష్టిలో చులకనైపోతాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెండికుర్చీను శివకుమార్ స్వామీజీకి ఇచ్చాను... వాచ్‌పై చర్చ జరుగుతున్న సమయంలోనే బయటి నుంచి శాసనసభలోకి వచ్చిన జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామిని ఉద్దేశిస్తూ స్పీకర్ కాగోడు తిమ్మప్ప మాట్లాడారు. ‘మీకు వెండి కుర్చీ గిఫ్ట్‌గా వచ్చింది కదా? దాన్ని ప్రభుత్వానికి అప్పగించారా?’ అంటూ ప్రశ్నించారు. ఇందుకు కుమారస్వామి సమాధానమిస్తూ నాకు గిఫ్ట్‌గా వచ్చిన వెండికుర్చీని సిద్ధగంగ మఠం పీఠాధిపతి శివకుమార్ స్వామీజీకి ఇచ్చాను.’ అని సమాధానమిచ్చారు. ఇందుకు మంత్రిమండలి అనుమతి పొందారా? అని ప్రశ్నించగా ‘నాకు గిఫ్ట్ ఇచ్చే సమయంలో వేదికపై ఉన్న సభ్యుల అనుమతి తీసుకుని శివకుమార్ స్వామీజీకి ఇచ్చాను.’ అని కుమారస్వామి సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా చర్చ జరుగుతున్నంత సేపు శాసనసభలో దాదాపు గంటన్నర మౌనంగా కుర్చొన్న సిద్ధరామయ్య అనంతరం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను నిబంధనలకు విరుద్ధంగా గిఫ్ట్ పొందలేదని ఈ విషయమై విపక్షాలు అనవసర ఆందోళన చేస్తున్నాయన్నారు. దీంతో సభలో తిరిగి కలాకలం మొదలైంది. విపక్షసభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేయడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప శాసనసభను నేటి(బుధవారం) ఉదయానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. -
ఢిల్లీకి రండి మాట్లాడుదాం !
సీఎం సిద్ధుకు అధిష్టానం పిలుపు మెడకు చుట్టుకుంటున్న‘గిఫ్ట్ వాచ్’ వ్యవహారం సాక్షి,బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. శాసనసభ సమావేశాలు అయిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలవనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమచారం. నిడారంబరంగా జీవిస్తానని చెప్పుకునే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రూ.70 లక్షల విలువ చేసే వాచ్ ఎలా వాడుతున్నారంటూ జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ఘాటుగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ విషయం జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షరాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని సూటు బూటు ప్రభుత్వం అంటూ విమర్శలకు దిగిన నేపథ్యంలో తమ పార్టీకు చెందిన ఓ ముఖ్యమంత్రి విలువైన వస్తువులు ధరించడం కాంగ్రెస్ అధినాయకత్వానికి మింగుడు పడటం లేదు. దీంతో సీఎం సిద్ధరామయ్యపై హైకమాండ్ గుర్రుగా ఉంది. ఇదిలా ఉండగా జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల తర్వాత సీఎం సిద్ధు స్వయంగా ఢిల్లీ వెళ్లి, కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో పాటు ‘మేడం’ సోనియాగాంధీతో భేటీ అయ్యి ‘ఆ వాచ్ నాకు ఓ స్నేహితుడు గిఫ్ట్‌గా ఇచ్చారు. అయితే జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ఈ విషయంలో అనవసర అరోపణలు చేశారు.’ అని వివరణ ఇచ్చారు. అయితే ఈ సీఎం సిద్ధు వివరణపై పార్టీ పెద్దలు సంతృప్తి చెందలేదని సమాచారం. దీంతో ఈ వాచ్‌కు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను మేడం సోనియాగాంధీతో పాటు యువరాజు రాహుల్‌గాంధీలు తెప్పించుకునే పనిలోపడ్డారు. ఈ విషయమై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) నాయకులు కొంతమంది ఇప్పటికే నివేదిక తయారు చేసే పనిలోపడ్డారు. ఇదిలా ఉండగా సిద్ధరామయ్య ధరిస్తున్న వాచ్ దొంగతనానికి గురైనదని కుమారస్వామి రెండు రోజుల ముందు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ వాచ్ యజమానిగా భావిస్తున్న రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సుధాకర్‌శెట్టిని నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్ సోమవారం స్వయంగా విచారణ చేశారు. విచారణ అనంతరం సుధాకర్ శెట్టి మీడియాతో మాట్లాడుతూ...‘ఆ వాచ్ నాది కాదు. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పాను.’ అని పేర్కొన్నారు. -
సీఎం వాచీ చోరీకి గురైనదే
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించిన వాచీ రూ.70లక్షలు విలువ చేసేదంటూ రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేకెత్తించిన మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి మరో బాంబ్ పేల్చారు. ఆ వాచీ ఇంతకుముందు చోరీకి గురైందని ఆరోపించారు. ఎన్ఆర్ఐ డాక్టర్ సుధాకర్ శెట్టి ఇంట్లో చోరీకి గురైన వాచ్, సిద్ధరామయ్య ధరిస్తున్న లగ్జరీ వాచ్ ఒకేలా ఉన్నాయంటూ సుధాకర్ శెట్టి స్నేహితుడొకరు తనకు స్వయంగా చెప్పారంటూ వెల్లడించారు. అయితే సుధాకర్ శెట్టి మాత్రం ఇందులో నిజం లేదని, తన ఇంట్లో చోరీకి గురైనవాచ్, సీఎం సిద్ధరామయ్య వద్ద ఉన్న వాచ్ వేర్వేరని చెబుతున్నారు. విలేకరుల సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ....‘నేను సీఎం సిద్ధరామయ్య ధరించిన వాచ్‌కు సంబంధించిన ఫొటోలను విడుదల చేసిన సందర్భంలో మీడియాలో ఆ వాచ్‌ను చూసిన ఎన్ఆర్ఐ డాక్టర్ సుధాకర్ శెట్టి తన స్నేహితుని ద్వారా నన్ను సంప్రదించేందుకు ప్రయత్నించారు. సీఎం సిద్ధరామయ్య ధరించిన వాచ్ తన ఇంట్లో చోరీకి గురైన వాచ్ అని, స్వయంగా కలిసి అన్ని వివరాలను చెబుతానని అన్నారు. అయితే రెండు రోజుల్లో ఆయన ఈ విషయంపై మాట్లాడేందుకు వెనకడుగు వేశారు. ఈ విషయంలోకి తనను లాగవద్దని అంటున్నారు. అయినా నేను ఆయనకు ధైర్యం చెప్పాను. 2015 జూలై 7న బెంగళూరులోని కబ్బన్‌పార్క్ పోలీస్ స్టేషన్లో సుధాకర్ శెట్టి తన ఇంట్లో జరిగిన దొంగతనానికి సంబంధించి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో రెండు రోలెక్స్ వాచ్‌లు, ఓ వజ్రాలు పొదిగిన వాచ్‌తో పాటు కొన్ని బంగారు, వజ్ర ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు’ అని వివరించారు. ఇక లగ్జరీ వాచ్ విషయమై సీఎం సిద్ధరామయ్య చెబుతున్న మాటలు కట్టు కథల్లా అనిపిస్తున్నాయని విమర్శించారు. నిజంగానే సిద్ధరామయ్య ప్రాణస్నేహితుడు ఆ వాచ్‌ను బహూకరించి ఉంటే ఆ విషయం చెప్పడానికి సీఎం ఇన్ని రోజులు ఎందుకు వేచి చూశారంటూ కుమారస్వామి ప్రశ్నించారు. కుమారస్వామిది దిగజారుడు రాజకీయం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం సిద్ధరామయ్య స్పందించారు. కుమారస్వామి పూర్తిగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ‘ఎలాంటి ఆధారాలు లేకుండా ఏవో ఆరోపణలు చేయడం కుమారస్వామికి అలవాటే. ఈ వాచ్‌కు సంబంధించిన వివరాలను నేను ఇప్పటికే వెల్లడించా. ఈ వాచ్‌పై నా స్నేహితుడు ఇప్పటికే అఫిడవిట్ కూడా ఇచ్చారు. ఆ వాచ్ నాది కాదు : ఇక ఈ వివాదంలో ముఖ్య వ్యక్తి అయిన డాక్టర్ సుధాకర్ శెట్టి ఈ అంశంపై స్పందించారు. ‘నేను నా భార్య ఇద్దరం డాక్టర్లమే. 35 ఏళ్లుగా విదేశాల్లో ఉంటూ కొంత కాలం క్రితమే నగరానికి వచ్చాం. మా ఇంట్లో దొంగతనం జరిగి ఖరీదైన వాచ్‌లు పోయిన విషయం నిజమే. అయితే సీఎం సిద్ధరామయ్య ధరించిన వాచ్, మా ఇంట్లో చోరీకి గురైన వాచ్ ఒకటే అనడంలో నిజం లేదని సుధాకర్ శెట్టి స్పష్టం చేశారు. -
'ఇక ఆ వాచీ పెట్టుకోను'
సాక్షి,బెంగళూరు: తాను ధరించిన ఖరీదైన వాచ్‌పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మొదటిసారిగా నోరు విప్పారు. సదరు వాచ్‌ను విధానసౌధలో క్యాబినెట్ మీటింగ్ జరిగే కార్యాలయంలో పెడుతానన్నారు. ఆ వాచ్‌ను ఇక ధరించబోనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రూ.70 లక్షల విలువైన వాచ్‌ను ధరిస్తున్నట్టు జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం లేపడంతో పాటు సీఎం సిద్ధు వ్యవహార శైలి పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తనపై ఆరోపణలు వచ్చిన దాదాపు పదిహేను రోజుల తర్వాత గురువారం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వాచ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘ఆ వాచ్‌ను కేరళకు చెందిన డాక్టర్ గోపాల పిళ్లై గిరీష్ చంద్ర వర్మ నాకు ఇచ్చారు. ఆయన దావణగెరెలో ఎంబీబీఎస్, మంగళూరులో ఎం.ఎస్ చేశారు. అటుపై వివిధ దేశాల్లో ప్రాక్టీస్ కొనసాగించి ప్రస్తుతం దుబాయిలో స్థిరపడ్డారు. నాకు అతను 1983 నుంచి తెలుసు. మేము మంచి మిత్రులం. గత ఏడాది జులైలో బెంగళూరుకు వచ్చినప్పుడు ఆయన తన చేతికి ఉన్న వాచ్‌ను తీసి నా చేతికి తొడిగారు. నేను వద్దాన్నా వినలేదు. స్నేహితుడే కదా ఇచ్చింది అని నేను కూడా తీసుకున్నా. మొదట్లో నేను ఆ వాచ్‌ను వాడలేదు. నాలుగు నెలల నుంచి మాత్రమే వాచ్‌ను ధరిస్తున్నాను. ఈ వాచ్ పై ఇంత వివాదం చెలరేగింది. ఇక ఈ వాచ్ ను ధరించను. క్యాబినెట్ హాల్లో ఉంచేస్తాను.’ అని తెలిపారు. ఇదిలా ఉండగా సీఎం సిద్ధరామయ్య వివరణ పలు అనుమానాలకు తావిస్తోందని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. వివరణ ఇవ్వడానికి పదిహేను రోజులు ఎందుకు తీసుకున్నట్టు అంటూ ప్రశ్నించారు. -
ఆ వాచీని క్యాబినెట్ హాల్లో పెడతా: సీఎం
సాక్షి,బెంగళూరు: తాను ధరించిన ఖరీదైన వాచ్‌పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మొదటిసారిగా నోరు విప్పారు. సదరు వాచ్‌ను విధానసౌధలో క్యాబినెట్ మీటింగ్ జరిగే కార్యాలయంలో పెడుతానన్నారు. ఆ వాచ్‌ను ఇక ధరించబోనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రూ.70 లక్షల విలువైన వాచ్‌ను ధరిస్తున్నట్టు జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం లేపడంతో పాటు సీఎం సిద్ధు వ్యవహార శైలి పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తనపై ఆరోపణలు వచ్చిన దాదాపు పదిహేను రోజుల తర్వాత గురువారం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వాచ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘ఆ వాచ్‌ను కేరళకు చెందిన డాక్టర్ గోపాల పిళ్లై గిరీష్ చంద్ర వర్మ నాకు ఇచ్చారు. ఆయన దావణగెరెలో ఎంబీబీఎస్, మంగళూరులో ఎం.ఎస్ చేశారు. అటుపై వివిధ దేశాల్లో ప్రాక్టీస్ కొనసాగించి ప్రస్తుతం దుబైలో స్థిరపడ్డారు. నాకు అతను 1983 నుంచి తెలుసు. మేము మంచి మిత్రులం. గత ఏడాది జులైలో బెంగళూరుకు వచ్చినప్పుడు ఆయన తన చేతిలో ఉన్నా వాచ్‌ను తీసి నా చేతికి తొడిగారు. నేను వద్దాన్నా వినలేదు. స్నేహితుడే కదా ఇచ్చింది అని నేను కూడా తీసుకున్నా. మొదట్లో నేను ఆ వాచ్‌ను వాడలేదు. నాలుగు నెలల నుంచి మాత్రమే వాచ్‌ను ధరిస్తున్నాను. ఈ వాచ్ పై ఇంత వివాదం చెలరేగింది. ఇక ఈ వాచ్‌ను ధరించను. క్యాబినెట్ హాల్లో ఉంచేస్తాను.’ అని తెలిపారు. ఇదిలా ఉండగా సీఎం సిద్ధరామయ్య వివరణ పలు అనుమానాలకు తావిస్తోందని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. వివరణ ఇవ్వడానికి పదిహేను రోజులు ఎందుకు తీసుకున్నట్టు అంటూ ప్రశ్నించారు. -
ముఖ్యమంత్రి వాచ్ ఖరీదు అరకోటిపైనే !!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించే వాచ్, కళ్లద్దాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం సిద్ధరామయ్య రూ.50-70లక్షల విలువచేసే వాచ్‌ను, రెండు లక్షల రూపాయల విలువ చేసే కళ్లద్దాలు ధరిస్తారని మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి ఆరోపించారు. ‘లోహియా’ ఆదర్శాలను పాలించే వ్యక్తిగా, అనుచరుడిగా సీఎం సిద్ధరామయ్య తనకు తాను చెప్పుకుంటూ ఉంటారు. అయితే సిద్ధరామయ్య లోహియా పేరును కేవలం ప్రచారానికి మాత్రమే ఉపయోగిస్తున్నారని, ఆయన నిజజీవితం పూర్తిగా విలాసవంతమైనదంటూ కుమారస్వామి ఆరోపించారు. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. ‘కుమారస్వామి చెప్పేవన్నీ అబద్ధాలే, కావాలంటే నా కళ్లద్దాలను రూ.50వేలకు, నా వాచ్‌ను పది లక్షల రూపాయలకు ఇచ్చేస్తాను, తీసుకోమనండి’ అంటూ ప్రతిస్పందించారు. అయితే ఈ విషయానికి సంబంధించిన ఆధారాలను హెచ్.డి.కుమారస్వామి మంగళవారం మీడియాకు అందజేశారు. ‘సిద్ధరామయ్య ధరించే వాచ్ హ్యూబ్లోట్ బ్రాండ్‌కు చెందినది. ఈ వాచ్‌ను పూర్తిగా బంగారుపూతతో తయారుచేస్తారు. డయల్‌లోని నంబర్ల స్థానంలో వజ్రాలను పొదుగుతారు. అందువల్లే ఈ వాచ్ ధర రూ.50-70లక్షలుగా ఉంటుంది. సిద్ధరామయ్య ఓ పెళ్లికి హాజరైనపుడు ఆయన ఈ వాచ్‌ను ధరించారు. ఆ వీడియోను వాట్సాప్ ద్వారా తెప్పించుకొని ఆ వీడియోను దుబాయ్‌కి పంపించి, ఈ విషయాన్ని నిర్ధారించుకున్నాను’ అని తెలిపారు. ఈ విమర్శలతో కర్ణాటకలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. -
పోలవరం వ్యయం భారీగా పెంపు
-
మందుల మాయాజాలం
-
రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమం
-
తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ధర్నా
-
గుండె విజయగర్వంతో నిండిపోయే సమయం
-
అలరిస్తున్న 'జాతీయ' గీతాలాపనలు
-
'ఇంటర్ జంబ్లింగ్' పై సర్కార్ పునరాలోచన
-
అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను
-
ఈ బాబా వాచీ ఖరీదు రూ.27 లక్షలట!
హరిద్వార్: సాధారణంగా బాబా, సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి అనుకుంటాం. కానీ ఇటీవల హరిద్వార్‌లో అర్ధ కుంభమేళాకు హాజరైన ఓ బాబాను చూస్తే ఈ అభిప్రాయం తప్పేమోనన్న అనుమానం కలుగుతుంది. ఒంటి నిండా బంగారంతో మెరిసిపోతూ సదరు సన్యాసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఏకంగా మూడున్నర కిలోల బంగారాన్ని ధరించి గంగానదిలో స్నానమాచరించి వస్తున్న బాబాను చూసి అక్కడున్నవారంతా నోళ్లు వెళ్లబెట్టారు. కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు, కమండలం తదితరాలతో సాదాసీదాగా ఉండాల్సిన సన్యాసి కాస్తా రూ. 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో మెరిసిపోయాడు. ఒకటా రెండా మెడ నిండా బంగారు గొలుసులు, లాకెట్లు.. అన్ని చేతివేళ్లకు బరువైన ఉంగరాలు. చేతికి పెద్ద వెడల్పాటి కడియం, డైమండ్ వాచ్. ఇలా సన్యాసులకు భిన్నమైన అవతారంతో తన శిష్యులు, అనుచరుల మందీ మార్బలంతో గంగా స్నానమాచరించడం ఆసక్తికరంగా మారింది. వజ్రాలు పొదిగిన ఆయన చేతి వాచీ సుమారు రూ. 27 లక్షల ఖరీదు చేస్తుందట. అయితే సన్యాసికి ఇంత బంగారం ఎందుకు అని ఎవరైనా అంటే ఈ బాబా అనుచరులు, శిష్యులకు కోపం వస్తుంది. బంగారం ఎంత స్వచ్ఛమో, ఎంత అమూల్యమో తమ గురువుకూడా అంతే విలువైనవాడంటూ వెనకేసుకొస్తున్నారు. మా గోల్డెన్ బాబా సేవలు అమూల్యమైనవంటూ మురిసిపోతున్నారు కాగా గోల్డెన్ బాబాగా చెప్పుకునే ఈయన గతంలో ఢిల్లీలో బట్టల వ్యాపారం చేసేవాడట. ఈయన అసలు పేరు సుధీర్ కుమార్ మక్కడ్(53 ). అయితే అప్పుడు ఎన్నో పాపాలు, పొరబాట్లు చేశానంటున్నాడీ గోల్డెన్ బాబా. ఆ పాపాలను కడిగేసుకోవడానికి సన్యాసిగా మారిపోయానంటున్నాడు. వ్యాపారం చేసే క్రమంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు సన్యాసం స్వీకరించానని చెబుతున్నాడు. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కష్టపడుతున్న పేద తలిదండ్రులకు, ఇతర స్వచ్ఛంద కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలకు సహాయం చేస్తుంటానని చెబుతున్నాడు. -
అతుక్కుపోయారో.. ఇక అంతే సంగతి!
న్యూయార్క్: ఏదో కాసేపు సరదాకో, లేదా విశ్రాంతిగా ఫీలయ్యేందుకో అలా టీవీ చూస్తే పెద్దగా నష్టం లేదుగానీ, ప్రతి రోజు అదే పనిగా టీవీ చూసేవాళ్లు మాత్రం తమంతట తాము వారి మృత్యురాత రాసుకున్నట్లేనని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు నిద్రాణంగా ఉన్న ఎన్నో రోగాలను కారకమయ్యే కణాలను కూడా నిద్ర లేపినట్లవుతుందని అవి ఒక్కసారి మేలుకున్నాక క్యాన్సర్ తోపాటు గుండె సంబంధమైన ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని మేరీలాండ్ లోగల నేషనల్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన సరాహ్ కేడల్ అనే పరిశోధనకారుడు ఆయన చేసిన అధ్యయనం వివరాలు వెల్లడించాడు. దీని ప్రకారం రోజూ మూడు నుంచి నాలుగు గంటలు చూసే వారి ఆయుష్షు తరిగిపోతుంది. ఆ అలవాటు నయంకాని ప్రమాదకరమై వ్యాధులను కలిగిస్తుంది. అంతేకాదు, మానసిక స్థితిపైనే తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా శారీరక దారుఢ్యంలో కూడా అమాంతం మార్పుల తీసుకొస్తుంది. ఆసక్తి, ఏకాగ్రత కూడా దెబ్బతిని పూర్తి శరీరం పనిచేసే వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం ఉందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. -
అతికించేద్దాం.. చూసేద్దాం..
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి గోడకు ఏదో పేపర్ అతికిస్తోంది అనుకుంటున్నారా? కాదు ఈ అమ్మడు అతికిస్తున్నది టీవీని! టీవీ ఏంటి గోడకు అతికించడమేంటి అనేగా మీ సందేహం! ఈ టీవీ పేరు ‘వాల్‌పేపర్ టీవీ'. ఈ సరికొత్త టీవీని తయారుచేసిన ఎల్జీ కంపెనీ కొరియాలో ప్రదర్శించింది. 55 అంగుళాలుండే ఈ ఓఎల్ఈడీ టీవీ కేవలం ఒక్క మిల్లీమీటర్ కన్నా తక్కువ మందం, 1.9 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. దీన్ని అయస్కాంతం సహాయంతో గోడకు అతికించుకోవచ్చు. అంతేకాదు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసేసి పేపర్లా మడిచి భద్రపరుచుకోవచ్చు కూడా. వీటి తయారీలో పాలీఇమైడ్ ఫిల్మ్‌లను ఉపయోగించడం వల్ల టీవీని వంచవచ్చు. -
హెచ్ఎంటీలో వాలంటరీ రిటైర్మెంట్ !
న్యూఢిల్లీ: హెచ్ఎంటీ సంస్థ స్వచ్ఛంద పదవీ విరమణ/ స్వచ్ఛంద విభజన స్కీమ్‌ల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. వాచ్‌లు, ట్రాక్టర్లు తయారు చేస్తున్న ఈ సంస్థ గత 15 సంవత్సరాలుగా నష్టాల్లో నడుస్తోంది. సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడానికి హెచ్ఎంటీ ఈ ప్రతిపాదనలను సమర్పించింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 1.045 మంది ఉద్యోగులున్నారు. వీరి వార్షిక వేతన బిల్లు రూ.45కోట్లుగా ఉంది. భారీ పరిశ్రమల విభాగం ఆదేశాలననుసరించి ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసి, కేంద్రానికి సమర్పించామని హెచ్ఎంటీ సంస్థ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు నివేదించింది. కాగా ఈ సంస్థను మూసేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోందని వార్తలు వస్తున్నాయి. గత పదేళ్లుగా వేతనాలకు, ఇతర బకాయిలకు బడ్జెటరీ మద్దతు లభిస్తోంది. గత ఏడాది కేంద్రం రూ.1,083 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది. కంపెనీ ఆధునీకరణ, ఐదేళ్లలో టర్న్ అరౌండ్ కావడానికి తోడ్పటటానికి ఈ ప్యాకేజీని కేంద్రం ఆమోదించింది. -
వాచ్ పెట్టుకొచ్చాడని మణికట్టు కోసేశారు
మదురై : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 68 ఏళ్లు గడిచినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో అంటరానితనం కొనసాగుతూనే ఉంది. తాజాగా తమిళనాడులో ఓ దళిత విద్యార్థి పాఠశాలకు వాచ్ పెట్టుకొచ్చాడనే నెపంతో అగ్రవర్ణ విద్యార్థులు అతని మణికట్టు కోశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. విరుదునగర్ జిల్లా శివకాశిలో పదో తరగతి విద్యార్థి రమేష్ స్కూలుకు వాచ్ పెట్టుకుని వచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన అగ్రవర్ణాల విద్యార్థులు సోమవారం అతడి చేత బలవంతంగా చేతి నుంచి వాచ్ తీయించివేశారు. సీనియర్ విద్యార్థుల చర్యను రమేష్ వ్యతిరేకించటంతో పాఠశాల ఆవరణలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు రోజుల అనంతరం రమేష్ తిరుత్తణళ్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా సీనియర్ విద్యార్థులు సహా సుమారు 15మంది బాలురు గ్యాంగ్ అతనిపై దాడి చేసి మణికట్టు కోశారు. అయితే వారి నుంచి తప్పించుకున్న బాధిత విద్యార్థి తీవ్ర రక్తస్రావంతో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకుని అనంతరం శివకాశి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటనపై తిరుత్తణళ్లూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి సబంధించి ముత్తుకుమార్ అలియాస్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కాగా ఇటీవలి ధర్మపురి జిల్లాలో రెండు గ్లాసుల పద్ధతి పెట్రేగుతుండటం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఓవైపు దళిత సామాజికవర్గ సంఘాలు గగ్గోలు పెడుతుండగా తాజా ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
టిక్.. టిక్.. టిక్.. వాచ్ డిజైనర్..
విలువైన కెరీర్‌కు చక్కటి ‘టైమ్’ టైమ్.. ఎంతో విలువైంది. పోటీ ప్రపంచంలో ప్రతి క్షణం, ప్రతి నిమిషం ప్రధానం. అలాంటి టైమ్‌ను సూచించే గడియారాలు.. నేడు విలువైన కెరీర్‌ను అందించడంలో.. లక్షల జీతం సొంతం చేసుకోవడంలో.. మెరుగైన ఉపకరణాలుగా మారుతున్నాయి. ఆధునిక ప్రపంచంలో లేటెస్ట్ ట్రెండ్స్ రాజ్యమేలుతున్న నేటి పరిస్థితుల్లో సమయాన్ని సూచించే గడియారాలు కూడా కొత్త ఆకృతులతో ఆకర్షిస్తున్నాయి. ఇలా ఆకర్షించే విధంగా వాచ్‌ల డిజైన్‌ను రూపొందించడం వెనుక ఎంతో శ్రమ. మరెంతో సృజనాత్మకత ఉంది. వంద రూపాయల మొదలు.. లక్షల రూపాయల వరకు ఆయా స్థాయిల వినియోగదారుల కొనుగోలు శక్తిని దృష్టిలో పెట్టుకుని రూపొందించడం ఒక ప్రత్యేక కళ. ఆ కళను అందించించడంతోపాటు కలర్‌ఫుల్ కెరీర్‌కు.. సోపానంగా నిలుస్తున్న వాచ్ డిజైనర్ కెరీర్‌పై ఫోకస్. గడియారం.. వాచ్.. అంటే 12 అంకెలు.. రెండు ముళ్లతో సమయాన్ని సూచించే సాధనం. వాల్ క్లాక్ అయినా రిస్ట్ వాచ్ అయినా గడియారం ఉద్దేశం అదే. కానీ ఆధునిక ప్రపంచంలో, అత్యాధునిక అభిరుచులకు అనుగుణంగా గడియారాలను డిజైన్ చేయడం అంత సులువేమీ కాదు. అందుకే నేడు వాచ్ డిజైనర్ విధి ఎంతో క్రియాశీలకమైంది. ఒక నిర్దిష్ట ఆకృతిలో వాచ్‌ను డిజైన్ చేయాలంటే.. దానికోసం చేయాల్సిన కసరత్తు కూడా ప్రత్యేకం. ప్రస్తుత వినియోగదారుల అభిరుచి, ట్రెండ్‌ను పరిశీలించడం- విశ్లేషించడం; వీటికి అనుగుణంగా ముందుగా పలు రకాల ఆకృతులను రూపొందించడం, అన్నిటిలోకి అత్యున్నత ఆకృతి ఏంటని ఆలోచించడం, కొత్త వాచ్ డిజైన్ వెనుక ఉద్దేశాన్ని గుర్తించడం ఇలా ఎన్నో ప్రక్రియలు ఇమిడి ఉంటాయి. వీటన్నిటి కలయికతోనే ఆకర్షణీయమైన ఆకృతికి ఆస్కారం. ‘టైమ్’.. టు ‘టీం’ వర్క్: వాస్తవానికి సృజనాత్మకతకు పెద్దపీట వేసే డిజైన్ కోణంలో పరిగణిస్తే.. వాచ్ డిజైన్‌లో ఇది మరింత ఆవశ్యకం. లక్షల మంది వినియోగదారులను ఆకర్షించేలా డిజైన్ చేసే విషయంలో టీం వర్క్‌కి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ క్రమంలో ఉత్పత్తి ఉద్దేశాన్ని వివరించడం, ఆలోచనను తెలపడం, సహచరులతో పరస్పర అభిప్రాయ సేకరణ, ఆలోచనను పంచుకోవడం, గ్రూప్ ప్రజెంటేషన్, ఇంటరాక్షన్ కోసం టీం వర్క్ తప్పనిసరి. తద్వారా కాన్సెప్ట్‌లను కుదించడం, టెక్నికల్ డ్రాయింగ్స్కు రూపమివ్వడం, వాటి మాతృకలను పరిశీలించి.. చివరికి ప్రస్తుత అవసరానికి అనువైన ఆకృతికి రూపమివ్వడం సాధ్యమవుతుంది. వృద్ధి బాటలో పరిశ్రమ: వాచ్ ఇండస్ట్రీ ప్రస్తుతం 8 శాతం వార్షిక వృద్ధితో పురోగమిస్తోంది. దీంతో వాచ్ డిజైనింగ్ సృజనాత్మక కోణంలో అత్యున్నత విభాగంగా నిలుస్తోంది. వాచ్ డిజైనింగ్‌లో విధులు నిర్వర్తించే క్రమంలో సదరు వాచ్ భౌతిక పరిమాణాలను దృష్టిలో పెట్టుకుని డయల్స్, స్ట్రాప్స్, కేస్ వంటి వాటిని రూపొందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ప్రధానమైంది, ప్రాథమికమైంది లక్షిత వినియోగదారుల అభిరుచి, ఆసక్తులను పరిగణనలోకి తీసుకోవడం. పని వేళలు ఇలా: వాచ్ డిజైనర్ వృత్తి ఉదయం తొమ్మిది గంటలకు మొదలై సాయంత్రం అయిదు గంటలకు విధులు ముగిసే ఉద్యోగం కాదు. సృజనాత్మకత కీలకమైన డిజైనింగ్ విభాగంలో అనుక్షణం కొత్త ఆలోచనలను పదును పెట్టాల్సిందే. అంటే ఒకరకంగా ఇది 24ఁ7 తరహా ఉద్యోగంగానే భావించాలి. ఆఫీసులో ఉన్నా.. ఇంటి వద్ద ఉన్నా.. కొత్త ఆలోచన రాగానే దానికి పెన్ను, పేపర్‌తో ప్రాథమిక రూపమివ్వడం అనేది ప్రాధాన్యం. దాని ద్వారా భవిష్యత్తులో మంచి డిజైన్ల రూపకల్పనకు ఆస్కారం లభిస్తుంది. ఇక.. డిజైన్ ప్రజెంటేషన్స్; మీటింగ్స్, ఫ్యాక్టరీ విజిట్స్, కొత్త డిజైనర్లకు శిక్షణనివ్వడం, ఇతర డిజైనర్లతో కలిసి పని చేయడం; క్లయింట్లతో చర్చలు వంటివి సాధారణంగా ఒక రోజులో వాచ్ డిజైనర్ విధుల్లో భాగంగా ఉంటాయి. లక్షల్లో వేతనాలు: వాచ్ డిజైనర్ ఇండస్ట్రీలో ఎంట్రీ లెవల్ నుంచి డిజైన్ డెరైక్టర్ స్థాయి వరకు చేరుకోవచ్చు. ప్రారంభంలో రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల వార్షిక వేతనం గ్యారంటీ. కొంత అనుభవం లభించాక సీనియర్ డిజైనర్‌గా రూ. 8 లక్షలు అందుకునేందుకు ఎన్నో అవకాశాలు. డిజైన్ మేనేజర్‌గా రూ. 16 లక్షల వార్షిక వేతనం పొందడం కూడా సాధ్యమే. కావల్సిన నైపుణ్యాలు: సృజనాత్మక సమయస్ఫూర్తి లక్ష్యంపై ఆసక్తి తగిన ఆకృతులు, ప్రమాణాలను గుర్తించే లక్షణం సాంకేతిక పరికరాలపై పరిజ్ఞానం చిన్నపాటి పరిమాణంలోని ఆకృతులను గుర్తించే లక్షణం నిరంతరం నేర్చుకోవాలనే అభిరుచి పరిశీలనాత్మక దృక్పథం వినియోగదారుల అవసరాలను గుర్తించడం సమస్యలను విశ్లేషించి పరిష్కరించే నైపుణ్యం వాచ్ డిజైన్‌లో అడుగు పెట్టాలంటే: ఈ రంగంలో కెరీర్ కోరుకునే ఔత్సాహికులకు ముందుగా డిజైన్ ఆప్టిట్యూడ్ ఉండాలి. డిజైన్‌లో డిగ్రీ కచ్చితంగా దోహదం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రొడక్ట్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్, యాక్ససరీ డిజైన్ తదితర విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయడం ఉపకరిస్తుంది. ప్రస్తుతం దేశంలోని ఎందరో వాచ్ డిజైనర్లు ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాక డిజైన్‌లో పీజీ చేసి మరీ ఈ రంగంలో అడుగు పెడుతున్నారు. డిజైన్ కోర్సులు.. ప్రముఖ ఇన్స్టిట్యూట్లు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్- అహ్మదాబాద్ వెబ్సైట్: www.nid.edu నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వెబ్సైట్: www.nift.ac.in క్రియేటివ్ అకాడెమీ-మిలాన్ వెబ్సైట్: www.creative-academy.com ఓయూలో లా కోర్సులు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ లా వివిధ లా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజీ డిప్లొమా ఇన్ లాస్ విభాగాలు: సైబర్ లాస్, టాక్సేషన్ ఆండ్ ఇన్సూరెన్స్ లాస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఎంపిక: అక్టోబర్ 12న నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ద్వారా. అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. వెబ్సైట్:www.osmania.ac.in ఎన్ఐబీఎంలో పీజీ డిప్లొమా పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్ (ఎన్ఐబీఎం) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విభాగం: బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కాలపరిమితి: రెండేళ్లు అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. 2014- క్యాట్/ సీమ్యాట్/ ఏటీఎంఏలో అర్హత సాధించాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: అక్టోబర్ 1 - జనవరి 31 వెబ్సైట్:www.nibmindia.org బార్కలో టెక్నీషియన్లు కల్పకంలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ఫెసిలిటీస్‌లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెక్నీషియన్ - సి: 2, విభాగం: బాయిలర్ ఆపరేటర్ అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్ ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ట్రేడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. చివరి తేది: సెప్టెంబర్ 19 వెబ్సైట్: http://www.barc.gov.in/ కాంపిటీటివ్ కౌన్సెలింగ్ గ్రూప్స్, సివిల్స్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్‌కు ఎలా ప్రిపేర్ కావాలో తెలిపండి? - హెచ్. లహరి, కొత్తపేట జనరల్ సైన్స్ విభాగంలోని బయాలజీలో వృక్ష, జంతు వైవిధ్యం-వాటి లక్షణాలు; ప్రత్యేకతలపై దృష్టి సారించాలి. అదే విధంగా మానవ శరీర ధర్మశాస్త్రం; వ్యాధులకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. గ్రూప్-1లో శరీర అవయవాలు- పని తీరు- వ్యాధులకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. అంతేకాకుండా ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్‌తో సమ్మిళితమైన ప్రశ్నలూ కనిపిస్తున్నాయి. (ఉదా: ఇటీవల కాలంలో ప్రబలుతున్న వ్యాధులు, అమల్లోకి వచ్చిన టీకాలు, మందులు, చికిత్స విధానాలు, నోబెల్ పురస్కారాలు-సంబంధిత పరిశోధనలు వంటివి). ఫిజిక్స్ ప్రశ్నలు అప్లైడ్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి. కాబట్టి మెకానిక్స్, ప్రమాణాలు, విద్యుత్, ఆధునిక భౌతిక శాస్త్రం ముఖ్యాంశాలుగా చదవాలి. రసాయన శాస్త్రానికి సంబంధించి సివిల్స్, గ్రూప్స్‌లో క్రమేణా ప్రాధాన్యం పెరుగుతోంది. నిత్య జీవితంలో మానవులు వినియోగించే పలు రసాయనాలు (ఉదా: కాస్మొటిక్స్, టాయిలెట్స్, ఫార్మాస్యూటికల్స్), ప్లాస్టిక్స్, పాలిమర్స్, కాంపొజిట్స్‌పై సమాచారం తప్పనిసరిగా సేకరించాలి. వీటికి అదనంగా లోహ సంగ్రహణ శాస్త్రం, ఆవర్తన పట్టిక ప్రత్యేకత, మూలకాలపై దృష్టి సారించాలి. ఇందుకోసం ప్రామాణిక పుస్తకాలతోపాటు గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. - సి. హరికృష్ణ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ -
ఆపదలో ఆదుకునే వాచీ!
ఈ వాచీ టైం చూసుకోవడానికే కాదు. అదృష్టం బాలేక కిడ్నాపర్ల చేతిలో పడితే, ఈ వాచీ ఉంటే సులభంగా బయటపడవచ్చు. అందుకు వీలుగా దృఢమైన ప్లాస్టిక్ తాడు, చిన్నపాటి బ్లేడు ఇతర వస్తువులు వాచీ పట్టీ లోపలివైపు ఎవరికీ తెలియకుండా దాచుకోవచ్చు. దాంతో దుండగుల బారి నుంచి రక్షించుకోవచ్చునని ఈ వాచీని డిజైన్ చేసిన గేర్వార్డ్ అనే కంపెనీ చెబుతోంది. ఏకే బ్యాండ్ పేరుతో మార్కెట్ చేస్తున్న ఈ వాచీ ఖరీదు 20 డాలర్లు మాత్రమే. మన కరెన్సీలో అయితే సుమారు 1,200 రూపాయలు. -
కాపురాలను కూల్చేస్తున్న నీలిచిత్రాలు
న్యూయార్క్: నీలి చిత్రాలు చూసే అలవాటు ఉన్నవారు వెంటనే ఆ అలవాటును మానుకోవడం మంచిదని, లేకుంటే కాపురం కూలిపోయే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నీలి చిత్రాలు చూసే వారి వివాహ బంధం విచ్చిన్నమై విడాకులకు దారితీస్తున్నాయని ఓ పరిశోధనలో తేలింది. నీలి చిత్రాలు చూసే అలవాటు వివాహేతర సంబంధాలకు ప్రేరేపిస్తోందని వెల్లడైంది. ఇటువంటి చిత్రాలు చూసే ఆడ/మగవారిలో చాలామంది వివాహేతర సంబంధాలు కోరుకుంటున్నారని చెబుతున్నారు. ఇలాంటి భార్యభర్తల మధ్య గొడవలు వచ్చి చివరకు విడాకులు తీసుకుంటున్నారని వెల్లడించారు. 551 మంది దంపతులపై పరిశోధన చేశారు. నీలి చిత్రాలు చూశారా? వివాహ భాగస్వామితో గాక ఇతరులతో శృంగారంలో పాల్గొనడంపై మీ అభిప్రాయం ఏమిటి? నీలి చిత్రాలు చూసే అలవాటు వివాహేతర సంబంధాలకు ప్రేరేపిస్తుందా? వంటి ప్రశ్నలకు వారి అభిప్రాయం సేకరించారు. నీలి చిత్రాలు చూసే వారి వివాహితుల కాపురాలు ఎక్కువగా విచ్చిన్నమైనట్టు పరిశోధనలో తేలింది.