బ్యాంకు ఖాతాలో డబ్బులుంటేనే యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. కానీ అకౌంట్‌లో నగదు లేకపోయినా చెల్లింపులు చేసే విధానాన్ని ఆర్‌బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘యూపీఐనౌ పే లేటర్’ ద్వారా బ్యాంకులు ముందుగా మంజూరు చేసిన క్రెడిట్ లైన్ నుంచి డబ్బు ఖర్చు చేసే అవకాశాన్ని కల్పించింది.
సాధారణంగా డెబిట్ కార్డు ద్వారా బ్యాంకు ఖాతాను యూపీఐ యాప్‌లకు లింక్ చేసి లావాదేవీలు చేస్తుంటాం. యూపీఐనౌ పే లేటర్ ప్రకారం ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్‌ని యూపీఐకి జత చేసుకునే వీలుంది. అసలు ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ అంటే ఏమిటి? దీన్ని ఉపయోగిస్తే వడ్డీ కట్టాలా..? వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్
బ్యాంకులు ముందుగానే మంజూరు చేసే రుణ సౌకర్యాన్ని ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ అంటారు. దీన్నే ప్రీ శాంక్షన్డ్ రుణాలు అని పిలుస్తారు. ఇది బ్యాంకులు కల్పించే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం వంటిదే. గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే వంటి మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ అప్లికేషన్ల ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ క్రెడిట్ లైన్‌ను అందించటానికి బ్యాంకులు ముందుగా వినియోగదారుల అనుమతి తీసుకుంటాయి. బ్యాంకులు ఆమోదించిన తర్వాత యూపీఐ ద్వారా ఆ డబ్బును ఖర్చు చేయొచ్చు. ఈ డబ్బు వినియోగంపై నిర్దిష్ట పరిమితి ఉంటుంది. నిర్దేశించిన గడువులోపు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు క్రెడిట్ లైన్ సదుపాయాన్ని ఉచితంగా అందిస్తే మరికొన్ని మాత్రం వడ్డీ వసూలు చేస్తున్నాయి.
ఇదీ చదవండి: జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐ
ఛార్జీలు ఎలా ఉంటాయి..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన తర్వాత చాలా బ్యాంకులు తమ యూజర్లకు క్రెడిట్ లైన్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. క్రెడిట్ పరిమితి, క్రెడిట్ వ్యవధి, వడ్డీ రేటు వంటివి బ్యాంకులను బట్టి మారుతూంటాయి. ఉదాహరణకు..హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కస్టమర్‌కు రూ.50వేల క్రెడిట్ పరిమితిని అందిస్తోందనుకుందాం. సదరు కస్టమర్ క్రెడిట్ లైన్ నుంచి 10 రోజులకు గాను రూ.5వేలు ఖర్చు చేశారనుకుందాం. తీసుకున్న ఆ సొమ్ముకు గానూ బ్యాంకు సాధారణ వడ్డీ వసూలు చేస్తుంది. డబ్బువాడుకున్న రోజులకు గానూ వడ్డీని లెక్కించి ప్రీ-అప్రూవ్డ్ ఖాతా నుంచి కట్ చేసుకుంటుంది. అలా తీసుకున్న మొత్తం, వడ్డీ మొత్తాన్ని నెలాఖరులో చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment