salary increases
-
రెసిడెన్షియల్ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల జీతాల పెంపు
సాక్షి, అమరావతి: ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (ఏపీఆర్ఈఐ) సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలను ప్రభుత్వం పెంచింది. వీరికి రివైజ్డ్ పేస్కేల్ ప్రకారం మినిమం టైమ్‌స్కేల్‌ను అమలు చేయనుంది. యూనివర్సిటీలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల కాంట్రాక్టు సిబ్బందికి మినిమం టైమ్‌స్కేల్‌ను మంజూరు చేస్తూ గతంలో ఆర్థికశాఖ 40వ నంబరు జీవో జారీచేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఏపీఆర్ఈఐ సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్లకు వర్తింపజేస్తూ సొసైటీ కార్యదర్శి ఆర్.నరసింహరావు మెమో ఇచ్చారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం పెరగనున్న జీతాల వివరాలు.. -
ఆఫీస్ నుంచే పని... మూడు రెట్ల జీతం
ముంబై: కరోనా వైరస్ కల్లోలంతో పలు కంపెనీలు ఇంటి నుంచే పనిని ప్రోత్సహిస్తున్నాయి. అయితే కమోడిటీ ఎక్సే్ఛంజ్, ఎమ్‌సీఎక్స్ మాత్రం కార్యాలయాల నుంచి విధులు నిర్వహించే ఉద్యోగులకు మూడు రెట్ల వేతనం చెల్లించనున్నది. ఎమ్‌సీఎక్స్‌లో దేశవ్యాప్తంగా 400 మంది పనిచేస్తుండగా, ఒక్క ముంబైలోనే 300 మంది పనిచేస్తున్నారు. గత శుక్రవారం నుంచి 50 మంది కీలక ఉద్యోగులు ఆఫీసులోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారని ఎమ్‌సీఎక్స్ తెలిపింది. వారికి కావలసిన రోజువారీ అవసరాలను సమకూరుస్తున్నామని, ఎక్సే్ఛంజ్ బిల్డింగ్‌లోనే బస సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొంది. ఇంత రిస్క్ తీసుకుంటున్నందుకు వీరికి రెట్టింపు జీతం ఇవ్వాలని నిర్ణయించామని వివరించింది. కొంత మందికి మూడు రెట్లు కూడా ఇవ్వనున్నామని పేర్కొంది. -
పాతికేళ్ల కష్టానికి చెల్లు!
ఎప్పటికైనా న్యాయం జరగకపోతుందా... తమ గోడు వినే నాథుడు రాకపోతాడా... తమ బతుకులు బాగుపడే రోజు రాకపోతుందా... అని పాతికేళ్లుగా ఎదురు చూసిన వారికి సరైన న్యాయమే జరిగింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి ప్రయత్నం ఫలించింది. ముఖ్యమంత్రి జగనన్న మనసు కరిగింది. పది రెట్లు వేతనం పెంచుతూ నిర్ణయం వెలువడటంతో ఆ చిరుద్యోగుల మోములో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పటివరకూ కేవలం నాలుగు వందల వేతనానికి పనిచేస్తున్న గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల వేతనం నాలుగు వేలకు పెరగడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి. విజయనగరం: నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో నెలకు కేవలం 400 రూపాయలతో ఎవరూ పని చేయరు. కానీ వారు చేశారు. అది కూడా ఒకటి రెండు నెలలో, సంవత్సరాలో కాదు, ఏకంగా పాతికేళ్లుగా చేస్తూనే ఉన్నారు. ఎంతమందికి చెప్పుకున్నా వారి సమస్య పరిష్కారం కాలేదు. ఇక మా బతుకులింతే అని వారు ఆవేదన చెందుతున్న తరుణంలోనే ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి వారి దీనస్థితిని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లారు. సీఎం సానుకూలంగా స్పందించడంతో వారి పాతికేళ్ల కష్టానికి తెరపడింది. రాష్ట్రంలో గిరిజనాభివృద్ధి కోసం ఐఎఫ్ఏడీ ఆధ్వర్యంలో 1995లో చేపట్టిన ప్రత్యేక ప్రాజెక్టులో భాగంగా ఐటీడీఏల పరిధిలోని గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో సామాజిక ఆరోగ్య కార్యకర్తలను ప్రభుత్వం నియమించింది. గిరిజన ఆవాసాలలో స్థానికంగా ఉండే గిరిజన మహిళలనే సామాజిక ఆరోగ్య కార్యకర్తలుగా నియమించారు. ఆశా వర్కర్ల తరహాలోనే గిరిజన ఆవాసాల్లో ఉండే గిరిజనుల ఆరోగ్య స్థితిగతులను ప్రభుత్వానికి చేరవేయడం, ప్రభుత్వం ద్వారా వచ్చే ఆరోగ్య పథకాలను అమలు చేయడం, ప్రత్యేకించి పసిపిల్లలు, బాలింతల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, అవసరమైన సర్వేలు చేయడం, గ్రామాల్లో పారిశుద్ధ్యం, వ్యక్తిగత శుభ్రతలపై అవగాహన కలిగించడం లాంటి పనులన్నింటినీ వారు చేస్తున్నారు. వారి ఎంపికలో విద్యార్హతలు, స్థానికతలకు సంబంధించిన రెండు తేడాలు మినహా, ఆశ వర్కర్లు చేసే పనులే వీరూ చేస్తున్నారు. కొండ కోనల్లో పని చేసే గిరిజనులు కావడం, వారి సమస్యలపై అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో సుమారు రెండున్నర దశాబ్దాలుగా వారి బతుకులు మెరుగుపడలేదు. 1995లో వారిని ఆరోగ్య కార్యకర్తలుగా నియమించినప్పుడు రూ.300లు గౌరవ వేతనం ఇచ్చేవారు. తరువాత కేవలం వంద మాత్రమే పెంచారు. నెలకు రూ.400లతో బతకడం అసాధ్యం. కనిపించిన ప్రతి నాయకుడికీ తమ కష్టాన్ని చెప్పుకున్నా... వారి బతుకులు మారలేదు. కదిలించిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి: టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగిన ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఒక గిరిజనబిడ్డగా గతంలో కూడా గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల వేతన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యురాలు కావడంతో అప్పటి ప్రభుత్వం ఈమె విన్నపాన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే వై,ఎస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, పుష్ప శ్రీవాణి ఉప ముఖ్యమంత్రి కావడం వారికి కలిసొచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఆశ వర్కర్ల వేతనాలను రూ.3000 నుంచి రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న తరుణంలో గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల పరిస్థితిని పుష్ప శ్రీవాణి ముఖ్యమంత్రికి వివరించారు. వారి వేతనాలను కూడా పెంచాలంటూ సీఎంను కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించడంతో అప్పటిదాకా ఎవరూ పట్టించుకోని గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల వేతనాల పెంపునకు సంబంధించిన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. నవంబర్ 27న జరిగిన కేబినెట్ సమావేశంలో వీరి వేతనాలను రూ.400ల నుంచి రూ.4000లకు పెంచారు. డిసెంబర్ నుంచే పెరిగిన వేతనాలు అందనున్నాయి. ఇంతవరకూ ఎవరూ తమ గోడు పట్టించుకోలేదని, తమ సేవలను వినియోగించుకోవడమే మినహా ఏ ప్రభుత్వమూ తమను ఆదుకోలేదని అయితే ప్రస్తుత ప్రభుత్వం తమ సేవలను గుర్తించి తమ వేతనాన్ని పది రెట్లు పెంచడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికీ, ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి ధన్యవాదాలు చెబుతున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం రాష్ట్రం మొత్తం మీద 7 ఐటీడీఏల పరిధిలో 2651 మంది గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు పని చేస్తుండగా వీరిలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో 498 మంది, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 1184 మంది, పాడేరు ఐటీడీఏ పరిధిలో 752 మంది, చింతూరు ఐటీడీఏ పరిధిలో 40 మంది, కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలో 14 మంది, శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో 163 మంది పని చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆశవర్కర్లకు సంబంధించిన వేతనాలను రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచారు. అదే సమయంలో గిరిజన ఐటీడీఏ ప్రాంతాల్లో ఆశ వర్కర్ల తరహాలోనే పని చేస్తున్న వీరి వేతనాలు మాత్రం పెంచలేదు. దీనిపై వారు ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు. -
ఆర్టిజన్ల వేతనాలు పెంపు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికు (ఆర్టిజన్లు)లకు శుభవార్త. ఆర్టిజన్ల వేతనాలు పెంచుతూ తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పొందుతున్న వేతనాలతో పోలిస్తే.. గ్రేడ్–1 ఆర్టిజన్లకు రూ.3,477, గ్రేడ్–2 ఆర్టిజన్లకు రూ.2,865, గ్రేడ్–3 ఆర్టిజన్లకు రూ.2,181, గ్రేడ్–4 ఆర్టిజన్లకు రూ.1,900 వేతనం పెరగనుంది. ఆగస్టు 1 నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ యాజమాన్య వాటాలను ఇకపై యాజమాన్యాలే చెల్లించనున్నాయి. ఇప్పటివరకు యాజమాన్య వాటాలను కూడా కార్మికుల వేతనాల నుంచే చెల్లిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఆ మొత్తం కార్మికులకే మిగిలి ఆ మేరకు వారి వేతనాల్లో పెరుగుదల కనిపిస్తుంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 21 నుంచి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో గత శనివారం సచివాలయంలో జరిగిన చర్చల సందర్భంగా ఆర్టిజన్ల వేతనాల పెంపుతోపాటు ఈఎస్ఐ, పీఎఫ్ వాటాల చెల్లింపు తదితర డిమాండ్ల పరిష్కారానికి విద్యుత్ సంస్థల యాజమాన్యాలు హామీ ఇవ్వడంతో అదే రోజు కార్మిక సంఘాలు సమ్మె విరమించాయి. ఈ నేపథ్యంలో ఆ హామీలను అమలుచేస్తూ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కింది హామీలను అమలు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 20,803 మంది ఆర్టిజన్లకు ప్రయోజనం కలగనుంది. అమలు చేయనున్న హామీలివే... ♦ విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్ల విలీనంపై హైకోర్టులో విధించిన యథాతథ స్థితి(స్టే) తొలగింపునకు తక్షణమే విద్యుత్ సంస్థలు అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తాయి. ♦ విద్యుత్ రెగ్యులర్ ఉద్యోగుల వేతన సవరణ జరగనున్న నేపథ్యంలో ఆర్టిజన్ల ఏకమొత్తం వేతనాల పెంపునకు అంగీకరించాం. పీఆర్సీ అమల్లోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆర్టిజన్ల వేతనాల పెంపు ఉండదు. ♦ నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రోత్సాహకంగా ఆర్టిజన్లకు ప్రత్యేక అలవెన్స్ మంజూరు. ♦ సాధారణ మరణం/ప్రమాదాల్లో మరణించిన ఆర్టిజన్ల కుటుంబంలో అర్హులైన ఒకరికి విద్యార్హతల ఆధారంగా ఉద్యోగావకాశం కల్పిస్తాం. ♦ ఆర్టిజన్ గ్రేడ్–3, గ్రేడ్–4గా కొనసాగుతూ పోల్ టూ పోల్, ఎఫ్ఓసీ, సబ్‌స్టేషన్ ఆపరేటర్, ఎంఆర్టీ, సీబీడీ, లైన్ బ్రేక్ డౌన్ గ్యాంగ్, డీపీఈగా నైపుణ్యం కలిగి విధులు నిర్వహిస్తున్న వారికి ఆర్టిజన్ గ్రేడ్–2 వేతనం చెల్లింపు. ♦ టీఎస్ఎస్పీడీసీఎల్లోని ఫీల్డ్ కార్యాలయాలు, సబ్స్టేషన్లలో గత రెండేళ్లుగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిశీలిస్తున్నాం. ♦ విధి నిర్వహణలో ప్రమాదాలకు లోనైతే చికిత్స కల్పించేందుకు మెడికల్ క్రెడిట్ కార్డులు జారీ. ♦ రెగ్యులర్ ఉద్యోగుల తరహాలోనే ఆర్టిజన్లకు సైతం సాధారణ మరణానికి రూ.10 లక్షల జీవిత బీమా చెల్లింపు. ♦ కార్మికుల ఈఎస్ఐ, పీఎఫ్ వాటాలను ఆయా చట్టాల ప్రకారమే వారి వేతనాల్లో కోత విధింపు. -
పెరిగిన హోంగార్డుల వేతనం
సాక్షి, హైదరాబాద్: పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా వివిధ రకాల విధుల్ని నిర్వర్తిస్తున్న హోంగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వీరి రోజువారీ వేతనాన్ని పెంచుతూ హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హోంగార్డులకు కానిస్టేబుళ్లకు ఉన్నట్లే అనేక సౌలభ్యాలు కల్పించారు. మొత్తంగా ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 14 విభాగాల్లో పనిచేస్తున్న 18,800 మంది హోంగార్డులు లబ్ధి పొందనున్నారు. గతేడాది డిసెంబర్ 13న ప్రగతి భవన్లో జరిగిన హోంగార్డుల సమావేశంలో సీఎం కేసీఆర్ పలు హామీలు ఇచ్చిన విషయం విదితమే. వీటిని అమలులోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హోంగార్డులకు రోజుకు రూ.400 చొప్పున నెలకు రూ.12 వేలు వేతనంగా లభిస్తోంది. ఇకపై రోజుకు రూ.675 చొప్పున నెలకు రూ.20,250 లభించనుంది. ప్రతి ఏడాదీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1 నుంచి రూ.వెయ్యి చొప్పున ఈ వేతనం పెరగనుంది. ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బందికి ప్రస్తుతం జీతానికి 30 శాతం అదనంగా పొల్యూషన్ అలవెన్స్ ఇస్తున్నారు. ఇకపై ఆ విభాగంలో పనిచేస్తున్న హోంగార్డులకూఈ అలవెన్స్ లభించనుంది. కానిస్టేబుళ్లకు ఇస్తున్నట్లు యూనిఫాం అలవెన్స్, ఇద్దరు పిల్లల వరకు మహిళా హోంగార్డులకు ఆరు నెలల మాతృత్వ సెలవు(మెటర్నిటీ లీవ్), పురుష హోంగార్డులకు 15 రోజుల పితృత్వ సెలవు(పెటర్నిటీ లీవ్) అమలులోకి తీసుకువచ్చారు. భారీ బందోబస్తు విధుల్లో పాల్గొన్నప్పుడు హోంగార్డులకూ కానిస్టేబుళ్ల మాదిరిగా డైట్ చార్జీలుగా పిలిచే బత్తా మంజూరు చేస్తారు. పోలీసు ఆస్పత్రుల్లో హోంగార్డులకూ అన్ని రకాల వైద్య సేవలు అందించేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. విధుల్లో ఉండగా మరణించే హోంగార్డుల కుటుంబాలకు ఇచ్చే తక్షణం సాయాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ప్రతి హోంగార్డుకీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, పోలీసుల మాదిరిగా హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రాజీవ్ త్రివేది ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అంగన్వాడీల కోసం వైసీపీ వాకౌట్
* అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల జీతాలు పెంచాలని సభలో పార్టీ ఎమ్మెల్యేల డిమాండ్ * సూటిగా సమాధానం చెప్పని మంత్రి సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయలకు జీతాల పెంపుదల విషయంలో తగిన సమాధానం రాకపోవడంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ శుక్రవారం శాసనసభ నుంచి వాకౌట్ చేసింది. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, ఆర్కే రోజా, గిడ్డి ఈశ్వరి, గౌరు చరితారెడ్డి, విశ్వసరాయి కళావతిలు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు చాలీచాలని జీతాలతో అల్లాడుతున్నారని, జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. దీనికి మంత్రి సూటిగా సమాధానం చెప్పకుండా ప్రభుత్వం కష్టాల్లో ఉందన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జోక్యం చేసుకుంటూ అంగన్వాడీ కార్యకర్తలకు, సహాయకులకు జీతాలు పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఇప్పుడేమో ఆ ప్రస్తావన కూడా చేయకపోవడం అన్యాయమని, నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నామని ప్రకటించారు. డెంగీని ఆరోగ్యశ్రీలో చేర్చండి రాష్ట్రంలో డెంగీ జ్వరాలతో జనం మృతి చెందుతున్నారని, ఈ జబ్బును ఆరోగ్యశ్రీలో చేర్చి ఆదుకోవాలని వైసీపీ శాసనసభ్యులు పీడిక రాజన్న దొర డిమాండ్ చేశారు. మంత్రి కామినేని శ్రీనివాస్ సమాధానమిస్తూ, డెంగీ బాధితుల్లో 5 శాతం మందికే సీరియస్‌గా ఉంటోందని, మిగతా వారికి ఇబ్బంది ఉండదన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ప్రతి జిల్లాకు వైద్యకళాశాల ప్రతిపాదనలు ఏమైనా ప్రభుత్వం దగ్గర ఉన్నా యా అని వైసీపీ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎం.సునీల్‌కుమార్ ప్రశ్నిం చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సమస్యలపై వైసీపీ సభ్యులు కోన రఘుపతి, ఆదిమూలపు సురేష్, గిడ్డి ఈశ్వరిలు తీవ్రంగా విమర్శించా రు. మంత్రి గంటా శ్రీనివాస్ స్పందిస్తూ, సకాలంలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందేలా చర్యలు తీసుకుంటామని, వాటి సరఫరా బాధ్యతలు ఆప్కోకు ఇచ్చామని చెప్పారు. -
పెంచేశారు!
ఉట్నూర్, న్యూస్‌లైన్ : అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు కేంద్రాల నిర్వహణ సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఉండేది. వేళల్లో మార్పు చేస్తూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పొడిగించింది. అంతేకాకుండా అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం రూ. 500, ఆయాలకు రూ.250 పెంచుతూ స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 15 ఐసీడీఎస్ ప్రాజెక్టులు మహిళాభివృద్ధి శిశు, సంక్షేమ శాఖ అధీనంలో పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో 3,570 మెయిన్, 798 మినీ అంగన్వా డీ కేంద్రాలున్నాయి. 0-6 ఏళ్ల పిల్లలకు పోషకాహారంతోపాటు గుణాత్మక విద్య అందించడం, అమృతహస్తం పథకం కింద బా లింతలకు, గర్భిణులకు పోషక ఆహారం అందించడం ఈ కేం ద్రాల లక్ష్యం. తాజాగా సమయం పెంచడం ద్వారా కార్యకర్తలు, ఆయాలకు పూర్తిస్థాయిలో పనిదొరకడంతోపాటు పోషకాహారం కూడా పూర్తిస్థాయిలో అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పెరిగిన పనిభారం : ఇంతవరకు అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనంగా రూ.3700, ఆయాలకు రూ.1,950 ప్రభుత్వం చెల్లిస్తోంది. కార్యకర్తలకు రూ.500 పెండంతో రూ.4,200, ఆ యాలకు రూ.200 పెంచడంతో రూ. 2,200 అవుతున్నాయి. ఇం తకుముందు సమయం తక్కువగా ఉండటతో వేరే పనిచేసుకునే వారమని, ఇప్పుడు సమయం పెంచడంతో వేరే పనిచేసుకునే అ వకాశం లేదని కార్యకర్తలు, ఆయాలు పేర్కొంటున్నారు. వేత నం పెంచి ఏం లాభం లేదని వారు వాపోతున్నారు. దీనికితోడు ప్రభుత్వ పథకాల పని తమకే అప్పగిస్తారని, సర్వేలు చేయిస్తూ శ్రమను దోచుకుంటున్నారని అంటున్నారు. వేతనం పెంచాలని వారు కోరుతున్నారు. కాగా, అంగాన్వాడీ కేంద్రాల నిర్వహణ సమయాల్లో మార్పులు చేయడం ద్వారా కేంద్రాల పనితీరు మా రుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మధ్యాహ్నం వరకే విధు లు నిర్వహించే ఆయాలు, కార్యకర్తలు ఇప్పుడు పూర్తిస్థాయిలో పనిచేస్తారని పేర్కొంటున్నారు. కేంద్రాల నిర్వహణ పాఠశాలల మాదిరిగా మారనుండటంతో పిల్లలకు న్యాయం జరగనుంది. ప్రభుత్వ నిర్ణయంపై పిల్లలతల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు.