Success secrets
-
ఈ అలవాట్లను మార్చుకున్నారో.. విజయం మీదే..!
జీవితంలో విజయాన్ని సాధించాలని, అన్నింటిలోనూ సక్సెస్ అనిపించుకోవాలని అందరికీ ఉంటుంది. అంతదాకా ఎందుకు, మీరు సక్సెస్ కోరుకుంటున్నారా అని అడిగితే ప్రతి ఒక్కరూ అవుననే అంటారు. అయితే మనం అనుకున్నంత సులువేం కాదు విజయాన్ని సాధించడం. ఇందుకోసం ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఎన్నో అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. జీవితంలో విజయం సాధించాలంటే కచ్చితంగా కొన్ని రకాల అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం... సక్సెస్‌ని చవిచూద్దాం...విజయం సాధించిన ప్రతి ఒక్కరి వెనకాల ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉండే ఉంటాయి. అయితే ఆ కష్టాలను ఇష్టాలుగా... ఆ కన్నీటిని పన్నీటిగా స్వీకరిస్తేనే వారు విజయాన్ని సొంతం చేసుకుని ఉంటారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.సమయాన్ని సద్వినియోగం... అందరికీ రోజులో ఉండేది 24 గంటల మాత్రమే. అయితే ఎవరు ఎక్కువగా ఆ సమయాన్ని ఉపయోగించుకుంటారన్న సూత్రమే సాఫల్యాన్ని సూచిస్తుంది. అందుకోసం చేసుకోవాల్సిన మొదటి అలవాటు ఉదయాన్నే త్వరగా నిద్ర మేల్కొనడం. కనీసం ఉదయం ఐదింటికల్లా నిద్రలేవడాన్ని అలవాటు చేసుకుంటే... రోజంతా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఎంత సమయం మిగులుతుందో మనకే అనుభవంలోకి వస్తుంది.బుక్ రీడింగ్..విజయం సాధించే వారిలో ఉండే మరో మంచి లక్షణం పుస్తక పఠనం. జీవితంలో గొప్ప స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా స్ఫూర్తిదాయకమైన పుస్తకాలను, గొప్పవారి జీవిత కథలను, ఆత్మకథలను చదవడం వల్ల మనసు పొరలు తెరుచుకుంటాయి. కొత్త ఉత్సాహం వస్తుంది. ఒక్కసారి పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే సరి... ఆ తర్వాత పుస్తకాలు చదవకుండా ఉండలేరు.ఆరోగ్యం... ఆకృతి!జీవితంలో అనుకున్నది సాధించాలంటే ముందుగా మన ఆరోగ్యం బాగుండాలి. అందుకే సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుంటారు. కచ్చితంగా ఉదయం వ్యాయామాలు చేస్తుంటారు. మంచి ఆహారం తీసుకుంటారు. రాత్రి సమయానికి నిద్ర΄ోతారు. ఆరోగ్యం బాగున్న వారే అహరహం శ్రమించగలిగే శక్తిని కలిగి ఉంటారనే విషయాన్ని మరచి ΄ోకూడదు.సరైన స్నేహం..మనం ఎప్పుడూ మంచి స్నేహితులనే ఎంచుకోవాలి. శల్య సారథ్యం చేసేవారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. శల్య సారథ్యం అంటే నువ్వు ఆ పని చెయ్యలేవు, నీ వల్ల అది సాధ్యం కాదు అంటూ వెనక్కి లాగడం. అందువల్ల మన పక్కన సానుకూల దృక్పథంతో ఉండేవారే ఉంటే మనకు చాలా మంచిది. అందువల్ల అలా పాజిటివ్‌గా ఉండే వారినే ఎంచుకోవడం, అలాంటి వారితోనే స్నేహం చేయడం చాలా మంచిది. కొందరు నిత్యం నెగిటివ్ ఆలోచనతో, నెగిటివ్ మాటలతో విసిగిస్తుంటారు. అలాంటి వారితో స్నేహం చేస్తే మీరు కూడా నెగిటివ్ దారిలోనే వెళ్తారు.వాదనలకు దూరంగా ఉండటం..జీవితంలో విజయం సాధించిన వారు ఎప్పుడైనా ఇతరులతో వాదనలకు దూరంగా ఉంటారు. వీలైనంత తక్కువ వాదిస్తుంటారు. ఎదుటి వ్యక్తితో వాదించే సందర్భంగా వచ్చినా మౌనంగా ఉంటారు తప్ప.. వాదనలకు దిగరు.ఇవి చదవండి: మీ బ్రెయిన్ ఆక్టివ్ ఉండాలంటే.. ఇలా చేయండి! -
ఎవరీ నీలిమ మోటపర్తి? ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Divis Laboratories Nilima Motaparti: భారతదేశంలో ఉన్న అత్యంత ధనిక మహిళలో ఒకరైన 'నీలిమ మోటపర్తి' (Nilima Motapatri) గురించి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ 'దివిస్ లాబొరేటరీస్' గురించి తప్పకుండా వినే ఉంటారు. ప్రస్తుతం ఈ కంపెనీ బాధ్యతలు చేపడుతూ వరుస లాభాల్లో పయనిస్తున్న నీలిమా గురించి ఇక్కడ తెలుసుకుందాం. దివిస్ లాబొరేటరీస్ సంస్థను స్థాపించిన మురళీ కృష్ణ దివి కుమార్తె నీలిమ మోటపర్తి. ఈమె గ్లాస్లో యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌లో పూర్తి చేసి, ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన మెటీరియల్ సోర్సింగ్, ప్రొక్యూర్మెంట్, కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్వెస్టర్ రిలేషన్స్ వంటి అన్ని కార్యకలాపాలను చూసుకుంటోంది. 2021లో ఈమె ఆదాయం సుమారు 51 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. (ఇదీ చదవండి: రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!) నిజానికి దివిస్ లాబొరేటరీస్ స్థాపించిన మురళీ కృష్ణ దివి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. మురళీ కృష్ణ కుటుంబం ఒకప్పుడు తన తండ్రికి వచ్చే పెన్షన్ మీద ఆధారపడి బ్రతికింది. జీవితంలో ఎన్నెన్నో కష్టాలు చూసిన మురళీ కృష్ణ తన 25 సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్లి ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. అప్పట్లో తన వద్ద కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయని ఫోర్బ్స్ ఇండియా గతంలో వెల్లడించినట్లు సమాచారం. దివిస్ లాబొరేటరీస్ ఆవిర్భావం.. అమెరికా వెళ్లిన తరువాత నిరంతర శ్రమతో కస్టపడి అతి తక్కువ కాలంలోనే భారతదేశంలో దివీస్ లాబొరేటరీస్ 5.8 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ ధనిక శాస్త్రవేత్తల్లో ఒకరిగా నిలిచారు. దివీస్ లేబొరేటరీస్ 1990లో దివీస్ రీసెర్చ్ సెంటర్‌గా స్థాపించారు, ఆ తరువాత క్రమంగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. 1994 నాటికి దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్‌గా స్థిరపడింది. (ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!) తండ్రి స్థాపించిన సంస్థలో నీలిమ మోటపత్రి 2012లో చేరి, అప్పటి నుంచి ఈ కంపెనీ అభివృద్ధికి దోహదపడుతోంది. ఉద్యోగంలో చేరకముందే ఈమెకు మెటీరియల్ రిక్వైర్మెంట్, ఫైనాన్సింగ్ అండ్ ఆసీకాంటింగ్ వంటి వాటిలో సుమారు ఐదు సంవత్సరాల అనుభవం ఉంది. మొత్తం మీద నీలిమా తండ్రికి తగ్గ తనయురాలిగా కంపెనీ బాధ్యతలు చేపట్టి విజయ మార్గంలో పయనిస్తోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలు, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఓటమి నేర్పిన పాఠం! కోట్లలో టర్నోవర్ సాధించేలా..
జీవితం ఎవ్వరిని వదిలిపెట్టదు అందరి సరదా తీర్చేస్తుందని ఒక సినిమాలో ఉన్న డైలాగ్ అందరికి తెలిసే ఉంటుంది. అయితే ఇది సినిమా డైలాగ్ మాత్రమే కాదు.. అక్షరాలా నిజం. ఇలా ఎన్నో కష్టాలు పడి చివరికి సక్సెస్ సాధించి వారు చాలా టాక్కువ ఉన్నారు. అలంటి వారిలో ఒకరు 'రోహిత్ మాంగ్లిక్'. ఇంతకీ అతడు పడ్డ కష్టాలు ఏమిటి? చివరికి సక్సెస్ ఎలా సాధించాడనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. నిజానికి ఎవరికైనా మంచి ఉద్యోగం చేయాలని, బాగా డబ్బు సంపాదించి స్థిరపడాలని ఉంటుంది. దీని కోసం ఎన్నో కష్టాలు, నష్టాలను అనుభవిస్తూ ముందుకు వెళతారు. జీవితంలో ఎదగాలని, ఉన్న ఉద్యోగం వదిలిపెట్టి ఒక స్టార్టప్ కంపెనీ స్థాపించి ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నాడు. నిజానికి రోహిత్ మాంగ్లిక్ 2012లో NIT నుంచి BTech పూర్తి చేసిన తర్వాత అనేక పెద్ద ఐటి కంపెనీలలో పనిచేశాడు. అయితే 2017లో ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఫరూఖాబాద్‌కు తిరిగి వచేసాడు. ఆ తరువాత ఏడుగురు ఉద్యోగులతో కెరీర్ కౌన్సెలింగ్ ప్రారంభించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. (ఇదీ చదవండి: 1964లో అంబాసిడర్ ధర అంతేనా? వైరల్ అవుతున్న ఫోటోలు!) ఉద్యోగం మానేసిన తరువాత మొదటిసారే ఫెయిల్యూర్ అయ్యాడు, పట్టు వదలకుండా రెండవ సారి లక్నోలో ఆఫీస్ ప్రారంభించి మళ్ళీ విఫలమయ్యాడు. రెండు సార్లు సక్సెస్ సాధించనప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా విద్యార్థులకు పోటీ పరీక్షల గురించి కావలసిన మంచి సమాచారం అందించడానికి 2020లో 'ఎడుగొరిల్లా' (EduGorilla) స్టార్ట్ చేసాడు. 2020లో మొదలైన ఈ ఎడుగొరిల్లా స్టార్టప్ కేవలం మూడు సంవత్సరాల్లోనే విద్యా రంగంలో ప్రపంచంలోని టాప్ 10 కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సంస్థలో 300 కంటే ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వరుస అపజయాలను చవి చూసిన రోహిత్ మాంగ్లిక్ వార్షిక ఆదాయం రూ. 10 కోట్లకంటే ఎక్కువ. -
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. సక్సెస్ సీక్రెట్
సవాలక్ష ఒత్తిళ్లతో నిండిపోయి ఉంటుంది కార్పొరేట్ వరల్డ్. ఇక గూగుల్ లాంటి బడా కంపెనీలను నడిపించే సుందర్ పిచాయ్లాంటి వాళ్లపై అయితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అంత ఒత్తిడిని ఎలా డీల్ చేస్తాను, పని చేసేందుకు కావాల్సిన శక్తిని తిరిగి ఎలా తెచ్చుకుంటాననే విషయాలను వాల్ స్ట్రీట్ జర్నల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల వెల్లడించారు సుందర్ పిచాయ్. పని ఒత్తిడి మధ్య రిలాక్స్ అయ్యేందుకు చాలా మంది సీఈవోలో టూర్లకు వెళ్తుంటారు. ప్రకృతిలో విహార యాత్రలు చేస్తుంటారు. కానీ సుందర్ పిచాయ్ బయట ఎక్కడా అడుగు పెట్టరట. తాను ఉన్న చోటులోనే ప్రత్యేకమైన పద్దతిలో విశ్రాంతి తీసుకుంటారట. దీన్ని నాన్ స్లీపింగ్ డీప్ రెస్ట్ (ఎన్ఎస్డీఆర్)గా పేర్కొంటారట. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన న్యూరోసైన్స్ ప్రొఫెసర్ ఆండ్ర్యూ హ్యుబర్ ఈ ఎన్ఎస్డీఆర్ టెక్నిక్‌ని అమెరికాలో విస్త్రృతం చేశారు. ఒక చోట కదలకుండా ఉండి ఆలోచనలను ఒకే అంశంపై నియంత్రిస్తూ ఉండటం వల్ల ఒత్తిడిని త్వరగా జయించవచ్చంటూ ఎన్ఎస్డీఆర్ టెక్నిక్‌ని అమెరికన్లలో పాపులర్ చేశారు. ఎన్ఎస్డీఆర్కి సంబంధించిన విధానాలను యూట్యూబ్ ద్వారా చూస్తూ సుందర్ పిచాయ్ సుందర్ పిచాయ్ ఒత్తిడిని దూరం చేసుకుంటారట. నేలపై ఒక చోట పడుకుని ఆలోచనలను నియంత్రిస్తూ.. క్రమంగా ఆలోచనా రహిత స్థితికి చేరుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు బ్రెయిన్ మరింత షార్ప్‌గా పని చేస్తుందంటున్నారు సుందర్ పిచాయ్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రతిపాదిన నాన్ స్లీపింగ్ డీప్ రెస్ట్ మెథడ్‌ని మన భారతీయులు ఎప్పుడో కనిపెట్టారు. శ్వాసమీద ధ్యాస, యోగ నిద్ర పేరుతో ప్రాచీన మహర్షులు మెదడుపై ఒత్తిడిని తగ్గించి ఉత్తేజపరిచే మార్గాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. చదవండి: Sundar Pichai: ఆఖరిసారి అప్పుడే ఏడ్చాను -
ఎస్ఐ కొలువు సాధించానిలా..!
సక్సెస్ స్పీక్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియలో తొలి దశ ముగిసింది. అభ్యర్థులు మలిదశలో విజయానికి కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఎస్ఐ పరీక్షలో 327 మార్కులతో (2011, ఆగస్టు) 3వ ర్యాంకు సాధించిన వడ్డే ఉదయ్‌కుమార్ తన సక్సెస్ సీక్రెట్స్‌ను ‘భవిత’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మాది ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం, కరివారిగూడెం. నాన్న వడ్డే శ్రీనివాసరావు సింగరేణిలో కోల్ ఫిల్లర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆయన 2005లో మరణించారు. అమ్మ సత్యవతి గృహిణి. నేను ఇంటర్ వరకు మణుగూర్‌లో తెలుగు మీడియంలోనే చదివాను. డిగ్రీ కొత్తగూడెంలో, ఎంసీఏ హైదరాబాద్‌లో పూర్తి చేశాను. బంధువు సలహాతో.. నా ఎంసీఏ పూర్తయ్యే నాటికి (2008లో) సాఫ్ట్వేర్ ఇండస్ట్రీపై ఆర్థికమాంద్యం ప్రభావం ఉంది. సరైన అవకాశాలు లేవు. అప్పటికే మా బంధువుల్లో చాలా మంది పోలీస్ ఉద్యోగాలు చేస్తున్నారు. మా అన్నయ్య వేణుమాధవ్ సలహా మేరకు ఎస్ఐ ఉద్యోగానికి ప్రయత్నించాను. మొదటి అటెంప్ట్‌లోనే విజయం సాధించాను. శిక్షణలో అగ్రస్థానం.. ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికైన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా)లో ఏడాది పాటు శిక్షణలో పాల్గొని, మొదటి స్థానంలో నిలిచా. బెస్ట్ ఆల్‌రౌండర్, బెస్ట్ ఇండోర్‌గా నిలిచి సీఎం పిస్టల్, గోల్డ్ మెడల్ గెలుచుకోవడంతోపాటు హోంమినిస్టర్ బ్యాటన్, గోల్డ్ మెడల్‌ను సాధించాను. పరుగు పందెంలో అప్రమత్తంగా... గతంలో మొదట దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి, తర్వాత రాత పరీక్ష జరిపేవారు. కానీ, ఇప్పుడు మొదట రాత పరీక్ష నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారికి మలి దశలో శారీరక పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు అన్ని ఈవెంట్స్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉండేది అయితే ఇప్పుడు సివిల్ ఎస్ఐ, ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు 800 మీటర్ల పరుగు పందెంతో పాటు ఏవైనా రెండు ఈవెంట్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. ఈ పోస్టులకు సంబంధించి ఈవెంట్స్‌లో మెరిట్ సాధించినా.. ఎంపికలో ఎలాంటి మార్కులు కలపరు. కానీ, మిగిలిన పోస్టుల భర్తీలో మాత్రం ఈవెంట్స్‌లో సాధించిన మెరిట్‌కు స్కోరు కేటాయించి తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా ప్రాక్టీస్ చేయాలి. 800 మీటర్ల పరుగుపందెంలో అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలి. అభ్యర్థులను ఎక్కువగా ఇందులోనే ఫిల్టర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు నిత్యం ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్‌లో అర్హత సాధించాలి... ఫైనల్ ఎగ్జామ్‌లో ఇంగ్లిష్ ఒక పేపర్‌గా ఉంటుంది. అభ్యర్థులు ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఇందులో అర్హత సాధిస్తేనే మిగతా పేపర్లను మూల్యాంకనం చేస్తారు. టెస్టులతో టైం మేనేజ్మెంట్... కోచింగ్ కేంద్రాలు నిర్వహించే మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ఇచ్చిన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు ప్రయత్నించాలి. అలా చేయడం ద్వారా టైం మేనేజ్మెంట్ అలవడుతుంది. అర్థమెటిక్‌లో కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే సమయాన్ని వృథా చేసుకోవద్దు. వాటిని వదిలేసి మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వదిలేసిన ప్రశ్నలను చివర్లో సాధించాలి. అర్థమెటిక్ పేపర్లో మెంటల్ ఎబిలిటీ/ రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలను తక్కువ సమయంలో సాధించవచ్చు. అభ్యర్థులు రీజనింగ్ బిట్స్ మొదట చేయడం లాభిస్తుంది. సబ్జెక్టు నేర్చుకోండి.. పోలీస్ ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులు కేవలం బిట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. అలాకాకుండా సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా పరీక్షలో మంచి ఫలితాలు సాధించవచ్చు. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, దాన్ని చదవడం ద్వారా సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది. తాజాగా నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్నవారే అర్హత సాధించారు. తెలంగాణ విద్యార్థులు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను బాగా చదవాలి. చాలా మంది అభ్యర్థులు ఎస్ఐ పరీక్షలో ఉండే అర్థమెటిక్‌ను ప్యూర్ మ్యాథ్స్‌గా భావించి.. కష్టమనే అపోహతో ఉంటారు. కానీ, పరీక్షలో అడిగే ప్రశ్నలు ఆర్ట్స్ విద్యార్థులు కూడా సులువుగా చేసే విధంగా ఉంటాయి. అభ్యర్థులు తొలుత మ్యాథ్స్ అనే భయాన్ని వీడి ప్రిపరేషన్లో ముందుకుసాగాలి. ముందుగా సిలబస్‌లో ఉన్న అంశాలను పరిశీలించాలి. పరీక్షలో ఆయా అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. సిలబస్‌లో లేని టాపిక్స్‌ను చదవద్దు. ఏదైనా ఒక ప్రామాణిక మెటీరియల్‌ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. -
ఇవే స్వర్ణాలకు సోపానాలు..
నిబద్ధత, నిజాయితీ, నిరంతర అధ్యయనం, కృషి ఇవే స్వర్ణాలకు సోపానాలు.. బీటెక్... ప్రస్తుత కార్పొరేట్ యుగంలో కలల కొలువును సొంతం చేసుకునేందుకు దారిచూపేదిగా యువత భావిస్తున్న కోర్సు. ఈ క్రమంలో కాలేజీలో అడుగుపెట్టిన తొలి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో విజయం సాధించేందుకు తపిస్తారు. కానీ, ఆ అమ్మాయి.. తొలుత సబ్జెక్టు పరిజ్ఞానం పొందేందుకు, ఆపై చక్కటి మార్కులు పొందేందుకు కృషి చేసింది. ఫలితంగా.. జేఎన్టీయూ (హైదరాబాద్) పరిధిలో నాలుగేళ్ల ఈసీఈ కోర్సులో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలు సాధించింది. బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ (2008-12)గా నిలిచింది. జేఎన్టీయూ (హైదరాబాద్) నాలుగో స్నాతకోత్సవంలో పతకాలు అందుకున్న అనంతరం.. నిరంతర అధ్యయనమే ఈ విజయ సాధనం అంటున్న కె.కావ్య సక్సెస్ స్పీక్స్... జేఎన్టీయూహెచ్ అఫ్లియేటెడ్ కళాశాలలన్నింటిలో.. యూనివర్సిటీ టాపర్ సహా మొత్తం నాలుగు పతకాలు లభించినందుకు కలిగే ఆనందం ఒక ఎత్తయితే.. పద్మవిభూషణ్, ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కకోద్కర్ చేతుల మీదుగా వాటిని అందుకునే అవకాశం రావడం చాలా సంతోషం కలిగించింది. ఈ విజయం వెనుక అమ్మా నాన్న, అధ్యాపకుల ప్రోత్సాహం మరవలేనిది. నాన్న పుల్లారావు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో చీఫ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఆ నాలుగు సాధనాలే: ఎంసెట్-2008లో 4,102 ర్యాంకుతో హైదరాబాద్‌లోని భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో ఈసీఈ బ్రాంచ్‌లో అడుగుపెట్టాను. కోర్సులో చేరిన తొలి రోజు నుంచే నిబద్ధత, నిజాయితీ, నిరంతర అధ్యయనం, నిరంతర కృషితో అడుగులు వేశాను.. ఈ నాలుగు అంశాలే నేను ప్రస్తుతం అందుకున్న నాలుగు స్వర్ణ పతకాలు సాధించడానికి సాధనాలు. ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన తొలి రోజు నుంచే సబ్జెక్టు పరంగా నిరంతర అధ్యయనం సాగించాను. ల్యాబ్ వర్క్‌కు ప్రాధాన్యం: విషయ పరిజ్ఞానం పొందే క్రమంలో పుస్తక పరిజ్ఞానానికి ఎంత ప్రాధాన్యమిచ్చానో.. అంతే స్థాయిలో సంబంధిత అంశంపై ల్యాబ్ వర్క్‌కు సమయం కేటాయించాను. లేబరేటరీల్లో ప్రయోగాల ద్వారా విషయ పరిజ్ఞానం మరింత ఎక్కువగా లభిస్తుంది. అది భవిష్యత్తులోనూ ఎంతో ఉపకరిస్తుంది. ముఖ్యంగా కోర్ బ్రాంచ్ విద్యార్థులు ల్యాబ్ వర్క్‌కు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలి. ప్రాక్టికల్ అప్రోచ్‌తో: కోర్సులో ప్రతి సబ్జెక్ట్.. అందులోని ప్రతి అంశాన్ని ప్రాక్టికల్ అప్రోచ్‌తో చదవడం.. చదివే అంశాలను వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ చదవడంతో సదరు సబ్జెక్టులపై మరింత పట్టు లభించింది. ఇంజనీరింగ్ వంటి కోర్సులో ఇది ఎంతో ముఖ్యమైన అంశం. కాబట్టి ప్రస్తు త విద్యార్థులకు కూడా నేనిచ్చే సలహా ఇదే. ముందుగా బేసిక్స్‌పై అవగాహన ఏర్పరచుకుని.. తర్వాత వాటిని, ప్రాక్టికల్‌గా అన్వయించుకోవాలి. అప్పుడే కష్టమైన సబ్జెక్ట్‌లోనూ రాణించడం సులభమవుతుంది. డీఎల్‌ఆర్‌ఎల్‌లో ప్రాజెక్ట్ వర్క్: ఇంజనీరింగ్‌లో కీలక అంశం ప్రాజెక్ట్ వర్క్. నేను వ్యక్తిగతంగా డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లేబొరేటరీలో రాడార్ డిజిటల్ రిసీవర్ అనే అంశంపై ప్రాజెక్ట్ వర్క్ చేశాను. మూడు నెలలపాటు సాగిన ఈ ప్రాజెక్ట్ వర్క్ కూడా నాకు నాలెడ్జ్పరంగా ఎంతో తోడ్పడింది. అందుకే ప్రస్తుత విద్యార్థులకు నా సలహా ఏంటంటే.. వ్యక్తిగతంగా చేసినా.. బృందాలుగా చేసినా.. లైవ్ ప్రాజెక్ట్స్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే నిజమైన నాలెడ్జ్ సొంతమవుతుంది. మినీ ప్రాజెక్ట్‌లకు కూడా మెయిన్ ప్రాజెక్ట్ మాదిరిగానే ప్రాధాన్యమివ్వాలి. నేను రెండు నెలల వ్యవధిలో డిజైన్ ఆఫ్ యూనివర్సల్ ఎసింక్రోనస్ రిసీవర్ ట్రాన్స్మిటర్ అనే అంశంపై మినీ ప్రాజెక్ట్ చేశాను. నచ్చిన విభాగం: ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు అన్ని అంశాల్లో రాణించాలనే ఆత్రుతతో చదవడం ప్రస్తుత కరిక్యులం ప్రకారం అంత సులువు కాదు. కాబట్టి విద్యార్థులు కోర్ సబ్జెక్టుల్లో తమకు బాగా నచ్చిన అంశంలో.. దానికి భవిష్యత్తులో గల అవకాశాలు, అవసరాల విషయంలో అవగాహన ఏర్పరచుకుని పరిపూర్ణత సాధించాలి. ఉదాహరణకు నాకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎంతో ఇష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మిగతా సబ్జెక్టులతో పోల్చితే ఈ విషయంపై ఎక్కువ దృష్టి సారించాను. ఇదే విధంగా మరికొందరు విద్యార్థులకు నెట్‌వర్కింగ్‌పై ఆసక్తి ఉంటుంది. అలాంటి వారు డాట్ నెట్ వంటి అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. ఈసీఈలో సాధించిన స్వర్ణ పతకాల వివరాలు: అనుబంధ కాలేజీలన్నింటిలోనూ బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ గోల్డ్ మెడల్. ఝ కాన్స్టిట్యుయెంట్ అండ్ అఫ్లియేటెడ్ కాలేజీల పరిధిలో మ్యాథమెటిక్స్-1 లో అత్యధిక మార్కులు సాధించినందుకు దివంగత ప్రొ॥జి.పురుషోత్తం మెమోరియల్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్. ఝ పిసుపాటి సుప్రియ దేశాయ్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్. ఝ జేఎన్టీయూ-హెచ్ పరిధిలోని అన్ని అఫ్లియేటెడ్, కాన్స్టిట్యుయెంట్ కాలేజీల్లో బీటెక్ అన్ని బ్రాంచ్‌ల్లో కలిపి ఫస్ట్ ర్యాంకు సాధించినందుకు బూర్గుల రామకృష్ణారావు ఎండోమెంట్ గోల్డ్ మెడల్. పీహెచ్డీ చేయడమే లక్ష్యం: ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ డివిజన్లో ఇంజనీర్‌గా ఉద్యోగం లభించింది. అయితే నా భవిష్యత్తు లక్ష్యం ఎంటెక్.. ఆ తర్వాత పీహెచ్డీ చేయడం. ఈ ఏడాది పీజీఈసెట్‌లో 37వ ర్యాంకు వచ్చినప్పటికీ.. అప్పటికే ఉద్యోగంలో ఉండటం.. కొన్ని నిబంధనల కారణంగా కోర్సులో చేరడం కుదరలేదు. భవిష్యత్తులో కచ్చితంగా ఎంటెక్, పీహెచ్డీ రెండు లక్ష్యాలను సాధిస్తాను. ఆ తర్వాత నేను నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాజిక అభివృద్ధికి దోహదపడేందుకు కృషి చేస్తాను. అకడమిక్ ప్రొఫైల్: పదో తరగతి(2006)లో 94.16 శాతం మార్కులు. ఇంటర్మీడియెట్ (2008)లో 98.4 శాతం మార్కులు. ఎంసెట్-2008లో 4,102 ర్యాంకు. బీటెక్-ఈసీఈ (2012)లో 91.25 శాతం.