అమెరికాలో ఉన్న అత్యంత సంపన్నులైన భారతీయులలో ఒకరు 'జై చౌదరి' (Jay Chaudhry). ఒక చిన్న గ్రామంలో పుట్టి చెట్ల కింద చదువుకొని, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటూ ఈ రోజు ఎంతోమందికి ఆదర్శమయ్యాడు. ఇంతకీ జై చౌదరి ఎవరు, అతని విజయ రహస్యం ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో..
సైబర్ సెక్యూరిటీ సంస్థ Zscaler సీఈఓ & ఫౌండర్ 'జై చౌదరి' హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆ గ్రామానికి సరైన విద్యుత్ సరఫరా లేకపోవడమే కాకుండా.. తాగునీటికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు కాబట్టి సరైన సౌకర్యాలు కూడా లేకపోవడంతో చిన్నతనంలో చెట్ల కింద చదువుకునేవాడు.
ప్రతిరోజు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొరుగు గ్రామమైన ధుసరాలోని హైస్కూల్‌కు నడిచి వెళ్ళేవాడనని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. పాఠశాల విద్య పూర్తయిన తరువాత వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి, ది యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటిలో ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ మాస్టర్స్ ప్రోగ్రామ్ చదవడానికి అమెరికాకు పయనమయ్యారు.
చదువు పూర్తయిన తరువాత సుమారు ఇరవై సంవత్సరాలు ఐబిఎమ్, యూనిసిస్ (Unisys), ఐక్యూ వంటి పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలలో పనిచేశారు. 1996లో జై చౌదరి సైబర్ సెక్యూరిటీ సంస్థను ప్రారంభించాడు. అంతకంటే ముందు ఇతడు కోర్‌హార్బర్, సెక్యూర్ ఐటీ, సైఫర్‌ట్రస్ట్, ఎయిర్‌డిఫెన్స్ వంటి కంపెనీలను కూడా ప్రారంభించారు.
(ఇదీ చదవండి: భారత్‌లో 2023 సుజుకి హయబుసా లాంచ్: ధర వింటే దడ పుట్టాల్సిందే..)
2008లో Zscaler స్థాపించారు. ఇది ప్రస్తుతం 2,600 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ కంపెనీ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే అమెరికాలోని అత్యంత సంపన్నులైన భారతీయుల జాబితాలో ఒకరుగా నిలిచారు. ఈ కంపెనీ విలువ ప్రస్తుతం 15 బిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు సుమారు లక్ష కోట్ల కంటే ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment