UPI
-
ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 9న 'యూపీఐ 123 పే' (UPI 123Pay) పరిచయం చేస్తూ.. లావాదేవీల పరిమితులను కూడా రూ.5,000 నుంచి రూ. 10,000లకు పొడిగించింది. అయితే ఇదెలా పనిచేస్తుంది? ఎలాంటి ఫోన్లలకు సపోర్ట్ చేస్తుందనే మరిన్ని విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.ఇది వరకు యూపీఐ లావాదేవీలు చేయాలంటే.. తప్పకుండా ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండాలి. కానీ ఇప్పుడు అందుబాటులోకి రానున్న యూపీఐ 123 పే.. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. ఇది స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది.యూపీఐ 123 పే చెల్లింపులు నాలుగు పద్ధతుల్లో అందుబాటులో ఉన్నాయి. అవి ఐవీఆర్ నెంబర్స్, మిస్డ్ కాల్స్, ఓఈఎమ్ ఎంబెడెడ్ యాప్‌లు, సౌండ్-బేస్డ్ టెక్నాలజీ. అంటే యూజర్ తమ లావాదేవీలను ఈ నాలుగు పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఇవన్నీ 2025 జనవరి 1 కంటే ముందు అమల్లోకి వచ్చేలా బ్యాంకులకు.. ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది.యూపీఐ 123 పే కస్టమర్లు బహుళ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉండకూడదు. కస్టమర్ మరొక ఖాతాను జోడించాలనుకుంటే.. వారు తప్పనిసరిగా ప్రస్తుత బ్యాంక్ ఖాతాను రిజిస్టర్ చేసి, ఆపై మరొక బ్యాంక్ ఖాతాను జోడించాలి.UPI 123PAYతో బ్యాంక్ ఖాతాను ఎలా లింక్ చేయాలి?•మొదట ఏదైనా ఐవీఆర్ నెంబర్‌కి కాల్ చేయండి•కాల్ చేసిన తరువాత మీ భాషను ఎంచుకోండి•మీ బ్యాంక్ ఖాతాను నమోదు చేయడానికి ఎంచుకోండి•మీ డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయండి•యూపీఐ పిన్ సెట్ చేసుకోండి.•పై దశలను పాటిస్తే మీ యూపీఐ 123 పేతో బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది. -
విదేశాల్లోనూ పేటీఎం యూపీఐ చెల్లింపులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వివిధ దేశాలకు ప్రయాణించే తమ యూజర్లు .. యూపీఐ మాధ్యమంలో చెల్లింపులు జరిపే వెసులుబాటును ఆర్థిక సేవల సంస్థ పేటీఎం అందుబాటులోకి తెచ్చింది. యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, భూటాన్, నేపాల్‌లోని నిర్దిష్ట ప్రాంతాల్లో దీన్ని వినియోగించుకోవచ్చని పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్) వెల్లడించింది.షాపింగ్, డైనింగ్ సహా వివిధ అవసరాలకు చెల్లింపుల కోసం ఈ ఫీచరు ఉపయోగపడగలదని పేర్కొంది. రానున్న హాలిడే సీజన్లో తమ యూజర్లు మరింత సౌకర్యవంతంగా విదేశీ ప్రయాణాలు చేసేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని పేర్కొంది. -
ఇన్వెస్టర్లకు యూపీఐ.. సెబీ ఆదేశం
న్యూఢిల్లీ: సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ కోసం క్లయింట్లకు యూపీఐ ఆధారిత బ్లాక్ విధానాన్ని లేదా త్రీ–ఇన్–వన్ ట్రేడింగ్ అకౌంటు సదుపాయాన్ని అందించాలని క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్క్కు (క్యూఎస్బీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది.ప్రస్తుత ట్రేడింగ్ విధానంతో పాటు ఫిబ్రవరి 1 నుంచి ఈ రెండింటిలో ఒక సదుపాయాన్ని తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించింది. త్రీ–ఇన్–వన్ ట్రేడింగ్ అకౌంటులో సేవింగ్స్ అకౌంటు, డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ మూడూ కలిసి ఉంటాయి.ఇదీ చదవండి: సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరటయూపీఐ బ్లాక్ మెకానిజంలో క్లయింట్లు ట్రేడింగ్ సభ్యునికి ముందస్తుగా నిధులను బదిలీ చేయడానికి బదులుగా తమ బ్యాంకు ఖాతాలలో బ్లాక్ చేసిన నిధుల ఆధారంగా సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ చేయవచ్చు. ఈ సదుపాయం ప్రస్తుతం ఇన్వెస్టర్లకు ఐచ్ఛికంగానే ఉంది. -
ఎన్నారైలకు శుభవార్త: యూపీఐతో రోజుకు లక్ష పంపొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రవాస భారతీయులకు (ఎన్నారైలు) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తీపి కబురు అందించింది. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్వో) ఖాతాలున్న ఎన్నారైలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ఇక నుంచి రోజుకు రూ.1 లక్ష వరకు భారత్‌లోని తమ కుటుంబ సభ్యులు, ఇతర చెల్లింపులకు నగదు పంపించవచ్చు.ఎన్నారైలు ఇక నుంచి అంతర్జాతీయ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి నేరుగా వారి స్మార్ట్‌ఫోన్ నుండి ఉచిత లావాదేవీల కోసం యూపీఐని ఉపయోగించవచ్చు. తద్వారా విదేశాల నుండి లావాదేవీలను నిర్వహించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. యూఎస్, కెనడా, యూకే, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, హాంగ్‌కాంగ్, మలేషియా, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలోని ఎన్నారైలకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. కొత్తగా నమోదైన యూపీఐ ఐడీల ద్వారా తొలి 24 గంటల్లో రూ.5,000 మాత్రమే పంపేందుకు వీలుంది. ఆ తర్వాతి రోజు నుంచి రోజుకు రూ.1 లక్ష పంపొచ్చు.ఇవీ బ్యాంకులు..యూపీఐ కోసం అంతర్జాతీయ మొబైల్ నంబర్ల అనుసంధానానికి ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ మద్దతు ఇస్తున్నాయి.అంతర్జాతీయ మొబైల్ నంబర్లకు అనుకూలమైన యూపీఐ అప్లికేషన్లలో ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, భీమ్, భీమ్ ఏయూ, ఫెడ్‌మొబైల్, ఐమొబైల్, భీమ్ ఇండస్ పే, ఎస్ఐబీ మిర్రర్ ప్లస్ వంటివి ఉన్నాయి. ఎన్నారైలు తమ ఎన్ఆర్ఈ మరియు ఎన్ఆర్వో ఖాతాల మధ్య, అలాగే భారత్‌లోని ఖాతాలకు యుపీఐ లావాదేవీలు చేయవచ్చు. ఎన్ఆర్వో ఖాతా నుండి ఎన్ఆర్ఈ ఖాతాకు నిధులను బదిలీ చేయలేరు. విభిన్న బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్న ఎన్నారైలు ప్రతి ఖాతాకు ప్రత్యేక యూపీఐ ఐడీ అవసరం. ఖాతా ఉమ్మడిగా ఉంటే ప్రాథమిక ఖాతాదారు మాత్రమే యూపీఐని ఉపయోగించగలరు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యూపీఐ.. ఈ రెండు రోజుల్లో పనిచేయదు
యూపీఐ సేవలకు సంబంధించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్లకు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసింది. అవసరమైన సిస్టమ్ నిర్వహణ కారణంగా నవంబర్‌లో రెండు రోజుల పాటు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవ అందుబాటులో ఉండదని ప్రకటించింది.కస్టమర్ల బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి నవంబర్ 5, 23 తేదీలలో అవసరమైన సిస్టమ్ నిర్వహణ పనులు చేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్లో పేర్కొంది. నవంబర్ 5న అర్ధరాత్రి 12 గంటల నుండి 2 గంటల వరకు, అలాగే నవంబర్ 23న అర్ధరాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు అంతరాయం ఉంటుందని వెల్లడించింది.ఈ సేవలు అందుబాటులో ఉండవు» హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కరెంట్ & సేవింగ్స్ ఖాతా, రూపే క్రెడిట్ కార్డ్‌పై ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ యూపీఐ లావాదేవీలు.» హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యూపీఐ హ్యాండిల్‌ని వినియోగించే హెచ్డీఎఫ్సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, గూగుల్‌పే, వాట్సాప్ పే, పేటీఎం, శ్రీరామ్ ఫైనాన్స్, మొబిక్విక్, క్రెడిట్ పేలో ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ యూపీఐ లావాదేవీలు.» హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ని వినియోగించే మర్చంట్ల వద్ద కూడా యూపీఐ లావాదేవీలు అందుబాటులో ఉండవు.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ ఆఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డులు -
రోజూ 50 కోట్ల లావాదేవీలు
దేశీయంగా యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు దాదాపు 500 మిలియన్లు(50 కోట్లు) లావాదేవీలు జరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంచనా వేస్తున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. త్వరలో ఇది బిలియన్(100 కోట్లు) మార్కును చేరనున్నట్లు చెప్పారు. అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ‘గ్రూప్ ఆఫ్ థర్టీస్ వార్షిక అంతర్జాతీయ బ్యాంకింగ్ సెమినార్’లో పాల్గొని ఆయన మాట్లాడారు.‘భవిష్యత్తులో ఆన్లైన్ లావాదేవీలకు మరింత ఆదరణ పెరుగుతుంది. ఆమేరకు చెల్లింపులకు సంబంధించి ఎలాంటి భద్రతా లోపాలకు తావులేకుండా మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తున్నాం. అందుకు ఆర్బీఐ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అన్ని చర్యలు తీసుకుంటోంది. యూపీఐ విధానం ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం రోజుకు దాదాపు 50 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిని మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. రానున్న రోజుల్లో వీటి సంఖ్యను ఒక బిలియన్(100 కోట్లు)కు చేర్చాలని భావిస్తున్నాం’ అన్నారు.ఇదీ చదవండి: క్విక్ కామర్స్‌లోకి టాటా గ్రూప్?‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) డేటా ప్రకారం, ఆగస్టులో యూపీఐ రోజువారీ లావాదేవీల సంఖ్య 483 మిలియన్లకు చేరింది. ఇది సెప్టెంబర్‌లో సుమారు 500 మిలియన్లుగా ఉంది. సెప్టెంబర్ 2024లో మొత్తం యూపీఐ చెల్లింపుల సంఖ్య 15.04 బిలియన్లు(1500 కోట్లు). ఫలితంగా వీటి విలువ రూ.20.64 లక్షల కోట్లకు చేరింది. ఆన్లైన్ చెల్లింపులు పెంచడానికి ఇతర దేశాల ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌లతో కూడా యూపీఐను లింక్ చేస్తున్నాం. ఇప్పటికే ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, భూటాన్, శ్రీలంక, మారిషస్, నేపాల్ వంటి ఏడు దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది’ అని దాస్ చెప్పారు. -
ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!
రవి ఉదయాన్నే లేచి కిరాణంకు వెళ్లి ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు తీసుకున్నాడు. బిల్లు చెల్లించేందుకు యూపీఐ థర్డ్‌పార్టీ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేశాడు. కానీ పేమెంట్ జరగలేదు. మళ్లీ ప్రయత్నించాడు. అయినా పేమెంట్ అవ్వలేదు. క్రితం రోజు రాత్రే తన ఫోన్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ గడువు ముగిసిన విషయం రవికి గుర్తొచ్చింది. ఇంటికేమో సరుకులు తీసుకెళ్లాలి. కానీ పేమెంట్ చేద్దామంటే నెట్ సదుపాయం లేదు. వెంటనే తనకు ‘యూపీఐ 123పే’ సర్వీసు గుర్తొచ్చింది. దాంతో ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే యూపీఐ పేమెంట్ చేసి సరుకులతో ఇంటికి వచ్చాడు.యూపీఐ 123పే ఆల్ట్రా క్యాష్ ద్వారా ఎలాంటి నెట్ సదుపాయం లేకుండానే రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ద్వారా యూపీఐ సేవలు ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం.మీ ఫోన్ నుంచి యూపీఐ 123పేకు అనుసంధానంగా ఉన్న ‘08045163666’ నంబరుకు డయల్ చేయండి.ఐవీఆర్‌ను అనుసరిస్తూ స్థానిక భాషను ఎంచుకోవాలి.మనీ ట్రాన్సాక్షన్ కోసం ‘1’ ఎంటర్ చేయమని ఐవీఆర్‌లో వస్తుంది. వెంటనే 1 ప్రెస్ చేయాలి.మీరు ఎవరికైతే డబ్బు పంపాలనుకుంటున్నారో బ్యాంకు వద్ద రిజిస్టర్ అయిన తమ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.ఐవీఆర్ సూచనలు పాటిస్తూ మీ బ్యాంకు పేరును వాయిస్ ద్వారా ధ్రువపరచాల్సి ఉంటుంది. వెంటనే మీ అకౌంట్ చివరి నాలుగు డిజిట్లు ఐవీఆర్ కన్ఫర్మ్ చేస్తుంది.తర్వాత ఎంత డబ్బు పంపించాలో ఎంటర్ చేయాలి.ఇదీ చదవండి: వీపీఎఫ్..పన్ను రహిత వడ్డీ పరిమితి పెంపు?మీరు ఎంత డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తిరిగి ఐవీఆర్ ధ్రువపరుస్తుంది. ఎవరికైతే డబ్బు పంపించాలనుకుంటున్నారో వారి పేరు కూడా చెబుతుంది. తిరిగి కాల్ వస్తుందని చెప్పి కాల్ కట్ అవుతుంది.అలా కాల్ కట్ అయిన క్షణాల్లోనే ముందుగా మీరు కాల్ చేసిన నంబర్ నుంచే కాల్ వస్తుంది.మనీ ట్రాన్స్ఫర్ ధ్రువపరిచేందుకు ఐవీఆర్‌ను అనుసరించి 1 ప్రెస్ చేయాలి.తర్వాత మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. వెంటనే మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్ అయినట్లు మెసేజ్ వస్తుంది.మీరు ఎవరికైతే డబ్బు చెల్లించాలో వారి ఖాతాలో డబ్బు జమైందో కనుక్కుంటే సరిపోతుంది. -
పేటీఎంకు ఎన్పీసీఐ ఊరట
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు ఊరటనిస్తూ కొత్త యూపీఐ యూజర్లను చేర్చుకునేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) అనుమతించింది. నిర్దేశిత మార్గదర్శకాలు, నిబంధనలను పాటించడాన్ని బట్టి అనుమతులు ఉంటాయని ఎన్పీసీఐ పేర్కొన్నట్లు ఎక్సే్చంజీలకు ఇచి్చన సమాచారంలో పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్) వెల్లడించింది. నిబంధనలను పదే పదే ఉల్లంఘించినందుకు గాను కార్యకలాపాలు నిలిపివేయాలంటూ ఈ ఏడాది జనవరిలో అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను (పీపీబీఎల్) ఆర్బీఐ ఆదేశించడం తెలిసిందే. ఎన్పీసీఐ అనుమతుల వార్తలతో బుధవారం ఓసీఎల్ షేరు ధర 8 శాతం లాభంతో రూ. 745 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 12 శాతం ఎగబాకింది. -
పేటీఎంకి ‘కొత్త’ ఊపిరి!
కష్టాల్లో కూరుకుపోయిన ఫిక్ టెక్ కంపెనీ పేటీఎంకి భారీ ఊరట లభించింది. కొత్తగా యూపీఐ యూజర్లను చేర్చుకోవడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుమతినిచ్చింది. ఆగస్ట్‌లో కంపెనీ చేసిన అభ్యర్థన మేరకు ఎన్పీసీఐ అనుమతిని మంజూరు చేసిందని పేటీఎం తెలిపింది.నిబంధనలు పాటించడంలో లోపాల కారణంగా ఎన్పీసీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా యూపీఐ యూజర్లను చేర్చుకోకుండా పేటీఎంపై నిషేధించింది. తాజాగా పేటీఎం అభ్యర్థన మేరకు రెగ్యులేటరీ నిబంధనలు, ప్రోటోకాల్స్లను సమీక్షించి కొత్తగా యూజర్లను చేర్చుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే షరతులతో కూడిన అనుమతి మాత్రమే.ఇదీ చదవండి: అదిరిపోయే ఆఫర్.. విమానం ఎక్కేయండి చవగ్గా!ఆర్బీఐ చర్యల తర్వాత ఇప్పటివరకూ పేటీఎం షేర్లు దాదాపు 10 శాతం నష్టపోయాయి. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ ఆదాయంలో 34 శాతం క్షీణత, నెలవారీ లావాదేవీల వినియోగదారులలో 25 శాతం తగ్గుదలని నివేదించింది. దీని తర్వాత కంపెనీ షేర్లు ఐదు శాతానికి పైగా పడిపోయాయి. -
ఆరు నెలల్లో 7897 కోట్ల లావాదేవీలు
తక్షణ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీల సంఖ్య 2024 జనవరి–జూన్ మధ్య దేశవ్యాప్తంగా 78.97 బిలియన్ల(7897 కోట్లు)కు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే లావాదేవీలు 52 శాతం పెరిగాయని పేమెంట్ టెక్నాలజీ సర్వీసులు అందిస్తున్న వరల్డ్‌లైన్ నివేదిక వెల్లడించింది.‘గతేడాదితో పోలిస్తే జనవరి–జూన్ మధ్య లావాదేవీల విలువ రూ.83.16 లక్షల కోట్లు నుంచి రూ.116.63 లక్షల కోట్లకు చేరింది. 2023 జనవరిలో యూపీఐ లావాదేవీల సంఖ్య 803 కోట్లుగా ఉంది. 2024 జూన్‌కు ఇది 1300 కోట్లకు చేరింది. లావాదేవీల విలువ రూ.12.98 లక్షల కోట్ల నుంచి రూ.20.07 లక్షల కోట్లకు చేరింది. విలువ, పరిమాణం పరంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వరుసగా మూడు స్థానాలను ఆక్రమించాయి. సగటు లావాదేవీ విలువ 2023 జనవరి–జూన్ మధ్య రూ.1,603 నమోదైంది. 2024 జూన్‌తో ముగిసిన ఆరు నెలల్లో ఇది రూ.1,478కి చేరింది. ఆన్లైన్ పరిశ్రమలో ఈ–కామర్స్, గేమింగ్, యుటిలిటీస్, ప్రభుత్వ సేవలు, ఆర్థిక సేవలు మొత్తం లావాదేవీల పరిమాణంలో 81 శాతం, విలువలో 74 శాతం కైవసం చేసుకున్నాయి’ అని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: ఒకే నెలలో రూ.24,509 కోట్లు రాక! -
రోజూ 50 కోట్ల లావాదేవీలు..!
దేశీయంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో యూపీఐ ద్వారా రూ.20.64 లక్షల కోట్ల చెల్లింపులు నమోదైనట్లు నివేదికలు తెలుపుతున్నాయి. లావాదేవీల పరిమాణం సెప్టెంబర్‌లో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 42% పెరిగి 1500 కోట్లకు చేరింది. సగటున రోజువారీ లావాదేవీలు 50 కోట్ల మార్కును చేరాయి.భారత్‌లోనే కాకుండా దుబాయ్, ఖతార్, కువైట్, మారిషస్.. వంటి ఇతర దేశాల్లోనూ ఎన్పీసీఐ యూపీఐ సేవలను అమలు చేస్తోంది. దాంతో అంతర్జాతీయంగా యూపీఐ లావాదేవీలు పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫిజికల్‌గా డబ్బు ఉంచుకోవడం కంటే డిజిటల్ లావాదేవీలు చేయడం మేలని యూపీఐ వినియోగదారులు నమ్ముతున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం సులభమవుతోంది. కానీ కొన్ని థర్డ్‌పార్టీ యూపీఐ యాప్‌లనే యూజర్లు ఎక్కువగా వినియోగిస్తుండడంపట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఏదైనా భద్రతా వైఫల్యాలు తలెత్తితే తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడుతోంది. ఈ థర్డ్‌పార్టీ యూపీఐ కంపెనీలు వినియోగదారులకు అధిక వడ్డీలోన్లను ఆశచూపి భారీగానే లాభపడుతున్నాయని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: నెలలో 11 శాతం పెరిగిన విక్రయాలుదేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నట్లు గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) డిజిటల్ చెల్లింపుల విలువ రూ.1,669 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థికశాఖ చెప్పింది. ఇదే కాలంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుందని పేర్కొంది. తాజాగా సెప్టెంబర్ నెలలో జరిగిన యూపీఐ లావాదేవీలు కలుపుకుంటే ఈ పరిమాణం మరింత పెరుగుతుంది. -
సెబీ కీలక నిర్ణయం.. యూపీఐ తప్పనిసరి
న్యూఢిల్లీ: డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసే దిశగా సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైల్ ఇన్వెస్టర్లు యూపీఐ ద్వారా నిధులను బ్లాక్ (బ్యాంక్ ఖాతాలో స్తంభన) చేసుకునే ఆప్షన్‌తోనే రూ.5లక్షల వరకు దరఖాస్తు చేసుకోవాలని సెబీ కోరింది.అదే సమయంలో సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంక్‌లు లేదా స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్ తదితర ప్రత్యామ్నాయ విధానాల్లోనూ ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఈక్విటీ పబ్లిష్ ఇష్యూలకు యూపీఐ బ్లాక్ ఆప్షన్ అవకాశం అందుబాటులో ఉన్న సంగతి విదితమే.‘‘డెట్ సెక్యూరిటీ పబ్లిక్ ఇష్యూలకు మధ్యవర్తుల ద్వారా (స్టాక్ బ్రోకర్లు, డీపీలు, రిజిస్ట్రార్ తదితర) దరఖాస్తు చేసుకునే వ్యక్తిగత ఇన్వెస్టర్లు, దరఖాస్తు రుసుం రూ.5 లక్షల వరకు ఉంటే వారు యూపీఐ బ్లాకింగ్ ఆప్షన్నే ఉపయోగించుకోవాలి’’అని సెబీ తన సర్క్యులర్‌లో కోరింది. -
వాచీలోనే క్యూఆర్ కోడ్... అదిరిందయ్యా ఆటో డ్రైవర్!
బెంగళూరుకు చెందిన ఈ ‘స్మార్ట్’ఆటో డ్రైవర్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందనలు అందుకున్నాడు. ఎందుకంటే మనవాడు యూపీఐ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ స్మార్ట్ వాచ్‌ను వాడుతున్నాడు మరి! సదరు ఫొటోను ఓ నెటిజన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దాంతో అది తెగ వైరలవుతోంది. అలా రైల్వే మంత్రి దృష్టినీ ఆకర్షించింది. ఆ ఫోటోను ఆయన రీట్వీట్ చేశారు. ‘యూపీఐ కా స్వాగ్! చెల్లింపులు మరింత సులువయ్యాయి’అంటూ కామెట్ చేశారు. ఆటోడ్రైవర్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెలులవెత్తుతున్నాయి. ఐటీలో ట్రెండ్ సెట్టర్ అయిన బెంగళూరు ఆ సాంకేతిక పరిజ్ఞానం వాడకంలోనూ ట్రెండ్ సెట్ చేస్తోందంటూ యూజర్లు కామెంట్ చేస్తున్నారు. ‘నవ భారత ముఖచిత్రమిది’అని ఒకరు, ‘డిజిటల్ ఇండియా మ్యాజిక్’అని మరొకరు పోస్ట్ చేశారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016లో ప్రారంభించిన యూపీఐ బ్యాంకుల మధ్య తక్షణ బదిలీలకు వీలు కలి్పంచడం ద్వారా చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!
భారతదేశంలో యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది యూపీఐ లావాదేవీలు 57 శాతం పెరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. 2022-23లలో దేశంలో యూపీఐ లావాదేవీలు 84 బిలియన్లుగా నమోదయ్యాయి. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జరిగిన లావాదేవీలు అంతకంటే ఎక్కువని తెలుస్తోంది.యూపీఐ లావాదేవీలు భారీగా పెరగటానికి ప్రధాన కారణం.. ఎలాంటి అదనపు చార్జీలు లేకపోవడమే. ఒకవేలా అదనపు చార్జీలు వసూలు చేసినట్లయితే.. యూపీఐ లావాదేవీలను 75 శాతం మంది ఆపేసి అవకాశం ఉందని లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడయ్యింది.సర్వేలో పాల్గొన్నవారిలో సుమారు 38 శాతం మంది తాము చేసే ట్రాన్సాక్షన్లకు.. డెబిట్, క్రెడిట్ కార్డులకంటే కూడా యూపీఐను ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. మరో 22 శాతం మంచి కేవలం యూపీఐను మాత్రమే వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. కాబట్టి యూపీఐ వినియోగానికి అదనపు చార్జీలు వసూలు చేయడం జరిగితే.. 75 శాతం మంచి దీనిని ఉపయోగించడం ఆపేస్తారని సర్వేలో తెలిసింది.ఇదీ చదవండి: నోట్ల సమస్య!.. కేంద్ర ఆర్థిక మంత్రికి కాంగ్రెస్ ఎంపీ లేఖప్రస్తుతం భారతదేశంలోని 10 మందిలో కనీసం నలుగురు యూపీఐ వాడుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి యూపీఐ లావాదేవీల మీద ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఫీజులను వసూలు చేయడం మొదలైతే.. వీరందరూ దీనిని వినియోగించడానికి కొంత వెనుకడుగు వేసే అవకాశం ఉంది. -
ఐదు నెలల్లో యూపీఐ లావాదేవీలు ఎంతంటే..
దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) డిజిటల్ చెల్లింపుల విలువ రూ.1,669 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థికశాఖ చెప్పింది. ఇదే కాలంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుందని పేర్కొంది.మొత్తం డిజిటల్ చెల్లింపు లావాదేవీల సంఖ్య 2017-18 ఆర్థిక సంవత్సరంలో 2,071 కోట్ల నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 18,737 కోట్లకు పెరిగాయి. ఇది ఏటా 44 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఈ ఏడాది కేవలం ఐదు నెలల్లోనే యూపీఐ లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుంది. ఇదిలాఉండగా, కేవలం భారతదేశంలోనే కాకుండా దుబాయ్, ఖతార్, కువైట్, మారిషస్.. వంటి ఇతర దేశాల్లోనూ ఎన్పీసీఐ యూపీఐ సేవలను అమలు చేస్తోంది. దాంతో అంతర్జాతీయంగా యూపీఐ లావాదేవీలు పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ఇదీ చదవండి: ఇంక్రిమెంట్లు, బోనస్‌ల పవర్ తెలుసా..?ఫిజికల్‌గా డబ్బు ఉంచుకోవడం కంటే డిజిటల్ లావాదేవీలు చేయడం మేలని యూపీఐ వినియోగదారులు నమ్ముతున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం సులభమవుతోంది. కానీ కొన్ని థర్డ్‌పార్టీ యూపీఐ యాప్‌లనే యూజర్లు ఎక్కువగా వినియోగిస్తుండడంపట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఏదైనా భద్రతా వైఫల్యాలు తలెత్తితే తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడుతోంది. ఈ థర్డ్‌పార్టీ యూపీఐ కంపెనీలు వినియోగదారులకు అధిక వడ్డీలోన్లను ఆశచూపి భారీగానే లాభపడుతున్నాయని కొందరు చెబుతున్నారు. -
కొత్త ఫీచర్: చేతిలోని క్యాష్.. ఈజీగా అకౌంట్లోకి..
యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక డిజిటల్ చెల్లింపుల్లో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఎవరికి నగదు పంపాలన్నా యూపీఐ యాప్‌ల ద్వారా క్షణాల్లో పంపించేస్తున్నాం. మరి క్యాష్ డిపాజిట్ అయితే ఏం చేస్తాం.. నేరుగా సంబంధిత బ్యాంకుకు వెళ్లి అకౌంట్లో వేయడమో లేదా ఆ బ్యాంకు ఏటీఎం మెషీన్లో డిపాజిట్ చేయడమో చేస్తాం. కానీ బ్యాంకుతో సంబంధం లేకుండా కేవలం యూపీఐ యాప్‌తో ఏ బ్యాంకు ఖాతాకైనా భౌతిక నగదును డిపాజిట్ చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదా.. అలాంటి కొత్త ఫీచర్ ఇప్పుడు వచ్చింది.ఏ బ్యాంక్ ఖాతాకైనా..యూపీఐ ఇంటర్ఆపరబుల్ క్యాష్ డిపాజిట్ (UPI-ICD) అనే కొత్త ఫీచర్ ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే విధానాన్ని మరింత సులువుగా మార్చనుంది. ఈ వినూత్నమైన ఫీచర్లో ఏ యూపీఐ యాప్‌ను ఉపయోగించైనా, ఏ బ్యాంక్ ఖాతాలోకైనా నగదును డిపాజిట్ చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన ఏటీఎంలలో ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నప్పటికీ, సమీప భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు ఈ సౌలభ్యాన్ని అందించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఈ బ్యాంకులో ఎఫ్డీ.. మంచి వడ్డీ!డిపాజిట్ ఇలా.. » యూపీఐ-ఐసీడీని సపోర్ట్ చేసే అధునాతన నగదు రీసైక్లర్ మెషీన్లతో కూడిన ఏటీఎంలను గుర్తించండి.» మీ యూపై యాప్‌ని తెరిచి ఏటీఎం స్క్రీన్‌పై వచ్చే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.» మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేసి, లబ్ధిదారు ఖాతాను ఎంచుకోండి.» డిపాజిట్ స్లాట్‌లో నగదు పెట్టండి.» వివరాలను ధ్రువీకరించి యూపీఐ పిన్ ఉపయోగించి లావాదేవీని పూర్తి చేయండి.ప్రయోజనాలు» నగదు తక్షణమే లబ్ధిదారుల ఖాతాకు జమవుతుంది.» ఏటీఎం నగదు రీసైక్లర్ యంత్రం డిపాజిట్ చేసిన నోట్ల ప్రామాణికతను ధ్రువీకరిస్తుంది.» ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.50,000 డిపాజిట్ చేసేందుకు వీలు.» మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా జరగుతుంది. ఎలాంటి కార్డ్స్, భౌతిక స్లిప్‌ల అవసరం ఉండదు.» ఇతర యూపీఐ లావాదేవీల మాదిరిగానే వీటికీ భద్రత ఉంటుంది. -
ఒకేసారి రూ.5 లక్షలు: ఎన్సీపీఐ కీలక నిర్ణయం
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత డిజిటల్ పేమెంట్స్ ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ రోజుకు/ఒకసారికి ఒక లక్ష మాత్రమే పంపించుకోవడానికి అవకాశం ఉండేది. తాజాగా ఈ పరిమితిని పెంచుతూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) కీలక ప్రకటన వెల్లడించింది.ఎన్సీపీఐ ప్రకారం రేపటి (సెప్టెంబర్ 16) నుంచి రోజుకు లేదా ఒకసారికి గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు పంపించుకోవచ్చు. దీంతో యూజర్లు ఆసుపత్రి బిల్లులు, విద్యాసంస్థల ఫీజులకు సంబంధించిన పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఐపీఓకు అప్లై చేసుకునేటప్పుడు రూ. 5 లక్షలు పేమెంట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు అన్నివిధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే.. -
యూపీఐ లైట్ కొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందంటే?
డిజిటల్ ఇండియాలో యూపీఐ పేమెంట్స్ సర్వసాధారణం అయిపోయింది. స్మార్ట్‌ఫోన్ వినియోగించే దాదాపు అందరూ గూగుల్ పే, ఫోన్ పే వంటివి ఉపాయ్ప్గిస్తున్నారు. అయితే పేమెంట్స్ చేసేటప్పుడు ఇది కొంత ప్రాసెస్‌తో కూడుకున్న పని. పిన్ ఎంటర్ చేయాలి.. ఆ తరువాత ట్రాన్సక్షన్ జరుగుతుంది.దీనిని మరింత సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ లైట్ ఫీచర్ తీసుకొచ్చింది. దీనిని చిన్న లావాదేవీలకు మాత్రమే ఉపయోగకోవాలి. ఎందుకంటే ఇందులో రూ. 2000 మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తయిన తరువాత మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ఈ విధానానికి చరమగీతం పాడే సమయం వచ్చేసింది.యూపీఐ ఆటో టాప్-అప్లావేదేవీల కోసం యూపీఐ లైట్ ఉపయోగిస్తుంటే.. అక్టోబర్ 31 తరువాత ఆటో టాప్ అప్ ఎంపికను ఉపయోగించుకోవచ్చు. అంటే యూపీఐ లైట్లో ఆటో టాప్-అప్ ఆప్షన్ ఎంచుకుంటే.. అమౌట్ పూర్తయిన తరువాత మీ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్‌గా అమౌంట్ యాడ్ అవుతుంది. ఇది అక్టోబర్ 31 నుంచి అమలులోకి రానున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది.నిజానికి యూపీఐ ట్రాన్సక్షన్ చేయాలనంటే పిన్ ఎంటర్ చేయాలి. కానీ యూపీఐ లైట్ ద్వారా రూ. 500 కంటే తక్కువ లావాదేవీలు జరపడానికి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది యూజర్ల సమయాన్ని ఆదా చేస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. యూపీఐ లైట్ ద్వారా జరిగే లావాదేవీలు బ్యాంక్ స్టేట్మెంట్లో కనిపించవు. -
UPI మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
-
యాక్సిస్ బ్యాంక్ నుంచి రెండు డిజిటల్ సొల్యూషన్స్
హైదరాబాద్: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తాజాగా రిటైల్, వ్యాపార వర్గాల కోసం రెండు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. యూపీఐ–ఏటీఎం, భారత్ కనెక్ట్ (గతంలో బీబీపీఎస్) ఫర్ బిజినెస్ వీటిలో ఉన్నాయి. కార్డ్‌లెస్ నగదు విత్‌డ్రాయల్, డిపాజిట్లకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) టెక్నాలజీ ఆధారిత ఆండ్రాయిడ్ క్యాష్ రీసైక్లర్‌గా యూపీఐ–ఏటీఎం పని చేస్తుంది. అకౌంటు తెరవడం, క్రెడిట్ కార్డుల జారీ, డిపాజట్లు, రుణాలు, ఫారెక్స్ మొదలైన సరీ్వసులన్నీ కూడా ఒకే ప్లాట్‌ఫాం మీద అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని బ్యాంకు డిప్యుటీ ఎండీ రాజీవ్ ఆనంద్ తెలిపారు. మరోవైపు, వ్యాపార సంస్థలు సప్లై చెయిన్లోని వివిధ దశల్లో నిర్వహణ మూలధన అవసరాల కోసం, అకౌంట్ రిసీవబుల్స్–పేయబుల్స్ను సమర్ధవంతంగా క్రమబదీ్ధకరించుకునేందుకు భారత్ కనెక్ట్ ఫర్ బిజినెస్ ఉపయోగపడుతుంది. ఎన్పీసీఐలో భాగమైన భారత్ బిల్‌పే భాగస్వామ్యంతో దీన్ని రూపొందించింది. -
పోటీలోకి మరో యూపీఐ యాప్
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో యూపీఐ చెల్లింపులదే అగ్రస్థానం. ఇప్పటికే పలు యూపీఐ యాప్‌లు యూజర్లకు సేవలందిస్తున్నాయి. ఇప్పుడీ పోటీలోకి మరో యాప్ వచ్చింది. వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పించేలా ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాం భారత్‌పే తాజాగా యూపీఐ టీపీఏపీని (థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్) ఆవిష్కరించింది.ఇందుకోసం యూనిటీ బ్యాంకుతో జట్టుకట్టినట్లు తెలిపింది. ఈ సేవల కోసం కస్టమర్లు భారత్‌పే యాప్‌లో @bpunity ఎక్స్‌టెన్షన్‌తో తమ యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకుని ఇటు వ్యక్తులకు అటు వ్యాపార వర్గాలకు చెల్లింపులు జరపవచ్చని పేర్కొంది. కంపెనీ ఇప్పటివరకు వ్యాపారవర్గాల మధ్య యూపీఐ చెల్లింపుల కోసం భారత్‌పే ఫర్ బిజినెస్ యాప్‌ను నిర్వహిస్తోంది.తాజాగా తమ బై–నౌ–పే–లేటర్ యాప్ ’పోస్ట్‌పే’ పేరును ’భారత్‌పే’గా మార్చి వినియోగదారుల చెల్లింపుల సేవల కోసం మరో యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో యాపిల్ డివైజ్‌లకు సంబంధించిన యాప్స్టోర్లోనూ అందుబాటులోకి రానుంది. -
439 బిలియన్ యూపీఐ లావాదేవీలు
న్యూఢిల్లీ: యూపీఐ వినియోగం ఏటేటా గణనీయగా పెరుగుతూనే ఉంది. 2028–29 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి యూపీఐ లావాదేవీలు మూడు రెట్ల వృద్ధితో 439 బిలియన్లకు (ఒక బిలియన్ వంద కోట్లకు సమానం) చేరుకుంటాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు 131 బిలియన్లుగా ఉన్నట్టు తెలిపింది. గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అద్భుతమైన వృద్ధిని చూసినట్టు పేర్కొంది. ఈ కాలంలో లావాదేవీల విలువ రూ.265 లక్షల కోట్ల నుంచి రూ.593 లక్షల కోట్లకు పెరిగినట్టు వెల్లడించింది. రిటైల్ చెల్లింపుల్లో యూపీఐ హవా రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ఇప్పుడు యూపీఐ వాటా 80 శాతాన్ని అధిగమించిందని.. 2028–29 నాటికి 91 శాతానికి చేరుకోవచ్చని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. యూపీఐ ఏటేటా చక్కని వృద్ధిని చూస్తోందంటూ.. లావాదేవీల పరిమాణంలో 57 శాతం వృద్ధి ఉన్నట్టు పేర్కొంది. క్రెడిట్ కార్డ్ విభాగం సైతం 2023–24లో బలమైన వృద్ధిని చూసిందని, కొత్తగా 1.6 కోట్ల కార్డులను పరిశ్రమ జోడించుకున్నట్టు వివరించింది. దీంతో లావాదేవీల పరిమాణం 22 శాతం మేర, లావాదేవీల విలువ 28 శాతం చొప్పున పెరిగినట్టు వెల్లడించింది. 2028–29 నాటికి క్రెడిట్‌కార్డులు 20 కోట్లకు చేరుకోవచ్చని తెలిపింది. ఇక డెబిట్ కార్డుల వినియోగం తగ్గుతోంది. లావాదేవీల పరిమాణం, విలువలోనూ క్షీణత కనిపించింది. వచ్చే ఐదేళ్లలో చెల్లింపుల పరిశ్రమ ఎకోసిస్టమ్ విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని, ప్రస్తుతమున్న ప్లాట్‌ఫామ్‌లపైనే కొత్త వినియోగ అవకాశాలను గుర్తించొచ్చని పీడబ్ల్యూసీ ఇండియా పేమెంట్స్ పార్ట్నర్ మిహిర్ గాంధీ అంచనా వేశారు. -
యూపీఐ, రూపే ‘విశ్వవ్యాప్త’మే ధ్యేయం
ముంబై: యూపీఐ, రూపేలను ‘‘వాస్తవరీతిన విశ్వ వ్యాపితం’’గా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం స్పష్టం చేశారు. సెంట్రల్ బ్యాంక్ దృష్టి సారిస్తున్న కీలక అంశాల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో గవర్నర్ మాట్లాడుతూ, ఆర్థిక సేవలను అందరికీ అందుబాటులోనికి తీసుకురావడం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పురోగతికి, వినియోగదారుల రక్షణ, సైబర్ భద్రత, స్థిరమైన ఫైనాన్స్, ఆర్థిక సేవల ప్రపంచ ఏకీకరణ అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అనేక దేశాలతో ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి అంతర్జాతీయ వేదికల ఏర్పాటు, ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవడంలో భారత్ నిమగ్నమై ఉందని అన్నారు. డేటా గోప్యత ఆందోళన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ‘విశ్వసనీయ ఏఐ‘ అభివృద్ధికి ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు, అలాగే ఆర్థిక రంగ సంస్థలు పరస్పరం సహకరించుకోవాలని కూడా ఈ సందర్భంగా దాస్ ఉద్ఘాటించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... → సరిహద్దు చెల్లింపు వ్యవస్థలతో సహా ఆర్థిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ఆర్బీఐ కీలక లక్ష్యాలుగా ఉన్నాయి. → భారతదేశానికి సాంకేతిక ప్రతిభ, అభివృద్ధి చెందిన ఆర్థిక ఫిన్‌టెక్ వ్యవస్థల బలం ఉంది. తద్వారా డిజిటల్ ఆవిష్కరణలు, ఫిన్‌టెక్ స్టార్టప్‌లు, అంతర్జాతీయ సహకారానికి నిబద్దతతో పనిచేయడం, ఎక్సలెన్స్ సంస్థలను అభివృద్ధి చేయడం వంటి వాటికి గ్లోబల్ హబ్‌గా ఉండే సామర్థ్యాన్ని దేశం సముపార్జించింది. → భూటాన్, నేపాల్, శ్రీలంక, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), మారిషస్, నమీబియా, పెరూ, ఫ్రాన్స్‌సహా కొన్ని ఇతర దేశాలతో రుపే కార్డ్‌ల అంగీకారం, యూపీఐ నెట్వర్క్ ద్వారా చెల్లింపుల్లో గణనీయమైన పురోగతి చోటుచేసుకుంది. డిజిటల్ ట్రాన్స్ బోర్డర్ చెల్లింపులతో అక్రమాలకు చెక్ – ఫెడ్ అధికారి క్రిస్టోఫర్ జే వాలర్ ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడు క్రిస్టోఫర్ జే వాలెర్ ఇదే కార్యక్రమంలో మాట్లాడుతూ, డిజిటల్ క్రాస్ బోర్డర్ చెల్లింపులతో అక్రమ ధనార్జన, టెర్రర్ ఫండింగ్ కట్టడి సాధ్యమవుతాయని అన్నారు. ట్రాన్స్–బోర్డర్ డిజిటల్ లావాదేవీల సామర్థ్యం పెంపు ఆవశ్యకతను ఆర్బీఐ గవర్నర్ ఉద్ఘాటిస్తున్న నేపథ్యంలో ఫెడ్ అధికారి కూడా దీనికి వోటువేయడం గమనార్హం. -
యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పులు..!
డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ (UPI - యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వినియోగం వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఇప్పుడు నగదు లావాదేవీల కంటే యూపీఐ పేమెంట్స్‌నే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో యూపీఐ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి.యూపీఐ పేమెంట్స్ భద్రతకు సంబంధించి ప్రస్తుతం పిన్ (PIN) ఆధారిత ధ్రువీకరణ విధానం ఉంది. పేమెంట్స్ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రతిసారి పిన్ నంబర్ ఎంటర్ చేసి ధ్రువీకరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కొన్నిసార్లు మోసాలు జరగుతున్నాయి. దీనిపై దృష్టిసారించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతోంది.బయోమెట్రిక్ ధ్రువీకరణ!సీక్రెట్ పిన్ నంబర్‌ను తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎన్పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మింట్ నివేదిక ప్రకారం.. పిన్ ఆధారిత ధ్రువీకరణ ప్రక్రియకు బదులుగా బయోమెట్రిక్ ధ్రువీకరణను తీసుకురానుంది. ఈ కొత్త విధానంలో యూపీఐ లావాదేవీలను వేలిముద్ర స్కానింగ్ లేదా ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ధ్రువీకరించాల్సి ఉంటుంది. స్మార్ట్ఫోన్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్లను ఉపయోగించి యూపీఐ చెల్లింపులను మరింత సురక్షితంగా, సులభంగా చేసే విధానంపై ఎన్పీసీఐ కసరత్తు చేస్తోంది. -
డెబిట్ కార్డు లేకపోయినా డబ్బు విత్‌డ్రా
డెబిట్ కార్డు పోయిందా..ఏటీఎంకు కార్డు తెసుకెళ్లడం మర్చిపోయారా..డెబిట్ కార్డు లేకుండా దూరప్రాంతాలకు వెళ్లారా.. మరేం పర్వాలేదు. మీరు ఉన్న ప్రాంతంలో ఏటీఎం ఉంటే ఎలాంటి డెబిట్ కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే అందుకోసం మీ స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ యాప్ ఉంటే సరిపోతుంది. కార్డు అవసరం లేకుండా యూపీఐ ద్వారా ఎలా డబ్బు విత్‌డ్రా చేయాలో తెలుసుకుందాం.బ్యాంకింగ్ రంగ సేవల్లో టెక్నాలజీ విస్తరిస్తోంది. అందులో భాగంగా యూపీఐ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఏ చిన్న లావాదేవీలు చేయాలన్నా స్మార్ట్పోన్లోని యూపీఐని వినియోగిస్తున్నారు. దీన్ని ఉపయోగించి డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. అందుకోసం ఇంటర్ ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రావల్ (ఐసీసీడబ్ల్యూ) విధానం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు ఈ సర్వీసును అందిస్తున్నాయి.విత్‌డ్రా చేసుకోండిలా..ముందుగా మీ వద్ద యూపీఐ యాప్ ఇన్స్టాల్ చేసిన స్మార్ట్‌ఫోన్ ఉండాలి. ప్రస్తుతం చాలామంది గూగుల్‌పే, ఫోన్‌పే..వంటి యూపీఐ ధర్డ్‌పార్టీ యాప్‌లను వాడుతున్నారు.మీ బ్యాంకు ఐసీసీడబ్ల్యూ సేవలందిస్తుందో లేదో తనిఖీ చేసుకోవాలి.ఒకవేళ ఈ సర్వీసు అందుబాటులో ఉంటే ఏటీఎం వద్దకు వెళ్లి స్క్రీన్‌పై ‘యూపీఐ నగదు ఉపసంహరణ’ ఆప్షన్ ఎంచుకోవాలి.ఏటీఎం ప్రొవైడర్‌ను బట్టి ఈ ఎంపిక విభిన్నంగా ఉండవచ్చు. జాగ్రత్తగా గమనిస్తే సులువుగానే దాన్ని గుర్తించవచ్చు.యూపీఐ విత్‌డ్రా సెలక్ట్ చేసుకున్నాక క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది.మీ ఫోన్లోని యూపీఐ యాప్ ఓపెన్ చేసి ఏటీఎం స్క్రీన్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.మీరు ఎంత డబ్బు విత్‌డ్రా చేయాలో ఎంటర్ చేసి, యూపీఐ పిన్ ప్రెస్ చేయాలి. (యూపీఐ ద్వారా ఏటీఎం రోజువారీ విత్‌డ్రా పరిమితి సాధారణంగా రూ.10,000గా ఉంటుంది)కొంత సమయం తర్వాత బ్యాంకు సిస్టమ్ సర్వర్‌తో కనెక్ట్ అయి డబ్బు విత్‌డ్రా అవుతుంది.ఇదీ చదవండి: కొత్త పెన్షన్ విధానంలోని కీలకాంశాలు..ఈ ప్రక్రియ వల్ల ఖాతాదారుల వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. క్యూఆర్ కోడ్ మీ సమాచారాన్ని రక్షించడానికి ఎన్క్రిప్షన్ని ఉపయోగిస్తుంది. మీకు మాత్రమే తెలిసిన యూపీఐ పిన్‌తో లావాదేవీని పూర్తి చేసుకోవచ్చు.