![State Bank Of India UPI Transaction Limit Increased Here How To Change UPI Transaction Limit](/styles/webp/s3/article_images/2025/02/16/upi-limit-increase.jpg.webp?itok=mGBEbwSp)
భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు ఎక్కువవుతున్నాయి. చాక్లెట్ దగ్గర నుంచి గోల్డ్ కొనుగోలు చేసే వరకు, చాలామంది ఆన్‌లైన్ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. అయితే యూపీఐ లిమిట్ ఉండటం వల్ల.. ఎంత కావాలంటే అంత లావాదేవీలు చేయడం సాధ్యం కాదు. దీనిని దృష్టిలో ఉంచుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) UPI లావాదేవీ పరిమితి పెంచుకోవడానికి అవకాశం కల్పించింది.
తన కస్టమర్ల అవసరాలను గుర్తించిన ఎస్‌బీఐ యూపీఐ పరిమితి 1,00,000 రూపాయలుగా నిర్ణయించింది. ఈ మొత్తాన్ని ఒకేసారి పంపవచ్చు, లేదా పదిసార్లుగా పంపవచ్చు. 10 కంటే ఎక్కువ సార్లు లావాదేవీలు జరపడానికి వీల్లేదు. లక్ష రూపాయల లావాదేవీలు పూర్తయిన 24 గంటల తరువాత మళ్ళీ ట్రాన్సక్షన్స్ కొనసాగించవచ్చు.
నెలకు, సంవత్సరానికి సంబంధించిన పరిమితికి ఎస్‌బీఐ ఎటువంటి ఆంక్షలు విధించలేదు. అంటే రోజుకు (24 గంటలు) రూ. 1 లక్ష వరకు లావాదేవీలు చేసుకోవచ్చు. ఫోన్‌పే, గూగుల్ పే మొదలైన యూపీఐ యాప్‌లకు ఇదే నియమం వర్తిస్తుంది. అంటే ఏ యూపీఐ యాప్ నుంచి అయిన లక్ష రూపాయలు ట్రాన్సక్షన్ చేయవచ్చు.
ఇదీ చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఏదంటే?
యూపీఐ లిమిట్ ఎలా పెంచుకోవాలంటే
ఎస్‌బీఐ ఖాతాలో యూపీఏ లిమిట్ పెంచుకోవాలంటే.. ఎస్‌బీఐ యోనో యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ కలిగి ఉండాలి. వీటి ద్వారా యూపీఐ లిమిట్ పెంచుకోవచ్చు.
➤ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ లేదా యోనో యాప్ లాగిన్ అవ్వండి.
➤'యూపీఐ ట్రాన్స్‌ఫర్' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
➤'సెట్ యూపీఐ ట్రాన్సక్షన్ లిమిట్' కి వెళ్లండి.
➤మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
➤అప్పటికి మీకున్న యూపీఐ లిమిట్ చూసి, మీకు ఎంత కావాలనుకుంటే అంత లక్ష రూపాయలలోపు ఎంటర్ చేయండి.
➤లిమిట్ లక్ష కంటే ఎక్కువ పెంచుకోలేము, కానీ తగ్గించుకోవచ్చు.
➤కొత్త లిమిట్ ఎంటర్ చేసుకున్న తరువాత.. సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
➤ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయిన తరువాత కొత్త లిమిట్ సెట్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment