
ఇంగ్లండ్‌లో భారీ పేలుడు.. 19 మంది మృతి
మాంచెస్టర్: ఇంగ్లాండ్ పారిశ్రామిక నగరం మాంచెస్టర్‌లో భారీ పేలుడు సంభవించింది. అమెరికన్ పాప్ సింగర్ అరియానా గ్రాండే నిర్వహిస్తున్న సంగీత కచేరీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నఈ ఘటనలో 19 మంది మృతిచెందగా.. 50 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10: 35 గంటలకు పేలుడు సంభవించినట్లు గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఖాళీ చేయించిన అధికారులు.. సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘటనను ఉగ్రవాదుల చర్యగా అనుమానిస్తున్నారు. పాప్ సింగర్ అరియానా క్షేమంగా ఉన్నారని ఆమె ప్రతినిధి వెల్లడించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.