ప్రముఖ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్ త్వరలో ఇండియాలోని పలు మెట్రో నగరాల్లో సంగీత కచేరి నిర్వహించనున్నాడు. 'దిల్ లుమినటి టూర్' పేరిట నిర్వహించబోతున్న ఈ కన్సర్ట్‌కు సంబంధించి లక్ష టికెట్లను సెప్టెంబర్ 10న అమ్మకానికి పెట్టగా కొద్ది నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే ఆ టికెట్ రేట్లు మధ్య తరగతి జనాలకు అందుబాటులో లేవని కమెడియన్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ సౌమ్య సాహ్ని ఫైర్ అయింది.
అంత డబ్బు ఎక్కడిది?
సంగీత కచేరిలో ఒక్క టికెట్ రూ.20-25 వేలా? ప్రేక్షకుల దగ్గర అంత డబ్బు ఎక్కడిది? పైగా ఎక్కువమంది నిరుద్యోగులే! మన భాషలో ఒకరు అద్భుతంగా పాడుతుంటే చూడాలని ఎవరికి ఉండదు.. కానీ టికెట్ రేట్లు ఆ రేంజ్‌లో ఉంటే దాన్ని కొనడం మధ్య తరగతి వాళ్లకు ఎలా సాధ్యమవుతుంది? పైగా పిల్లలతో కలిసే కుటుంబాలు కచేరీకి వెళ్తుంటాయి.
బాగానే సంపాదిస్తున్నారు కదా!
ఎలాగో విదేశాల్లో కచేరీలు పెట్టి బాగానే సంపాదిస్తున్నారు కదా! అలాంటప్పుడు కనీసం మనవాళ్ల దగ్గరైనా తక్కువ వసూలు చేయొచ్చుగా.. అంతర్జాతీయ సెలబ్రిటీలు కూడా ఒక్క టికెట్ దాదాపు రూ.10 వేలకే అమ్ముతారు. అలాంటిది నువ్వు రూ. 15 వేలు, రూ.20-25 వేలకు టికెట్స్ అమ్మడమేంటో నీకే తెలియాలి' అని వీడియోలో మండిపడింది.
రూ.500 పెట్టడమే ఎక్కువ
ఈ వీడియో చూసిన నెటిజన్లు సౌమ్య అభిప్రాయానికే మద్దతిస్తున్నారు. 'ఒక్క టికెట్‌కు రూ.500 పెట్టడమే ఎక్కువ. నేనైతే ఆ కచేరీని యూట్యూబ్‌లో చూస్తాను', 'మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయ్యుండి దిల్జిత్ ఇలా డబ్బు, పేరు వెనక పరిగెడతాడని అస్సలు ఊహించలేదు', 'అతడు కావాలనుకుంటే ఒక్క సిటీలోనే పలు షోలు చేయొచ్చు, కానీ అభిమానుల కంటే కూడా డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చాడు' అని కామెంట్లు చేస్తున్నారు.
ఆరోజే కచేరీ ప్రారంభం
కాగా దిల్జిత్ కచేరీ అక్టోబర్ 26 ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నో, పుణె, కోల్‌కతా, బెంగళూరు, ఇండోర్, చంఢీగర్ వంటి నగరాల మీదుగా ఈ కచేరీ టూర్ సాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment