
న్యూఢిల్లీ: నమోదిత వినియోగదారుల సంఖ్య 60 కోట్లు దాటిందని ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే తెలిపింది. 4 కోట్ల మందికిపైగా వర్తకులు ఫోన్‌పే వేదికగా కస్టమర్ల నుంచి డిజిటల్ చెల్లింపులను అందుకుంటున్నారు.
10 సంవత్సరాల ప్రయాణంలో కంపెనీ తన కార్యకలాపాలను వెల్త్ మేనేజ్‌మెంట్, పిన్‌కోడ్ ద్వారా ఈ–కామర్స్ రంగంలోకి ప్రవేశించింది. 2023లో జరిగిన చివరి నిధుల సమీకరణ రౌండ్‌లో కంపెనీని 12 బిలియన్ డాలర్లుగా విలువ కట్టారు.
ఫోన్‌పే డిజిటల్ చెల్లింపుల యాప్ 2016 ఆగస్టులో ప్రారంభమైంది. 2024 మార్చి నాటికి సంస్థ ఖాతాలో నమోదిత వినియోగదారులు దాదాపు 53 కోట్ల మంది ఉన్నారు. ఫోన్‌పే రోజుకు 33 కోట్లకుపైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. వార్షికంగా వీటి మొత్తం చెల్లింపుల విలువ రూ.150 లక్షల కోట్లకుపైగా ఉంటుందని సంస్థ వెల్లడించింది.
ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా
Comments
Please login to add a commentAdd a comment