Indo american
-
మైక్రోసాఫ్ట్ విండోస్, సర్ఫేస్ చీఫ్‌గా పవన్ దావులూరి నియామకం
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ తన కొత్త విండోస్, సర్ఫేస్ చీఫ్‌గా భారత సంతతికి చెందిన పవన్ దావులూరిని నియమించింది. ది వెర్జ్ నివేదిక ప్రకారం.. దావులూరి, ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి. మైక్రోసాఫ్ట్‌లో 23 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ డీప్‌మైండ్ డిపార్ట్మెంట్ మాజీ సహ వ్యవస్థాపకుడు ముస్తఫా సులేమాన్‌ను ఏఐ బ్రాంచ్ హెడ్‌గా నియమించగా.. తాజాగా పవన్‌కు కీలక బాధ్యతలను మైక్రోసాఫ్ట్ అప్పగించింది. అయితే, విండోస్, సర్ఫేస్ విభాగాలకు వేర్వేరుగా అధిపతులు ఉండగా.. రెండింటి బాధ్యతలను పవన్‌కే కట్టబెట్టింది. ఇక పవన్ నియామకమంతో అమెరికా దిగ్గం టెక్ కంపెనీల్లో అత్యున్నత పదవులు చేపట్టిన భారతీయ వ్యక్తుల జాబితాలో పవన్‌కు సైతం చోటు దక్కింది. ప్రస్తుతం, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ నాయకత్వం వహిస్తుండగా.. మైక్రోసాఫ్ట్ స్వయంగా సత్య నాదెళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. కాగ్నిజెంట్‌కి రవి కుమార్ , ఐబీఎంకు అరవింద్ కృష్ణ, పాలో ఆల్టో నెట్వర్క్స్కు నికేశ్ అరోరా, యూట్యూబ్ నీల్ మోహన్ అడోబ్కి శాంతను నారాయణ్‌లు సీఈఓలుగా రాణిస్తున్నారు. -
పాపం టెక్కీ, 2 నిమిషాలు హిందీలో మాట్లాడితే ఉద్యోగం పోయింది!
బంధువు మరణంపై ఫోన్లో తన కుటుంబ సభ్యులతో హిందీలో మాట్లాడినందుకు టెక్కీ జాబ్ పోగొట్టుకున్నారు. అకారణంగా తనని జాబ్ నుంచి తొలగించినందుకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు న్యాయ పోరాటానికి దిగారు. భారత్‌కు చెందిన 78 ఏళ్ల అనిల్ వర్ష్నే 2002 నుంచి అమెరికాలో శత్రుదేశాలు బాలిస్టిక్ క్షిపణి లక్ష్యాల నుంచి యూఎస్ రక్షణదళాల్ని రక్షించేలా ఇంటిగ్రేటెడ్, లేయర్డ్ మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ విభాగంలో అమెరికా ఫెడరల్ ఏజెన్సీ తరుపున పార్సన్స్ కార్పొరేషన్ అనే సంస్థలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబరు 26, 2022న ఆఫీస్‌లో తలా మునకలైన అనిల్‌కు అవతల వ్యక్తి నుంచి ఫోన్ కాల్. భారత్‌లోని బంధువులు చనిపోయారనేది ఆ కాల్ సారాంశం. ఫోన్ చేసింది ఆయన బావమరిదే. ఫోన్ కాల్ సంభాణ అంతా హిందీలో జరిగింది. అదే ఆయన చేసిన తప్పు. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు. సంస్థ రహస్యాల్ని ఎవరికో షేర్ చేస్తున్నారు’ అంటూ భారత టెక్కీ ఫోన్ కాల్‌పై అనుమానంగా ఉంది అంటూ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుతో సమాచారం అందుకున్న యాజమాన్యం టెక్కీ అనిల్‌ను విధుల నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నాకు అన్యాయం జరిగింది దీంతో అన్యాయంగా తనని ఉద్యోగం నుంచి తొలగించారంటూ బాధితుడు అనిల్ అలబామాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్లోపార్సన్స్ కార్పొరేషన్, యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్లపై దావా వేసినట్లు ఆలబామా స్థానిక మీడియా సంస్థ ఏఎల్. కామ్ నివేదించింది. దావాలో ‘గత ఏడాది భారత్‌లో బంధువు మరణంపై బావమరిదితో దాదాపు రెండు నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడా. ఆ సమయంలో సంస్థలోని అత్యంత సున్నితమైన రహస్యాల్ని చేరవేస్తున్నానని తప్పుగా భావించిన శ్వేత జాతీయుడు ఫిర్యాదు చేశాడని, సహోద్యోగి ఫిర్యాదుతో కంపెనీ నన్ను విధుల నుంచి తొలగించిందని దావాలో పేర్కొన్నారు. ఇక, ఆ ప్రాంతంలో ఫోన్ మాట్లాడకూడదన్న నిషేదాజ్ఞలు కూడా లేవు. అయిననప్పటికీ నేను భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డారని యాజమాన్యం తన ఫిర్యాదులో తెలిపింది. ఇప్పుడు నా భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. అమెరికా మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ (MDA)తో కలిసి పనిచేయకుండా ఆంక్షలు విధించారని వాపోయారు. మేం తప్పు చేయలేదు తాజాగా ఈ ఏడాది జూలై 24న కోర్టుకు దాఖలు చేసిన ప్రతిస్పందనలో పార్సన్స్ తాము ఎలాంటి తప్పు చేయలేదని ఖండించింది. అంతేకాదు, వర్ష్నే వేసే దావాను కొట్టివేయాలని కోరింది. తన న్యాయవాదుల ఫీజులు, ఇతర ఖర్చులు సైతం ఖర్చులను చెల్లించాలని కోరినట్లు తెలుస్తోంది. ఏల్.కామ్ ప్రకారం.. అనిల్ తన దావాలో తొలగించిన ఉద్యోగం తిరిగి ఇప్పించాలని, సంస్థ నిబంధనల్ని ఉల్లంఘించారని పేర్కొన్న రికార్డ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తన ఉద్యోగాన్ని పునరుద్ధరించకపోతే జాబ్ నుంచి తొలగించినందుకు నష్టపరిహారం, న్యాయవాదుల రుసుములతో పాటు, ప్రయోజనంతో కూడిన ముందస్తు చెల్లింపులు, మానసిక వేదన అనుభవించినందుకు నష్టపరిహారాన్ని కోరనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి అనిల్ వర్షి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. 1968లో అమెరికాకు వలస వచ్చారు. అతను జూలై 2011 నుండి అక్టోబర్ 2022 వరకు పార్సన్స్ హంట్స్‌విల్లే కార్యాలయంలో పనిచేశాడు. సిస్టమ్స్ ఇంజనీరింగ్‌లో కాంట్రాక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తింపు పొందాడు. భూమి ఆధారిత క్షిపణి రక్షణ కార్యక్రమంలో 5 మిలియన్లను ఆదా చేసినందుకు మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ సిఫార్స్ లేఖను అందుకున్నారు. -
వివేక్ రామస్వామికి ఓటు వేయొద్దంటూ మత ప్రచారకుడి ప్రచారం..
వాషింగ్టన్: త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్షఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న వివేక్ రామస్వామి హిందువు అని ఆయనకు ఓటు వేయొద్దంటూ మత ప్రచారకుడు కున్నేమాన్ ప్రసంగం చేసిన వీడియో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ నేపథ్యంలో ఇండో అమెరికన్ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఆయనకు మద్దతుగా నిలిచారు. నెబ్రాస్కాలోని నాన్-డినామినేషనల్ లార్డ్ ఆఫ్ హోస్ట్స్ లో పనిచేస్తున్న హాంక్ కున్నేమాన్ ఇటీవల చేసిన ప్రసంగంలో.. రామస్వామి ఒక హిందువు అని ఆయనకు అండగా నిలిచినవారు దేవుని ఆగ్రహానికి గురవుతారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ మతప్రచారకుడు కున్నేమాన్ మతోన్మాద వ్యాఖ్యలు విచారకరమని కాంగ్రెస్‌కు చెందిన రాజా కృష్ణమూర్తి, ఆర్ఓ ఖన్నా తీవ్రంగా ఖండించారు. వీరిద్దరూ కూడా రాజకీయంగా వివేక్ రామస్వామితో ఏకీభవించకపోయినా ఆయనపై కున్నేమాన్ చేసిన వ్యాఖ్యలను మాత్రం తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా వారి అభిప్రాయాలను వెల్లడించారు. రాజా కృష్ణమూర్తి రాస్తూ.. నేను వివేక్ కృష్ణమూర్తితో రాజకీయంగా ఏకీభవించను కానీ, ఒక్కటి మాత్రం చెప్పాలి అమెరికాలోని అన్ని రాజకీయ పార్టీలు హిందువులతో సహా ఏ మతానికి చెందిన వారినైనా స్వాగతించాలి. రామస్వామిపై చేసిన మతోన్మాద వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రిపబ్లికన్ ప్రతినిధులంతా ఈ సామరస్యాన్ని ఆచరిస్తారని అనుకుంటున్నాను. I don’t agree with @VivekGRamaswamy on much, but one thing is certain: all political parties in America should welcome individuals of all faiths, including Hindus. I condemn the bigoted remarks directed toward Ramaswamy, and I hope that Republican electeds and others do the same. https://t.co/OI9CsOhBlU — Congressman Raja Krishnamoorthi (@CongressmanRaja) July 25, 2023 ఆర్ ఓ ఖన్నా స్పందిస్తూ.. వివేక్ రామస్వామికి నాకూ ఆత్మీయ విభేదాలున్న మాట వాస్తవం. కానీ ఆయన మతవిశ్వాసంపై చేసిన దాడి అసహ్యకరమైనది. అనేక మతాలకు చెందిన వారమైనా మనమంతా ఒక్కటే. అమెరికా రిపబ్లిక్షన్లు చాలా మంది రామస్వామి ఆదర్శాలకు అండగా నిలుస్తున్నారని.. అది వాస్తవమని రాశారు. I have had spirited disagreements with @VivekGRamaswamy. But this is a disgusting and anti-American attack on his faith. We are a nation of many faiths, & the fact that so many Christian American Republicans are willing to support Vivek speaks to that ideal. https://t.co/ebfrvpuIwU — Ro Khanna (@RoKhanna) July 25, 2023 వివాదాస్పదమైన కున్నేమాన్ వీడియో ప్రసంగం.. అందరూ నా మాటలు జాగ్రత్తగా వినండి.. మన సిద్ధాంతాలకు వ్యతిరేకమైన రామస్వామికి మీరు అండగా ఉంటే మీరు దేవుడి ఆగ్రహానికి గురవుతారు. గతంలో కూడా డోనాల్డ్ ట్రంప్ ఇదే విధంగా దేవుడి ఆగ్రహానికి గురై 2020లో పదవిని కోల్పోయారని ఇప్పుడు రామస్వామి విషయంలోనూ అదే జరుగుతుందని అన్నారు. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి రామస్వామి మాత్రం తన ప్రచార కార్యక్రమాలలో నేను వారి సంప్రదాయానికి చెందకపోయినా వారి విలువలను మాత్రం చాల గౌరవిస్తానని అన్నారు. ఇది కూడా చదవండి: ఎంతకాలం అడుక్కుంటాం.. ముందు చేతిలో చిప్ప విసిరేయాలి -
మందు మీద మోజు.. వైన్ బిజినెస్‌తో కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ
'ఆకాశంలో సగం' అంటూ పోవూరి లలిత కుమారి (ఓల్గా) రాసిన కవిత ఒకప్పుడు సంచలనం రేపింది. ప్రతి రంగంలోనూ అవకాశాలు కల్పించాలని, పురుషాధిక్యం తగదని తన రచనల ద్వారా సమాజం మీద విరుచుకుపడిన విషయం దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. అయితే ఈ రోజు మహిళ అడుగుపెట్టని రంగం ఏదీ లేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ రోజు అన్ని రంగాల్లోనూ మహిళల హవా నడుస్తోంది. మహిళలకు పూర్తిగా విరుద్ధంగా భావించే వైన్ ఇండస్ట్రీలో కూడా మేము సైతం అంటున్నారు. ఇలాంటి రంగంలో అడుగు పెట్టి ప్రపంచ వ్యాపార రంగంలో ఎంతోమంది దృష్టిని ఆకర్శించి 'జోయా వోరా షా' (Zoya Vora Shah) మహిళ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికాలోని ప్రముఖ వైన్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో ముందుకెళ్తున్న 'జోయా వోరా షా' భారతదేశానికి చెందిన మహిళ కావడం గమనార్హం. నిజానికి ఈమె కొంత కాలం క్రితం మన దేశం నుంచి అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడింది. కొన్ని రోజుల తరువాత ఒక రెస్టారెంట్లో వైన్ బిజినెస్ ప్రారంభించింది. ఈ వ్యాపారం అతి తక్కువ కాలంలోనే బాగా లాభాల బాట పట్టింది. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) ఒక బ్రాంచ్‌తో మొదలైన ఆమె వ్యాపారం అదే నగరంలో ఎనిమిది బ్రాంచ్‌లకు చేరింది. ప్రస్తుతం ఈమె వైన్, స్పిరిట్ విక్రయాలకు ప్రతినిధిగా మారింది. కాలక్రమంలో ఆమె స్థాపించిన వైన్ టేస్టింగ్ రూమ్ తరువాత వైన్ బార్ అండ్ బాటిల్ షాప్‌గా రూపుదిద్దుకున్నాయి. అతి తక్కువ సమయంలో ఈమె బాగా ఎదగటానికి కారణం ఈ రంగంపై ఆమెకున్న అభిరుచే. (ఇదీ చదవండి: కుటుంబంలో 12 మంది డాక్టర్లు.. 16 సంవత్సరాలకే రికార్డు.. అసిస్టెంట్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలి..) ప్రారంభంలో ఇలాంటి రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావంటూ ఎంతో మంది ఆమెను విమర్శించారు. కానీ ఎవరి మాటను లెక్క చేయని జోయా వోరా షా చివరికి అనుకున్న విజయం సాధించింది. దీనికి ప్రధాన కారణం ఆమె భర్త అందించిన సహకారమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె బిజినెస్ కోట్లలో టర్నోవర్ పొందుతోంది. దీన్ని బట్టి చూస్తే మహిళ అనుకోవాలే కానీ ఆమె విజయం సాధించని రంగం అంటూ ఏది ఉండదని స్పష్టంగా తెలుస్తోంది. -
హత్యకు కుట్ర.. ఇండో అమెరికన్ డాక్టర్‌పై నిషేధం
డెవిల్స్ సైడ్ అని పిలువబడే 250 అడుగుల కొండపై కారును నడుపుతూ తన కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నించిన ఇండో అమెరికన్ డాక్టర్‌ను మెడిసిన్ ప్రాక్టీస్ చేయకుండా నిషేధించారు. వివరాల ప్రకారం.. రేడియాలజిస్ట్ ధర్మేష్ పటేల్ తన కారులో శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణాన ఉన్న పసిఫిక్ కోస్ట్ హైవే నుంచి జనవరి 2, 2023న కొండపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇది అతను ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. అతను మాత్రం ఈ నేరాన్ని అంగీకరించలేదు. ప్రమాద సమయంలో అతని ఇద్దరు పిల్లలు, భార్య నేహా పటేల్ ఆ కారులో ఉన్నారు. వెంటనే రెస్క్యూలో సహాయం చేయడానికి అధికారులను ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది చిన్నారులను స్ట్రెచర్లపై రోడ్డుపైకి తీసుకొచ్చి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దంపతులకు ప్రాణాపాయం తప్పిన తీవ్ర గాయాలు కావడంతో వారిని హెలికాప్టర్లో ఎక్కించి హైవేపైకి తీసుకెళ్లి.. అక్కడ వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి విడుదలైన తర్వాత, పటేల్ ఉద్దేశపూర్వకంగా తన కుటుంబాన్ని హత్య చేసేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలతో అధికారులు అరెస్టు చేశారు. అంతేకాకుండా అతను మెడిసిన్ ప్రాక్టీస్ చేయకుండా నిషేధించారు. చదవండి: గిన్నిస్ రికార్డుకెక్కిన కిడ్నీ స్టోన్ -
189 బిలియన్ డాలర్ల కంపెనీకి సారధి: రోజుకు రూ.70 లక్షలు సంపాదన
హైదరాబాద్‌లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు శంతను నారాయణ్. సంకల్పం, కృషి, పట్టుదల ప్రతిభతో తన కలను సాకారం చేసుకున్న గొప్ప వ్యక్తి. 189 బిలియన్ డాలర్ల టెక్ దిగ్గజం అడోబ్‌కు సీఈవోగా రోజుకు రూ. 70 లక్షలు సంపాదిస్తున్న నాన్-ఐఐటియన్. భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్తగా, ప్రపంచాన్నేలుతున్న శంతను నారాయణ్ బర్త్‌డే సందర్భంగా సక్సెస్ స్టోరీ.. కార్పొరేట్ ప్రపంచంలో విజయం సాధించాలంటే ఐఐటీ లేదా ఐఐఎంలో చేరడం తప్పనిసరి. కానీ ఐఐటీ చదవ కుండానే ప్రపంచంలోని అతిపెద్ద, దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీ అడోబ్‌కు ఛైర్మన్, ప్రెసిడెంట్, సీఈవోగా ప్రతిభను చాటు కుంటున్నారు. ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్స్లో ఒకరిగా ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారు. శంతను నారాయణ్ 1962, మే 27 హైదరాబాద్‌లో జన్మించారు. ఫ్యామిలీలో ఆయన రెండో కుమారుడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్) పూర్తి చేశారు. ఆ తర్వాత 1986లో ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ , కాలిఫోర్నియా యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా పొదారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ సమయంలో ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగానికి బదులు 1986లో MeasureX Automobiles System అనే స్టార్టప్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ మరుసటి సంవత్సరం, 1989లో యాపిల్‌లో చేరారు. అక్కడ ఆరేళ్ల పాటు పలు పోర్ట్‌ఫోలియోల్లో పనిచేశారు. ఇక్కడ పరిచయమైన గురుశరణ్ సింగ్ సంధు తన గురువుగా చెప్తుంటారు.. సవాళ్లను ఎదుర్కొనే మార్గాన్ని ఆయన నుంచే తాను నేర్చుకున్నానంటారు శంతను. యాపిల్‌ను వీడిన తరువాత సిలికాన్ గ్రాఫిక్స్‌లో డైరెక్టర్‌గా చేరిన కొన్నాళ్ల తరువాత అడోబ్ సిస్టమ్స్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గాచేరారు. ఇక అప్పటినుంచి ఆయన కరియర్ మరింత దూసుకుపోయింది. 2005లో సీవోవో, 2007లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యారు. 2008 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి సంస్థను విజయవంతంగా గట్టెక్కించారు. ఒక విధంగా చెప్పాలంటే శంతను నారాయణ్ హయాంలోనే అడోబ్ సిస్టమ్స్ ప్రపంచంలోనే టాప్ సాఫ్ట్వేర్ కంపెనీగా అవతరించింది. కుటుంబ నేపథ్యం తల్లి ప్రొఫెసర్. అమెరికన్ సాహిత్యాన్ని బోధించేవారు. తండ్రి వ్యాపారవేత్త. శంతను బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్శిటీలో ఉన్నప్పుడు రేణితో పరిచయం పెళ్లికి దారితీసింది. ఆమె క్లినికల్ సైకాలజీలో డాక్టరేట్ సాధించారు. ఈ దంపతులకు శ్రవణ్ , అర్జున్ నారాయణ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శంతనుకి క్రికెట్, సెయిలింగ్ అంటే చాలా ఆసక్తి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆసియా రెగట్టా పోటీలో సెయిలింగ్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం. అంతేకాదు శంతనుకి చిన్నతనంలో జర్నలిజం పట్ల మక్కువ ఉండేదట. తను బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా ఉండకపోతే, అతను ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడిగా ఉండేవాడినని స్వయంగా ఆయనే చెప్పారు. అడోబ్‌తో పాటు, శాంతను డెల్ ఇంక్, ఫైజర్ ఇంక్ , హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్, కాలిఫోర్నియాలో డైరెక్టర్ల బోర్డు సభ్యుడు. అంతేకాదు, శంతను అడోబ్ ఫౌండేషన్ అధ్యక్షుడు కూడా. ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరైన శంతను 2022లో దాదాపు 256 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డులు, రివార్డులు ♦2009లో, శంతను నారాయణ్ ప్రతిష్టాత్మకమైన అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్ బిజినెస్ అండ్ ఫిలాంత్రోపిక్ లీడర్షిప్ అవార్డును పొందారు. అదే సంవత్సరంలో, 'ది టాప్ గన్ సీఈవో జాబితాలో స్థానం సంపాదించారు. ♦ 2011లో ఓహియోస్ బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. ♦ 2011లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సలహా మండలి సభ్యునిగా నియమితులయ్యారు. ♦ శంతను నారాయణ్ ఫైజర్ కంపెనీకి స్వతంత్ర డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ♦ US-India స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్‌కి వైస్-ఛైర్మన్‌గా ఉన్నారు. ♦ ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో 12వ స్థానం ♦ ది ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా' గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డుతో సత్కరించింది. ♦ 2019 లో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును కూడా అందుకోవడం విశేషం. -
అమెరికాలో ఎవరు మనోళ్లు.. ఎవరు పరాయి వాళ్లు?
* మనలో మనకే ఇంత వివక్షా? * "మనోళ్లు "" మనోళ్ళని " చిన్నచూపు చూస్తారా ? (చాలా కాలంగా అమెరికాలో స్థిరపడి అక్కడి సమాజాన్ని నిశితంగా పరిశీలించిన ఒక వ్యక్తికి కౌన్సిలింగ్ ఇస్తుంటే , ఆ వ్యక్తి నాతో పంచుకొన్న సమాచారం ఇది) ఓ కుటుంబం ముప్పై అయిదేళ్ల క్రితమే అమెరికా కు వలసపోయారు. అక్కడే ఉన్నత విద్య, ఉద్యోగం, పిల్లలు. ముందుగా వీసా .. అటుపై గ్రీన్ కార్డు .. అటుపై అమెరికా పౌరసత్వం . వారి పిల్లలు అక్కడే పుట్టారు- జన్మతః అమెరికా పౌరసత్వం. మరో కుటుంబం.. వీరు ఇటీవలే అమెరికాకు వెళ్లారు . ఇంకా వీసా పైనే వున్నారు. వారికో అమ్మాయి / అబ్బాయి. వీరిని పెళ్లి చేసుకొంటారా ? పెళ్లి దాక ఎందుకు ? వారు వీరిని చిన్న చూపు చూస్తారు. దగ్గరకు కూడా రానివ్వరు. ఎందుకంటారా? వివరంగా మీరే చదవండి. ముప్పై / నలభై ఏళ్ళ క్రితం అమెరికాకు వలస పోయి, ఇప్పుడు ఆ దేశ పౌరసత్వాన్ని సాధించిన వారు మేమే గొప్ప, ఉన్నతం అనుకొంటారు. చదువుకునేందుకు లేదా ఉద్యోగం చేసేందుకు వచ్చే వారిని చిన్న చూపు చూస్తారు. ఇలాంటి వారికి తమ అబ్బాయి / అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడరు. సంబంధాలు చేసుకోరు. పెద్ద వారికంటే, అక్కడే పుట్టి అమెరికా పౌరసత్వాన్ని జన్మతః సాధించుకొన్న రెండవ తరం వారికి జాత్యహంకార భావన చాలా ఎక్కువ . తాము" బ్రౌన్ తోలు కలిగిన శ్వేత జాతీయులు "అనుకొంటారు. అదేంటి?" బ్రౌన్ తోలు కలిగిన తెల్ల జాతివారు"? అనుకొంటున్నారా ? అవునండీ .. తమ తల్లితండ్రులు" ఆసియా నుండి వలస వచ్చారు కాబట్టి తమకు ఇంకా బ్రౌన్ స్కిన్ ఉందని .. తాము వాస్తవంగా అంటే ఆలోచనల్లో ఆంగ్లం మాట్లాడే పద్దతిలో శ్వేతజాతీయులం అని వారు నమ్ముతారు. చదవండి: భారతీయ అమెరికన్ల విలువ పెంచిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక వీసాపై వచ్చి అక్కడ ఉద్యోగం చేస్తున్న భారతీయులంటే వారికి చిన్న చూపు. కాలేజీలు, ఆఫీస్‌లలో ఈ బ్రౌన్ తోలు తెల్ల దొరలు , సాధారణ వీసాల వారితో కలవరు, దగ్గరకు రానివ్వరు. ఇక పెళ్లిళ్ల విషయానికి వస్తే బ్రౌన్ తోలు తెల్ల దొరలు , తమలాంటి బ్రౌన్ తోలు తెల్లదొరలనే పెళ్లి చేసుకొంటారు. వీసా వారు తక్కువ జాతివారు ; వారితో పెళ్లి సమస్యే లేదు . అక్కడి మ్యారేజ్ బ్యూరోల్లో " బ్రౌన్ తోలు తెల్ల దొరలకు" వేరే బ్యూరో .. "వీసా వారికి" వేరే బ్యూరో ఉంటుంది . నేను ఒక ప్రశ్న అడిగాను. "అదేంటి అమెరికా దేశాన్ని జాతుల సంగమ దేశంగా పిలుస్తారు కదా ? అక్కడ జాతుల పేరు చెప్పడమే తప్పు . పైగా జాతి అంతరాలు మరచి పెళ్లిళ్లు కూడా చేసుకొంటున్నారు అనుకొంటున్నారా ? అవునండీ .. అది అసలే కాపిటలిస్ట్ దేశం . ప్రతి దానికి ఒక లెక్క ఉంటుందట. ఆ దేశంలో అత్యుత్తమ జాతి ఏది ? శ్వేత జాతి కదా ? రెండో స్థానం బ్రౌన్ తోలు తెల్ల దొరలు / దొరసానులు . అంటే ఇండియా చైనా లాంటి దేశాల నుండి వలస వచ్చిన తల్లితండ్రులకు పుట్టి జన్మతః ఆ దేశ పౌరసత్వాన్ని పొందిన వారు . ఇక అట్టడుగు స్థాయిలో ఉన్న వారు వీసాపై వచ్చి చదువుకుంటున్న వారు, ఉద్యోగాలు చేస్తున్నవారు. శ్వేత జాతి అమ్మాయి, రెండో కేటగిరీకి చెందిన వారినో పెళ్లి చేసుకుంటుందా ? మామూలుగా అయితే జరగదు కానీ.. ఒక లెక్క ప్రకారం జరిగే ఛాన్స్ ఉంది. ఆఫ్రికా / ఇండియా మూలం కలిగిన వ్యక్తి బాగా డబ్బు సంపాదించాడు. తెల్ల అమ్మాయికి ఉద్యోగం లేదు. లేదా తక్కువ జీతం వచ్చే ఉద్యోగం . ఇప్పుడు తాను, తన జాతి పరమైన ఉన్నత స్థానాన్ని ట్రేడింగ్ చేసుకొంటుంది . స్టార్ స్టేటస్ పొందిన నల్ల / బ్రౌన్ జాతి మూలాల్ని కలిగిన యువకుడ్ని పెళ్లి చేసుకొంటే .. వీడికి తెల్ల అమ్మాయి దొరికింది అనే తృప్తి. ఆమెకు కాష్ ఫ్లో .. రేపు పెళ్లి పెటాకులు అయితే .. కావాలని పెటాకులు చేసుకొన్నా.. సగం జీతం .. ఆస్థి లో సగం . దెబ్బకు రెండు పిట్టలు . జాతులు కలిసిపోయి కొత్త తరం మానవాళి రూపొందడం ఉత్తుత్తి మాటే .. అక్కడ సరి కొత్త జాతులు వెలుస్తున్నాయి. చర్మం రంగు .. గ్రీన్ కార్డు / పొరసత్వం , శాలరీ ప్యాకేజీ వీటి ఆధారంగా సరి కొత్త జాతులు వస్తున్నాయి. ఇక్కడ ఇంకో తిరకాసు. దక్షిణ భారతీయులు కొంత లిబరల్ అట. ఉత్తర భారత దేశ మూలాలు కలిగిన వారైతే మహా ముదుర్లు అట . మనిషి ..మానవత్వం ..మట్టి.. మశానం..అన్ని ఉత్తుత్తి మాటలే .నువ్వు అమెరికన్ సిటిజానా ? లేక ఆకు పచ్చ కార్డు ? ఆకు పచ్చ కార్డు అయితే ఇక్కడ "ఎర్ర బస్సు ఎక్కి వచ్చిన జనాలు" అంటారే .. అలాగే ట్రీట్ చేస్తారట . దీనికి తోడు నీ శాలరీ ప్యాకేజీ ఏంటి ? బ్యాంకు బాలన్స్ ఎంత ? .. అక్కడితో అయిపోయిందా ? చదివింది ఎక్కడ ? నువ్వు వీసా పైన ఉన్నా.. ఐఐటీ సరుకైతే కాస్త గౌరవం . అదే చైనా కోళ్లఫారాల సరుకంటే మాహా చిన్న చూపంట.ఇలాంటి వారికి ఏదో పేర్లు వున్నాయి. ఇక్కడి మీడియాకు ఎవరైనా చెప్పండయ్యా బాబు .. " మనోళ్లు " మనోళ్లు " అని రాస్తుంటే / చెబుతుంటే ఏదో ఫీలింగ్ వస్తోంది. చివరాకరికి మనోళ్లు కేటగిరీ అయితే .. జో బిడెన్ .. బరాక్ ఒబామా .. చైనా లో ఫుట్ పాత్ పై వస్తువులు అమ్ముకొనే చున్ వన్ ఉఛ్ .. మెక్సికో నుంచి వలస వచ్చి అమెరికా ఇళ్లల్లో పని చేసుకొనే ఇసాబెల్లా .. కెరిమెన్ .. అందరూ.. అందరూ.. అందరూ మనోళ్లే . వారిది మనది హోమో సేపియన్స్ అనే ఒకటే జాతి . కానీ మనోళ్లు అనే ఫీలింగ్ లేని వారిని.. కనీస మానవ విలువలు లేని వారిని ఎగేసుకొని మనోళ్లు మనోళ్లు అనడం పరమ అసహ్యంగా ఉంటుందా ? ఉండదా ? ఇంత ఆత్మ న్యూనత.. ఇంత ఐడెంటిటీ క్రైసిస్ ఏంటో ? వాసిరెడ్డి అమర్ నాథ్, విద్యావేత్త, మానసిక పరిశోధకులు -
భారతీయ అమెరికన్ల విలువ పెంచిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక
ప్రపంచ దేశాలు అనేక ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో వాటికి దిశానిర్దేశం చేసే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్ అజయ్ బంగా ఎన్నికవడం ఇండియాకు గర్వకారణం. ఇండియాలోని పుణె ఖడ్కీ కంటోన్మెంటులో పంజాబీ సిక్కు సైనికాధికారి కుటుంబంలో జన్మించిన 63 ఏళ్ల అజయ్ పాల్ సింగ్ బంగా తర్వాత దేశంలోని అనేక నగరాల్లో విద్యాభ్యాసం చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో కూడా చదివిన బంగా కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అమెరికా పౌరుడయ్యారు. ఈ విషయం ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచ దేశాలను ఆదుకోవడానికి స్థాపించిన ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అధ్యక్ష పదవికి కేవలం అమెరికన్లకు ఎన్నికయ్యే అవకాశం ఇవ్వడం, ఈ బ్యాంక్ జోడు సంస్థ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సారధి పదవిని ఐరోపా దేశీయుడికే ఇవ్వడం ఆనవాయితీ. సాధారణంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి బ్యాంకు బోర్డ్ ఆఫ్ గవర్నర్ల ఏకాభిప్రాయ సాధనతో జరుగుతుంది. అయితే, ఈసారి 24 మంది బోర్డు సభ్యులు పాల్గొన్న ఓటింగ్ ద్వారా బంగా ఎన్నిక బుధవారం నిర్వహించారు. బోర్డులో సభ్యత్వం ఉన్న రష్యా ప్రతినిధి ఈ ఎన్నిక ఓటింగులో పాల్గొనలేదు. భారతదేశంలో పుట్టినాగాని కొన్నేళ్లు దేశంలో పనిచేసిన తర్వాత అమెరికా వెళ్లి అక్కడ పెప్సికో, మాస్టర్ కార్డ్ వంటి దిగ్గజ కంపెనీల్లో బంగా పనిచేశారు. అలా ఆయన అమెరికా పౌరుడు కావడంతో ప్రపంచ బ్యాంక్ సారధిగా ఎన్నికవడం వీలైంది. జూన్ 2 నుంచి ఐదేళ్లు పదవిలో జూన్ 2న కొత్త పదవి స్వీకరించే బంగాను ఈ పదవికి బుధవారం ఎన్నుకునే ముందు సోమవారం ప్రపంచ బ్యాంక్ బోర్డు సభ్యులు నాలుగు గంటలపాటు ఆయనను ఇంటర్వ్యూ చేశారు. ఈ అత్యున్నత పదవికి బంగాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫిబ్రవరి నెలాఖరులో ప్రతిపాదన రూపంలో నామినేట్ చేశారు. ఆయన నామినేషన్ ను బ్యాంకు బోర్డు ఖరారు చేయడం భారతీయ అమెరికన్లతో పాటు భారతీయులకు గర్వకారణంగా భావిస్తున్నారు. గత పాతికేళ్లలో పలువురు భారతీయ అమెరికన్లు అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు, సంస్థల అధిపతులుగా నియమితులై, విజయవంతంగా వాటిని నడుపుతూ మంచి పేరు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ జూన్ ఒకటి వరకూ పదవిలో ఉంటారు. ఆయన గతంలో అమెరికా ఆర్థికశాఖలో ఉన్నతోద్యోగిగా పనిచేసిన గొప్ప ఆర్థికవేత్త. మాల్పాస్ మాదిరిగానే బంగా కూడా ఐదేళ్లు బ్యాంక్ ప్రెసిడెంట్ గా పదవిలో జూన్ 2 నుంచి కొనసాగుతారు. 1944 నుంచి ఇప్పటి వరకూ ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవిని 13 మంది అమెరికన్లు నిర్వహించారు. బాంగాకు ముందు ఆసియా దేశమైన దక్షిణ కొరియాలో పుట్టిన జిమ్ యాంగ్ కిమ్ (2012–2019) కూడా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేశారు. బంగా మాదిరిగానే 1959లో జన్మించిన యాంగ్ ఐదేళ్ల వయసులో తన కుటుంబంతో పాటు అమెరికా వలసపోయి స్థిరపడి అమెరికా పౌరుడయ్యారు. గతంలో ఈ బ్యాంక్ అధ్యక్షులుగా పనిచేసిన ఆర్థికరంగ నిపుణుల్లో యూజీన్ ఆర్ బ్లాక్ (1949–1962), రాబర్ట్ ఎస్ మెక్ నమారా (1968–1981)లు 12 ఏళ్లు దాటి పదవిలో ఉండడం విశేషం. మెక్ నమారా కాలంలోనే ఈ అంతర్జాతీయ బ్యాంక్ తన కార్యకపాలు విస్తరించింది. బ్యాంకు సిబ్బందితోపాటు అనేక దేశాలకు రుణాలు ఇవ్వడం పెంచింది. పేదరిక నిర్మూలనపై దృష్టి పెట్టింది. మెక్ నమారా ఈ బ్యాంక్ ప్రెసిడెంట్ గా ఎన్నికవడానికి ముందు అమెరికా రక్షణ మంత్రిగా పనిచేశారు. మొదటిసారి ఒక భారతీయ అమెరికన్ ఈ ప్రతిష్ఠాత్మక పదవిని చేపట్టడం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికం తగ్గించి, సంపద విస్తరించడానికి కృషి చేసే అత్యంత ముఖ్యమైన సంస్థల్లో ఒకటైన ప్రపంచబ్యాంక్ సారధిగా బంగా అత్యధిక సభ్యుల ఆమోదంతో ఎన్నికవడం హర్షణీయమని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ అభినందించడం భారతీయ అమెరికన్ల సమర్ధతకు అద్దంపడుతోంది. విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ ఎంపీ -
చిన్న గ్రామం.. చెట్ల కింద చదువు: ఇప్పుడు అమెరికాలో..
అమెరికాలో ఉన్న అత్యంత సంపన్నులైన భారతీయులలో ఒకరు 'జై చౌదరి' (Jay Chaudhry). ఒక చిన్న గ్రామంలో పుట్టి చెట్ల కింద చదువుకొని, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటూ ఈ రోజు ఎంతోమందికి ఆదర్శమయ్యాడు. ఇంతకీ జై చౌదరి ఎవరు, అతని విజయ రహస్యం ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో.. సైబర్ సెక్యూరిటీ సంస్థ Zscaler సీఈఓ & ఫౌండర్ 'జై చౌదరి' హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆ గ్రామానికి సరైన విద్యుత్ సరఫరా లేకపోవడమే కాకుండా.. తాగునీటికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు కాబట్టి సరైన సౌకర్యాలు కూడా లేకపోవడంతో చిన్నతనంలో చెట్ల కింద చదువుకునేవాడు. ప్రతిరోజు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొరుగు గ్రామమైన ధుసరాలోని హైస్కూల్‌కు నడిచి వెళ్ళేవాడనని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. పాఠశాల విద్య పూర్తయిన తరువాత వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి, ది యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటిలో ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ మాస్టర్స్ ప్రోగ్రామ్ చదవడానికి అమెరికాకు పయనమయ్యారు. చదువు పూర్తయిన తరువాత సుమారు ఇరవై సంవత్సరాలు ఐబిఎమ్, యూనిసిస్ (Unisys), ఐక్యూ వంటి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేశారు. 1996లో జై చౌదరి సైబర్ సెక్యూరిటీ సంస్థను ప్రారంభించాడు. అంతకంటే ముందు ఇతడు కోర్‌హార్బర్, సెక్యూర్ ఐటీ, సైఫర్‌ట్రస్ట్, ఎయిర్‌డిఫెన్స్ వంటి కంపెనీలను కూడా ప్రారంభించారు. (ఇదీ చదవండి: భారత్‌లో 2023 సుజుకి హయబుసా లాంచ్: ధర వింటే దడ పుట్టాల్సిందే..) 2008లో Zscaler స్థాపించారు. ఇది ప్రస్తుతం 2,600 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ కంపెనీ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే అమెరికాలోని అత్యంత సంపన్నులైన భారతీయుల జాబితాలో ఒకరుగా నిలిచారు. ఈ కంపెనీ విలువ ప్రస్తుతం 15 బిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు సుమారు లక్ష కోట్ల కంటే ఎక్కువ. -
టాప్ అమెరికా ఎంఎన్సీ సీఈవోగా ఇండో అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్
న్యూఢిల్లీ: భారతీయ సంతతికి చెందిన బిజినెస్ ఎగ్జిక్యూటివ్ మరో టాప్ ఇంటర్నేషనల్ కంపెనీ కీలక ఎగ్జిక్యూటివ్‌గా నియమితులయ్యారు. అమెరికాలోని దిగ్గజ మల్టీ నేషనల్ కంపెనీ హనీవెల్ ఇంటర్నేషనల్ కొత్త సీఈఓగా విమల్ కపూర్ ఎంపికయారు. ప్రస్తుత సీఈవీ డారియస్ ఆడమ్జిక్ స్థానంలో కంపెనీ బాధ్యతలు స్వీకరిస్తారు. 57 ఏళ్ల కపూర్ ఏడాది జూన్ 1 నుంచి బాధ్యతలు చేపడతారని కంపెనీ ప్రకటించింది. అలాగే ఈ నెల(మార్చి) 13 నుంచి హనీవెల్ డైరెక్టర్ల బోర్డులో కూడా చేరతారని తెలిపింది తెలిపింది. విమల్ కపూర్ ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్, సీవోవోగా సేవలందిస్తున్నారు. పనిచేస్తున్నారు. అలాగే డారియస్ ఆడమ్జిక్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారని హనీవెల్ స్పష్టం చేసింది. 2018లో ఛైర్మన్‌గా, 2017లోసీఈవోగా నియమితులైన ఆడమ్జిక్ నేతృత్వంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 88 బిలియన్ డాలర్ల నుంచి 145 బిలియన్లకు డాలర్లకు పెరగడం విశేషం. పాటియాలాలోని థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇన్స్ట్రుమెంటేషన్లో స్పెషలైజేషన్‌తో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యారు. ఇండియాలో స్టడీ పూర్తి చేసిన తర్వాత కంపెనీలో చేరిన విమల్ అనేక కీలక పదవులను నిర్వహించారు. నిర్మాణ సాంకేతికతలతో పాటు పనితీరు మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ యూనిట్ల సీఈవోగా సేవలందించారు. వైవిధ్యభరిత తయారీదారుల వివిధ వ్యాపారాలకు నాయకత్వం వహించిన విమల్ కపూర్‌కు మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. హనీవెల్ సీఈవోగా నియమితులైన దాదాపు 10 నెలల తర్వాత మరో కీలక పదవికి ప్రమోట్ అయ్యారు. అమెరికన్ లిస్డెడ్ కంపెనీహనీవెల్ ఇంటర్నేషనల్.. ఏరోస్పేస్, బిల్డింగ్ టెక్నాలజీస్, పెర్ఫార్మెన్స్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీస్, సేఫ్టీ అండ్ ప్రొడక్టివిటీ సొల్యూషన్స్ వ్యాపారాలను నిర్వహిస్తోంది -
Neal Mohan యూట్యూబ్ కొత్త సీఈవో: మరోసారి ఇండియన్స్ సత్తా
సాక్షి, ముంబై: గ్లోబల్ టెక్ కంపెనీలకు సారధులుగా భారతీయ సంతతికి చెందిన నిపుణులు సత్తా చాటుతున్నారు. తాజాగా వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ సీఈవోగా ఇండో అమెరికన్ నీల్మోహన్ నియమితులయ్యారు. తొమ్మిదేళ్ల పాటు యూట్యూబ్ సీఈవోగా పనిచేసిన సుసాన్ వోజ్కికీ తప్పుకోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. భారతీయ-అమెరికన్ నీల్మోహన్ 2015 నుండి యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీచేసిన మోహన్ గతంలో మైక్రోసాఫ్ట్‌తో పాటు పలు టెక్ కంపెనీల్లో కూడా పనిచేశారు. మరోవైపు దాదాపు పాతికేళ్లపాటు గూగుల్‌కు పనిచేసిన తాను జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నానని సుసాన్ చెప్పారు. తన వ్యక్తిగత ప్రాజెక్టులకు సంబంధించి కొత్త పని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తన కెరీర్లో 2007లో డబుల్‌క్లిక్ కొనుగోలుతో గూగుల్‌కు వచ్చినప్పటినుంచీ దాదాపు 15 సంవత్సరాలు మోహన్‌తో కలిసి పనిచేశాననీ ఆమె చెప్పారు. అయితే గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్పిచాయ్కు సలహాదారుగా మార నున్నారని సమాచారం. Thank you, @SusanWojcicki. It's been amazing to work with you over the years. You've built YouTube into an extraordinary home for creators and viewers. I'm excited to continue this awesome and important mission. Looking forward to what lies ahead... https://t.co/Rg5jXv1NGb — Neal Mohan (@nealmohan) February 16, 2023 సుసాన్ వోజ్కికీ కాగా ఇప్పటికే గ్లోబల్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ సంతతికి చెందిన సీఈవోల జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ పెప్సికో ఇంద్రా నూయి, తమ ప్రత్యేకతను చాటుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో నీల్ మోహన్ చేరడం విశేషం. -
భారత సంతతి వైద్యుడికి యూఎస్ సీడీసీలో కీలక పదవి
కోవిడ్-19 మహమ్మారి సమయంలో కీలక సేవలు అందించడంతో పాటు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ఎంతో కృషి చేసిన భారతీయ-అమెరికన్ డాక్టర్ నీరవ్ డి. షా యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (US CDC)లో ప్రిన్సిపల్ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం మైనే సీడీసీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన మార్చిలో తన నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు. సీడీసీ డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీకి ఆయన రిపోర్ట్ చేయనున్నారు. దీనిపై షా మాట్లాడుతూ.. “ఇంతకాలం నాకెంతో సహకరించిన మైనే ప్రజలకు నా ధన్యవాదాలు, వారితో ప్రయాణం మరిచిపోలేనిదని పేర్కొన్నారు. ఏజెన్సీ, రాష్ట్ర ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను పునర్నిర్మించే లక్ష్యంతో షా 2019లో మైనే సీడీసీలో బాధ్యతలు చేపట్టారు. మైనే గవర్నర్ జానెట్ మిల్స్ తన ట్వీట్లో.. “డాక్టర్ షా నాకు నమ్మకమైన సలహాదారు మాత్రమేకాదు మైనే సీడీసీ(Maine CDC)లో అసాధారణ నాయకుడు కూడా. ముఖ్యంగా కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివని’ కొనియాడారు. భారత్ నుంచి వలస వెళ్లిన షా తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. షా విస్కాన్షిన్‌లో పెరిగాడు. లూయిస్విల్లే యూనివర్సిటీలో మనస్తత్వ శాస్త్రం, జీవశాస్త్రంలో ఆయన పట్టా పొందారు. అనంతరం ఆయన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించారు. 2000లో చికాగో విశ్వవిద్యాలయంలో వైద్య పాఠశాలలో చేరారు. షా 2007లో తన జ్యూరిస్ డాక్టర్, 2008లో డాక్టర్ ఆఫ్ మెడిసిన్‌ను పూర్తి చేశారు. -
ఇండియాకు వెళ్లిపో.. ప్రమీలా జయపాల్‌పై దూషణ పర్వం
సియాటెల్: ఇండో-అమెరికన్ కాంగ్రెస్ఉమెన్ ప్రమీలా జయపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫోన్ చేసి మరీ ఓ వ్యక్తి ఆమెను దూషించాడు. అంతేకాదు జాతివివక్ష, జాత్యాహంకారం ప్రదర్శిస్తూ.. ఆమెను ఇండియాకు వెళ్లిపోవాలంటూ బెదిరించాడు. ఇందుకు సంబంధించి ఐదు ఆడియో క్లిప్పులను అమెరికా చట్టసభ్యురాలైన ఆమె తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. మరీ అభ్యంతకరంగా, పరుష పదజాలంతో ప్రమీలా జయపాల్‌ను దూషించాడు ఆ వ్యక్తి. అంతేకాదు పుట్టిన దేశానికే వెళ్లిపోవాలంటూ ఆమెను బెదిరించాడు కూడా. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో అమెరికాలో స్థిరపడిన భారతీయులపై జాత్యహంకారం ప్రదర్శిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఘటనలపై చర్యలు చేపడుతున్నప్పటికీ.. పరిస్థితుల్లో మార్పు మాత్రం రావడం లేదు. Typically, political figures don't show their vulnerability. I chose to do so here because we cannot accept violence as our new norm. We also cannot accept the racism and sexism that underlies and propels so much of this violence. pic.twitter.com/DAuwwtWt7B — Rep. Pramila Jayapal (@RepJayapal) September 8, 2022 చెన్నైలో పుట్టిన ప్రమీలా(55).. సియాటెల్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికా ప్రతినిధుల సభ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి ఇండో-అమెరికన్(డెమొక్రటిక్ పార్టీ తరపున) కూడా ఈమెనే. అయితే ఆమెకు ఇలాంటి అనుభవం ఎదురు కావడం మొదటిసారేం కాదు. ఈ ఏడాది సమ్మర్లో.. సియాటెల్‌లోని ఆమె ఇంటి బయట గన్‌తో ఓ వ్యక్తి వీరంగం వేశాడు. ప్రమీలా కుటుంబ సభ్యుల్ని దూషిస్తూ.. బెదిరింపులకు దిగాడు. దుండగుడ్ని బ్రెట్ ఫోర్సెల్ (49)గా గుర్తించి.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: ఆ డాక్టర్ ఏకంగా హౌస్ కీపర్‌ని పెళ్లి చేసుకుంది! -
బైడెన్ కేబినెట్లో చరిత్ర సృష్టించనున్న భారతీయ సంతతి మహిళ
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన మరో మహిళకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక బాధ్యతలకు ఎంపిక చేశారు. భారతీయ అమెరికన్, భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ ఆరతీ ప్రభాకర్‌ను ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ (ఓఎస్టీపీ) సలహాదారుగా నామినేట్ చేశారు. ఈ నామినేషన్ చారిత్రాత్మకమైంది. ఓఎస్‌టీపికీ సెనేట్ ధృవీకరించిన డైరెక్టర్‌గా నామినేట్ చేసిన తొలి మహిళ, వలసదారు ప్రభాకర్ అని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. దీనికి సెనేట్ ఆమోదం లభిస్తే చీఫ్ అడ్వైజర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా బాధ్యతలు చేపట్టనున్నారు ప్రభాకర్. అలాగే బైడెన్ సర్కార్‌లో పనిచేయనున్న మూడవ ఆసియా అమెరికన్‌గా కూడా ఆమె నిలుస్తారు. ముఖ్య సలహాదారుగా, సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రెసిడెంట్స్ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్‌కు కో-చైర్‌గా, ప్రెసిడెంట్ క్యాబినెట్ సభ్యునిగా ఉంటారని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. బైడెన్ ప్రభుత్వంలో ఇప్పటికే పలువురు భారత సంతతి వ్యక్తులు పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరో ఇండో-అమెరికన్ ప్రభాకర్ చేరడం విశేషం. ఇప్పటిదాకా ఈ పదవిలో ఉన్న ఎరిక్ ల్యాండర్ రాజీనామా నేపథ్యంలో ప్రభాకర్‌ను ఈ పదవికి బైడెన్ నామినేట్ చేశారు. తెలివైన, అత్యంత గౌరవనీయమైన ఇంజనీర్, గొప్ప భౌతిక శాస్త్రవేత్త అని డాక్టర్ ప్రభాకర్‌ను అధ్యక్షుడు బైడెన్ అభివర్ణించారు. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ల ద్వారా అవకాశాలను విస్తరించేందుకు, కష్టతరమైన సవాళ్లను పరిష్కరించి, అసాధ్యాలను సుసాధ్యం చేసేందుకు భారతీయ అమెరికన్లు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీకి నాయకత్వం వహిస్తారని ఆయన అన్నారు. కాగా ప్రభాకర్ కుటుంబం ప్రభాకర్ మూడేళ్ల వయసులో భారతదేశం నుండి అమెరికాకు వలస వెళ్లింది. మొదట చికాగోకు వెళ్లి ఆపై ఆమె 10 సంవత్సరాల వయస్సులో టెక్సాస్‌లోని లుబ్బాక్‌లో స్థిరపడింది. ఆమె టెక్సాస్ టెక్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పొందారు. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్డీ పట్టా పుచ్చుకున్న తొలి మహిళ. ఇక్కడే లక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ కూడా చేశారు. ఆఫీస్ ఆఫ్ టెక్నాలజీ అసెస్మెంట్లో కాంగ్రెషనల్ ఫెలోగా లెజిస్లేటివ్ శాఖలో కరియర్‌ను ప్రారంభిచారు. డాక్టర్ ప్రభాకర్ రెండు వేర్వేరు ఫెడరల్ ఆర్ అండ్‌డీ ఏజెన్సీలకు నాయకత్వం వహించారు. అనేక రంగాలలో స్టార్టప్‌లు, పెద్ద కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ల్యాబ్‌లు, ఎన్జీవోతో కలసి పనిచేసి విశేష సేవలందించారు. ముఖ్యంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఎస్టి)కి నాయకత్వం వహించిన మొదటి మహిళ కూడా ఆరతీప్రభాకర్. ఆ తరువాత డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా పనిచేశారు. -
మిస్ వరల్డ్ 2021: అందాల రాశులు ఒక్కచోట చేరితే..
-
ముఖంపై కాలిన గుర్తులు.. అయినా ఆమె అందగత్తెనే!
Indian-American Shree Saini is first runner-up of Miss World 2021: జీవితంలో ‘చేదు’ను.. ‘తీపి’గా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదురైనా.. ఓర్చుకుంటూ ముందుకు సాగడమే సిసలైన జీవిత ప్రయాణం. చిన్నవయసులోనే మోయలేనంతగా బాధల్ని చవిచూసింది ఆ చిన్నారి. కానీ, తొణకలేదు. పైగా తల్లిదండ్రుల కన్నీళ్లను చిట్టిచేతులతో తుడిచింది. ఎదురించి పోరాడింది. ఎట్టకేలకు.. చిన్నప్పటి కలను సాధించుకుంది. ఏకంగా ప్రపంచ అందాల పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. శ్రీ సైని(26).. భారత మూలాలు ఉన్న యువతి కావడం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. Miss World 2021 పోటీలు మార్చి 17వ తేదీన ప్యూర్టో రికా, శాన్ జువాన్లోని కోకా కోలా హాల్లో ఘనంగా జరిగాయి. పోలాండ్ సుందరి కరోలీనా బెయిలాస్కా(23) Karolina Bielawska ప్రపంచ సుందరి టైటిల్ నెగ్గింది. మాజీ సుందరి జమైకాకు చెందిన టోనీ అన్సింగ్.. ప్రపంచ సుందరి కిరీటంతో కరోలీనాను సత్కరించింది. మొదటి రన్నరప్‌గా మిస్ అమెరికా 2021 శ్రీ సైని నిలవగా.. రెండో రన్నరప్‌గా పశ్చిమ ఆఫ్రికా దేశం కోట్ డీల్వోరికు చెందిన ఒలీవియా యాసే నిలిచింది. ఈ ముగ్గురిలో శ్రీ సైని.. ఇండో అమెరికన్ కాగా.. ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయం కూడా. Our newly crowned Miss World Karolina Bielawska from Poland with 1st Runner Up Shree Saini from United States 2nd Runner up Olivia Yace from Côte d’Ivoire#missworld pic.twitter.com/FFskxtk0KO — Miss World (@MissWorldLtd) March 17, 2022 శ్రీ సైని నేపథ్యం.. అందాల పోటీల్లో భారత సంతతి యువతి శ్రీ సైని ఆకట్టుకుంది. 26 ఏళ్ల సైని.. ప్రపంచ సుందరీమణుల పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. కిందటి ఏడాది అక్టోబర్‌లో జరిగిన మిస్ అమెరికా పోటీల్లో ఆమె విజేతగా నిలిచిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ►మిస్ వరల్డ్ ఫస్ట్ రన్నరప్ శ్రీ సైని స్వస్థలం పంజాబ్‌లోని లూథియానా. సైనికి ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం వాషింగ్టన్కు వలస వెళ్లింది. పసితనం నుంచే ఆమె అడుగులు.. ముళ్ల బాటలో సాగాయి. ► ఐదేళ్ల వయసులో ఆమెకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడింది ఆమె. అందరి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే.. శ్రీ సైనికి కేవలం 20సార్లు మాత్రమే కొట్టుకునేది. ఆమె అందరు పిల్లలాగా ఆడుకోలేని డాక్టర్లు చెప్పారు. చివరికి.. పన్నెండవ ఏటా ఓపెన్ హార్ట్ సర్జరీతో పేస్‌మేకర్ అమర్చారు. ఆపై ఆమె మిగతా పిల్లల్లాగే గెంతులేస్తూ ఆడింది. ► సవ్యంగా సాగుతున్న శ్రీ సైనిపై మరో పిడుగు పడింది. ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె ముఖం బాగా కాలిపోయింది. కానీ, శ్రీ షైని కుంగిపోలేదు. ఆమె కోలుకోవడానికి ఏడాది టైం పడుతుందని వైద్యులు చెప్పారు. కానీ, ఆశ్చర్యకర రీతిలో కేవలం రెండు వారాలకే ఆమె తరగతి గదిలో అడుగుపెట్టింది. తల్లిదండ్రులతో శ్రీ సైని(పాత చిత్రం) ► చిన్నతనంలోనే ప్రపంచ సుందరి కావాలన్న కల నెరవేర్చుకునేందుకు.. ప్రయత్నించింది. కాలిన ఆ మరకలను సహజంగా తగ్గించుకునే ప్రయత్నం చేసింది. అందాల పోటీల్లో పాల్గొంది. 2020లో Miss Washington World గెల్చుకుంది. ► ఆపై మిస్ అమెరికా 2021 కిరీటం దక్కించుకుంది. మిస్ అమెరికా ఫైనల్ పోటీలకు ముందురోజు.. స్టేజ్ మీదే కుప్పకూలిన ఆమె ఆస్పత్రి పాలైంది. అయినా ఆ మరుసటి రోజు నెర్వస్ను పక్కనపెట్టి కిరీటాన్ని దక్కించుకుంది. ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి గానూ.. మిస్ వరల్డ్ బ్యూటీ విత్ ఏ పర్పస్(BWAP) అంబాసిడర్ హోదా కూడా దక్కింది. ► ముఖ కాలిన గాయాలు, గుండె లోపాన్ని అధిగమించిన నా కథ.. రోజువారీ సవాళ్లను అధిగమించడానికి ఇతరులను ప్రోత్సహిస్తుందని నేను ఆశిస్తున్నా. నేను కేవలం 6 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, నేను మిస్ వరల్డ్ వేషం వేసుకున్నాను, ఎందుకంటే నేను మిస్ వరల్డ్‌ను సూపర్ హీరోగా చూశాను. సేవ చేయాలనే ఉద్దేశ్యం నాకు కష్ట సమయాల్లో బలాన్నిచ్చింది. నాకు కష్టాలు తెలుసు. బతకాలనే సంకల్పం నా జీవితాన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది అంటోంది శ్రీ సైని. View this post on Instagram A post shared by SHREE SAINI👑MISS WORLD 1st RU (@shreesaini) -
రష్యాపై అమెరికా ఆంక్షలు.. మనోడిదే కీలక పాత్ర
ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రష్యా, పుతిన్ స్వతంత్ర్య రాజ్యాలుగా గుర్తించిన తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటు ప్రాంతాలపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆంక్షల విధింపులో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తరపున కీలకంగా వ్యవహరించింది భారత సంతతికి చెందిన వ్యక్తే కావడం విశేషం. ఆయనే ఆర్థిక సలహాదారు దలీప్ సింగ్. ఇండో-అమెరికన్ అయిన దలీప్ సింగ్.. నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్‌గా, ఇంటర్నేషనల్ ఎకనమిక్స్ విభాగానికి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా ఉన్నారు. గత కొన్నిరోజులు ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో వైట్ హౌజ్ ప్రెస్ రూమ్‌లో దలీప్ రెండుసార్లు కనిపించారు. రష్యాపై ఆర్థిక ఆంక్షల వ్యవహారంలో బైడెన్‌కు ప్రతీది దగ్గరుండి క్షుణ్ణంగా వివరించడంతో పాటు, ఏ మేర అమలు చేయాలనే విషయాలపై కీలక సూచనలు ఇచ్చింది ఈయనే. అంతేకాదు ఆ అమలును బైడెన్ తర్వాత ప్రపంచానికి ప్రకటించింది దలీప్ సింగ్ కావడం విశేషం. దలీప్ ఏం చెప్పాడంటే.. ‘‘ఉక్రెయిన్‌పై రష్యా దీర్ఘకాలంగా సమీక్ష తర్వాత దండయాత్ర మొదలుపెట్టింది. దానికి మా స్పందనే ఇది. ఇవాళ అధ్యక్షుడు (జో బైడెన్) మిత్రదేశాలు.. భాగస్వాములతో చర్చించి త్వరగతిన ప్రతిస్పందించారు. ఈ చర్యలు చరిత్రలో నిలిచిపోయేవి. ఒక నిర్ణయాత్మక ప్రతిస్పందన కోసం వారాల నుంచి నెలలు పట్టింది.. అంటూ మొదలుపెట్టి సుదీర్ఘంగా ప్రసంగించారు దలీప్ సింగ్. జర్మనీతో రాత్రికి రాత్రే సంప్రదింపులు జరిపి.. పైప్లైన్ల ఆపరేషన్లను నిలిపివేయించాం. ఆపై ఆర్థిక ఆంక్షలు విధించాం. బిలియన్ల డాలర్లు విలువ చేసే ఆస్తుల్ని, ఆర్థిక లావాదేవీలను ఆపేశాం. తద్వారా అమెరికా, యూరప్ దేశాలతో ఎలాంటి లావాదేవీలు ఉండబోవు. పైగా కొత్త అప్పులు పుట్టవు. రష్యా ఉన్నత కుటుంబాలు, ధనికులపై అదనపు చర్యలూ ఉంటాయి. ఇవేం పొరపాటుగా తీసుకున్న నిర్ణయాలు కావు. పరస్సర సహకారంతోనే ముందుకెళ్లాం. ఈరోజు మేము తీసుకున్న చర్యలు మొదటి విడత మాత్రమే. మేము ఇంకా వెల్లడించనివి చాలానే ఉన్నాయి. పుతిన్ గనుక మొండిగా ముందుకెళ్తే.. ఆర్థిక ఆంక్షల్ని, ఎగుమతి నియంత్రణలను ఉపయోగించి ఒత్తిడి పెంచుతాము. మిత్రదేశాల సహకారంతో పూర్తిస్థాయిలో ఆంక్షల్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని దలీప్ సింగ్ స్పష్టం చేశారు. రష్యా పాలనా విధానంలో సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నందునే.. తాను కీలక బాధ్యతలు చేపట్టాల్సిన వచ్చిందంటూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీకి చెప్పడం.. రష్యా ఆంక్షల వ్యవహారంలో దలీప్ సింగ్ ప్రాధాన్యం ఏపాటిదో చెప్పనకనే చెప్తుంది. దలీప్ సింగ్ నేపథ్యం.. దలీప్ సింగ్ పుట్టింది మేరీల్యాండ్ ఓల్నీ, పెరిగింది నార్త్ కరోలినా రాలేయిగ్‌లో. కాంగ్రెస్(అమెరికా చట్ట సభ)కు ఎంపికైన తొలి ఏషియన్ అమెరికన్ దలీప్ సింగ్ సౌంధుకి బంధువు ఈ దలీప్ సింగ్. ఆర్థిక శాస్త్రంలో డీగ్రీ చేసిన దలీప్, పలు ఇంటర్నేషనల్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యల్ని అభ్యసించాడు. గతంలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్‌కి వైస్ ప్రెసిడెంట్‌గా, ఒబామా హయాంలోనూ పలు కీలక బాధ్యతలు నిర్వహిచాడు. ప్రస్తుతం బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా ఉన్నారు 47 ఏళ్ల దలీప్ సింగ్. -
ఈ మాటలు మంచివే!
ఈసారి అమెరికాలో అక్కడి రిటైల్ షాపుల్లో మన ఊరి మామిడి పండ్లు, ద్రాక్షలు, దానిమ్మలు కనిపిస్తే ఆశ్చర్యపోకండి. అలాగే మరికొద్ది రోజుల్లో మన వీధి చివరి సూపర్ బజార్లోనే అమెరికన్ ఛెర్రీలు, పంది మాంసం ఉత్పత్తులు దొరికితే అబ్బురపడకండి. అక్షరాలా అది అంతా భారత – అమెరికాల మధ్య కుదిరిన తాజా వాణిజ్య అంగీకార ఫలితమే! వాణిజ్యంలో కొన్నేళ్ళుగా భారత్ పట్ల అపనమ్మకంతో నడిచిన అమెరికా, ఎట్టకేలకు కొన్ని నియమాలను సడలించడానికి మంగళవారం అంగీకరించడంతో ఈ దృశ్యం ఆవిష్కృతం కానుంది. నాలుగేళ్ళ తరువాత జరిగిన ఇరుదేశాల ‘వాణిజ్య విధాన వేదిక’ (టీపీఎఫ్) తొలి పునఃసమావేశం ఈ కీలక ఘట్టానికి వేదిక అయింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్టీఆర్) క్యాథరిన్ తాయ్ జరిపిన రెండు రోజుల ఢిల్లీ పర్యటన భారత్, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాల్లో పాత అనుమానాలకు తెర దించి, కొత్త తలుపులు తీసింది. వచ్చే ఏడాది మధ్యనాటి కల్లా పరస్పర వాణిజ్య సంబంధాల్లోని చిక్కుముడులను తొలగించుకోవడమే లక్ష్యమని టీపీఎఫ్ వేదికపై ఇరుదేశాలూ అంగీకరించడం శుభసూచకం. దీనితో, కీలకమైన వ్యవసాయ, వ్యవసాయేతర వస్తువులు, సేవలు, పెట్టుబడులు, మేధాసంపత్తి హక్కులు సహా వివిధ అంశాల్లో ప్రయాణం సాఫీ కానుంది. ఈ 5 ప్రధాన అంశాలపై ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూపులు తరచూ సమావేశమై, అందుకు కార్యాచరణను సిద్ధం చేయనున్నాయి. వచ్చే ఏడాది మధ్యలో మరోసారి జరిగే టీపీఎఫ్ మధ్యంతర సమావేశానికి నిర్దిష్ట వాణిజ్య ఫలితాలను ఖరారు చేయనున్నాయి. ఇప్పుడు భారతదేశపు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఏడాది 10 వేల కోట్ల డాలర్ల మార్కును దాటుతుందని అంచనా. చైనాను వెనక్కినెట్టి, అమెరికా ఆ స్థానానికి వచ్చిన పరిస్థితుల్లో టీపీఎఫ్ పునరావిష్కృతం కావడం విశేషం. భారత్‌తో ఏదో తాత్కాలికంగా ఓ మినీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని తాము భావించట్లేదని అమెరికా ముందే స్పష్టం చేసింది. దాంతో, టీపీఎఫ్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌కు అతి పెద్ద ఎగుమతుల విపణి కూడా అమెరికాయే. గడచిన 2020–21లో మన దేశం నుంచి 5.2 వేల కోట్ల డాలర్ల విలువ గల ఎగుమతులు ఆ దేశానికి వెళ్ళాయి. గతంలో డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా, భారత్‌కు ‘ప్రాధాన్యాల సాధారణీకరణ వ్యవస్థ’ (జీఎస్పీ)ని ఉపసంహరించుకుంది. వర్ధమాన దేశాలకు అమెరికా ఇచ్చే ప్రత్యేక వాణిజ్య హోదా అది. ఆ జీఎస్పీ వల్ల వివిధ ఉత్పత్తుల విషయంలో ట్యారిఫ్ తగ్గింపు దక్కుతుంది. ఆ హోదా ఉండడంతో 2018లో అమెరికా నుంచి భారత్ అత్యధికంగా లబ్ధి పొందింది. 2019లో ట్రంప్ సర్కారు ఎత్తేసిన ఆ హోదాను మళ్ళీ అందించాలంటూ ప్రపంచ పెద్దన్నను భారత్ తాజాగా అభ్యర్థించింది. ఆ అభ్యర్థనను పరిశీలిస్తామని అగ్రరాజ్యం పేర్కొనడం తాజా భేటీలోని మరో శుభ సూచన. అలాగే, రెండు దేశాలలోని ఐటీ ఉద్యోగులు తమ తప్పనిసరి సోషల్ సెక్యూరిటీ చందాలను స్వదేశానికి తరలించుకొనేందుకు వీలిచ్చే ఒప్పందం ఇప్పటికి పదేళ్ళ పైగా పెండింగ్‌లో ఉంది. ఆ ఒప్పందం సాధ్యమైతే, భారతీయ ఐటీ ఉద్యోగులు వందల కోట్ల డాలర్ల పదవీ విరమణ నిధులు స్వదేశానికి వచ్చే వీలుంటుంది. దానిపైనా ఇప్పుడు మళ్ళీ చర్చలు మొదలు కానున్నాయి. పటిష్ఠమైన ద్వైపాక్షిక వాణిజ్య బంధాలు, మెరుగైన ఆర్థిక సంబంధాల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనీ, రెండు దేశాల్లోని శ్రామిక జనానికి మేలవుతుందనీ భారత, అమెరికాలు గుర్తించాయి. అందుకే, డిజిటల్ వాణిజ్యం, వ్యవసాయం, మెరుగైన నియంత్రణ విధానాలు, ప్రమాణాల లాంటి ప్రధాన అంశాల్లో సహకారం అందించుకొనేందుకు కృషి చేయనున్నాయి. అలాగే, రెండు దేశాల మధ్య నిర్దిష్టమైన విపణి అందుబాటు సమస్యలు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని పరస్పరం పరిష్కరించుకోవడం వల్ల ఇటు భారతీయ రైతులకూ, అటు అమెరికన్ రైతులకూ, అలాగే వ్యాపార సంస్థలకూ స్పష్టమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఆ సంగతి కూడా తాజా భేటీలో రెండు దేశాల మంత్రులూ అంగీకరించారు. వచ్చే వారమే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సభ్యదేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ తాజా భేటీ కొత్త ఆశలు రేపింది. రెండు దేశాల మధ్య అపరిష్కృత డబ్ల్యూటీఓ వివాదాలకూ పరిష్కారాలు కనుగొనాలని నిర్ణయించారు. అలాగే, సైబర్ ప్రపంచం, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధ (ఏఐ), 5జీ, 6జీ, అత్యాధునిక టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీలలో చైనా సంస్థలతో కొంత అసౌకర్యం అనిపిస్తుండడంతో... వాటిపై పరస్పర భావవినిమయం చేసుకోవాలని భారత్ – అమెరికా భావిస్తున్నాయి. వర్తమాన పరిస్థితుల్లో ఇవన్నీ కీలకమైన అంశాలే. అందుకే, భవిష్యత్ ఫలితాల మాటెలా ఉన్నా, అసలంటూ సమస్యను గుర్తించి, పరిష్కారానికి నడుం బిగించడం వరకు అమెరికా, భారత్ వాణిజ్య సంబంధాల భేటీ విజయం సాధించింది. నాలుగేళ్ళుగా పాదుకున్న ప్రతిష్టంభనను తొలగించింది. ట్యారిఫ్‌లపై అటు ట్రంప్ చర్యలు, ఇటు భారత పాలకుల ప్రతిచర్యలతో అప్పట్లో బిగుసుకున్న వాణిజ్య సంబంధాలు, ఒప్పందాలు బైడెన్ కాలంలో తేలికపడితే మంచిదే! కరోనా అనంతర వేళ కీలక సరఫరాల కోసం చైనాపై అతిగా ఆధారపడక, భారత్‌ను కీలక భాగస్వామిని చేసుకోవాలన్న అగ్రరాజ్యపు ఆలోచన మనకు ఇప్పుడు కలిసొచ్చేదే! అమెరికా సర్కారు నుంచి పలువురి వరుస పర్యటనల్ని సద్వినియోగం చేసుకోవాల్సింది మనమే! -
టైమ్స్ జాబితాలో ఇండో అమెరికన్ !
వివిధ రంగాల్లో తమదైన ముద్రవేస్తూ ఎంతో మందికి ప్రేరణగా నిలిచే వందమంది జాబితాను టైమ్స్ మ్యాగజీన్ ఇటీవల విడుదల చేసింది. ‘అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా–2021’లో అమెరికా అధ్యక్షుడు జో బైడన్ , ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌లతోపాటు మన దేశానికి చెందిన నలుగురు ప్రముఖులు చోటుదక్కించుకున్నారు. వీరిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, సీరమ్ ఇన్ స్టిట్యూట్ సీఈవో అడర్ పూనావాల, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏ3పీసీఓఎన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంజుషా పి కులకర్ణిలు ఉన్నారు. మంజుషా ఏషియన్ పసిఫిక్ పాలసీ అండ్ ప్లానింగ్ కౌన్సిల్(ఏ3పీసీఓఎన్)కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ లక్షలమంది జాత్యహంకారానికి గురైన బాధితులకు సాయం చేస్తున్నారు. నలభైకి పైగా కమ్యూనిటీ సంస్థలను ఏకతాటిపైకి తీసుకువచ్చి పదిహేను లక్షలమంది ఆసియన్ అమెరికన్స్, పసిఫిక్ ఐలాండ్ పౌరుల హక్కుల కోసం పోరాడుతున్నారు. అంతేగాక కోవిడ్–19 తర్వాత జాత్యహంకార దాడులకు వ్యతిరేకంగా పోరాడేందుకు స్టాప్ ఏఏపీఐ(ఏషియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్–ఏఏపీఐ) స్థాపించి దాని ద్వారా పోరాడుతున్నారు. మంజుషా ఇండియాలో పుట్టింది. కొన్నాళ్లల్లోనే తల్లిదండ్రులు వృత్తిరీత్యా అమెరికాకు వెళ్లడంతో ఆమె బాల్యం అంతా అక్కడే గడిచింది. అలబామాలోని మోంట్‌గోమెరీలో ఇండియన్ కుటుంబాలు ఎక్కువగా ఉండడంతో వాళ్లతో కలిసి పెరుగుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ పెరిగింది. తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు కావడంతో తను కూడా ముందుగా డాక్టర్ అవ్వాలనుకుంది. కానీ తనకు లా అంటే అమితాసక్తి ఉండడంతో మెడిసిన్ కాకుండా లా చదువుతానని తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు వద్దని వారించినప్పటికీ తనే నిర్ణయం తీసుకుని లా చదివింది. లా తోపాటు పౌరుల హక్కుల గురించి విపులంగా తెలుసుకున్న మంజుషా అవి సక్రమంగా అమలు కావాలని కోరుకునేది. స్కూల్లో చదివేప్పటి నుంచి తన తోటి విద్యార్థులు శరీర రంగు కారణంగా వివక్షకు గురికావడం, తన కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు జాత్యహంకారంతో చిన్నచూపు చూసిన సందర్భాలు అనేకం ఎదుర్కొంది. ఇవి నచ్చని మంజుషా వాటికి వ్యతిరేకంగా పోరాడాలనుకునేది. లా అయ్యాక.. బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరీస్ డాక్టర్ లా డిగ్రీ అయ్యాక సదరన్ పావర్టీ లా సెంటర్లో ఇంటర్న్‌షిప్ చేసింది. ఈ సమయంలో పౌరుల హక్కుల గురించి మరింత అధ్యయనం చేసింది. జాత్యహంకారానికి గురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి? న్యాయపరమైన హక్కులు ఏమి ఉన్నాయో మరింత లోతుగా తెలుసుకుంది. ఈ క్రమంలోనే నేషనల్ హెల్త్ లా ప్రోగ్రామ్(ఎన్హెచ్ఈఎల్పీ)లో చేరి.. శాసన, పరిపాలన, న్యాయపరమైన శిక్షణా కార్యక్రమాలు, సాంకేతిక సహాయం, నిరుపేదలకు న్యాయపరమైన సలహాలు, సూచనలు, వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించేది. తరువాత ఎన్హెచ్ఈఎల్పీ నుంచి తప్పుకుని సౌత్ ఏషియన్ నెట్వర్క్(సాన్)కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలను చేపట్టి మరికొంతమంది పౌరులకు ఆరోగ్య, పౌరుల హక్కుల గురించి పనిచేసింది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వర్ణ వివక్షపై పోరాడుతూ ఉండేది. తరువాత మరో ఇద్దరితో కలిసి ఏషియన్ పసిఫిక్ పాలసీ అండ్ ప్లానింగ్ కౌన్సిల్ (ఏ3పీసీఓఎన్) ను స్థాపించి దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ జాత్యహంకార దాడులకు బలవుతున్న బాధితులకు అండగా నిలబడి పోరాడుతోంది. ఏఏపీఐ.. గతేడాది కోవిడ్–19 ప్రపంచం మీద విరుచుకు పడడంతో..కోవిడ్ వైరస్ చైనాలో పుట్టిందని, చైనా వైరస్, వూహాన్ వైరస్ అని దూషిస్తూ అమెరికాలో ఉన్న చైనీయులపై దాడులు చేయడం, జాత్యహంకార దాడులు పెరగడం, అప్పటి అధ్యక్షుడు ఏషియన్ దేశాలకు వ్యతిరేక విధానాలు అమలు చేయడంతో.. దీనిని ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో... ఏషియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ)ను ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలబడి, కావాల్సిన సాయం చేస్తోంది. అంతేగాక గత రెండు దశాబ్దాలుగా జాతి సమానత్వం కోసం పోరాడుతుండడంతో ఆమెను టైమ్స్ మ్యాగజీన్ 2021 గాను వందమంది అత్యంత ప్రభావవంతమైన జాబితాలో చేర్చింది. 2014లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా హయాంలో వైట్ హౌస్ నుంచి ‘చాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డును అందుకుంది. ఒకపక్క తన కుటుంబాన్ని చూసుకుంటూనే మరో పక్క సమాజ సేవచేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నందున మంజుషా కులకర్ణికి టైమ్స్ వందమంది ప్రభావవంతుల జాబితాలో చోటు లభించింది. -
మరో భారతీయ అమెరికన్‌కు ఉన్నత పదవి!
వాషింగ్టన్: అమెరికాలో బైడెన్ ప్రభుత్వం మరో భారతీయ అమెరికన్‌ను ఉన్నత పదవికి నామినేట్ చేసింది. అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛకు సంబంధించిన అంబాసిడర్–ఎట్–లార్జ్ పదవికి రషద్ హుస్సేన్(41)ను దేశాధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రకటించింది. అంబాసిడర్–ఎట్–లార్జ్ పదవిలో ఉన్న వారు అమెరికా తరఫున కేవలం ఒక దేశానికే రాయబారిగా ఉండబోరు. పలు దేశాలకు, వేర్వేరు బాధ్యతల్లో రాయబారిగా, అవసరమైతే మంత్రిగా వ్యవహరిస్తారు. ఐక్యరాజ్యసమితి, యురోపియన్ యూనియన్ (ఈయూ)ల్లో అమెరికా తరఫున అంతర్జాతీయ చర్చల్లో పాల్గొంటారు. ఇంతటి ఉన్నత పదవికి అమెరికా ఒక ముస్లింను నామినేట్ చేయడం ఇదే ప్రథమం. ప్రస్తుతం హుస్సేన్ అమెరికా జాతీయ భద్రతా మండలిలో పార్ట్నర్షిప్స్, గ్లోబల్ ఎంగేజ్మెంట్ విభాగం డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో బరాక్ ఒబామా హయాంలో ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఐవోసీ)లో అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా, వ్యూహాత్మక ఉగ్రవ్యతిరేక విభాగం ప్రత్యేక ప్రతినిధిగా, వైట్‌హౌస్ బృందంలో డెప్యూటీ అసోసియేట్‌గా బాధ్యతలు నిర్వహించారు. -
Wimbledon 2021: బాలుర టైటిల్ నెగ్గిన సమీర్ బెనర్జీ
లండన్: వింబుల్డన్ 2021లో ఇండో అమెరికన్ సమీర్ బెనర్జీ సంచలనం సృష్టించాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో జరిగిన ఈ పోటీల్లో బాలుర విభాగంలో పోటీ పడ్డ సమీర్ బెనర్జీ (17) తుదిపోరులో అమెరికాకు చెందిన విక్టర్ లిలోవ్‌పై 7-5, 6-3 తేడాతో విజయం సాధించాడు. జూనియర్ గ్రాండ్‌స్లామ్‌లో పోటీ పడ్డ రెండోసారే సమీర్.. ఈ ఘనత సాధించాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి విశేషంగా ఆకట్టుకుంటూ టైటిల్‌ను కైవసం చేసుకున్న సమీర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. రానున్న కాలంలో పురుషుల టెన్నిస్‌ను ఏలుతాడంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురుస్తోంది. A future men's champion? Samir Banerjee might well be a name you become more familiar with in the future#Wimbledon pic.twitter.com/byAEBwBrSp— Wimbledon (@Wimbledon) July 11, 2021 కాగా, భారత్‌కు చెందిన యూకీ బాంబ్రీ జూనియర్ విభాగంలో చివరిసారిగా 2009 ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్‌ను గెలిచాడు. అంతకుముందు లియాండర్ పేస్ (1990 వింబుల్డన్), రమేష్ కృష్ణన్ (1979 ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్), రామనాథన్ కృష్ణన్ (1954 వింబుల్డన్) జూనియర్ విభాగంలో గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను చేజిక్కించుకున్నారు. -
తొలిసారి అంతరిక్షంలోకి తెలుగు మూలాలున్న మహిళ
-
బైడెన్ బృందంలో మరో భారతీయురాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష స్థానాన్ని అధిరోహించనున్న జో బైడెన్ తన టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తన బృందంలో భారత సంతతికి చెందిన వారికి పెద్దపీట వేస్తున్న బైడెన్ ఇప్పుడు మరొకరికి కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. శ్వేత భవనంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌కు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా 32 ఏళ్ల భారత సంతతికి చెందిన సబ్రినా సింగ్‌ను నియమించారు. ఎన్నికల సమయంలో బైడెన్, కమలా హ్యారీస్‌కు మీడియా కార్యదర్శిగా సబ్రినా సింగ్ పని చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అంతకుముందు అమెరికాలో డెమొక్రటిక్ నేషనల్ కమిటీలో కమ్యూనికేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. గతంలో సబ్రినా మైక్ బ్లూంబర్గ్ అధ్యక్ష ప్రచార సీనియర్ ప్రతినిధిగా, కోరీ బుకర్ అధ్యక్ష ప్రచారానికి నేషనల్ ప్రెస్ సెక్రెటరీగా పని చేసింది. అమెరికన్ బ్రిడ్జ్ ట్రంప్ వార్ రూమ్ ప్రతినిధి, హిల్లరీ క్లింటన్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రాంతీయ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గానూ సేవలందించారు. ఆమె ఎస్కేడీకే నికర్ బాకర్ కన్సల్టింగ్ సంస్థ, రిపబ్లిక్ జాన్ షాకోవ్స్కీకి కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా, వివిధ డెమొక్రాటిక్ కమిటీల్లోనూ పని చేశారు. ఎంతో గౌరవం: సబ్రినా సింగ్ డిప్యూటీ ప్రెస్ కార్యదర్శిగా నియమితులవడంపై సబ్రినా సింగ్ సంతోషం వ్యక్తం చేసింది. వైట్‌హౌస్ బృదంలో చేరడం ఎంతో గొప్ప విషయమని, గౌరవంగా భావిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. కమలా హ్యారీస్‌కు పని చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు. -
యూఎస్ డిఫెన్స్: కశ్యప్ పటేల్‌కు కీలక పదవి
వాషింగ్టన్ : భారత సంతతికి చెందిన కశ్యప్ ప్రమోద్ పటేల్ (కాష్ పటేల్‌ను) అమెరికా రక్షణ కార్యదర్శి క్రిస్ మిల్లర్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ప్రకటించారు. ఈ మేరకు పెంటగాన్ ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ రక్షణ కార్యదర్శిగా మార్క్ ఎస్పర్‌ను ట్రంప్ తొలిగించిన ఒకరోజు తర్వాత ఈ నియాయకం జరిగింది. ‘మార్క్ ఎస్పర్‌ని తొలగిస్తున్నాం. ఆయన దేశానికి అందించిన సేవలకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్క్ స్థానంలో క్రిస్ మిల్లర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జెన్ స్టీవర్ట్ స్థానంలో ఇండో-అమెరికాన్ కశ్యప్ పటేల్‌ను నియమించారు. గతంలో వైట్‌హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీలో జాతీయ ఉగ్రవాద నిరోధక సీనియర్ న్యాయవాదిగా పటేల్ పనిచేశారు. 2019 జూన్‌లో జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్సీ) సీనియర్ డైరెక్టర్‌గానూ సేవలందించారు. (రక్షణ శాఖా మంత్రి మార్క్ ఎస్పర్ తొలగింపు! ) న్యూయార్క్‌లో జన్మించిన కశ్యప్ పటేల్‌కు భారత్‌లోని గుజరాత్ మూలాలున్నాయి. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాకు చెందినవారు. 1970లో కెనడా నుంచి వచ్చి అమెరికాలోని న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. స్కూలింగ్ అనంతరం ఫ్లోరిడాలో పై చదువులు అభ్యసించిన కశ్యప్ పటేల్ వాషింగ్టన్ డీసీకి ప్రాసిక్యూరట్గా పనిచేశారు. ఆ తర్వాత తూర్పు ఆఫ్రికా, కెన్యా, అమెరికా సహా పలు ప్రాంతాల్లో పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయనను డిఫెన్స్ విభాగంలోని స్పెషల్ ఆపరేషన్ కమాండో సభ్యునిగా యూఎస్ ప్రభుత్వం నియమించింది. (అధికార మార్పిడికి ట్రంప్ మోకాలడ్డు! ) -
జర్నలిస్ట్ మృతికి సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: అమెరికాలో కరోనా బారిన పడిన ప్రముఖ జర్నలిస్ట్ కంచిభొట్ల బ్రహ్మానందం మరణించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంచిభొట్ల పాత్రికేయునిగా జీవితం ప్రారంభించారు. అనంతరం ఆంగ్ల వార్తా సంస్థ యూఎన్ఐలో పని చేశారు. తర్వాత అక్కడే న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. జర్నలిజంలోనే కొనసాగుతూ పేరు ప్రఖ్యాతులు గడించారు. కొద్ది రోజుల క్రితం అతనికి కరోనా సోకింది. దీంతో అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. సోమవారం మృతి చెందినట్లు న్యూయార్క్ వైద్యులు ధ్రువీకరించారు కరోనా బారిన పడి మరణిస్తున్న భారతీయు సంఖ్య పెరగడం అందరినీ కలవరపరుస్తోంది. కాగా న్యూయార్క్‌తోపాటు న్యూజెర్సీలో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. కేవలం ఈ రెండు రాష్ట్రాల్లోనే ఇప్పటివరకు లక్షా 70 వేల మంది కరోనా బారిన పడ్డారు. దీని బారిన పడి అమెరికాలో ఇప్పటివరకు పదివేల మందికి పైగా మరణించగా, ఒక్క న్యూయార్క్‌లోనే 4,758 మంది ప్రాణాలు విడిచారు. (వారికి సాయం అందించండి : సీఎం జగన్)