న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే తాజాగా ఈ–కామర్స్ వ్యాపారంలోకి ప్రవేశించింది. పిన్‌కోడ్ పేరిట షాపింగ్ యాప్‌ను రూపొందించింది. తొలుత బెంగళూరులో ఈ యాప్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ తెలిపారు. రోజుకు 10,000 పైచిలుకు లావాదేవీలు సాధించిన తర్వాత ఇతర నగరాలకు కూడా దీన్ని విస్తరిస్తామని చెప్పారు.
డిసెంబర్ నాటికి రోజుకు లక్ష లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వినియోగదారులకు సంబంధించి గత ఏడేళ్లలో ఫోన్‌పే నుంచి ఇది రెండో యాప్ అని చెప్పారు. కేంద్రం తీర్చిదిద్దిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) ప్లాట్‌ఫాం ఆధారంగా పిన్‌కోడ్ యాప్‌ను రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment