
డెవిల్స్ సైడ్ అని పిలువబడే 250 అడుగుల కొండపై కారును నడుపుతూ తన కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నించిన ఇండో అమెరికన్ డాక్టర్‌ను మెడిసిన్ ప్రాక్టీస్ చేయకుండా నిషేధించారు. వివరాల ప్రకారం.. రేడియాలజిస్ట్ ధర్మేష్ పటేల్ తన కారులో శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణాన ఉన్న పసిఫిక్ కోస్ట్ హైవే నుంచి జనవరి 2, 2023న కొండపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇది అతను ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. అతను మాత్రం ఈ నేరాన్ని అంగీకరించలేదు.
ప్రమాద సమయంలో అతని ఇద్దరు పిల్లలు, భార్య నేహా పటేల్ ఆ కారులో ఉన్నారు. వెంటనే రెస్క్యూలో సహాయం చేయడానికి అధికారులను ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది చిన్నారులను స్ట్రెచర్లపై రోడ్డుపైకి తీసుకొచ్చి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దంపతులకు ప్రాణాపాయం తప్పిన తీవ్ర గాయాలు కావడంతో వారిని హెలికాప్టర్‌లో ఎక్కించి హైవేపైకి తీసుకెళ్లి.. అక్కడ వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి విడుదలైన తర్వాత, పటేల్ ఉద్దేశపూర్వకంగా తన కుటుంబాన్ని హత్య చేసేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలతో అధికారులు అరెస్టు చేశారు. అంతేకాకుండా అతను మెడిసిన్ ప్రాక్టీస్ చేయకుండా నిషేధించారు.
Comments
Please login to add a commentAdd a comment