online transaction
-
ఆరు నెలల్లో 7897 కోట్ల లావాదేవీలు
తక్షణ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీల సంఖ్య 2024 జనవరి–జూన్ మధ్య దేశవ్యాప్తంగా 78.97 బిలియన్ల(7897 కోట్లు)కు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే లావాదేవీలు 52 శాతం పెరిగాయని పేమెంట్ టెక్నాలజీ సర్వీసులు అందిస్తున్న వరల్డ్‌లైన్ నివేదిక వెల్లడించింది.‘గతేడాదితో పోలిస్తే జనవరి–జూన్ మధ్య లావాదేవీల విలువ రూ.83.16 లక్షల కోట్లు నుంచి రూ.116.63 లక్షల కోట్లకు చేరింది. 2023 జనవరిలో యూపీఐ లావాదేవీల సంఖ్య 803 కోట్లుగా ఉంది. 2024 జూన్‌కు ఇది 1300 కోట్లకు చేరింది. లావాదేవీల విలువ రూ.12.98 లక్షల కోట్ల నుంచి రూ.20.07 లక్షల కోట్లకు చేరింది. విలువ, పరిమాణం పరంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వరుసగా మూడు స్థానాలను ఆక్రమించాయి. సగటు లావాదేవీ విలువ 2023 జనవరి–జూన్ మధ్య రూ.1,603 నమోదైంది. 2024 జూన్‌తో ముగిసిన ఆరు నెలల్లో ఇది రూ.1,478కి చేరింది. ఆన్లైన్ పరిశ్రమలో ఈ–కామర్స్, గేమింగ్, యుటిలిటీస్, ప్రభుత్వ సేవలు, ఆర్థిక సేవలు మొత్తం లావాదేవీల పరిమాణంలో 81 శాతం, విలువలో 74 శాతం కైవసం చేసుకున్నాయి’ అని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: ఒకే నెలలో రూ.24,509 కోట్లు రాక! -
యూపీఐ లైట్ కొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందంటే?
డిజిటల్ ఇండియాలో యూపీఐ పేమెంట్స్ సర్వసాధారణం అయిపోయింది. స్మార్ట్‌ఫోన్ వినియోగించే దాదాపు అందరూ గూగుల్ పే, ఫోన్ పే వంటివి ఉపాయ్ప్గిస్తున్నారు. అయితే పేమెంట్స్ చేసేటప్పుడు ఇది కొంత ప్రాసెస్‌తో కూడుకున్న పని. పిన్ ఎంటర్ చేయాలి.. ఆ తరువాత ట్రాన్సక్షన్ జరుగుతుంది.దీనిని మరింత సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ లైట్ ఫీచర్ తీసుకొచ్చింది. దీనిని చిన్న లావాదేవీలకు మాత్రమే ఉపయోగకోవాలి. ఎందుకంటే ఇందులో రూ. 2000 మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తయిన తరువాత మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ఈ విధానానికి చరమగీతం పాడే సమయం వచ్చేసింది.యూపీఐ ఆటో టాప్-అప్లావేదేవీల కోసం యూపీఐ లైట్ ఉపయోగిస్తుంటే.. అక్టోబర్ 31 తరువాత ఆటో టాప్ అప్ ఎంపికను ఉపయోగించుకోవచ్చు. అంటే యూపీఐ లైట్లో ఆటో టాప్-అప్ ఆప్షన్ ఎంచుకుంటే.. అమౌట్ పూర్తయిన తరువాత మీ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్‌గా అమౌంట్ యాడ్ అవుతుంది. ఇది అక్టోబర్ 31 నుంచి అమలులోకి రానున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది.నిజానికి యూపీఐ ట్రాన్సక్షన్ చేయాలనంటే పిన్ ఎంటర్ చేయాలి. కానీ యూపీఐ లైట్ ద్వారా రూ. 500 కంటే తక్కువ లావాదేవీలు జరపడానికి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది యూజర్ల సమయాన్ని ఆదా చేస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. యూపీఐ లైట్ ద్వారా జరిగే లావాదేవీలు బ్యాంక్ స్టేట్మెంట్లో కనిపించవు. -
‘స్మార్ట్’గా దోపిడీ
దేశంలో సైబర్ మోసాలు వణుకు పుట్టిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల ద్వారా పెరుగుతున్న ఆన్లైన్ లావాదేవీలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రూ.కోట్లు కొట్టేస్తున్నారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నిర్వహించే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఏకంగా 7.40 లక్షల ఫిర్యాదులు నమోదవడం సైబర్ ముప్పు తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఫిర్యాదుల ప్రకారం రూ.1,750 కోట్లు సైబర్ నేరగాళ్ల దోపిడీకి గురయ్యాయి.ఆన్లైన్ పెట్టుబడి మోసం, గేమింగ్ యాప్‌లు, అల్గారిథమ్ మానిప్యులేషన్లు, అక్రమ రుణ యాప్‌లు, అశ్లీల వీడియోలతో బెదిరింపులు, ఓటీపీ స్కామ్‌లలో అమాయకులు చిక్కుకుని ఆరి్థకంగా నష్టపోతున్నారు. సైబర్ నేరగాళ్లు కాల్ స్పూఫింగ్, ప్రభుత్వ, బ్యాంకు అధికారులుగా నటిస్తూ ఆర్థిక లావాదేవీల వివరాల సేకరణ, ఆన్లైన్ టాస్క్‌ల ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఫలితంగా 2019 నుంచి 2024 వరకు సైబర్ కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. –సాక్షి, అమరావతిమే నెలలో రోజుకు 7 వేల ఫిర్యాదులు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) నివేదిక ప్రకారం ఈ ఏడాది మే నెలలో రోజుకు సగటున 7 వేల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇది 2021–2023 మధ్య కాలంతో పోలిస్తే 113.7 శాతం అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఫిర్యాదుల్లో 85 శాతం ఆర్థిక ఆన్లైన్ మోసానికి సంబంధించినవి కావడం గమనార్హం. ఒక్క 2023లోనే ఐ4సీ డేటా ప్రకారం.. లక్షకుపైగా ఆన్లైన్లో పెట్టుబడి మోసాలను గుర్తించారు.ఇక డిజిటల్ అరెస్ట్‌ల (వీడియో కాల్స్ స్కామ్‌లు) ఫలితంగా 2024 తొలి నాలుగు నెలల్లోనే 4,599 కేసులు నమోదవగా.. బాధితులు రూ.120 కోట్ల మేర నష్టపోయారు. 20 వేలకు పైగా ట్రేడింగ్ స్కామ్‌లు నమోదవగా.. సైబర్ నేరగాళ్లు రూ.1,420 కోట్లు కాజేశారు. ఇక 62,687 ఆన్లైన్ పెట్టుబడి మోసాల కేసుల్లో రూ.222 కోట్లు, డేటింగ్ యాప్‌ల వలలో 1,725 కేసుల్లో రూ.13.23 కోట్లు సైబర్ మోసాలకు పాల్పడ్డారు.సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం ⇒ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న చాలామంది సైబర్ నేరగాళ్లు ఆగ్నేయాసియా ప్రాంతాల నుంచి మోసాలకు పాల్పడుతున్నారు. పుర్సాట్, కోహ్‌కాంగ్, కంబోడియాలోని సిహనౌక్విల్లే, మయన్మార్‌లోని మైవాడ్డీ, థాయ్‌లాండ్ వంటి ప్రాంతాల నుంచి ఈ ముఠాలు పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ⇒ సైబర్ మోసాల కట్టడికి ఐ4సీ.. నాలుగు నెలల్లో దాదాపు 3.25 లక్షల మ్యూల్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది. 5.30 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేసింది. ⇒అదనంగా సైబర్ నేరగాళ్ల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ 3,401 సోషల్ మీడియా ఖాతాలు, వాట్సాప్ గ్రూపులను డీయాక్టివేట్ చేసింది. ⇒గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను నమ్మొద్దు. సులభంగా డబ్బు సంపాదన, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలంటూ ఇచ్చే అవకాశాలను విశ్వసించవద్దు. ⇒ అధికారిక చానల్స్ ద్వారా ఉద్యోగ ఆఫర్లు ప్రామాణికతలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి ⇒అవసరమైతే తప్ప సురక్షితమైన వెబ్సైట్లో మాత్రమే సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలి. ⇒ ఏదైనా అనుమానిత సైబర్ స్కామ్ గుర్తిస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోరి్టంగ్ పోర్టల్‌కు నివేదించాలి. తక్షణ సహాయం కోసం 1930కి కాల్ చేయాలి.సైబర్ ఫిర్యాదుల్లో పెరుగుదల ఇలా.. 2019 26,049 2020 2,57,777 2021 4,52,414 2022 9,66,790 2023 15,56,218 2024 7,40,957 (తొలి నాలుగు నెలల్లోనే) -
మరో రెండు దేశాల్లో యూపీఐ సేవలు..
భారతదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సిస్టం.. ఈ రోజు శ్రీలంక, మారిషస్‌లలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వర్చువల్ కార్యక్రమం ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ పాల్గొన్నారు. శ్రీలంక, మారిషస్ దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతున్న తరుణంలోనే ఇండియాకు చెందిన సేవలు ప్రారంభం కావడం గొప్ప విషయం. ఈ రోజే శ్రీలంకలోని భారతీయుడు తొలి యూపీఐ లావాదేవీలను నిర్వహించారు. యూపీఐ లావాదేవీలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేయాలనే 'నరేంద్ర మోదీ' కల మెల్ల మెల్లగా నెరవేరుతోంది. ప్రస్తుతం శ్రీలంక, మారిషస్‌లలో UPI సిస్టం అందుబాటులోకి రావడం వల్ల డిజిటల్ కనెక్టివిటీ మెరుగుపడుతుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మారిషస్‌లో యూపీఐతో పాటు రూపే కార్డ్ సేవలను కూడా ప్రారంభించారు. ఇప్పుడు శ్రీలంక, మారిషస్‌లలో యూపీఐ లావాదేవీలు ప్రారంభం కావడం వల్ల.. ఇండియా నుంచి వెళ్లే భారతీయులు యూపీఐ లావాదేవాలను జరుపవచ్చు. మారిషస్‌లో రూపే కార్డ్ సేవల పొడిగింపు మారిషస్‌లోని రూపే విధానం ఆధారంగా కార్డులను జారీ చేయడానికి మారిషస్ బ్యాంకులను అనుమతిస్తుంది. ఇదీ చదవండి: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గత కొన్ని రోజులకు ముందు ఫ్రాన్స్ దేశంలో కూడా యూపీఐ పేమెంట్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఈఫిల్ టవర్ సందర్శించాలనుకునే వ్యక్తులు ఇప్పుడు ఈ యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో యూపీఐ సిస్టం మరిన్ని దేశాల్లో అందుబాటులో ఉండనున్నట్లు జరుగుతున్న పరిణామాల ద్వారా తెలుస్తోంది. -
కొత్త నిబంధన.. ఆ ఆన్లైన్ లావాదేవీలకు 4 గంటలు ఆగాల్సిందే..!
ఆన్లైన్ లావాదేవీల్లో జరుగుతున్న మోసాల గురించి ఎక్కడోచోట చూస్తూంటాం. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నో నిబంధనలు తీసుకొస్తోంది. తాజాగా మరో కొత్త నిబంధనను అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలిసారి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే లావాదేవీల్లో.. రూ.2,000 లోపు అయితే వెంటనే పేమెంట్ అవుతుంది. తొలి లావాదేవీలో అంతకుమించి డబ్బు పంపాలంటే కనీసం 4 గంటల వ్యవధి ఉండేలా చూడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23 సంవత్సరానికిగాను విడుదల చేసిన నివేదికలో మొత్తం 13,530 ఆన్లైన్ మోసాలు నమోదైనట్లు తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.30,252 కోట్లు. ఇందులో 49 శాతం మోసాలు ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించినవే. ఆన్లైన్ మోసాలను మరింత సమర్థంగా అడ్డుకునేందుకు.. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి విడతలోనే రూ.2,000కు మించి ఆన్లైన్లో నగదు బదిలీ చేయాలంటే.. కనీసం 4 గంటల వ్యవధి ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతకు మించి చెల్లించినప్పుడు.. ఆ నాలుగు గంటల వ్యవధిలో వినియోగదారుడు లావాదేవీని రద్దు చేసుకోవచ్చు, లేదా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా మోసాలను సులభంగా అడ్డుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. యూపీఐ లావాదేవీలకే కాకుండా.. ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్), రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) లావాదేవీలకూ ఈ షరతును వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ఇదీ చదవండి: అద్దెకు ఆమె సగం మంచం.. నెలకు రెంట్ ఎంతంటే..? ప్రస్తుత నిబంధనల ప్రకారం తొలిసారి యూపీఐ లావాదేవీని నిర్వహించే వారు 24 గంటల వ్యవధిలో రూ.5,000 మించి చేయడానికి వీలుకాదు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) లావాదేవీల్లో ఒకసారి అవతలి వ్యక్తిని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, 24 గంటల పాటు రూ.50,000 వరకే బదిలీ చేసే వీలుంటుంది. -
హెలో.. యూపీఐ - ఇక వాయిస్ ఆధారిత చెల్లింపులు
ముంబై: యూపీఐ వేదికగా వాయిస్ ఆధారిత పేమెంట్స్ సహా పలు కొత్త రకాల చెల్లింపు విధానాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆవిష్కరించింది. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ సందర్భంగా వీటిని ప్రకటించింది. ఇందులో హెలో!యూపీఐ అనే విధానంతో యాప్స్, టెలికం కాల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాల ద్వారా వాయిస్ ఆధారిత యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. ఇది హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటుంది. త్వరలోనే ఇతర ప్రాంతీయ భాషల్లోనూ దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఎన్పీసీఐ తెలిపింది. బ్యాంకులు మంజూరు చేసిన క్రెడిట్ లైన్‌ను యూపీఐ ద్వారా కూడా వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఇక ఆఫ్లైన్లోనూ నగదును పంపించేందుకు, అందుకునేందుకు లైట్ ఎక్స్ సాధనం ఉపయోగపడగలదని ఎన్పీసీఐ తెలిపింది. అలాగే, యూపీఐ ట్యాప్ అండ్ పే విధానంతో ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) ఆధారిత క్యూఆర్ కోడ్స్‌పై ట్యాప్ చేసి, చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయొచ్చని వివరించింది. -
హోలీ ఆటలో చిన్నారుల వెరైటీ.. క్యాష్ లేదా.. నో ప్రాబ్లమ్!
సాక్షి,ఖమ్మం: పెద్ద నోట్ల రద్దు, ఆపై కరోనాతో నగదు లావాదేవీలు చాలావరకు తగ్గిపోయాయి. షాపింగ్ మాళ్లు మొదలు తోపుడు బండ్ల వ్యాపారులకు వరకు అందరూ ఫోన్ పే, గూగుల్ పేలతో నగదు స్వీకరిస్తున్నారు. తాజాగా హోలీ పండుగ సందర్భంగా గ్రామాల్లో పిల్లలు మామూళ్ల కోసం వెళ్తూ ఫోన్ పే స్కానర్ వెంట తీసుకెళ్లడాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. కూసుమంచి మండలం నర్సింహులగూడెంలో మంగళవారం ఈ దృశ్యం కనిపించింది. సూది తెచ్చుకుంటేనే టీకా! సత్తుపల్లి టౌన్ : ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని ప్రచారం చేస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మిగతా విషయాలను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాన్పు అయిన శిశువులకు 24 గంటల్లోపు బీసీజీ టీకాలు వేయించాల్సి ఉంటుంది. ఈ టీకా చిన్నారుల్లో క్షయవ్యాధి రాకుండా కాపాడుతుంది. అయితే, 0.01 ఎంఎల్ సిరంజీతో మాత్రమే శిశువులకు వ్యాక్సిన్ వేయించాల్సి ఉండగా.. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రెండు వారాలుగా అరకొరగా సరఫరా అవుతున్నాయి. దీంతో సిరంజీలు లేవని సిబ్బంది చెబుతుండగా. తల్లిదండ్రులు మళ్లీ ప్రైవేట్ మెడికల్ షాపులకు వెళ్లిల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిరోజు ఏరియా ఆస్పత్రుల్లో జరిగే వ్యాక్సినేషన్‌కు వచ్చే వారు ఇక్కట్లు పడుతున్నారు. ఈ విషయమై జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎం.రాజేష్‌ను విరణ కోరగా సిరంజీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఫోన్లో ఎంటర్ చేయగానే లక్ష రూపాయలు మాయం!
బాలానగర్: ఇంటిని అద్దెకు ఇస్తానని ఆన్లైన్లో పోస్ట్‌పెట్టిన వ్యక్తి రూ.లక్ష పోగొట్టుకున్న ఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండీ వాహిదుద్దీన్ వివరాల ప్రకారం.. బాలానగర్ డివిజన్‌కు చెందిన గన్ను తిరుపతయ్య సాయినగర్‌లోని ఫ్లాట్‌ను అద్దెకు ఇవ్వడానికి నోబ్రోకర్ డాట్ కమ్‌లో 2వ తేదీన పోస్ట్ చేయగా.. నేను మీ ఇంటిని అద్దెకు తీసుకుంటానని ఓ వ్యక్తి రిప్లే ఇచ్చాడు. నెలకు రూ.15 వేల అద్దె 3 నెలల అడ్వాన్స్‌గా ఇవ్వాలని తిరుపతయ్య కోరగా గుర్తు తెలియని ఆ వ్యక్తి గూగుల్ పే నుంచి మీ అకౌంట్ వివరాలు పంపాలని కోరగా బాధితుడు పంపాడు. కాసేపటి తర్వాత మీ దగ్గర నుంచి నాకు మెసేజ్ రాలేదని ఓసారి రూ.45 వేలు ఎంటర్ చేసి చూపండి అని చెప్పగా తిరుపతయ్య అదే విధంగా చేయగా రెండు దఫాలుగా రూ.45 వేలు, మరోసారి రూ.10 వేలు తిరుపతయ్య అకౌంట్ నుంచి డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
Apps: గోప్యత, భద్రతపై యూజర్లలో ఆందోళన
న్యూఢిల్లీ: దేశీయంగా డిజిటలీకరణ వేగవంతమవుతోన్నా.. వ్యక్తిగత వివరాల గోప్యత, భద్రతపైనా యూజర్లలో ఆందోళన ఉంటోంది. ఇటీవల వెబ్సైట్లు, మొబైల్ యాప్‌ల ద్వారా వ్యాపార సంస్థలతో యూజర్లు నిర్వహించే వ్యాపార లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనిపరై టెక్ దిగ్గజం ఐబీఎం నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కోవిడ్ విపత్తులో మార్చి 12–26 మధ్య నిర్వహించిన ప్రకారం కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అన్ని వయస్సుల వారు ఎంతో కొంత డిజిటల్ మాధ్యమం ద్వారా లావాదేవీలు నిర్వహిస్తుండగా .. 35 సంవత్సరాలకు పైబడిన వర్గాల్లో ఇది గణనీయంగా పెరిగింది. ‘కోవిడ్ నేపథ్యంలో వెబ్సైట్లు, మొబైల్ యాప్‌ల ద్వారా దేశీ యూజర్లు అన్ని రకాల వ్యాపారాలు, సంస్థలతో లావాదేవీలు నిర్వహించారు. ముఖ్యంగా బ్యాంకింగ్ (65 శాతం), షాపింగ్/రిటైల్ (54 శాతం) విభాగాల్లో ఈ ధోరణి అత్యధికంగా కనిపించింది‘ అని ఐబీఎం పేర్కొంది. గోప్యతపై ఇప్పటికీ పలువురు యూజర్లు యాప్‌లను వాడటానికి ఇష్టపడకపోవడానికి ప్రధాన కారణాలు గోప్యత, భద్రతపై సందేహాలే. అయినప్పటికీ చాలా మంది ఇలాంటి ఏదో ఒక మాధ్యమాన్ని ఎంచుకుంటున్నారు. సర్వేలో పాల్గొన్న ప్రతి పది మందిలో నలుగురు.. షాపింగ్ చేసేందుకు లేదా ఆర్డరు చేసేందుకు ఆన్లైన్ ప్లాట్‌ఫాంను వాడటానికి ఇష్టపడటం లేదు. యాప్ లేదా వెబ్సైట్లో గోప్యతపై (40 శాతం), భద్రతపై (38 శాతం) సందేహాలు ఇందుకు కారణం‘ అని నివేదిక తెలిపింది. సౌకర్యవంతం మహమ్మారి వ్యాప్తి సమయంలో డిజిటల్ లావాదేవీలందించే సౌకర్యానికి చాలా మంది వినియోగదారులు కాస్త అలవాటు పడినట్లు ఈ సర్వే ద్వారా తెలుస్తోందని ఐబీఎం టెక్నాలజీ సేల్స్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ సేల్స్ లీడర్ ప్రశాంత్ భత్కల్ తెలిపారు. కరోనా పూర్వ స్థాయికి పరిస్థితులు తిరిగి వచ్చినా ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయని వివరించారు. భారత్ సహా 22 దేశాల్లో నిర్వహించిన సర్వేలో 22,000 మంది (ఒక్కో దేశంలో 1,000 మంది) పాల్గొన్నారు. మరిన్ని విశేషాలు.. - మహమ్మారి వ్యాప్తి సమయంలో దేశీ యూజర్లు వివిధ కేటగిరీల్లో సుమారు 19 కొత్త ఆన్లైన్ ఖాతాలు తెరిచారు. సోషల్ మీడియా, వినోదం కోసం సగటున 3 కొత్త ఖాతాలు తీసుకున్నారు. - 50 ఏళ్లు పైబడిన వారు వివిధ కేటగిరీల్లో దాదాపు 27 కొత్త ఆన్లైన్ ఖాతాలు తెరిచారు. ఒక్కో కేటగిరీలో మిగతా వయస్సుల వారికన్నా ఎక్కువ అకౌంట్లు తెరిచారు. - దాదాపు సగం మంది (47 శాతం) భారతీయ యూజర్లు చాలా సందర్భాల్లో ఇతర అకౌంట్లకు కూడా ఒకే రకం లాగిన్ వివరాలను ఉపయోగిస్తున్నారు. ఇక 17 శాతం మంది కొత్త, పాత వివరాలు కలిపి ఉపయోగిస్తున్నారు. 35–49 ఏళ్ల మధ్య వారిలో దాదాపు సగం మంది యూజర్లు ఇతర అకౌంట్లకు ఉపయోగించిన క్రెడెన్షియల్స్‌నే మళ్లీ మళ్లీ వాడుతున్నారు. - వెబ్సైట్ లేదా యాప్ భద్రతపై సందేహాలు ఉన్నప్పటికీ జనరేషన్ జెడ్ తరం (1990ల తర్వాత, 2000 తొలినాళ్లలో పుట్టిన వారు) మినహా 57 శాతం మంది యూజర్లు.. భౌతికంగా స్టోర్‌కి వెళ్లడం లేదా ఫోన్ కాల్ ద్వారా ఆర్డర్ చేయడం కన్నా డిజిటల్‌గా ఆర్డరు, చెల్లింపులు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. - తాము సందర్శించే యాప్‌లు, వెబ్సైట్లను ఇతర యాప్‌లు ట్రాక్ చేసేందుకు యూజర్లు ఇష్టపడటం లేదు. ట్రాకింగ్‌కు సంబంధించి పలు యాప్‌లకు అనుమతులు నిరాకరించినట్లు సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది పైగా వెల్లడించారు. - తమ వ్యక్తిగత డేటా భద్రంగా ఉంచుతాయని యూజర్లు అత్యధికంగా నమ్ముతున్న కేటగిరీల సంస్థల్లో హెల్త్‌కేర్ (51 శాతం), బ్యాంకింగ్/ఆర్థిక సంస్థలు (56%) ఉన్నాయి. సోషల్ మీడియాపై యూజర్లు అత్యంత అపనమ్మకంతో ఉన్నారు. చదవండి : SBI ఖాతాదారులూ ముఖ్య గమనిక! -
లైన్లన్నీ బిజీ
ఉండి/అత్తిలి : నోట్ల రద్దుతో బ్యాంకుల వద్ద, పింఛన్ల కోసం పంచాయతీ కార్యాలయాల వద్ద, ఇప్పుడిదిగో రేషన్ సరుకుల కోసం డిపోల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఈ నెల నుంచి నగదు రహిత లావాదేవీల ద్వారా మాత్రమే రేషన్ సరుకులు అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో రేషన్ షాపు వద్ద క్యూ లైన్లు చాంతాడంత ఉంటున్నాయి. సర్వర్లు సరిగా పనిచేయకపోవడంతో రోజుకు పదిమందికి కూడా రేషన్ అందే పరిస్థితి లేదు. ఒక ఇంటిలో తండ్రి పింఛను కోసం లైన్లో ఉంటే.. కొడుకు నగదు కోసం బ్యాంకు క్యూ లైన్లో, తల్లి రేషన్ సరుకుల కోసం డిపో వద్ద క్యూలో పడిగాపులు పడాల్సిన దుస్థితి జిల్లాలో ఏర్పడింది. ఆ విధంగా ముందుకు పోవడమంటే ఇదేనేమో! పులిని చూసి నక్కవాతలు పెట్టుకుందన్న చందంగా చంద్రబాబు ప్రభుత్వం చక్కగా సాగిపోయే వ్యవస్థను నిర్వీర్యం చేయనారంభించింది. క్యాష్‌లెస్ అంటూ రేషన్ సరుకులకు వచ్చిన వారితో వేలిముద్రలు వేయించుకుంటూ బ్యాంకు ఖాతా ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. బ్యాంకులకు ఆధార్ అనుసంధానం కాకపోవడం ఒక కారణమైతే, ఆధార్ లింక్ కాకపోవడం మరొక కారణ. అన్ని సక్రమంగా సాగుతున్నాయని అనుకునే సమయంలో సర్వర్ సమస్య తలెత్తుతోంది. దీంతో రోజుల తరబడి లబ్ధిదారులు రేషన్‌దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రతినెలా 5వ తేదీ నాటికి రేషన్ ఇవ్వడం ముగించి 6వ తేదీకి మిగిలిన సరుకు బ్యాలె న్స్ గా చూపించాలి. కాని ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కనీసం 30 శాతం కూడా రేషన్అందించలేకపోయారు. అలాగే మరికొన్ని రేషన్ షాపుల్లో ఒక్కకార్డుకు కూడా రేషన్ ఇవ్వలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇది వారు చేసుకున్న పాపం అన్నట్టు ఈ సమస్యపై ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణం. ప్రజల పరిస్థితి ఇలా ఉంటే రేషన్ డీలర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. క్యాష్‌లెస్ ట్రాన్సక్షన్స్ అంటూ ప్రారంభించిన ప్రభుత్వం అందుకు అనుగుణమైన ఏర్పాట్లు చేయకుండా నాసిరకం యంత్రాలను తమ మొహాన కొట్టి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు దుకాణానికి వచ్చిన ప్రజలు ఒకటికి రెండుసార్లు ఇంటికి వెళ్లయినా వస్తున్నారు. కాని డీలర్ల పరిస్థితి అలా లేదు, ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడు సర్వర్ కనెక్ట్ అవుతుందా? అని ఎదురుచూడటమే పెద్ద పనిగా మారిపోయింది. ఇలాగైతే నెల రోజులైనా రేషన్ పంపిణీ పూర్తి కాదని వాపోతున్నారు. -
బ్యాంక్ ఖాతా తెరుస్తున్నారా.. అయితే ఒక్క నిమిషం..
పెద్ద నోట్ల రద్దుతో ఎన్నడూ బ్యాంక్ మెట్లు ఎక్కని వారందరూ నేడు వాటి చుట్టూ తిరగాల్సి వస్తోంది. కరెన్సీ కష్టాలకు చెక్ పెట్టాలంటే అందరినీ ఆన్లైన్ లావాదేవీలవైపు మళ్లించడమే అంతిమ మార్గమని ప్రభుత్వాలు తేల్చేశాయి. దీంతో భవిష్యత్‌లో నగదు రహిత లావాదేవీలే కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ లావాదేవీ చేసేందుకు ప్రతి వ్యక్తికి కచ్చితంగా ఏదైనా బ్యాంక్‌లో ఖాతా ఉండాలి. బ్యాంకుల్లో సేవింగ్, కరెంట్, జాయింట్ వంటి ఖాతాలు అనేకం ఉన్నాయి. ఖాతా తెరిచే ముందు బ్యాంకులో అందుబాటులో ఉన్న ఖాతాలు, వాటి ఉపయోగాలు తెలుసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. విశాఖపట్నం : ప్రతి వ్యక్తి తన అవసరానికి తగినట్టు ఎన్ని బ్యాంకుల్లోనైనా ఖాతాలు ప్రారంభించవచ్చు. కానీ ఆ ఖాతా నిర్వహణకు సంబంధించిన నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. సేవింగ్స్ ఖాతా ఇలా.. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబం, స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే సేవింగ్స ఖాతా తెరిచేందుకు అనుమతి ఉంది. వ్యక్తిగతంగానూ లేక మరొకరి భాగస్వామ్యంతోనూ కలిసి ఈ సేవింగ్ ఖాతా తెరవచ్చు. దీనిని స్వయంగా నిర్వహించేందుకు, లేదా వారి తరఫున మరొకరు నిర్వహించేందుకు పవర్ ఆఫ్ అటార్సీ ఇవ్వడానికి కూడా అనుమతి ఉంది. కనీస నగదు నిల్వను అన్ని వేళలా ఉంచాలి. సేవింగ్ ఖాతాలో నిల్వ ఉన్న నగదు మొత్తానికి వివిధ బ్యాంకులు 4 నుంచి 6 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తున్నాయి. ఖాతాతో పాటు ఏటీఎం కమ్ డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, చెక్‌బుక్ సేవలు పొందవచ్చు. వీటితోపాటు ఆయా బ్యాంకులు వ్యక్తిగత బీమా, లాకర్ సదుపాయాలను అందిస్తున్నారుు. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఉచిత ఫోన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంటి ముంగిటకే బ్యాంకింగ్, కోరినన్ని చెక్కులు, ఉచిత డీడీలు తదితర సదుపాయాలు కల్పిస్తున్నారుు. కరెంట్ ఖాతా వ్యాపారస్తులు, రోజువారీ నగదు లావాదేవీలు నిర్వహించే వారికి కరెంట్ ఖాతాలు అనువుగా ఉంటాయి. నగదు డిపాజిట్, ఉపసంహరణ పరిమితి ఉండదు. ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయడంతో పాటు డ్రా చేసుకోవచ్చు. చెక్ బుక్‌ల విషయంలోనూ పరిమితి ఉండదు. రోజువారీ లావాదేవీలు, ఆయా ఖాతాదారుడి చరిత్ర ఆధారంగా బ్యాంకులు ఓడీ సౌకర్యం కల్పిస్తున్నారుు. కరెంట్ ఖతాలో నిల్వ ఉండే నగదుకు బ్యాంకులు వడ్డీ చెల్లించవు. వేతన ఖాతాలు వేతన ఖాతాలను ఎవరికి వారు వ్యక్తిగతంగా తీసుకునేందుకు వీలు లేదు. కంపెనీలు, సంస్థలే బ్యాంకులతో ఒప్పందం చేసుకుని తమ ఉద్యోగుల పేరిట ఖాతాలు తెరుస్తుంటాయి. ఈ ఖాతాల ద్వారా ఉద్యోగులకు పలు ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. వేతన ఖాతాల్లోనే ప్రీమియం, ప్రయారిటీ, శాలరీ, శాలరీ ప్లస్, ప్లాటినం ఇలా రకరకాల పేర్లుతో వివిధ అదనపు ప్రయోజనాలతో అందిస్తున్నాయి. -
కిడ్నీ రాకెట్‌కు 2008లోనే బీజం
-
కిడ్నీ రాకెట్‌కు 2008లోనే బీజం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ కేంద్రంగా వెలుగుచూసిన కిడ్నీ రాకెట్‌కు ఏడేళ్ల క్రితమే బీజం పడిందా? అప్పటి నుంచి పకడ్బందీగా నెరపుతున్న ఆన్లైన్ లావాదేవీలతో ఎవరికీ అంతుచిక్కని విధంగా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారా? ఈ రాకెట్‌తో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన వందలాది మందికి సంబంధముందా? ఇప్పటి వరకు ఈ రాకెట్ ద్వారా దేశంలో 60 మంది కిడ్నీలు అమ్ముకున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే అంటున్నాడు కిడ్నీ రాకెట్లో దేశంలోనే కీలక ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న సురేశ్‌భాయ్ అమృత్‌భాయ్ ప్రజాపతి. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సఫాల్వివాన్ ప్రాంతానికి చెందిన ఇతను పోలీసు విచారణలో పలు ఆసక్తికర వెల్లడించారు. నల్లగొండ జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ వెల్లడించిన వివరాల ప్రకారం జాతీయ స్థాయిలో జరిగిన ఈ కిడ్నీ కుంభకోణం పూర్వాపరాలివి. 2008లోనే ‘ఆన్లైన్’ పోస్టింగ్.. గుజరాత్‌కు చెందిన సురేశ్ ప్రజాపతికి ఏడేళ్ల క్రితమే కిడ్నీ వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే, వ్యాపారానికి నెట్వర్క్ కావాల్సి ఉన్నందున ఆ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అతను ఇంటర్నెట్ను ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. 2008లోనే పలు వెబ్సైట్లు, బ్లాగ్‌లలో కిడ్నీ అమ్మకానికి పెట్టాడు. ‘ఐ వాంట్ టు హెల్ప్ యూ. ఐ వాంట్ సమ్ మనీ. ఐ విల్ గివ్ యు మై కిడ్నీ.’ అంటూ కిడ్నీలు అవసరమున్నవారిని ఆకర్షించే ప్రయత్నం చేశాడు. అతను ఏ స్థాయిలో ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించాడంటే ‘బ్లాగ్స్.సులేఖ.కామ్’లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాం ట్ ఆర్గనైజర్‌ను క్లిక్ చేస్తే నేరుగా సురేశ్ ప్రజాపతి వివరాలు లభిస్తాయి. అదే విధంగా 2009, మే14న ఎంఆర్ఐషాన్షరీఫ్.బ్లాగ్స్పాట్.ఇన్ అనే వెబ్సైట్లో కూడా అతని వివరాలు పొందుపరిచాడు. ఈ క్రమంలో అతనికి మహారాష్ట్రకు చెందిన మరో వ్యక్తి సబ్ ఏజెంట్‌గా కలిశాడు. ఆన్లైన్ ద్వారా పరిచయం చేసుకుని సురేశ్ ప్రజాపతిని అతను ఇద్దరూ కలసి ఈ వ్యాపారం ప్రారంభించారు. ఈ మహారాష్ట్రకు చెందిన సబ్ఏజెంట్ను అరెస్టు చేయాల్సి ఉంది. 2013లో మొదలు.. అసలు ఈ వ్యాపారాన్ని 2013లో ప్రారంభించాడు సురేశ్ ప్రజాపతి. ఆన్లైన్ ద్వారా మంచి నెట్‌వర్క్‌ను తయారు చేసుకున్న అతను శ్రీలంకలోని ఏజెంట్ల సహకారంతో అక్కడి నాలుగు ఆసుపత్రులకు చెందిన డాక్టర్లతో కుమ్మక్కయ్యాడు. మూడేళ్లలో ఇప్పటివరకు 60 మంది కిడ్నీలను శ్రీలంకలో అమ్మించాడు. కొలంబోలోని నవలోక్, హేమ, లంకన్ ఆసుపత్రులతో పాటు బొరెల్లాలోని వెస్టర్న్ ఆసుపత్రులలో ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపించాడు. ఇందుకు ఆయా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్ మాధవ, డాక్టర్ మోనిక్, డాక్టర్. సాధన (నవలోక్), డాక్టర్. చమిల (హేమ), డాక్టర్. నిరోషిని (లంకన్), డాక్టర్. హబీబా షరీఫ్ (వెస్టర్న్)లు సహకరించారు. వీరంతా శ్రీలంకీయులే. వీరి సహకారంతో పాటు ఆయా ఆసుపత్రుల యజమానులు డాక్టర్. హర్షిద్ (నవలోక్), డాక్టర్. శరత్ (లంకన్), డాక్టర్. రిజ్వీ షరీఫ్ ఆయన కుమారుడు రికజ్ షరీఫ్‌లు కూడా తోడయ్యారు. కిడ్నీలు ఇండియావి..అమ్మేది శ్రీలంకలో.. రేటు మాత్రం డాలర్లలో ఇక, ఈ కిడ్నీ రాకెట్‌కు సహకరించేందుకు గాను శ్రీలంకలోని ఆసుపత్రులకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పాడు సురేశ్ప్రజాపతి. ఒక్కో కిడ్నీని మార్పిడి చేసేందుకు గాను ఆస్పత్రి ఫీజుల కింద 22 వేల డాలర్లు చెల్లించాడు. కిడ్నీ మార్పిడి చేసేందుకు ఆసుపత్రి ఎథిక్స్ కమిటీ అనుమతి అవసరం. కాగా, అందులో ఒక ఆసుపత్రి డాక్టర్, మరో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌తో పాటు ఆరోగ్య శాఖ నుంచి మరో ఉన్నతాధికారి సభ్యులుగా ఉంటారు. ఈ సభ్యులను మేనేజ్ చేసేందుకు గాను 500 డాలర్లు చెల్లించారా..? లేక ఎథిక్స్ కమిటీకి కూడా చెప్పకుండా కేవలం ఫీజు రూపంలో చెల్లించారా అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఇక, ఈ కిడ్నీ మార్పిడి వ్యవహారంలో ఒక్కో కిడ్నీకి రూ.28 నుంచి 30 లక్షలను వసూలు చేస్తుంటాడు సురేశ్ ప్రజాపతి. అందులో రూ.5 లక్షలు కిడ్నీ విక్రేతలకు ఇచ్చి మిగిలినవి డాక్టర్లు, ఆసుపత్రి ఖర్చులతోపాటు ఏజెంట్లకు, ప్రయాణచార్జీలకు, వీసా ప్రాసెసింగ్, శ్రీలంక వెళ్లి వచ్చేందుకు టికెట్లు, అక్కడ వసతి సదుపాయాలకు ఖర్చు పెట్టేవాడు. సురేశ్ కూడబెట్టిన ఆస్తులివే.. ఏడేళ్ల క్రితమే తాను కిడ్నీని అమ్ముతానని ఆన్లైన్లో పెట్టిన సురేశ్ ప్రజాపతికానీ, అతనికి సహకరించిన దిలీప్కానీ కిడ్నీలు అమ్ముకోకపోవడం కొసమెరుపు. మరో విశేషమేమిటంటే ఈ రాకెట్ ద్వారా సురేశ్ ప్రజాపతి రూ.3 కోట్ల వరకు ఆస్తులు సంపాదించాడు. అహ్మదాబాద్‌లో రూ.1.40 కోట్ల విలువైన ఓ ఇల్లు, రూ.30 లక్షలతో ఓ ఆఫీసు, రూ.27 లక్షలతో తన ఆఫీసుకు, ఇంటికి ఫర్నీచర్, రూ.8.5 లక్షలు చెల్లించి, మిగతా బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఓ ఆడి కారు కూడా కొన్నాడు. రూ. లక్ష వెచ్చించి బజాజ్ ఎవెంజర్ మోటార్ సైకిల్ కూడా కొన్నాడు. మొత్తం రూ.45 లక్షల వరకు ఏజెంట్లకు ముట్టచెప్పాడు. తాను గతంలో కొన్న అపార్ట్‌మెంట్‌కు ఉన్న రూ. 7లక్షల బ్యాంకు రుణం కూడా తీర్చేశాడు. ఇప్పుడు సురేశ్ ప్రజాపతి బ్యాంకు బాలెన్స్ ఎంతో తెలుసా.. రూ.21లక్షలు. ఇతనికి సహకరించిన దిలీప్ కూడా 15లక్షలు పెట్టి అహ్మదాబాద్‌లో ఇల్లు కొనుక్కుని మరో రూ.లక్ష ఖర్చుచేశాడు. మరో ముగ్గురు అరెస్టు ఈ కుంభకోణంలో కీలక పాత్రధారి, దేశవ్యాప్త ఏజెంట్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సురేశ్‌భాయ్ అమృత్‌భాయ్ ప్రజాపతిని నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరిస్తున్న మరో ఏజెంట్ దిలీప్చౌహాన్ (గుజరాత్), తన కిడ్నీని అమ్ముకుని ఏజెంట్‌గా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన జెను నూకరాజులను కూడా అదుపులోనికి తీసుకున్నారు. ముగ్గురినీ నల్లగొండ ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ముగ్గురి అరెస్టుతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య పదికి చేరింది. సమావేశంలో ఏఎస్పీ గంగారాం, నల్లగొండ డీఎస్పీ సుధాకర్, సీఐలు రవీందర్, టి.శ్రీనివాస్. శాలిగౌరారం సీఐ ప్రవీణ్ పాల్గొన్నారు. అమ్మినవాళ్లు... కొన్నవాళ్లు వీరే.. సురేశ్ ప్రజాపతి నెట్వర్క్ ద్వారా 60 మంది కిడ్నీలు అమ్ముకోగా, 54 మంది డబ్బు లు చెల్లించి కిడ్నీలు మార్పిడి చేయించుకున్నారని తేలింది. కిడ్నీలు అమ్ముకున్న వారిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారు 22 మంది ఉన్నారు. తమిళనాడు ఆరుగురు, మహారాష్ట్ర ఐదుగురు, క ర్నాటక నలుగురు, ఢిల్లీకి చెందిన ముగ్గురు, జమ్ము-కాశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన ఒక్కొక్కరున్నారు. ఇతర రాష్ట్రాల వారు మరో 11 మంది ఉన్నారు. ఇక, కిడ్నీలు మార్పిడి చేసుకున్నవారిలో ఢిల్లీ (2), గుజరాత్ (8), మహారాష్ట్ర (6),జమ్ము-కాశ్మీర్ (5), పంజాబ్ (3)తోపాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. అవయవ మార్పిడి చట్టం ప్రకారం అనుమతి లేకుండా కిడ్నీలు దానం చేయడంతో పాటు డబ్బులు వెచ్చించి మార్పిడి చేయించుకోవడం కూడా నేరమేనని, ఈ రాకెట్‌తో సంబంధమున్న అందరినీ అరెస్టు చేస్తామని ఎస్పీ దుగ్గల్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన కీలక నిందితుడి అరెస్టుతో శ్రీలంకకు సంబంధించిన సాక్ష్యాధారాలు బలంగా లభిస్తున్నాయని, అవసరమైతే శ్రీలంక వెళ్లి విచారణ జరిపేందుకు కూడా నల్లగొండ పోలీసులు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.