concert
-
మ్యూజిక్ కన్సర్ట్‌లో సందడి చేసిన సితార, నమ్రతా శిరోద్కర్ (ఫోటోలు)
-
బ్రిటీష్ సింగర్ నోట ‘జై శ్రీరామ్’.. వీడియో వైరల్
బ్రిటిష్ సింగర్ క్రిస్ మార్టిన్ నోట ‘‘జై శ్రీరాం’’ అనే పదం వినిపించింది. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం సాయంత్రం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో తన బ్యాండ్ ‘కోల్డ్‌ప్లే’ బృందంతో ప్రదర్శన ఇచ్చారు. ఫిక్స్ యూ, ఏ స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్‌తో యువతను ఉర్రుతలూగించారు. ఈ క్రమంలో.. ప్రదర్శన ముగించే సమయానికి క్రిస్ మార్టిన్(Chris Martin) అక్కడున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై చూపించిన అభిమానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పట్టుకున్న ఫ్లకార్డుపై జై శ్రీరాం అని ఇంగ్లీష్‌లో రాసి ఉంది. అది చూసి ఆయన ‘‘జై శ్రీరామ్’’(Jai Shreeram) అనడంతో స్టేడియం మారుమోగిపోయింది. ఆపై ఆ పదం అర్థం ఏంటని? అక్కడున్నవాళ్లను అడిగి తెలుసుకున్నారు. When Chris Martin said ‘Jai Shri Ram’ at Mumbai concert... the crowd went wild!#ChrisMartin #MumbaiConcert #ColdplayInIndia #JaiShriRam pic.twitter.com/yNeB6FcMOF— India Today NE (@IndiaTodayNE) January 19, 2025బూమ్ బూమ్ బుమ్రా పేరు కూడా.. ప్రదర్శన ఇచ్చే టైంలో ఉన్నట్లుండి మార్టిన్ నోట జస్ప్రీత్ బుమ్రా పేరు ప్రస్తావన కూడా వచ్చింది. ‘‘ఆగండి.. ప్రదర్శన అయిపోలేదు. చివరగా జస్ప్రీత్ బుమ్రా వచ్చి పాల్గొంటాడట’’ అని మార్టిన్ మైకులో చెప్పాడు. దీంతో అభిమానులు బుమ్రా నినాదాలతో హోరెత్తిపోయారు. అయితే అలాంటిదేం అదేం జరగకపోయినా.. క్రిస్ మార్టిన్ నోట బుమ్రా పేరు రావడంతో క్రికెట్ అభిమానులు మాత్రం ఖుషీ అయ్యారు.Coldplay's Mumbai concert on Saturday was unforgettable for music lovers and cricket fans. During the performance, Chris Martin surprised the audience by mentioning India's star bowler, Jasprit Bumrah.#ColdplayMumbai #Coldplay #JaspritBumrah #ChrisMartin #MusicConcert pic.twitter.com/TMz2wscdkm— Mid Day (@mid_day) January 19, 2025ఇదిలా ఉంటే.. హాలీవుడ్ స్టార్ డకోటా జాన్సన్(Dakota Johnson), క్రిస్ మార్టిన్ ప్రియురాలు. ఈ ఇద్దరూ భారత్ సందర్శనకు వచ్చారు. తాజాగా.. ముంబైలోని ప్రసిద్ధ శ్రీ భూల్‌నాథ్ ఆలయాన్ని ఈ జంట దర్శించుకుంది. ఆధ్యాత్మిక సందర్శన కోసం సాంప్రదాయ భారతీయ దుస్తుల్లో కనిపించారు. క్రిస్ బ్లూ కుర్తాలో మెడపై రుద్రాక్ష మాలతో కనిపించాడు. Dakota Johnson telling her wishes in ear of Shri Nandi Maharaj. Amazing how foreign nationals come to India and try following our culture and traditions! #Coldplay #ChrisMartin #DakotaJohnson pic.twitter.com/0Dz19yXg5c— Priyanshi Bhargava (@PriyanshiBharg7) January 18, 2025 ఆలయంలో నంది చెవిలో మార్టిన్ తన మనసులోని కోరికను వినిపించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకు ముందు.. మార్టిన్, జాన్సన్‌లు ముంబైలో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. -
దీపికా పదుకొణె లైఫ్ రీస్టార్ట్.. సింగర్‌కి కన్నడ నేర్పిస్తూ (ఫొటోలు)
-
మహేశ్-నమ్రతని మించిపోతున్న సితార
రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న మహేశ్ బాబు.. బయట పెద్దగా కనిపించట్లేదు. మరోవైపు ఇతడి భార్య, కూతురు మాత్రం ఇప్పుడు ముంబైలో కనిపించారు. ప్రముఖ పాప్ సింగర్ దువా లిపా కన్సర్ట్కి హాజరయ్యారు. బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్‌లో కనిపించారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)ప్రస్తుతం సితార టీనేజీ అమ్మాయి. అయితేనేం డ్యాన్సుల్లో మంచి ప్రావీణ్యం సంపాదించింది. ఎత్తు, అందంలోనూ తల్లితండ్రులని మించిపోయేలా ఇప్పుడే కనిపిస్తోంది. చూస్తుంటే అందం విషయంలో మహేశ్‌ని మించిపోతుందేమోనని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.మహేశ్.. ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం మేకోవర్ అవుతున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. అంతవరకు మహేశ్ అయితే పెద్దగా కనిపించడని చాలామంది అనుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు అయితే ఎయిర్పోర్ట్ లేదా ఏదో ఓ ఈవెంట్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ముంబై కన్సర్ట్కి భార్య-కూతురిని మాత్రం పంపించాడు.(ఇదీ చదవండి: కోడలు శోభితకి నాగార్జున ఆ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా?) -
నకిలీ టికెట్ల వ్యవహారం.. బుక్‌మైషో సీఈవోకు సమన్లు
బ్రిటిష్ రాక్ బ్యాండ్ ‘కోల్డ్‌ప్లే’ షో నలికీ టికెట్లతో బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై బుక్‌మైషో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సహ వ్యవస్థాపకుడైన ఆశిష్ హేమ్రజనీ ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఈయనతోపాటు కంపెనీ టెక్నికల్ హెడ్‌కు కూడా సమన్లు పంపినట్లు ఒక అధికారి తెలిపారు.ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వచ్చే ఏడాది జనవరి 19 నుండి 21 వరకు జరగనున్న కోల్డ్‌ప్లే కచేరీకి సంబంధించి బుక్‌మైషో టిక్కెట్ల బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడిందని ఆరోపిస్తూ ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదుపై ముంబై పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీ సీఈవో, టెక్నికల్ హెడ్లకు సమన్లు పంపిన అధికారులు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేయాల్సి ఉందని కోరారు.కోల్డ్‌ప్లే ఇండియా టూర్ టిక్కెట్ల వ్యవహారానికి సంబంధించి బుక్‌మైషోపై ఫిర్యాదు చేసిన న్యాయవాది అమిత్ వ్యాస్.. రూ.2,500 ఉన్న టెకెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేసి రూ.3 లక్షల వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే అమిత్ వ్యాస్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన అధికారులు.. టికెట్ల దందాలో పాల్గొన్న పలువురు బ్రోకర్లను గుర్తించారు. -
ఒక్క టికెట్ రూ.25 వేలా? డబ్బు వెనక పరిగెడతాడనుకోలేదు!
ప్రముఖ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్ త్వరలో ఇండియాలోని పలు మెట్రో నగరాల్లో సంగీత కచేరి నిర్వహించనున్నాడు. 'దిల్ లుమినటి టూర్' పేరిట నిర్వహించబోతున్న ఈ కన్సర్ట్కు సంబంధించి లక్ష టికెట్లను సెప్టెంబర్ 10న అమ్మకానికి పెట్టగా కొద్ది నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే ఆ టికెట్ రేట్లు మధ్య తరగతి జనాలకు అందుబాటులో లేవని కమెడియన్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ సౌమ్య సాహ్ని ఫైర్ అయింది.అంత డబ్బు ఎక్కడిది?సంగీత కచేరిలో ఒక్క టికెట్ రూ.20-25 వేలా? ప్రేక్షకుల దగ్గర అంత డబ్బు ఎక్కడిది? పైగా ఎక్కువమంది నిరుద్యోగులే! మన భాషలో ఒకరు అద్భుతంగా పాడుతుంటే చూడాలని ఎవరికి ఉండదు.. కానీ టికెట్ రేట్లు ఆ రేంజ్లో ఉంటే దాన్ని కొనడం మధ్య తరగతి వాళ్లకు ఎలా సాధ్యమవుతుంది? పైగా పిల్లలతో కలిసే కుటుంబాలు కచేరీకి వెళ్తుంటాయి.బాగానే సంపాదిస్తున్నారు కదా!ఎలాగో విదేశాల్లో కచేరీలు పెట్టి బాగానే సంపాదిస్తున్నారు కదా! అలాంటప్పుడు కనీసం మనవాళ్ల దగ్గరైనా తక్కువ వసూలు చేయొచ్చుగా.. అంతర్జాతీయ సెలబ్రిటీలు కూడా ఒక్క టికెట్ దాదాపు రూ.10 వేలకే అమ్ముతారు. అలాంటిది నువ్వు రూ. 15 వేలు, రూ.20-25 వేలకు టికెట్స్ అమ్మడమేంటో నీకే తెలియాలి' అని వీడియోలో మండిపడింది.రూ.500 పెట్టడమే ఎక్కువఈ వీడియో చూసిన నెటిజన్లు సౌమ్య అభిప్రాయానికే మద్దతిస్తున్నారు. 'ఒక్క టికెట్‌కు రూ.500 పెట్టడమే ఎక్కువ. నేనైతే ఆ కచేరీని యూట్యూబ్‌లో చూస్తాను', 'మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయ్యుండి దిల్జిత్ ఇలా డబ్బు, పేరు వెనక పరిగెడతాడని అస్సలు ఊహించలేదు', 'అతడు కావాలనుకుంటే ఒక్క సిటీలోనే పలు షోలు చేయొచ్చు, కానీ అభిమానుల కంటే కూడా డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చాడు' అని కామెంట్లు చేస్తున్నారు. ఆరోజే కచేరీ ప్రారంభంకాగా దిల్జిత్ కచేరీ అక్టోబర్ 26 ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నో, పుణె, కోల్‌కతా, బెంగళూరు, ఇండోర్, చంఢీగర్ వంటి నగరాల మీదుగా ఈ కచేరీ టూర్ సాగనుంది. View this post on Instagram A post shared by Saumya Sahni (@mrsholmes221b) బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టేలర్ స్విఫ్ట్ కచేరీపై ఉగ్రదాడికి కుట్ర
వియన్నా: ఆ్రస్టియా భద్రతాధికారులు సకాలంలో స్పందించి పెనుముప్పు నివారించగలిగారు. అమెరికా గాయని టేలర్ స్విఫ్ట్ గురువారం రాజధాని వియన్నాలో తలపెట్టిన కచేరీలో నరమేధానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు. 19 ఏళ్ల ప్రధాన సూత్రధారి సహా 17 ఏళ్ల మరో యువకుడిని అరెస్ట్ చేశారు. 15 ఏళ్ల మరో అనుమానితుడిని ప్రశి్నస్తున్నారు. ఎర్నెస్ట్ చాపెల్ స్టేడియానికి వచ్చే వారిని పేలుడు పదార్థాలు వాడి లేదా కత్తులతో పొడిచి సాధ్యమైనంత ఎక్కువమందిని చంపాలని పథకం వేసినట్లు తేలింది. వీరికి ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)తో సంబంధాలున్నట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు. ఈ పరిణామం నేపథ్యంలో టేలర్ పాల్గొనాల్సిన మొత్తం మూడు కచేరీలను రద్దు చేశారు. -
ది స్పియర్: 18 వేల మంది లైవ్‌లో సినిమా చూడొచ్చు!
సినిమాలు చూసేందుకు థియేటర్‌కు వెళ్తుంటాం.. 3డీలో చూసే సినిమాల కోసం స్పెషల్ 3డీ గ్లాసెస్ ఇస్తుంటారు. కానీ ఇక్కడ చెప్పుకునే ఓ థియేటర్‌లాంటి వేదికలో మాత్రం ఎటువంటి అద్దాల అవసరం లేకుండానే ఏకంగా 4డీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. లోపలే కాదు బయట కూడా ఈ వేదిక రంగులు వెదజిమ్ముతూ ఆకట్టుకుంటోంది. ప్రపంచంలోనే అతి పెద్ద గోళాకారంలో నిర్మించిన ఈ భవంతి పేరు ద స్పియర్. దీని పై, లోపలి భాగాల్లో విశాలమైన ఎల్ఈడీ స్క్రీన్లను ఫిక్స్ చేశారు. ఎల్ఈడీ స్క్రీన్ల వెలుగులతో భవంతి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. లోపల ఏర్పాటు చేసిన తెరమీద ఏదైనా వీడియో ప్లే చేస్తుంటే మనం కూడా ఆ వీడియోలో ఉన్న ప్రదేశంలో ఉన్నామేమో అన్న అనుభూతి కలిగేలా స్క్రీన్ల అమరిక ఉంది. ఈ మధ్యే ఈ స్పియర్‌ను ప్రారంభించగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేదిక అసలు పేరు ఎమ్ఎస్జీ స్పియర్. ఇది అమెరికాలో లాస్ వెగాస్‌కు సమీపంలోని ప్యారడైజ్‌లో ఉంది. ఏదైనా షోలు, కచేరీలు, ఈవెంట్లు జరుపుకోవడానికి ఇది ఎంతో అనువుగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఎంటర్టైన్మెంట్కు పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. స్పియర్‌కు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు ► పాపులస్ అనే సంస్థ దీని రూపకల్పనకు నడుం బిగించింది. ► దీని ఎత్తు 366 అడుగులు, వెడల్పు 516 అడుగులు. ► 18,600 సీట్ల సామర్థ్యం కలదు. ► వేదిక వెలుపలి భాగంలో 5,80,000 చదరపు అడుగుల ఎల్ఈడీ స్క్రీన్లు ఉన్నాయి. ► వేవ్ఫీల్డ్, సింథసిస్ టెక్నాలజీతో ఉన్న స్పీకర్స్.. 16కె రిజల్యూషన్ స్క్రీన్ క్వాలిటీ, 4డీ ఎఫెక్స్ట్ దీని ప్రత్యేక స్పెషాలిటీ. ► ఈ వేదికను నిర్మించడానికి అయిన ఖర్చు 2.3 బిలియన్ డాలర్స్ (భారతదేశ కరెన్సీ ప్రకారం రూ.19 వేల కోట్ల పైమాటే) The inside of the Sphere is equally as impressive as the outside! 👏🏼😮🐟 pic.twitter.com/pmmzRXgvzX — H0W_THlNGS_W0RK (@HowThingsWork_) October 17, 2023 View this post on Instagram A post shared by U2 (@u2) View this post on Instagram A post shared by Sphere (@spherevegas) View this post on Instagram A post shared by Sphere (@spherevegas) చదవండి: శుభశ్రీ అవుట్.. రతిక రోజ్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఎలా వాడుకుంటుందో.. -
కెనడా-భారత్ వివాదం: ప్రముఖ సింగర్ సంగీత కచేరి రద్దు
ముంబయి: ఇండియా- కెనడా మధ్య వివాదాస్పద పరిస్థితుల ప్రభావం ఓ సింగర్ సంగీత కచేరి మీద పడింది. ముంబయిలో జరగనున్న ఖలిస్థానీ మద్దతుదారుడైన కెనడియన్ పంజాబీ సింగర్ శుభ్ సంగీత కచేరీ రద్దైంది. సింగర్ శుభ్ భారత పర్యటన కూడా రద్దైంది. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంగీత కచేరి కోసం టికెట్ బుక్ చేసుకున్నవారికి బుక్ మై షో ఇప్పటికే రీఫండ్ కూడా చేసేసింది. ఖలిస్థానీలకు మద్దతు తెలుపుతున్నట్లు సింగర్ శుభ సోషల్ మీడియాలో పోస్టులు ఉన్న నేపథ్యంలో.. సంగీత కచేరీని రద్దు చేయాలని భారతీయ యువ మోర్చా డిమాండ్ చేసింది. దీంతో శుభ్ పర్యటనకు స్పాన్సర్షిప్ చేసిన కంపెనీ బీఓఏటీ ఈ మేరకు సంగీత కచేరిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కెనడా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఈ కెనడాకు చెందిన ఈ పంజాబీ సింగర్ శుభ్ వివాదాస్పద భారత్ చిత్రపటాన్ని షేర్ చేశారు. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు లేని భారత్ మ్యాప్‌ను షేర్ చేయడంతో క్రికెటర్ విరాట్ కొహ్లీ కూడా శభ్ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడు. కెనడా-భారత్ వివాదం.. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ అధికారిని కెనడా నుంచి బహిష్కరించారు. కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. అంతేకాకుండా భారత్‌లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదీ చదవండి: భారత్-కెనడా వివాదం: ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ సిక్కు ఎంపీ -
సింగర్ సోనూ నిగమ్‌పై ముంబైలో దాడి
-
విపరీతమైన చెమటలు.. కేకే ఆఖరి వీడియో వైరల్
KK Demise: KK Sweating Badly At Concert Video Goes Viral: ప్రముఖ సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్) మృతిపై పోలీసులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మంగళవారం రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన తర్వాత ఆయన గుండెపోటుతో కన్నుమూశారనే ప్రకటన మాత్రమే ఇప్పటిదాకా అందరికీ తెలుసు. అయితే.. కేకే చివరిసారిగా ప్రదర్శన ఇచ్చే సమయంలో తీవ్ర ఇబ్బందికి లోనయ్యారు. కోల్‌కతా నజ్రుల్ మంచాలోని గురుదాస్ కాలేజ్ వద్ద జరిగిన కాన్సెర్ట్‌లో పాల్గొన్నారు కేకే. అయితే ఆ సమయంలో ఆయన చాలా ఇబ్బందికి లోనయ్యారు. వేదిక క్లోజ్డ్ హాల్. ఫ్యాన్, ఏసీ సదుపాయాలు లేకపోవడంతో విపరీతమైన చెమటలు పోసి ఇబ్బందిపడ్డారు. ఒకానొక టైంలో భరించలేక కిందకు దిగి నిర్వాహకులకు స్వయంగా ఆయనే ఇబ్బందిపై ఫిర్యాదు కూడా చేశారు. అయినా నిర్వాహకులు సరిగా స్పందించలేదు. దీంతో ఇబ్బంది పడుతూనే ఆయన గంటపాటు ప్రదర్శన పూర్తి చేశారు. ఆ తర్వాత హోటల్ ఒబెరాయ్ గ్రాండ్‌కు చేరుకుని ఛాతీలో భారంగా ఉందని తన సిబ్బందికి తెలిపారాయన. అలా చెబుతూనే కుప్పకూలిన ఆయన్ని.. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గుండె పోటుతోనే మృతి చెంది ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం అసహజ మరణం కిందే కేసు నమోదు చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని సీఎంఆర్ఐ ఆస్పత్రిలో ఉంచారు. శవ పరీక్ష పూర్తి అయితేనే ఆయన మృతికి గల అసలు కారణం తెలిసేది. చదవండి: ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలకించేవి: ప్రధాని మోదీ ఇదిలా ఉంటే కేకే చెమటలు పట్టిన ముఖాన్ని తుడుచుకుంటున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన కేకే అభిమానులు ఆయన మరణానికి నిర్వహకుల నిర్లక్ష్యమే కారణంగా ఎత్తిచూపుతున్నారు. 'అక్కడ ఏసీ లేదు. వేడి, డీహైడ్రేషన్ వల్లే స్ట్రోక్స్, కార్డియాక్ అరెస్ట్‌లు సంభవిస్తాయి' అని ఒక అభిమాని ట్వీట్ చేశాడు. 'ఆ కాన్సెర్ట్‌లో పాల్గొనకపోతే కేకే బతికి ఉండేవాడు. కేవలం ఆయన తన అభిమానుల కోసమే ప్రదర్శన ఇచ్చారు. నిర్వాహణ లోపం కారణంగా మనం ఒక రత్నాన్ని కోల్పోయాం' అని మరో అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: సింగర్ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి.. AC wasn't working at Nazrul Mancha. he performed their and complained abt it bcoz he was sweating so badly..it wasnt an open auditorium. watch it closely u can see the way he was sweating, closed auditorium, over crowded, Legend had to go due to authority's negligence. Not KK pic.twitter.com/EgwLD7f2hW — WE जय (@Omnipresent090) May 31, 2022 -
సింగర్ కార్తీక్ సాహసం.. లైవ్ కాన్సెర్ట్లను కాదని..
నాకొక గర్ల్‌ఫ్రెండ్ కావాలెగా.... అంటూ యువతరాన్ని ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ మ్యూజిక్ కాన్సెర్ట్లలో కొత్త ఒరవడికి తెర లేపారు. దేశంలోనే తొలిసారిగా మెటావర్స్ కాన్సెర్ట్ నిర్వహించేందుకు రెడీ అయ్యాడు. అంతేకాదు ఈ కాన్సెర్ట్‌లో ఆలపించిన గీతాలను నాన్ ఫంజిబుల్ టోకెన్లుగా (ఎన్ఎఫ్టీ) మార్చి తన అభిమానులకు అందివ్వనున్నాడు. ఏప్రిల్ 14న సింగర్ కార్తీక్ నిర్వహించే మెటావర్స్ కాన్సెర్ట్ 2022 ఏప్రిల్ 14న జరగనుంది. ఈ కాన్సెర్ట్‌లో పాల్గొనాలంటే ప్రత్యేకంటా టిక్కెట్టు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో టిక్కెట్టు ధర రూ. 29,000లుగా నిర్ణయించారు. ఆన్లైన్లో క్రిప్టో చెల్లింపులతో పాటు డెబిట్, క్రెడిట్, యూపీఏ పేమెంట్స్ ద్వారా ఈ టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. బ్లాక్‌చైయిన్ టెక్నాలజీపై పని చేస్తున్న జూపిటర్మెటా సంస్థ ఈ కాన్సెర్ట్‌కి సంబంధించి డిజిటల్ వర్క్స్ అన్నింటీని పర్యవేక్షిస్తోంది. 45 నిమిషాలు మెటావర్స్ ఫ్లాట్‌ఫామ్‌పై దేశంలోనే తొలిసారిగా జరగబోతున్న ఈ కాన్సెర్ట్‌లో సింగర్ కార్తీక్ తాను స్వయంగా బాణీకట్టి ఆలపించిన గీతాలను పాడబోతున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ కాన్సెర్ట్ కొనసాగనుంది. ఈ కాన్సెర్ట్‌లో పాడిన గీతాలలో రెండు పాటలను వీక్షకులకు ఎన్ఎఫ్టీలుగా అందివ్వనున్నారు. ఇక ఈ మెటావర్స్ కాన్సెర్ట్‌లో పాల్గొనే వారికి చేతులు ఊపడం, చేతులు ఎత్తడం, చప్పట్లు కొట్టడం వంటి అన్ని పనులు చేస్తూ ప్రత్యక్ష అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. మెటావర్స్ ? ఫేస్బుక్ అధినేత జుకర్‌బర్గ్ మేథ నుంచి పుట్టిన మరో అద్భుతం మెటావర్స్. ఎక్కడెక్కడో ఉన్న జనాలు తమ ముందున్న ఫోన్ల ద్వారానే ఒకే చోట ఉన్నట్టుగా అనూభూతి కలిగించడమే సింపుల్‌గా మెటావర్స్‌గా పేర్కొనవచ్చు. అంటే మీరు మీ ఇంట్లో ఉంటూనే లైవ్ కాన్సెర్ట్‌లో ప్రత్యక్షంగా భాగం అయ్యే ఛాన్స్ మెటావర్స్ కలిగించనుంది. అందరికీ సాధ్యమేనా? మెటావర్స్, ఎన్ఎఫ్టీ కాన్సెప్టులు ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల రాధేశ్యామ్ ట్రైలర్ సైతం మెటావర్స్‌లో రిలీజ్ చేశారు. అంతకు ముందు సింగర్ దలేర్ మెహందీ 2022 జనవరి 26న ఇండియాలోనే ఫస్ట్మెటావర్స్ కాన్సెర్ట్ నిర్వహించారు. అయితే మెటావర్స్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. మెటావర్స్ అనుభూతి పొందేందుకు అవసరమైన స్పీడ్ ఇంటర్నెట్, వివిధ రకాలైన సెన్సార్లు కలిగిన ఫోన్లు, వీఆర్ హెడ్ సెట్ తదితర విషయాలు మరింత మెరుగు కావాల్సి ఉంది. చదవండి: డేటాకు ‘మెటావర్స్’ దన్ను.. -
కరోనాపై పోరాటానికి నేడు ’ఏక్ దేశ్ ఏక్ రాగ్’
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ ప్రైవేటు వినోద చానెల్ జీ తెలుగు కరోనాపై పోరాటంలో దేశవాసుల ఐక్య స్ఫూర్తిని ప్రేరేపించేలా ‘ఏక్ దేశ్ ఏక్ రాగ్’ పేరిట ఒక వినూత్న సంగీత కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. జీ సరిగమపలో భాగంగా 25 గంటల ఈ మ్యూజికల్ లైవ్–థాన్‌ను శనివారం నిర్వహించనున్నామన్నారు. కోవిడ్‌పై పోరులో ప్రజల్ని ఐక్యం చేసేందుకు సంగీతాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నామన్నారు. ఇది పూర్తిగా డిజిటల్ కన్సర్ట్‌గా సాగుతుందని, దేశవ్యాప్తంగా పేరొందిన గాయకులు తమ తమ ఇళ్ల నుంచే జీ ఫేస్బుక్ పేజెస్ ద్వారా 350 రకాల ప్రదర్శనలు ఇస్తారని వారు వివరించారు. -
ఆన్లైన్లో కచేరి
సాధారణంగా కాన్సర్ట్ అంటే వేల మంది జనం, భారీ మ్యూజిక్, పెద్ద గ్రౌండ్లో ఏర్పాటు చేస్తారు. కానీ ఇవేమీ లేకుండా డిజిటల్ కాన్సర్ట్ (ఆన్ లైన్ లోనే కాన్సర్ట్)ను ప్లాన్ చేశారు హాలీవుడ్ సింగర్ లేడీ గాగా. ప్రస్తుతం కరోనా వైరస్‌తో ప్రపంచమంతా పోరాడుతోంది. ఈ పోరాటానికి స్ఫూర్తి నింపేందుకే ‘వన్ వరల్డ్: టుగెదర్ ఎట్ హోమ్’ పేరుతో ఈ డిజిటల్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. ఎవరింట్లో వారు ఉండి ఆన్ లైన్లోనే ఈ సంగీత కచేరీని వీక్షించవచ్చు. ఏప్రిల్ 18న జరిగే ఈ కాన్సర్ట్ కరోనాపై పోరాటానికి ఫండ్ రైజింగ్ ఈవెంట్. ఈ ప్రోగ్రామ్‌లో హాలీవుడ్ టాప్ సింగర్స్ జెన్నీఫర్ లోపెజ్, ఆడమ్ లాంబెర్ట్, ఓప్రా విన్ ఫ్రె, టేలర్ స్విఫ్ట్ వంటి ప్రఖ్యాత సింగర్స్ పాల్గొననున్నారు. మన దేశం నుంచి షారుక్ ఖాన్, ప్రియాంకా చోప్రా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. లేడీ గాగా యాంకర్‌గా వ్యవహరించనున్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో మన కోసం ముందు వరుసలో పోరాడుతున్న ఆరోగ్య శాఖ వారికి గౌరవంగా ఈ కాన్సర్ట్‌లో నేను కూడా భాగం అవుతున్నాను’’ అని పేర్కొన్నారు షారుక్ ఖాన్. -
ఆ వాయులీనం.. శ్రోతలకు పరవశం!
సాక్షి, తెనాలి(గుంటూరు) : ‘శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తిగాన రసం ఫణిః’ సంగీతం విశిష్టతకు ఇంతకుమించి మరో మాట అవసరం లేదు. సంగీతం వేదస్వరూపిణి, పాపనాశని, దైవదర్శిని, ఆనందవర్ధని, మోక్షప్రదాయిని అని సంగీతకారులు ప్రణమిల్లుతారు. ఇంతటి ఉత్కృష్టమైన సంగీత కళాకారులకు నిలయం కృష్ణాతీరం. వారిలో విజయవాడకు చెందిన ‘నాద సుధార్ణవ’ అన్నవరపు రామస్వామి ప్రసిద్ధులు. 94 ఏళ్ల వయసులోనూ ప్రతిరోజూ సంగీత సాధన చేయటమే కాదు.. వాయులీన విద్యతో రసజ్ఞులను మైమరపింపజేస్తున్నారు. పట్టణానికి చెందిన సంగీత సంస్థ హేమాద్రి మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రమ్‌లో సంగీతాభిమానులకు ఆ వాద్యగాన విందు లభించనుంది. ‘గాన విదూషి’ గద్దె వేంకట రామకుమారి చతుర్ధ వర్ధంతి సంగీత ఉత్సవంలో అన్నవరపు రామస్వామి శాస్త్రీయ వాయులీన వాద్య సంగీత కచేరీ జరగనుంది. వయొలిన్‌పై బీవీ దుర్గాభవాని, హేమాద్రి చంద్రకాంత్, మృదంగంపై పీఎస్ ఫల్గుణ్, ఘటంపై కేవీ రామకృష్ణ సహకారం అందిస్తారు. సంగీత సాధనకు ఎన్నో కష్టాలు వయొలిన్ లేని సంగీతం లేదంటే అతిశయోక్తి కాదు. వాయులీన విద్యలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొంది అనేక ప్రతిష్టాత్మక గౌరవాలను స్వీకరించిన అన్నవరపు రామస్వామిది సంగీత కుటుంబం. యుక్తవయసులో సంగీత సాధనకు ఎన్నో కష్టాలు అనుభవించారు. వారాలు చేసుకుంటూ గురుకుల పద్ధతిలో గురువు శుశ్రూష చేసుకుంటూ సంగీతాన్ని నేర్చారు. ఒకోసారి భోజనం కోసం ఆరోజు వంతు ఇంటికి వెళితే, తాళం వేసి వుండేదట! చేసేదిలేక నిట్టూర్చుకుంటూ నీరసంతో తిరిగొస్తూ దారిలోని చేతిపంపు నీరు కడుపునిండా తాగి, గురువు ఇంటికి చేరుకునేవారు. సంగీత విద్వాంసుడు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి సంగీత శిక్షణ పొందారు. సప్తస్వరాలను పలికించటంలో.. బాలమురళీకృష్ణ గాత్రంలో కీర్తిప్రతిష్టలను పొందితే వాయులీనంలో సప్తస్వరాలను పలికించటంలో రామస్వామి గుర్తింపును పొందారు. కొత్త రాగాలను, కీర్తనలను రూపొందించి, తన నైపుణ్యంతో వాటికి ప్రాచుర్యాన్ని కల్పించారు. ‘వందన’ రాగంలో ‘కనకాంబరి’ అనే కీర్తన, ‘శ్రీదుర్గ’ అనే రాగంలో కనకదుర్గ అనే కీర్తలను కూడా ప్రదర్శించి వాయులీన కళలో ప్రత్యేకతను నిలుపుకున్నారు. సంగీత, సాహిత్యరంగంలో అప్పటికి తలపండినవారి అభినందనలు అందుకున్నారు. ఉన్నతశ్రేణి కళాకారుడిగా ఆకాశవాణి, దూరదర్శన్‌లో సంగీత కార్యక్రమాల రూపకల్పన చేశారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు డాక్టర్ బాలమురళీకృష్ణతో కలిసి యూకే, కెనడా, ఫ్రాన్స్, శ్రీలంక, సింగపూర్, మలేషియా, బెహ్రాన్, దుబాయ్, దోహా, మస్కట్ తదితర దేశాల్లో పర్యటించి, భారతీయ శాస్త్రీయ సంగీతకళ ఔన్నత్యాన్ని చాటారు. సంగీతసేవకు జీవితాన్ని, ఆస్తిని అర్పించిన తెనాలి న్యాయవాది, శ్రీసీతారామ గానసభ వ్యవస్థాపకుడు నారుమంచి సుబ్బారావు జీవించివున్నపుడు, దాదాపు ఆరు దశాబ్దాల క్రితం రామస్వామి తెనాలిలో తన వాయులీన విద్యను ప్రదర్శించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత హేమాద్రి మ్యూజిక్ అకాడమి, తెనాలిలో ఆ కళాప్రముఖుడి కచేరిని ఏర్పాటు చేయటం విశేషం. -
సల్మాన్, కత్రినా, రణ్‌వీర్‌లపై దావా
ఇల్లినాయిస్, అమెరికా : సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, రణ్వీర్ సింగ్, ప్రభుదేవా, అక్షయ్ కుమార్లపై అమెరికాలో భారతీయ అమెరికన్ ప్రమోటర్ కంపెనీ దావా వేసింది. డబ్బు తీసుకుని కన్సర్ట్‌లో పాల్గొనడానికి నటీనటులు నిరాకరిస్తున్నారని దావాలో పేర్కొంది. చికాగోకు చెందిన వైబ్రంట్ మీడియా గ్రూప్ ఇల్లినాయిస్ కోర్టులో దావాను వేసింది. వైబ్రంట్ మీడియా వేసిన దావాలో నటీనటులు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, రణ్వీర్ సింగ్, ప్రభుదేవా, అక్షయ్ కుమార్, సింగర్లు ఉదిత్ నారాయణ్, ఆల్కా యాజ్ఞిక్, ఉషా మంగేష్కర్లు, మాట్రిక్స్ ఇండియా ఎంటర్టైన్మెంట్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, యాష్‌రాజ్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లు కాంట్రాక్టును ఉల్లంఘించాయని పేర్కొంది. సల్మాన్‌తో మిగిలిన ఆర్టిస్టులు తమతో ఒప్పందం కుదుర్చుకుని వేరే ప్రమోటర్‌తో కన్సర్ట్ చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలిసిందని పిటిషన్లో వైబ్రంట్ మీడియా వెల్లడించింది. తమకు నష్టపరిహారంగా 1 మిలియన్ డాలర్లు ఇప్పించాలని కోర్టును కోరింది. -
సాధనలో దాహం ఉండాలి, కసి ఉండాలి
పంచదార, ఇసుక కలిపి అక్కడ పెడితే వేరుపరచడం మనకు అంత సులభ సాధ్యమయిన పనేమీ కాదు. కానీ ఇంత చిన్న శరీరం ఉన్న చీమ ఎంతో ఓపికగా ఇసుకలోకి వెళ్లి పంచదార రేణువుల్ని ఒక్కొక్కటిగా నోటకరచుకుని ఎవరి కాళ్ల కిందా పడకుండా, ఏదైనా అడ్డుగా ఉంటే ఎంత చుట్టయినా సరే తిరిగి ఎక్కడో గోడ గుల్లగా ఉన్నచోట కన్నంలోకి వెళ్లి పంచదార కణాల్ని దాచి మళ్లీ తిరుగు ప్రయాణంలో ఎవర్నీ గుద్దుకోకుండా తిరిగొచ్చి ఇసుకలో ఉన్న పంచదార రేణువును మాత్రం పట్టుకుని మళ్లీ అంతదూరం వెళ్లి... మళ్లీ తిరుగుతూ మోసుకొచ్చి దాచుకుంటుంది. వానాకాలం వచ్చినప్పుడు తన చిన్న శరీరం నీటిలో కొట్టుకుపోతుందని బయటికి రాకుండా ఆ కన్నంలో కూచుని అక్కడ దాచుకున్న ఆహార పదార్థాలను తిని బతుకుతుంది. చిన్నచీమ అంతగా శ్రమించి సాధించగా లేనిది, ఒక విద్యార్థి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఎందుకు సాధించలేడు... ఇదీ కలాం గారి ఆర్తి. ఆయన చెప్పినట్లు మీ జీవితాలకు ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి.రవీంద్రనాథ్ ఠాగూర్‌లా మీరు కూడా గొప్ప కవి, ఈమని చిట్టిబాబులా గొప్ప వైణిక విద్వాంసుడు లేదా హరిప్రసాద్ చౌరాసియాలాగా గొప్ప వేణుగాన విద్వాంసుడు లేదా సుబ్బలక్ష్మిలా గొప్ప సంగీత విద్వాంసురాలు కావాలనుకుంటున్నారా!? ఎం.ఎస్.సుబ్బలక్ష్మిగారు పాట పాడుతుంటే హెలెన్ కెల్లర్ ఏమన్నారో తెలుసా... హెలెన్‌కు కళ్ళూ, చెవులూ లేవు. కానీ ఒక శక్తి ఉండేది. ఆమె ఎవర్నయినా ముట్టుకుంటే వారి బలాల్ని, బలహీనతల్ని అన్నీ చెప్పేసేవారు. ఆమె ఓసారి భారతదేశానికి వచ్చినప్పడు ఎం.ఎస్.సుబ్బలక్ష్మిగారి కచ్చేరీకి వచ్చారు. వేదికపైన సుబ్బలక్ష్మిగారి పక్కనే కూర్చున్నారు. అప్పుడు ఆమె తమిళంలో ‘ఒన్రాయ్ ఉల్లమ్ గోవిందా...’ అన్న కీర్తన పాడుతుంటే... ఆమె కంఠం కింద వేలుపెట్టిన కెల్లర్ కంటివెంట నీరు ధారకట్టగా గద్గద స్వరంతో...‘‘ఈమె సాధారణ గాయకురాలు కాదు, గంధర్వకాంత. ఇది దేవతలు మాత్రమే పాడగలిగిన పాట. మానవమాత్రులకు సాధ్యం కాదు’’ అని వ్యాఖ్యానించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంతటి ప్రశంసలు పొందిన సుబ్బలక్ష్మిగారు ఎన్ని కష్టాలలోంచి వచ్చారో తెలుసా..? చిన్నప్పడు అన్నంలో నీళ్ళమజ్జిగ పోసుకుని కడుపునింపుకునేవారు. తరువాత కాలంలో కోట్లు సంపాదించి కూడా తృణప్రాయంగా భావించి తమకంటూ రూపాయి కూడా ఉంచుకోకుండా దానం చేసేసిన మహాతల్లి ఆమె. ఒక సాధారణ నిరుపేద యువతికి ఇంతపెద్ద లక్ష్యం ఎలా సాధ్యమయింది ? ఆమె తన లక్ష్యాన్ని బరువుగా భావించలేదు. అది సాధన... సాధన... సాధన చేత మాత్రమే సాధ్యపడింది. ‘అబ్బా! చచ్చిపోతున్నా... మా అమ్మగారు చెప్పారు కాబట్టి ఫలానా వాద్యసంగీతం నేర్చుకుంటున్నా.... మా నాన్నగారు చెప్పారు కాబట్టి ఫలానా క్రీడలో శిక్షణ తీసుకుంటున్నా... వంటి సమాధానాలు కాదు. ఆ ‘ఫలానా..’ను నేర్చుకోవడంలో ఒక తృష్ణ ఉండాలి. దానిమీద పట్టుసాధించేదాకా పట్టుదలతో శ్రమించాలి. అదీ ఒక తపనతో, ఒక కసితో చేయాలి. అప్పుడే మీకు, మీ లక్ష్యానికి మధ్య దూరం తగ్గిపోతుంది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఇంగ్లండ్‌లో భారీ పేలుడు..19 మంది మృతి
-
ఇంగ్లండ్‌లో భారీ పేలుడు.. 19 మంది మృతి
మాంచెస్టర్: ఇంగ్లాండ్ పారిశ్రామిక నగరం మాంచెస్టర్‌లో భారీ పేలుడు సంభవించింది. అమెరికన్ పాప్ సింగర్ అరియానా గ్రాండే నిర్వహిస్తున్న సంగీత కచేరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నఈ ఘటనలో 19 మంది మృతిచెందగా.. 50 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10: 35 గంటలకు పేలుడు సంభవించినట్లు గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఖాళీ చేయించిన అధికారులు.. సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘటనను ఉగ్రవాదుల చర్యగా అనుమానిస్తున్నారు. పాప్ సింగర్ అరియానా క్షేమంగా ఉన్నారని ఆమె ప్రతినిధి వెల్లడించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ప్రైవేటు విమానాన్ని కొన్న హీరో!
‘ఉడ్తా పంజాబ్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన దిల్జిత్ దోసాన్జ్ తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకు ఫిలింఫేర్ అవార్డును సైతం అతను సొంతం చేసుకున్నాడు. ఇటీవల అనుష్క శర్మ తెరకెక్కించిన ‘ఫిల్హౌరి’ సినిమాలోనూ దిల్జిత్ అలరించాడు. ఇక అసలు విషయానొకొస్తే దిల్జిత్ తాజాగా ఓ ప్రైవేటు జెట్ విమానాన్ని కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. ‘ ప్రైవేటు జెట్‌తో సరికొత్త ఆరంభం మొదలైంది’ అంటూ అతను ట్వీట్ చేశాడు. దిల్జిత్ త్వరలోనే తన టీమ్‌తో కలిసి ప్రపంచమంతటా సంగీత కచేరిలు (కాన్సర్ట్స్) నిర్వహించబోతున్నాడు. త్వరలో వాంకోవర్, ఎడ్మంటన్, విన్నిపెగ్, టోరంటోలో అతను ప్రదర్శనలు ఇవ్వనున్నాడు. అతను పెట్టిన కొత్త విమానం ఫొటోలు, వీడియోలు ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నాయి. New Beginning Starts With Private Jet -
ప్రణవానికి ప్రతిబింబం
నివాళి నేనాయన్ని మొదటిమారుగా చూసింది, విన్నది 1944లో. నా మేనమామ మేకా మువ్వగోపాల అప్పారావు పెళ్లి హైదరాబాదులో జరిగిన తరువాత, సొంత ఊరైన నూజివీడు తేలప్రోలు ఎస్టేటులో జరిగిందా కచ్చేరీ. ఆయన కప్పుడు 14 ఏళ్లుంటాయి కానీ చూడటానికి ఏడెనిమిదేళ్ల వానిలా ఉన్నాడు. నా వయస్సు అయిదు. కచ్చేరీ చివరి భాగం మాత్రం విని-- నాకు తెలుసు నాకు నచ్చేపాటలా సమయంలోనే పాడతారని--‘పదాలు, జావళీలు పాడలేదేం? అతనికి రావా!’ అని నేను నా అమ్మమ్మనడగటం, ‘చిన్నపిల్లాడేం పాడతాడు నీ సానివారి పాట?’ లని అమ్మమ్మ నన్ను గదమాయించడం నాకు గుర్తున్నది. నేను రికార్డులపైనా, ముఖతా గడ్డిభుక్త సీతారాం వద్ద (ఆమె బొబ్బిలి వేణుగోపాలుని నృత్యసేవకే కాక బొబ్బిలి సంస్థాన నర్తకి కూడాను. మా చిన్నతనంలో మేముండే రాణి వాసానికి రోజూ వచ్చి, నేను కోరిన పాటలు పాడేది) పాటలే వినడానికి యిష్ట పడేవాణ్ణని అమ్మమ్మకు తెలుసు. ఆ సమయంలోనే నేను బెంగుళూరు నాగరత్నమ్మ కచ్చేరీ కూడా విన్నాను. ఆమెతో నాకు చనువు కనుక ‘నేనే జాణ’ పాడలేదేమని అడిగాను. ఆ రికార్డు నాకెంతో ఇష్టం. ‘నీ కోసం పాడతాన్నాయనా’ అంటూ నన్ను ఒళ్లో కూర్చోబెట్టు కుని పాడారు. ‘బాలమురళిది సంగీతమూ కాదు, కర్ణాటకమూ కాదు, అదొక ఓంకార మమ్మా! అయ్యవారి (అంటే త్యాగయ్య) ప్రణవానికి ప్రతిబింబం’ అని నాగ రత్నమ్మ మా అమ్మతో ఎన్నో మార్లు అన్నారట. మళ్లీ ఆయన్ను తరచూ చూడటం కుటుంబ సమేతంగా వారు మద్రాసుకి తరలివచ్చిన తరువాతనే! ఆయనతో సాన్నిహిత్యం, భార్య అన్నపూర్ణమ్మ గారితో, పిల్లలతో పరిచయం. క్రమేణా బాలమురళీగారితో చనువు ఏర్ప డింది. ‘ఇది మీరు సరిగా పాడలేదు. ఆ పాటకు వరస బాగా కట్టలేదు’ అనే వాడిని. నా సంగీత పరిజ్ఞానమెంతటిదో ఆయనకు బాగా తెలుసును గనుక చిరునవ్వేసేవారు. 1970 ప్రాంతంలో ఆయన గ్రామఫోను కంపెనీకి అన్నమా చార్యుల సంకీర్తనలొక ఎల్.పి ఇచ్చారు. అన్నమయ్య పాటల తొలి ఎల్.పి యిదే. ఆ తరువాతనే శ్రీరంగం గోపాలరత్నం, ఎం.ఎస్ సుబ్బులక్ష్మి తది తరులు. ఆ ఎల్.పికి ‘స్లీవ్ నోట్స్’ (కవరు మీది వివరణ) వ్రాయమని నన్ను హెచ్.ఎమ్.వి రికార్డింగ్ ఆఫీసరైన పి. మంగపతి అడిగారు, బహుశా బాలమురళి అనుమతితోనే. వ్రాశాను. బాగా వచ్చింది. రాకేం? సంగీతమంటే ఆసక్తి, ఆ గాయకుడంటే గౌరవం, శ్రీమల్లాది రామకృష్ణశాస్త్రి వనమాలల ద్వారా అన్నమ య్యంటే భక్తి ఉండగా! ఈ పాటల్లో రెండిటికి వరసలు అన్నమయ్య అంతరంగంలోంచి దొంగి లించి చేసినవి (రాగి రేకులపైనున్న రాగాలలో కాదు). ‘ఇందరికి నభయంబు లిచ్చు చేయి’ - అన్న దశావతార సంకీర్తనొకటైతే, ‘కొమ్మ తన ముత్యాల కొంగు జారగ’ - రెండవది. ఇందులో అమ్మవారు నిదురించే తీరులో మదాలస భంగి మలు చెలికత్తెలచే పారిజాత పూరేకులంత లలితంగా వర్ణితం. ఈ రెండింటినీ వారి అనుమతితో నేనెన్నోమార్లు శ్రీనివాస మంగాపుర కల్యాణ వేంకటేశ్వరుని సాక్షాత్కార వైభవ సమయంలోనూ (ఆషాఢ శుద్ధ సప్తమి), కార్వేటినగర వేణుగోపాలుని పుట్టిన రోజునా (గోకులాష్టమి) ఒక యాభై సంవత్సరాలు ఆ ట్రాక్స్ ఉపయోగించి నృత్యనివేదనగా చేశాను. ఏం చెయ్యకూడదా! అన్నమయ్య అనలేదూ... ఏనుగుపైనా, కుక్కపైనా ప్రసరించే ఎండ ఒక్కటేనని? ఆ ఎల్.పి.కి ముఖపత్రం బాపు చేత వేయించమని ఆ కుంఫిణీ వారిని వేధించాను. అన్నమయ్య-మురళీ పాటలకు తగిన ట్లు నా విన్నపం విని, బాపు బంగారు వాకిలిలోన ఆ కలియుగ కృష్ణుడు కనబడేటట్లు వేశారు. ఇవన్నీ బాలమురళికి నచ్చాయి కాబోలు... తదుపరి భద్రాచల రామదాసు కీర్తనల ఎల్.పి.కి, తనే పాడి, వాయులీనం, మృదంగం వాయించిన ఒక ఈ.పి.కి అలాగే వ్రాయించుకున్నారు. ఇందులో వినిపించే బాలమురళి విద్వత్తు ఎంత టిదో, హెచ్.ఎమ్.వి రికార్డింగు ఇంజినీరు రఘునాథన్ శబ్దగ్రాహక నైపుణ్యం అంతటిది. మొదట పాట, జాగాలతో రికార్డు చేసి, ఆ తరువాత మృదంగం, చివర వాయులీనం జాగ్రత్తగా ఆ జాగాలలో బిగించడం అప్పటి పరికరాలతో, యింద్రజాలమే. ఆ తరువాత హెచ్.ఎమ్. మేహ శ్ అన్నతను ‘సంగీతా’ కంపెనీ స్థాపించి, తక్కిన కంపెనీలన్నీ పాతికేళ్లలో చేసింది ఒక ఐదేళ్లలో సాధించాడు. ఈ మాస్టర్ రికార్డింగు కంపెనీకి బాలమురళీ... పదీ యిరవై కాదు వందకు పైగా పలు భాషల్లో కేసెట్లు రికార్డు చేశారు. అప్పుడొక తమాషా జరిగింది. ఈ మహేశ్ సరస్వతీ స్టోర్స్‌కి (కొలంబియా) కన్నడ విభాగంలో పనిచేసినప్పటి నుంచి నా హితుడు. ఒక ఎల్.పి.కి నాతో మొదటిమారుగా స్లీవ్నోట్స్ వ్రాయించిందితనే. వీరికి బాలమురళీ త్యాగయ్య ‘నౌకా చరిత్రం’ లోని కొన్ని పాటలొక కేసెట్టు చేయగా ఇన్లే కార్డు మీద రెండు వాక్యాలు వ్రాయమని అడిగితే వ్రాశాను. ఎప్పటి లాగా నేను వ్రాసింది ప్రూఫ్ చూపేటప్పుడు దానిపై ‘సంగీతం అభయాంబిక’ అని ఉంటే అలా వేయకూడ దన్నాను. ‘ఆమె రికార్డింగుకి ఎంతో తోడ్పడ్డారు. అలా వేసి తీరాలి’ అన్నారు. ‘అయితే నేను వ్రాయను’ అని తుమి తేల్చేశాను. ఆ ఇన్లే కార్డు చూసి ‘రంగా రావు పరిచయ వాక్యాలు లేవేం?’ అని బాలమురళి అడిగితే, నసుగుతూ, నాన్చుతూ చెప్పేరట - ‘సంగీతం ఫలానా’ అని వేస్తే వ్రాయనన్నాడని! వాళ్లనే గసిరి ‘త్యాగరాజు కీర్తనలకు సంగీతం మరొకరా? కావలిస్తే ఆర్కెస్ట్రేషన్’ అని వేయండన్నారట! అలా నా పక్షం వహించారు బాలమురళి. ఇంతకూ అభ యాంబిక ఎవరు? ఆనాడు బాలమురళి నియామకాలు చూసే ఆంతరంగిక కార్యదర్శి. ఆమెతో నాకు సఖ్యమే. చిన్నతనంలో తన యిద్దరు సోదరీమణులతో నాట్య ప్రదర్శనలివ్వడమే గాక, రంగవల్లుల ఎగ్జిబిషన్‌ను చేసేవారు. ఒకమారు ఆమె, బాలమురళి ప్రోత్సాహంతో బెంగుళూరు నాగరత్నమ్మ పాత పాటలు కేసెట్టుపై విడుదల చేద్దామని నా రికార్డులడిగితే వాటినామెకు ఇచ్చాను. పని జరిగిన తరువాత నా ప్రాణాలను భద్రంగా నాకు తిరిగి యిచ్చారు. ‘సంగీతా’ వారికి బాలమురళి పాడిన కేసెట్లలో నాకు బాగా నచ్చినవి అష్టపదులు, తరంగాలు, క్షేత్రయ్య పదాలు, భరత నాట్యాంశాలు కలిగిన ఒక కార్యక్రమం, తిల్లానాలు. ఆ తిల్లానాలన్నీ వీనుల విందు చేసేవే. కానీ వాటిలో కుంతల వరాళి తిల్లానా అంటే పిచ్చి యిష్టం. నేనెరిగిన నిష్ణాతులైన స్త్రీపురుష నాట్యకళాకారులెందరికో వీటి గురించి చెప్పాను, అడిగాను, ప్రాథేయపడ్డాను... ‘దీనిని రంగమెక్కించండీ’ అని! ‘అబ్బా, చాలా కష్టమైనదండీ!’ అని తప్పించు కున్నారు. చివరికి శాంత - ధనుంజయన్లు (నేనప్పుడు వారి వద్ద భరతనాట్యం నేర్చుకుంటున్నాను) దానికి రంగస్థలంపై ఒక అపూర్వమైన రూపం కల్పించారు, దాదాపు 45 సంవత్సరాల క్రిందట. బాలమురళి కృతిని భరత నాట్యానికి - బంగారుకి పరిమళం- జోడించటానికి వారు ఆడిందే నాంది! ఒకప్పుడు, 1965 ప్రాంతంలో నేను మద్రాసు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కి సంగీత కచ్చేరీల గురించి వ్రాస్తుండేవాడిని. ఒక కచ్చేరీలో బాలమురళి పాడిన తీరుని విమర్శించాను ‘మధ్య మధ్య వెనుక తంబూరా వేస్తున్న వ్యక్తిని (ఎవరో కాదు, తన కుమార్తె) తిరిగి చూడటమేమిటి! మైక్‌కి దూరమై పాట వినపడటం తగ్గిపోదా! రేడియోలో అంతకాలం పనిచేసిన వారికి మైక్ ప్రాముఖ్యం తెలి యదా!’ అంటూ. ఆయన్ని ‘కొడు’కంటూ ముద్దుచేసే నా అక్క ఇందిరాదేవితో (బొబ్బిలి రాకుమారి, ఆకాశవాణి వీణా విదుషి, బహుమతులు పొందిన చిత్ర కారిణి) సగం నవ్వుతూ అన్నారట - ‘అమ్మా! మీ తమ్ముడికి నా పాట నచ్చలే’ దని! అక్క నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా అయిదు నిమిషాలు ఝాడించింది. ‘బాలమురళి పాటను విమర్శించేటంతటి వాడివా నీవు?’ అంటూ. తిల్లానాలు యిటీవలి విద్వాంసులెందరో చేశారు. అవి వారి వారి కంఠాల, వాద్యాల సొగసును యినుమడింప జేయడానికే రూపొందించబడ్డాయి. నాట్యా నికన్నీ అంతగా నప్పవు. బాలమురళీ తిల్లానాలు (ద్విజావంతి, బృందావన సారంగ, కదన కుతూహలం యిత్యాది) అలా కాదు. నాట్యం కోసమే తీర్చిన ట్లుంటాయి. ఇప్పుడాయన తిల్లానాలతో ఎందరో అందలమెక్కి ఊరేగుతు న్నారు, నాతో ఆనాడు ‘అబ్బా కష్ట’మన్నవారు కూడా! బాలమురళి దాదాపు ఏది పాడినా ‘దీనికి నాట్యం చెయ్యరూ?’ అని గోముగా అడిగినట్లుంటుంది. నూరేళ్లుగా దక్షిణ దేశంలో ‘కృష్ణం కలయసఖి సుందర’ మన్న తరంగాన్ని ముఖారి రాగంలో పాడుతున్నారు. 75 సంవత్సరాల కిందట త్రిపురారిభట్ల రామకృష్ణశాస్త్రి రికార్డు విన్నా, బాలమురళిది విన్నా మనసు గంతులు వేస్తుంది. కాళిందీతట తరికిటతోమ్లను కంటికి కట్టిస్తుంది. పదమైనా అంతే. ‘అలిగితే భాగ్యమాయే’ (క్షేత్రయ్య, హుసేని) ఆయన పాడగా వింటే అరసొంపు మాటలాడే ఆ ధూర్తుని దుండగీడుతనాన్నెలా ఆ ముగ్ధ ఓర్చుకుంటున్నదో అనీ, అయ్యో పాపం ఆ అబలాయ కబళాయ వాడి పాల బడిందా అనీ కంటనీరు పెట్టిస్తుంది. తన సంగీతానికెన్నో అన్నమయ్య సంకీర్తనలు పాడిన బాలమురళి మూడో నాలుగో వక్కలంక సరళారావు (ఆనాడు ‘కీలుగుర్రం’లో ఘంటసాలతో కలిసి ‘కాదు సుమా కల కాదు సుమా’ పాడిన గాయకి) వరసలకు ఒక కేసెట్లో పాడారు. ఆ చూడామణిలో కోహినూర్లు ‘చలిగాలి వెడ యేల చల్లీని’ (బృందా వని, సరళతో), ‘ఎంత దవ్వైననేమి’ (బాగేశ్రీ, నాట్యకళాకారిణి స్వప్న సుందరితో). రాగంలో సంగతి, అన్నమయ్య సంకీర్తనల స్వరకర్తగా సరళ ఎవ్వ రికీ తీసిపోదు. అందుకనే అడగ్గానే బాలమురళి ఆమెకు పాడటం. అష్టపదులలో చివరిది ‘నిజగాదస యదునందనే’ ఒక రాజహంస. సరసాలంతా జరిగిన తరువాత రాధ కృష్ణునితో సరాగాలు. యిలా ఎన్నో. నాట్య కళాకారులు వీటిని భరతనాట్య, కూచిపూడి, విలాసిని, మోహినీ ఆట్టం, మణిపురి, సత్రియ, కథక్ పద్ధతులలో గజ్జకడితేనా, అద్దిరభన్నా! ఈ క్రింది విషయం నాతో పద్మాసుబ్రహ్మణ్యం (భరతుని నాట్యశాస్త్రం నా తలకెక్కించే ప్రయత్నం చేసిన ధీరవిదుషి) చెప్పారు. ‘‘ఒకమారు బాలమురళి, నేను కచ్చేరీ నిమిత్తం రైల్లో వెళుతున్నాం. ‘ఒక జావళి నీ కోసం చేస్తా’ నంటూ అప్పటికప్పుడు ధారతో ‘మరులు మించెరా’ అన్నది నవరోజులో చేశారు. ఈ విషయం చెప్పి, అక్కడ దానికి నేను అభినయం పడితే, చూసినవారెంత మెచ్చుకున్నారో చెప్పలేను!’’. మెచ్చుకోక ఏం చేస్తారు? ఆ పాటలో మాటలు - ఒక ప్రౌఢ మరులు మించెరా అని వగలు పోతుంటే వినడం - మాంఛి ఎండాకాలంలో గాలి ఆడక బిగపట్టిన వేళ పచ్చకర్పూరం కలిపిన చందనం వీపుకి తమలపాకుతో పూసినట్లూ, గొంతు తడారిపోయినప్పుడు నిమ్మ నీరులో కాస్త తుహినమూ, తేనే కలిపి త్రాగించినట్లూ ఉంటుంది. నిజం. ఆయనకు సంగీతం తెలియదు. సంగీతానికి ఆయన తెలుసు. కాబట్టే ఆయన తనువిప్పుడు మనలో లేకపోయినా తను విడిచి వెళ్లిన విమల గాంధర్వం మనిషి ఉన్నంతవరకు మనసుకి ఆహ్లాదం కలిగిస్తూనే ఉంటుంది. ఇప్పుడాయన ఉనికి గోలోకంలో (కృష్ణగానం చేసిన వారి పరమావధి గోలోకమనే నా విశ్వాసం). అక్కడ జుగల్బందీ చేస్తే ఆ పెద్ద మురళీ వాడి ముందు బాలమురళి నీడను పడతాడా అన్నది పక్కనున్న మల్లాది రామకృష్ణ శాస్త్రే నిర్ణయించాలి! వి.ఎ.కె. రంగారావు వ్యాసకర్త ప్రముఖ కళా, సంగీత విమర్శకులు, చెన్నై మొబైల్: 094447 34024 -
సంగీత సుధార్ణవం
అక్షర తూణీరం గమకాలు గుండెలవిసేలా లోతుగా.. ఉండాలన్న అతి పాత ధర్మాన్ని సంస్కరించారు. గమకాలు కలువ రేకులు కదిలి నంతసున్నితంగా కూడా ఉండవచ్చని పాడి చూపించారు. ఒక సుమధుర సంగీత ఝరి ఆగిపోయింది. ఆయన గళంలో ఒక ఠీవి ఉంది. శ్రుతికి మించిన ఆత్మవిశ్వాసం ఉంది. సంగ తులు, గమకాలు వాటంతటవే వచ్చి కూర్చుంటాయన్న ధైర్యం ఆయనకుండేది. ‘బాలమురళి’ అంటే నవ శాస్త్రీయ చరిత్ర. ఎనభై ఏళ్ల సుదీర్ఘ రాగ ప్రస్థానం. త్యాగరాజ స్వామి గురు పరంపరలో అయిదో తరం వారసుడు. సంగీత సార్వ భౌమ పారుపల్లి రామకృష్ణయ్య శుశ్రూషలో సంగీత పాఠాలు నేర్చిన విద్యార్థి మంగళంపల్లి బాలమురళీకృష్ణ. అరవై ఏళ్ల క్రితం బాలమురళి వివాదాస్పద విద్వాంసుడు. ఒక బంగారు చట్రంలో బిగుసుకుపోయిన శాస్త్రీయ సంగీత రీతులకు విముక్తి కలిగించాడు. సంప్రదాయమంటే - ఒక తరం వారు తాము ఆర్జించిన సుజ్ఞానాన్ని మారిన కాలంతో వడకట్టి తర్వాతి తరా నికి అందించడమేకానీ, తుచలు పోకుండా అందివ్వడం కాదని ఈ ‘ఛైల్డ్ ప్రాడిజీ’ నమ్మారు. అదే ఆచరించి చూపారు. అందుకే ఆయన వెయ్యిమందిలో ఒక్క రుగా కాక ఒకే ఒక్కడుగా సంగీత ప్రపం చాన్నేలారు. సామాన్య జనులందరినీ సంగీతమాస్వాదించి ఆనందించగల రసి కులుగా ‘కన్వర్ట్’ చేసేస్తున్నాడని బాలముర ళిపై ఆనాటి ఛాందసులు అభియోగం మోపారు. దాన్నొక గొప్ప అభినందనగా, ఆశీర్వాదంగా బాలమురళి స్వీకరించారు. వస్తూనే ‘స్వరార్ణవం’ చంకనపెట్టుకు తెచ్చుకున్నాడని ప్రతీతి. ‘‘నేను వానికి నేర్పిందేమీ లేదు. వాడి సంగీతాన్ని వాడే తెచ్చుకున్నాడు’’ అంటూ గురువు పారుపల్లి రామకృష్ణయ్య తరచూ చెబుతుండేవారట. ఆరవ ఏట పక్కవాద్యాలతో సహా సంగీత గోష్ఠి నెరపిన అసాధారణ ప్రతిభామూర్తి బాలమురళి. సంగీత లోకంలో ఆయనొక సాహసి. విద్యుత్తుతోబాటు తగుమాత్రం ధిషణాహం కారం కూడా బాలమురళి వినూత్న శైలిని తీర్చిదిద్దింది. గమకాలు గుండెలవిసేలా లోతుగా, గొడ్డలి గంట్లులా ఉండాలన్న అతిపాత ధర్మాన్ని సంస్కరించుకుని ఆపాత మధురంగా మలచుకున్నారు. గమకాలు కలువరేకులు కదిలినంత సున్నితంగా కూడా ఉండవచ్చని పాడి చూపించారు. మెప్పించి, ఔననిపించారు. వయోలాని గిటార్‌లా, వయొలిన్‌ని ఏక్తారలా, వీణని వయొలిన్‌లా పలికించగల చతుర్థ సమర్థుడు. అనేక వాద్యాల మీద అధికారం సంపాయించారు. బాలమురళీ ‘పుట్టు విద్వాంసుడు’ అవడం వల్ల, సంగీత జ్ఞానిగా సాహిత్యకారునిగా సాధించాల్సినదంతా పాతికేళ్లకే పూర్తి చేసు కున్నారు. ఇక మిగిలిన తీరికలో కావల్సినన్ని సాము గరిడీలు చేస్తూ సంగీత సరస్వతిని ఆరాధించారు. బాలమురళి కారణ జన్ముడు. స్కూలు చదువులెరుగని బాలమురళి సంస్కృతాంధ్ర భాషల్లో ప్రావీణ్యం గడిం చారు. కొత్త రాగాలను నిర్మించారు. అనేక కృతులు రచించారు. ఆయన తిల్లానాలను ప్రత్యేకంగా చెప్పుకుంటారు. సినిమాలకు పాటలు పాడినా బాలమురళి ముద్ర ఉంటుంది. గొప్ప చమత్కారి. ‘నేను కచ్చేరీల్లోనే సాధన కూడా చేస్తాను. ముఖ్యంగా పెళ్లిళ్లలో నా గోష్ఠి ఏర్పాటు చేసినపుడు. ఎందుకంటే అక్కడ నన్నెవరూ వినరు. అందు కని నా ప్రయోగాలు నేను చేసుకుంటాను’ అని చెప్పేవారు. సంగీతానికి బాల మురళి చేసిన గొప్ప సేవ ఆయన రికార్డింగ్స్. కొన్ని వందల గంటలు రికార్డ్స్‌లో, టేపుల్లో, సీడీల్లో నిక్షిప్తం చేసి జాతికి అందించారు. త్యాగరాజ కృతుల్లోని సాహిత్యాన్ని సుమధుర గాత్రంతో విశదపరిచారు. శాస్త్రీయ సంగీతానికి, ఆ విద్వాంసులకు బాలమురళి గ్లామర్ తెచ్చి పెట్టారు. ఆయన ‘షోకిలా’గా జీవించారు. ఆయన అందుకోని బిరుదులు, గౌర వాలు ఏవీ లేవు. అన్నమయ్య, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, రామదాసు కీర్తనలు ఆయన నోట అమృతధారలైనాయి. బాలమురళి మరో పేరు ‘‘భక్తిరంజని’’. బాలమురళి నిష్ర్క మణతో సరిగమల బృందావనం సద్దుమణిగింది. వారికి అక్షర నివాళి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
గాన గంధర్వుడు
జీవన కాలమ్ ఆయన గొంతులో పలకని గమకం, రవ్వ సంగతి లేదేమో. ఎప్పుడూ విన్న కీర్తనని వింటున్నా మరేదో కొత్త మర్యాద, జీవలక్షణం పలుకుతుంది. మైకు ముందు కూర్చుంటే గొప్ప అధికారం, దిషణ రూపుదిద్దుకున్నట్టుంటుంది. త్యాగరాజస్వామి ఐదో తరం గురు సంపద నాకు దక్కిన అదృష్టం- అని మంగళంపల్లి బాల మురళీకృష్ణ గర్వపడ్డారు... గతంలో నేను సంపాద కత్వం వహించిన ‘సురభి’ పత్రికకి ఇంట ర్వ్యూలో. బాలమురళి గురువులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులుకి మానాంబుచావిడి (ఆకుమళ్ల) వెంకట సుబ్బయ్య సంగీత భిక్ష పెట్టారు. అంతకుముందు మరీ చిన్న తనంలో తండ్రి పట్టాభిరామయ్య ఏకైక సంతా నంగా ప్రతీరాత్రీ పక్కనే పడుకుని ఆయన చెప్పే సరళీస్వరాలు, జంట స్వరాలూ, వర్ణాలూ - అన్నీ ‘జ్ఞాపకం’ చేసుకున్నారు. ఏడో యేట గురువు ఉంటే మంచిదని తండ్రి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గరకు తీసుకెళ్లారు. ‘ఏదీ, నీకొచ్చిన పాట ఒకటి పాడు’ అన్నారాయన. పాడారు. వీడిని ఇంట్లో దింపి మధ్యాహ్నం రమ్మన్నారాయన. వస్తే ‘వీడికి చెప్పవలసిందేం లేదు. వచ్చినవి మననం చేసుకోవడమే’ అన్నారట. 1939 జూలై 6న మొదటి కచ్చేరీ. సభలో నాన్న, గురువు ఉన్నారు. 9 నుంచి ఒక గంట సాగాలి. పదిన్నరయినా సాగుతోంది. గురువు వేదిక మీదికి వచ్చి కుర్రాడిని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లి దిష్టితీయమన్నారు. తర్వాత ముసునూరి సత్యనారాయణ భాగవతార్ హరికథ చెప్పాలి. చెప్పలేనని ఆయన వేదిక దిగిపోయారు. పట్టాభి రామయ్య మురళి వాయించేవారు. కొడుక్కి ‘ముర ళీకృష్ణ’ అని పేరు పెట్టుకున్నారు. ముసునూరి సూర్యనారాయణ పేరులో ‘బాల’ కలిపారు ఆ రోజు. ఆ విధంగా బాలమురళీకృష్ణ అయ్యారు. తర్వాత తిరువయ్యూరులో దిగ్దంతుల ముందు అలవోకగా పాడే కుర్రాడిని చూసి అబ్బుర పడి వీణ ధనమ్మ ఎత్తుకుని తనతో తీసుకుపోయి దిష్టి తీసిందంటారు. వారి ఇంటి ఎదుటి సత్రంలో వారి గురువుగారి ఆధ్యాత్మిక గురువు విమలానంద భారతీస్వామి విడిది చేశారు. చాతుర్మాస దీక్ష చేస్తు న్నారు. బాలమురళికి కబురు పంపించారు. ‘ఒక్క మాట చెప్తావా? త్యాగరాజుకి ముందు సంగీతం ఎలా ఉండేదంటావు?’ అన్నారు. ఒక క్రమబద్ధమైన ధోరణిలో లేదన్నారు. ‘ఆయన ఇదివరకెన్నడూ చేయనిది, చేయలేనిదీ చేశారు. చరిత్రలో మిగి లారు. ఆ పని నువ్వూ చెయ్యి’ అన్నారు. అప్పుడా యనకి 16. మరో రెండేళ్లలో 72 మేళ కర్త రాగాలలో కృతులు చేశారు. అది అప్పటికీ ఇప్పటికీ అపూర్వం. అనితర సాధ్యం. ఆయన జీవితమంతా అనితర సాధ్యమైన సంగీతాన్నే ఆరాధించారు. బహుశా ఆయన గొంతులో పలకని గమకం, రవ్వ సంగతి లేదేమో. ఎప్పుడూ విన్న కీర్తనని వింటున్నా మరేదో కొత్త మర్యాద, జీవ లక్షణం పలుకుతుంది. మైకు ముందు కూర్చుంటే గొప్ప అధికారం, దిషణ రూపుదిద్దుకున్నట్టు ఉంటుంది. ఆయనలో చిలిపితనం ఉంది, సరదా ఉంది. ప్రతీ క్షణాన్నీ అనుభవించే ‘సరసత’ ఉంది. తాను ఆనం దిస్తూ పాడతారు. ఆ ఆనందాన్ని రసికునికి పంచి ఆ క్షణాన్ని అజరామరం చేస్తారు. దాదాపు 53 ఏళ్ల కిందట - విజయవాడ రేడియో కేంద్రం ‘భక్తిరంజని’ విని రంజించని వారె వరూ లేరు. జాతీయ స్థాయిలో ఆ కార్యక్రమం పరిమళించింది. ఆ గుబాళింపుకి అధ్యక్షుడు బాల మురళి. ఇంకా శ్రీరంగం గోపాలరత్నం, వింజ మూరి లక్ష్మి, వీబీ కనకదుర్గ, ఎమ్వీ రమణమూర్తి, సూర్యారావు ప్రభృతులు ఉండేవారు. ఉదయమే అహిర్ భైరవిలో ‘పిబరే రామరసం’ అంటే శ్రోతల హృదయాల్లో రామరసం చిప్పిల్లేది. ఈ విందుకి కారకులు - మరొక మహానుభావుడు - ఇంకా విజ యవాడలో ఉన్నారు. బాలాంత్రపు రజనీకాంత రావుగారు. ఆయనకిప్పుడు నూరేళ్లు. ఆయన సంగీత ప్రపంచంలో ఏమి చేశా రనికాదు. ఏమి చెయ్యలేదని ప్రశ్నించుకోవాలి. భీంసేన్ జోషీ, అజయ్ చక్రవర్తి వంటి వారితో ‘జుగల్బందీ’కి శ్రీకారం చుట్టారు. అవి అపూర్వ మైన కచ్చేరీలు. స్వరశ్రీ, మహతి వంటి కొత్త రాగాలను సృష్టించారు. ఇక - సంగీత రచనలో ఆయనకి ఆయనే సాటి. నాటలో ‘అమ్మ’ వర్ణం వింటే పులకించిపోతాను. రామప్రియ మరొక కళా ఖండం. కదన కుతూహలం తిల్లాన - ఇలా ఏరడం వారి దిషణకి అన్యాయం చేసినట్టు. మా ఇంట్లో దసరా నవరాత్రులకు బొమ్మల కొలువు ప్రత్యేకత. 2008 ఆగస్టు 10న సతీ సమే తంగా వచ్చారు. వారికి పాదాభివందనం చేసి శాలువా కప్పాను. నాకు చాలా ఇష్టమైన ఆయన రచనని పాడమన్నాను. కానడలో ‘బృహదీశ్వర మహాదేవ!’ నా చేతిని ఆప్యాయంగా పుచ్చుకుని పాడారు. ఆయన పాటలో, రచనలో ఈ జన్మకే పరి మితం కాని ఉపాసనా బలమేదో కనిపిస్తుంది. ఆఖరుసారి విశాఖపట్నం బీచిలో విశ్వప్రియ హాలులో ఇస్కాన్ ఉత్సవాలలో పాడారు. పాట సాహిత్యం మరిచిపోతున్నారు. వృద్ధాప్యం ఓ జీనియస్‌ని ఏమారుస్తోంది. కానీ ఆయన లొంగడం లేదు. సాహిత్యం జ్ఞాపకానిది. ఉద్దతి జీన్స్ది. కాస్సే పయాక సునాద వినోదిని రాగంలో మైసూర్ వాసు దేవాచార్ ‘దేవాదిదేవ’ ఎత్తుకున్నారు. అంతే. నభూతో నభవిష్యతి. అది ఒక మహాగాయకుడి విజృంభణ. బాలమురళీకృష్ణ ఈ తరం సంగీతానికి అధ్య క్షుడు. ఏతరంలోనయినా కనిపించని అరుదైన గంధర్వుడు. A complete musical genius. గొల్లపూడి మారుతీరావు -
స్తబ్దతను ఛేదించిన ‘మురళి’
సందర్భం యూరోపియన్ సంగీతానికి మొజార్ట్ అధినేత కావడంతో అది ‘మొజార్ట్ యూరప్’ అయింది. అలాగే బెతోవెన్ శకం అన్నారు. ఇది కర్నాటక సంగీత లోకంలో బాలమురళి యుగం! సంప్రదాయంపై అధికారమున్నవాడికే సంస్కరించే హక్కు ఉంటుంది. సంప్రదాయం మీద దండోరా వేయడం అంత తేలిక కాదు. అందుకు ఎంతో అధికారం, ప్రభుత్వ విమర్శకులకు ఉంటేనే అది సాధ్యం. అంతా ‘సంకరం’ అయిపోతుందనుకునేవాళ్లు ఆధు నిక జీవన పద్ధతులకు దూరంగా అరణ్యాలలో, ఆశ్రమాలలో కంద మూలాలు తిని బతకవచ్చు. కాని అలా బతకడానికి ఇష్టపడటం లేదు. సంప్రదాయం చేత ఆధునికం చాకిరీ చేయించుకొనక తప్పదు. అందుకే కొత్త పాతల మేలు కలయిక అన్నారు. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ కర్నాటక సంగీతాన్ని ఆధునికులకు మరింత కర్ణ పేయంగా మలచి, వందల సంఖ్యలో మాత్రమే ఆక ర్షితులవుతున్న శ్రోతలనూ, ప్రేక్షకులనూ వేల సంఖ్యలో పెంచడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. దాక్షిణాత్య ఛాంద సులు కొందరు పదే పదే విమర్శలు చేసి కర్ణాటక సంగీత విరోధిగా లోకానికి చిత్రించాలని చూస్తున్నందుననే బాల మురళి ఇటీవల తిరగబడవలసి వచ్చింది. నిజానికి ఆయన తన ముందుతరం పెట్టిపోయిన సంగీత సంప్రదాయాల పరిధిలోనే మార్పు చేశాడు. లలిత సంగీత బాణీలకు ఆక ర్షితులవుతున్న జనాన్ని కూడా తన వైపునకు ఆకట్టుకోవ డానికి వాణినీ, బాణినీ సంస్కరించుకున్నాడు. అదే విప్లవ మైతే, పాశ్చాత్య దేశాల్లోనూ, చివరికి కమ్యూనిస్టు దేశా ల్లోనూ గాత్ర, వాద్య సంగీతంలో వచ్చిన మార్పులను చూసి ఛాందసులు గుండెలు బాదుకోవలసి వస్తుంది. బాలగంధర్వుడిగా తొమ్మిదేళ్లకు తిరువాయూర్ సంగీత సభలలో ఉద్దండులను తమ గానమాధుర్యంతో ఊగించి శాసించిన బాలమురళి గురుపరంపరలో త్యాగ రాజుకు శిష్యుడుగా నిలవగలిగాడు. కర్ణాటక సంగీతాన్ని జనాకర్షకం చేయడానికి ఆయన సంగీత సరిహద్దులనే కాక దక్షిణాదిని దాటి యావద్భారతంలోనూ ఖ్యాతికెక్కాడు. వాక్కునూ, గేయాన్నీ సొంతం చేసుకున్న బాలమురళి, ‘బయకారుడై’ వాగ్గేయకారునిగా ప్రసిద్ధి పొందాడు. 430 బాణీలతో, 72 మేళకర్త రాగాలకు ఒక్కొక్క కృతి చొప్పున సమకూర్చుతూ ‘జనకరాగ మంజరి’ని రచించిన బాల మురళికి సంప్రదాయంపై అధికారం ఉండితీరాలి. అది ఉన్నవాడికే సంస్కరించే హక్కు కూడా ఉంటుంది. కనుకనే అతనికి చెప్పదగిన తొలికచేరి తిరువాయార్ సభ అయితే, తుది కచేరి తిరువనంతపురం కావలిసి వచ్చింది. కనుకనే బాలమురళి ‘సంప్రదాయాన్ని కొంత వదులుకోవాలి. లేకుంటే కర్ణాటక సంగీతం మెల్లమెల్లగా చచ్చిపోతుంది’ అని దండోరా వేయవలసి వచ్చింది. త్యాగరాజు సంప్ర దాయంలోనే ఇతను కూడా వ్యాపార ప్రపంచం సరిహ ద్దులు దాటి నిధి కంటే దైవసన్నిధి సుఖం అని ఆలోచించ సాగాడు. ఇది ఎప్పటికప్పుడు కొత్త రుచుల కోసం అర్రులు చాచే శ్రోతలకు శుభసూచకం. సంప్రదాయ ఉల్లంఘన ఈనాటిది కాదు. వ్యాకరణ దోషాలను కూడా పట్టించుకోకుండా శ్రవణపేయతకు ప్రాధాన్యం కల్పించిన కర్ణాటక మూర్తిత్రయం కీర్తన కృతులు లేవా? ఈ మూర్తిత్రయం సంగీత సాగర మథ నంలో సౌలభ్యం కోసం ఎన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించారో! కొన్నేళ్లక్రితం ‘ప్రజానాట్య మండలి’ ప్రాచీన కళారూపాలన్నింటినీ చేపట్టినప్పుడు వాటిని ప్రజా రంజకం చేసినప్పుడు సంప్రదాయ కళలకు మరింత వన్నె కూర్చిపెట్టిందే గాని, తగ్గించలేదు. బాలమురళికి ముందు నాగయ్య కర్ణాటక సంగీతాన్ని ఆధునికం చేసినట్టే ‘శ్రీరంగ రంగా కావేటి రంగా’ వంటి కీర్తనలను విప్లవీకరించి తన బాణీలతో వేల సంఖ్యలో జనాల్ని ఆకర్షిస్తున్నవాడు గద్దర్. ఒకప్పుడు యూరోపియన్ సంగీతానికి మొజార్ట్ అధి నేత అయినందున అది ‘మొజార్ట్ యూరప్’ అయింది. అలాగే బెతోవెన్ శకం అన్నారు. ఇది కర్ణాటక సంగీత లోకంలో బాలమురళి యుగం! తప్పులు దొర్లితే దొర్లుగాక. అసలు సొంత అడుగే పడనివ్వకపోతే ఎలా? జాజ్, ఫోక్, రాక్, పాప్, కంట్రీ సింఫోనిక్, లైట్ క్లాసికల్, బ్రాడ్వే, హాలీవుడ్ - ఇంత వైవిధ్యం పాశ్చాత్యులు పెంచుకుంటున్నారు. కొత్త రాగ మాలికల ద్వారా సరికొత్త స్వరకల్పనల ద్వారా ఫ్రాంక్ జప్పా, రోలింగ్ స్టోన్స్, అరీతా ఫ్రాంక్లిన్ ఆధునికులలో సంగీత ఝరికి హద్దులు లేవని నిరూపిస్తున్నారు. మైకేల్ జాక్సన్ ఇందుకొక సరికొత్త మేళవింపు. యూరప్‌లో సెబాస్టియన్ బాక్ చర్చి మ్యూజిక్ సంప్ర దాయాన్ని కాపాడుతూనే హెచ్చుమందిని ఆకర్షించేందుకు వాద్య, గాత్రాలకు మెరుగులు దిద్దుకున్నాడు. కచేరీ మధ్యలో బాలమురళి ‘విరామం’ తీసుకుంటాడని బాధపడే ఛాందసులకు విరామ చిహ్నం వ్యాస రచనకు ఎంత ఆరో గ్యమో, వాగ్గేయకారునికి మధ్యలో సరికొత్త ‘ఎత్తుబడి’కి అంతే అవసరం. ఈ విరామం విషయంలో యూరప్‌లో స్యూయెన్‌బర్గ్-స్ట్రావిన్స్కీ; బ్రామ్స్-వాగ్నెర్ల మధ్య ఎన్ని వాదోపవాదాలు సాగాయో, మన దక్షిణాదిన బాల మురళి-బాలచందర్ మధ్య కూడా అలాగే తలెత్తాయి. అక్కడ ‘ట్వెల్వ్ టోన్ వర్క్స్’ను మ్యూజిక్ ఆప్ ఇంట ర్వల్స్ అన్నారు. కనుకనే స్యూయెన్‌బర్గ్ ‘స్వర కల్పన అంటే నీలోని అంతర్వాణిని ఆదరించుకోడమే’గానీ మూడోవాడి జోక్యాన్ని సహించడం కాదు అన్నాడు. కేవలం జానపద గీతాల ద్వారా ప్రత్యామ్నాయ సంగీత బాణీలను సమకూ ర్చిన మైఖేల్ గ్లింకా.. జారు చక్రవర్తిని కూడా సమ్మోహితం చేసిన దేశభక్తియుత సంగీత నాటకాన్ని రచించాడు. బరోడిన్ రంగం మీదికి వచ్చిన తర్వాతే ‘సంగీతంలో స్తబ్దత’ కాస్తా వదిలిపోయిందన్నాడు జర్మన్ విమర్శకుడు అభీలిజ్. అలాగే మన వర్ణ, స్వర ప్రబంధకర్త బాలమురళి కూడా రామదాసు కీర్తనల నుంచి రాఘవేంద్ర స్వామి స్తుతి వరకూ, త్యాగరాజు సంస్కృత కృతుల నుంచి ఉమా శంకర స్తుతి మాల వరకు సంప్రదాయంలోనే సమ్మతమైన సంస్క రణలు తెస్తే ఎందుకింత సణుగుడు? (కర్ణాటక సంగీతంలో బాలమురళి సంస్కరణలపై 31 ఏళ్ల క్రితం -13.10.85- భావమురళి శీర్షికన ఏబీకే ప్రసాద్ రాసిన వ్యాసం) ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పలుకే బంగారమాయెనా!
జననం : 06 జూలై 1930 మరణం : 22 నవంబర్ 2016 బాలమురళీకృష్ణ ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలు స రి గ మ ప ద ని... సప్తస్వరాలు. ఆ స్వరాలన్నిటికీ నైవేద్యం పెట్టిన బాలగంధర్వుడు... ఈ స్వరస్వతీపుత్రుడు! పాటతో పులకింపజేసి... సాక్షాత్తూ భగవంతుడినే తిలకింపజేసిన బాలమురళి పలుకే బంగారమాయెనా! ‘‘పునర్జన్మ ఉందో, లేదో నాకు తెలియదు. కానీ, ఒకరి నుంచి మరొకరికి సంగీతం పరంపరాగతంగా రావడం లాంటి వాటిని బట్టి, మన శాస్త్రాలను బట్టి చూస్తే పునర్జన్మ ఉందనే అనుకుంటున్నా. మళ్ళీ జన్మంటూ ఉంటే, ఈసారి ‘పెద్ద’ బాల మురళీకృష్ణ లాగా, ‘కొత్త’ బాల మురళీకృష్ణ లాగా మరింత మెరుగైన పనులు చేస్తా. సంగీతానికి నాకు చేతనైనంత ఇంకా... ఇంకా చేస్తా’’. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణను ఇంటర్వ్యూ చేస్తూ పునర్జన్మలు ఉన్నాయంటారా? మీకు నమ్మకం ఉందా? అని సాక్షి ‘ఫ్యామిలీ’ అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఇది. తన గానాన్ని భువికిచ్చి, బాలమురళి దివికేగిన ఈ సందర్భంలో ఆనాటి ఆయన సంభాషణలోని కొన్ని స్వర గమకాలు మళ్లీ మీ కోసం. అప్పటికప్పుడు తిల్లానా రాసుకొని, అక్కడికక్కడ సంగతులు వేసుకొని మీలా పాడేయడం ప్రయత్నం మీద వస్తాయా? లేదు. ఇవన్నీ ప్రయత్నం చేస్తే వచ్చేవి కావు. సహజంగా అలా జరగాలి. అంతే. అందుకే నేనెప్పుడూ చెబుతుంటాను... సంగీతం నాకు రాదు, తెలియదు. కానీ, సంగీతానికి నేను తెలుసు. అందుకే, అది నన్ను వెతుక్కుంటూ వచ్చినంత కాలం నేను వాహికగా మాత్రం ఉంటాను. పాట నా నోట పలుకుతుంది. అసలు నా జీవితంలో నేనెప్పుడూ కచ్చేరీలు చేయాలనీ, ఇందులోనే స్థిరపడాలనీ అనుకోలేదు. అలా జరిగింది. ఆ క్రమంలో ‘బాలమురళి బాణీ’ అనేది సృష్టించాను. ఈ సంగీతం, పాండిత్యం మీకు భగవద్దత్తం అనుకోవచ్చా? మీలో ఒక త్యాగయ్య, ప్రయాగ రంగదాసు, సుసర్ల దక్షిణామూర్తుల అంశ ఉందని అభిమానులు అంటారు... ఇదంతా భగవంతుడు ఇచ్చిందే. అయితే, ఫలానా వారి అంశ లాంటివి నేను చెప్పలేను. నేనివాళ ఇలా ఉండడానికే అలాంటి మహానుభావులే కారణం. మా అమ్మ గారి తాత గారు ఎన్నో కృతులు వెలయించిన సుప్రసిద్ధ ప్రయాగ రంగదాసు గారు. ఇక, మా నాన్న గారు పట్టాభిరామయ్య గాయకులు. మా అమ్మ వైణికురాలు. మా పెద్దమ్మ సంగీతం పాడేవారు, పిల్లలకు నేర్పేవారు. ఇలా పరంపరాగతంగా సంగీతం నాకు సంక్రమించింది. పెపైచ్చు, మా నాన్న గారి ఒళ్ళో కూర్చొని, ఆయన పాటలు వింటూ, అంటూ పెరిగాను. ఒక్కసారి వింటే వచ్చేసేది. పుస్తకం చూడకుండా పాడేసేవాణ్ణి. అంతా దైవలీల. ఎనిమిదేళ్ళు నిండీ నిండగానే కచ్చేరీలు మొదలు పెట్టారు. ఇప్పటికి 76 ఏళ్ళుగా కొన్ని వేల కచ్చేరీలు చేశారు. అసలు తొలిసారిగా మీరిచ్చిన కచ్చేరీ గుర్తుందా? ఎందుకు లేదూ! 1938 జూలైలో అనుకుంటా... బెజవాడలోని దుర్గాపురంలో శరభయ్యగారి గుళ్ళలో హాలు ప్రారంభోత్సవం. త్యాగరాజస్వామి, వారికి మానాంబుచావిడి (ఆకుమళ్ళ) వెంకట సుబ్బయ్య, ఆయనకు సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి, సుసర్లకు పారుపల్లి రామకృష్ణయ్య, ఆయనకు నేను - ఇలా త్యాగరాజస్వామి ప్రత్యక్ష శిష్యపరంపరలో నేను అయిదో తరం వాణ్ణి. మా గురువు గారైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు తమ గురువులైన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి పేర ‘సద్గురు ఆరాధనోత్సవాలు’ జరుపుతున్నప్పుడు నాతో కచ్చేరీ చేయించారు. కొద్దిసేపనుకున్న నా గానం కొన్ని గంటలు మంత్రముగ్ధంగా సాగింది. నా తరువాత హరికథ చెప్పాల్సిన సుప్రసిద్ధులు ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ తన ప్రోగ్రామ్ కూడా వద్దని, నన్ను ఆశీర్వదించారు. అప్పటి దాకా నా పేరు మురళీకృష్ణ. పసివాడినైన నాకు ‘బాల’ అనే మాట ఆయనే చేర్చి, ‘బాల మురళీకృష్ణ’గా దీవించారు. మీ 11వ ఏట తిరువయ్యారులో బెంగుళూరు నాగరత్నమ్మ గారు స్వామి ఆశీస్సులిప్పించారనీ, అప్పటి కుర్తాళం పీఠాధిపతి విమలానంద భారతీస్వామి మిమ్మల్ని ‘జనకరాజ కృతిమంజరి’కి దీవించారనీ, మరొకరు మీకు కవితా లక్షణం ఉపదేశించారనీ... ఇలా ఎందరో స్వామీజీల అనుగ్రహం మీకు లభించిందట! నా 11వ ఏట తిరువయ్యారులో త్యాగరాయ ఆరాధనోత్సవాలలో పారుపల్లి వారికిచ్చిన సమయంలో నేను పాడినప్పుడు, జనం నుంచి అపూర్వ స్పందన వచ్చి, చుట్టూ మూగితే, నాగరత్నమ్మ గారు నన్ను తీసుకువెళ్ళి, త్యాగరాజస్వామి విగ్రహం పాదాల చెంత పడేశారు. ‘ఏ నరదృష్టీ సోకకుండా ఈ పిల్లవాణ్ణి కాపాడమ’ని ప్రార్థించారు. ఇక, బెజవాడలోని సత్యనారాయణపురంలో మా ఇంటికి ఎదురుగా ఉన్న సత్రంలో (దూబగుంట వారి సత్రం ఇప్పటికీ ఉంది) చాతుర్మాస్య దీక్షకని కుర్తాళం పీఠాధిపతి వచ్చారు. ఆయన మా గురువు పారుపల్లి వారికి ఆధ్యాత్మిక గురువు. స్వామీజీని కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ ప్రేరణ, ఆశీర్వాదం అందుకొని, 72 మేళకర్త రాగాల్లో కీర్తనల రచన ‘జనక రాగ కృతి మంజరి’ మొదలుపెట్టాను. ఇక, శరభయ్య గారి గుళ్ళలో ఉండే దేవీ ఉపాసకుడు, పండితుడు అయ్యప్పశాస్త్రి నాకు యతి, ప్రాస, కవితా లక్షణాలను చెప్పడం, కృతి, కీర్తన, పాట, పదం, జావళీల భేదాలు, రచనా రహస్యాలు తెల్పడం నా సాహితీ రచనకు వన్నెలద్దింది. ప్రతిభకు పెద్దల ఆశీర్వాద బలం తోడైంది. మీ జీవితంలో మీ గురువు గారి పాత్ర? ఆయనలో మీరు చూసిన ప్రత్యేకత? మా గురువు పారుపల్లి వారు లేకపోతే, ఆంధ్రదేశంలో ఇవాళ కర్ణాటక సంగీతం ఇంతగా ప్రాచుర్యంలోకి వచ్చేది కాదు. బెజవాడలో గాంధీనగర్‌లోని ఆయన ఇంటికి సైకిల్ మీద వెళ్ళి, పాఠం చెప్పించుకున్న రోజులు నాకింకా గుర్తే. శిష్యులమైన మా అందరికీ ఆయన తనకు తెలిసిన విద్యనంతా నేర్పారు. గమ్మత్తేమిటంటే, పారుపల్లి వారి దగ్గర మా నాన్న గారూ పాఠం చెప్పించుకున్నారు. నేనూ సంగీతం నేర్చుకున్నాను. తండ్రీ కొడుకులిద్దరికీ ఆయనే గురువన్న మాట! రేడియో పాపులారిటీకి కూడా ఎంతో శ్రమించారు. ఉదయం వేళ ‘భక్తి రంజని’ ఆలోచన మీదేనట! అవును. ఆ రోజుల్లో కోరుకొని మరీ రేడియోలో చేరాను. ఉదయాన్నే నిద్ర లేస్తూనే, మంచి సంగీతం వింటే, శ్రోతలకు బాగుంటుందని ఆ భక్తి సంగీత కార్యక్రమం పెట్టాను. దాని కోసం ఎన్నో తత్త్వాలు, భక్తి కీర్తనలు సుప్రసిద్ధులెందరితోనో పాడించాను. అలాగే, సంగీతం, నాటకం, స్పోకెన్ వర్డ్ లాంటి వివిధ విభాగాలకు ప్రొడ్యూసర్లనే పోస్టులు పెట్టించి, ఆ యా రంగాల్లోని సుప్రసిద్ధులను అధిపతులుగా నియమించేలా చూశాను. ఆకాశవాణికి అది స్వర్ణయుగం. విజయవాడలో ప్రభుత్వ సంగీత కళాశాల పెట్టించి, తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేసిన మీరు మద్రాసుకు మారిపోయి, ఇక్కడే 50 ఏళ్ళుగా స్థిరపడడానికి కారణం? ఉత్తరాదికి బొంబాయి ఎలాగో, దక్షిణాదికి మద్రాసు అలా! కళా, సాంస్కృతిక రంగాలకు ఇది కేంద్రం. ఇక్కడ అవకాశాలు ఎక్కువ. బెజవాడ మ్యూజిక్ కాలేజీకి రాజీనామా చేశాక, మళ్ళీ మద్రాసు ఆకాశవాణిలో మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా చేస్తూనే, కచ్చేరీలిస్తూ వచ్చా. ఆ తరువాత పూర్తిగా సంగీతం మీదే దృష్టి పెడుతూ, ఉద్యోగం వదిలేశాను. అయితే, నేనెప్పుడూ డబ్బుకూ, సంగీతానికీ ముడిపెట్ట లేదు. ఇంతిస్తేనే పాడతాను అనలేదు. కళ మీద త్రికరణ శుద్ధిగా దృష్టి పెడితే, సంపాదన దానంతట అదే వస్తుంది. అలాగే, ఆ రోజుల్లో ఎక్కువ డబ్బు వచ్చింది నాకే! మీకు అత్యంత ఇష్టమైన రాగం ఏమిటి? పిన్న వయసులోనే 75 మేళకర్త రాగాలలో కీర్తనలు రాసి, ‘జనక రాగ కృతి మంజరి’ పేర ప్రచురించా. వాటిని పాడి ప్రచారంలో పెట్టాను. అలాగే, సరికొత్త తాళ విధానాన్ని కనిపెట్టాను. ఇక, మహతి, లవంగి, గణపతి - ఇలా నేను సృష్టించిన రాగాలే దాదాపు 25 పైగా ఉంటాయి. అన్నీ నా పిల్లలే కదా. వాటిలో ఏది ఎక్కువ ఇష్టమంటే చెప్పడం కష్టం. కానీ, కల్యాణి మీకు ఇష్టమైన రాగమనుకుంటా..? మీరే ఎక్కడో ఆ మాట అన్నట్లున్నారు! (నవ్వేస్తూ...) గతంలో ఒకసారి కేరళలోని త్రివేండ్రంలో అనుకుంటా. కచ్చేరీ చేస్తున్నా. ఆ సమయంలో నేను కల్యాణి రాగం పాడుతుంటే, ఒక అందమైన అమ్మాయి వచ్చి, నా పక్కన కూర్చొంది. ‘సొగసు నీ సొమ్ము కల్యాణి రాగిణీ, వగలు విరజిమ్ము నా భావజాలమ్ములో...’ అని అప్పటికప్పుడు పాట, వరుస కట్టాను. ఆ కృతి అయిపోగానే ఎలా వచ్చిన అమ్మాయి అలా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎవరో ఎవరికీ తెలీదు. దానికి ఆ కచ్చేరీకి వచ్చినవాళ్ళే సాక్షులు. కల్యాణి రాగదేవతే అలా వచ్చిందనుకుంటా. ఎన్టీఆర్‌తో మీ అనుబంధం ఎలా ఉండేది? ఎన్టీఆర్ మంచి నటుడు, చాలా గొప్పవారు. ‘నర్తనశాల’, ‘శ్రీమద్విరాటపర్వము’ లాంటి చిత్రాల్లో ఆయనకు నేను మంచి పాటలు పాడాను. మా మధ్య ఆ గౌరవాదరాలు ఉండేవి. కానీ, ఆయన లలిత కళా అకాడెమీలన్నిటినీ ఒక్క కలం పోటుతో రద్దు చేసేసరికి, భేదాభిప్రాయం వచ్చింది. కళాకారులకు అవమానం జరిగిందనే బాధతో ఆయన తన పంథా మార్చుకొనే దాకా పాడనన్నాను. ఏడేళ్ళ విరామం తరువాత ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి అభ్యర్థనతో మళ్ళీ హైదరాబాద్‌లో పాడాను. తరువాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ సాదరంగా మళ్ళీ పిలిచి, గౌరవించడంతో వెళ్ళాను. పాడాను. ప్రాథమికంగా మేమిద్దరం ఆర్టిస్టులం. ఆయన నటన నాకూ, నా పాటలు ఆయనకూ నచ్చేవి. అధికారానికో, అహంకారానికో, ఆర్థిక బలిమికో కాదు... నేను ప్రేమకు కట్టుబడతాను. వట్టి డబ్బు ఇస్తే ప్రేమ ఉంటుందా? ‘మహతి’ అనే పేరు బాగా ఇష్టమా? 50 ఏళ్ళుగా మీరు స్థిరనివాస ముంటున్న ఈ ఇంటికి కూడా ‘మహతి’ అనే పేరు పెట్టుకున్నారు.(నవ్వేస్తూ...) నేను పుట్టిన పక్షం రోజులకే మరణించిన మా అమ్మ వీణావాదనలో దిట్ట. నారదుడి వీణ పేరు కూడా మహతే కదా. అందుకే, ఈ పేరు. జీవితపు ద్వితీయార్ధంలో పరిచయమైనా, దీర్ఘకాలం మీ వెంట ఉండి, మీ చరిత్రనూ, కృషినీ భావి తరాలకు అందించాలని ఎం.బి.కె. ట్రస్ట్ ద్వారా ప్రయత్నించిన నర్తకి సరస్వతి మరణించడం... (తీవ్రమైన భావోద్వేగానికి గురై...) ఆమె లేకపోవడం నాకు అపారమైన నష్టం. షి వజ్ మై లైఫ్. (కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోవడానికీ, తుడుచుకోవడానికీ ప్రయత్నిస్తూ...) ఆమె మరణం తరువాత అనేక అంశాలపై నాకు ఆసక్తి కూడా పోయింది. (ఇంటర్వ్యూ: డాక్టర్ రెంటాల జయదేవ) చదువులేని విద్యార్థి 12 డాక్టరేట్ల మేధావి నేను తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో పుట్టా. నేను పుట్టిన పక్షం రోజులకే వాళ్ళ అక్కచెల్లెళ్ళలో అతి చిన్నదైన మా అమ్మ సూర్యకాంతమ్మ చనిపోయింది. దాంతో, మా అమ్మగారి అక్కల్లో అందరి కన్నా పెద్దవారూ, బాల వితంతువైన మా పెద్దమ్మ సుబ్బమ్మగారు నన్ను పెంచారు. నేను స్కూల్లో చేరి చదివింది సరిగ్గా 3 నెలలే. నా పాట విని, విజయవాడ గవర్నర్‌పేటలోని మునిసిపల్ స్కూల్లో హెడ్మాస్టర్ నాకు ఫస్ట్ ఫారమ్‌లో ప్రవేశం కల్పించారు. మా నాన్నగారు నన్ను ముందు కూర్చోబెట్టుకొని, సైకిల్ తొక్కుతూ బడికి తీసుకువెళ్ళడం నాకిప్పటికీ గుర్తే. అయితే, బడిలో కూడా నా పాటలే ఆకర్షణ. ప్రతిరోజూ నేనే బడిలో ప్రార్థన చేసేవాణ్ణి. అంతా నా చుట్టూ చేరేవారు. నా సంగీతంతో మిగిలిన పిల్లల చదువు కూడా పాడవసాగింది. ఇంతలో నేను క్వార్టర్లీ పరీక్షలు తప్పాను. దాంతో, ‘మీ వాడికి చదువు కన్నా సంగీతమే కరెక్ట్. అందులోనే కృషి చేయించండి’ అని హెడ్మాస్టర్ మా నాన్న గారికి చెప్పారు. (నవ్వుతూ...) అలా 6వ తరగతి ఫెయిలై, స్కూలు చదువు అటకెక్కినా, వివిధ విశ్వవిద్యాలయాల నుంచి 12 డాక్టరేట్లు అందుకొని, డాక్టర్‌నయ్యా. రేడియోలో పనిచేస్తున్న రోజుల్లో బెజవాడలో ఓ ఆడ ఇంగ్లీష్ ఎనౌన్సర్ నా పాట విని నచ్చి, ఇంగ్లీషులో మెచ్చుకొని, షేక్‌హ్యాండ్ ఇవ్వబోతే అర్థం కాక జంకాను. ఆ తరువాత పట్టుబట్టి, 3 నెలల్లో ఇంగ్లీషులో పట్టు సాధించి, ఆమెతో అనర్గళంగా మాట్లాడా. రోటరీక్లబ్‌లో ఇంగ్లీషులో నా తొలి ఉపన్యాసమిచ్చా. అలాగే, సంస్కృతం మీద పట్టు సాధించా. ఐస్‌క్రీమ్ తినే గొంతు నేను ఎప్పుడూ ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదు. ఫలానాది తింటే జలుబు చేస్తుంది, గొంతు పట్టుకుంటుంది లాంటివేవీ నాకు లేవు. ఐస్‌క్రీమ్‌లంటే ఇష్టం. శుభ్రంగా లాగిస్తుంటా. కచ్చేరీల ముందు, మధ్య విరామంలో కూడా ఐస్‌క్రీమ్‌లు తిన్న సందర్భాలున్నాయి. ఇష్టంగా ఏది తినాలనిపిస్తే, తినేస్తుంటా. ముఖ్యంగా చిరుతిళ్ళు ఎక్కువ తింటూ ఉంటా. కారప్పూస, కారబ్బూంది, అటుకులు, లడ్డూలు, గారెలు, దోసెలు ఇష్టంగా తింటా. బెజవాడ ఆయన ప్రాణవాయువు మంగళంపల్లికి బెజవాడతో మంచి అనుబంధం. మూడుపదుల వయస్సు దాటేవరకూ బాలమురళీకృష్ణ బెజవాడ సత్యనారాయ ణపురంలోని తన సొంత ఇంట్లోనే వుండేవారు. వారి తండ్రి పట్టాభిరామయ్య కట్టించిన ఇల్లది. మద్రాసులో స్థిరపడి, సంగీతంలో ఖండాంతర ఖ్యాతి పొందిన తరువాత కూడా ఆయన బెజవాడలోని తన ఇంటిని అట్టే పెట్టుకోవడం ఆ వూరి మీద ఆయనకున్న మమకారాన్ని తెలియచేస్తుంది. కనుకనే విజయవాడ పురపాలక సంఘం వాళ్ళు మంగళంపల్లివారికి పౌర సన్మానం చేసారు. ఆయన ఇల్లు వున్న వీధికి మంగళంపల్లి వీధి అని పేరు పెట్టారు. మంగళంపల్లి వారు చాలాయేళ్ళు బెజవాడ రేడియో స్టేషన్లో సంగీత ప్రయోక్తగా పనిచేసారు. బెజవాడలో ఏర్పాటు చేసిన సంగీత కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్ కూడా మంగళంపల్లివారే. రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆయన మద్రాసుకు మకాం మార్చారు. ఒకసారి బెజవాడ వచ్చి కచేరీ చేశారు. ఆయన తమిళ కీర్తనలు పాడడం ఒకాయనకు నచ్చలేదు. ఆ సంగతి మంగళంపల్లి చెవిన పడింది. ఇక ఆ రోజు పూనకం పట్టినట్టు వర్ణం నుంచి మంగళం వరకు (కచేరీ మొదలు అయిన దగ్గరి నుంచి చివరి వరకు) తమిళ కీర్తనలే పాడి కచేరీ ముగించారు. తమిళులకి సంగీతం పట్ల యెనలేని గౌరవం వుందని, తనకు పేరుప్రఖ్యాతులు రావడంలో తమిళ అభిమానుల పాత్ర వుందని చెబుతుండేవారు. అసలు సిసలు సంగీతం కావేరీ ఒడ్డునే ఉందనేవారు. వారి గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. బెజవాడ గాంధీ నగరంలో నవయుగ ఫిలిమ్స్, అద్దంకి శ్రీరామమూర్తి ఇంటి దగ్గరలో పంతులుగారి నివాసం. బాలమురళీకృష్ణ అక్కడ వుండే సంగీతం నేర్చుకున్నారు. వారికి వయోలిన్ అంటే ఆసక్తి. వయోలిన్ విద్యాంసులు ద్వారం వెంకట స్వామి నాయుడి బాణీ అంటే చెవికోసుకునేవారు. ఆయన్ని అనుకరిస్తూ వయోలిన్ వాయిస్తూ ఒకసారి గురువుగారి కంట పడ్డారు. ‘వయోలిన్ సంగతి సరే! ముందు నీ సంగతి చూసుకో’ అని గురువు గారు మెత్తగా మందలించారు. (సంగతి అనేది సంగీత పరిభాషలో ఒక పదం). ఆనాటి నుంచి మంగళంపల్లి అనుకరణకు పూర్తిగా స్వస్తి పలికారు. 1985 ప్రాంతంలో కాబోలు, బెజవాడలో డి.ఎల్.నారాయణగారి అమ్మాయి వివాహానికి మంగళంపల్లి మద్రాసు నుంచి వచ్చారు. పెళ్ళిలో కచేరీ కూడా చేసారు. ఆ తరువాత మమత హోటల్ లో కాసేపు గడిపి రాత్రి పదకొండు గంటలకు రైల్వే స్టేషన్‌కు వెళ్ళారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్లాటు ఫారం మీద సిద్ధంగా వుంది. ఆ ట్రైను టీసీ మంగళంపల్లిని చూడగానే గుర్తుపట్టి సెకండ్ ఏసీ బోగీలో ఒక బెర్తు మీద కూర్చోబెట్టి, ఇప్పుడే వస్తాను, కూర్చోండి, వచ్చి మీకు బెర్తు ఇస్తాను అని చెప్పి వెళ్లి పోయాడు. ఈలోగా ఒక బెంగాలీ బాబు వచ్చి బాలమురళితో అది తన బెర్తని, అక్కడి నుంచి లేవమని అన్నాడు. తానొక సంగీతకారుడిననీ, పేరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అనీ పరిచయం చేసుకోబోయారు. అయినా ఆ బెంగాలీబాబు పట్టించుకోలేదు. అయితే ఏమిటట (వాట్ ఇఫ్) అనేశాడు. మంగళంపల్లి చిన్నబుచ్చుకుని టీసీ వచ్చేవరకు ఆగకుండా బండి దిగి, మళ్ళీ హోటల్ కు వచ్చేసారు. తనవెంట వున్న మిత్రుడితో ఇలా అన్నారు- ‘చూడు కృష్ణారావు. మనల్ని కావాలని కోరుకునేవాళ్ళు ఎంతోమంది వున్నారని అనుకుంటాం. మన వెర్రి కాని అది పూర్తిగా నిజం కాదు. మన అసలు స్థాయి ఏమిటన్నది ఆ బెంగాలీ వాడు మనకు చెప్పాడు’ అన్నారు. ఆయన మాటల్లో బాధ లేదు. ఒక సత్యం బోధపడిన భావన కనిపించింది. - ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు -
పాట అయ్యాకే దోషం ఏమిటో చెప్పేవారు!
మంగళంపల్లి బాలమురళి చాలా ఏళ్లుగా నాకు సుపరిచితులు. దాదాపు 70 సంవత్సరాల అనుబంధం మాది. విజయవాడలో ప్రభుత్వ సంగీత కళాశాల 1960లో స్థాపించారు. ఆ సమయంలో నేను రేడియోలో పనిచేస్తున్నాను. నన్ను మ్యూజిక్ కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్‌గా చేరడానికి రమ్మన్నారు. వెంటనే ఆయనను క లిశాను. 1960 - 62 దాకా ఆయన ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆ రోజుల్లో ఆయన విద్యార్థులకు ఒక మంచి అలవాటు చేశారు. ప్రతివారు తరగతి గదిలోకి వెళ్లగానే తప్పనిసరిగా ‘నాద తనుమనిశం శంకరం’ కీర్తనను ప్రార్థనగా పాడాలనే నియమం పెట్టారు. అలాగే కళాశాల విద్యార్థులంతా ‘గురువుగారు’ అనే పిలవాలని నిర్దేశించారు. తరగతిలో మేం పాఠాలు చెబుతున్నప్పుడు ఆయన అటుగా నడుస్తూ వినేవారు. ఎప్పుడైనా మేం పాడటంలో ఏదైనా దోషం వస్తే, వెంటనే ఆయన ఏమీ చెప్పకుండా, ఒక చిన్న కాగితం తీసుకుని ‘పాఠం అయిపోయాక నా దగ్గరకు రండి’ అని చీటీ మా దగ్గర పెట్టి వెళ్లిపోయేవారు. మేం పాఠం పూర్తయ్యాక ఆయన దగ్గరకు వె ళితే, మేం చేసిన దోషాన్ని చాలా నెమ్మదిగా చెప్పేవారు. అంతటి సహృదయులు ఆయన. ఆ తరవాత మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రొడ్యూసర్‌గా వెళ్లిపోయారు. విజయవాడలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి ‘భక్తిరంజని’ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఆయన తన వెంట నన్ను కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కూడా తీసుకువెళ్లారు. దాదాపు 70 కచ్చీరీలకు ఆయనకు సహకార గానంలో పాల్గొన్నాను. ఆయనతో కలిసి ‘త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలు’, ‘ఉత్సవ సంప్రదాయ కీర్తనలు’ అని మొత్తం 30 సీడిలు చేశాం. మహా గాయకుడు ఆయన బార్న్ మ్యుజీషియన్. సంగీతంతో పుట్టారు. తొమ్మిదవ ఏటే 72 మేళకర్త రాగాలలో కీర్తనలు రాశారు. తరువాత ఎన్నో కృతులు చేశారు. సంగీతంలో ఆయనకి తెలియని ప్రక్రియ లేదు. శాస్త్రీయ సంగీతం, భక్తి సంగీతం, సినిమా సంగీతం, లలిత సంగీతం... అన్నిటిలోనూ ఆయనకు అభినివేశం ఉంది. వయొలిన్, వయోలా, మృదంగం, వీణ, కంజీరా... ఇన్ని వాద్యాలు వాయిస్తారు. ఆయనకు చెప్పరానంత మనోధర్మ సంగీతం ఉంది. ఎన్నో ప్రక్రియలు చేశారు. నిన్నమొన్నటి దాకా త్రిస్థాయిలు పలికించారు. చిరునవ్వు ఆయన సొంతం. కచ్చేరీలో అయినా, బయట అయినా ఆయన మోములో చిరునవ్వు చెరగదు. నవ్వుతూ పాడటం చాలా కష్టం. కానీ అది ఆయనకే చెల్లింది. ఆయన ఏది ముట్టుకున్నా ఆ విద్య ఆయనకు వస్తుంది. మహర్జాతకుడు. పక్కవాద్యం... ఆయన కచ్చేరీ చేసేటప్పుడు ఆయనకు ఎంత చిన్నస్థాయి వాళ్లు పక్కవాద్యం వాయించినా పాడేవారు. వాళ్లని ప్రోత్సహించేవారు. వారు నా స్థాయి వాళ్లు కాదు అనే మాట ఎన్నడూ అనలేదు. పెద్దపెద్ద వాళ్లు కూడా ఆయన పక్కన వాయించడానికి భయపడేవారు. మహామేధావి. గంభీరమైన గొంతు ఆయనది. కింద షడ్జమం కూడా అందుకునేవారు, అంతలోనే తారస్థాయి పాడతారు. మనసుతో తాళం వేసేవారు. ఆ లయ మనసులో పుట్టుకతో వచ్చింది. ప్రయాణాల్లో... ఆయన ప్రయాణాల్లో చాలా సరదాగా ఉండేవారు. నేను మొట్టమొదటిసారి ఆయనతోనే విమానం ఎక్కాను. ఒకసారి ‘రామవిలాస సభ’ బెంగ ళూరు వాళ్లు పెద్ద కచ్చేరీ పెట్టారు. దానికి నన్ను తీసుకువెళ్లారు. ఆ కచ్చేరీ నుంచి వచ్చేటప్పుడు ఆయనతో విమానంలో ప్రయాణించే అదృష్టం కలిగింది. నన్ను విమానం ఎక్కించిన ఘనత ఆయనది. బృహదీశ్వర మహాదేవ: ‘బృహదీశ్వర మహాదేవ...’ అనే కానడ రాగ కీర్తనకు పెద్ద కథ ఉంది. ఒకసారి వారితో కలిసి తమిళనాడులో కొన్ని ఊళ్లలో కచేరీలు చేసే సందర్భంలో, తంజావూరులో ఒక కచేరీకి వెళ్లవలసి వచ్చింది. అక్కడ బృహదీశ్వరాలయం ఉంది. అది చాలా పెద్ద దేవాలయం. నేను, బాలమురళిగారు ఆ ఆలయంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, ఆయనకు అప్పటికప్పుడు ఆశువుగా ఒక ఈ కీర్తన తట్టింది. వెంటనే బసకు వచ్చిన తరువాత, ‘ఆలయంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నాకు మంచి కీర్తన తట్టింది. నేను చెప్తాను, నువ్వు వెంటనే రాసేసై’ అన్నారు. ఆ కీర్తన అలా వచ్చింది. ప॥బృహదీశ్వర మహాదేవ బ్రోవుము మహాప్రభావ సహజ కారుణ్య ఈక్షణ సాధు సుజన సంరక్షణ చ॥మమతపాశముల తాళను శమనవైరి దయలేకను కమనీయ మురళీగాన సమ సంగీతము లేదను (సంభాషణ: పురాణపండ వైజయంతి) -
సంగీత చికిత్సతో...
సంగీత చికిత్స ద్వారా రాగాలతో రోగాలు తగ్గించడమనే ప్రక్రియ కోసం బాలమురళి ఎంతగానో శ్రమించారు. ఫలానా జబ్బుకు ఫలానా రాగంతో చికిత్స అని ఏమైనా కనిపెడితే, అది ప్రపంచంతో పంచుకోవచ్చని తపించారు. అందుకే మ్యూజిక్ థెరపీ మీద ప్రయోగాలు చేశారు. ‘‘అవసరం వస్తే, తెలిసినవాళ్ళు నన్ను అడిగితే, సంగీత చికిత్స చేస్తాను. అయితే, ఫలానా అస్వస్థతకు ఫలానా రాగం పాడాలంటూ సాధారణీకరించి చెప్పలేం. అది సదరు రోగిని బట్టి, ఆ వ్యక్తి శారీరక, మానసిక స్థితిని బట్టి మారిపోతుంటుంది. అంతేతప్ప, ఫలానా రోగ లక్షణం ఉన్నవాళ్ళందరికీ ఫలానా రాగం పనికొస్తుందని చెప్పలేం. అయినా, వ్యాధి తగ్గాలంటూ చూపే అనురాగాన్ని మించిన రాగం (సంగీతం) ఏముంటుంది’’ అని నవ్వుతూ అనేవారు. ‘భారతరత్న’ ఎప్పుడో ఇవ్వాల్సింది! ‘‘గంభీరమైన, అద్భుతమైన మంచి బేస్ వాయిస్ బాలమురళి గారిది. సంక్లిష్టమైన కర్ణాటక శాస్త్రీయ సంగీతం పాడేటప్పుడు స్వరస్థానాల్ని అందంగా రూపొందించి, అంతే అందంగా, జనరంజకంగా పాడడం ఆయనలోని గొప్పతనం. అందుకే, ఒకే కీర్తనను కొన్ని వందల మంది పాడినా, బాలమురళి పాటే విలక్షణంగా ఉంటుంది. సాహిత్యానికి విలువనిస్తూ, సంగీతాన్ని సమన్వయం చేస్తూ పాడే దిట్ట ఆయన. పి.వి. నరసింహారావు గారి పేరిట ‘నృసింహ ప్రియ’ అనీ అప్పటికప్పుడు కొత్త రాగాన్ని కనిపెట్టి, పాడిన స్రష్ట ఆయన. అంత శాస్త్రీయ సంగీత మేధావి అయినా, సినిమా పాట దగ్గరకు వచ్చేసరికి, సినిమాకు తగ్గట్లు మలుచుకొని అద్భుతంగా పాడడం చూస్తాం. ఆయన పాడిన కీర్తనలున్న ‘రాగసుధా రసం’ అనే క్యాసెట్‌ను ఏడో తరగతిలో ఉండగా మా నాన్న గారు తెచ్చి ఇస్తే, విని నేర్చుకున్నా. అలా నేను ఆయనకు ఏకలవ్య శిష్యుణ్ణి. పెద్దయ్యాక చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో తొలిసారిగా ఆయనను స్వయంగా కలసినప్పుడు ‘కమలదళాయతాక్షీ...’ అనే ఆయన కీర్తన చిన్నప్పుడు విన్నది పాడితే చాలా సంతో షించారు. నా సినిమా సంగీతంలోని పాటలన్నీ ఆయనకు పాడి, వినిపిస్తే మెచ్చుకు న్నారు. ఒక్కమాటలో ఆయన సంగీత గని. రాగనిధి. సరస్వతీ పుత్రుడు. సాక్షాత్తూ సరస్వతీ అంశ. అలాంటి ఆయన ‘భారతరత్న’కు ఎప్పుడో సంపూర్ణంగా అర్హులు. ఆ అవార్డెప్పుడో ఇవ్వాల్సింది. కానీ, రకరకాల రాజకీయాలు, బ్యూరోక్రసీ వల్ల ఇవ్వకపోవడం చాలా దారుణం, బాధా కరం. మనిషి మరణించాక కీర్తిస్తే ఏం లాభం? బతికున్నప్పుడు గౌరవించకుండా!’’ - కె.ఎం రాధాకృష్ణన్, ‘ఆనంద్, గోదావరి’చిత్రాల సంగీత దర్శకుడు-శాస్త్రీయసంగీతజ్ఞుడు త్యాగరాజస్వామి ప్రత్యక్ష శిష్యపరంపరలో నేను 5వ తరం వాణ్ణి... త్యాగరాజస్వామి, వారికి మానాంబుచావిడి (ఆకుమళ్ళ) వెంకట సుబ్బయ్య, ఆయనకు సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి, సుసర్లకు పారుపల్లి రామకృష్ణయ్య, ఆయనకు నేను... ఇలా! గానమే కాకుండా అనేక వాద్యాల మీద నాకు పట్టు మొదలైంది ద్వారం వయొలిన్ కచ్చేరీతో! ఆయన వాయిస్తుంటే విని విని, చూసి చూసి, చటుక్కున వయొలిన్ తీసి వాయించడం మొదలు పెట్టాను. తర్వాత వయోలా, మృదంగం, కంజీరా, వీణ ఇలా... చాలానే! నేను పాడిన తెలుగు సినిమా పాటల్లో నాకిష్టమైనవి... ‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు..’ (ఉయ్యాల - జంపాల), ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా...’ (గుప్పెడు మనసు), ‘పాడనా వాణి కల్యాణిగా...’ (మేఘసందేశం), ‘నర్తనశాల’లోని ‘సలలిత రాగ సుధారస సారం’ వగైరా! సంగీతానికి నేనిచ్చే నిర్వచనం... లైఫ్! సంగీతం అంటే ప్రాణం, జీవం. అదే మనిషి జీవితం. అంతేతప్ప, సంగీతం అంటే ఏవో నాలుగైదు కీర్తనలు పాడడం కాదు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొనే మాటల్లో కూడా సంగీతం ఉంటుంది. ఆ సంగీతం సరిగ్గా కుదరకపోతే, ఒకరు మాట్లాడేది మరొకరికి అర్థం కాదు. ఆ సంగీతం సమశ్రుతిలో ఉంటే, అదే బ్రహ్మానందం! - ‘సాక్షి’తో మంగళంపల్లి బాలమురళీకృష్ణ -
సినీ మధు మురళి
స్వర సంగీత సార్వభౌముడైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ అనగానే శాస్త్రీయ సంగీత విద్వాంసులే గుర్తుకువస్తారు. కానీ, ఆయనకూ, సినీ రంగానికీ విశేష అనుబంధం ఉంది. తెలుగు, తమిళ, కొన్ని సినిమాల్లో ఆయన నటించారనీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళాల్లో కొన్ని పదుల సినిమా పాటలు పాడారనీ అంటే ఈ తరానికి ఆశ్చర్యం కలిగించవచ్చు. తొలి సినిమా... తొలి పాట... మంగళంపల్లి పాతికేళ్ళ వయసుకే శాస్త్రీయ, లలిత, రేడియో సంగీతాల్లో శిఖరసమా నుడయ్యారు. ఆ పరిస్థితుల్లో శ్రీరాజరాజేశ్వరీ ఫిలిమ్స్‌వారు ‘సతీ సావిత్రి’ (1957) సినిమా తీస్తూ, అందులో పాడాల్సిందిగా ఒత్తిడి చేయడంతో, తొలిసారిగా సినీ నేపథ్య గాయకుడి అవతారం ఎత్తారు. అప్పటికి ఆయన మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగి. అక్కినేని హీరో అయిన ఆ చిత్రంలో కథానాయిక ఆ తరం సినీ నటి, గాయని ఎస్. వరలక్ష్మి. ఆమె బాలమురళీకృష్ణ శిష్యురాలే. దాంతో, శిష్యురాలి కోసం ఆయన ఆ చిత్రంలో ‘తులసీవనములకేగ’ మొదలైన పద్యాలు, పాటలు పాడారు. ‘నర్తనశాల’ చిత్రంలో బృహన్నల పాత్రధారి అయిన ఎన్టీయార్‌కు బాలమురళి (బెంగుళూరు లతతో కలసి) పాడిన ‘సలలిత రాగ సుధా రససారం..’ పాట ఇవాళ్టికీ సంగీత రసికుల హృదయాల్ని ఆనందంలో ఓలలాడిస్తుంది. ఆ తరువాత ఎన్టీయార్ ‘శ్రీమద్విరాట పర్వము’లో మళ్ళీ బృహన్నల పాత్రకు వచ్చే పాటలు (‘ఆడవే హంస గమన...’, ‘జీవితమే కృష్ణ సంగీతము’) పట్టుబట్టి మరీ బాలమురళీకృష్ణతోనే పాడించారు. ‘స్వాతి తిరునాళ్’ అనే మలయాళ చిత్రంలో ఆయన పాడిన హిందీ భజన గీతం సుప్రసిద్ధమైంది. దాంతో, ఆయనకు కేరళ ప్రభుత్వం ఉత్తమ గాయకుడిగా అవార్డు కూడా ప్రదానం చేసింది. మలయాళంలో హీరో! ఆ తరువాత బెంగాలీలో ఉత్పలేందు చక్రవర్తి దర్శకత్వంలోని ‘చచందనిర్’లో కాసేపు తెరపై ఆయన కనిపించారు. ఓ సంగీత విద్వాంసుడి జీవితం చుట్టూ తిరిగే కథగా మలయాళంలో రూపొందిన ‘సంధ్య కెందిన సింధూరం’ చిత్రంలో ఆ కథానాయక పాత్ర చేశారు. ‘‘అంటే.. అందులో నేనే హీరో అన్న మాట! ఇన్ని చేసినా, అన్నీ హీరోయిన్ లేని పాత్రలే. 80 ఏళ్ళ పైబడిన ఈ వయసులో కూడా నేను అంత పెద్దవాడిలా కనిపించను. అందుకే, ఇప్పటికీ హీరోయిన్ ఉన్న పాత్ర ఎవరైనా ఇస్తారేమోనని ఎదురుచూస్తున్నా’’ అని ‘సాక్షి ఫ్యామిలీ’తో గతంలో ఆయన నవ్వుతూ అన్నారు. ఆణిముత్యాల లాంటి సినీ బాణీలు ఎన్నో శాస్త్రీయ స్వరరచనలు చేసిన బాలమురళి సినీ స్వర రచనల్లోనూ తన బాణీ పలికించారు. జి.వి. అయ్యర్ దర్శకత్వంలోని కన్నడ చిత్రం ‘హంస గీతె’ (1975)తో ఆయన తొలిసారిగా సినీ సంగీత దర్శకుడి అవతారమెత్తారు. సంస్కృత భాషలో తొలి చలనచిత్రమైన జి.వి. అయ్యర్ ‘ఆది శంకరాచార్య’కు కూడా స్వరకర్త - బాలమురళీకృష్ణే. ఆ తరువాత కన్నడంలో వచ్చిన ‘మధ్వాచార్య’కు, తమిళంలోని ‘రామానుజాచార్య’, సంస్కృతంలోని ‘భగవద్గీత’ కు ఆయనే సంగీత దర్శకులు. ‘మధ్వాచార్య’ చిత్రం కోసం అప్పట్లో బాలమురళి కేవలం ఆరు వాద్యాల్ని మించి ఉపయోగించకపోవడం విశేషం. నేషనల్ బెస్ట్ సింగర్ బెస్ట్ మ్యూజిక్ డెరైక్టర్ విశేషం ఏమిటంటే, ఈ ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు సినిమాల్లో కూడా ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ స్థాయిలో అవార్డులు అందు కోవడం! ‘హంసగీతె’కు ఉత్తమ నేపథ్య గాయకుడిగా, కన్నడ ‘మధ్వాచార్య’ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ అవా ర్డులు ఆయన సొంతమయ్యాయి. తెలుగులో ఒక్క సినిమానే! తెలుగు చిత్రసీమ స్వరకర్తగా బాలమురళి ప్రతిభను వినియోగిం చుకోలేకపోయింది. తెలుగులో అక్కినేని కుటుంబరావు దర్శకత్వంలో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మించిన ‘తోడు’ (1997) చిత్రా నికి ఒక్క దానికే ఆయన స్వరాలు అందించారు. ఆ సినిమాలో బాలమురళి తన సంప్రదాయశైలికి భిన్నంగా స్వరాలు సమకూర్చారు. ఆ సినిమా ఉత్తమ తృతీయ చిత్రంగా కాంస్య నంది పురస్కారం గెలుచుకుంది. చాలా మంచి పాటలున్న ఈ సినిమా ద్వారా గాయని ఎస్. జానకికి ఉత్తమ గాయనిగా నంది అవార్డు కూడా వచ్చింది. అంతకు ముందు కానీ, ఆ తరువాత కానీ ఎవరూ అడగక పోవడంతో బాలమురళి తెలుగు సినిమాల్లో మ్యూజిక్ డెరైక్షన్ చేయలేదు. వెండితెర నారదుడు! సినీ నేపథ్యగానంతో మొదలుపెట్టిన బాలమురళి తరువాత కెమేరా ముందుకొచ్చి నటించారు. ఏ.వి.ఎం. వారి ‘భక్త ప్రహ్లాద’ (1967)లో ఆయన పోషించిన నారద మహర్షి పాత్ర చాలా పాపులర్. ఆ సినిమాలో నారద పాత్రకు వచ్చే ‘ఆది అనాదియు నీవే దేవా’, ‘వరమొసగే వనమాలి’ పాటలు ఆయనే పాడుకున్నారు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నారద పాత్ర పోషించారు. తరచూ ఆ పాత్రే వస్తుండడంతో విసుగొచ్చి, నటనకు బ్రేక్ చెప్పారు. మిస్సయిన ‘శంకరాభరణం’ నిజానికి, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన సంగీత కథాచిత్రం ‘శంకరాభరణం’కి కూడా మొదట బాలమురళీకృష్ణతోనే పాటలు పాడించాలనుకున్నారట దర్శక - నిర్మాతలు. సరిగ్గా అదే సమయంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళారు. అది రెండు నెలల పర్యటన కావడంతో, దర్శక - నిర్మాతలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటలు పాడించారు. ఆ రకంగా శాస్త్రీయ సంగీత విద్వాంసుడి జీవితకథగా నడిచే ‘శంకరాభరణం’ పాటలు బాలమురళి మిస్సయ్యారు. ఎస్పీ బాలు సాధన చేసి మరీ ఆ పాటలు పాడి, అజరామరమైన కీర్తి సంపాదించారు. బాలమురళి సినీ గాన రవళి బాలమురళి గానం చేసిన తెలుగు సినీగీతాలెన్నో జనాదరణ పొందాయి. ఆయన పాడిన పాటల నుంచి మచ్చుకు కొన్ని... ‘సతీసావిత్రి’ (1957)- ‘విలాసాల కోవెల, వినోదాల నావలె...’ పాట (ఎస్. వరలక్ష్మితో కలసి) ‘జయభేరి’ (1959)- ‘శుక్లాంబరధరం విష్ణుం...’ పద్యం ‘స్వర్ణగౌరి’ (1962)- ‘జయజయ నారాయణ’ పాట ‘నర్తనశాల’ (1963)- ‘సలలిత రాగ సుధారససారం...’ ‘కర్ణ’(1963)- ‘‘నీవు నేను వలచితిమి...’ (పి. సుశీలతో కలసి) ‘భక్త రామదాసు’ (1964)- కబీరు గీతాలు ‘ఉయ్యాల - జంపాల’ (1965)- ‘ఏటిలోని కెరటాలు...’ ‘పల్నాటియుద్ధం’(’66)-‘శీలముగలవారి చినవాడా’(పి. సుశీలతో) ‘భక్త ప్రహ్లాద’ (1967)- ‘సిరి సిరి లాలి’ (ఎస్. జానకితో), ‘నమో నారసింహ’ (పి. సుశీలతో కలసి) ‘వీరాంజనేయ’(’68)- ‘నవరాగమె సాగేనులే’(పి.బి. శ్రీనివాస్‌తో) ‘అందాల రాముడు’ (1973).... ‘పలుకే బంగారమాయెనా...’ ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ (1975)... ‘మేలుకో శ్రీరామా మేలుకో రఘురామా’ (పి.లీల తదితరులతో కలసి) టి.టి.డి. వారి డాక్యుమెంటరీ ‘శ్రీవేంకటేశ్వర వైభవం’(1977)... ‘తెర తీయరా తిరుపతి దేవరా’ ‘గుప్పెడు మనసు’ (1979)... ‘మౌనమె నీ భాష...’ ‘మేఘసందేశం’ (1982)... ‘పాడనా వాణి కల్యాణిగా..’ ‘ప్రియమైన శ్రీవారు’ (1997)... ‘జాతకాలు కలిసేవేళ’ - రెంటాల -
బాధ తొలగిపోయింది: గులాంఅలీ
♦ కోల్‌కతాలో పాక్ గాయకుడి కచేరీ ♦ సంగీతానికి ఎల్లల్లేవు: మమత కోల్‌కతా: పాకిస్తానీ గజల్ గాయకుడు గులాం అలీ మంగళవారం కోల్‌కతాలో కచేరీ నిర్వహించారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కచేరీకి వేలాది మంది హాజరయ్యారు. ‘నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది. అప్పుడప్పుడూ కోల్‌కతాకు వస్తుండేవాడిని. కానీ.. ఈ ఏడాది మాత్రం 50 ఏళ్ల తర్వాత వచ్చినట్లు అనిపిస్తోంది. నాకు చాలా బాధగా ఉండేది.. కానీ ఇప్పుడా బాధ తొలగిపోయింది’ అని ఆయన అన్నారు. తాను ప్రపంచమంతటా కచేరీలు నిర్వహిస్తుంటాని, ఎక్కడ ఎక్కువ సంతోషంగా ఉంటుందని అడిగితే ఎప్పుడూ కోల్‌కతానే అని చెప్తానన్నారు. ప్రజాభిమానం గల తన ‘చుప్కే చుప్కే రాత్ దిన్, హంగామా హై క్యో బార్పా...’ పాటలను ఆయన పాడినపుడు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. గులాంఅలీని సంగీత సామ్రాట్ అని కీర్తిస్తూ.. సంగీతానికి సరిహద్దులు ఉండవని ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఆడిటోరియం సామర్థ్యం 12,000 మందే కావటంతో కచేరీకి అందరికీ చోటుదక్కలేదన్నారు. అలీ మన మధ్య.. అద్భుతం: మహేశ్‌భట్ ప్రస్తుతం 75 ఏళ్ల వయసున్న పటియాలా ఘరానా గాయకుడు గులాం అలీ వాస్తవానికి గత ఏడాది అక్టోబర్‌లో ముంబైలో ఆయన కచేరీని ఏర్పాటు చేసినప్పటికీ.. దానిని అడ్డుకుంటామని శివసేన హెచ్చరించటంతో ఆ కార్యక్రమం రద్దయింది. పాక్ నుంచి భారత్‌పై జరుగుతున్న ఉగ్రవాదం నిలిచిపోయే వరకూ.. ఆ దేశానికి చెందిన ఏ కళాకారుడినీ ముంబైలో ప్రదర్శన ఇవ్వబోమని అప్పుడు శివసేన హెచ్చరించింది. తాజాగా బెంగాల్ ప్రభుత్వం కోల్‌కతాలో అలీ కచేరీని నిర్వహించింది. స్వామి వివేకానంద 153వ జయంతి రోజున యాదృచ్ఛికంగా నిర్వహించిన ఈ కచేరీని.. చిన్న, మధ్య తరహా పరిశ్రమల వాణిజ్య ప్రదర్శన ‘మిలన్ ఉత్సవ్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేశారు. అలీ తమ మధ్య ఉండటం ఒక అద్భుతం వంటిదని ప్రేక్షకుల్లో ఉన్న బాలీవుడ్ సినీనిర్మాత మహేశ్‌భట్ అభివర్ణిస్తూ.. అందుకు మమతకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కొన్ని నెలల కిందట ముంబైలో సృష్టించిన వాతావరణం చూసి మేం ఆశలు వదులుకున్నాం’ అని భట్ వ్యాఖ్యానించారు. త్రిపుర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు అగర్తల: గులాంఅలీ కోల్‌కతా కచేరీపై త్రిపుర గవర్నర్ తథాగతరాయ్ మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కోల్‌కతాలో పాకీ గాయకుడు గులాం అలీ. పాకీల చేతుల్లో బెంగాలీలు బాధపడ్డంతగా మరెవరూ బాధపడలేదు. బెంగాలీలు మరచిపోయారు’ అని ట్విటర్లో వ్యాఖ్యానించారు. గవర్నర్ పదవి చేపట్టకముందు బీజేపీ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన రాయ్.. ‘1950 ఫిబ్రవరి 12న అశోగంజ్ (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది) వద్ద మేఘ్నా బ్రిడ్జిని దాటుతున్న అన్ని రైళ్లనూ ఆపివేశారు.. హిందువులందరినీ పొడిచి నదిలో విసిరివేశారు’ అని మరో ట్వీట్ చేశారు. -
అలరించిన సంగీత విభావరి
సాక్షి, సిటీ బ్యూరో: స్వరాంజలి సాంస్కృతిక సంస్థ ఆధ్వ ర్యంలో కేవీ మహదేవన్ స్వరాల తో నిర్వహించిన ‘ఝుమ్మంది నాదం’ సంగీత విభావరి ఆధ్యంతం ఆహూతులను అలరించింది. చిక్కడపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ టంపెట్ వాయిద్య కళాకారులు జీవన్ థామస్‌ను సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంగీత దర ్శకులు సాలూరి వాసురావు మాట్లాడుతూ పాడాలనే తపన ఉన్న ఎంతో మంది గాయనీగాయకులను ప్రోత్సహిస్తున్న స్వరాంజలి సంస్థ సేవలు అభినందనీయమన్నారు. అనంతరం సన్మాన గ్రహీత జీవన్ థామస్ మాట్లాడుతూ పాట వెనకాల ఉన్న వాయిద్య కూర్పుని గుర్తించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరెందరో కళాకారులను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో సినీ సంగీత దర్శకులు జోస్యభట్ల, గాయకులు గజల్ శ్రీనివాస్, రచయిత మదన్మోహన్, సంస్థ అధ్యక్షులు కవితా చక్ర, ప్రదాన కార్యదర్శి సుధారాణి చల్లా, పలువురు గాయనీగాయకులు పాల్గొన్నారు. -
స్వరాలకు నేనే దాసోహమయ్యాను
మనిషిని కదిలించి, కరిగించే మహత్తర శక్తి సంగీతానిది. ఆనందం... ఆవేశం... వినోదం... విషాదం... సమయం, సందర్భం ఏదైనా, దానికి గళమిచ్చేది సంగీతం. బలమిచ్చేది సంగీతం. అందుకే, పాట లేని ప్రపంచాన్ని ఊహించలేం. ఏడు రథాల తేరుపై పయనంలో మనిషి ఎలుగెత్తిన గొంతుకను శాశ్వతం చేసే సంగీతానికి ఇవాళ పండుగ రోజు. ఈ ‘ప్రపంచ సంగీత దినోత్సవం’ సందర్భంగా కొందరు స్వరసారథులు, గళ వారధుల మనసులోని మాటలు... పాటలు... ఇవాళ్టి ‘సాక్షి’ స్పెషల్ ఎమ్మెస్ విశ్వనాథన్ నచ్చిన రాగం: స.. రి.. గ.. మ.. ప.. ద.. ని.. స.. ఇష్టమైన వాద్యాలు: హార్మోనియం, పియానో ఫేవరెట్ సింగర్స్: పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పీబీ శ్రీనివాస్, టీఎమ్ సౌందరరాజన్, కేజే ఏసుదాస్, ఎల్.ఆర్. ఈశ్వరి సంగీతం గురించి: ‘‘స్వరాలు నాకు ఎప్పుడూ లోబడలేదు. నేనే వాటికి దాసోహమయ్యాను. సంగీతం దేవుడి భాష. దానికి తెలుగు, తమిళం, మలయాళం అనే భేదాలుండవు. బాణీలు ఎక్కడైనా అవే. దానికి మనం రాసుకునే సాహిత్యం ఉంటుంది కదా. అప్పుడు కలుగుతుంది భాషా భేదం.’’ ఎప్పటికైనా కచ్చేరీ చేస్తాను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఫేవరెట్ సింగర్స్: ఎస్. జానకి, ఏసుదాస్, మహమ్మద్ రఫీ, సోనూ నిగమ్ ఇష్టమైన రాగం: యమన్ ఆశయం: నేను కర్ణాటక సంగీత కచ్చేరీ చేస్తే వినాలని మా నాన్నగారు ఎంతో ఆశపడ్డారు. ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయారాయన. ఎప్పటికైనా కచ్చేరీ చేయాలనేది నా ఆశ, ఆశయం. సంగీతమంటే?: దేవుడు ఏదైనా చేయగలడు. అలాగే సంగీతం ఏదైనా చేయగలదు. ప్రతి రోజూ మ్యూజిక్ డేనే! ఎల్.ఆర్. ఈశ్వరి ‘‘వరల్డ్ మ్యూజిక్ డేనా?... సంగీతానికి ఒక్కరోజు కేటాయించడమేంటి? అసలు ఈ ప్రపంచం, కాలం, మనం.. అంతా సంగీతంతోనే కదా మమేకమైపోయి ఉన్నాం. సంగీతం గురించి ఒక్కరోజు ఏంటి? ఎన్ని రోజులైనా మాట్లాడాలి. అసలు మన ప్రాణం, ప్రయాణం అంతా సంగీతంతోనే ముడిపడి ఉంది. అమ్మ పాడే లాలిపాటతో మొదలైన మన జీవితం చివరి క్షణం వరకూ సంగీతంతోనే ముడిపడి ఉంటుంది. అసలు సంగీతం లేని జీవితం ఉంటుందా? పాట పాడితేనే కాదు.. మన మాట కూడా సంగీతమే. మనం చేసే ఏ శబ్దంలోనైనా సంగీతాన్ని చూస్తాను. సంగీతంతో నా జీవితం అంతగా మమేకమైపోయింది. ఏ పాట పాడినా మధురానుభూతికి లోనవుతుంటా. మనం పాడే పాటలు ఇతరుల కోసం అని నేననుకోను. పాడటంలో ముందు నేను ఆనందం పొందుతాను. ఆ తర్వాత శ్రోతలు ఆనందపడతారు.’’ రఫీ కలెక్షన్ మొత్తం ఉంది ఎస్.పి. శైలజ ఫేవరెట్ సింగర్: మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ సింగర్ మహ్మద్ రఫీ. ఆ తర్వాత పి.సుశీల, ఎస్.జానకి అంటే ఇష్టం. నా దగ్గర రఫీ కలెక్షన్ మొత్తం ఉంది. సంగీత దర్శకత్వం: సంగీతమే నాకు సరిగ్గా రాదు. ఇక సంగీత దర్శకత్వం ఎక్కడ చేస్తాను? సింగర్‌గా: సినిమాలకు పాడటం తగ్గిపోయింది. బాపుగారు డెరైక్ట్ చేసిన ‘సుందరకాండ’ తర్వాత నేను మళ్లీ సినిమా పాట పాడలేదు. అన్నీ ప్రైవేట్ ఆల్బమ్స్ సాంగ్సే. టీవీ షోస్, ఫారిన్ ట్రిప్స్ కామనే.