richest Indian
-
రూ.20కోట్లు ఇవ్వకపోతే చంపుతామంటూ అంబానీకి ఈమెయిల్..నిందితుడు ఎవరంటే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని చంపుతామంటూ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తనకు రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తానని ఒక వ్యక్తి అంబానీని ఈమెయిల్ ద్వారా బెదిరించినట్లు చెప్పారు. "మీరు మాకు రూ.20 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపుతాము. భారతదేశంలోనే అత్యుత్తమ షూటర్లు మా వద్ద ఉన్నారు" అని ఈమెయిల్ వచ్చినట్లు చెప్పారు. అయితే ఆ ఈమెయిల్ అక్టోబరు 27న షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి అకౌంట్ ద్వారా వచ్చినట్లు పోలీసులు ధ్రువపరిచారు. అంబానీ నివాసం యాంటిలియాలోని భద్రతా అధికారులు హత్య బెదిరింపుకు సంబంధించిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడంతో విచారణ ప్రారంభించారు. (ఇదీ చదవండి: 29.7 శాతం పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం) అంబానీ, అతని కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బెదిరిస్తూ అనామక కాల్స్ చేసినందుకు బిహార్‌కు చెందిన ఒక వ్యక్తిని ముంబై పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు. దక్షిణ ముంబైలోని అంబానీ కుటుంబ నివాసం 'యాంటిలియా'తో పాటు హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌ను పేల్చివేస్తానని ఆ వ్యక్తి కాల్ చేసి బెదిరించాడు. -
ఎవరీ నీలిమ మోటపర్తి? ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Divis Laboratories Nilima Motaparti: భారతదేశంలో ఉన్న అత్యంత ధనిక మహిళలో ఒకరైన 'నీలిమ మోటపర్తి' (Nilima Motapatri) గురించి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ 'దివిస్ లాబొరేటరీస్' గురించి తప్పకుండా వినే ఉంటారు. ప్రస్తుతం ఈ కంపెనీ బాధ్యతలు చేపడుతూ వరుస లాభాల్లో పయనిస్తున్న నీలిమా గురించి ఇక్కడ తెలుసుకుందాం. దివిస్ లాబొరేటరీస్ సంస్థను స్థాపించిన మురళీ కృష్ణ దివి కుమార్తె నీలిమ మోటపర్తి. ఈమె గ్లాస్లో యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌లో పూర్తి చేసి, ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన మెటీరియల్ సోర్సింగ్, ప్రొక్యూర్మెంట్, కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్వెస్టర్ రిలేషన్స్ వంటి అన్ని కార్యకలాపాలను చూసుకుంటోంది. 2021లో ఈమె ఆదాయం సుమారు 51 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. (ఇదీ చదవండి: రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!) నిజానికి దివిస్ లాబొరేటరీస్ స్థాపించిన మురళీ కృష్ణ దివి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. మురళీ కృష్ణ కుటుంబం ఒకప్పుడు తన తండ్రికి వచ్చే పెన్షన్ మీద ఆధారపడి బ్రతికింది. జీవితంలో ఎన్నెన్నో కష్టాలు చూసిన మురళీ కృష్ణ తన 25 సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్లి ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. అప్పట్లో తన వద్ద కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయని ఫోర్బ్స్ ఇండియా గతంలో వెల్లడించినట్లు సమాచారం. దివిస్ లాబొరేటరీస్ ఆవిర్భావం.. అమెరికా వెళ్లిన తరువాత నిరంతర శ్రమతో కస్టపడి అతి తక్కువ కాలంలోనే భారతదేశంలో దివీస్ లాబొరేటరీస్ 5.8 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ ధనిక శాస్త్రవేత్తల్లో ఒకరిగా నిలిచారు. దివీస్ లేబొరేటరీస్ 1990లో దివీస్ రీసెర్చ్ సెంటర్‌గా స్థాపించారు, ఆ తరువాత క్రమంగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. 1994 నాటికి దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్‌గా స్థిరపడింది. (ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!) తండ్రి స్థాపించిన సంస్థలో నీలిమ మోటపత్రి 2012లో చేరి, అప్పటి నుంచి ఈ కంపెనీ అభివృద్ధికి దోహదపడుతోంది. ఉద్యోగంలో చేరకముందే ఈమెకు మెటీరియల్ రిక్వైర్మెంట్, ఫైనాన్సింగ్ అండ్ ఆసీకాంటింగ్ వంటి వాటిలో సుమారు ఐదు సంవత్సరాల అనుభవం ఉంది. మొత్తం మీద నీలిమా తండ్రికి తగ్గ తనయురాలిగా కంపెనీ బాధ్యతలు చేపట్టి విజయ మార్గంలో పయనిస్తోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలు, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
చిన్న గ్రామం.. చెట్ల కింద చదువు: ఇప్పుడు అమెరికాలో..
అమెరికాలో ఉన్న అత్యంత సంపన్నులైన భారతీయులలో ఒకరు 'జై చౌదరి' (Jay Chaudhry). ఒక చిన్న గ్రామంలో పుట్టి చెట్ల కింద చదువుకొని, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటూ ఈ రోజు ఎంతోమందికి ఆదర్శమయ్యాడు. ఇంతకీ జై చౌదరి ఎవరు, అతని విజయ రహస్యం ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో.. సైబర్ సెక్యూరిటీ సంస్థ Zscaler సీఈఓ & ఫౌండర్ 'జై చౌదరి' హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆ గ్రామానికి సరైన విద్యుత్ సరఫరా లేకపోవడమే కాకుండా.. తాగునీటికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు కాబట్టి సరైన సౌకర్యాలు కూడా లేకపోవడంతో చిన్నతనంలో చెట్ల కింద చదువుకునేవాడు. ప్రతిరోజు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొరుగు గ్రామమైన ధుసరాలోని హైస్కూల్‌కు నడిచి వెళ్ళేవాడనని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. పాఠశాల విద్య పూర్తయిన తరువాత వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి, ది యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటిలో ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ మాస్టర్స్ ప్రోగ్రామ్ చదవడానికి అమెరికాకు పయనమయ్యారు. చదువు పూర్తయిన తరువాత సుమారు ఇరవై సంవత్సరాలు ఐబిఎమ్, యూనిసిస్ (Unisys), ఐక్యూ వంటి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేశారు. 1996లో జై చౌదరి సైబర్ సెక్యూరిటీ సంస్థను ప్రారంభించాడు. అంతకంటే ముందు ఇతడు కోర్‌హార్బర్, సెక్యూర్ ఐటీ, సైఫర్‌ట్రస్ట్, ఎయిర్‌డిఫెన్స్ వంటి కంపెనీలను కూడా ప్రారంభించారు. (ఇదీ చదవండి: భారత్‌లో 2023 సుజుకి హయబుసా లాంచ్: ధర వింటే దడ పుట్టాల్సిందే..) 2008లో Zscaler స్థాపించారు. ఇది ప్రస్తుతం 2,600 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ కంపెనీ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే అమెరికాలోని అత్యంత సంపన్నులైన భారతీయుల జాబితాలో ఒకరుగా నిలిచారు. ఈ కంపెనీ విలువ ప్రస్తుతం 15 బిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు సుమారు లక్ష కోట్ల కంటే ఎక్కువ. -
భారత అపర కుబేరుల సంపద.. దిమ్మతిరిగి పోయే వాస్తవాలు
మన దేశంలో ధనికుల సంపద.. దాని గురించి దిమ్మ తిరిగి పోయే వాస్తవాలు ఒక అధ్యయనం వెల్లడించింది. భారత్ లో సంపన్నులు 1 శాతం ఉంటే.. దేశం మొత్తం సంపద లో 40 శాతం వాళ్ళ దగ్గరే ఉంది. ఇక సగం జనాభా దగ్గర ఉన్న సంపద కేవలం 3 శాతం మాత్రమే!!.. దావోస్ వేదికగా జనవరి 16 నుంచి జనవరి 20 వరకు వరల్డ్ ఎకనమిక్స్ ఫోరమ్ వార్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లోని తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రారంభమైన స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో మనదేశ సంపన్నుల వివరాలు, వారి వద్ద ఉన్న సంపదతో ఏమేమి చేయొచ్చో పొందుపరిచింది. పిల్లలను బడుల్లో చేర్పించవచ్చు టాప్ 100 భారతీయ బిలియనీర్లకు 2.5 శాతం పన్ను విధించడం లేదా టాప్ 10 భారతీయ బిలియనీర్లపై 5 శాతం పన్ను విధించడం వల్ల పేదరికం కారణంగా చదువుకు దూరమైన పిల్లలను బడుల్లో చేర్పించవచ్చని తెలిపింది. అదాని అవాస్తవిక లాభాలపై ట్యాక్స్ విధిస్తే ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. 128.3 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో భారత్‌కు చెందిన గౌతమ్ అదానీ మూడో స్థానంలో ఉన్నారు. అయితే అదానీ 2017 నుంచి 2021 వరకు సంపాదించిన అవాస్తవిక లాభాలపై ఒక్కసారి ట్యాక్స్ విధిస్తే 1.79లక్షల కోట్లను సమీకరించవచ్చు. ఆ మొత్తాన్ని సంవత్సరానికి ఐదు మిలియన్లకు పైగా భారతీయ ప్రాథమిక పాఠశాల్లో ఉపాధ్యాయుల్ని నియమించుకునేందుకు సరిపోతుంది. పోషక ఆహార లోపం తగ్గించొచ్చు పోషకాహార లోపం.. చిక్కిపోయిన (ఐదేండ్లలోపు పిల్లలు) (ఎత్తుకు తగ్గ బరువులేని పిల్లలు), ఎదుగుదలలేని పిల్లలు (వయస్సుకు తగ్గ ఎత్తులేని పిల్లలు) పిల్లల మరణాలు వంటి నాలుగు పారామీటర్స్ ఆధారంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (ప్రపంచ ఆకలి సూచీ)-2022లో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా 121 దేశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులను విడుదల చేయగా భారత్ 107వ స్థానాన్ని దక్కించుకుంది. తాజా ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ నివేదికలో.. భారత్‌లో ఉన్న బిలియనీర్లలో ఒక్కసారి 2శాతం ట్యాక్స్ విధిస్తే రూ.40,423కోట్లను సమీకరించవచ్చు. ఆ మొత్తంతో వచ్చే మూడేళ్లలో దేశ మొత్తంలో పోషక ఆహార లోపంతో బాధపడుతున్న వారికి బలవర్ధకమైన ఆహారాన్ని అందించవచ్చు. 1.5 రెట్లు ఎక్కువ భారత్‌లో ఉన్న 10 మంది బిలియనీర్లపై ఒక్కసారి 5శాతం ట్యాక్స్ విధిస్తే రూ.1.37లక్షల కోట్లు సమీకరించవచ్చు. ఆ మొత్తం ఎంతంటే? 2022-23లో కేంద్ర సంక్షేమ పథకాలైన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ (రూ.86,200 కోట్లు), మినిస్ట్రీ ఆఫ్ ఆయిష్ (రూ.3,050 కోట్లు) అంచనా వేసిన నిధుల కంటే 1.5 రెట్లు ఎక్కువ. పురుషుడి సంపాదన రూపాయి, మహిళ సంపాదన 63 పైసలు లింగ అసమానతపై నివేదిక ప్రకారం..ఒక పురుషుడు రూపాయి సంపాదిస్తే.. అందులో మహిళ సంపాదించేది 63 పైసలు సంపద రోజుకు రూ.3,608 కోట్లు పెరిగింది కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి 2022 నవంబర్ వరకు భారతదేశంలోని బిలియనీర్లు తమ సంపద 121 శాతం లేదా రోజుకు రూ. 3,608 కోట్ల మేర పెరిగినట్లు ఆక్స్‌ఫామ్ తెలిపింది. 3శాతం జీఎస్టీ వసూళ్లు మరోవైపు, 2021-22లో దేశ వ్యాప్తంగా మొత్తం రూ. 14.83 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు అయ్యాయి. ఆ జీఎస్టీ దేశంలోని అట్టడుగు వర్గాల నుంచి 64 శాతం వస్తే, భారత్‌లో ఉన్న టాప్ 10 బిలియనీర్ల నుంచి కేవలం 3శాతం జీఎస్టీ వసూలైంది. పెరిగిపోతున్న బిలియనీర్లు భారతదేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో 102 కాగా 2022 నాటికి 166కు పెరిగిందని ఆక్స్‌ఫామ్ తెలిపింది. ఆక్సోఫామ్ ఆధారాలు ఎలా సేకరించిందంటే దేశంలోని సంపద అసమానత, బిలియనీర్ల సంపదను పరిశీలించేందుకు ఫోర్బ్స్,క్రెడిట్ సూయిస్ వంటి దిగ్గజ సంస్థల నివేదికల్ని ఆక్సోఫామ్ సంపాదించింది.అయితే నివేదికలో చేసిన వాదనలను ధృవీకరించడానికి ఎన్ఎస్ఎస్, యూనియన్ బడ్జెట్ పత్రాలు, పార్లమెంటరీ ప్రశ్నలు మొదలైన ప్రభుత్వ నివేదికలు ఉపయోగించింది. చివరిగా::: అవాస్తవిక లాభాలంటే వాణిజ్య భాషలో అవాస్తవిక లాభాలంటే ఉదాహరణకు..రమేష్ అనే వ్యక్తి ఏడాది క్రితం ఓ కంపెనీకి చెందిన ఓక్కో స్టాక్‌ను రూ.100 పెట్టి కొనుగోలు చేస్తే.. ఆ స్టాక్ విలువ ప్రస్తుతం రూ.105లకు చేరుతుంది. అలా పెరిగిన రూ.5 అవాస్తవిక లాభాలంటారు. చదవండి👉 చైనాపై అదానీ సెటైర్లు, ‘ఇంట కుమ్ములాటలు.. బయట ఏకాకి!’ -
మోదీ వల్లే ఆస్తుల పెరుగుదల! గౌతమ్ అదానీ ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: ప్రపంచ ధనవంతుల్లో మూడో స్థానంలో కొనసాగుతున్నారు ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ. వివిధ రంగాల్లో తన వ్యాపారాలను విస్తరిస్తూ కొన్నేళ్లలోనే శిఖరాగ్రానికి చేరుకున్నారు. అయితే, బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఉన్న సాన్నిహిత్యం వల్లే ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ వాదనలపై తాజాగా ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు గౌతమ్ అదానీ. పీఎం మోదీతో సాన్నిహిత్యంమే తన ఆస్తులు పెరిగేందుకు కారణమైందనే వాదనలను తోసిపుచ్చారు. తాము దేశంలోని 22 రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తున్నామని, అయితే, అన్ని చోట్ల బీజేపీ ప్రభుత్వం లేదని గుర్తు చేశారు. విపక్షాలతోనూ కలిసి తాము వ్యాపారం సాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘ప్రతి రాష్ట్రంలో గరిష్ఠస్థాయిలో పెట్టుబడులు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం దేశంలోని 22 రాష్ట్రాల్లో అదానీ గ్రూప్ ఉండటం చాలా సంతోషంగా ఉంది. అలాగే అన్ని రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు. ఏ రాష్ట్ర ప్రభుత్వంతోనూ మాకు ఎలాంటి సమస్యలు లేవని స్పష్టంగా చెప్పగలను. వామపక్ష పార్టీ పాలిత కేరళ, మమతా దీదీ నేతృత్వంలోని బెంగాల్, నవీన్ పట్నాయక్ సారథ్యంలోని ఒడిశా, జగన్ మోహన్ రెడ్డి సార్థథ్యంలోని ఆంధ్రప్రదేశ్, కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణలోనూ మేము పని చేస్తున్నాం. మోదీ జీ నుంచి ఎలాంటి వ్యక్తిగత సాయం అందదని చెప్పాలనుకుంటున్నా. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆయనతో పాలసీల గురించి మాట్లాడొచ్చు. కానీ ఆ పాలసీ రూపొందిన తర్వాత అది అందరి కోసం. కేవలం అదానీ గ్రూప్ కోసం కాదు. ’ - గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ తమ బహుళ బిలియన్ డాలర్ల సంస్థ భారీగా పరపతి సాధించడంపై అపోహలు ఉన్నాయని, అది బ్యాంకులు, సాధారణ ప్రజల పొదుపు సొమ్ముకు హాని కలిగిస్తుందని స్పష్టం చేశారు అదానీ. గడిచిన 7-8 ఏళ్లలో ఆదాయం 24 శాతం పెరిగిందన్నారు. అదే సమయంలో రుణాలు 11 శాతం పెరిగినట్లు స్పష్టం చేశారు. తనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే క్రోనీ క్యాపిటలిజం ఆరోపణలు చేయడం రాజకీయ వ్యాపారంలో భాగమని తాను నమ్ముతున్నాని చెప్పారు. రాహుల్ గాంధీ పార్టీ పాలించే రాజస్థాన్‌లోనూ తమకు వ్యాపారాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇటీవలే రాజస్థాన్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు తాము హాజరయ్యానని తెలిపారు. అప్పుడు తమ వ్యాపారాలను రాహుల్ గాంధీ ప్రశంసించినట్లు చెప్పారు. రాహుల్ పాలసీలు అభివృద్ధికి వ్యతిరేకం కాదన్నారు. రాజస్థాన్‌లో రూ.68వేల కోట్లు పెట్టుబడులు పెట్టామన్నారు. ‘నా జీవితంలో మూడు పెద్ద బ్రేక్‌లు వచ్చాయి. తొలుత 1985లో రాజీవ్ గాంధీ పాలన సమయంలో ఎక్జిమ్ పాలసీ ద్వారా మా సంస్థ గ్లోబల్ ట్రేడింగ్ హౌస్‌గా మారింది. రెండోది, 1991లో పీవీ నరసింహారావు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల ద్వారా మేము పబ్లిక్-ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానంలోకి వచ్చాం. మూడోది నరేంద్ర మోదీ గుజరాత్లో 12 ఏళ్ల పాలనలో జరిగింది. ఇది మంచి అనుభవమని చెప్పగలను. గుజరాత్ అనేది వ్యాపార అనుకూల రాష్ట్రం, కానీ అదానీకి కాదు. ’అని తెలిపారు. ఇదీ చదవండి: రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామ రక్షణ కమిటీల పునరుద్ధరణ -
అయ్యో.. 11 మందికి బిలీనియర్ ట్యాగ్ పోయింది!
నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో 11 మంది తమ బిలీనియర్ ట్యాగ్ ను కోల్పోయారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ నకిలీ కరెన్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో వీరు బిలీనియర్ జాబితా నుంచి కిందకి పడిపోయినట్టు తాజా సర్వేలో వెల్లడైంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ మంగళవారం విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పెద్ద నోట్ల రద్దు వంటి ప్రభుత్వం తీసుకునే సంచలనాత్మక నిర్ణయాలతో భారత్ ఎంతో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొందని హురున్ రిపోర్ట్ ఇండియా చీఫ్ రీసెర్చర్, మేనేజింగ్ డైరెక్టర్ రెహమాన్ జునైడ్ తెలిపారు. పారదర్శకతమైన కరెన్సీ ఎకనామిక్స్ పారశ్రామికవేత్తల్లో సానుకూల ప్రభావాన్ని నెలకొల్పుతుందని తాము విశ్వసిస్తున్నట్టు చెప్పారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ నేడు విడుదల చేసిన రిచెస్ట్ ఇండియన్స్ 2017 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, చైర్మన్ ముఖేష్ అంబానీ మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. గ్లోబల్ ర్యాంకిగ్స్ లో ఆయన 28 స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత దేశీయంగా రెండో ర్యాంకింగ్ లో ఎస్పీ హిందూజా అండ్ ఫ్యామిలీ(గ్లోబల్ గా 74) , మూడో స్థానంలో దిలీప్ సంఘ్వీ(గ్లోబల్ గా 74), నాలుగో ర్యాంక్ లో పల్లోజి మిస్త్రీ(గ్లోబల్ గా 97)లు ఉన్నారు. ఈ రిపోర్టు ప్రకారం 132 మంది భారతీయులు లేదా భారతీయ సంతతి బిలీనియర్ల నికర సంపద 1 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. 42 మంది బిలీనియర్లకు ముంబై నిలయంగా ఉండగా.. దాని తర్వాత న్యూఢిల్లీ, అహ్మదాబాద్ లు ఉన్నాయి. గ్లోబల్ గా బీజింగ్, న్యూయార్క్ ను అధిగమించింది. ''బిలీనియర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్'' గా బీజింగ్ అగ్రస్థానంలో నిలిచింది. -
ఆయన సంపద రూ 1.32 లక్షల కోట్లు