ఇండియన్‌ పాప్‌ మ్యూజిక్‌.. టాలెంట్‌ హంట్‌ మొదలుపెట్టిన సవన్‌ | Savan Kotecha will Introduce India's First Boy Band | Sakshi
Sakshi News home page

పాప్‌ సాంగ్స్‌ కోసం ఎవరిపైనా ఆధారపడనక్కర్లే.. త్వరలోనే ఇండియాలో..

Feb 21 2025 7:32 PM | Updated on Feb 21 2025 7:36 PM

Savan Kotecha will Introduce India's First Boy Band

ఇండియన్‌ పాప్‌ మ్యూజిక్‌లో అద్భుతాలు సృష్టించడానికి ఇండో అమెరికన్‌ గేయ రచయిత సవన్‌ కొటేచా (Savan Kotecha) ముందడుగు వేశాడు. యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా , రిపబ్లిక్ రికార్డ్స్, రిప్రజెంటేట్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. కొత్త టాలెంట్‌ వెలికితీయడంతోపాటు దేశంలో పాప్‌ బ్యాండ్‌ (Pop Boy Band)ను ఏర్పరచడమే వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఎవరీ సవన్‌ కొటేచా?
సవన్‌ ఎన్నో పాటలకు రచయితగా పని చేశాడు. ఈయన రాసిన ఎన్నో పాటలు.. అరియానా గ్రాండె, ద వీకెండ్‌, జస్టిన్‌ బీబర్‌, వన్‌ డైరెక్షన్‌ (పాప్‌ బ్యాండ్‌)లు ఆలపించాయి. పాటలరచయితగా సవన్‌ 17 సార్లు గ్రామీ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. అలాగే ఆస్కార్‌, గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారాలకు సైతం నామినేట్‌ అయ్యాడు. బిల్‌బోర్డ్‌ మ్యూజిక్‌ అవార్డును అందుకున్నాడు. 

అదే అసలైన లక్ష్యం
తాజాగా సవన్‌ కొటేచా మాట్లాడుతూ.. భారత్‌లోని యువతలో ఉన్న మ్యూజిక్‌ టాలెంట్‌ను వెలికితీయడమే తన లక్ష్యమని చెప్తున్నాడు. ఇక్కడి యంగ్‌ జనరేషన్‌ అంతా కూడా పాప్‌ సాంగ్స్‌ కోసం, సింగర్ల కోసం విదేశాలపై ఆధారపడుతోంది. ఇకమీదట ఆ అవసరం రాకుండా చేయాలన్నదే మా ఉద్దేశ్యం. భారత్‌లో ఓ సరికొత్త పాప్‌ బ్యాండ్‌ గ్రూప్‌ సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నాం అని పేర్కొన్నాడు.

చదవండి: ఓటీటీలోకి ఎమర్జెన్సీ.. సింపుల్‌గా డేట్‌ చెప్పేసిన కంగనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement