
యాక్టివ్‌గాలేని, రీ అసైన్ చేసిన మొబైల్ నంబర్లతో లింక్ అయిన యూపీఐ సేవలు ఏప్రిల్ 1 నుంచి పనిచేయవని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) తెలిపింది. మోసాలు, అనధికార లావాదేవీలను నిరోధించడానికి ఇలాంటి నంబర్లను డీలింక్ చేయాలని ఎన్‌పీసీఐ బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లను (పీఎస్‌పీ) ఆదేశించింది. ఈమేరకు బ్యాంకులు, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్‌లు తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, భద్రతను పెంచడానికి వీలవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఎందుకీ మార్పులు..?
యూపీఐతో లింక్ చేసి ఇన్‌యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్లతో సెక్యూరిటీ ప్రమాదాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. వినియోగదారులు వారి నంబర్లను మార్చినప్పుడు లేదా డీయాక్టివేట్ చేసినప్పుడు వారి యూపీఐ ఖాతాలు యాక్టివ్‌లోనే ఉంటాయి. దాంతో వీటిని దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉంది. ఆయా ఫోన్ నంబర్లను వేరేవారికి అలాట్ చేసినప్పుడు అప్పటికే యాక్టివ్‌లో ఉన్న యూపీఐ ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి బ్యాంకులు, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్‌లు ఇకపై ఇన్‌యాక్టివ్‌గా ఉండే నంబర్లకు యూపీఐను డియాక్టివేట్ చేస్తారు.
ఇదీ చదవండి: 2030 నాటికి రెట్టింపు ఉద్యోగాలు
ఇన్‌యాక్టివ్, రీ అసైన్, డీయాక్టివేట్ చేయాలని నిర్ణయంచిన మొబైల్ నంబర్లను బ్యాంకులు, పీఎస్‌పీలు సదరు వినియోగదారులకు నోటిఫికేషన్ల ద్వారా సమాచారం అందిస్తాయి. మొబైల్ నంబర్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటే యూపీఐ నుంచి ఖాతాను డీలిస్ట్ చేస్తారు. నిబంధనల ప్రకారం వినియోగదారులు మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా తిరిగి తమ యూపీఐ యాక్సెస్‌ను పునరుద్ధరించవచ్చు.
ఎవరిపై ప్రభావం అంటే..
మొబైల్ నెంబర్ మార్చినప్పటికీ బ్యాంకులో అప్‌డేట్ చేయని యూజర్లు.
చాలా కాలంగా కాల్స్, ఎస్ఎంఎస్ లేదా బ్యాంకింగ్ అలర్ట్స్ కోసం ఉపయోగించని ఇన్‌యాక్టివ్ నంబర్లు కలిగిన వినియోగదారులు.
తమ బ్యాంకు వివరాలను అప్‌డేట్ చేయకుండానే నంబర్‌ను సరెండర్ చేసిన యూజర్లు.
తమ పాత నంబరును వేరొకరికి కేటాయించిన యూజర్లు.
Comments
Please login to add a commentAdd a comment