సాక్షి, ముంబై: కాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కమోడిటీ ఎక్సేంజ్ చార్జీలను పెంచేసింది. ఈ మేరకు బుధవారం సెబీ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ వెలువడిన 30రోజులకు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
దీని ప్రకారం టర్నోవర్ స్లాబ్లో అత్యధిక లావాదేవీ ఛార్జీల మధ్య నిష్పత్తి 2: 1 ని మించికూడదు. వివిధ ఎక్స్ఛేంజీలతో సంప్రదించి న అనంతరం సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక కాంట్రాక్ట్ లోని 'టర్నోవర్ స్లాబ్' హయ్యస్ట్ నుండి లోయస్ట్ చార్జీల రేషియో 2:1 మించకుండా కమోడిటీ ఎక్చేంజ్‌లు చూస్తాయని తెలిపింది. 2016 సెప్టెంబర్‌లో కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్ లకు సెబీ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఈ నిష్పత్తి 1.5.1గా ఉంది.
ఫార్వర్డ్ మార్కెట్స్ కమీషన్ తో విలీనం తరువాత. 2015నుంచి కమోడిటీ ఎక్సేంజ్‌లపై నియంత్రణ ప్రారంభించిన సెబీ 2016 సెప్టెంబరులో సరుకు డెరివేటివ్స్ లావాదేవీల చార్జీల వసూలుపై నిబంధనలను విధించింది.
Comments
Please login to add a commentAdd a comment