Commodity Exchange
-
ఎగుమతుల ‘రికార్డు’ కొనసాగుతుంది
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతుల రికార్డు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) కూడా కొనసాగుతుందని భారత్ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) ప్రెసిడెంట్ ఏ శక్తివేల్ స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే, 2021–22లో ఎగుమతులు 422 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయిని తాకాయి. 2022–23లో 3 నుంచి 5 శాతం వృద్ధితో 435–445 బిలియన్ డాలర్లకు చేరుతాయన్న విశ్వాసాన్ని తాజాగా శక్తివేల్ వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా అనిశ్చితి, డిమాండ్ మందగమనం ఉన్నప్పటికీ భారత్ ఆల్‌టైమ్ రికార్డు కొనసాగుతందని విశ్లేషించారు. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం, భారత్ వస్తు ఎగుమతులు వరుసగా రెండోనెల జనవరిలోనూ క్షీణతను నమోదుచేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నెలల కాలంలో (ఏప్రిల్–జనవరి) వస్తు ఎగుమతులు 8.51 శాతం పెరిగి 369.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఘనంగా 58వ వ్యవస్థపక దినోత్సవాలు కాగా, ఎఫ్ఐఈఓ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శక్తివేల్ ఈ సందర్భంగా తెలిపారు. మూడు వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా– మార్చి 9 నుంచి 11 మధ్య ‘సోర్సెక్స్ ఇండియా’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆహారం, ఫార్మా, ఆయుర్వేదం, హస్త కళలు, ఎఫ్ఎంసీజీ, జౌళి వంటి రంగాల్లో అవకాశాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. సూపర్ మార్కెట్లు, హైపర్మార్కెట్లు, రిటైల్ చైన్లు, దిగుమతిదారులుసహా దాదాపు 35 దేశాలు నుంచి ప్రతినిధులు ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు తమ ఆసక్తిని కనబరిచినట్లు తెలిపారు. -
ఆఫీస్ నుంచే పని... మూడు రెట్ల జీతం
ముంబై: కరోనా వైరస్ కల్లోలంతో పలు కంపెనీలు ఇంటి నుంచే పనిని ప్రోత్సహిస్తున్నాయి. అయితే కమోడిటీ ఎక్సే్ఛంజ్, ఎమ్‌సీఎక్స్ మాత్రం కార్యాలయాల నుంచి విధులు నిర్వహించే ఉద్యోగులకు మూడు రెట్ల వేతనం చెల్లించనున్నది. ఎమ్‌సీఎక్స్‌లో దేశవ్యాప్తంగా 400 మంది పనిచేస్తుండగా, ఒక్క ముంబైలోనే 300 మంది పనిచేస్తున్నారు. గత శుక్రవారం నుంచి 50 మంది కీలక ఉద్యోగులు ఆఫీసులోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారని ఎమ్‌సీఎక్స్ తెలిపింది. వారికి కావలసిన రోజువారీ అవసరాలను సమకూరుస్తున్నామని, ఎక్సే్ఛంజ్ బిల్డింగ్‌లోనే బస సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొంది. ఇంత రిస్క్ తీసుకుంటున్నందుకు వీరికి రెట్టింపు జీతం ఇవ్వాలని నిర్ణయించామని వివరించింది. కొంత మందికి మూడు రెట్లు కూడా ఇవ్వనున్నామని పేర్కొంది. -
బంగారంలో ట్రేడింగ్ చేస్తున్నారా?
ముంబై : కోవిడ్ 19 వైరస్ మహమ్మారి విస్తరణ, దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో ఫ్యూచర్స్ మార్కెట్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా(ఎంసీఎక్స్), ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఐఈఎక్స్) ట్రేడింగ్ సమయాన్ని తగ్గిస్తూ ఎంసీఎక్స్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెబీ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. తాజా నిర్ణయం ప్రకారం కమోడిటీ ట్రేడింగ్ కేవలం 8 గంటలే జరగనుంది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే జరగనుందని ఎంసీఎక్స్, ఐసీఈఎక్స్ సర్క్యులర్‌లో వెల్లడించాయి. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 14 వరకు ఈ నిర్ణయం అమల్లో వుంటుంది. తొలి 15 నిమిషాలు జీటీసీ/జీటీడీ చెల్లుబాటు ఆర్డర్స్ రద్దు కోసం ప్రి-ఓపెన్ సెషన్ నిర్వహిస్తారు. అలాగే చివరి 15 నిమిషాలు అంటే రాత్రి 11:30 నుంచి 11:45 వరకు క్లోజింగ్ సెషన్ నిర్వహిస్తారు. ఈ రెండు సెషన్లు కూడా ఉదయం 9 గంటల నుంచి 9:45 నిమిషాల వరకు, సాయంత్రం 4:45 నిమిషాల నుంచి 5గంటల వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2, ఏప్రిల్ 6, ఏప్రిల్ 14, 2020 న సాయంత్రం సెషన్ (ట్రేడింగ్ సెషన్) అందుబాటులో ఉండదు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకు కమోడిటీ ట్రేడింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. చదవండి : మార్కెట్లకు రుచించని ప్యాకేజీ -
కమోడిటీ ఎక్సేంజ్ లేవాదేవీ చార్జీల పెంపు
సాక్షి, ముంబై: కాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కమోడిటీ ఎక్సేంజ్ చార్జీలను పెంచేసింది. ఈ మేరకు బుధవారం సెబీ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ వెలువడిన 30రోజులకు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీని ప్రకారం టర్నోవర్ స్లాబ్‌లో అత్యధిక లావాదేవీ ఛార్జీల మధ్య నిష్పత్తి 2: 1 ని మించికూడదు. వివిధ ఎక్స్ఛేంజీలతో సంప్రదించి న అనంతరం సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక కాంట్రాక్ట్ లోని 'టర్నోవర్ స్లాబ్' హయ్యస్ట్ నుండి లోయస్ట్ చార్జీల రేషియో 2:1 మించకుండా కమోడిటీ ఎక్చేంజ్‌లు చూస్తాయని తెలిపింది. 2016 సెప్టెంబర్‌లో కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్ లకు సెబీ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఈ నిష్పత్తి 1.5.1గా ఉంది. ఫార్వర్డ్ మార్కెట్స్ కమీషన్ తో విలీనం తరువాత. 2015నుంచి కమోడిటీ ఎక్సేంజ్‌లపై నియంత్రణ ప్రారంభించిన సెబీ 2016 సెప్టెంబరులో సరుకు డెరివేటివ్స్ లావాదేవీల చార్జీల వసూలుపై నిబంధనలను విధించింది. -
ట్రేడింగ్ చర్చల్లో పాల్గొనవద్దు...
కమోడిటీ ఎక్స్చేంజ్లకు సెబీ ఆదేశం న్యూఢిల్లీ: కమోడిటీ ఎక్స్చేంజ్లు, ఈ ఎక్స్ఛేంజ్ల సంబంధిత అధికారులు మీడియాలో కమోడిటీ డెరివేటివ్‌ల ట్రేడింగ్ సంబంధిత చర్చల్లో పాల్గొనకూడదని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆంక్షలు విధిం చింది. అంతేకాకుండా అలాంటి కార్యక్రమాలను స్పాన్సర్ చేయకూడదని కూడా పేర్కొంది. కమోడిటీ డెరివేటివ్‌ల ట్రేడింగ్‌కు సంబంధించి టీవీ చర్చా కార్యక్రమాల్లో కానీ, రేడియో, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ల్లో గానీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లు, సంబంధిత ఉద్యోగులు పాల్గొనరాదని సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో తగిన ప్రవర్తన నిబంధనావళిని కమోడిటీ ఎక్స్ఛేంజ్లు రూపొందించాలని సూచించింది.