తక్షణ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీల సంఖ్య 2024 జనవరి–జూన్ మధ్య దేశవ్యాప్తంగా 78.97 బిలియన్ల(7897 కోట్లు)కు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే లావాదేవీలు 52 శాతం పెరిగాయని పేమెంట్ టెక్నాలజీ సర్వీసులు అందిస్తున్న వరల్డ్‌లైన్ నివేదిక వెల్లడించింది.
‘గతేడాదితో పోలిస్తే జనవరి–జూన్ మధ్య లావాదేవీల విలువ రూ.83.16 లక్షల కోట్లు నుంచి రూ.116.63 లక్షల కోట్లకు చేరింది. 2023 జనవరిలో యూపీఐ లావాదేవీల సంఖ్య 803 కోట్లుగా ఉంది. 2024 జూన్‌కు ఇది 1300 కోట్లకు చేరింది. లావాదేవీల విలువ రూ.12.98 లక్షల కోట్ల నుంచి రూ.20.07 లక్షల కోట్లకు చేరింది. విలువ, పరిమాణం పరంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వరుసగా మూడు స్థానాలను ఆక్రమించాయి. సగటు లావాదేవీ విలువ 2023 జనవరి–జూన్ మధ్య రూ.1,603 నమోదైంది. 2024 జూన్‌తో ముగిసిన ఆరు నెలల్లో ఇది రూ.1,478కి చేరింది. ఆన్‌లైన్ పరిశ్రమలో ఈ–కామర్స్, గేమింగ్, యుటిలిటీస్, ప్రభుత్వ సేవలు, ఆర్థిక సేవలు మొత్తం లావాదేవీల పరిమాణంలో 81 శాతం, విలువలో 74 శాతం కైవసం చేసుకున్నాయి’ అని నివేదిక వివరించింది.
ఇదీ చదవండి: ఒకే నెలలో రూ.24,509 కోట్లు రాక!
Comments
Please login to add a commentAdd a comment