నేపాల్‌లోని భారతీయుల కోసం ప్రముఖ సేవలు ప్రారంభం | Indians can now pay using QR-code-based UPI in Nepal | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో యూపీఐ సేవలు ప్రారంభం

Published Sat, Mar 9 2024 3:24 PM | Last Updated on Sat, Mar 9 2024 3:32 PM

Indians can now pay using QR-code-based UPI in Nepal - Sakshi

నేపాల్‌లో భారత్‌కు చెందిన యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సేవలు అందుబాటులోకి వచ్చినట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) తాజాగా ప్రకటించింది. నేపాల్‌ వ్యాపారుల వద్ద ఇకపై క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేసి యూపీఐ వినియోగదారులు చెల్లింపులు చేయొచ్చని తెలిపింది. 

గతేడాది సెప్టెంబరులో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ (ఎన్‌ఐపీఎల్‌), నేపాల్‌ అతిపెద్ద చెల్లింపు నెట్‌వర్క్‌ ఫోన్‌పే పేమెంట్‌ సర్వీస్‌ల మధ్య భాగస్వామ్యం కుదరగా, తాజాగా ఈ సేవలు ప్రారంభమయ్యాయి. మొదటి దశలో యూపీఐ ఆధారిత యాప్‌ల ద్వారా భారత వినియోగదారులు నేపాల్‌లోని వ్యాపార కేంద్రాల వద్ద యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. ఫోన్‌పే నెట్‌వర్క్‌పైన ఉన్న వ్యాపారులకు భారత వినియోగదారులు యూపీఐ ద్వారా చెల్లించొచ్చు.

ఇదీ చదవండి: ఐటీ పరిశ్రమకు భారీ షాక్‌.. ‘70 శాతం ఉద్యోగాలు పోనున్నాయ్‌’

ఇరు దేశాల పౌరుల మధ్య లావాదేవీల్లో ఈ సేవలు విప్లవాత్మక మార్పులు తెస్తాయని ఎన్‌ఐపీఎల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రితేశ్‌ శుక్లా పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో రెండు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని, డిజిటల్‌ చెల్లింపుల్లో మార్పునకు కట్టుబడి ఉన్నామని అన్నారు. భారత్‌, నేపాల్‌ మధ్య ఆర్థిక సంబంధాలు, వాణిజ్య, పర్యాటకం గణనీయంగా మెరుగుపడటానికి యూపీఐ సేవలు ఉపకరిస్తాయని ఫోన్‌పే చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ దివాస్‌ కుమార్‌ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement