Divis Laboratories Nilima Motaparti: భారతదేశంలో ఉన్న అత్యంత ధనిక మహిళలో ఒకరైన 'నీలిమ మోటపర్తి' (Nilima Motapatri) గురించి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ 'దివిస్ లాబొరేటరీస్' గురించి తప్పకుండా వినే ఉంటారు. ప్రస్తుతం ఈ కంపెనీ బాధ్యతలు చేపడుతూ వరుస లాభాల్లో పయనిస్తున్న నీలిమా గురించి ఇక్కడ తెలుసుకుందాం.
దివిస్ లాబొరేటరీస్ సంస్థను స్థాపించిన మురళీ కృష్ణ దివి కుమార్తె నీలిమ మోటపర్తి. ఈమె గ్లాస్లో యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌లో పూర్తి చేసి, ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన మెటీరియల్ సోర్సింగ్, ప్రొక్యూర్‌మెంట్, కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్వెస్టర్ రిలేషన్స్ వంటి అన్ని కార్యకలాపాలను చూసుకుంటోంది. 2021లో ఈమె ఆదాయం సుమారు 51 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
(ఇదీ చదవండి: రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!)
నిజానికి దివిస్ లాబొరేటరీస్ స్థాపించిన మురళీ కృష్ణ దివి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. మురళీ కృష్ణ కుటుంబం ఒకప్పుడు తన తండ్రికి వచ్చే పెన్షన్ మీద ఆధారపడి బ్రతికింది. జీవితంలో ఎన్నెన్నో కష్టాలు చూసిన మురళీ కృష్ణ తన 25 సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్లి ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. అప్పట్లో తన వద్ద కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయని ఫోర్బ్స్ ఇండియా గతంలో వెల్లడించినట్లు సమాచారం.
దివిస్ లాబొరేటరీస్ ఆవిర్భావం..
అమెరికా వెళ్లిన తరువాత నిరంతర శ్రమతో కస్టపడి అతి తక్కువ కాలంలోనే భారతదేశంలో దివీస్ లాబొరేటరీస్ 5.8 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ ధనిక శాస్త్రవేత్తల్లో ఒకరిగా నిలిచారు. దివీస్ లేబొరేటరీస్ 1990లో దివీస్ రీసెర్చ్ సెంటర్‌గా స్థాపించారు, ఆ తరువాత క్రమంగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. 1994 నాటికి దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్‌గా స్థిరపడింది.
(ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!)
తండ్రి స్థాపించిన సంస్థలో నీలిమ మోటపత్రి 2012లో చేరి, అప్పటి నుంచి ఈ కంపెనీ అభివృద్ధికి దోహదపడుతోంది. ఉద్యోగంలో చేరకముందే ఈమెకు మెటీరియల్ రిక్వైర్మెంట్, ఫైనాన్సింగ్ అండ్ ఆసీకాంటింగ్ వంటి వాటిలో సుమారు ఐదు సంవత్సరాల అనుభవం ఉంది. మొత్తం మీద నీలిమా తండ్రికి తగ్గ తనయురాలిగా కంపెనీ బాధ్యతలు చేపట్టి విజయ మార్గంలో పయనిస్తోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలు, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment