Ariana Grande
-
క్రిస్మస్ రోజే ట్విటర్ ఖాతా తొలగించిన అరియానా.. ఫ్యాన్స్ షాక్ !
Ariana Grande Deletes The Twitter Account On Christmas: హాలీవుడ్ పాప్ సింగర్ అరియానా గ్రాండె తన పాటలు, నటనతో ఎంతో పేరు తెచ్చుకుంది. 2013-2014 మధ్యలో వచ్చిన 'సామ్ అండ్ క్యాట్' టీవీ షోతో మరింత పాపులర్ అయింది అరియానా. అలాగే 'ది వాయిస్' సీజన్‌కు న్యాయనిర్ణేతగా కూడా కనిపించి అలరించింది. సోషల్ మీడియా పుణ్యమా అని అరియానా గ్రాండె పేరు ఈ సంవత్సరం ఎక్కువగా వినిపించింది. ఈ ఏడాది మేలో లాస్ ఏంజెల్స్ లగ్జరీ రియల్టర్ డాల్టన్ గోమెజ్‌ను సీక్రెట్‌గా వివాహం చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చిన అరియానా తాజాగా మరోసారి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా శుక్రవారం (డిసెంబర్ 25) క్రిస్మస్ సంబురాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలందరూ తమ ఫొటోలను, క్రిస్మస్ వేడుకలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో క్రిస్మస్ రోజు తన ట్విటర్ ఖాతా తొలగించి అభిమానులను ఆశ్చర్యపరిచింది అరియానా. ఎలాంటి సమాచారం లేకుండా తన అకౌంట్ డిలీట్ చేయడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఇంతకీ ఏమైందా అని ఆరా తీశారు అరియానా ఫ్యాన్స్. అరియానా సైబర్ వేదింపులకు గురయి ఉంటుందని, అందుకే డిలీట్ చేసిందని కొందరు భావిస్తున్నారు. లేదా తన కొత్త ప్రాజెక్ట్ ప్రకటనతో వచ్చేందుకు ఇలా చేసిందా అని తికమక పడుతున్నారు. ఆమె మీద ట్రోలర్స్ ప్రభావం పడిందేమోనని, వారివల్లే ఖాతా తొలగించిందేమో అని ఆరోపిస్తున్నారు. ఆమె మళ్లీ ట్విటర్‌లోకి రావాలని అరియానా ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. View this post on Instagram A post shared by Ariana Grande (@arianagrande) బ్యాంగ్ బ్యాంగ్, బ్రేక్ ఫ్రీ, సైట్ టు సైడ్ వంటి హిట్ సాంగ్స్ పాడిన అరియానా గ్రాండె ఇన్‌స్టా గ్రామ్‌లో మాత్రం యాక్టివ్‌గా ఉంది. తన తాజా నెట్‌ఫ్లిక్స్ చిత్రం డోంట్ లుక్ అప్ ప్రచార చిత్రాలను షేర్ చేసింది. దానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చేస్తుంది. అంతేకాకుండా ఇన్‌స్టా వేదికగా అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం విశేషం. మెర్రీ.. బీ సేఫ్, ఐ లవ్ యూ అని స్టోరీ షేర్ చేసింది ఈ బ్యూటీఫుల్ సింగర్. ఇదీ చదవండి: తన నివాసంలో ప్రియుడిని పెళ్లాడిన పాప్ సింగర్ -
అభిమానులకు అండగా పాప్ సింగర్
వాషింగ్టన్ : అమెరికన్ పాప్ సింగర్ అరియానా గ్రాండే తన అభిమానులకు అండగా నిలిచారు. కరోనా వైరస్ కారణంగా పలు దేశాల్లో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి వీలు లేకపోవడంతో అనేక మంది తమ ఉపాధిని కోల్పోయారు. ఈ క్రమంలో ఉపాధి కోల్పోయిన తన అభిమానులకు సాయం చేయడానికి అరియానా ముందుకు వచ్చారు. కష్ట సమయంలో అభిమానులకు ఆర్థిక సహాయం చేసి ఉదారభావాన్ని చాటుకున్నారు. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా మలుచుకున్నారు. ఇంట్లో అవసరాలకు డబ్బులు లేకపోవడం, ఇంటి అద్దె చెల్లించలేకపోవడం వంటి కారణాలతో వారు ఆమెను సహాయం చేయాల్సిందిగా కోరారు. (అమెరికాపై కరోనా వైరస్ ప్రతాపం) ఈ మేరకు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారు సోషల్ మీడియా ద్వారా ఆమెను అభ్యర్థించారు. దీంతో మనసు చెలించిన గ్రాండే అభిమానుల నుంచి వచ్చిన అభ్యర్థనల్లో 10 కారణాలను ఎంచుకొని డ్రా ఆధారంగా కొంతమందికి నగదు పంపించారు. దాదాపు 500 వందల డాలర్ల నుంచి 1500 డాలర్ల వరకు అభిమానులకు వెన్మో ద్వారా విరాళం అందించారు. ఆ డబ్బులు తమకు అందినట్లు అభిమానులు వెల్లడించారు. అలాగే గత కొన్ని రోజులుగా ఆమె ఇలా తమకు డబ్బులు పంపిస్తున్నట్లు వారు తెలిపారు. ఇక ఈ విషయంపై అరియానా మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సహాయం చేశానని, తన లాగే ఇతరులు కూడా వారిని ఆదుకోవాలని ట్విటర్ ద్వారా సూచించారు. -
పేలుడు పదార్థాలను ఒక్కడే సీక్రెట్‌గా కొని..!
మాంచెస్టర్/లండన్: పాప్ స్టార్ అరియానా గ్రాండే మ్యూజిక్ కన్సర్ట్పై జరిగిన ఆత్మాహుతి దాడి కేసులో మాంచెస్టర్ నగర పోలీసులు ఇప్పటికే 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆత్మాహుడి దాడికి పాల్పడిన వ్యక్తిని లిబియా సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు సల్మాన్ అబేదిగా పోలీసులు ఇదివరకే గుర్తించారు. అయితే నిందితుడు బాంబు పేల్చడానికి కావలసిన సామాగ్రిని తానొక్కడే కొనుగోలు చేశాడని నార్త్ వెస్ట్ కౌంటర్ టెర్రరిస్టు విభాగం చీఫ్ రస్ జాక్సన్ మీడియాకు తెలిపారు. వారం రోజుల కిందట మాంచెస్టర్‌లో చోటుచేసుకున్న ఈ మారణకాండలో చిన్నారులు సహా 22 మంది మృతిచెందగా, 116 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడే నాలుగు రోజుల ముందే మాంచెస్టర్‌లో సల్మాన్ అబేది అడుగుపెట్టాడు. ఈ సమయంలో పేలుడు పదార్థాలను పలు ఏరియాలలో తిరిగి ఎవరికీ అనుమానం రాకుండా కొనుగోలు చేసి ప్లాన్ ప్రకారమే మారణహోమం సృష్టించాడని జాక్సన్ వెల్లడించారు. దాడికి ముందు అతడు ఎవరెవరికీ ఫోన్ చేశాడు.. ఏ విషయాలపై చర్చించాడన్న దానిపై బ్రిటన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్లూ సూట్‌కేసులో బాంబుతో సహా మ్యూజిక్ కన్సర్ట్ ప్రాంతానికి వచ్చి పేల్చేసుకున్నాడని చెబుతున్నారు. దాడి జరిగిన మాంచెస్టర్ ఎరీనా హాలు యూరప్‌లోనే అతి పెద్దదని, భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించాలన్న లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు. గడాఫీ నియంత పాలన నుంచి తప్పించుకునేందుకు అబేది కుటుంబం బ్రిటన్‌కు వలసవచ్చింది. ఉగ్రదాడి కోసం అబేది లండన్ నుంచి మాంచెస్టర్‌కు నాలుగు రోజుల ముందుగానే రైల్లో వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మాంచెస్టర్‌లోని అబేది ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రస్ జాక్సన్ పేర్కొన్నారు. దాడి చేసిన రోజే ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ప్రకటించగా.. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
ఆ దుర్మార్గుడి తండ్రి, సోదరుడు అరెస్టు!
ట్రిపోలి: మాంచెస్టర్ మారణహోమంపై బ్రిటన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాంచెస్టర్‌లో జరిగిన సంగీత కచేరిపై విరుచుకుపడి.. 22మందిని పొట్టనబెట్టుకున్న సూసైడ్ బాంబర్ సల్మాన్ అబేది తండ్రిని, సోదరుడిని పోలీసులు లిబియాలో అరెస్టుచేశారు. ట్రిపోలిలోని అయిన్జరా ప్రాంతంలో బుధవారం సల్మాన్ తండ్రి రమదాన్ అబేదిని అతని ఇంటిబయట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా సల్మాన్ సోదరుడు హషీం అబేదిని కూడా అరెస్టు చేశారు. ఉగ్రవాద నిరోధక బృందం ‘రదా’ వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నది. హషీం అబేదికి కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతడు సోదరుడు సల్మాన్‌తో పలుసార్లు సంప్రదింపులు జరిపాడని, లిబియా రాజధాని ట్రిపోలిలో ఉగ్రవాద దాడులు జరపాలని అతను పథకం రచించినట్టు తెలుస్తున్నదని చెప్పారు. పాప్ సింగర్ అరియానా గ్రాండే సోమవారం మాంచెస్టర్‌లో సంగీత కచేరి నిర్వహిస్తుండగా ఉగ్రవాది సల్మాన్ అబేదీ అమర్చిన బాంబులు పేలి 22 మంది మరణించడం తెలిసిందే. మంగళవారం అరెస్టైన ఇస్మాయిల్ అబేదీ, ఉగ్రవాది సల్మాన్ అబేదీకి అన్న అని పోలీసులు నిర్ధారించారు. సల్మాన్, ఇస్మాయిల్‌ల తల్లిదండ్రులది లిబియా కాగా వీరు బ్రిటన్‌లోనే పుట్టి పెరిగారు. -
‘మాంచెస్టర్’లో నలుగురి అరెస్ట్
-
‘మాంచెస్టర్’లో నలుగురి అరెస్ట్
► మారణహోమం ఘటనలో 119కి పెరిగిన క్షతగాత్రులు ► మరిన్ని దాడులు జరగొచ్చని నిఘా వర్గాల అనుమానం లండన్: మాంచెస్టర్ మారణహోమం కేసులో మరో నలుగురిని బ్రిటన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి మొత్తం సంఖ్య ఐదుకు చేరింది. పాప్ సింగర్ అరియానా గ్రాండే సోమవారం మాంచెస్టర్‌లో సంగీత విభావరి నిర్వహిస్తుండగా సల్మాన్ అబేదీ అనే 22 ఏళ్ల ఉగ్రవాది అమర్చిన బాంబులు పేలి 22 మంది మరణించడం తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన వారి సంఖ్య 59 నుంచి 119కి పెరిగింది. బుధవారం దక్షిణ మాంచెస్టర్‌లో ముగ్గురినీ, అక్కడికి దగ్గర్లోనే మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం అరెస్టైన ఇస్మాయిల్ అబేదీ, ఉగ్రవాది సల్మాన్ అబేదీకి అన్న అని పోలీసులు నిర్ధారించారు. సల్మాన్, ఇస్మాయిల్‌ల తల్లిదండ్రులది లిబియా కాగా వీరు బ్రిటన్‌లోనే పుట్టి పెరిగారు. ఇటీవల పలుసార్లు లిబియా, సిరియాలకు వెళ్లి వచ్చాక ఉగ్రవాదులుగా మారారని బ్రిటన్ అధికారులు తెలిపారు. దాడి అనంతరం సల్మాన్ సిరియాకు వెళ్లిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మాంచెస్టర్ పేలుళ్లతో పలువురు ఇతరులకు కూడా సంబంధం ఉందనీ, సల్మాన్ ఒక్కడే ఈ దాడి చేసి ఉండడని పోలీసులు, బ్రిటన్ హోంమంత్రి చెప్పారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, బ్రిటన్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా సమాచారం రావడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. -
మాంచెస్టర్‌లో మారణహోమం
-
మారణహోమం
⇒ మాంచెస్టర్‌లోని మ్యూజిక్ కన్సర్ట్పై ఆత్మాహుతి దాడి ⇒ 22 మంది మృత్యువాత, 59 మందికి తీవ్ర గాయాలు ⇒ దుండగుడు సల్మాన్ అబేదీగా గుర్తింపు ⇒ మాదే బాధ్యత అని ప్రకటించుకున్న ఐసిస్ ⇒ మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరిక ⇒ ఇది వికృతమైన ఉగ్ర దాడి: థెరిసామే ⇒ ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన బ్రిటన్ పోలీసులు ⇒ మనవాళ్లు క్షేమం.. ‘హెల్ప్ లైన్లు’ ఏర్పాటు ⇒ దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు జోరుగా.. హుషారుగా సాగిన మ్యూజిక్ కన్సర్ట్.. యువతీయువకుల కేరింతలు, పాప్ స్టార్ అరియానా గ్రాండేతో కలసి చిన్నారుల స్టెప్పులు.. మ్యూజిక్ కన్సర్ట్ ముగుస్తుందనగా ఒక్కసారిగా భారీ పేలుడు.. రక్తపుమడుగులో మృతదేహాలు.. ప్రాణభయంతో జనం పరుగులు.. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో సోమవారం రాత్రి ఓ దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడినప్పటి దృశ్యాలివీ. మ్యూజిక్ కన్సర్ట్పై ఆత్మాహుతి దాడి మాంచెస్టర్/లండన్: జోరుగా.. హుషారుగా సాగిన మ్యూజిక్ కన్సర్ట్.. యువతీయువకుల కేరింతలు, తుళ్లింతలతో హంగామా.. పాప్ స్టార్ అరియానా గ్రాండేతో కలసి చిందులేసిన చిన్నారులు.. మ్యూజిక్ కన్సర్ట్ మరికాసేపట్లో ముగుస్తుందనగా అలజడి.. ఒక్కసారిగా భారీ తీవ్రతతో పేలుడు.. రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాలు.. తీవ్ర గాయాలతో నెత్తురోడిన క్షతగాత్రులు.. ప్రాణ భయంతో జనం పరుగులు.. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో సోమవారం రాత్రి ఓ దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడినప్పటి దృశ్యాలివీ. బ్రిటన్‌లోని పారిశ్రామిక నగరం మాంచెస్టర్ నెత్తురోడింది. యూరోప్‌లోనే అతిపెద్ద ఇండోర్ ఎరీనా అయిన మాంచెస్టర్ ఎరీనాలో పాప్ స్టార్ అరియానా గ్రాండే మ్యూజిక్ కన్సర్ట్ సందర్భంగా ఒక దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 22 మంది యువతీయువకులు, చిన్నారులు మృత్యువాత పడగా.. మరో 59 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒకే దుండగుడు భారీ తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలను తీసుకుని కన్సర్ట్ జరుగుతున్న మాంచెస్టర్ ఎరీనా వెలుపలకు వచ్చి ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. 2005లో లండన్వరుస బాంబు దాడుల తర్వాత బ్రిటన్‌లో జరిగిన అతి ఘోరమైన ఉగ్ర దాడి ఇదే. మేమే దాడి చేశాం: ఐసిస్ ఈ దాడికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ప్రకటించింది. ఇకపై ఇలాంటి మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది. ‘‘నిబద్ధత కలి గిన ఒక సైనికుడొకరు జన సమూహం ఉన్న చోట బాంబులు పెట్టాడు’’అంటూ తమ సోష ల్ మీడియా సైట్లలో పోస్ట్ చేసింది. కాగా ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తిని లిబియా సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు సల్మాన్ అబేదిగా గుర్తించారు. గడాఫీ నియంత పాలన నుంచి తప్పించుకునేందుకు అబేది కుటుంబం బ్రిట న్కు వలసవచ్చింది. ఉగ్రదాడి కోసం అబేది లండన్ నుంచి మాంచెస్టర్‌కు రైల్లోకి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మాంచెస్టర్‌లోని అబేది ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. వేగంగా కేసు దర్యాప్తు.. దాడికి సంబంధించి దర్యాప్తును వేగంగా నిర్వహిస్తున్నామని, ఉగ్రవాద కోణంలోనూ ముందుకువెళుతున్నామని, దాడికి ఒక్కరే పాల్పడ్డాడా లేక.. దీని వెనుక ఏదైనా నెట్వర్క్ ఉందా అనే దానిపై దృష్టిసారించామని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు వెల్లడించారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఘటనాస్థలంలోనే మరణించినట్టు ధ్రువీకరించారు. కాగా, సౌత్ మాంచెస్టర్‌లోని కార్ల్‌టన్‌లో ఈ దాడితో సంబంధం ఉందని భావిస్తున్న 23 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాంచెస్టర్ ఎరీనా అంతా పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. సాధారణ ప్రజలను ఆ ప్రాంతంలోకి అనుమతించడం లేదు. బాంబ్ డిస్పోజల్ బృందాలను కూడా రంగంలోకి దించారు. పాశవికమైన ఉగ్రవాద చర్య: బ్రిటన్ ప్రధాని మాంచెస్టర్ ఉగ్ర దాడిని బ్రిటన్ ప్రధాని థెరిసామే తీవ్రంగా ఖండించారు. అత్యంత పాశవికమైన ఉగ్రవాద చర్యగా దీనిని అభివర్ణించారు. దాడి తర్వాత అత్యవసరంగా కోబ్రా(కేబినెట్ ఆఫీస్ బ్రీఫింగ్ రూమ్స్) సమావేశంలో ఆమె పాల్గొని పరిస్థితిని సమీక్షించారు. ఒకే ఉగ్రవాది ఇంట్లో చేసిన అత్యంత శక్తివంతమైన బాంబుతో దాడికి పాల్పడినట్టు ఆమె వెల్లడించారు. కన్సర్ట్ ముగిసే సమయం కా>వడంతో జనం అప్పడే బయటకు వస్తున్నారని, ఆ సమయంలో దాడికి పాల్పడటంతో ఎక్కువ మంది గాయపడ్డారని వివరించారు. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ 2 ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాంచెస్టర్ దాడిని తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఉగ్ర దాడి నేపథ్యంలో బ్రిటన్ సాధారణ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. ప్రధాని థెరిసామే, లేబర్ పార్టీ నాయకుడు జెర్మీ కార్బైన్ ఎన్నిక ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. భారతీయులంతా క్షేమం: కేంద్రం మాంచెస్టర్ ఉగ్ర దాడిలో భారతీయులెవరూ మరణించలేదని, గాయపడలేదని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకూ భారతీయులకు సంబంధించి ఎటువంటి సమాచారం అందలేదని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో వెల్లడించారు. ఉగ్రదాడిలో భారతీయులెవరైనా చిక్కుకుంటే వారి కోసం భారత హై కమిషన్ సహాయ విభాగంతో పాటు బాధితులు 020 76323035ను సంప్రదించవచ్చని అవసరం మేరకు మరిన్ని హెల్ప్లైన్లు ఏర్పాటు చేస్తామని భారత హైకమిషన్ తెలిపింది. మాంచెస్టర్ ఉగ్రదాడి బాధితులకు సాయమందించేందుకు సిక్కు గురుద్వారాలు ముందుకొచ్చాయి. బాధితుల కోసం ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు అందించాయి. పాప్ స్టార్ గ్రాండే సేఫ్.. పాప్ స్టార్ గ్రాండే తన షోను ముగించుకుని, స్టేజ్ దిగిన తర్వాత దాడి జరిగినట్టు ప్రత్యక్ష సాకు‡్ష్యలు తెలిపారు. ఈ దాడిలో అరియానా గ్రాండేకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఆమె సురక్షితంగా ఉన్నారని గ్రాండే అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘మాంచెస్టర్ దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాదం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. నన్ను క్షమించండి’’అంటూ గ్రాండే ట్విట్టర్లో తన భావోద్వేగాన్ని వెల్లడించింది. మాంచెస్టర్ దాడి నేపథ్యంలో తన ప్రపంచ టూర్‌ను గ్రాండే రద్దు చేసుకున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 7/7 దాడిని గుర్తు చేస్తూ.. రెండు నెలల క్రితం లండన్‌లో పార్లమెంటుకు సమీపంలో ఓ దుండగుడు వ్యాన్‌తో దూసుకువచ్చి నలుగురిని చంపడమే కాక.. కత్తితో దాడి చేసి ఓ పోలీసు అధికారిని హత్య చేసిన విషయం తెలిసిందే. 2005 జూలై 7న లండన్‌లో వరుస బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈ ఘటనల్లో 52 మంది మృత్యువాత పడగా.. 700 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. దుండగుడు సల్మాన్ అబేది ఇల్లు దాడికి కొన్ని గంటల ముందు మాంచెస్టర్ ఎరీనాలో ఉగ్ర దాడి జరగనుందంటూ ఓ ట్వీటర్ అకౌంట్లో చేసిన పోస్ట్ -
మాంచెస్టర్‌పై పంజా
ఇటీవల కాస్త సద్దుమణిగినట్టు కనిపించిన ఉగ్రవాద సర్పం మళ్లీ కాటేసింది. అనేక భారీ పరిశ్రమలున్న బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో సోమవారం రాత్రి పాప్ స్టార్ అరియానా గ్రాండే నేతృత్వంలో నిర్వహించిన ఒక సంగీత విభావరి కార్యక్రమంపై ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడి 22మందిని బలి తీసుకున్నాడు. ఈ దాడిలో మరో 59మంది గాయాలపాలయ్యారు. దాడి జరిగిన మాంచెస్టర్ ఎరీనా హాలు యూరప్‌లోనే అతి పెద్దది. ఈ కార్యక్రమానికొచ్చినవారిలో అత్యధికులు యువత, పిల్లలే. తాము దాడి చేయదల్చుకుంటే ఎవరూ ఆపలేరని... ప్రపంచంలో ఎక్క డైనా, ఎప్పుడైనా భారీయెత్తున ప్రాణనష్టం కలిగించగల సత్తా తమకున్నదని ఉగ్ర వాదులు నిరూపించారు. ఫ్రాన్స్‌లో రెండేళ్లక్రితం ఒక సాకర్ పోటీ సమయంలో ఉగ్రవాదులు దాడికి తెగబడి 128మంది ప్రాణాలు తీశారు. ఆ ఏడాదే చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై దాడిచేసి 15మందిని కాల్చిచంపారు. 2004లో స్పెయిన్ లోని మాడ్రిడ్‌లో రైళ్లలో బాంబులు పేల్చి 200మంది ఉసురుతీశారు. భద్రతలో ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా కోలుకోలేని స్థాయిలో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని తాజా ఉదంతం మరోసారి హెచ్చరిస్తోంది. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెళ్లగిస్తామని, అందుకు అవిశ్రాంతంగా పోరాడతామని ప్రభుత్వాలు చెబుతున్నా ఆచరణ మాత్రం సంతృప్తికరంగా లేదని మాంచెస్టర్ ఉదంతం నిరూపిస్తోంది. భారీ సంఖ్యలో జనం హాజరయ్యేచోట, కిక్కిరిసి ఉండే వ్యాపార సముదాయాలున్న ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండటం ముఖ్యం. ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయడం, అందరిపైనా కన్నేసి ఉంచడం కష్టమే కావొచ్చుగానీ గరిష్టంగా భద్రతా ఏర్పాట్లు, పటిష్టమైన నిఘా ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరి. ఇది తమ ఘన కార్యమేనంటూ ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) సాధారణ అర్ధంలో ఒక సంస్థ కాదు. దానికొక స్వరూపమంటూ లేదు. నాయకుడని ప్రకటిం చుకున్న వ్యక్తి ఉండొచ్చు. తమదొక రాజ్యమని చెప్పుకోవచ్చు. ఇరాక్–సిరియా సరిహద్దుల్లో అరాచకం రాజ్యమేలుతున్నచోట వారికంటూ కొంత ప్రాంతం కూడా ఉండొ ఉండొచ్చు. కానీ నేతలు, శ్రేణుల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడమనే విధానమేదీ కనబడదు. అయినా అత్యంత సులభంగా యూరప్‌లో ఏదో ఒక దేశంలో ఎప్పుడో ఒకప్పుడు దాడి చేయగలుగుతున్నారంటే అది భద్రతా సంస్థల వైఫల్యం ఫలితమే. సాంకేతిక విజ్ఞానం పెరిగి సామాజిక మాధ్యమాలు విస్తరించినచోట ఏ భావ జాలమైనా వేగంగా చొచ్చుకుపోవడం వింతేమీ కాదు. ఆ మాధ్యమాలను ఆలంబన చేసుకునే ఐఎస్ లాంటి ఉగ్రవాద సంస్థలు తమ విధ్వంసక చర్యలు కొనసాగి స్తున్నాయి. యూట్యూబ్‌లో, వాట్సాప్‌లో, ఫేస్బుక్లో, అనేక ఇతర మాధ్యమాల్లో జిహాదీల ప్రసంగాలకు కొదవలేదు. ఉగ్రవాదులు ఉన్మాదంతో రెచ్చిపోయి తోటి మనుషులపై అత్యంత క్రూరంగా దాడులు చేసిన వీడియోలు కూడా ప్రచారంలో ఉంటున్నాయి. ఇలాంటివన్నీ వ్యక్తులుగా చీలిపోయిన సమాజాల్లో సులభంగా విషబీజాలు నాటుతున్నాయి. స్వీయ సమస్యలతో సతమతమయ్యే యువతలో అర్ధంలేని ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. తమ అసంతృప్తి దేనికో, ఆగ్రహం ఎవరిపైనో తెలియకుండానే ప్రతీకార వాంఛను రగిలిస్తున్నాయి. ఒకే ఇంట్లో నివసిస్తున్నవారి మధ్య అంతులేని అగాధం ఉంటుంటే ఇక ఇరుగు పొరుగు సంబంధాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇలాంటిచోట ఒక సెల్‌ఫోను లేదా ల్యాప్‌టాప్ ఉగ్రవాదానికి వాహికలవుతున్నాయి. ఉగ్రవాదంపై పోరు పేరిట దారీ తెన్నూలేని చర్యల పరంపరకు తెరలేపిన అమెరికాను దీనంతటికీ తప్పుబట్టాలి. 2001 సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లోని జంట హర్మ్యాలపై అల్‌కాయిదా ఉగ్ర వాదులు దాడి జరిపాక ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ బ్రిటన్‌తో కలిసి అప్ఘానిస్తాన్‌లో దాడులు ప్రారంభించారు. అంతేకాదు... దానితో ఏమాత్రం సంబంధం లేని ఇరాక్‌పై రసాయన ఆయుధాలున్నాయనే సాకుతో యుద్ధం మొదలుపెట్టారు. ఆ యుద్ధం లక్షలాదిమంది ప్రాణాలు తీసింది. మరిన్ని లక్షల మందిని నిరాశ్రయుల్ని చేసింది. సోమాలియా, లిబియా, యెమెన్ లాంటి దేశాల్లో మూలమూలనా ద్రోన్ దాడులు జరిపారు. జరుపుతూనే ఉన్నారు. వాటిల్లో ఉగ్ర వాదులు పదుల సంఖ్యలో మరణిస్తే, అమాయక పౌరులు వందలాదిమంది చనిపోయారు. మాంచెస్టర్ దాడి తర్వాత నగరవాసులు ప్రదర్శించిన సమయస్ఫూర్తి మెచ్చ దగ్గది. ఈ ఘటన తర్వాత రైల్వే స్టేషన్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటించడం, దుకా ణాలు సైతం మూతబడటంతో రాత్రి వేళ గమ్యస్థానాలకు ఎలా చేరాలో తెలియక వేలాదిమంది సతమతమయ్యారు. ఆ సమయంలో తమ నివాసాల్లో తలదాచు కోవచ్చునని కొందరు... తమ ఇంటికి వస్తే కాఫీ, టీ, ఇతర పానీయాలు, ఆహారం వగైరాలున్నాయంటూ మరికొందరు ట్వీట్లిచ్చారు. మీరున్న చోటునుంచి అయిదు నిమిషాల్లో రావొచ్చునని తోవ చూపారు. ఆఖరికి క్యాబ్ డ్రైవర్లు సైతం ఉచితంగా తమ వాహనాల్లో ఎవరి ఇళ్లకు వారిని చేరుస్తామని భరోసా ఇస్తూ టెలిఫోన్ నంబర్లు ఇచ్చారు. దీన్నంతటినీ గమనించాక ఒక హోటల్ యాజమాన్యం సైతం ఘటనలో తల్లిదండ్రులనుంచి తప్పిపోయిన పిల్లలకు ఆశ్రయం కల్పించింది. తమ చర్యల ద్వారా సమాజంలో పరస్పర అపనమ్మకాలనూ, విద్వేషాలనూ రగల్చడం ఉగ్రవా దుల ధ్యేయం. ప్రభుత్వాధినేతలు సైతం ఇలాంటి సందర్భాల్లో సంయమనం కోల్పోయి ప్రకటనలు చేయడం ద్వారా వారి ధ్యేయాన్ని నెరవేరుస్తున్నారు. కానీ సామాన్య పౌరులు ఎంతో పరిణతి ప్రదర్శించి ఉగ్రవాదుల లక్ష్యాన్ని వమ్ము చేయడం ఉపశమనం కలిగిస్తుంది. మాంచెస్టర్ పౌరులు తెరిచి ఉంచింది తమ ఇళ్ల తలుపుల్ని కాదు... తమ విశాల హృదయాలనూ, మనసులనూ! ఇంతటి ఔదా ర్యంతో ప్రపంచ పౌరులకు మార్గ నిర్దేశం చేసి, సంక్షోభ సమయాల్లో ఎలా మెల గాలో, సౌహార్దాన్ని ఎలా పంచాలో తెలియజెప్పినందుకు మాంచెస్టర్ పౌరులను ప్రశంసించాలి. తాజా ఉగ్రవాద దాడి మన అలక్ష్యాన్ని అంతమొందిస్తుందని, మన అప్రమత్తతను మరింతగా పెంచుతుందని ఆశిద్దాం. -
‘నా గుండె పగిలింది, ఐ యామ్ సారీ’
లండన్: మాంచెస్టర్ దాడిపై అమెరికా పాప్ గాయని, నటి అరియానా గ్రాండే దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటన తనను ఎంతోగానో కలసి వేసిందని ఆవేదన తెలిపింది. మాంచెస్టర్‌లో దాడి జరిగిన ఐదు గంటల తర్వాత ఆమె స్పందించింది. ‘నా గుండె పగిలింది. ఐ యామ్ సారీ. ఏం చెప్పాలో మాటలు రావడం లేద’ని అరియానా ట్వీట్ చేసింది. మాంచెస్టర్ ఎరీనాలో అరియానా ప్రదర్శన ముగిసిన తర్వాత మాంచెస్టర్ ఎరీనా గేటు దగ్గర పేలుడు సంభవించడంతో 20 మంది చనిపోగా, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. అరియానా షోకు 21 వేల మంది హాజరయ్యారని తెలుస్తోంది. వేదిక కెపాసిటీ 18 వేలు మాత్రమే. మెన్ ఎరీనాగా ముద్ర పడిన మాంచెస్టర్ ఎరీనాలో తరచుగా పాప్ సంగీత కార్యక్రమాలు జరుగుతుంటాయి. బర్మింగ్‌హామ్, డబ్లిన్‌లో ఇప్పటికే ప్రదర్శనలు ఇచ్చిన అరియానా రేపు, ఎల్లుండి లండన్ ప్రదర్శనలు ఇవాల్సివుంది. ఈలోగా మాంచెస్టర్‌లో దాడి జరిగింది. దీంతో తదుపరి కార్యక్రమాలపై సందిగ్దత నెలకొంది. -
మాంచెస్టర్ మారణకాండ: భారీ మూల్యం!
-
ఇది ఆరంభం మాత్రమే; ఐసిస్ ప్రకటన
-
ఇది ఆరంభం మాత్రమే; ఐసిస్ ప్రకటన
మాంచెస్టర్: ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ నగరంలో విధ్వంసానికి పాల్పడింది తామేనని ప్రకటించుకున్న ఐసిస్.. ఇది ఆరంభం మాత్రమేని హెచ్చరించింది. ఇలాంటి దాడులు మరిన్ని చేస్తామని భీకరవ్యాఖ్యలు చేసింది. మాంచెస్టర్‌లోని మాంచెస్టర్ ఎరీనా వద్ద శక్తిమంతమైన ’నెయిల్ బాంబు’ పేలుడులో 19 మంది మరణించగా, 50మంది గాయపడ్డారు. మాంచెస్టర్ పేలుళ్లు విజయవంతం కావడంపట్ల ఐసిస్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని పంచుకున్నారు. ‘మోసుల్‌లో దాడులకు ప్రతీకారమే ఇది..’ అని కామెంట్లు పెట్టారు. అమెరికన్ పాప్ గాయని అరియానా షో ముగిసిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. ఎరీనా వద్ద బాంబు పేలిన తర్వాత అప్రమత్తమైన పోలీసులు.. అక్కడికి సమీపంగా ఉన్న కేథడ్రల్ గార్డెన్‌లోనూ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రదాడిని ఖండించిన బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మాంచెస్టర్ ఘటనతో ఉలిక్కిపడ్డ యూరప్ దేశాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. జనం ఎక్కువగా గుమ్మికూడే చోట్ల తనిఖీలు నిర్వహిస్తూ, అదనపు బలగాలను మోహరించాయి. అటు అమెరికాసైతం సెక్యూరిటీని టైట్ చేసింది. -
మాంచెస్టర్ మారణకాండ: భారీ మూల్యం!
మాంచెస్టర్: యూకేలోని ప్రఖ్యాత పారిశ్రామిక నగరం మాంచెస్టర్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఇంగ్లాండ్‌లో అతిపెద్ద ఈవెంట్ హబ్‌గా పేరుపొందిన మాంచెస్టర్ ఎరీనాలో భారీ పేలుడుకు పాల్పడ్డారు. స్టానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:35కు చోటుచేసుకున్న దాడిలో 20 మంది చనిపోగా, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎరీనాలో అమెరికన్ పాప్ సింగర్ అరియానా గ్రాండే షో ముగియగానే.. సీట్లలో నుంచి లేచిన జనం గుంపులు గుంపులుగా ద్వారాల వద్దకు చేరుకున్నారు.. సరిగ్గా అదే సమయంలో ఒక ద్వారం వద్ద భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో భీతిల్లిపోయిన జనం.. పరుగులు తీశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ప్రాణభయంతో చిన్నారులు అరుస్తుండటం వీడియోల్లో రికార్డయింది. మాంచెస్టర్ మారణకాండ ముమ్మాటికీ ఉగ్రవాదుల పనేనని ఇంగ్లాండ్ పోలీసులు ప్రకటించారు. పేలుడు నేపథ్యంలో యూకే వ్యాప్తంగా అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మాంచెస్టర్ దాడిని ఖండించారు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలిపారు. ఐసిస్‌ను తక్కువగా అంచనావేశారా? గడిచిన కొద్ది నెలలుగా సైలెంట్‌గా ఉన్న ఐసిస్.. అదనుచూసి పంజా విసిరింది. సిరియా, ఇరాక్‌లోని ఐసిస్ ప్రాబల్య ప్రాంతాలపై యూఎస్, రష్యా, సిరియా, ఇరాక్ సైన్యాలు ఎడతెరిపిలేకుండా జరుపుతున్న దాడులతో కొద్దిగా వెనక్కి తగ్గిన రాక్షసమూక.. మాంచెస్టర్ దాడితో మళ్లీ తన ఉనికిని చాటుకుంది. అమెరికాలో దాడులు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో కొన్నేళ్ల కిందటే యూరప్‌ను టార్గెట్ చేసిన ఐసిస్ భారీ విధ్వంసాలకు కుట్రపన్నింది. ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ట్రక్కుదాడి, బ్రసెల్స్‌లో పేలుళ్లు తమపనేనని గర్వంగా ప్రకటించుకుంది. కొద్ది రోజుల కిందట ఏకంగా యూకే పార్లమెంట్ భవనంపైనే దాడికి తెగబడటం, ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. అయితే, చిన్నచిన్న దాడులు తప్ప భారీ విధ్వంసం చేయలేదని ఐసిస్ పట్ల ఇంగ్లాండ్ భద్రతా బలగాలు వేసిన అంచనాలు తప్పని భారీ మూల్యం చెల్లించుకున్నాకగానీ తెలిసిరాలేదు. 21వేల మంది ప్రేక్షకులు హాజరైన ఈవెంట్లో ఉగ్రవాదులు సులువుగా పేలుళ్లకు పాల్పడటం.. భద్రతా బలగాల పనితీరుపై అనుమానాలకు తావిస్తోంది. మాంచెస్టర్ ఎరీనాలో పేలుడుకు ఉపయోగించిన 'నెయిల్ బాంబు'ను ఉగ్రవాదులు ఎలా తీసుకెళ్లారు? చెక్ పాయింట్లను ఎలా బురిడీకొట్టించారు? అనే ప్రశ్నలకు జవాబులు తెలిస్తే భద్రతా బలగాల వైఫల్యం బట్టబయలవుతుంది. -
ఇంగ్లండ్‌లో భారీ పేలుడు..19 మంది మృతి
-
ఇంగ్లండ్‌లో భారీ పేలుడు.. 19 మంది మృతి
మాంచెస్టర్: ఇంగ్లాండ్ పారిశ్రామిక నగరం మాంచెస్టర్‌లో భారీ పేలుడు సంభవించింది. అమెరికన్ పాప్ సింగర్ అరియానా గ్రాండే నిర్వహిస్తున్న సంగీత కచేరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నఈ ఘటనలో 19 మంది మృతిచెందగా.. 50 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10: 35 గంటలకు పేలుడు సంభవించినట్లు గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఖాళీ చేయించిన అధికారులు.. సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘటనను ఉగ్రవాదుల చర్యగా అనుమానిస్తున్నారు. పాప్ సింగర్ అరియానా క్షేమంగా ఉన్నారని ఆమె ప్రతినిధి వెల్లడించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
బట్టలు లేకుండా నిద్ర పొమ్మని ... అమ్మమ్మే చెప్పింది
లాస్ ఏంజిల్స్: పెద్దల మాట సద్ది మూట అనే సామేత ఉంది. ఆ సామెతను ఎవరు పాటించిన పాటించకపోయినా చిత్ర పరిశ్రమకు చెందిన హీరోహీరోయిన్లతోపాటు గాయకులు...టెక్నీషిన్లంతా తూచ తప్పక పాటిస్తుంటారు. అది టాలీవుడు... బాలీవుడు చివరకు హాలీవుడ్ హీరోహీరోయిన్లు... తాను పెద్దల మాట వింటున్నామని అప్పుడు ఎప్పుడో ఎక్కడో ఏదో సందర్బంగా చెబుతుంటారు. అ విషయం మనం చూస్తునే ఉంటాం. ఇప్పుడు అలాగే హాలీవుడ్ గాయని, నటీ ఆరియానా గ్రాండి (21) తన అమ్మమ్మ మాటలకు అక్షరాల తూచా పాటిస్తున్నానని చెబుతుంది. తాను నిద్ర పోయేటప్పుడు ఒంటిపై చాలా తక్కువ బట్టలతో నిద్ర పోతానని వెల్లడించింది. అందుకు తన అమ్మమ్మే కారణమని చెప్పింది. ఒంటిపై నూలు పోగు లేకుండా నిద్ర పోవాలని అమ్మమ్మ తన చిన్నతనం నుంచి ప్రోత్సహించిందని తెగ మురిసిపోతూ చెబుతుంది ఈ హాలీవుడ్ బామా. అయితే తనకు మనుషుల కంటే కుక్కలనే అధికంగా ప్రేమిస్తానని... తన వద్ద నాలుగు కుక్కలు ఉన్నాయిని తెలిపింది. ఆ కక్కులతో కలసి కొన్ని సార్లు నిద్రపోతాని చెప్పింది. తాను పూర్తిగా శాఖహారినని ఆరియానా గ్రాండి పేర్కొంది.