
ముంబై: కరోనా వైరస్ కల్లోలంతో పలు కంపెనీలు ఇంటి నుంచే పనిని ప్రోత్సహిస్తున్నాయి. అయితే కమోడిటీ ఎక్సే్ఛంజ్, ఎమ్‌సీఎక్స్ మాత్రం కార్యాలయాల నుంచి విధులు నిర్వహించే ఉద్యోగులకు మూడు రెట్ల వేతనం చెల్లించనున్నది. ఎమ్‌సీఎక్స్‌లో దేశవ్యాప్తంగా 400 మంది పనిచేస్తుండగా, ఒక్క ముంబైలోనే 300 మంది పనిచేస్తున్నారు. గత శుక్రవారం నుంచి 50 మంది కీలక ఉద్యోగులు ఆఫీసులోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారని ఎమ్‌సీఎక్స్ తెలిపింది. వారికి కావలసిన రోజువారీ అవసరాలను సమకూరుస్తున్నామని, ఎక్సే్ఛంజ్ బిల్డింగ్‌లోనే బస సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొంది. ఇంత రిస్క్ తీసుకుంటున్నందుకు వీరికి రెట్టింపు జీతం ఇవ్వాలని నిర్ణయించామని వివరించింది. కొంత మందికి మూడు రెట్లు కూడా ఇవ్వనున్నామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment