మనం ఇప్పటి వరకు ఎంతో మంది విజయ గాథలను (సక్సెస్ స్టోరీస్) గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు అతి తక్కువ కాలంలోనే కోట్ల సామ్రాజ్యం సృష్టించిన 'నిర్మిత్ పారిఖ్' గురించి తెలుసుకుందాం. నిర్మిత్ పారిఖ్ ఎవరు? అయన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో..
ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీలలో ఒకటైన ఆపిల్ సంస్థలో ఉన్నత ఉద్యోగాన్ని, లక్షల జీతాన్ని వదులుకుని భారతదేశానికి వచ్చి అతి తక్కువ కాలంలోనే కుబేరుడయ్యాడు. కరోనా మహమ్మారి వ్యాప్తికంటే ముందు స్వదేశానికి వచ్చి ఏదైనా సొంతంగా చేయాలనే పట్టుదలతో జాబ్స్ ప్లాట్‌ఫామ్ 'అప్నా' (Apna) ప్రారంభించి ఎన్నో కంపెనీలకు మార్గదర్శిగా నిలిచాడు. ఈ యాప్ ప్రారభించిన కేవలం 21 నెలల్లో ధనవంతుల జాబితాలో ఒకడయ్యాడు.
నిర్మిత్ పారిఖ్ మొదలు పెట్టిన ఈ జాబ్ ప్లాట్‌ఫామ్ షాడోఫాక్స్, జొమాటో, ఢిల్లీవేరీ, G4S గ్లోబల్, బర్గర్ కింగ్ వంటి ఎన్నో కంపెనీలు ఉపయోగించుకున్నాయి. టెక్నాలజీలో మార్పు తీసుకురావడమే కాకుండా ఎంతో మందికి ఉపయోగపడాలని ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ యాప్ అతన్ని కోట్లకు అధిపతిని చేసింది.
(ఇదీ చదవండి: జిమ్నీ ప్రియులారా ఊపిరి పీల్చుకోండి.. లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది!)
నిర్మిత్ పారిఖ్ 2023 మే నాటికి 1.1 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడయ్యాడు. అంటే ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 9,000 కోట్లకంటే ఎక్కువ. ఒక్క ఆలోచన అతని జీవితాన్నే మార్చేసింది, అతి తక్కువ కాలంలోనే అతని ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింది. అప్నా యాప్ 10 కోట్లకు పైగా ఇంటర్వ్యూలను, ఒక కోటికి పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది.
నిర్మిత్ నిర్మా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీర్ అండ్ అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఫర్ బిజినెస్ నుంచి MBA చదివారు. ఈయన కేవలం 21 సంవత్సరాల వయసులోనే ఇన్‌కోన్ టెక్నాలజీస్ అనే సంస్థను స్థాపించాడు. ఆ తరువాత అనేక సంస్థలలో ఉన్నతమైన పదవుల్లో పనిచేసి తరువాత ఒక యాప్ ద్వారా గొప్ప సక్సెస్ సాధించాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్కోవడానికిఇ సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment