అరియానాకు ఏమైంది? బక్కచిక్కిపోయి.. అస్థిపంజరంలా! | Is Ariana Grande Okay? Fans Wonder Her Appearance In BAFTA Film Awards | Sakshi
Sakshi News home page

అరియానాకు ఏమైంది? అప్పుడలా.. ఇప్పుడిలా..!

Published Sun, Feb 23 2025 5:14 PM | Last Updated on Sun, Feb 23 2025 5:59 PM

Is Ariana Grande Okay? Fans Wonder Her Appearance In BAFTA Film Awards

అమెరికన్‌ పాప్‌ సింగర్‌, నటి అరియానా గ్రాండె (Ariana Grande) గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇటీవల బాఫ్తా ఫిలిం అవార్డుల కార్యక్రమానికి వెళ్లిన ఆమె తన అభిమానులకు ఆటోగ్రాఫులిచ్చింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమె ఫోటో క్లిక్‌మనిపించి దాన్ని సోషల్‌ మీడియాలో వదలగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ పిక్‌లో అరియానా ఎంతో బక్కచిక్కిపోయింది. అది చూసిన అభిమానులు తన ఆరోగ్యం బాగానే ఉందా? అని ఆరా తీస్తున్నారు. 

ఇలా అయిపోయిందేంటి?
అరియానా రోజురోజుకీ ఇలా అయిపోతుందేంటి? అని కంగారు పడుతున్నారు. ఐదేళ్ల క్రితం ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? అంటూ తన పాత ఫోటోలు తిరగేస్తున్నారు. 2020లో పీపుల్స్‌ ఛాయిస్‌ అవార్డ్‌ ఫంక్షన్‌లో అరియానా ఎలా ఉంది? ఇప్పుడు బాఫ్లా ఫంక్షన్‌లో ఎలా ఉంది? అసలేం జరుగుతోందని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో ఏకంగా పదేళ్లు వెనక్కి వెళ్లి.. అప్పటి అరియానాయే బాగుందని కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పుడే బాగున్నా..
గతంలోనూ తన బాడీ గురించి ఇటువంటి చర్చ జరిగింది. అప్పుడు అరియానా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ఆరోగ్యంగా ఉన్నానని తెలియజేయడానికి ఎలా కనిపించాలో మీరు నాకు చెప్పొద్దు. నేను గతంలో కంటే కూడా ఇప్పుడే బాగున్నాను. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్నానంటున్నారుగా.. అప్పుడు సరిగా తినలేదు, ఇబ్బందులు ఎదుర్కొన్నాను.

మీకనవసరం..
మానసికంగానూ బాగోలేను. దాన్ని మీరు ఆరోగ్యకరమైన రోజులుగా వర్ణిస్తున్నారు. లుక్స్‌ను బట్టి ఆరోగ్యంగా లేనని డిసైడ్‌ అవకండి. నా శరీరం గురించి మీకనవసరం అని పేర్కొంది. కాగా అరియానా గ్రాండె విక్టోరియస్‌, అండర్‌డాగ్స్‌, డోంట్‌ లుకప్‌, విక్‌డ్‌ సినిమాల్లో నటించింది. ఎన్నో పాప్‌ సాంగ్స్‌ పాడింది.

 

 

చదవండి: 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement