బాదుడుకు రెడీ! | all banks ready to Transaction charges | Sakshi
Sakshi News home page

బాదుడుకు రెడీ!

Published Tue, Mar 14 2017 1:05 AM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

బాదుడుకు రెడీ!

బాదుడుకు రెడీ!

ఏప్రిల్‌ 1 నుంచి బ్యాంకుల్లో రుసుముల మోత
భారీగా పెరగనున్న లావాదేవీల చార్జీలు


ఏప్రిల్‌ ఒకటో తారీఖు నుంచి సామాన్యుల నడ్డి విరచడానికి బ్యాంకులు సిద్ధమయ్యాయి. బ్యాంకులంటేనే ఖాతాదారులు భయపడేలా రుసుముల మోత మోగించనున్నాయి.  చార్జీల పెంపుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా బ్యాంకులు కానీ, రిజర్వ్‌బ్యాంకు కానీ వెనక్కు తగ్గడం లేదు. ఈ విషయం తమ పరిధిలో లేదన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండడంపై ఖాతాదారులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

చిత్తూరు: పెద్ద నోట్ల రద్దుతో అస్తవ్యస్తం అయిన ఆర్థిక వ్యవస్థతో ఇప్పటికీ సామాన్యులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు బ్యాంకులు లావాదేవీల చార్జీలు భారీగా పెంచుతున్నాయి. సామాన్యులకు అండగా నిలిచి ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలవా ల్సిన బ్యాంకులు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తుంటే ఖాతాదారులు భయపడిపోతున్నారు. జిల్లాలో సుమా రు 42 లక్షల జనాభా ఉంది. వీరిలో 33 లక్షల మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. అంటే 78 శాతం మంది బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రతిఫలాలన్నీ బ్యాంకుల ద్వారానే లబ్ధిదారులకు చేరుతున్నాయి. దీంతో ప్రజలందరూ బ్యాంకులపై ఆధారపడ్డారు. దీంతో బ్యాంకులు ఆడిం దే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది. ఇందులో భా గంగానే ఏప్రిల్‌ ఒకటి నుంచి లావాదేవీల చార్జీలు భారీగా పెంచుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, జాతీయబ్యాంకులు ప్రస్తుతం ఉన్న లావాదేవీల చార్జీ లను సవరిస్తూ ఇప్పటికే తమ శాఖలకు కొత్త చార్జీల వివరాలు పంపాయి. ఈపెంపుపై జాతీయ మీడియా, నెటిజన్లు సామాన్యులు మండిపడుతున్నారు. ఈ పెం పునకు వ్యతిరేకంగా నెటిజన్లు ఏప్రిల్‌ 6ను లావాదేవీల రహిత దినంగా  ప్రకటించారు.  ఆ రోజున దేశంలోని ప్రజలందరూ అన్నిరకాల బ్యాంకు లావాదేవీలను నిలి పేయాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.

జిల్లాలో 40 బ్యాంకులు 754 బ్రాంచులున్నాయి. వీటిలో సుమారు 33 లక్షల మంది ఖాతాదారులుగా ఉన్నారు. అన్ని ప్రైవేటు బ్యాంకులు, జాతీయ బ్యాంకులు తమకు అనుకూలంగా, తాము అనుకున్న విధంగా రుసుం పెంచి సామాన్యుడిపై భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. నెలలో మొదటి మూడు నగదు లావాదేవీలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఇది ప్రస్తుతం 5 వరకు ఉచితంగా చేసుకునే వెసులుబాటు ఉంది.

హెచ్‌డీఎఫ్‌సీ
ప్రతి నెలా నాలుగు లావాదేవీలు మించితే రుసుం చెల్లించాల్సిందే. నాలుగుకు మించితే ప్రతి లావాదేవీపై రూ.150లు ఖాతాదారుడి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారు. ఒక్కోరోజు రూ.2 లక్షల నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉటుంది. అదికూడా హోం బ్రాంచ్‌ అయితేనే. అంతకు మించితే బాదుడు తప్పదు. ఈ చార్జీలు కేవలం సేవింగ్స్, శాలరీ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తాయి.

ఐసీఐసీఐ
నెలకు నాలుగు లావాదేవీలకు ఎలాంటి రుసుం ఉండదు. అంతకు మించితే బాదుడు తప్పదు. పరిమితి మించిన లావాదేవీలపై ఒక్కోదానిపై సుమారు రూ.150 వసూలు చేస్తుంది. ఇతర లావా దేవీల చార్జీలు కూడా భారీగా పెంచినట్లు సమాచారం.

యాక్సిస్‌ బ్యాంకు
యాక్సిస్‌ బ్యాంకు ఖాతాదారులు ప్రతి నెలా ఐదు లావాదేవీలను ఉచితంగా చేసుకోవచ్చు. వీటిలోనే డిపాజిట్లు విత్‌డ్రాలుంటాయి. వీటికి మించితే రుసుం చెల్లించాల్సిందే. ప్రతి లావాదేవీపై గరిష్టంగా రూ.95 చార్జి ఉంటుంది. నాన్‌హోమ్‌ బ్రాంచ్‌లో ఐదుకు మించి లావాదేవీలు చేస్తే ప్రతి లావాదేవీకి రూ.1000కి రూ.2.5 రుసుం లేదా రూ.95లు ఏది ఎక్కువైతే అది వసూలు చేస్తారు.

ఎస్‌బీఐ
ఖాతాదారులు ప్రతి నెలా మూడుసార్లు ఉచితంగా నగదు డిపాజిట్‌ చేయొచ్చు. అంతకుమించింతే ప్రతి లావాదేవీపై సర్వీస్‌ టాక్స్, రూ.50 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ ఒకటి నుంచి మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేని అకౌంట్లపై ప్రతి నెలా రూ.20 నుంచి రూ.100 పెనాల్టీతో పాటు సర్వీస్‌ ట్యాక్స్‌ను ఖాతాదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారు. ఎస్‌బీఐ ఖాతాదారులు ఇతర బ్యాంకు ఏటీఎంలలో మూడుసార్ల కంటే ఎక్కువ నగదు డ్రా చేసుకుంటే ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.20తో పాటు సర్వీస్‌ట్యాక్స్‌ వసూలు చేస్తారు. ఎస్‌బీఐ ఏటీఎంలో అయితే ఇది ఐదు సార్లకు మించకూడదు. రూ.10 వేలు నిల్వ ఉన్న కరెంటు ఖతాదారులు అయితే రూ.25వేలకు ప్రతిరోజూ రూ.25 వేలకు వరకు ఉచితంగా డిపాజిట్‌ చేసుకోవచ్చు. అంతకు మించితే ట్యాక్స్, రుసుం చెల్లించాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement