
సాక్షి, అమరావతి: ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఏపీఆర్‌ఈఐ) సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలను ప్రభుత్వం పెంచింది. వీరికి రివైజ్డ్ పేస్కేల్ ప్రకారం మినిమం టైమ్‌స్కేల్‌ను అమలు చేయనుంది. యూనివర్సిటీలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల కాంట్రాక్టు సిబ్బందికి మినిమం టైమ్‌స్కేల్‌ను మంజూరు చేస్తూ గతంలో ఆర్థికశాఖ 40వ నంబరు జీవో జారీచేసిన సంగతి తెలిసిందే.
దీన్ని ఏపీఆర్‌ఈఐ సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్లకు వర్తింపజేస్తూ సొసైటీ కార్యదర్శి ఆర్.నరసింహరావు మెమో ఇచ్చారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం పెరగనున్న జీతాల వివరాలు..
Comments
Please login to add a commentAdd a comment