జీవితం ఎవ్వరిని వదిలిపెట్టదు అందరి సరదా తీర్చేస్తుందని ఒక సినిమాలో ఉన్న డైలాగ్ అందరికి తెలిసే ఉంటుంది. అయితే ఇది సినిమా డైలాగ్ మాత్రమే కాదు.. అక్షరాలా నిజం. ఇలా ఎన్నో కష్టాలు పడి చివరికి సక్సెస్ సాధించి వారు చాలా టాక్కువ ఉన్నారు. అలంటి వారిలో ఒకరు 'రోహిత్ మాంగ్లిక్'. ఇంతకీ అతడు పడ్డ కష్టాలు ఏమిటి? చివరికి సక్సెస్ ఎలా సాధించాడనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
నిజానికి ఎవరికైనా మంచి ఉద్యోగం చేయాలని, బాగా డబ్బు సంపాదించి స్థిరపడాలని ఉంటుంది. దీని కోసం ఎన్నో కష్టాలు, నష్టాలను అనుభవిస్తూ ముందుకు వెళతారు. జీవితంలో ఎదగాలని, ఉన్న ఉద్యోగం వదిలిపెట్టి ఒక స్టార్టప్ కంపెనీ స్థాపించి ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నాడు.
నిజానికి రోహిత్ మాంగ్లిక్ 2012లో NIT నుంచి BTech పూర్తి చేసిన తర్వాత అనేక పెద్ద ఐటి కంపెనీలలో పనిచేశాడు. అయితే 2017లో ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఫరూఖాబాద్‌కు తిరిగి వచేసాడు. ఆ తరువాత ఏడుగురు ఉద్యోగులతో కెరీర్ కౌన్సెలింగ్ ప్రారంభించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
(ఇదీ చదవండి: 1964లో అంబాసిడర్ ధర అంతేనా? వైరల్ అవుతున్న ఫోటోలు!)
ఉద్యోగం మానేసిన తరువాత మొదటిసారే ఫెయిల్యూర్ అయ్యాడు, పట్టు వదలకుండా రెండవ సారి లక్నోలో ఆఫీస్ ప్రారంభించి మళ్ళీ విఫలమయ్యాడు. రెండు సార్లు సక్సెస్ సాధించనప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా విద్యార్థులకు పోటీ పరీక్షల గురించి కావలసిన మంచి సమాచారం అందించడానికి 2020లో 'ఎడుగొరిల్లా' (EduGorilla) స్టార్ట్ చేసాడు.
2020లో మొదలైన ఈ ఎడుగొరిల్లా స్టార్టప్ కేవలం మూడు సంవత్సరాల్లోనే విద్యా రంగంలో ప్రపంచంలోని టాప్ 10 కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సంస్థలో 300 కంటే ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వరుస అపజయాలను చవి చూసిన రోహిత్ మాంగ్లిక్ వార్షిక ఆదాయం రూ. 10 కోట్లకంటే ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment