transaction charges
-
బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోయినా యూపీఐ చెల్లింపులు..!
బ్యాంకు ఖాతాలో డబ్బులుంటేనే యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. కానీ అకౌంట్లో నగదు లేకపోయినా చెల్లింపులు చేసే విధానాన్ని ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘యూపీఐనౌ పే లేటర్’ ద్వారా బ్యాంకులు ముందుగా మంజూరు చేసిన క్రెడిట్ లైన్ నుంచి డబ్బు ఖర్చు చేసే అవకాశాన్ని కల్పించింది.సాధారణంగా డెబిట్ కార్డు ద్వారా బ్యాంకు ఖాతాను యూపీఐ యాప్‌లకు లింక్ చేసి లావాదేవీలు చేస్తుంటాం. యూపీఐనౌ పే లేటర్ ప్రకారం ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్‌ని యూపీఐకి జత చేసుకునే వీలుంది. అసలు ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ అంటే ఏమిటి? దీన్ని ఉపయోగిస్తే వడ్డీ కట్టాలా..? వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్బ్యాంకులు ముందుగానే మంజూరు చేసే రుణ సౌకర్యాన్ని ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ అంటారు. దీన్నే ప్రీ శాంక్షన్డ్ రుణాలు అని పిలుస్తారు. ఇది బ్యాంకులు కల్పించే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం వంటిదే. గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే వంటి మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ అప్లికేషన్ల ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ క్రెడిట్ లైన్‌ను అందించటానికి బ్యాంకులు ముందుగా వినియోగదారుల అనుమతి తీసుకుంటాయి. బ్యాంకులు ఆమోదించిన తర్వాత యూపీఐ ద్వారా ఆ డబ్బును ఖర్చు చేయొచ్చు. ఈ డబ్బు వినియోగంపై నిర్దిష్ట పరిమితి ఉంటుంది. నిర్దేశించిన గడువులోపు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు క్రెడిట్ లైన్ సదుపాయాన్ని ఉచితంగా అందిస్తే మరికొన్ని మాత్రం వడ్డీ వసూలు చేస్తున్నాయి.ఇదీ చదవండి: జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐఛార్జీలు ఎలా ఉంటాయి..?రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన తర్వాత చాలా బ్యాంకులు తమ యూజర్లకు క్రెడిట్ లైన్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. క్రెడిట్ పరిమితి, క్రెడిట్ వ్యవధి, వడ్డీ రేటు వంటివి బ్యాంకులను బట్టి మారుతూంటాయి. ఉదాహరణకు..హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్‌కు రూ.50వేల క్రెడిట్ పరిమితిని అందిస్తోందనుకుందాం. సదరు కస్టమర్ క్రెడిట్ లైన్ నుంచి 10 రోజులకు గాను రూ.5వేలు ఖర్చు చేశారనుకుందాం. తీసుకున్న ఆ సొమ్ముకు గానూ బ్యాంకు సాధారణ వడ్డీ వసూలు చేస్తుంది. డబ్బువాడుకున్న రోజులకు గానూ వడ్డీని లెక్కించి ప్రీ-అప్రూవ్డ్ ఖాతా నుంచి కట్ చేసుకుంటుంది. అలా తీసుకున్న మొత్తం, వడ్డీ మొత్తాన్ని నెలాఖరులో చెల్లించాలి. -
కమోడిటీ ఎక్సేంజ్ లేవాదేవీ చార్జీల పెంపు
సాక్షి, ముంబై: కాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కమోడిటీ ఎక్సేంజ్ చార్జీలను పెంచేసింది. ఈ మేరకు బుధవారం సెబీ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ వెలువడిన 30రోజులకు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీని ప్రకారం టర్నోవర్ స్లాబ్‌లో అత్యధిక లావాదేవీ ఛార్జీల మధ్య నిష్పత్తి 2: 1 ని మించికూడదు. వివిధ ఎక్స్ఛేంజీలతో సంప్రదించి న అనంతరం సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక కాంట్రాక్ట్ లోని 'టర్నోవర్ స్లాబ్' హయ్యస్ట్ నుండి లోయస్ట్ చార్జీల రేషియో 2:1 మించకుండా కమోడిటీ ఎక్చేంజ్‌లు చూస్తాయని తెలిపింది. 2016 సెప్టెంబర్‌లో కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్ లకు సెబీ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఈ నిష్పత్తి 1.5.1గా ఉంది. ఫార్వర్డ్ మార్కెట్స్ కమీషన్ తో విలీనం తరువాత. 2015నుంచి కమోడిటీ ఎక్సేంజ్‌లపై నియంత్రణ ప్రారంభించిన సెబీ 2016 సెప్టెంబరులో సరుకు డెరివేటివ్స్ లావాదేవీల చార్జీల వసూలుపై నిబంధనలను విధించింది. -
బాదుడుకు రెడీ!
ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల్లో రుసుముల మోత భారీగా పెరగనున్న లావాదేవీల చార్జీలు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి సామాన్యుల నడ్డి విరచడానికి బ్యాంకులు సిద్ధమయ్యాయి. బ్యాంకులంటేనే ఖాతాదారులు భయపడేలా రుసుముల మోత మోగించనున్నాయి. చార్జీల పెంపుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా బ్యాంకులు కానీ, రిజర్వ్‌బ్యాంకు కానీ వెనక్కు తగ్గడం లేదు. ఈ విషయం తమ పరిధిలో లేదన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండడంపై ఖాతాదారులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. చిత్తూరు: పెద్ద నోట్ల రద్దుతో అస్తవ్యస్తం అయిన ఆర్థిక వ్యవస్థతో ఇప్పటికీ సామాన్యులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు బ్యాంకులు లావాదేవీల చార్జీలు భారీగా పెంచుతున్నాయి. సామాన్యులకు అండగా నిలిచి ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలవా ల్సిన బ్యాంకులు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తుంటే ఖాతాదారులు భయపడిపోతున్నారు. జిల్లాలో సుమా రు 42 లక్షల జనాభా ఉంది. వీరిలో 33 లక్షల మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. అంటే 78 శాతం మంది బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రతిఫలాలన్నీ బ్యాంకుల ద్వారానే లబ్ధిదారులకు చేరుతున్నాయి. దీంతో ప్రజలందరూ బ్యాంకులపై ఆధారపడ్డారు. దీంతో బ్యాంకులు ఆడిం దే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది. ఇందులో భా గంగానే ఏప్రిల్ ఒకటి నుంచి లావాదేవీల చార్జీలు భారీగా పెంచుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, జాతీయబ్యాంకులు ప్రస్తుతం ఉన్న లావాదేవీల చార్జీ లను సవరిస్తూ ఇప్పటికే తమ శాఖలకు కొత్త చార్జీల వివరాలు పంపాయి. ఈపెంపుపై జాతీయ మీడియా, నెటిజన్లు సామాన్యులు మండిపడుతున్నారు. ఈ పెం పునకు వ్యతిరేకంగా నెటిజన్లు ఏప్రిల్ 6ను లావాదేవీల రహిత దినంగా ప్రకటించారు. ఆ రోజున దేశంలోని ప్రజలందరూ అన్నిరకాల బ్యాంకు లావాదేవీలను నిలి పేయాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 40 బ్యాంకులు 754 బ్రాంచులున్నాయి. వీటిలో సుమారు 33 లక్షల మంది ఖాతాదారులుగా ఉన్నారు. అన్ని ప్రైవేటు బ్యాంకులు, జాతీయ బ్యాంకులు తమకు అనుకూలంగా, తాము అనుకున్న విధంగా రుసుం పెంచి సామాన్యుడిపై భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. నెలలో మొదటి మూడు నగదు లావాదేవీలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఇది ప్రస్తుతం 5 వరకు ఉచితంగా చేసుకునే వెసులుబాటు ఉంది. హెచ్డీఎఫ్సీ ప్రతి నెలా నాలుగు లావాదేవీలు మించితే రుసుం చెల్లించాల్సిందే. నాలుగుకు మించితే ప్రతి లావాదేవీపై రూ.150లు ఖాతాదారుడి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారు. ఒక్కోరోజు రూ.2 లక్షల నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉటుంది. అదికూడా హోం బ్రాంచ్ అయితేనే. అంతకు మించితే బాదుడు తప్పదు. ఈ చార్జీలు కేవలం సేవింగ్స్, శాలరీ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తాయి. ఐసీఐసీఐ నెలకు నాలుగు లావాదేవీలకు ఎలాంటి రుసుం ఉండదు. అంతకు మించితే బాదుడు తప్పదు. పరిమితి మించిన లావాదేవీలపై ఒక్కోదానిపై సుమారు రూ.150 వసూలు చేస్తుంది. ఇతర లావా దేవీల చార్జీలు కూడా భారీగా పెంచినట్లు సమాచారం. యాక్సిస్ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులు ప్రతి నెలా ఐదు లావాదేవీలను ఉచితంగా చేసుకోవచ్చు. వీటిలోనే డిపాజిట్లు విత్డ్రాలుంటాయి. వీటికి మించితే రుసుం చెల్లించాల్సిందే. ప్రతి లావాదేవీపై గరిష్టంగా రూ.95 చార్జి ఉంటుంది. నాన్హోమ్ బ్రాంచ్‌లో ఐదుకు మించి లావాదేవీలు చేస్తే ప్రతి లావాదేవీకి రూ.1000కి రూ.2.5 రుసుం లేదా రూ.95లు ఏది ఎక్కువైతే అది వసూలు చేస్తారు. ఎస్బీఐ ఖాతాదారులు ప్రతి నెలా మూడుసార్లు ఉచితంగా నగదు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించింతే ప్రతి లావాదేవీపై సర్వీస్ టాక్స్, రూ.50 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ ఒకటి నుంచి మినిమమ్ బ్యాలెన్స్ లేని అకౌంట్లపై ప్రతి నెలా రూ.20 నుంచి రూ.100 పెనాల్టీతో పాటు సర్వీస్ ట్యాక్స్‌ను ఖాతాదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారు. ఎస్బీఐ ఖాతాదారులు ఇతర బ్యాంకు ఏటీఎంలలో మూడుసార్ల కంటే ఎక్కువ నగదు డ్రా చేసుకుంటే ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.20తో పాటు సర్వీస్‌ట్యాక్స్ వసూలు చేస్తారు. ఎస్బీఐ ఏటీఎంలో అయితే ఇది ఐదు సార్లకు మించకూడదు. రూ.10 వేలు నిల్వ ఉన్న కరెంటు ఖతాదారులు అయితే రూ.25వేలకు ప్రతిరోజూ రూ.25 వేలకు వరకు ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకు మించితే ట్యాక్స్, రుసుం చెల్లించాల్సిందే. -
వెనక్కి తగ్గిన పేటీఎం
న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్ సంస్థ పేటీఎం క్రెడిట్ కార్డుల వడ్డనపై వెనక్కి తగ్గింది. క్రెడిట్ కార్డుతో టాప్ అప్‌లపై విధించిన 2శాతం చార్జీలు రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. లక్షలాది ఖాతాదారులు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2 శాతం ఫీజును ఉపసంహరించుకుంటున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. వినియోగదారుల సౌలభ్యమే తమకు అత్యంత ముఖ్యమని, అందుకే క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఇటీవల విధించిన ఫీజును రద్దు చేస్తున్నామని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబోట్ ప్రకటించారు. అలాగే తమ సేవల దుర్వినియోగాన్ని పసిగట్టేందుకు తమ బృందాన్ని మరింత పటిష్ట పరుస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు మరో వాలెట్ సంస్థ మొబిక్విక్ తమ వాలెట్స్‌లో క్రెడిట్ కార్డులతో టాప్ అప్ చేస్తే ఎటువంటి చార్జీలు వసూలు చేయమని స్పష్టం చేసింది. కాగా క్రెడిట్ కార్డులతో టాప్ అప్ విధానాన్ని టెక్నాలజీపై పట్టున్న కొందరు యూజర్లు నగదు రొటేషన్ కోసం వాడుకుంటున్నందున, మార్చి 8నుంచి వీటిపై 2 శాతం ఫీజును వసూలు చేయనున్నట్టు ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేటీఎం ప్రకటించింది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్‌ల ద్వారా టాప్ అప్‌లపై ఎలాంటి చార్జీలు ఉండబోవని వివరించిన సంగతి తెలిసిందే. -
క్రెడిట్ కార్డుతో టాప్ అప్‌లకు పేటీఎం షాక్
2 శాతం చార్జీల వడ్డన న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్ సంస్థ పేటీఎం.. క్రెడిట్ కార్డులతో టాప్ అప్ చేసేవారికి షాకిచ్చింది. 2 శాతం లావాదేవీ చార్జీలు విధిస్తున్నట్లు ప్రకటించింది. క్రెడిట్ కార్డులతో టాప్ అప్ విధానాన్ని టెక్నాలజీపై పట్టున్న కొందరు యూజర్లు నగదు రొటేషన్ కోసం వాడుకుంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక బ్లాగ్ పోస్ట్‌లో సంస్థ తెలిపింది. కొందరు యూజర్లు క్రెడిట్‌కార్డులతో మొబైల్ వాలెట్లో డబ్బులు వేసుకుని, తర్వాత ఆ నగదును బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకోవడాన్ని గమనించినట్లుగా తెలిపింది. క్రెడిట్ కార్డుతో టాప్ అప్ చేసిన ప్రతిసారీ తాము అటు కార్డ్ నెట్వర్క్ సంస్థకు, ఇటు బ్యాంకుకు భారీ చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుండగా.. తమ ప్లాట్‌ఫాంపై ఎటువంటి లావాదేవీలు జరపకుండానే సదరు యూజర్లు లబ్ది పొందారని పేటీఎం పేర్కొంది. తమ నెట్‌వర్క్‌లో ఉత్పత్తులు, సర్వీసుల విక్రయం ద్వారా వచ్చే స్వల్ప మార్జిన్లే తమకు ఆదాయమని, కొందరు యూజర్లు అనుసరిస్తున్న విధానాలతో నష్టపోవాల్సి వస్తోందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటివి పునరావృతం కాకుండా చూసేందుకే రెండు శాతం చార్జీలు విధిస్తున్నట్లు వివరించింది. క్రెడిట్ కార్డులతో టాప్ అప్ చేసిన 24 గంటల్లోగా నిర్దిష్ట మొత్తానికి డిస్కౌంట్ కూపన్‌ను అందిస్తామని తెలిపింది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్‌ల ద్వారా టాప్ అప్‌లపై ఎలాంటి చార్జీలు ఉండబోవని స్పష్టం చేసింది. మొబిక్విక్ ఆహ్వానం..: మరోవైపు, తమ వాలెట్స్‌లో క్రెడిట్ కార్డులతో టాప్ అప్ చేస్తే ఎటువంటి చార్జీలు విధించబోమని మరో మొబైల్ వాలెట్ సంస్థ మొబిక్విక్ తెలిపింది. డీమోనిటైజేషన్ అనంతరం నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు తాము ఫీజుల విధానాన్ని ఉపసంహరించామని, అదే విధానాన్ని ఇకపైనా కొనసాగిస్తామని వివరించింది. -
స్టేట్ బ్యాంక్ బాదుడు షురూ!
దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రైవేటు బ్యాంకుల బాటలోనే నడుస్తోంది. ఖాతాలలో కనీస మొత్తం ఉంచకపోతే పెనాల్టీలు విధిస్తామని చెప్పింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇవి అమలవుతాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో కనీసం రూ. 5వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 3వేలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ. 2వేలు, గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి రూపాయల చొప్పున కనీస నిల్వ ఖాతాల్లో ఉండాలని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఖాతాలలో ఉన్న మొత్తానికి, కనీస నిల్వకు మధ్య ఎంత తేడా ఉందో దాన్ని బట్టి పెనాల్టీలు ఉంటాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో రూ. 3750 (75%) కంటే తక్కువ ఉంటే వంద రూపాయలు, దానిపై సేవాపన్నును పెనాల్టీగా వేస్తారు. అదే 50-75 శాతం మధ్య అయితే 75 రూపాయలు, దానిపై సేవాపన్ను పనడుతుంది. సగం కంటే తక్కువ తేడా ఉంటే 50 రూపాయలు, సేవాపన్ను పెనాల్టీగా వేస్తారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఖాతాల్లో కనీస నిల్వ మొత్తం ఉంచుకోకపోతే రూ. 25-50, సేవాపన్ను పెనాల్టీగా పడుతుంది. బ్యాంకుకు వస్తే మోతే బ్రాంచిలో నెలకు మూడుసార్ల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు నిర్వహిస్తే 50 రూపాయల చొప్పున చార్జీ విధిస్తారు. అయితే ఎంత మొత్తం నగదు లావాదేవీ అనే పరిమితి మాత్రం లేదు. గతంలో కూడా ఇలా బ్యాంకులో నగదు లావాదేవీల మీద చార్జీలు ఉండేవని, వాటిని ఏప్రిల్ 1 నుంచి పునరుద్ధరిస్తున్నామని బ్యాంకు అధికారులు తెలిపారు. ఏటీఎంల నుంచి నెలకు 10 సార్లు ఉచితంగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉన్నందున కస్టమర్లు బ్రాంచికి రావాల్సిన అవసరమే ఉండదన్నారు. -
కార్డు చెల్లింపులపై జీరో చార్జీలు
• ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్ కమిటీ సిఫారసులు • లావాదేవీల చార్జీలను శాఖలే భరించాలి • స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు పేదలకు రూ.1000 సబ్సిడీ ఇవ్వాలి • పాలు, రేషన్ దుకాణాల్లో మొబైల్ పేమెంట్లను ప్రోత్సహించాలి సాక్షి, హైదరాబాద్: ఎయిర్‌లైన్స్ సంస్థలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ తదితర ప్రైవేటు వ్యాపార సంస్థల తరహాలోనే డెబిట్/క్రెడిట్ కార్డు లావాదేవీలకు సంబంధించిన చార్జీలను ప్రభుత్వ శాఖలే భరించాలని సీనియర్ ఐఏఎస్ అధికారి సురేష్ చందా నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సోమ, మంగళవారాల్లో సమావేశాలు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ ప్రభుత్వానికి పలు కీలక సిఫారసులు చేసింది. కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై జీహెచ్ఎంసీ, డిస్కంలు, జల మండలి సంస్థలు పౌరుల నుంచి 0.80 నుంచి 0.90 శాతం వరకు ట్రాన్సాక్షన్ చార్జీలను వసూలు చేస్తున్నారుు. అరుుతే నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు కార్డు లావాదేవీలకు సంబంధించిన చార్జీల భారాన్ని తప్పించాలని టాస్క్‌ఫోర్స్ సూచించింది. అలాగే ప్రభుత్వ శాఖలపై లావాదేవీల చార్జీల భారం ఉండని నెట్ బ్యాంకింగ్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు పౌరులకు రారుుతీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. నగదు రహిత లావాదేవీల అమలుపై టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రజల నుంచి సలహాలు సూచలను ఆహ్వానించింది. వాటిని డిసెంబర్ 10లోగా ఛ్చిటజ్ఛిటట.టఠట్ఛటజిఃజఝ్చజీ.ఛిౌఝకు పంపాలని కోరింది. ఇతర ముఖ్య ప్రతిపాదనలు ఇవీ.. ⇔ ప్రభుత్వానికి ఆదాయార్జన తెచ్చి పెట్టే శాఖల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలి. రెవెన్యూ, ఎకై ్సజ్ శాఖల తరహాలో జరిగే భారీ లావాదేవీలు నెట్‌బ్యాంకింగ్/ఎన్ఈఎఫ్టీ/ఆర్టీజీఎస్ల ద్వారా జరిగేలా చూడాలి వినియోగదారుల నుంచి కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరించేందుకు వ్యాట్ డీలర్లందరికీ స్వైపింగ్ యంత్రాలను అందించాలి రూ.20వేలకు మించిన లావాదేవీలన్నీ నగదు రహితంగానే జరగాలి ⇔ మార్కెట్‌యార్డులు, సహకార సొసైటీలు రైతుల ఖాతాలకు ఆన్లైన్ చెల్లింపులు జరపాలి నగదు రహిత చెల్లింపులపై సహకార సొసైటీలు రైతులకు సరుకులు విక్రరుుంచాలి అన్ని రేషన్ దుకాణదారులు, పాల సమాఖ్యలోని పాల విక్రయదారులు, ఇతరులు తమ వినియోగదారులకు బడ్డీ/పాకెట్స్/పేటీఎం తదితర యాప్‌ల సాయంతో మొబైల్ పేమెంట్లు జరిపేందుకు అవకాశం కల్పించాలి పాల వ్యాపారులు, రేషన్ డీలర్ల నుంచి చెల్లింపులను నెట్ బ్యాంకింగ్/ఎన్ఈఎఫ్టీ/మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పాల సమాఖ్యలు, పౌర సరఫరాల సంస్థ స్వీకరించాలి రైతు బజార్లలో మొబైల్ పేమెంట్లు లేదా కూపన్లతో చెల్లింపులు జరిపే వ్యవస్థను తేవాలి ఎల్పీజీ బుకింగ్ కోసం ఆన్లైన్లోనే చెల్లింపులు స్వీకరించాలి ⇔ కూరగాయలు, కిరాణ వస్తువుల వంటి తక్కువ ధర లావాదేవీల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రత్యేక పారుుంట్ ఆఫ్ సేల్(పీఓఎస్) యంత్రాలు, యాప్‌లను ప్రవేశపెట్టాలి నగదు రహిత చెల్లింపులపై పురోగతిని సమీక్షించేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్య ప్రభుత్వ శాఖలు, బ్యాంకు అధికారులతో రాష్ట్ర, జిల్లా స్థారుుల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి ⇔ ప్రతి మండలంలో బ్యాంకు అధికారులు, బ్యాంకు మిత్రలతో నగదు రహిత సదుపాయాల కేంద్రాలను ఏర్పాటు చేయాలి ⇔ పేద కుటుంబాలు ఆన్లైన్ లావాదేవీల కోసం స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు 25 శాతం సబ్సిడీని రూ.1000కు మించకుండా ప్రభుత్వం చెల్లించాలి ఆన్లైన్ లావాదేవీలకు అవసరమైనంత మేరకు ప్రజల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం లేదు. ప్రచార కార్యక్రమాల ద్వారా వినియోగాన్ని ప్రోత్సహించాలి ప్రభుత్వ యంత్రాంగం, బ్యాంకు అధికారులు నగదు రహిత, కార్డు, ఆన్లైన్, మొబైల్ పేమెంట్ల ఉపయోగాలను ప్రజలకు తెలియజేయాలి జిల్లాల్లో పౌరుల విజ్ఞప్తులను పరిష్కరించేందుకు జిల్లా స్థారుులో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలి