new app
-
జెప్టో కేఫ్ దూకుడు.. ప్రత్యేక యాప్
క్విక్ కామర్స్ మార్కెట్లో జెప్టో దూకుడు ప్రదర్శిస్తోంది. జెప్టో కేఫ్‌ను ప్రత్యేక యాప్‌గా అందుబాటులోకి తీసుకు రానున్నట్టు క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో సహ వ్యవస్థాపకుడు ఆదిత్ పాలిచా తెలిపారు. కేఫ్ సేవలకు ఆదరణ పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.నెలకు 100కుపైగా కేఫ్‌లను ప్రారంభిస్తున్నామని, ఇప్పటికే రోజుకు 30,000 పైచిలుకు ఆర్డర్లను అందుకుంటున్నామని వివరించారు. జెప్టో వేదికగా 2022 ఏప్రిల్‌లో జెప్టో కేఫ్ ప్రారంభం అయింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ఉన్న స్టోర్లలో 120 కంటే ఎక్కువ కేఫ్‌ల ద్వారా ప్రధాన నగరాలకు తన కేఫ్ సేవను విస్తరించనున్నట్లు గత నెలలో కంపెనీ ప్రకటించింది.హైదరాబాద్, చెన్నై, పుణే సైతం విస్తరణ జాబితాలో ఉన్నాయని వివరించింది. వార్షిక ప్రాతిపదికన జెప్టో కేఫ్ వ్యాపారం ప్రస్తుతం రూ.160 కోట్ల స్థాయిలో నమోదవుతోందని వెల్లడించింది. కొత్త నగరాల్లో విస్తరణ కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల వార్షిక సగటు రేటు సాధిస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.ఇదిలా ఉండగా సంస్థలో మరో కీలక పరిణామం జరిగింది. చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మార్టిన్ దినేష్ గోమెజ్ తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీలో చేరిన ఏడాదిలోపే ఆయన నిష్క్రమించడం గమనార్హం. జనవరిలో చీఫ్ బ్రాండ్ ఆఫీసర్‌గా చేరిన చందన్ మెండిరట్టా అక్టోబర్ నెలాఖరు నుండి చీఫ్ కల్చర్ ఆఫీసర్ బాధ్యతలతోపాటు హోచ్ఆర్ అధిపతిగానూ కొనసాగుతారని కంపెనీ ప్రకటించింది. -
రైల్వే కొత్త యాప్.. ఎవరి కోసమంటే..?
ఇండియన్ రైల్వే ఫ్రంట్‌లైన్ భద్రతా సిబ్బంది కోసం భద్రతా శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే మొబైల్ అప్లికేషన్ 'సంరక్ష'ను ప్రారంభించింది. లక్షలాది మంది రైల్వే ఫ్రంట్‌లైన్ సిబ్బందికి క్లిష్టమైన కార్యాచరణ శిక్షణను అందించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే తెలిపింది.ఈ 'సంరక్ష' యాప్‌ను సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగపూర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రూపొందించారు. రైల్వే ఉద్యోగుల శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే సమర్థవంతమైన వ్యవస్థను అందించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఏఐ భవిష్యత్తులో సాధ్యాలతో, రైల్వే డొమైన్ పరిజ్ఞానంతో ఈ యాప్ అనుసంధానమై ఉంటుందని డీఆర్ఎం నమితా త్రిపాఠి పేర్కొన్నారు.రైల్వే రూపొందించిన ఈ యాప్ స్మార్ట్ లెర్నింగ్, ఫీడ్‌బ్యాక్ మెకానిజమ్‌లను కలిగి ఉంటుంది. ఇది మల్టీ లెవల్, రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్, పర్యవేక్షణను సాధ్యం చేస్తుంది. -
జొమాటో కొత్త యాప్ లాంచ్: ఇదెలా ఉపయోగపడుతుందంటే..
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ 'జొమాటో' ఎట్టకేలకు కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. దీనికోసం డిస్ట్రిక్ట్ (District) పేరుతో ఓ కొత్త యాప్ లాంచ్ చేసింది. యూజర్లు సినిమాలు, స్పోర్ట్స్, లైవ్ ఈవెంట్స్ వంటి వాటి కోసం టికెట్స్ బుక్ చేసుకోవడానికి.. డైనింగ్, షాపింగ్ వంటి వాటికోసం కూడా ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు.డిస్ట్రిక్ట్ యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు గతంలోనే దీపీందర్ గోయల్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ యాప్ యాపిల్ ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులో ఉండనుంది.ఇదీ చదవండి: కొత్త స్కామ్.. రూటు మార్చిన కేటుగాళ్లుఫుడ్ డెలివరీలో ముందు వరుసలో దూసుకెళ్తున్న జొమాటో.. టికెటింగ్ వ్యాపారంలో కూడా తన ఉనికిని విస్తరించడానికి 2024 ఆగష్టులో పేటీఎం నుంచి టికెటింగ్ బిజినెస్ కొనుగోలు చేసింది. దీనికోసం జొమాటో రూ. 2048 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కాగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ యాప్ లాంచ్ చేసింది. ఇది ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొనే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. -
సిద్దమవుతున్న సూపర్ యాప్: ఐఆర్సీటీసీ సర్వీసులన్నీ ఒకే చోట..
ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఒక యాప్.. ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలనుంటే మరో యాప్, ఇలా ప్రతి ఒక్కదానికీ ఒక్కో యాప్. ఈ విధానానికి ఐఆర్సీటీసీ మంగళం పడనుంది. ఇండియన్ రైల్వే 'సూపర్ యాప్' పేరుతో ఓ సరికొత్త యాప్‌ను ప్రారంభించనుంది.ఐఆర్సీటీసీ ప్రారంభించనున్న ఈ సూపర్ యాప్‌ను.. రైల్వేకు సంబంధించిన అన్ని సర్వీసులకు ఉపయోగించుకోవచ్చు. ఇది 2024 డిసెంబర్ చివరి నాటికి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ప్రయాణికులకు సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌ను తీసుకువస్తున్నారు.ఇండియన్ రైల్వే లాంచ్ చేయనున్న సూపర్ యాప్‌ను సీఆర్ఐఎస్ (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం) అభివృద్ధి చేస్తోంది. దీనికి యాప్ టికెట్ బుకింగ్, ప్లాట్‌ఫామ్ పాస్‌లు, ఫుడ్ డెలివరీ వంటి వాటిని అనుసంధానిస్తోంది. అంటే ఈ ఒక్క యాప్‌లోనే టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, ప్లాట్‌ఫామ్ పాస్ వంటివన్నీ కూడా పొందవచ్చు. అంతే కాకుండా ట్రైన్ జర్నీ స్టేటస్ కూడా ఇందులోనే తెలుసుకోవచ్చని సమాచారం.ఇండియన్ రైల్వే సూపర్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత థర్డ్ పార్టీ యాప్‌ల మీద ఆధారపడే అవసరం ఉండదు. ట్రైన్ జర్నీ చేసేవారు ఎక్కువ యాప్స్ ఉపయోగించాల్సిన అవసరం తీరిపోతుంది. ఇది ప్రయాణాన్ని సులభతరం చేయడం మాత్రమే కాకుండా.. వినియోగదారు అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుందని పలువురు భావిస్తున్నారు. -
జియోఫైనాన్స్ కొత్త యాప్.. ఇక మరిన్ని ఫీచర్లు
న్యూఢిల్లీ: జియోఫైనాన్స్ యాప్‌ను మరింత మెరుగ్గా ప్రారంభించినట్టు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకటించింది. రుణాలు, పొదుపు ఖాతాలు, యూపీఐ బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు, డిజిటల్ ఇన్సూరెన్స్‌తో సహా అనేక రకాల సేవలను ఈ యాప్ అందిస్తోంది.జియోఫైనాన్స్ యాప్ బీటా వెర్షన్ 2024 మే 30న ప్రారంభమైంది. 60 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్నారు. బీటా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి అనేక రకాల ఆర్థిక ఉత్పత్తులు సేవలు జోడించామని, మ్యూచువల్ ఫండ్లపై రుణాలు, గృహ రుణాలు (బ్యాలెన్స్ బదిలీతో) సహా ఆస్తిపై రుణాలు వీటిలో ఉన్నాయని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. -
దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా దివ్యాంగ సురక్ష యాప్
-
టెస్టింగ్ దశలో కొత్త ఫీచర్.. నచ్చిన ధరకే ఉబర్ రైడ్!
చాలామంది తమ నిత్యజీవితంలో ఎక్కడ ఏం కొనాలన్నా కొంత బేరమాడుతూ ఉంటారు, ఇక ఆటోలో ప్రయాణించాలంటే మాత్రం డ్రైవర్‌తో కొంత బేరమాడకుండా ఉండలేరు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ 'ఉబర్' ఓ కొత్త ఫీచర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు క్యాబ్ బుక్ చేసుకోవాలంటే సంస్థ యాప్‌లో ఎంత రేటు చూపిస్తే అంత చెల్లించాల్సి వచ్చేది, దీంతో బేరమాడే అవకాశం లేకుండా పోయింది. ఉబర్ పరిచయం చేయనున్న కొత్త ఫీచర్ 'ఉబర్ ఫ్లెక్స్’లో మనకు నచ్చిన రేటుకే క్యాబ్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఉబర్ పరిచయం చేయనున్న కొత్త ఫీచర్ ఒక రేటును కాకుండా.. యూజర్ ప్రయాణించే దూరం, సమయం వంటి వాటిని ఆధారంగా తీసుకుని తొమ్మిది ధరలను చూపిస్తుంది. ఇందులో వింభియోగదారుడు తనకు నచ్చిన రేటుని ఎంచుకోవచ్చు, అయితే ఆ రేటు డ్రైవర్‌కి నచ్చితే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఇదీ చదవండి: చైనాను దాటేసిన భారత్.. త్వరలో అమెరికా! - ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఒకే రేటు దగ్గర నిలిచిపోకుండా.. కస్టమర్ తనకు నచ్చిన రేటును ఎంచుకునే అవకాశాన్ని ఉబర్ కల్పిస్తోంది. ఇది వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అదే సమయంలో తక్కువ ధరకే ప్రయాణం చేసే వెసులుబాటుని పొందవచ్చు. ఈ ఫీచర్‌ను ఉబర్ కంపెనీ భారతదేశంలో ఔరంగాబాద్, ఆజ్మీర్, బరేలీ, చండీగఢ్, కోయంబత్తూర్, దేహ్రాదూన్, గ్వాలియర్, ఇందౌర్, జోధ్‌పుర్, సూరత్ ప్రాంతాల్లో టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. భారత్ మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా, కెన్యా దేశాల్లో కూడా సంస్థ ఈ ఫీచర్‌ను అమలుచేసే అవకాశం ఉంది. -
గూగుల్ పే నుంచి యూపీఐ లైట్ - ఇలా యాక్టివేట్ చేసుకోండి!
న్యూఢిల్లీ: పేమెంట్ యాప్ గూగుల్ పే తాజాగా స్వల్ప మొత్తాల డిజిటల్ చెల్లింపు లావాదేవీలను సులభతరం చేసేందుకు తమ ప్లాట్‌ఫాంపై యూపీఐ లైట్ సర్వీసును ఆవిష్కరించింది. దీనితో యూజర్లు రూ. 200 వరకు చిన్న మొత్తాలను యూపీఐ పిన్ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే చెల్లించవచ్చు. తక్షణ లావాదేవీల కోసం ఒక రోజులో రూ. 4,000 వరకు లోడ్ చేసుకోవచ్చు. యూజర్లు తమ గూగుల్ పే యాప్‌లోని ప్రొఫైల్ పేజ్‌లో 'యాక్టివేట్ యూపీఐ లైట్' ఆప్షన్‌ను ట్యాప్ చేయడం ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పటికే పేటీఎం, ఫోన్‌పే, భీమ్ యాప్‌లతో పాటు 15 బ్యాంకులు ఈ తరహా సర్వీసును అందిస్తున్నాయి. -
Twitter vs Threads: అసలేంటీ మెటా థ్రెడ్స్? ట్విటర్ కంటే ఎందుకంత స్పెషల్?
మెటా వారి ‘థ్రెడ్స్’ ట్విట్టర్–కిల్లర్ అవుతుందా లేదా అనేది తెలియదుగానీ ఈ యాప్‌పై యువత అమిత ఆసక్తి ప్రదర్శిస్తోంది. ట్విట్టర్ కంటే ‘థ్రెడ్స్’ ఏ రకంగా భిన్నమైనది అనే విశ్లేషణ ఒక కోణం అయితే, కొత్తవాటిపై సహజమైన ఆసక్తి మరో కోణం... మెటా వారి టెక్ట్స్ ఆధారిత సంభాషణ యాప్ ‘థ్రెడ్స్’ ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. యాప్ మొదలైన రెండు గంటలోనే ఇరవై లక్షల మంది యూజర్లు సైనప్ అయ్యారు. నాలుగు గంటలలో ఆ సంఖ్య యాభై లక్షలకు చేరడం చూస్తుంటే థ్రెడ్స్ ‘ట్విట్టర్’కు గట్టిపోటీ ఇవ్వనుందనే విషయం అర్థమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ‘థ్రెడ్స్’ డేటా ప్రైవసీ నిబంధనల కారణంగా యూరప్‌లో అందుబాటులోకి రాలేదు. థ్రెడ్స్‌కు సంబంధించి ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ యూజర్ నేమ్ కొనసాగించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లోని రెడీ–మేడ్ యూజర్ బేస్ వల్ల ‘థ్రెడ్స్’ ట్విట్టర్‌ని మించిపోతుంది అనే అంచనా ఉంది. ‘థ్రెడ్స్‌పై యూత్ ఆసక్తి ప్రదర్శించడానికి కారణం ఏమిటి?’ ఈ ప్రశ్నకు దేశంలోని వివిధ నగరాలకు చెందిన యువగళాల మాటల్లోనే జవాబు దొరుకుతుంది. ► ట్విట్టర్ ఎలాన్ మస్క్ అధీనంలోకి వచ్చిన తరువాత ప్రయోజనకరమైన మార్పుల కంటే అవసరం లేని మార్పులే ఎక్కువ జరిగాయి. యూజర్ల ట్వీట్ల మీద ఆంక్షలు, బ్లూటిక్స్ పై కొత్త రూల్స్... మొదలైనవి చిరాకు తెప్పించాయి’ అంటుంది ముంబైకి చెందిన ఎంబీఏ స్టూడెంట్ మనీష. ► థ్రెడ్స్ అనేది ట్విట్టర్‌కు కాపీ–పేస్ట్’ అనే విమర్శ మాట ఎలా ఉన్నా ‘ట్విట్టర్‌తో పోల్చితే భిన్నంగా ఉంది’ అని చెప్పుకోవడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. ‘జుకర్ బర్గ్ కాపీ–పేస్ట్ విధానాన్ని నమ్ముకొని బాహుబలి లాంటి ట్విట్టర్‌ను ఢీ కొనడానికి రంగంలోకి దిగుతాడని నేను అనుకోవడం లేదు. ట్విట్టర్‌తో పోల్చితే థ్రెడ్స్ కచ్చితంగా భిన్నంగా ఉంటుంది. థ్రెడ్స్‌లో పోస్ట్ చేసే వీడియోల నిడివి అయిదు నిమిషాలు. ట్విట్టర్లో అయితే రెండు నిమిషాల ఇరవై సెకండ్లు. థ్రెడ్స్‌లో పోస్ట్ పరిమితి అయిదు వందలు. ట్విట్టర్లో రెండు వందల ఎనభై. భవిష్యత్తులో మరిన్ని మార్పులు జరగవచ్చు’ అంటుంది చెన్నైకి చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ చైత్ర. ► ‘థ్రెడ్స్’లోని వినూత్నమైన ఫీచర్ ‘ఫెడివర్స్’ యూత్‌కు నచ్చింది. ఆల్టర్నేటివ్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘మాస్టడన్’లాంటి వాటితో ‘థ్రెడ్స్’ యూజర్లు ఇంటరాక్ట్ కావచ్చు. ఎప్పటికప్పుడు ప్లాట్‌ఫామ్ మైగ్రేషన్‌లో యూత్ చురుగ్గా ఉంటుంది. ► యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో బౌండర్’కు చెందిన ప్రొఫెసర్ కేసీ ఫైస్లర్ ఆన్లైన్ కమ్యూనిటీని లోతుగా అధ్యయనం చేసిన ‘ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్’గా పేరు తెచ్చుకుంది. ప్లాట్‌ఫామ్ మైగ్రేషన్స్’ గురించి రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసింది. ► ప్లాట్‌ఫామ్‌ను ఎందుకు మార్చారు? మార్చడం ద్వారా ఎదురైన సవాళ్లు, అనుభవాలు’ అనే అంశంపై యువతరంలో ఎంతోమందితో మాట్లాడింది. ► ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందులోని ఆన్లైన్ కమ్యూనిటీ తట్టాబుట్టా సర్దుకొని కొత్త ప్లాట్ఫామ్లోకి వెళుతుంది. మైగ్రేషన్‌కు సంబంధించి తొలి దశలో కొత్త ప్లాట్‌ఫామ్ గురించి ప్రోత్సాహకరంగా మాట్లాడుకుంటారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అందరి కంటే ముందు తామే ఉండాలనుకునేవారితోపాటు, స్నేహితులు కదిలేవరకు కదలని వారు కూడా ఉంటారు’ అంటుంది ఫైస్లర్. ► ట్విట్టర్‌తో పోల్చితే హ్యాష్‌ట్యాగ్స్, వెబ్ వెర్షన్, ఎడిట్ పోస్ట్‌లు, డీఎం ఆప్షన్, ఎఐ జనరేటెడ్ ఆల్ట్ టెక్ట్స్, ట్రెండింగ్ టాపిక్స్, క్రోనలాజికల్ ఫీడ్... మొదలైన ఫీచర్స్ ‘థ్రెడ్స్’లో లేవు అనే మాట వినిపిస్తోంది. ►ఎన్నో అంచనాలతో ‘థ్రెడ్స్’లోకి వచ్చిన నవతరాన్ని మెటా నిరుత్సాహ పరుస్తుందా? ఒక మీమ్‌లో చూపినట్లు వేగంగా వచ్చిన వాళ్లు అంతే వేగంగా వెళ్లిపోతారా? ‘థ్రెడ్స్ ద్వారా జుకర్‌బర్గ్ కచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తాడు’ అనే ఆశావాదంతో ఎంతకాలమైనా ఎదురుచూసే వాళ్లు ఉంటారా అనేది వేచిచూడాల్సి ఉంది. ట్విట్టర్ vs థ్రెడ్స్ ఈ మీమ్స్ చూస్తే పొట్టచక్కలు ట్విట్టర్ వర్సెస్ థ్రెడ్స్ నేపథ్యంలో యువ నెటిజనులు మీమ్స్, జోక్స్ పేలుస్తున్నారు. ‘ఎట్ ది రేట్ ఆఫ్’ సింబల్‌ని పోలిన ‘థ్రెడ్స్’ లోగో అచ్చం జిలేబిలా ఉందని కొందరు రెండు ఫొటోలను పక్కపక్కన పెట్టి పోస్ట్ చేస్తున్నారు. ఒక మీమ్‌లో... ట్విట్టర్ ఆఫీస్ కిటికీ నుంచి మార్క్ జుకర్‌బర్గ్ దొంగచాటుగా తొంగి చూస్తుంటాడు. ‘థ్రెడ్స్‌లోకి వెళ్లిన వారు కేవలం 5 నిమిషాల తరువాత బ్యాక్ టు ట్విట్టర్ అంటూ ఎలా పరుగెత్తుకు వస్తున్నారో చూడండి’ అంటూ ట్విట్టర్ వీరాభిమానులు వీడియో క్లిప్ పోస్ట్ చేశారు. నసీబ్, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, సూర్యవంశ్... మొదలైన బాలీవుడ్ సినిమాల క్లిప్‌లకు ట్విటర్–థ్రెడ్స్‌కు సంబంధించి ఫన్నీ కామెంట్స్ జత చేస్తున్నారు. Elon Musk: I am tweeting Mark Zuckerberg: pic.twitter.com/oVciHtsgWU — Sagar (@sagarcasm) July 6, 2023 People right now balancing on twitter and threads😂 pic.twitter.com/njRzO4tayh — Rishabh Kaushik (@RishabhKaushikk) July 6, 2023 They said this was Mark Zuckerberg at Twitter offices coming up with Threads 🤣 pic.twitter.com/AudgcfE7QS — O.T.G (@365OTG) July 7, 2023 Is it just a coincidence ? Jalebi lovers should sue Mark Zuckerberg .. pic.twitter.com/xMHSQKZGfh — Lost in Paradise 🇮🇳 (@Lost_human19) July 7, 2023 -
మెటా థ్రెడ్స్‌లోకి టాలీవుడ్ హీరోలు.. ఫస్ట్ ఎంట్రీ ఎవరిదంటే?
Meta Threads: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్' ప్రత్యర్థిగా మెటా ఇప్పుడు కొత్త 'థ్రెడ్స్' (Threads) అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇది విడుదలైన అతి తక్కువ సమయంలో మిలియన్ల మంది యూజర్లు దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. సాధారణ పౌరులు మాత్రమే కాకుండా ఈ యాప్‌ని సెలబ్రిటీలు సైతం డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న మొదటి సెలబ్రిటీ అని భావిస్తున్నారు. ఆ తరువాత రామ్ చరణ్ కూడా ఈ కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్యాన్స్‌ని ఫిదా చేశారు. దీంతో అభిమానులు కూడా పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసుకుని వారిని ఫాలో అవ్వడం మొదలు పెడుతున్నారు. (ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్.. నిమిషాల్లోనే సంచలనం.. ఇలా లాగిన్ అవ్వండి!) నివేదికల ప్రకారం మెటా థ్రెడ్స్ యాప్ కొన్ని గంటల్లోనే ట్విటర్‌ను షేక్ చేసినట్లు తెలిసింది. దీనిని కేవలం 2 గంటల్లో 20 లక్షలు, 4 గంటల్లో 50 లక్షల మంది డౌన్లోడ్ చేకున్నట్లు సంస్థ సీఈఓ జూకర్ బర్గ్ అధికారికంగా తెలిపాడు. ఈ సందర్భంగా అతడు సుమారు 11 సంవత్సరాల తరువాత ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేసాడు. ఇది ఎలాన్ మస్క్‌ని ఉద్దేశించి చేసినట్లు చాలామంది అభిప్రాయపడ్డారు. -
ట్విటర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్.. నిమిషాల్లోనే సంచలనం.. ఇలా లాగిన్ అవ్వండి!
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్' పోటీగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా థ్రెడ్స్' (Meta Threads) యాప్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల సంఖ్యలో యూజర్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే ఈ యాప్ ఎలా లాగిన్ అవ్వాలి? ఉపయోగాలేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. మెటా థ్రెడ్స్ లాగిన్ విధానం.. ట్విటర్ ప్రత్యర్థిగా విడుదలైన కొత్త 'మెటా థ్రెడ్స్' వినియోగించాలనుకునే వ్యక్తి ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ ద్వారా థ్రెడ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తరువాత ఇన్‌స్టాగ్రామ్‌తో లాగిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీ ఆధారాలను నమోదు చేయండి ప్రొఫైల్ ఫోటో, పేరు, బయో, లింక్‌లు వంటి ఇన్పుట్ వివరాలు ఫిల్ చేయండి.. లేదా ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా తీసుకోవచ్చు. పబ్లిక్ లేదా ప్రైవేట్ ప్రొఫైల్‌ను ఇక్కడ ఎంచుకోవచ్చు. ఇందులో మీరు ప్రైవేట్ ప్రొఫైల్ ఎంచుకుంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వ్యక్తులు మాత్రమే మీ పోస్టులు, ఇతర వివరాలు కనిపిస్తాయి. చివరగా జాయిన్ థ్రెడ్‌లపై క్లిక్ చేయండి. ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. మెటా థ్రెడ్స్ ఉపయోగాలు.. మెటా థ్రెడ్స్ యాప్ ద్వారా కంటెంట్‌ని సృష్టించవచ్చు, లింక్స్ పెట్టవచ్చు, ఫొటోలు, అయిదు నిమిషాల నిడివితో వీడియోలు పోస్ట్ చేయవచ్చు. చాలా ఫీచర్స్ దాదాపు ట్విటర్ ఫీచర్స్ మాదిరిగానే ఉంటాయి. ఇందులో ట్విటర్లో లేని కొన్ని అదనపు ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్ వినియోగించాలనుకునే వారు అప్పటికి ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న అందరూ ఇందులో కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. దీని కోసం ప్రత్యేకంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. (ఇదీ చదవండి: ట్విటర్‌ను షేక్ చేస్తున్న మెటా థ్రెడ్స్.. లక్షలు దాటుతున్న యూజర్ల సంఖ్య!) మెటా థ్రెడ్స్ యాప్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాల్లో తప్ప ప్రపంచంలోని దాదాపు 100కి పైగా దేశాల్లో ఈ రోజు (గురువారం) నుంచి అందుబాటులో వచ్చింది. ఈ యాప్ ద్వారా వినియోగదారుడు 500 అక్షరాలా వరకు పోస్ట్ చేయవచ్చు. కొత్తగా వచ్చిన ఈ థ్రెడ్స్ యాప్ "ట్విటర్ కిల్లర్" అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. -
ట్విటర్‌ను షేక్ చేస్తున్న మెటా కొత్త యాప్! గంటల వ్యవధిలో..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్'కి పోటీగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' ఓ కొత్త యాప్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. 'థ్రెడ్స్' (Threads) పేరుతో విడుదలైన ఈ యాప్ ఇటీవలే అందుబాటులో వచ్చింది. దీనిని ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఉపయోగించవచ్చు. ఈ లేటెస్ట్ యాప్‌కు అతి తక్కువ సమయంలో కనీవినీ ఎరుగని రీతితో స్పందన లభిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లక్షలు దాటుతున్న యూజర్లు.. నివేదికల ప్రకారం.. థ్రెడ్స్ యాప్ విడుదలైన కేవలం 2 గంటల్లో 20 లక్షల మంది, 4 గంటల్లో 50 లక్షల మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఈ విషయాన్నీ మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' స్వయంగా వెల్లడించారు. ట్విటర్ మాదిరిగా ఉండే ఫీచర్స్ కలిగిన ఈ మెటా కొత్త యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానంగా ఉంటుంది. కావున ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ యూజర్ నేమ్ కొనసాగించొచ్చు. పరిస్థితులను చూస్తుంటే థ్రెడ్స్ యాప్ ఖాతాదారుల సంఖ్య త్వరలోనే ట్విటర్‌ను అధిగమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న అకౌంట్స్ కొత్త యాప్‌లోనూ అనుసరించే అవకాశం ఉంది. కావున తప్పకుండా ఎక్కువమంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ఫోటో లైక్, షేర్ వంటి సౌలబ్యాన్ని కూడా అందిస్తుంది. టెక్స్ట్ మెసేజ్‌లు చేసుకోవాలనుకునే వారికి ఇది తప్పకుండా కొత్త అనుభవాన్ని అందిస్తుందని, ఆధునిక ప్రపంచంలో ఇలాంటి ఇలాంటి యాప్ అవసరం చాలా ఉందని మెటా చీప్ వెల్లడించారు. (ఇదీ చదవండి: రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..) pic.twitter.com/MbMxUWiQgp — Mark Zuckerberg (@finkd) July 6, 2023 ఎలాన్ మస్క్ స్పందన.. మెటా థ్రెడ్స్ యాప్ మీద ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఇది పూర్తిగా Ctrl + C + V ట్విటర్ కాపీ పేస్ట్ అని వ్యంగ్యంగా అన్నాడు. దీనికి స్పందిస్తూ ఒక నవ్వుతున్న ఎమోజీని ఎలాన్ మస్క్ పోస్ట్ చేసాడు. అయితే జుకర్‌బర్గ్ కొత్త యాప్ ప్రారంభించిన సందర్భంగా 11 సంవత్సరాల తరువాత తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇందులో ఇద్దరు స్పైడర్ మ్యాన్ ఫోటోలు ఉండటం చూడవచ్చు. ఎలాన్ మస్క్‌ను ఉద్దేశించి జుకర్‌బర్గ్ చేసిన పోస్ట్ ఇది చాలామంది భావిస్తున్నారు. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) 😂 — Elon Musk (@elonmusk) July 6, 2023 -
ట్విటర్‌కి గట్టి పోటీ.. త్వరలో కొత్త యాప్!
ఎలాన్ మస్క్ ట్విటర్ సొంతం చేసుకున్నప్పటి నుంచి అనేక మార్పులు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ మార్పులకు సాధారణ వినియోగదారులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం విసుగెత్తిపోయారు. ఈ తరుణం కోసం ఎదురు చూస్తున్న మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ యాప్‌తో పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నాయి. ట్విటర్‌కు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూసే వారికి ఇప్పటికే మాస్టోడాన్, బ్లూ స్కై వంటివి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సైతం ట్విటర్‌కు పోటీగా కొత్త యాప్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇన్స్టాగ్రామ్ బ్రాండ్‌పై కొత్త యాప్ తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతున్నట్లు సమాచారం. మెటా సైతం కొత్తగా తీసుకురానున్న ఈ యాప్ పేరు అధికారికంగా ప్రస్తావించనప్పటికీ, కొంత మంది దీనిని పీ92, బార్సిలోనా పేర్లతో పిలుచుకుంటున్నారు. కానీ ఇది ఒక ప్రత్యేకమైన యాప్‌గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాది జూన్ నాటికి భారతదేశంలో అందుబాటులో రానున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ కొత్త యాప్ దాదాపుగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాదిరిగా ఉంటుందని, ఇందులో ఫోటోలు, వీడియోలు మాత్రమే కాకుండా ఇతరత్రా టైమ్‌లైన్ పోస్టులు పెట్టుకోవచ్చని భావిస్తున్నారు. మెటా విడుదలచేయనున్న ఈ కొత్త యాప్‌లో సుమారు 500 అక్షరాలతో టెక్స్ట్ రాసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అంతే కాకుండా ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న వారిని కూడా ఒక్క క్లిక్‌తో ఈ కొత్త యాప్‌లోనూ ఫాలో అయ్యే విధంగా కంపెనీ ఏర్పాటు చేస్తోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా భారీగా యూజర్లను సంపాదించుకున్న మెటా ఇప్పుడు త్వరలో విడుదల చేయనున్న కొత్త యాప్ ద్వారా ఎంత వరకు ఆదరణ పొందుతుంది. ట్విట్టర్ యాప్‌కి ప్రధాన ప్రత్యర్థిగా ఈ యాప్ నిలుస్తుందా.. లేదా? అనే మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!
మనం ఇప్పటి వరకు ఎంతో మంది విజయ గాథలను (సక్సెస్ స్టోరీస్) గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు అతి తక్కువ కాలంలోనే కోట్ల సామ్రాజ్యం సృష్టించిన 'నిర్మిత్ పారిఖ్' గురించి తెలుసుకుందాం. నిర్మిత్ పారిఖ్ ఎవరు? అయన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో.. ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీలలో ఒకటైన ఆపిల్ సంస్థలో ఉన్నత ఉద్యోగాన్ని, లక్షల జీతాన్ని వదులుకుని భారతదేశానికి వచ్చి అతి తక్కువ కాలంలోనే కుబేరుడయ్యాడు. కరోనా మహమ్మారి వ్యాప్తికంటే ముందు స్వదేశానికి వచ్చి ఏదైనా సొంతంగా చేయాలనే పట్టుదలతో జాబ్స్ ప్లాట్‌ఫామ్ 'అప్నా' (Apna) ప్రారంభించి ఎన్నో కంపెనీలకు మార్గదర్శిగా నిలిచాడు. ఈ యాప్ ప్రారభించిన కేవలం 21 నెలల్లో ధనవంతుల జాబితాలో ఒకడయ్యాడు. నిర్మిత్ పారిఖ్ మొదలు పెట్టిన ఈ జాబ్ ప్లాట్‌ఫామ్ షాడోఫాక్స్, జొమాటో, ఢిల్లీవేరీ, G4S గ్లోబల్, బర్గర్ కింగ్ వంటి ఎన్నో కంపెనీలు ఉపయోగించుకున్నాయి. టెక్నాలజీలో మార్పు తీసుకురావడమే కాకుండా ఎంతో మందికి ఉపయోగపడాలని ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ యాప్ అతన్ని కోట్లకు అధిపతిని చేసింది. (ఇదీ చదవండి: జిమ్నీ ప్రియులారా ఊపిరి పీల్చుకోండి.. లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది!) నిర్మిత్ పారిఖ్ 2023 మే నాటికి 1.1 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడయ్యాడు. అంటే ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 9,000 కోట్లకంటే ఎక్కువ. ఒక్క ఆలోచన అతని జీవితాన్నే మార్చేసింది, అతి తక్కువ కాలంలోనే అతని ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింది. అప్నా యాప్ 10 కోట్లకు పైగా ఇంటర్వ్యూలను, ఒక కోటికి పైగా డౌన్లోడ్లను కలిగి ఉంది. నిర్మిత్ నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీర్ అండ్ అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఫర్ బిజినెస్ నుంచి MBA చదివారు. ఈయన కేవలం 21 సంవత్సరాల వయసులోనే ఇన్కోన్ టెక్నాలజీస్ అనే సంస్థను స్థాపించాడు. ఆ తరువాత అనేక సంస్థలలో ఉన్నతమైన పదవుల్లో పనిచేసి తరువాత ఒక యాప్ ద్వారా గొప్ప సక్సెస్ సాధించాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్కోవడానికిఇ సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఇక ట్విటర్ కనిపించదు.. ఎందుకంటే?
ట్విటర్ కంపెనీని ఎలన్ మస్క్ సొంత చేసుకున్నప్పటి నుంచి అన్ని సమస్యలే! లెక్కకు మించిన ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. లోగో విషయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. పక్షి స్థానంలో కుక్కను.. కుక్క స్థానంలో పక్షిని చూపించి వినియోగదారులను సైతం కన్ఫ్యుస్ చేసేసారు. అయితే ఇప్పుడు ఏకంగా ట్విటర్ మాయం కానున్నట్లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు క్షుణ్ణంగా ఈ కథనంలో చూసేద్దాం.. నివేదికల ప్రకారం, ట్విటర్‌ను ఎక్స్ అనే 'ఎవ్రీథింగ్ యాప్'లో విలీనం చేసినట్లు సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ వెల్లడించినట్లు తెలుస్తోంది. మంగళవారం ట్విటర్ బాస్ ఎలోన్ మస్క్ ఈ పరిణామాన్ని ధ్రువీకరించే ఉద్దేశంతో ‘ఎక్స్’ ఒకే అక్షరాన్ని ట్వీట్ చేశారు. మస్క్ ట్వీట్ చేసిన ఈ ఒక్క అక్షరం దేనిని సూచిస్తుందనే మీద సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఇది ట్విటర్ విలీనం కానున్న X Corp కంపెనీ అని భావిస్తున్నారు. ట్విటర్ కొనుగోలు ప్రక్రియ తుది దశలో ఉండగానే, ఎక్స్ యాప్‌కు సంబంధించిన ప్రణాళికలను మస్క్ వెల్లడించారు. గతంలో ఎక్స్ యాప్ అనేది నా దీర్ఘకాల వ్యాపార ప్రణాళిక అని, దీని రూపకల్పనను వేగవంతం చేసేందుకు ట్విటర్ చాలా ఉపయోగపడుతుందని, ట్విటర్‌ను కొనుగోలు చేస్తే ఎక్స్ కంపెనీ ఏకంగా మూడు నుంచి ఐదు ఏళ్ళు ముందుకు సాగుతుందని అక్టోబర్ 2022లో ట్వీట్ చేశారు. అదే ఇప్పుడు నిజం కానుంది. (ఇదీ చదవండి: పేరుకే యూట్యూబర్! నెల సంపాదన రూ. కోటి కంటే ఎక్కువ..) చైనాలో అందుబాటులో ఉన్న వీచాట్ మాదిరిగానే మెసేజింగ్, కాలింగ్ వంటి అనేక కార్యక్రమాలు ఒకే యాప్‌లో చేసుకునేలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదే మా లక్ష్యం అని మస్క్ వెల్లడించారు. నిజానికి 1999లో ఈయన ఎక్స్ పేరుతో ఒక ఆన్లైన్ బ్యాంకు ఏర్పాటు చేశారు. ఆ తరువాత దానిని పేపాల్‌లో విలీనం చేశారు. ఆ తరువాత ఎక్స్.కామ్ కొనుగోలు చేశారు, ప్రస్తుతం ట్విటర్‌ను కొత్త సూపర్ యాప్ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. X — Elon Musk (@elonmusk) April 11, 2023 -
ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఫోన్‌పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే తాజాగా ఈ–కామర్స్ వ్యాపారంలోకి ప్రవేశించింది. పిన్‌కోడ్ పేరిట షాపింగ్ యాప్‌ను రూపొందించింది. తొలుత బెంగళూరులో ఈ యాప్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ తెలిపారు. రోజుకు 10,000 పైచిలుకు లావాదేవీలు సాధించిన తర్వాత ఇతర నగరాలకు కూడా దీన్ని విస్తరిస్తామని చెప్పారు. డిసెంబర్ నాటికి రోజుకు లక్ష లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వినియోగదారులకు సంబంధించి గత ఏడేళ్లలో ఫోన్‌పే నుంచి ఇది రెండో యాప్ అని చెప్పారు. కేంద్రం తీర్చిదిద్దిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ప్లాట్‌ఫాం ఆధారంగా పిన్‌కోడ్ యాప్‌ను రూపొందించారు. -
ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!
ట్విటర్‌కు పోటీగా మరో మైక్రోబ్లాగింగ్ సైట్ వస్తోంది. ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్‌డోర్సే ‘బ్లూస్కై’ అనే యాప్ బీటా వర్షన్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్‌లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. టెక్‌క్రంచ్ కథనం ప్రకారం.. బ్లూస్కై ప్రస్తుతం ఇన్వైట్-ఓన్లీ బీటా వర్షన్ అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 17న అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను ఇప్పటివరకు 2 వేల మంది ఎంపిక చేసిన యూజర్లు ఇన్స్టాల్ చేసుకున్నట్లు డేటా.ఏఐ అనే యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంది. ట్విటర్ మాదిరిగానే బ్లూస్కై యూజర్ ఇంటర్ఫేస్ను కూడా చాలా సింపుల్‌గా రూపొందించారు. 256 అక్షరాల వరకు నిడివితో యూజర్లు చాలా తేలికగా పోస్ట్‌లు చేయొచ్చు. ప్లస్ బటన్ క్లిక్ చేయడం ద్వారా సులువుగా ఫొటోలు జోడించొచ్చు. ట్విటర్లో ఉన్న ‘వాట్ ఈజ్ హాపెనింగ్?’ అన్న ఆప్షన్‌కు బదులుగా ఇందులో ‘వాట్స్అప్?’ అనే ఆప్షన్ ఉంది. అలాగే బ్లూస్కైలో షేర్, మ్యూట్, బ్లాక్ అకౌంట్స్ వంటి ఆప్షన్స్‌తో పాటు కొత్తవారిని కూడా యాడ్ చేసే అడ్వాన్స్డ్ ఫీచర్ ఇందులో ఉంది. (ఇదీ చదవండి: లేఆఫ్స్ వేళ ఫ్రెంచ్ కంపెనీ సంచలనం.. కొత్తగా 12 వేల మందికి ఉద్యోగాలు!) యాప్ మధ్యలో ఇచ్చిన డిస్కవర్ ట్యాబ్ ద్వారా.. యూజర్లు ఎవరిని ఫాలో అవ్వాలి, సజెషన్స్, తాజా అప్డేట్స్ ఫీడ్‌ను తెలుసుకోవచ్చు.అలాగే నోటిఫికేషన్స్ ట్యాబ్ ద్వారా లైక్స్, రిపోర్ట్స్, ఫాలోస్, రిప్లయిస్ వంటివి చూసుకోవచ్చు. అయితే ఇందులో ప్రస్తుతానికి డెరెక్ట్ మెసేజ్ (డీఎం) ఫీచర్ లేదు. ట్విటర్ మాదిరిగానే బ్లూస్కైలో కూడా యూజర్లు సెర్చ్, ఫాలో, తమకు పోస్ట్‌లకు సంబంధించిన అప్డేట్లను హోం టైమ్‌లైన్‌లో చూసుకోవచ్చు. ఈ బ్లూస్కై ప్రాజెక్ట్‌ను 2019లోనే అభివృద్ధి చేసినప్పటికీ దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరిపి, మరింతగా అభివృద్ధి చేసి 2022లో స్వతంత్ర కంపెనీగా ఆవిష్కరించారు. జాక్ డోర్సే ట్విటర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈ బ్లూస్కై గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత 2022 అక్టోబర్‌లో ఏ యాప్‌తో అయినా సరే పోటీ విధింగా బ్లూస్కైని రూపొందిస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలియజేశారు. బ్లూస్కై గతేడాది 13బియన్ డాలర్ల నిధులను సమీకరించింది. -
Apple watch: బ్లడ్ గ్లూకోజ్ ట్రాకింగ్ ఇప్పుడు చాలా సింపుల్.. ఎలా?
మారుతున్న ప్రపంచంలో మనం వినియోగించే వస్తువులు కూడా అప్డేట్ అవుతూనే ఉన్నాయి, ఇప్పటికే అనేక ఆధునిక ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్న యాపిల్ వాచ్ ఇప్పుడు బ్లడ్ గ్లూకోజ్ ట్రాకింగ్ చేయడానికి ఉపయోగపడేలా తయారైంది. నిజానికి షుగర్‌బాట్ అనేది ఐఫోన్ యాప్. ఇది వినియోగదారులు తీసుకునే ఆహారంలో ఉన్న షుగర్ లెవెల్స్ ట్రాక్ చేస్తుంది. ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ ట్రాక్ చేయడం వల్ల ఆరోగ్యం పట్ల మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవచ్చు. వాచ్ఓఎస్ వెర్షన్‌తో వస్తున్న లేటెస్ట్ అప్డేట్తో ఆపిల్ వాచ్ వినియోగదారులు నేరుగా యాక్సెస్ చేయవచ్చు. ఇక మీరు యాపిల్ వాచ్‌తో క్యాలరీలు, షుగర్ లెవెల్స్ తెలుసుకోవడంలో షుగర్‌బాట్ ఎంతగానో సహాయపడుతుంది. తెలియని వారు కూడా సులభంగా షుగర్‌బాట్ ఉపయోగించవచ్చు. యాప్ ఓపెన్ చేసిన వెంటనే రోజులో తీసుకున్న ఆహారం గురించి ప్రస్తావించాలి, ఇందులో చికెన్ సూప్ నుంచి బిగ్ మ్యాక్ వరకు అనేక ఆహారాల డేటాబేస్ ఉంటుంది. (ఇదీ చదవండి: Zomato Everyday: హోమ్ స్టైల్ మీల్స్.. కేవలం రూ. 89 మాత్రమే) మీరు తీసుకున్న ఆహరం యాప్‌లో లేకపోతే చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మాన్యువల్‌గా కూడా మీరు తీసుకున్న ఆహారం గురించి జోడించవచ్చు. ఈ యాప్ క్యాలరీలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, సూక్ష్మపోషకాలు, విటమిన్లు వంటి డేటాకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తుంది. -
ఓలా, ఉబెర్‌కు ఊహించని దెబ్బ, దూసుకుపోతున్న ఆ యాప్
సాక్షి, బెంగళూరు: కర్నాటకలో యాప్ ఆధారిత క్యాబ్ సేవలు అందించే ఓలా, ఉబెర్, ర్యాపిడో ఊహించని దెబ్బపడింది. అధిక చార్జీలు, వ్యవహార తీరుతో తీవ్ర విమర్శల పాలై, అక్కడి సర్కార్ ఆగ్రహానికి గురైన దిగ్గజాలకు అనూహ్యంగా మరో షాక్ తగిలింది. బెంగుళూరు ఆటో రిక్షా డ్రైవర్లు సొంతంగా ఒక యాప్‌ను రూపొందించుకున్నారు. లాంచింగ్‌కు ముందే 'నమ్మ యాత్రి' అప్లికేషన్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. బెంగళూరు ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ (ARDU) నవంబర్ 1న తన నమ్మయాత్రి సేవలను షురూ చేయనుంది. అయితే ఈ యాప్ ఇప్పటికే 10,000 డౌన్లోడ్స్ సాధించింది. అలాగే కస్టమర్లను ఆకట్టుకునేలా చార్జీలను నిర్ణయించారు. యూజర్ క్యాన్సిలేషన్ చార్జీలు లేకుండా, 30 రూపాయల కనీస ఫీజు ఫిక్స్ చేశారు. అయితే ప్రస్తుతానికి నగదు మాత్రమే స్వీకరిస్తున్నారు. ప్రత్యర్థులకు సమానమైన ఇంటర్ఫేస్తో 'సరసమైన ధరల' వద్ద సేవలను అందిస్తుండటం విశేషం. దీంతో ఈ యాప్ చాల బావుందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్‌పై సోషల్ మీడియాలో రివ్యూలు వెల్లువెత్తాయి. పికప్, డ్రాప్ లొకేషన్లను సెట్ చేసిన తర్వాత, సమీపంలోని డ్రైవర్లు చార్జీని కోట్ చేస్తారు. సాధారణంగా పికప్ , డ్రాపింగ్ ప్లేస్ దూరాన్ని బట్టి అదనంగా 10-30 రూపాయల వరకు అదీ ప్రభుత్వం నిర్ణయించిన మేరకే చార్జీ వసూలు చేయనుంది చిన్మయ్ ధుమాల్ అనే దీనిపై ట్వీట్ చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఆటో సర్వీసులపై విధించిన నిషేధంపై ఓలా, ఉబెర్, రాపిడోలకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది.దీనిపై మధ్యంతర స్టే విధిస్తూ తదుపరి విచారణను 2022, నవంబర్ 7కు వాయిదా వేసిసి సంగతి తెలిసిందే. Bangalore Auto Rickshaw Drivers launched their own application called 'Namma Yatri' to tackle unfair comission charges of Ola/Uber. - ₹30 fixed platform fees - No cancellation charges - Currently, Cash Only The app is beautiful and responsive. Bangalore is built different! pic.twitter.com/8J7OZIXcA1 — Chinmay Dhumal (@ChinmayDhumal) October 27, 2022 -
‘మీ4 టిక్ టిక్’ యాప్ లాంచ్.. టిక్ టాక్‌ను మరిపిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టిక్ టాక్ ద్వారా యూత్ తమ టాలెంట్‌ను నిరూపించుకుంటూ ఎంతో పాపులర్ అయ్యేవారు. అయితే కొన్ని భద్రతా కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం "టిక్ టాక్" ను బ్యాన్ చేసింది. దీంతో యువత ప్రత్యామ్నాయాలను ఎంచుకున్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా "రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి "మీ 4 టిక్ టిక్" యాప్ ను ప్రముఖులు, యువత సమక్షంలో హైదరాబాద్‌లో ఘనంగా లాంచ్ చేసింది. ట్యాలెంటెడ్ యూత్ కు 'ME 4 టిక్ టిక్' యాప్ ఒక యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని "ME 4 Tic Tic" యాప్ ఇండియా సీఈవో డీసతీష్ రెడ్డి వెల్లడించారు. అన్ని రకాల కంటెంట్ తో అందరినీ అలరిస్తుందన్నారు. ముఖ్యంగా స్వదేశీంలో భారత ఐటీ యువత రూపొందించిన "ME 4 టిక్ టిక్" హైలీ సెక్యూర్డ్ యాప్ అనీ ఇందులో ఉండే డేటా చాలా సేఫ్ అని కంపెనీ వెల్లడించింది. ఈ యాప్ 150 దేశాలలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా అమెజాన్ భాగస్వామ్యంతో అమెజాన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఈ యాప్ ఉంటుందని, ఒక భారతీయుడిగా ఇండియాలో ఈ యాప్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యాప్ రూపొందించిన టీంకు కృతజ్ఞతలు తెలిపిన పలువురు, యాప్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఇదివరకు సినిమాలో ఏ క్యారెక్టర్ కు ఎవరు సూట్ అవుతారో ఫోటో షూట్ చూసి సెలెక్ట్ చేసేవారమనీ, సోషల్ మీడియా వచ్చిన తరువాత చాలామంది దర్శక, నిర్మాతలకు ఇపుడు ఆ పని ఈజీ అయ్యిందని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినీ నిర్మాత సురేష్ కొండేటి వ్యాఖ్యానించారు. టిక్ టాక్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన "ME4 టిక్ టిక్" యాప్ పెద్ద సక్సెస్ అవ్వాలన్నారు. -
TTD: టీటీడీ సేవలన్నింటికీ ఒకే యాప్
సాక్షి, తిరుమల(చిత్తూరు): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అందించే సేవల వివరాలన్నీ ఒకే యాప్‌లో పొందు పరిచేందుకు జియో సంస్థతో దేవస్థానం అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సమక్షంలో అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, జియో ప్రతినిధి అనీష్ ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ పరిస్థితుల్లో శ్రీవారి దర్శనం కోసం ఆన్లైన్ ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు జారీచేయడంతో ఒకేసారి లక్షలాది మంది భక్తులు ప్రయత్నించడంతో టీటీడీ సర్వర్లలో సమస్యలు తలెత్తాయని చెప్పారు. వీటిని అధిగమించేందుకు జియో సంస్థ సహకారం తీసుకున్నామన్నారు. టీటీ డీకి సంబంధించిన సమస్త సేవలు, సమాచారం ఒకేచోట లభించేలా జియో ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేయడానికి ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. ఇందులో భక్తులకు అవసరమైన వసతి, దర్శనం లాంటి సకల సేవలు అందుబాటులో ఉంటాయ న్నారు. రాబోయే వైకుంఠ ఏకాదశి రోజున ఈ యాప్‌ను ఆవిష్కరించేలా ఏర్పాటు చేయాలని చైర్మన్ కోరారు. ఐదేళ్లుగా టీటీడీకి ఉచితంగా సాంకేతిక సహకారం అందిస్తున్న టీసీఎస్ సమన్వ యంతో జియో సంస్థ ఉచితంగా టీటీడీ ఐటీ విభాగానికి మెరుగైన సేవలు అందిస్తోందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. -
సోనూ సూద్ ‘ట్రావెల్’ యాప్
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులకు వ్యాపార అవకాశాలు కల్పించే దిశగా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ట్రావెల్ యూనియన్ పేరిట బిజినెస్–టు–బిజినెస్ ట్రావెల్ టెక్నాలజీ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించారు. ఐఆర్సీటీసీ దేశవ్యాప్తంగా నిర్వహించే రైళ్లు, దేశ..విదేశ రూట్లలో 500 పైచిలుకు ఫ్లయిట్లు, 10 వేల పైచిలుకు బస్సు ఆపరేటర్ల వాహనాల్లో టికెట్లతో పాటు హోటళ్లలో గదులను దీని ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు తమ ప్రయాణాలను ముందస్తుగా ప్లాన్ చేసుకునే వెసులుబాటు అంతగా లేదని, ఒక్కో దానికోసం ఒక్కో ఆపరేటరును ఆశ్రయించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ట్రావెల్ యూనియన్‌తో ఇలాంటి వాటన్నింటినీ చౌకగా ఒకే చోట పొందవచ్చని సోను సూద్ వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపారవేత్తలకు ఇది అదనపు ఆదాయ మార్గంగా ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాట్‌ఫాంలో చేరడానికి కట్టే నామమాత్రపు రుసుము రిఫండ్ అవుతుందని, తద్వారా ఉచితంగానే చేరినట్లవుతుందన్నారు. ట్రావెల్ యూనియన్‌లో సోనూ సూద్ రెండో అతి పెద్ద వాటాదారుగా ఉన్నారు. -
ఇ–రూపీ వచ్చేసింది..!
న్యూఢిల్లీ: ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో పారదర్శకతను మెరుగుపరచడం, ప్రయోజనాలను నేరుగా లక్ష్యిత సేవలకు అందించడం లక్ష్యంగా కేంద్రం ‘ఇ–రూపీ’ని తీసుకొచ్చిం ది. వ్యక్తులు అలాగే నిర్దిష్ట ప్రయోజనాల కోసం వినియోగించే ఈ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్‌ను సోమవారమిక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతానికి ఇ–రూపీ సదుపాయం ఆరోగ్య సేవలకు అందుబాటులో ఉంటుంది, రానున్న కాలంలో ఇతర విభాగాలకు కూడా దీన్ని విస్తరించనున్నారు. ఆయుష్మాన్ భారత్, ఎరువుల సబ్సిడీ వంటి వాటికి కూడా కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ‘ఇ–రూపీ ద్వారా డిజిటల్ పాలనలో దేశం సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. డిజిటల్ లావాదేవీలు అలాగే ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ)ని మరింత సమర్థవంతంగా మార్చడంలో ఇ–రూపీ వోచర్ అద్భుతమైన పాత్రను పోషించబోతోంది. లక్ష్యిత వర్గాలందరికీ పారదర్శకమైన, లీకేజీ రహిత ప్రయోజనాలు అందించడంలో దోహదం చేస్తుంది‘ అని ఇ–రూపీ ప్రారంభం సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. లీకేజీలకు అడ్డుకట్ట... ప్రభుత్వ ప్రయోజనాలను నిర్దేశిత లబ్ధిదారులకు, వృథా (లీకేజీ) రహితంగా. లక్ష్యిత వర్గాలకు చేరేవిధంగా పలు పథకాలను గత కొన్నేళ్లుగా కేంద్రం ప్రవేశపెడుతూనే ఉంది. ఇప్పుడు అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రానికల్ వోచర్ అనేది సుపరిపాలన విజన్‌ను పెంపొందించడంలో మరింత తోడ్పాటును అందించనుంది. ఇది ఒక్క ప్రభుత్వానికి మాత్రమే సంబంధించినది కాదని, ప్రైవేటు సంస్థలు లేదా ఎవరికైనా తమ వైద్య చికిత్సలు, విద్య లేదా ఇతరత్రా ఎలాంటి పనులకైనా సరే సహాయం చేయాలనుకుంటున్న సంస్థలు నగదుకు బదులు ఇ–రూపీ రూపంలో ఇవ్వవచ్చని ప్రధాని వివరించారు. దీనివల్ల ఏ ప్రయోజనం కోసమైతే డబ్బును ఇచ్చారో, అదే పని కోసం కచ్చితంగా అది వినియోగించబడేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ వంటి నిర్దిష్ట ప్రయోజనాలను అవసరమైన వారికి చేరువ చేసేందుకు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ఈ లీకేజీ రహిత యంత్రాంగాన్ని ఉయోగించుకోవచ్చని వివరించారు. రాష్ట్రాలు కూడా సంక్షేమ పథకాలను నిర్దేశిత లబ్ధిదారులకు చేరువ చేసేందుకు ఇ–వోచర్‌ను వినియోగించుకోవాల్సిందిగా ప్రధాని సూచించారు. ప్రైవేటు రంగం సైతం తమ ఉద్యోగుల సంక్షేమం, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యకలాపాలకు ఈ డిజిటల్ వోచర్ల ప్రయోజనాలను వాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. వంట గ్యాస్, రేషన్ సరుకులు అలాగే ఇతరత్రా సంక్షేమ పథకాలకు సంబంధించి సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి వేయడం (డీబీటీ) ద్వారా భారీగా లీకేజీలకు అడ్డుకట్ట వేయగలిగామని, అదేవిధంగా నకిలీ లబ్ధిదారులను ఏరివేయగలిగామని ప్రధాని పేర్కొన్నారు. ప్రభుత్వం రూ.1.78 లక్షల కోట్ల మొత్తాన్ని ఆదా చేయడంలో ఇది ఎంతగానో తోడ్పడిందని ఆయన చెప్పారు. కరోనా లాక్డౌన్ సమయంలో డీబీటీ ఎంతగా ఉపయోగపడిందనేది ప్రధాని వివరిస్తూ... జామ్ (జన్‌ధన్ ఖాతా, మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు)తో డిజిటల్ ఇండియా అనుసంధానం వల్ల ఒక్క క్లిక్‌తో నేరుగా కోట్లాది మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేసేందుకు తోడ్పడిందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇప్పటికీ దీని కోసం భౌతిక వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. డీబీటీ ప్లాట్‌ఫామ్ ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకూ కేంద్రం అందిస్తున్న 300కు పైగా స్కీములకు రూ.17.5 లక్షల కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు ప్రధాని వెల్లడించారు. ‘వంట గ్యాస్ సబ్సిడీ, పెన్షన్లు, పీఎం కిసాన్ యోజన, స్కాలర్షిప్లు వంటి వాటి కోసం దాదాపు 90 కోట్ల మంది ఈ డీబీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయడం ద్వారా రూ.1.78 లక్షల కోట్లు ఆదా అయింది’ అని చెప్పారు. సేవల కల్పనలో నవకల్పనలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విషయానికొస్తే, ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలన్నింటితో పాటు భారత్ కూడా ప్రపంచ నాయకత్వాన్ని అందించే సత్తాను సొంతం చేసుకుందని ప్రధాని పేర్కొన్నారు. -
యూట్యూబ్ చేతికి సిమ్‌సిమ్ యాప్
న్యూఢిల్లీ: వీడియో షేరింగ్ వెబ్సైట్ యూట్యూబ్ తాజాగా భారత్‌కు చెందిన వీడియో ఈ–కామర్స్ ప్లాట్‌ఫాం సిమ్‌సిమ్ యాప్‌ను కొనుగోలు చేసింది. దేశీయంగా చిన్న వ్యాపార సంస్థలు, రిటైలర్లను కొత్త కస్టమర్లకు చేరువ చేసేందుకు ఈ డీల్ తోడ్పడగలదని యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్ తెలిపింది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చిస్తున్నదీ మాత్రం వెల్లడించలేదు. మరికొన్ని వారాల్లో కొనుగోలు లావాదేవీ పూర్తి కాగలదని సంస్థ తెలిపింది. సిమ్‌సిమ్ యాప్‌లో ఎటువంటి మార్పులు ఉండవని, ఇకపైనా స్వతంత్రంగానే కార్యకలాపాలు కొనసాగిస్తుందని గూగుల్ పేర్కొంది. సిమ్‌సిమ్ ఆఫర్లను యూట్యూబ్ వీక్షకులకు ఏ విధంగా చూపవచ్చన్న దానిపై కసరత్తు చేస్తున్నామని తెలిపింది. స్థానిక వ్యాపార సంస్థలు, ప్రభావితం చేసేవారు, కస్టమర్లను సిమ్‌సిమ్ అనుసంధానిస్తుంది. స్థానిక వ్యాపార సంస్థల ఉత్పత్తుల గురించి క్రియేటర్లు ..ఇందులో వీడియో రివ్యూలు ఉంచుతారు. వీక్షకులు ఆయా ఉత్పత్తులను నేరుగా యాప్ నుంచే కొనుగోలు చేయవచ్చు. ఇందులోని వీడియోలు ప్రస్తుతం హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో ఉంటున్నాయి. యూజర్లు ఆన్లైన్లో సులభతరంగా కొనుగోళ్లు చేసేందుకు, విక్రేతలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు సిమ్సిమ్ను ప్రారంభించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకులు అమిత్ బగారియా, కునాల్ సూరి, సౌరభ్ వశిష్ట ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. -
జర్నలిస్టుల కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక యాప్
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో సమావేశాలను జూమ్‌లో, విద్యార్థులకు చదువులు ఆన్లైన్లో..ఇలా ప్రతీది ఆన్లైన్ బాటలో నడుస్తున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వర్చువల్ విధానంలో విచారణలు జరుపుతుండగా...జర్నలిస్టుల కోసం కూడా ఓ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌ను సీజేఐ జస్టీస్ ఎన్.వి.రమణ ప్రారంభించారు. యాప్ ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది జర్నలిస్టులకు ఎంతో ఉపయోగపడనుందని గతంలోను ఓ జర్నలిస్టుగా బస్సులో తిరుగుతూ వార్తలు సేకరించిన రోజులు గుర్తున్నాయని సీజేఐ ఈ సందర్భంగా అన్నారు. సుప్రీం కోర్టు విచారణలను జర్నలిస్టులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సుప్రీంకోర్టు ఇ-కమిటీ చొరవతో ఈ యాప్‌ని విడుదలు చేస్తున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి రమణ అన్నారు. కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తామని ఆయన అన్నారు. కోర్టు ప్రత్యక్ష కార్యకలాపాలను ప్రసారం చేసేలా ఓ ట్రయల్ ప్రతిపాదనను కూడా సుప్రీంకోర్టు పరిశీలిస్తోందని తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కోర్టు విచారణలను పలువురు జర్నలిస్టులు వర్చువల్ ద్వారా జరపాలని కోరిన తరువాత యాప్‌ను రూపొందించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ఈ యాప్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్ ద్వారా విచారణలను ప్రత్యక్షంగా హాజరయ్యే వీలు కల్పించనున్నారు. ( చదవండి: కోవిడ్ మరణాల్లో మరో రికార్డు ) Breaking: Supreme Court to launch app that will provide links for virtual hearings to media persons#SupremeCourt #VirtualHearings #media https://t.co/xoFpobyCOo pic.twitter.com/I2CKKneZto — Bar & Bench (@barandbench) May 13, 2021