Diljit Dosanjh: కల్కి సింగర్‌ వాచ్‌ ధర తెలిస్తే కంగుతినడం ఖాయం..! | Diljit Dosanjh Flaunts Diamond Encrusted More Than Rs 1 Crore Watch | Sakshi
Sakshi News home page

కల్కి సింగర్‌ దిల్జీత్‌ దోసాంజ్‌ వాచ్‌ ధర ఏకంగా అన్ని కోట్లా..!

Published Wed, Jun 19 2024 10:51 AM | Last Updated on Wed, Jun 19 2024 12:39 PM

Diljit Dosanjh Flaunts Diamond Encrusted More Than Rs 1 Crore Watch

ప్రముఖ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్‌ బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బడిలో పాఠాలు చదువుకునే రోజుల్లో గురుద్వారలో కీర్తనలు పాడేవాడు దిల్జీత్‌ దోసాంజ్‌. తర్వాత ఆ గొంతే అతడికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. పంజాబీ, హిందీ ఇండస్ట్రీలో సింగర్‌గా, నటుడిగానూ రాణిస్తున్నాడు. అంతేగాదు ప్రభాస్‌ లేటెస్ట్‌ మూవీ  'కల్కి 2898 AD'లో 'భైరవ ఏంథమ్' పాటని కూడా పాడారు. ఇక దిల్జిత్‌ దోసాంజ్‌​ పాటలే గాక మంచి ఫ్యాషన్‌ ఐకాన్‌ కూడా. ప్రతి పాటకు అందుకు తగ్గ డిజైనర్‌ డ్రెస్‌లతో ప్రేక్షకులను అట్రాక్ట్‌ చేస్తుంటాడు. బహుశా ఈ ఆహార్యమే అతడిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిందేమో.!. 

ఇక ఇటీవల జిమ్మీపాలన్‌  ది టునైట్‌ షోలో దిల్జిత్‌ దోసాంజ్‌ ధరించి వాచ్‌ అందర్నీ ఆకర్షించింది. ఆయన ఆ షోలో పంజాబీకి చెందిన గోట్‌ లిరిక్స్‌, బోర్న్‌ టు షైన్‌ వంటి మంచి హిట్‌ పాటలతో ప్రేక్షకులనూ ఉర్రూతలు ఊగించాడు. ఈ షోలో ఆయన పంజాబీ సంప్రదాయం ఉట్టిపడేలా వేషధారణతో పాటలు పాడారు. అలాగే అందుకు తగ్గట్లు తన సంస్కృతిని తెలియజెప్పేలా గోట్‌ లిరిక్స్‌లో మంచి హిట్‌ పాటలతో అలరించారు. ఈ షోలో ఆయన పాడుతూ.. లయబద్ధంగా డ్యాన్స్‌లు చేశారు. ఆ షోలో అందరి దృష్టి ఆయన చేతికి ధగ ధగ మెరుస్తూ కనిపిస్తున్న వాచ్‌పైనే పడింది. విలాసవంతమైన వస్తువుల కలెక్షన్‌కు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా ఉండే దిల్జిత్‌ ఆడెమర్స్ పిగెట్ రాయల్ ఓక్ సెల్ఫ్‌వైండింగ్  బ్రాండ్‌ వాచ్‌ని ఈ షోకి ఎంపిక చేసుకున్నారు. 

ఈ వాచ్‌ 18 క్యారెట్‌ల రోజ్‌ గోల్డ్‌ లింక్‌లతో కూడిన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బ్రాస్‌లెట్‌తో రూపొందించారు. అంతేగాదు ఈ వాచ్‌ ఇండెక్స్‌ అవర్‌ మార్క్‌లో సిల్వర్‌ డయల్‌ ఉంటుంది. దీన్ని జైన్‌ ఆభరణాల వ్యాపారులు రూపిందించారట. ఈ వాచ్‌ మెరిసిపోయేలా మొత్తం వజ్రాలతో పొదిగారు. ఎంత దూరం నుంచి చూసినా వాచ్‌ చేయిపై మిరుమిట్లు గొలిపే కాంతితో కూడిన ఒక ఆభరణంలా కనిపిస్తుంది. ఇంత లగ్జరీయస్‌ వాచ్‌ ధర వింటే మాత్రం కళ్లు బైర్లుకమ్ముతాయి. దిల్జిత్‌ ఈ లగ్జరీయస్‌ బ్రాండెడ్‌ వాచ్‌​ని ఏకంగా రూ. 1.2 కోట్లుతో కొనుగోలు చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది మీరు కూడా ఓ లుక్కేయండి. 

 

(చదవండి: ప్లాస్టిక్‌ బాటిల్స్‌తో టీ షర్ట్స్‌..ఏకంగా రూ. 80 కోట్లు..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement